నిందంతు నీతి నిపుణాం యది వా స్తువంతు
లక్ష్మీ సమావిశతు వా గఛ్ఛతువా యథేష్టం
అద్యైవవా మరణమస్తు యుగాంతరే వా
న్యాయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః
ఇది భర్తృహరి మహాకవి విరచితం. దీని భావం, నీతి నిపుణులైన వారు నిందించినా , డబ్బులు (లక్ష్మి) వచ్చినా పోయినా, ఈక్షణమే మరణం వచ్చినా, యుగాంతంలో వచ్చినా, ధీరులైన వాళ్ళు న్యాయమైన మార్గం నుండి చరించరు.
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ ।
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్.
హితోపదేశం. మొదటి ఆధ్యాయం, ఆరో శ్లోకం. సారం-- విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల పాత్రత అంటే పొందే అర్హత వస్తుంది. అర్హత వల్ల ధనం వస్తుంది. ధనం వల్ల ధర్మాచరణ చేయచ్చు. ధర్మం వల్ల సుఖం వస్తుంది.
వైబీరావు గాడిద వ్యక్తిగత అభిప్రాయం-- నిజమైన విద్య వల్ల వినయం వస్తుందన్నమాట నిజమే. కాని విద్య అంటే కేవలం డిగ్రీలు కావు. డిగ్రీలు అంటే గురువుగారు ఇచ్చే సర్టిఫికెట్టు మాత్రమే. గురువుగారు ఇచ్చే సర్టిఫికెట్ నైపుణ్యానికి సంబంధించినది మాత్రమే. వినయం వల్ల పాత్రత వస్తుందనేది ౨౧వ శతాబ్దంలో గానీ పూర్వం గానీ నిజం కాదు. వినయం వల్ల వడ్డించేవాడి అనుగ్రహం వస్తుంది. అపుడు మనల్ని గవర్నర్ నో, ఏదైనా దేవస్థానానికి ఛైర్మన్ నో చేయచ్చు. వడ్డించే వాడు ధూర్త లక్షణమైన అతివినయాన్ని అర్ధం చేసుకోలేనపుడు ధూర్తులకే పదవిని ఇస్తాడు. తరువాత అట్టి ధూర్తుల చేత ఇడుములు పడతాడు. అనామకుడిగా మార్చబడి క్రుంగి కృశించి పోతాడు. అట్టి నాయకులను మనం భారతదేశంలో ఎందరినో చూడచ్చు. పాత్రత వల్ల ధనం రావటం అనేది అందరి విషయంలో జరగక పోవచ్చు. ఎందరో పాత్రులు అయిన వారు వారి అర్హతకు సంబంధించిన వాటినికూడ పొందక పోవచ్చు. అసలు అర్హతలకు పొందేవాటికీ సంబంధం ఉండక పోటం ౨౧వ శతాబ్ద లక్షణం.
నేడు ప్రియాంకా చోప్రాది నటీమణులు తమ శరీరాలను, హావభావాలను చూపి వందల లేక వేల కోట్లను సంపాదించటం మనం చూస్తున్నాం. కవితా శక్తితో కన్నా, స్త్రీత్వంతో ఎక్కువ ధనం సంపాదించచ్చు అనే నీతిని శ్రీనాథమహాకవి గ్రహించటం చాల ఆలస్యం అయింది. మహాకవి చాటువుని తిలకించండి.
కవితల్ సెప్పిన బాడ నేర్చిన వృథా కష్టంబె యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వం బేల పో పోచకా
సవరంగా సొగసిచ్చి మేల్ యువతి వేషం బిచ్చి పుట్టింతువే
నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా .
అయితే మేల్ యువతి వేషంబు పొందిన వారికందరినీ లక్ష్మి అనుగ్రహించుతుందనుకోటం ఇంకో భ్రమ. మీటూ అనే ఉద్యమంలో, సినిమా రంగంలో , టీవీ రంగంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎందరో స్త్రీలు తమ శరీరాలను కోల్పోయారు కానీ డబ్బు రాలేదు.
అందుకే ఏనుగు లక్ష్ణణ కవి తన నీతి శతకంలో ఇలా అన్నాడు.
ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్.
గొప్పవైన శీలాలను కోల్పోయే కన్నా పర్వతం మీదనుండి దూకటం మేలని ఏనుగు లక్ష్మణ కవి అంటున్నాడు. అంతేనా ఇందులో ఒక గొప్ప తెలుగు సమాసం దాగి ఉంది. గాలి మేపరి దొర వాత కేలిడుట బాగు. గాలి మేపరి అంటే పాము. పాముల దొర అంటే నాగేంద్రుడు. మన చేతిని నాగేంద్రుడి కాటుకై దాని పడగ ముందు పెట్టమని భావమేమో (నాకు తెలుగు కూడ కొన్ని సార్లు అరం కావటం లేదు). హుతాశన మధ్యపాతము అంటే మంటల్లో దూకటం కూడ గుణ శీలాలను కోల్పోటం కన్నా ఒక వరమని ఇంకో భావన.
ధనం వల్ల ధర్మం వస్తుంది అనుకోటం మరొక భ్రమ. అసలు ధర్మం అనేదానికే సరియైన నిర్వచనాలు లేవు. మీరు ఏగుడికో ఏస్వాముల వారికో ఒక కోటి రూపాయలు ధర్మం అనుకుని పారేశారు అనుకోండి. దాని వల్ల ఆ స్వాముల వారు విమానాల్లో తిరుగుతాడు. బంగారు, దంతం, వజ్ర సింహాసనాలు చేయించుకుంటాడు. మీరు కోరితే ఇంకా కొన్ని కోట్లు తీసుకుని యజ్ఞాలు యాగాలు చేసి పెడ్తాడు.
సారాంశం ఏమిటంటే, సత్య విద్యకు వినయానికి సంబంధం ఉంది కానీ, విద్యకూ ధనానికీ, అర్హతకూ, అధికారానికీ, ధర్మానికి ఉన్న రిలేషన్ షిప్ చాల పల్చటిది. కొన్ని సార్లు రుజువైనట్లే కనిపిస్తుంది. కొన్నిసార్లు తుస్ అనిపిస్తుంది.
ధనాన్ని ధర్మానికి వినియోగించుకోవాలనుకునే వాడు అర్హుడైన వాడిని పట్టుకోటం అంత తేలికేమీ కాదు.
నేను జగన్ నియమించిన ఒక కుక్కను అని మన విజ్ఞులైన పాఠకులు రేసు గుర్రంగారు అన్నారు. ఇపుడు జగన్ గారి పాలనను విమర్శించవలసిన సమయం వచ్చింది. వీటిని గురించి రాబోయే బ్లాగ్ పోస్టులలో వ్రాస్తాను.★
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 982511
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.