topics for discussion, చర్చనీయాంశాలు: పాదరక్షలు, లైఫ్ స్టైల్స్, దౌర్భాగ్యదేశం, మోహన్ బాబు, సినిమాలు
పుత్రికా వాత్సల్యం అంటే ఎలా ఉండాలి?
ప్రముఖ హీరో శ్రీ మోహన్ బాబు లా ఉండాలి.
వారు తమ పుత్రికారత్నానికి సుమారు రూ. 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి షూస్ (బూట్లు) కొని పెట్టారట.
గతంలో చెప్పుల వ్యామోహంలో రికార్డు స్థాపించినది పురచ్చి తలైవి కుమారి జయలలితా, తమిళనాడు ముఖ్యమంత్రి. ఆమె ఇంట్లో చెప్పుల మ్యూజియం ఉండేది. ఆమె పై ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసును బుక్ చేసినపుడు, ఆ చెప్పుల మ్యూజియం ఫొటోలను ప్రదర్శించారు.
శ్రీ మోహన్ బాబు రికార్డును ఏ తెలుగు హీరో లేక హీరోయన్ బద్దలు కొట్టబోతుందో చూడాలి.
ప్రజలారా, మీరు శ్రీ మోహన్ బాబు సినిమాలు బాగా చూడండి, వాళ్ళమ్మాయికి ఇంకా ఇంకా ఎక్కువ చెప్పులు, బూట్లు కొని పెట్టండి.
యమలీల 2 లో యమధర్మరాజు కు ఈ ఐడియా వచ్చి శ్రీ మోహన్ బాబుతో పోటీ పడితే, భూలోకంలో ప్రజలు చస్తూ చస్తూ పాదరక్షలను కానుకలుగా నరకానికి తీసుకెళ్ళాలి.
ఈనాటి పాట
1968 లక్ష్మీనివాసం, ఆరుద్ర, ఘంటసాల,
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం | 2 times |
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా | 2 times |
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ||
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ||
ధనమేరా అన్నిటికీ మూలం ||![]()
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా ,
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా | 2 times |
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే | 2 times |
ధనమేరా అన్నిటికీ మూలం ||![]()
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం | 2 times |
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ||
ధనమేరా అన్నిటికీ మూలం ||
వైబీరావు గాడిద వ్యాఖ్య
కూలివాని చెమటలో ఉండే ధనాన్ని కాజేయటానికి సినీనటులు కాచుక్కూచొని ఉంటారు.
4 లక్షల రూపాయలతో పుత్రికకు బూట్లు కొనటం అంటే శ్రీదేవిని నిరసించుటే. (ఇంకా ఉంది. దీనిని తిరగ రాస్తాను).
1968 లక్ష్మీనివాసం, ఆరుద్ర, ఘంటసాల,