Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label Sonia Gandhi. Show all posts
Showing posts with label Sonia Gandhi. Show all posts

Friday, March 20, 2015

450 Mr. Prakash Karat and Mr. Sitaram Yechury should not hang around Ms. Sonia Gandhi in the name of Opposition Unity



450 विपक्ष एकता के नाम पर श्री प्रकाश कारत और श्री सीताराम येचूरी, सोनिया गांधी के उपग्रह नहीं बनना चाहिए ।

450 ప్రతిపక్ష ఐక్యత పేరుతో శ్రీ ప్రకాశ్ కారత్ మరియు శ్రీ సీతారాం యేచూరి, శ్రీమతి సోనియా గాంధీకి ఉపగ్రహాలుగా తయారు కాకూడదు.

In the name of opposition unity, Mr. Prakash Karat and Mr. Sitaram Yechury seem to be circumambulating (around) Ms. Sonia Gandhi, as if she is not against tyrannical land acquisitions.  Knowing her despotic nature from the past experiences, this time CPM should be wary in becoming a taily of bourgeoisie parties.




(To continue.  सशेष.  ఇంకా ఉంది.)

Friday, March 13, 2015

445 Mr. Manmohan Singh if not dishonest, is at least negligent!



४४५ श्री मन्मोहन सिंग बेइमान या कपटी नहीं तो, कम से कम लापरवाह या असावधान होगा

౪౪౫ శ్రీ మన్మోహన్ సింగ్ గారు అవినీతి పరుడు, కపటి కాకపోతే, కనీసం శ్రధ్ధాహీనుడు, అసావధాని అవక తప్పదు.

In the coal mines scam, Mr. Manmohan Singh wants a fair trial for him.  कोयला खदान आवंटन घोटाले में श्री मन्मोहन सिंग् निष्पक्ष सुनवाई चाह रहे हें।  బోగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో శ్రీ మన్మోహన్ సింగ్ గారు తనకు న్యాయమైన విచారణ జరగాలని కోరుకుంటున్నారు.

Congress President Ms. Sonia Gandhi declared him clean and innocent.   कांग्रॆस अध्यक्ष श्रीमती सोनिया गांधी श्री सिंग जी को क्लीन और इमानदार घोषित किया.  కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడ, శ్రీ సింగ్ గారిని శుధ్ధుడు , అమాయకుడు అని ప్రకటించారు.



As Prime Minister, and Minister for Coal, why did Mr. Manmohan Singh remove the food of sustenance at the mouth of the Government Company Neyveli Lignite Corporation and fed it to Private Sector Hindujas?  This is a grave injustice.  प्रधान मंत्री और केंद्रीय कोयला मंत्री के पद स्थित श्री मन्मोहन सिंग, सरकारी कंपॆनी नैवेली लिग्नैट् कार्पोरेशन के सामने रखा हुआ खाने को ले जा कर प्रैवेट् सॆक्टार हिंदूजास को क्यों खिलाया ? यह घोर अन्याय है।  ప్రధాన మంత్రి మరియు కేంద్ర బొగ్గు మంత్రి కూడ అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారు, ప్రభుత్వ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ నోటి దగ్గరి ఆహారాన్ని తీసుకెళ్ళి, హిందూజాల చేత బొక్కించటం ఎందుకు చేసినట్లు?  ఇది ఘోర అన్యాయం.

I have acted on the basis of recommendation by Coal Secretary.  Recommendation of Experts Group is not necessary.  There may be error of judgment in decision-making, for which I cannot be penalised.-- This line of defence Mr. Manmohan Singh cannot hide behind.   मै कोयला कार्यदर्शी सिफारिस पर निर्णय लिया हूँ।  विशेषज्ञ बृंद के राय लेने के जरूरत नहीं है।  फैसले की तृटी या निर्णय तृटि हो सकती।  उसके लिये मैं दंडित नहीं हो सकता हुँ।  ऐसे आत्म रक्षणात्मक तर्क वितर्क उसको काम में नहीं आयेगी।  నేను బొగ్గుగనుల కార్యదర్శి సిఫార్సు మేరకే నిర్ణయం తీసుకున్నాను.  నిపుణుల బృందాన్ని సమావేశ పరచ నవసరం లేదు.  నిర్ణయం తీసుకోటంలో పొరపాటు జరిగితే జరిగి ఉండచ్చు.  అంతమాత్రాన నన్ను దోషిగా నిలబెట్టి శిక్షించటం అనే ఆత్మ రక్షణాత్మక వాదనలో అర్ధం లేదు.


Mr. Manmohan Singh had time to collect doctorates from Oxford, but he had no time to look into what was happening in the Ministry under his own control.  महानू मन्मोहन सिंगजी को आक्सफर्ड यूनिवर्सिटी से डाक्टरेट कलॆकट करने के लिये समय है, लेकिन, अपने प्रत्यक्ष नियंत्रण में रहने वाले कोयला शाखा में क्या हो रहा था, देखने के लिये उन को वखत नहीं है।  శ్రీమాన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ కలెక్ట్ చేసుకోటానికి సమయం ఉంది కానీ, తన ప్రత్యక్షనియంత్రణలో ఉన్న బొగ్గు శాఖలో ఏమి జరుగిందో పట్టించుకునే తీరిక లేకపోయింది.  







If Coal Secretary has recommended improperly, PM (also Coal Minister) should have corrected him, asked him to re-convene the meeting of Experts Committee and ascertain their views.  PM should also have also constituted a small group of impartial persons, to examine the justification of removing the coal from the mouth of a Public Sector Company.

The peculiar and at the same time the typical trait of most Indian Prime Ministers right from the days of the first Prime Minister Jawaharlal Nehru is to spend their time in foreign tours, instead of leaving this task to the idle (without work) President and Vice Presidents.  Consequently, domestic administration and governance get neglected.  Ministers and Secretaries get opportunities and scope to act dishonestly or negligently or recklessly.

Prime Ministers should concentrate on internal administration.  They can give near-Prime Minister powers to Foreign Minister.  Foreign Minister can be allowed to get guidance from President, Vice President, or a Senior Dy. Prime Minister.   To summarise, we need drastic administrative reforms.

As far as conviction and punishment for corruption is concerned, investigating agencies and courts will not be justified in taking only a technical view and decide on literal interpretation of statutes and procedures.  A better method is to deeply investigate whether the accused bureaucrats / politicians have accumulated assets disproportionate to the known sources of their income and wealth.  CBI and Enforcement Directorate, will have to dig deeply into whether any kickbacks have been siphoned off into accounts with stealth secret account countries like Switzerland, Isle of Man etc.

English and Hindi translations will be added shortly.

(To continue सशेष ఇంకా ఉంది.)

Saturday, October 18, 2014

375 Modi has proven that he is not different from Sonia Gandhi and Manmohan Singh

375 తనకూ సోనియా గాంధీకి, మన్మోహన్ సింగుకీ తేడా ఏమీలేదని, శ్రీ నరేంద్రమోడీ గారు ఋజువు చేశారు.

३५५ श्री मोदी महोदय सिध्ध किया है कि उन और सोनिया गांधी और मन्मोहन के मध्य कुछ फरक नही है।

Ten proving behaviors दस साबित పది ఋజువులు

  1.  Withhold the boulders of punishments intended for throwing on  people till polling dates pass on.  పోలింగు తేదీలు దాటే దాకా ప్రజలపై వడ్డించాలనుకున్న శిక్షలను బిగపట్టుకోటం.  मतदान तारीख गुजरने तक जन के ऊपर फेंकने केलयि तय्यार किया हुआ पथ्थर को रोकना, ओर अगले दिन उस पथ्थर को लोग पर घालना, पटकना, झोंकना ।
  2. Behaving in one manner while in opposition and behaving in a diametrically opposite manner after coming into power. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ, అధికారంలోకి వచ్చాక పూర్తిగా వ్యతిరేకంగానూ ప్రవర్తించటం.  प्रतिपक्ष में रहने के समय पर, एक रीती नीती में बात करना, सत्ते में आने के बाद उन सब बातों को उल्टा पल्टा करना।
  3.  Total intolerance of Opposition parties. ప్రతి పక్షాల ఎడల పూర్తి అసహనం.  प्रति पक्षों के साथ संपूर्ण व्यतिरिक्त भाव।
  4. Following a tit for tat approach towards opposition.   తమలపాకుతో ఆమె ఒకటంటే,  తలుపు చెక్కతో ఈయన ఒకటన్నట్లు.  प्रतिपक्ष विषय में शठे शाठ्‍यम समाचरण।
  5. Imitating one another in Crony-Capitalism.  దాస్య పెట్టుబడిదారీ విధానాన్ని పాటించటంలో ఒకరితో మరొకళ్ళు పోటీ పడటం.  सुहृद पूंजीवादी बनने में एक दूसरों से प्रतिस्पर्धा करना।
  6. Competing with one another in prostrating before the U.S., China and the G8 countries by visiting those countries excessively, while neglecting internal problems.  అమెరికా, చైనా, జీ౭ దేశాల చుట్టూ తిరిగి వాళ్ళకు సాష్టాంగపడటంలో పోటీ పడుతూ, స్వదేశ సమస్యలను నిర్లక్ష్యం చేయటం.  अमेरिका, चैना, जी७ देशाधिनेताओं के पावों पर गिरने के लिये बार बार विदेश चाना, और स्वदेशी समस्याओं के निर्ल्क्षय करना ।
  7. Pampering media with full-page ads, repetitive TV ads, paid news and, media persons with bus-train passes, pensions, city house sites, gifts, cocktail parties, what not.  Expecting that Media should be ruling party's stooge.  Pontificating to media.  Armtwisting media.  మీడియాకు పూర్తిపేజీ ప్రకటనలు, పునఃపునః ప్రసార ప్రకటనలు, పెయిడ్ న్యూస్, మరియు మీడియా ఉద్యోగులకు బస్ ట్రెయిన్ పాస్ లు, బహుమతులు, మందు పార్టీలు, పెన్షన్లు, నగరాల్లో ఇళ్ళస్థలాలు, ఇంకా ఇంకా ఇచ్చి వాళ్ళను బుజ్జగించాలని చూడటం.  మీడియా తనకు బానిసగా పడిఉండాలని ఆశించటం.  మీడియాకి నీతిబోధలు చేయటం.  మీడియా మెడలు వంచాలని ప్రయత్నించటం.  प्रिंट और प्रसार माध्यम को पूर्ण पृष्ट विज्ञापन, पुनः पुनः प्रसारित विज्ञापन और पॆयिड  न्यूस दे कर, और मीडिया पर्सन्स को बस ट्रॆयिन पासेस, उपहार, बूज पार्टीस, पॆन्शन्स, शहरों मे निवेशन स्थल, वगौरा दे कर उनको बहुत लाड प्यार करना।
  8. Blind belief in mega projects, foreign investments, PPPs, BOTs, SEZs, disinvestment, growth rate predictions, under-declaring inflation rates, what not.  గుడ్డిగా మెగా ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ పథకాలు, సెజ్ లు, డిజ్ ఇన్వెస్ట్ మెంట్లు చేయటానికి నానా యాతనలు పడటం, వృధ్ధిరేటు గత  ప్రభుత్వకాలంలో కన్నా తమకాలంలో గొప్పగా ఉందని నమ్మించటానికి ప్రయత్నించటం, ధరలు తగ్గుతున్నాయని నమ్మించటానికి ద్రవ్యోల్బణం రేటును తగ్గించి చూపటం, వగైరా వగైరా.  मॆगा प्राजॆक्टों, विदेशी पूजी, सर्कारी  प्रैवेट भागस्वाम्य, बिल्ड आपरेट् ट्रान्सफर, सॆज्, प्रभुत्व संस्थओं से विनिवेश करने के लिये व्यर्ध प्रयत्न,  बार बार वृध्धी रेट घोषण करना, द्रव्योल्बण रेट को कम प्रकट करना ओर अपने पालन में दामों के गिरावट बार बार प्रस्ताव करना, ये सब कार्यों मे  अंध विश्वास और निमग्नता।
  9. Spending millions of Rupees and Dollars for acquiring fancy aircraft in the name of VIP security, building bullet proof Office Chambers and Residences, renovation of Chambers and Residences for rectifying perceived vAstu dOshAs.  మిలియన్ల కొద్దీ బిలియన్ల కొద్దీ రూపాయలను, డాలర్లను తగలేసి ఘరానా విమానాలను విఐపీ భద్రత పేరుతో కొనుగోలు చేయటం, బులెట్ ప్రూఫ్ ఛాంబర్లను , నివాసాలను నిర్మించుకోటం, వాస్తుదోషాలను సరిచేయటానికి భవనాలను తరచుగా మార్చటం, వగైరా.  वीऐपी भद्रता के नाम पर, मिलियन्स और बिलियन्स रूपये और डालर्स खर्च करके फेन्सी ऎयिरक्राफ्ट खरीदना, बुलॆट प्रूफ दफ्तर कमरे और निवास  निर्माण करना, प्रस्तुत निर्माणों को वास्तु दोष परिहारण के लिये बार बार बदलना, वगैरा वगैरा।
  10. Trying to change the names of places, roads, cities, airports, schemes, etc. and competing with one another in renaming madness.   Not only do they become mad, but also they make people idiots.  స్థలాలు, రోడ్లు, నగరాలు, విమానాశ్రయాలు, పథకాలు ఇవీ అవీ అని లేకుండా ప్రతి దానికీ పేర్లు మార్చాలని ప్రయత్నించటం, పేర్లు మార్చటంలో రెండు పార్టీలు పోటీపడి పిచ్చివాళ్ళలాగా ప్రయత్నించటమే కాకుండా ప్రజలను పిచ్చివాళ్ళను చేయటం.  चारित्रिक स्तल, सडक, शहर, हवाई अड्डे, योजनाएँ, वगैरा सब के नामों को बदलाने में समय बिताना,  एक दोनों से प्रतिस्पर्धित रहना।  स्वयंं पागल होने के अतिरिक्त जनावली को भी पागल बनाना।
This list can go upto 100 items.  For each item, we can get dozens of examples.  Today's example is reintroducing Direct Benefit Transfer Scheme (Remitting Gas Subsidy through Bank Accounts) which failed during Congress Regime and shunned by Supreme Court of India.  Another example is, Modi Govt's volte-face in disclosing the names of persons who have stashed huge amounts in foreign banks.

ఈ పట్టిక వంద ఐటమ్స్ వరకు వెళ్ళచ్చు.  ప్రతి ఒక్క ఐటమ్ కి డజన్లకొద్దీ  ఉదాహరణలు దొరుకుతాయి.  ఈరోజు ఉదాహరణలు ఏమిటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన, సుప్రీం కోర్టు చేత అక్షింతలు వేయించుకున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని (గ్యాస్ సబ్సిడీని బ్యాంకు ఖాతాల ద్వారా జమచేయటం), ఆధార్ కార్డు డిమాండు చేయటం .  రెండవ ఉదాహరణ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే విదేశాల్లో పోగైన నల్ల డబ్బుని భారత్ కు వెనక్కి తెచ్చి దోషుల పేర్లు ప్రకటిస్తామని చేసిన కోతలను తుంగలో తొక్కి సుప్రీం కోర్టు ముందు వెల్లికిలా పడటం.

यह सूची एक सौ नंबर तक आसानी से जा सकते।  लिस्ट के हर ऐटम के लिये डजन्स से अधिक संख्या में उदाहरण उपलभ्य ।  आज केलिये उदाहरण-- गत कांग्रॆस जमाने में विफल हुआ और सुप्रीं कोर्टु से भर्त्सित डैरक्ट बॆनिफिट बदली पथक (गाय्स सब्सिडी को बैंक खाताओं मॆ जमा करना), को पुनः घोषित करना और आधार कार्ड डिमांड करना।  दूसरे उदाहरण -- विदेशों मे छिपा हुए काले धन को सत्ते में  आने के बाद तीन महीनों मे वापस मंघा कर, दोषी लोगों के नाम घोषण करने के वादा से बीजेपी सरकार वापस जाना।




सशेष.  To continue.  ఇంకా ఉంది.

Thursday, June 26, 2014

270 What Ms. Sonia Gandhi is doing in Kausani?


270 సోనియా గాంధీ గారు కౌశానీ లో ఏమి చేస్తున్నారు?
270, Uttarakhand, Sonia Gandhi, Uttarakhand, Almora, Swami Vivekananda, Mahatma Gandhi, Sumitranandan Pant,

జవాబు: సేద తీరుతున్నారుట.
ఎన్నికల ప్రచారంలో ఎండలో తిరిగి తిరిగి చేతులు ఊపీ ఊపీ , గొంతు చించుకొనిహామీలు ఇచ్చీ ఇచ్చీ సోనియా గాంధీ గారు అలసి పోయారో ఏమో, కూలింగు సెంటర్ కి వెళ్ళి సేద తీర్చుకుంటున్నారట. ఈ కూలింగ్ సెంటర్ పేరు కౌశానీ.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, బాగేశ్వర్ జిల్లాలో ఉన్నది. హిమాలయ పర్వత శిఖరాలను తనివి తీరా దర్శించటానికి సరియైన ప్రదేశంట. ఆల్మోరాకు 52 కిలోమీటర్ల దూరంలో, ఆల్మోరా బాగేశ్వర్ దీదీహాట్ హైవే పై ఉందిట. ఇక్కడనుండి త్రిశూలి, నందాదేవి, పంచౌలీ, వంటి హిమాలయా శిఖరాలను చూచాయగా దర్శించ వచ్చునట. పైన్ చెట్ల గుబురులు ఎక్కువట (మనకు తాడిచెట్లలాగా అనుకోండి). గాంధీగారు ఈ ప్రదేశాన్ని స్విట్ జర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నారుట. గాంధీగారు ఇక్కడి అనాసక్తి ఆశ్రమం లో బస చేసినపుడు, అనాసక్తి యోగా అనే వ్యాఖ్యానాన్ని కూడ వ్రాసారుట.



Kausani

ఆల్మోరా ఉత్తరాఖండ్ లో ఒక జిల్లా కేంద్రం. ఆల్మోరా జిల్లా పరిపాలన వెబ్ సైట్ http://almora.nic.in/pages/view/29/48-kausani-location కి వెళ్ళటానికి క్లిక్

సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్లలో సరియైన సమాచారం ఉండదు. కానీ ఆల్మోరా జిల్లా వెబ్ సైట్ ని ఒక మినహాయింపు అనచ్చు.
The wide expanse of the famous Katyur Valley lies in front of it as you wake up to experience the Kausani sunrise. Kausani's beauty arrested the feet of even Mahatama Gandhi, who stayed for some time at this place. The memory that brief stay of that great man lingers behind in the Anasakti Ashrama. Another great man of India the famous Hindi poet Sumitra Nandan Pant was born here. There is small museum to earmark that sacred spot. The famous folk singer Gopidas was also inspired by the beauty of Kausani. Pinnath (10KMs), Bura Pinnath (5KMs) and Bhakot are the highest points near Kausani.

తెలుగు సారం: విస్తృతమైన కత్యూర్ లోయ, కౌసాని పట్టణం ముందు, సూర్యోదయం కాగానే, మనం నిదుర లేవగానే, మన కళ్ళముందు దర్శన మిస్తుంది. ఇక్కడ కొంత సమయం ఆగిన మహాత్మా గాంధీ గారి పాదాలను కౌసానీ సౌందర్యం కట్టిపడేసిందట. ఆ క్లుప్తమైన విడిది యొక్క జ్ఞాపకం, అనాసక్తి ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భారత్ యొక్క మరొక మహనీయుడు, హిందీ మహాకవి, సుమిత్రానందన్ పంత్ గారు ఇక్కడ జన్మించారుట. ఆ పవిత్ర స్థలాన్ని గుర్తించటానికి ఒక చిన్న మ్యూజియం కూడ ఉన్నది. ప్రఖ్యాత జానపద గాయకుడు గోపీదాస్ జీ , కౌసానీ సౌందర్యంతో ఎంతో ముగ్ధుడు అయ్యారు. పిన్నత్ 10 కిమీ, బూరా పిన్నత్ 5కిమీ, మరియు భకోట్ ఇక్కడి ఉన్నత ప్రదేశాలు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు



శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమహాత్మాగాంధి గారు విడిది చేశారంటున్న కౌసానీ లోని అనాసక్తి ఆశ్రమాన్ని సందర్శించారో లేదో తెలియదు.
సోనియా మేడమ్ అనే తెలంగాణ మాతకు ఉన్నసేద తీరే హక్కుని మనం తప్పక గౌరవించి తీరవలసినదే. అదే సమయంలో, పాపం గాంధీగారు!! అనాసక్తి ఆశ్రమం యొక్క చరిత్రను గురించి వాకబు చేసి, గాంధీజీ రచించిన అనాసక్తి యోగా గ్రంధం , దీని ఆంగ్ల నామం , Anasakti Yoga, or The Gospel of selfless action చదవాలనే ఆసక్తిని ఆమె చూపి ఉంటే ఎంతో ఆదరణీయంగా ఉంటుంది. ఇది 390 పేజీల గ్రంధం. రాజకీయనేతలు చదువవలసినది. దురదృష్ట వశాత్తు, ఇది కాపీరైట్ లో ఉండి డబ్బు పెట్టి కొనాల్సిందే తప్ప, ఫ్రీ డౌన్ లో డ్ గా లభ్యమవుతున్నట్లు కనిపించదు. దీని యొక్క సంక్షిప్తసారాన్ని ఈ క్రింది వెబ్ సైట్ లో చూడచ్చు. http://www.mkgandhi.org/swmgandhi/chap01.htm సంక్షిప్త సారం చదువటానికి క్లిక్

ఈ సందర్భంగా, మరొక్క విషయం వ్రాయటం తప్పు కాదనుకుంటాను.
తెలంగాణ మాత సోనియా గాంధీ కనీసం, నెలకొక్కరోజైనా తనకొరకు తెలంగాణా లో నిర్మించి దేవాలయాలలోని విగ్రహాలలోకి ప్రవేశించి భక్తుల కోరికలను తీరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా కరీంనగర్ భూత్ పూర్వ్ ఎంపీ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, భూత్ పూర్వ్ ఎం.ఎల్.ఏ. శ్రీ శంకరరావు గారికి, ఏవైనా వరాలను ఇస్తే బాగుంటుంది.



ఆల్మోరాలో స్వామీ వివేకానంద



స్వామీ వివేకానంద గారు కౌసానీ వెళ్ళారో లేదో తెలియదు కానీ, సేవియర్ దంపతులతో ఆల్మోరాలో చాలా కాలం ఉన్నారు. అంతేకాక తన మిత్రురాలైన క్రిస్టీనా గ్రీనై స్టైడల్ గారికి సేవియర్ దంపతుల చేత ఆశ్రయం ఇప్పించారు. స్వామీజీకి ఆల్మోరాలో స్వంత ఇల్లు కొనుక్కోవాలని కోరిక. అది తీరకుండానే కన్ను మూశారు.

Monday, March 3, 2014

164 KCR cheated dalits and coronated his own Son as Prince कॆसीअर दलितों को धोका दिया और अपने बेटे को युवराजा बन दिया కెసీఆర్ దళితులకు చేయిచ్చి తన కొడుకుకే పట్టాభిషేకం చేసుకున్నాడు

164 IS EVERYTHING A DELUSION? అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
చర్చనీయాంశాలు: పవన్ కల్యాణ్,కెసిఆర్,సోనియా గాంధీ,కాంగ్రెస్,తెరాస,చంద్రబాబు


శ్రీపవన్ కల్యాణ్ గారు రాజకీయాలలోకి వస్తారట. కిరణ్ వెనుకాడుతున్నందు వల్ల శ్రీపవన్ కల్యాణ్ గారు రాజకీయాల్లోకి దూకే అవకాశం ఉందిట.

పాతనీరు పోయి కొత్తనీరు రావటంగా మనం భావించి స్వాగతం చెప్పటమే మేలు. కొత్తనీరు పాతనీరు కన్నా మురికిగా ఉండకూడదనేమీ లేదు. అయినా కూడ మార్పు ఎల్లపుడూ అభిలషణీయమే.

ఆక్రోశించి ఫలితమేమి?


శ్రీచంద్రబాబు నాయుడు గారు కెసీఆర్ తన దగ్గర పాఠాలు నేర్చుకొని తనకే పంగనామాలు పెట్టాడని కెసీఆర్ పై ఆక్రోసిస్తున్నారు. మరి తానిచ్చిన ట్రెయినింగు ఎలాంటిది? ఇద్దరూ కలిసి ఎన్ టీ ఆర్ కి వెన్నుపోటు పొడవలేదా?

కెసిఆర్ దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా? Won't KCR allow a dalit to become the first Chief Minister of TelangaNa?


సోపన్ జోషి గారి చిత్రం తెహల్కా.కామ్ వారి దయతో.

15.1.2011 నాడు శ్రీ కె చంద్రశేఖర రావు గారు శ్రీ సొపన్ జోషి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏమన్నారో చూడండి.

Are you doing all this to become the CM of the new state? ఇదంతా మీరు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని చేస్తున్నారా?

This is rubbish. I’ve said it not less than a thousand times that the first Telangana CM will be a Dalit. We have not zeroed in on a name right now, but there are so many leaders. When the occasion comes, we will evolve a consensus on a Dalit CM. The Telangana society is in such a mood that nobody can rule here unless they bring us statehood. It is ultimately a political decision. Let wisdom prevail on the Prime Minister and Sonia Gandhi that they deliver on the promise they made to the people of Telangana.

తెలుగు సారం: ఇది చెత్త. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ఉంటాడని నేను వేయి సార్లకు తక్కువ కాకుండా చెప్పాను. ఇప్పటికిప్పుడు మేము పేరును నిర్ణయించుకునే దశకు రాలేదు. ఆ సమయం వచ్చినపుడు దళిత ముఖ్యమంత్రిపై మేము ఏకాభిప్రాయాన్ని సాధిస్తాము. తెలంగాణ సమాజం ఈరోజు ఏస్థితిలో ఉందంటే, తెలంగాణకి రాష్ట్రాన్ని సాధించకుండా ఇక్కడ పాలన చేయలేని మూడ్ లో ఉన్నది. అది చివరికి ఒక రాజకీయ నిర్ణయము. తాము తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే వివేకం ప్రధానమంత్రి మరియు సోనియా గాంధీలో ఉదయించు గాక.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించటానికి కూడ వెనుకాడకుండా ప్రధానమంత్రి, సోనియా గాంధీ, తాము అన్నమాటలను నెరవేర్చారు కదా. మరి కెసీఆర్ గారు తాను వేయి సార్లకు తక్కువగా కాకుండా అన్నమాటలను నెరవేర్చరా?

కాంగ్రెస్ లో విలీనానికి తెరాస నిరాకరణ


ఊహించినదే. కెసీఆర్ చంద్రబాబు పాఠశాలలో చదివాడు కదా. అందుకని వెన్నుపోట్లు తప్పవు.

శ్రీమతి సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లు కలిసి పాడుకోవాల్సిన ఈనాటి పాట



దేవదాసు నుండి. శ్రీ సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం. సముద్రాల రచన. గానం: కె.రాణి.
ప్రస్తుత పరిస్థితి కనుగుణంగా మార్చి.

అంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా
ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...
మరల అంతా భ్రాంతి||

చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
మరల.
తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
మరల.
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా.. నా ఆశే దోచినదా ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మరల.
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
మరల.
వంతలపాలై చింతిలుటే మా వంతా తెరాసా.. మా వంతా తెరాసా..

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

Friday, February 21, 2014

150 soniamma chinnamma jatara

150 Telangana Govt can start Sonamma Chinnamma jAtara తెలంగాణ ప్రభుత్వం సోనమ్మ చిన్నమ్మ జాతర ప్రారంభించు కోవచ్చు.
చర్చనీయాంశాలు: bifurcation, telangana, విభజన, తెలంగాణ, సుష్మా స్వరాజ్, sushma swaraj, sonia gandhi


ఇప్పటికే తెలంగాణవారు ఆరాధనగా సోనియా గాంధీ గారిని తెలంగాణ మాతగా వర్ణించటం మొదలుబెట్టారు. తెలంగాణ తండ్రిగా కెసీఆర్ గారుంటారని వేరే వ్రాయనక్కరలేదు.

సోనియా గాంధీ గారు తెలంగాణ సందర్శించటానికి ఒప్పుకున్నారుట. ఆమె కరీంనగర్ వెళ్ళి అక్కడి ఎంపీ శ్రీపొన్నం ప్రభాకర్ గారు కట్టేగుడిలో నిల్చుని, శిలగా మారిపోతే, విగ్రహం కన్నా ఎంతో వాస్తవికంగా ఉంటుంది. ఆవిగ్రహానికి వరాలు ఇచ్చేశక్తులు కూడ పెరుగుతాయేమో. అదే దేవాలయంలో మరో ప్రక్క శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి విగ్రహాన్ని కూడ ప్రతిష్ఠించుకోవచ్చు. ఒకే ప్రదేశంలో రెండు దేవతలుంటే శక్తి కూడ రెట్టింపవచ్చు.

సోనియా గాంధీ గారు గానీ, రాహుల్ గాంధీ గారు గానీ, సుష్మా స్వరాజ్ గారు గాని సీమాంధ్ర సందర్శించరనుకోండి. లేదనుకుంటే అక్కడ కూడ ఒక గుడిని కట్టవచ్చు. ఎందుకంటే, వారి వల్ల సీమాంధ్ర వారికి నెహ్రూకుటుంబ బానిసత్వ విముక్తి కలిగింది కనుక. అక్కడే
చంద్రబాబు, జగన్ విగ్రహాలను కూడ ప్రతిష్ఠించు కుంటే సరిపోతుంది. ఒకటే కాంప్లెక్స్.

ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు లోక్ సభలో, తెలంగాణ బిల్లును పాస్ చేశాక, చెప్పిన వాక్యాలను చూద్దాం.

"... I know, Congressmen from Telangana region will try to give the entire credit to Sonia-amma....we are not after any credit, but don't forget, I too was like chinn-amma (an aunt) for the entire process, ..."
తెలుగు సారం
''... నాకు తెలుసు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ వాదులు, తెలంగాణ ఇవ్వటంలో మొత్తం ఘనతను సోనియాకు ఆపాదిస్తారు. ... మేము ఏ ఘనత కోసం పాకులాడటం లేదు, కానీ మర్చి పోవద్దు, ఈ మొత్తం జరిగిన ప్రాసెస్ లో నేను కూడ చిన్నమ్మ (ఆంట్) లాంటి దానినే...''

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ, తిలక్, ఆనీ బీసెంట్ లను మరచి పోయిన ఘనచరిత్ర మనకు ఉంది. పాపం చిన్నమ్మ చేసిన కృషిని ఎవరు గుర్తుకు ఉంచుకుంటారు? కొన్ని సార్లు గుళ్ళూ గోపురాలు కూడ పూజా పునస్కారాలు లేకుండా, కనీసం దీపం పెట్టుకునే వారు లేక బిక్కుబిక్కు మంటు ఉంటాయి. నిజంగా సోనియమ్మ, చిన్నమ్మ పేర్లను జ్ఞాపకం పెట్టుకో వాలంటే చక్కటి మార్గం ఉంది.

ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళ కొకసారి జరుగుతూ ఉంటుంది. దీనికి కోటి మంది దాకా జనం వస్తూ ఉంటారు. సమ్మక్క సారక్క జాతర లేని సంవత్సరంలో అదే నెలలో సోనమ్మ చిన్నమ్మ (లేక సోనక్క చిన్నక్క) జాతర జరుపుకోవచ్చు. దీనికి తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ళ కొకసారి ఒక 50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం (కాంగ్రెస్ కి సోనక్క, బిజేపికి చిన్నక్క ముఖ్యం కాబట్టి) 50కోట్లు ఇస్తే బాగుంటుంది.

సీమాంధ్ర ప్రజలు కూడ ఈజాతరకు వెళ్ళ వచ్చు. వారికి కూడ సోనక్క, చిన్నక్కలు గుర్తుంచుకోదగ్గ వ్యక్తులే.

English Gist.
We have a glorious history of foregetting the great leaders like Gandhi, Tilak and Anne Besant, who took us successfully through the freedom struggle. Alas, who will remember the contribution made by Chinnamma (Sushma Swaraj)? Even temples, built ith great expense and fanfare, sometimes end up as dilapidated places without anybody to light a lamp. There is a good solution to remember Soniamma and Chinnamma, for ever.

Sammakka Sarakka jatara, the principal fair of Telangana takes place every two years. Nearly 10 million attend the fair. During the year of no sammakka sarakka jatara, they can introduce a Soniamma Chinnamma jatara (or a Sonakka Chinnakka jatara or a Peddamma Chinnamma jatara), which will be a biennial event. The Telangana Government can allocate Rs. 500 million for that purpose. The Central Government, (often run either by Congress of Soniamma or BJP of Chinnamma) can also allocate another Rs. 500 million towards its share.

People of Seemandhra (residual Andhra Pradesh) can also attend the fair, since Soniamma and Chinnamma are leaders worth remembering.

Monday, February 10, 2014

133 Modi in Assam

13౩ Narendra Modi instigating regional feelings ప్రాంతీయ భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ
చర్చనీయాంశాలు: Narendra Modi, నరేంద్ర మోడీ, Prime Minister of India, Sonia Gandhi

మన నేతలు పగటి వేష గాళ్ళని వేరే చెప్పనక్కరలేదు.


జాతీయ స్థాయి నేతలుగా ఎదగాలనుకునే ప్రాంతీయనేతలకి ప్రాంతీయ దృష్టే కాకుండా జాతీయదృష్టి కూడ ఉంటే మేలు అని విజ్ఞుల నానుడి. నరేంద్రమోడీ గారు మిగతా నేతలవలెనే ఈవిషయాన్ని తుంగలో తొక్కారు.
For 23 years you have been sending Prime Ministers from here. You tell me, you made such a big investment but what did you get in return. Did you get anything?...If he being yours could not do anything for you, then what will he do for the nation.
తెలుగు సారం
మీరు గత 23 ఏళ్లుగా ఇక్కడనుండి ప్రధానమంత్రులని పంపిస్తున్నారు. (శ్రీ మన్మోహన్ సింగ్ ని రాజ్యసభకి అని భావం). మీరు చెప్పండి, మీరు అంత పెద్ద పెట్టుబడిని పెట్టారు, కానీ ప్రతిఫలంగా ఏమి పొందారు? మీకైదైనా వచ్చిందా?... ఆయన (ప్రధాని) మీవాడైనా మీకేమీ చేయలేదంటే, ఆయన జాతికి ఇంకేమి చేస్తాడు?

Among all Northeast states, Assam's condition is the worst ... Congress leaders are narrow minded. Their thinking is narrow, dreams are small and vision is shortsighted.
తెలుగు సారం: ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో, అస్సాం పరిస్థితే దిగదుడుపు. ... కాంగ్రెస్ నాయకులు ఇరుకు మనస్తత్వం గలవాళ్ళు. వాళ్ళ ఆలోచన ఇరుకు. కలలు చిన్నవి. దృష్టి ఎక్కువ దూరం పోదు.

Prime Minister ji if even a small worker from Assam would have sat in Rajya Sabha for 23 years, he would changed the face of Assam. You are sitting in Rajya Sabha for 23 years, holding the coveted post of Prime Minister and yet your own state of Assam is facing such a bad condition, then you can imagine in what bad shape will the whole country be.
ప్రధానమంత్రి గారూ, అస్సాం నుండి ఒక చిన్న కార్యకర్త రాజ్యసభలో 23 ఏళ్ళు కూర్చున్నా, అతడు అస్సాం ముఖచిత్రాన్ని మార్చిఉండేవాడు. మీరు రాజ్యసభలో 23 ఏళ్ళ నుండి కూర్చుంటున్నారు. అయినా మీ స్వంతరాష్ట్రం అయిన అస్సాం ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటున్నదంటే, అఖిలభారత దేశం ఇంకెంత దుస్థితి లో ఉందో ఊహించండి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు Comments of ybrao a donkey


This type of comments instigate regional hatred, though they may be facts. ఇటువంటి వ్యాఖ్యలు సత్యాలే అయినా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతాయి.

Every leader, be it Sonia Gandhi, Rahul Gandhi, Narendra Modi make this type of speeches, to whichever Region/State they go. ప్రతి నేతా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, ఏ ప్రాంతానికి| రాష్ట్రానికి వెళ్ళినా ఇటువంటి ఉపన్యాసాలే ఇస్తూ ఉంటారు.

తెలుగులో ఒక సామెత ఉంది. ఏ రోటి దగ్గర ఆపాట పాడటం. Telugu language has a proverb. Singing the song appropriate to the corn-grinding-stone =mortar. (Upto near 1950, corn/flour used to be ground with hand pestles on stone grinders. 2 or 3 persons used to apply the pestle in turn. While operating the pestles, they used to sing folk songs. The songs used to vary depending on the house in which the mortar is located and grinding work is done. )

అస్సాం వెళ్తే అస్సాం పాట, తమిళ నాడు వెళ్తే తమిళనాడు పాట. Assam song is sung when leaders go to Assam, and Tamil Nadu song is sung when they go to Tamil Nadu.

నరేంద్రమోడీ గారూ, అరవింద కేజ్రీవాల్ గారూ భిన్నంగా ఉండాలని కదా మనం కోరుకునేది. What do we expect? Narendra Modi and Aravind Kejriwal ought to be different.
... Prime Minister ji, you will have to reply. People of the country have the right to seek an answer from you and people of Assam have a special right to demand an answer from you ...
తెలుగుసారం
ప్రధానమంత్రిగారూ, మీరు జవాబు ఇవ్వాల్సిందే. ఈదేశ ప్రజలు మీనుండి జవాబును కోరే హక్కును కలిగి ఉన్నారు. అస్సాం ప్రజలకి మీనుండి జవాబును కోరే ప్రత్యేక హక్కుఉన్నది,

వైబీరావు గాడిద వ్యాఖ్య Comment of ybrao a donkey


గుజరాత్ లో 33 జిల్లాలు ఉన్నాయి. వికీపీడియా ప్రకారం, గుజరాత్ లోని డాంగ్ జిల్లా, గుజరాత్ లోనే కాదు, భారత దేశంలోనే మిక్కిలి వెనుకబడిన జిల్లా. నరేంద్రమోడీ గారిని మరల మరల ముఖ్యమంత్రిని చేస్తున్న వారిలో, డాంగ్ ప్రజలు కూడ ఉన్నారు. అస్సాం ప్రజలచేత మోడీగారు మన్మోహన్ సింగ్ గారిని అడిగిస్తున్న ప్రశ్నలనే, డాంగ్ జిల్లా ప్రజలచేత మోడీగారిని అడిగించ వచ్చు. Gujarat has 33 districts. Dang District in Gujarat, is the most backward district not only in Gujarat, but also in entire India. The voters of Dang are also a part of the Gujarat people who are electing Mr. Narendra Modi. Somebody can go to Dang and make Dang District people pose the same questions to Narendra Modi, which Mr. Modi is instigating people of Assam to ask.

Thursday, November 21, 2013

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

bifurcation, livelihood, విభజన, బ్రతుకుతెరువు

Question: మీవ్రాతలు చూస్తుంటే, మీరు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం లాగ కనిపిస్తుంది. నిజమేనా?



నిజం కాదు. ప్రత్యేక తెలంగాణను నిరంకుశ పధ్ధతుల్లో ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అవసరం. వివిధప్రాంతాలవారు, నెలకొకసారి సమావేశమయి కొంత ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, ఒక అవగాహనకు వచ్చాక, అన్ని ప్రాంతాల ప్రజలు ఏర్పాట్లను చర్చించాక, వారే స్నేహపూర్వక విభజనను కోరుకుంటారు. లేదా సమైక్యంగా ఉందామనుకుంటారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ శ్రీ ఆసిఫ్ ఇబ్రహీం , 21-11-2౦1౩ నాడు, ఢిల్లీలో జరిగిన డీజీపీల మూడవ సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారో చూడండి.
“The demand for a separate statehood to Telangana has triggered counter-agitations. The situation emerging on this front is likely to throw up new challenges to the security forces as well as intelligence agencies at both the state and national levels."


కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో, సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని అధికారంలోకి వచ్చింది. 2౦౦4లో ఆమె ఎన్నికల ప్రసంగం.
“Muje Telangana ke jasbath ka yehsahs hai, mein jaanthi hoon jithni tarakki hone chahiye thi, utna nahi hooyi, rojgaar ke jithne mathen milna cayihe the nahi mile,, mein aapp ke jasabaathon ki katthir karthi hoon, aagar iss pradesh mein, aur kendra mein apni sarakari bani,tho hum apki ummedonko poori karneka hur koshish karenge..


ఈ వాగ్దానం ఆమె ఆరునెలలలో పూర్తి చేస్తానందిట. ఆరు నెలల సంగతి మర్చిపోయి 2౦౦4 నుండి 2౦1౩ వరకు సోనియా మాత నిద్రపోయింది. 1999 నుండి 2౦1౩ వరకు బిజెపి నిద్ర పోయింది . కాబట్టి, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ, ఒళ్ళో పెడుదునా దళ్ళో పెడుదునా అన్నట్లుగా బిల్లు, బిల్లు అని ఉరికితే ఎలా? జాతీయ స్థాయిలో పాలించే వాళ్ళకి ముందు చూపు ఉండాలి. విదేశీయురాలైన సోనియాకు పాపం ఈ ముందు చూపు లేదు అనుకున్నా, శ్రీ మన్ మోహన్ సింగుకు, చిదంబరానికి, సుశీల్ కుమార్ షిండేకి ఉండాలి కదా.

తెలంగాణాను ఏర్పరచటానికి ఆమె చేసిన ప్రయత్నం ఏమిటి? ఆమె అన్ని ప్రాంతాలవారినీ 2౦౦4లోనే ఒకచోట సమావేశం చేయించి, ఇరువురికీ ప్యాకేజీలను ఆఫర్ చేసి ఒప్పించి ఉండాల్సింది. గులాబీ కండువా కప్పుకునే ముందు ఆమె సీమాంధ్ర ప్రజలను సంప్రదించిందా? లేదు. తరువాతైనా సంప్రదించిందా? లేదు. తెరాస నేత కెసీఆర్ చేత ఆపార్టీని కాంగ్రెస్ లో ఎలాగైనా విలీనంచేయంచుకోవాలనే యావ తప్ప, కాంగ్రెస్ అధిష్టానానికి వేరొక చోదనం లేదు.

గులాబీ కండువాను కప్పుకోటం ద్వారా సోనియా మాత పులిపై స్వారి మొదలు పెట్టినట్లయ్యింది. కదిలితే తెరాసా నేతలు, టీజాక్ నేతలు మింగటానికి సిధ్ధంగా ఉన్నారు.

ఇప్పుడు కూడ సోనియా మాత సీమాంధ్రలో ఎందుకుపర్యటించలేక పోతున్నది? ఆమెకు అనారోగ్యం అనే కారణం చెల్లదు. ఎందుకంటే,ఆమె కర్నాటక వెళ్ళి కాంగ్రెస్ ను గెలిపించి నందుకు వారికి థాంక్స్ చెప్పింది.

Question ప్రశ్న: మరి సీమాంధ్ర నేతలు ఎందుకు నిద్రపోయారు?

Answer జవాబు:


శ్రీరాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కావాలి. సీమాంధ్రలో కాంగ్రెస్ టిక్కెట్లు పొందిన వారందరు, ఆయన అనుయాయులు కావటం వల్ల అందరూ, టీడీపీని ఓడించి సింహాసనాన్న సాధించుకోవాలనే తపనతో నిద్ర పోయారు.

Question: అయితే మీ వైబీరావు గాడిద అభిప్రాయం ఏమిటి?

Answer: జవాబు


సోనియా స్వార్ధం, వాజ్ పేయి అద్వానీ స్వార్ధం, రాజ్ నాధ్ సింగ్ నరేంద్రమోడీల స్వార్ధం, రాజశేఖర్ స్వార్ధం, కిరణ్ స్వార్ధం, కేసీఆర్ స్వార్ధం,జానా జైపాల్ స్వార్ధం, వంటి వాటికి మనం అలవాటు పడ్డాం.

అయ్యా, ఒక నాస్తికుడిగా, మార్క్సిస్టుగా, నేను శ్రామిక వర్గ పక్షపాతినే కాని కానీ ప్రాంతీయ రాగద్వేషాలతో నాకు సంబంధం లేదు. శ్రామిక వర్గకోణంలోంచి చూసినప్పుడు, పొట్టకోసం వలసపోటం, అనివార్యం. వెళ్ళినచో ట స్వల్పంగా కొన్ని పరిమితులకు లోబడి, చిన్న ఇల్లు, కొద్దిగా పొలం సేకరించుకోవచ్చు. ఇది , దేవుడు ఇచ్చిన అనలేం కానీ, భూగోళంలో మనకు సహజ సిధ్ధంగా లభించే ఒక మానవ హక్కు. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, వంటి దేశాలు, ఈమానవ హక్కుకు భంగం కలిగిస్తున్న విషయం విదితమే. వారి అమానుషత్వాన్ని వ్యతిరేకించ వలసిన బాధ్యత భారతీయులందరిపైనా, ముఖ్యంగా శ్రామికులందరి పైనా ఉంది.

ప్రాంతీయ కుమ్ములాటలతో మనలో మనం తన్నుకుంటుంటే, ఇంక అంతర్జాతీయ మానవ హక్కులను ప్రస్తావించే తీరిక, ఓపిక, కోరిక, మనకు ఎక్కడ ఉంటాయి?

Question: ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పండి.

Answer:జవాబు:


ఆంధ్ర ప్రదేశ్ వైశాల్యం చాలా ఎక్కువ. హైదరాబాదు నుండి విశాఖకు షుమారు 75౦ కిలోమీటర్లు. హైదరాబాదు నుండి రోడ్ ద్వారా అనంతపూర్ కు 476, హిందూపూర్ కు 411 లేక 462 కిలోమీటర్లు. చిత్తూరుకు 572 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు. ఇలాంటి దూరాలను రైల్లో ప్రయాణించినా, బస్సుల్లో ప్రయాణించినా విపరీతమైన ఖర్చు. ప్రాణాలు గాలిలో దీపం. పైగా, ఒకే రోజు హైదరాబాదు వెళ్ళి తిరిగి రాలేరు. హైదరాబాదులో లాడ్జింగ్ ఖర్చులు ఎవరిస్తారు? లేదా బంధువుల నెత్తిన పడాలి. దూరం కోణం నుంచి చూసినా, రాష్ట్రాన్ని 4 లేక 5 చిన్నరాష్ట్రాలను చేయటం అవసరం.


కాబట్టి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాష్ట్రాలు అవసరం.

Question ప్రశ్న: మరి హైదరాబాదు సంగతి ఏమిటి?

Answer, జవాబు:


హైదరాబాదు తెలంగాణా వారిది మాత్రమే అనుకోటం అర్ధం లేదు. శాతవాహన ఆంధ్రులకాలం నుండి, తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉన్నాయి. చాళుక్యుల కాలంలోనూ అంతే. కాకతీయుల కాలంలోనూ అంతే. బహమనీల కాలంలోనూ అంతే. కొంతకాలం గజపతులు గోదావరీ తీరం వరకు ఆక్రమించినా, విజయనగరరాజులు, గోల్కొండ నవాబులు, కోస్తాను, రాయలసీమను తిరిగి ఆక్రమించారు.

బ్రిటీష్ వారికి నిజాం నవాబులు సర్కారులను బ్రిటీష్ వారికి కప్పంగా, ఇచ్చేశాడు. దక్షిణ సర్కారులను వారికి బలవంతంమీద అమ్మివేశాడు. తరువాత, బ్రటీష్ సైన్య పోషణ కొరకు రాయలసీమను దత్తం చేశాడు. అందుకే వీటికి దత్తమండలాలు అనే పేరు వచ్చింది.

బ్రిటీష్ గవర్నర్ మదరాస్ నుండి, దత్తమండలాలను, సర్కారులను పాలించటంతో, సీమాంధ్రులకు మదరాసు ప్రయాణం అవసరం అయ్యింది. కలకత్తా మద్రాస్ రైలు మార్గం ఏర్పడక ముందు అంటే 1905 ముందు విశాఖ నుండి మదరాసు వెళ్ళాలంటే, ఓడలో వెళ్లవలసి వచ్చేది.

హైదరాబాదు నుండి కర్నూలుకు 182 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు కాగా గుంటూరుకు 2 70 లేక 3౦ 2 కిలోమీటర్లు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే , హైదరాబాదుపై ఆప్రక్కనున్న వరంగల్ వారికో,మెదక్ వారికో ప్రత్యేక హక్కులు ఉన్నాయనుకోటం ఒక భ్రమ.

హైదరాబాదులో 1956కు ముందు, వజీర్ సుల్తాన్ వారి చార్ మినార్ సిగరెట్ల ఫ్యాక్టరీ తప్ప పెద్ద పరిశ్రమలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ పెద్దరాష్ట్రంగా అవతరించాక, కేంద్రం మొత్తం 20 జిల్లాల అభివృధ్దిని దృష్టిలో ఉంచుకొని, అఖిలభారత నిధులను వెచ్చించి BHEL, HAL, HMT, BDL, ECIL, HCL, IDPL, DRDL, DLRL, DMRL, MIDHANI, NUCLEAR FUEL COMPLEX, HYDERABAD CENTRAL UNIVERSITY, ICRISAT, ENGLISH & FOREIGN LANGUAGES UNIVERSITY, వంటి పలు సంస్థలను స్థాపించారు తప్ప కేవలం తెలంగాణ 1౦ జిల్లాలనుద్దేశించి స్థాపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ, రాష్ట్రం యొక్క 2౦ జిల్లాల నిధులను వ్యయం చేసి హైదరాబాదును అభివృధ్ధి చేసింది. ఐటీ రంగాన్న అభివృధ్ధి చేసింది. ఆనాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రాంతీయ దృక్పథం ఉండి ఉంటే, విశాఖ, విజయవాడ, కర్నూలు, నగరాల్లో కూడ ఐటీ హైటెక్ సిటీ లను నెలకొల్పి ఉండేవాళ్ళు. ఇప్పడు కెసీఆర్ &కో, కోదండరాం&కో, ఇప్పుడు జైపాల్ రెడ్డి&కో, ప్రతి దాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూడటం గమనార్హం.

2౩ జిల్లాల జనం, 28రాష్ట్రాల జనం ఒకచోట చేరటం వల్ల హైదరాబాదు మార్కెట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రం మొత్తం నుండి వసూలయిన పన్నులను, వ్యాపార సంస్థల, కంపెనీల హైదరాబాదు కార్యాలయాలు, నగరంలో చెల్లించటం వల్ల హైదరాబాదు పన్నుల ఆదాయం విపరీతంగా పెరిగింది. అది మొత్తం 1౦ తెలంగాణ జిల్లాల బలం అనే భ్రమ ఏర్పడింది.

తెలంగాణ నేతలు తమ స్వార్ధం కొరకు, తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్రమైన కోరికను లేవదీశారు. హైదరాబాదునుండి, 1౦ జిల్లాలకు చెందని తెలుగు వాళ్ళను తరిమేస్తే, ఉద్యోగాలన్ని మనవే. డబల్ ప్రమోషన్లు కొట్టేయచ్చు. కెసీఆర్ ఇంక్రిమెంట్లుకూడా వాగ్దానం చేశాడు. ఇళ్ళస్థలాలు, అపార్టమెంట్లు అగ్గువకు కొనేయచ్చు. సాగర్లో, శ్రీశైలంలో, మొత్తం నీళ్ళన్నిటినీ ఆపేయచ్చు. జారాలనుండి, ఆదిలాబాదు వరకు కృష్ణ నీటిని పారించ వచ్చు. కర్నాటక నీటిని వదిలతేకదా, జూరాలకు నీరు వచ్చేది, అనే ప్రాథమిక విషయాన్ని కూడ మర్చి పోయారు. జూరాల్లో నీళ్ళుంటే కదా ఆదిలాబాదుకి వెళ్ళేది.

ఇప్పుడు హైదరాబాదు భారతీయులది అందరిదే తప్ప కేవలం తెలుగు వారిదో, తెలంగాణవారిదో కాదు. పైగా శ్రామిక హక్కుల మానవహక్కు సిధ్ధాంతం సరిగా అమలు కావాలంటే, హైదరాబాదే కాదు, 1౦ లేక 2౦ లక్షలు జనాభా దాటిన ప్రతినగరాన్నీ కేంద్రపాలిత ప్రాంతం చేయటం అవసరం. పాకిస్థాన్ ప్రేరిత తీవ్ర వాదాన్ని అరికట్టాలన్నా, నగరాల కన్నిటికీ కామన్ పోలీస్ వ్యవస్థ అవసరం. అంతేకాదు, 2౦ లక్షల జనాభా దాటిన నగరాల పెరుగుదలను అరికట్టటం కూడ అవసరమే. అంటే అక్కడ 2౦ లక్షల జనాభాకి ఎటువంటి INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలో అన్నే INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలి. ఎక్కువ ఉంటే జనాభ్ పెరిగి నీళ్ళు, డ్రైనేజీ, సమస్యలు వస్తాయి. ఆనగరాల స్థానంలో కొత్త చిన్న నగరాలను అభివృధ్ధి చేసుకోవాలి.

Question ప్రశ్న: ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఎన్నాళ్ళు ఉండాలి?



ఎన్నాళ్ళో ఉండనవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర,రాయలసీమలకు అసౌకర్యం. హైదరాబాదు శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు, కావాలనుకుంటే, ఉత్తర దక్షిణ తెలంగాణాలు తమతమ రాజధానులను హైదరాబాదులో ఏర్పరుచుకోవచ్చు.

Question: మరి నదీజలాల సంగతి ఏమిటి?



జూరాల్లో కృష్ణానదిలో, శ్రీరాంసాగర్ గోదావరిలో నీళ్ళే లేనప్పుడు పంపకం అనేది ఊహా జనితమైన వివాదం కాబోతున్నది. నదీజలాల విషయంలో, రాయలసీమ, తెలంగాణ, సీమాంధ్రల పరిస్థితి చాలా దీనంగా ఉండబోతున్నది. కాగితం మీద 8౦౦ టీయంసీలు 1౦౦౦ టీయంసీలు వంటి లెక్కలు ఉన్నా వాస్తవ జలాలు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు దాటి దిగువకు రావు. రెండు నదులు వరదల సమయంలో మురుగు కాలువలు గా వాడపడతాయి.

Question ప్రశ్న: మరి ఏమిటి దిక్కు?



బంగాళాఖాతంలోని సముద్ర జలాలను శుధ్ధి చేసి, సాగు, తాగు నీటి అవసరాలను కోస్తాజిల్లాలు తీర్చుకోవాలి. అంతేకా దు, ఎగువన తెలంగాణాకు, రాయలసీమకు సప్లయి చేయాలి.

Question ప్రశ్న: మరి బొగ్గు, ఇనుము, సున్నపురాయి సంగతి ఏమిటి



ఇవి శాశ్వత వనరులు కావు. వాడేస్తే వట్టి పోతాయి. గుంటలు మిగులుతాయి. సూర్య శక్తి తప్పమార్గం లేదు. మనకు భూమి కరువు కాబట్టి బంగాళాఖాతంలో కి రోడ్లను,తేలే ప్లాట్ ఫారాలను నిర్మించుకొని, సూర్యశక్తి స్టేషన్లను అభివృధ్ధి చేసుకోవాలి. దురదృష్ట వశాత్తు ఈదౌర్భాగ్య ప్రభుత్వం మంగళ్ యాన్ మీద వేలకోట్లు తగలేస్తున్నది తప్ప సూర్యశక్తి, సముద్రజలాల శుధ్ది విషయం పట్టించుకోవటంలేదు.

చిన్న రాష్ట్రాలను సమర్ధించటం అనేది అఖిల భారత అవసరం.

ఇంకా సుదీర్ఘంగా వ్రాయవలసి ఉంది. సశేషం.

Tuesday, November 19, 2013

066 గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! A wedding cannot be stopped by hiding pestle stone




bifurcation, విభజన, మనుచరిత్ర, పెద్దన, పద్యకవిత్వం
తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు,అంటారు. అల్లసాని పెద్దనామాత్యుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. ఈమహాకవి విరచితమైన మనుచరిత్ర ప్రబంధం తెలుగువారు నిత్యం కాకపోయినా, నెలకొకసారి కనీసం ఒక్క పద్యాన్నైనా చదువ తగిన గ్రంధరాజము.

పైపద్యం, మనుచరిత్ర పంచమాశ్వాసంలో, 17 వపద్యం. అల్లిక జిగిబిగియే కాక, పైపద్యం లో మనమేమి గమనించవచ్చు? జవాబు: సుందరమైన తెలుగు నుడికారం. నాలుగవ లైనులో వాడిన ఈలోకోక్తిని చూడండి. 'గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!'

ఈసామెత తెలుగు వారిలోకి 16వ శతాబ్దం నాటినుండే ఎలా ప్రవేశించింది?

ఆకాలంలో తెలుగువారిలో వోలికాశపడి కానీ, ఇతరకారణాల వల్లకానీ, బాలలను అతివృధ్దులకు ఇచ్చి వివాహంచేసే ఆచారం ఉండేది. రెండు మూడేళ్ళలోనే ఆవృధ్ధుడు గతించటం, అబ్బాల విధవ పుట్టింటికి చేరటం జరిగేది. ఇలా జరగటం ఆఇంటి ఇల్లాలికి ,అంటే పెళ్లి కూతురు తల్లికి ఇష్టం ఉండేది కాదు. ఆమె నిరసనలను ఇంటి యజమానిగానీ, బంధువులుగానీ పట్టించుకోకుండా పెళ్ళిని ముందుకు నెట్టుకెళ్ళేవారు. ఆతల్లి ఏడుస్తూ కూర్చునేది.

ఆనాటి వివాహాల్లో ఒకానొక దశలో గుండ్రాయి అవసరం పడేది. దాన్ని ముందుగా సిధ్ధం చేసుకోటం జరగనిచోట, అప్పటికప్పుడు, పెళ్ళి పందిరిలో గుండ్రాయి కొరకు వెతికేవాళ్ళు. దొరకకపోతే, వివాహం కొన్ని నిమిషాలు ఆలస్యం అయ్యేది. ఒకపెళ్ళిలో, పెళ్ళికూతురు తల్లి ఏంచేసిందంటే, గుండ్రాయి దొరకకుండా, దానిని దాచిపెట్టింది. అలాగైనా ఆపెళ్ళి ఆగిపోతుందని, ఆ అమాయక తల్లి ఆశ. ఆపెళ్ళికూతురు తండ్రి, బంధువులు మొండి ముండా కొడుకులు, ఎక్కడి నుండో మరో గుండ్రాయిని తెచ్చి ఆపెండ్లిని పూర్తి చేశారు. అలాగా, 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా', అనే సామెత వ్యాప్తమయ్యింది.

మనుచరిత్రలో ఈసామెతను వాడిన సందర్భం


బ్రహ్మ మిత్రుడు అనే పండితుడు, తన శిష్యులకు ఆయుర్వేదాన్ని నేర్పే వాడు. ఇందీవరాక్షుడు అనే రాజు , బ్రహ్మ మిత్రుడి దగ్గరకు వెళ్ళి తనకు ఆయుర్వేదాన్ని నేర్ప వలసినదిగా ప్రార్ధించాడు.

గురువుకి రాజులపై ఏవో దురభిప్రాయాలుండటం వల్ల ఆయన దానిని కొంత కటువుగానిరాకరించాడు. ఇక్కడ పెద్దన పద్యం అవశ్యం పఠనీయం, కమనీయం.
గురువు, బ్రహ్మ మిత్రుడు : నటవిట గాయక గణికా
కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
గటు వీ శాస్త్రము వల ది
చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్‌?


రాజు, ఇందీవరాక్షుడు :
తేటగీతి. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
యించుకించుక మీవంటి యెఱుక గలుగు
పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు.


గురువు, బ్రహ్మ మిత్రుడు :
కందం. ధన రాజ్య రమా మదమునఁ
గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
టెను నేరము గలదే? ననుఁ
గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్‌.


రాజు, ఇందీవరాక్షుడు :

తేటగీతి. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
వెజ్జుఁదన మేల? (యని మది లజ్జవొడమి).


ఇందీవరాక్షుడు ఇంటికెళ్ళి నిద్ర పోలేదు. మారువేషంలోతిరిగి వచ్చి గురువుగారిని మభ్యపెట్టి ఆయుర్వేదాన్ని బాగానే నేర్చుకున్నాడు. అంతటితో ఆగి, ఇంటికెళ్ళి ఉంటే బాగుండేది.

కానీ రాజులకుండే నోటి దురుసుతనం , అహంకారం ఆపని చేయనివ్వ లేదు.
శార్దూలం. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


రాజు గురువుని 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా' అని హేళన చేశాడు. గురువుకి కడుపులో మండి పోయింది.

మత్తేభం. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.

వచనం. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర
ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున
విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని
కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు
మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి
గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా
మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె
జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి.


గుటగుటలు గురువుతోనా! అని గురువు ఇందీవరాక్షుడిని రాక్షసుడివై పొమ్మని శపించాడు.

తరువాతి కథ ఇంకోసారి.

పై సామెతను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి గారి శాసనసభ ప్రోరోగ్ మంత్రాంగానికి వర్తింప చేయవచ్చా?

పరిశీలన:
ముందుగా, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రే అయినప్పటికీ , లోలోపల ఏస్వార్ధాలున్నప్పటికీ, మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి ధైర్యాన్ని అభినందించి తీరాలి. కిరణ్ కుమార్ రెడ్డి

కాకపోతే రాష్ట్ర విభజనను అడ్డుకోటానికి ఆయన వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో అనుమానాస్పదం.
పైన వ్రాసిన బాల్య వివాహం కథలో , పెళ్లికూతురు తల్లి గుండ్రాయిని దాచకుండా, ఏనుయ్యో గొయ్యో చూసుకొని ఉంటే వివాహం కనీసం మైల కారణం వల్లనైనా ఆగేది. గ్రామస్థులు కూడ చొరవ తీసుకుని ఆపించి ఉండే వాళ్ళేమో. ఆమె గుండ్రాయిని దాచటం వల్ల పెళ్ళిని కొన్ని నిమిషాలు ఆలస్యం చేయించకలిగింది కానీ మొండి ముండాకొడుకు మొగుడి, ఇంకా పెద్ద ముండాకొడుకులు బంధువుల మనసులను మార్చలేక పోయింది.

ముఖ్యమంత్రిగారు కూడ, రెండు నెలలక్రితమే శాసనసభను సమావేశం చేయించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు తీర్మానం చేయించి, శాసనసభను ప్రోరోగ్ చేయించి, మర్నాడు తాను రాజీనామా చేసి ఉంటే, బహుశా, పరిస్థితులు భిన్నంగా టర్న్ తీసుకొని ఉండేవేమో.

రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియా భటులు (హోం మంత్రి, గోం మంత్రుల బృందం), రాజ్ నాధ్ సింగ్- సుష్మా స్వరాజ్ వంటి భాజపా నేతలు, పైన వ్రాసిన పెళ్ళికూతురి తండ్రి, బంధువులకు ఏమాత్రం తీసి పోలేదు. మొండి ముండాకొడుకులు అనటానికి సభ్యత అడ్డు వస్తుంది. బిజెపి అండ చూసుకొని కాంగ్రెస్ ఇలా చెలరేగి పోతున్నది. ఎప్పుడో బిజెపి వాగ్దానం చేశానంటున్నది. సీమాంధ్రలో ఎక్కడన్నా సభలను పెట్టి తెలుగు ప్రజలకు నచ్చచెప్పిందా.

దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టు వైఖరి కూడ, ఈబలవంతపు పెళ్ళి తంతును (ఇక్కడ బలవంతపు విడాకులు) ముందుకు తీసుకు వెళ్ళేది గా ఉన్నది. సుప్రీంకోర్టు ఎడల అగౌరవాన్ని వ్యక్తం చేయకుండా, వారి తీర్పులను విమర్శించటం తప్పుకాదు కనుక మనం మరి కొంత పరిశీలన చేయవచ్చు.

రాష్ట్ర విభజన అంశం ఇంకా పక్వానికి రాలేదు,తగిన సమయంలో వస్తే పరిశీలిస్తాం అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం లాగా కనిపిస్తుంది.

కేంద్రం, గోం, హోం మంత్రిగారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ సింగ్ గారు, అందరూకూడ , ఇంక కొద్ది రోజుల్లో బిల్లు నిశ్చయం అని బల్లగుద్ది చెప్తున్నారు. కేంద్రం సీమాంధ్రకు వాతలు పెట్టటానికి శలాకలను ఎర్రగా కాలుస్తున్నది. టీలీడర్లు డప్పులు కూడ వాయిస్తున్నారు. న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళటానికి ఇంతకన్నా తగిన సమయం ఇంకేమి ఉంటుంది? వాతలు పెట్టాక, శరీరం అంతా కవురు కట్టాక, ఎంత శాతం కాలింది అని లెక్క కట్టేదాకా ఆగాలా? అప్పుడు బర్నాల్ పూసి యాంటీ బయటిక్కులు రాస్తే సరిపోతుందా? అన్యాయం జరిగిం తరువాత ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోటంకన్నా ముందుగా నివారించటం మేలు కాదా.

సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అధిష్ఠానం వాతలు పెట్టటంలో, బిజేపీ నేతలు వాతలు పెట్టటంలో, సీమాంధ్రనేతల పాత్ర తక్కువేమీ లేదు.

ఆంధ్రప్రదేశ్ సభాపతి కొన్న నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. వారి మనస్సులో ఏమి తంత్రాలు దాగియున్నాయో మనుకు తెలియదు. ఇప్పుడు శ్రీవారి స్వార్ధ ప్రణాళికలు బయటికి వస్తాయేమో మనం చూడాలి. ఏపుట్టలో ఏపాము ఉంటుందో ఎవరికి తెలుసు?

Tuesday, October 22, 2013

019 రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా


Added on 4th Jan. 2016: People of Residual Andhra Pradesh have not learnt any lessons from the forced unjust bifurcation of United Andhra Pradesh. The People of Residual A.P. deserve this treatment.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికార ప్రతినిధి, మాన్యశ్రీ సందీప్ దీక్షిత్ గారు , పత్రికల ప్రకారం ఒక ప్రకటన చేశారు. దాని సారం ఇది.

ముఖ్య మంత్రులు , పార్లమెంటు చేసే రాష్ట్రాల విభజనలను ఆపలేరు.

పరిశీలన.
________

ఇది దీక్షిత్ గారి వ్యక్తిగత అభిప్రాయమో లేక కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారిక అభిప్రాయమో తెలియదు. అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ అనుమతి తో ఇలా చెప్తున్నారో తెలియదు.

కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు, టీ నాయకులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఇలానే అంటున్న్రారు. అందరూ కలసి సీమాంధ్ర ప్రజలపై కక్షకట్టారా అనిపిస్తుంది. లేక సీమాంధ్ర ప్రజలు విధి వంచితులా అనిపిస్తుంది.

అలనాటి పాండవులు అడవులకు వెళ్ళారంటే, అందులో జూదమాడటం అనే స్వంత లోపం ఉంది. కానీ సీమాంధ్ర సామాన్య ప్రజలలో అటువంటి దోషాలేమీ లేవు. దేశంలో ఎక్కడైనా బ్రతుకుతెరువు సంపాదించుకోటం, చిన్నచిన్న ఆస్తులను సంపాదించుకోటం వారి ప్రాధమిక హక్కు. ఈ హక్కు ఒక మానవ హక్కు. దీనిని దేవుడే తొలగించలేడు. ఇంక పార్లమెంటేమి తొలగిస్తుంది ! కాంగ్రెస్ మరియు బిజెపి కుమ్మక్కై ఏక పక్షంగా రాష్ట్ర విభజనకు పూనుకోటం హృదయ విదారకం. సీమాంధ్ర ప్రజల శ్రామిక బ్రతుకు తెరువు హక్కులకు భంగకరం. కేవలం కొన్ని ఆత్మహత్యలు జరిగాయని (ఇవి కూడా ఎక్కువగా టీ లీడర్ల దుర్బోధల వల్ల జరిగినవే ), సీమాంధ్ర ఆమ్ ఆద్మీని సంప్రదించకుండా, తమకు ఇష్టం వచ్చిన రీతిలో విభజనకు పూనుకోటం ఘోరం, అమాయక తెలంగాణా_సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును తెరాస నేతల కబంధ హస్తాల్లో పెట్టటం దారుణం. తెరాసను కాంగ్రెస్ లో లీనం అవమని ప్రార్ధించటం , వారు మోసం చేయటానికి ప్రయత్నించటం , ఇంక ఏం జరుగుతుందో , మనం తెరపై చూడాలి.

ఇప్పుడు కేంద్రమంత్రుల బృందం MOG కి అప్పగించిన terms of reference లో కూడా కీలక విషయాలేమీ లేవు. సీమాంధ్ర ప్రజలు ఏ సూచనలను పంపినా కూడా అవి మా terms of reference లో లేవు అని తొక్కి పారేసే అవకాశం ఉంది. సూచనలను ఆహ్వానించటం అనేది ఒక కంటి తుడుపు చర్యగా మిగిలి పోయే అవకాశాలు బహుళం.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా అని కదా కేంద్ర ప్రభుత్వం న్యాయాన్యాయాలను పట్టించుకోకుండా అడ్డు దారులు, నియంతృత్వ దారులు వెతుక్కునే అవకాశాలున్నాయి. సందీప్ దీక్షిత్ ప్రకటన కూడా అందులో ఒక భాగమే.

ఇటువంటి దారుణ పరిస్ధితులు , కేవలం సీమాంధ్ర ప్రజలకే కాదు, దేశంలోని ఏ ప్రాంత ప్రజలకైనా రావచ్చు. ఇతర రాష్ట్రాల ప్రజలు కొందరు దీనిని వినోదంగా చూస్తుంటే, మరి కొన్ని ప్రాంతాలవారు , తమ భవిష్యత్ ఉద్యమాలకు ఒక case study గా తీసుకొని సీమాంధ్ర ప్రజలవలె నిద్దుర మత్తులో మునుగ కుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంది.

2014లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలకు పలు కఠిన పరీక్షలు రెడీగా ఉంటాయి. ఇల్లలుకగానే పండుగ అవదు అని సోనియా, రాహుల్, మోడీ, సుష్మా స్వరాజ్ ల వంటి అగ్రనేతలే కాక ఇతరులు కూడా గ్రహించటం మేలు.

Wednesday, October 16, 2013

#014 Wash the Queen's feet with tears!


Congress Leaders serve their Dynastic Leaders Mrs. Sonia Gandhi and Mr. Rahul Gandhi with great dedication and devotion. If leaders of other States do "two much", Congress Leaders of Andhra Pradesh do "three much" !!!
Here is a verse from the Great Telugu Poet Vemana, who has frankly presented the futility of serving masters for long time. What such people get in return is not "Living" , but an "Illusion" only.

యెరుక లేక దొరల నెన్నాళ్ళు కొలిచిన
బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని
గొడ్డు టావు పాలు కోరితే చేపునా
విశ్వదాభిరామ వినుర వేమ.

సదసద్ జ్ఞానము లేకుండా దొరలను ఎన్నాళ్ళు సేవించి నప్పటికీ భ్రాంతి తప్ప బ్రతుకు బాగుపడదు. పాల కోసం గొడ్డుటావు దగ్గరికి వెళ్తే అది చేపదు.
ఇది ౧౫.౧౭ శతాబ్దాల పద్యం అయినప్పటికి ౨౧వ శతాబ్దానికి చక్కగా వర్తిస్తుంది.

సోనియా గాంధీని తెలంగాణ నేతలు , సీమాంధ్ర నేతలు ఎంతో విశ్వాసంతో కొల్చారు. కొందరికి కొన్ని పదవులు కూడా లభించాయి. కానీ ఏమి లాభం? జీవితాలు బానిస బ్రతుకు లయ్యాయి. కిషోర చంద్ర దేవుడు, పళ్ళంరాజు, జయపాలుడు, చిరంజీవి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, శీలం, కోటా సూర్యప్రకాశుడు, ఒక్కరికీ శాంతి లేదు. వస్తున్నట్లు కనిపిస్తున్నది నిజంగా వస్తుందా. సోనియా పాదాలను కన్నీళ్ళతో కడిగినా ఆమెకు కనికరం కలిగేలాగా లేదు.
హతవిధీ?

Added on 04th Jan. 2016.


Did Mr. Raghuveera Reddy, the 2015, 2016 President of Andhra Pradesh Congress Committee learn any lesson?

Incomplete. असंपूर्ण. ఇంకా ఉంది.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |