Reference: valmiki ramayana. Book 6, Book of Forests- sundara kAnDa. Chapter 22. From Verses 31 to 42. English Translations courtesy: valmikiramayan.net, yuddha kAnDa. Telugu language script verses and gist have been added by me.
Context: Shri Rama was on the banks of Ocean, exploring ways to cross it. After praying Sea-God sAgara for three days, Shri Rama threatened the Sea God to use force against him. Rama fixed a mighty arrow called 'brahmAstra (Weapon of Creator) to his bow and was about to direct it towards Sea God. Sea God appeared before him, and prayed for his mercy. The Sea God after advising Rama to build a bridge over the Ocean, Shri Rama asked him about what he had to do with his fixed arrow "Creator's Weapon (BrahmAstra)". Then, the Sea God is replying Rama.
శ్రీరాముడు సముద్రము ఒడ్డున ఉన్నాడు. దానిని దాటి లంకకు చేరుకోవాలి. ముందు ప్రాయోప వేశము చేసి మూడు రోజులు గడ్డి చాపమీద పండుకుని సముద్రుడిని ప్రార్ధించాడు. తరువాత బాణాలను ప్రయోగిస్తానని కొన్ని బాణాలను ప్రయోగించాడు. సముద్రుడు వినలేదు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కు పెట్టాడు. దానిని ప్రయోగించేలోపలే, సముద్రుడు భయకంపితుడై శ్రీరాముడి ముందుకి వచ్చి వారధిని నిర్మించుకోమని చెప్పాడు. శ్రీరాముడు తాను ఎక్కు పెట్టిని బ్రహ్మాస్త్రాన్ని ఏమి చేయాలని అడిగాడు. దానికి సముద్రుడు ఇచ్చిన జవాబు ఈ క్రింది శ్లోకాలు.
uttareNAvakAsho.asti
kashchit puNyataro mama || 6-22-31
drumakulya iti khyAto
lokE khyAtO yathA bhavAn |
ఉత్తరేణా అవకాశో అస్తి
కశ్చిత్ పుణ్యతరో మమ
ద్రుమకుల్య ఇతి ఖ్యాతో
లోకే ఖ్యాతో యథా భవాన్.
"Towards my northern side, there is a holy place. It is well known as Drumatulya, in the same way as you are well known to this world."
నాకు ఉత్తర దిశలో , ఒక పవిత్ర ప్రదేశం ఉంది. దాని పేరు ద్రుమకుల్య. నీవు జగద్విఖ్యాతుడవైనట్లే అదికూడ జగద్విఖ్యాతము.
ugra darshana karmANo
bahavas tatra dasyavaH ||
AbhIra pramukhAH pApAH
pibanti salilam mama | 6-22-32
English gist: "Numerous robbers of fearful aspect and deeds, having the sinful Abhiras as their chief, drink my waters there."
పలువురు ఉగ్రాకారులైన దస్యులు ఆభీరుడు అనే పాపి నాయకత్వంలో నా నీటిని త్రాగుతున్నారు.
tairna tat sparshanam pApam
saheyam pApa karmabhiH ||
amoghaH kriyatAm rAma
tatra teSu sharottamaH | 6-22-33
"I am not able to bear that touch of those wicked people, the evil doers, O, Rama! Let this excellent arrow with out vain be released over them there."
నేను ఆ పాపుల, పాపకర్ముల స్పర్సను సహించ లేకపోతున్నాను. ఓరామా, నీవు నీ ఉత్తమ అమోఘ శరాలను వాళ్ళమీదికి ప్రయోగించు.
tasya tadvacanam shrutvA
sAgarasya mahAtmanaH || 6-22-34
mumoca tam sharam dIptam
param sAgara darshanAt |
Hearing those words of the high-soled Ocean, Rama released that excellent and splendid arrow towards that place as directed by the ocean.
మహాత్ముడైన సముద్రుడి మాటలను విని రాముడు తన దేదీప్త శ్రేష్ఠ శరాలను సాగరుడు చూపిన ప్రదేశానికే విడిచాడు.
tena tan marukAntAram
prithivyAm kila vishrutam || 6-22-35
vipAtitaH sharO yatra
vajrAshani sama prabhaH |
The place where the arrow, whose splendor was akin to that of a thunder and a thunder bolt, was descended by Rama- that place is indeed famous as desert of Maru [Maru—Malwar in Rajastan (India)] on this earth.
వజ్రసమానమైన కాంతితో పిడుగులా భూమిపై పడిన ఆ శరము, ఆ ప్రదేశాన్ని మరు కాంతారం (ఎడారి చిట్టడవి) గా మార్చేసింది. అదే, మరు. [అదే నేటి మల్ వార్, మర్ వార్ , మర్వాడ్. థార్ ఎడారి. రాజస్థాన్ లో ఉంది.]
nanAda ca tadA tatra
vasudhA shalya pIDitA || 6-22-36
tasmAd bANa mukhAt toyam utpapAta rasA talAt |
The earth there, pierced by the dart, then emitted a sound . The waters of the penultimate subterranean region gushed forth from the mouth of that cleft.
ఆ బాణము చేత గ్రుచ్చబడి, అక్కడి భూమి పెద్ద శబ్దంతో పేలి, భూగర్భంలోంచి జలాలు ఉబికి వచ్చాయి.
sa babhUva tadA kUpo
vraNa ityeva vishrutaH || 6-22-37
satatam cotthitam toyam
samudrasyeva drishyate |
Then the hollow became known as Vrana. Water constantly seen, gushing forth from it resembled seawater.
అప్పుడు, అక్కడ పడిన గొయ్యి ~వ్రణము~ అని పేరుతో తెలియ వచ్చింది. అందులో నుండి నిరంతరాయంగా వచ్చే నీరు సముద్ర జలం వలె ఉన్నది.
avadAraNa shabdashca
dAruNaH samapadyata || 6-22-38
tasmAt tadbANa pAtena
apaH kukshiSv ashoSayat |
A terrific splitting sound was born in that place. Water was dried up in those cavities, as a result of hurling of that arrow by Rama.
ఆ ప్రదేశంలో భయంకరమైన శబ్దం వచ్చింది. శ్రీరామ బాణ జనితమైన ఆ గోతులలో నీరు ఇంకి పోయింది.
vikhyAtam triSu lokeSu
maru kAntAra mEva ca || 6-22-39
shoSayitvA tu tam kukshim
rAmo dasha rath AtmajaH |
varam tasmai dadau vidvAn
marave amaravikramaH || 6-22-40
That desert of Maru became famous in the three worlds. Rama (the son of Dasaratha), a wise man and a valiant man resembling a celestial, made that cavity dried up and gave a boon to that desert of Maru.
ముల్లోకాల్లో , ఆ మరు ఎడారి ప్రఖ్యాతి పొందింది. వివేకవంతుడైన శూరుడైన దాశరథి ఆ గోతులను ఎండింప చేసి, ఆ మరు ఎడారికి ఒక వరాన్ని ప్రసాదించాడు.
pashavyash cA alpa rogashca
phalamUla rasAyutaH |
bahu sneho bahu kshIraH
sugandhir vividh auSadhiH || 6-22-41
evam etair guNair yukto
bahibhiH samyuto maruHహ |
rAmasya varadAnAcca
shivaH panthA babhUva ha || 6-22-42
Due to granting of a boon by Rama, that desert of Maru became the most congenial place for cattle rearing, a place with a little of disease, producing tasty fruits and roots, with a lot of clarified butter, a lot of milk and various kinds of sweet- smelling herbs. Thus it became an auspicious and suitable move, bestowing these merits.
శ్రీరామ వరప్రసాదం వల్ల మరు ఎడారి పశువులను మేపుకోటానికి అనువైన ప్రదేశంగా మారింది. (అక్కడి పశువులకు) జబ్బులు తక్కువ. పలు రుచికరమైన పండ్లు, కందమూలాలు దొరుకుతాయి. కావలసినంత నేయి (స్నేహం అంటే నెయ్యి). బోలెడు పాలు. సుగంధ భరితమైన ఓషధులు. అలాగా అది ఒక మంగళకరమైన సుగుణ వంతమైన ప్రదేశంగా మారింది.
ybrrao~a-donkey~s personal views, not intended to be imposed on others:
1. If Shri Rama~s creator~s weapon (Brahmastra) is so powerful to convert an area into a desert and so as to destroy the Abhiras, how Abhiras are able to survive even till 2019?
శ్రీరామునిచే ప్రయోగించబడిన బ్రహ్మాస్త్ర్రము భూమిని ఎడారిగా మార్చగలిగినంత శక్తిమంతమైనది అయితే, బ్రహ్మాస్త్రంతో ఆభీరులు నిర్మూలించ బడతారు అనే సముద్రుడి (@వరుణుడు) యొక్క నమ్మకము సరియైనది అయితే ఆభీరులు అనే వారు 2019నాటికి భూమిపై, భారత్ లో , రాజస్థాన్ గుజరాత్ సరిహద్దులలో బ్రతికి బట్టకట్టకూడదు. వారు పాపకర్ములైనా (సముద్రుడి ప్రకారం) లేక పుణ్యకర్ములైనా ఇతర మానవుల వలె జీవిస్తూనే ఉన్నారు కదా.
2. Abhiras survived even during Lord Krishna~s age i.e. dvApara yugA. In Mahabharata, after Lord Krishna and Balarama passed away and all the Yadavas were destroyed owing to curse of Sage, Arjuna who was in Dwaraka packed all the remnant wealth of Yadavas, and remaining Yadava women who did not commit Sati, to Hastinapur. Arjuna and his entourage was waylaid by Abhiras, and Yadava women were robbed of their jewellery etc. Arjuna could not protect the Yadava women, as he could not recall his powerful astras (arrows + magic chants). Assuming that the distance between Dwaraka and Hastinapura is about 1500km., it is not known exactly at what point, Arjuna and his entourage were robbed by Abhiras, assuming that the distance between Dwaraka and Hastinapur is about 1500km.
ఆభీరులు శ్రీకృష్ణుడు అవతరించిన ద్వాపర యుగంయొక్క ఆఖరి రోజుల వరకు, ఆ తరువాత కూడ ఉన్నారు. బ్రహ్మాస్త్రం వారినేమీ చేయలేకపోయింది అనే అనుకోవాలి. మహాభారతంలో, శ్రీకృష్ణ నిర్యాణం, బలరామ మహాభి నిష్క్రమణం తరువాత, సతీసహగమనం చేయని యాదవ స్త్రీలను, మిగిలిన యాదవ సంపదలను తీసుకొని, అర్జునుడు హస్తినాపురానికి బయలు దేరాడు. దారిలో అర్జునుడి బృందాన్ని, యాదవ స్త్రీలను ఆభీరులు అటకాయించి, నిస్సహాయుడైన అర్జునుడు చూస్తూ ఉండగానే, వారి సంపదలను దోచుకున్నారు. అర్జునుడికి తన బ్రహ్మాస్త్రంగానీ, పాశుపతాస్త్రం గానీ, ఇతర దివ్యాస్త్రాలు గానీ గుర్తుకు రాలేదు. అతడి బాణాలన్నీ ఆభీరుల ముందు వృథా అయ్యాయి. దీనికి కారణంగా చెప్ప బడే విషయము ఏమిటంటే, శ్రీకృష్ణ నిర్యాణానంతరము, అర్జునుడు తన పాశుపతము, బ్రహ్మాస్త్రము మొదలైన దివ్య శక్తులను కోల్పోయాడు. అతడి గాండీవము నిర్జీవము అయింది. అక్షయతూణీరము క్షయమయింది. అయితే హస్తినాపురానికీ ద్వారకకూ సుమారు 1500 కిలో మీటర్లు దూరం ఉందనుకుంటే, ఆ రథాల మార్గంలో కరెక్టుగా ఏ ప్రదేశంలో యాదవ కురు ప్రయాణీకుల బృందం పై ఆభీరుల దాడి జరిగిందో తెలీదు.
Question: There is an impression that Abhiras (or Ahirs) and Yadavas are same. Can it be true?
ప్రశ్న - ఆభీరులు (ఆహిరులు) యాదవులు ఒకటే అంటారు, నిజమేనా ?
Ans: According to my personal belief, if Abhirs and Yadavas belonged to same clan or caste, they would not have ignoring Arjuna, and his arrows, robbed Yadava women. On the other hand, they would have escorted them, at least for some distance, though not upto Hastinapur. If this robbery took place near Madhura (Uttar Pradesh ), or Kota (Rajasthan ), Abhiras might have heard about / or known Lord Shri Krishna, who spent his childhood there, and with a soft corner, they would have released Arjuna's entourage without inflicting any harm. But, there is a possibility. Abhiras and Yadavas might have been cognates or consanguineals. But in Valmiki Ramayana verses, I am unable to trace any references to Yadavas (my readers can help me). But, Abhirs by their survival instincts could overcome the impact of Brahmastra. This inference we can make by juxtaposing the contents of Valmiki Ramayana and Mahabharata.
జవాబు- నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఆభీరులు యాదవులు ఒకే తెగ లేక ఒకే వంశానికి చెందిన వారు అయితే, వారు అర్జునుడిని మాటలను బాణాలను పట్టించుకోకుండా యాదవ స్త్రీలను దోచుకోరు. వారిని సన్మానించి తాము కూడ ఆ బృందానికి కొంత దూరమైనా తోడుగా వచ్చి ఉండే వాళ్ళు. ఈ దారిదోపిడీ మధుర (ఉత్తర ప్రదేశ్) లేక కోట (రాజస్థాన్) ప్రాంతంలో జరిగి ఉంటే, ఆభీరులకు శ్రీకృష్ణుడి సంగతి తెలిసే ఉండాలి. వారు శ్రీకృష్ణుడి మీద భక్తి లేక గౌరవము తోనైనా అర్జునుడి బృందాన్ని వదలి వేసి ఉండే వాళ్ళు. అయితే ఒక అవకాశం ఉంది. ఆభీరులు మరియు యాదవులు దాయాదులు అయ్యే అవకాశాన్ని త్రోసి పుచ్చలేము. పైన వ్రాసిన వాల్మీకి రామాయణ శ్లోకాలలోగాని, వాల్మీకి రామాయణం లో మరెక్కడైనా గానీ, యాదవుల ప్రసక్తి నాకు కనిపించలేదు. ఆభీరులు మటుకు బ్రహ్మాస్త్ర్రాన్ని కూడ తట్టుకుని నిలబడ్డారు అనేది రెండు గ్రంథాలను మనం ప్రక్క ప్రక్క పరిశీలిస్తే ద్యోతకము అవుతుంది.
Question: Do you believe that our mythologies, over course of their journeys through centuries, might have exaggerated the capacities and powers of the magical chants which are used to bolster the arrows of Aryans. Y/N?
Ans: Possible. Temple preachers, Balled singers have a tendency to exaggerate the valor of their Protagonists.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 962600
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.