Tuesday, April 15, 2014

203 అవి ఏవో చెప్పమ్మా? బయట పెట్టమ్మా

203 అవి ఏవో చెప్పమ్మా?

చర్చనీయాంశాలు, topics for discussion: Vijayashanti, విజయశాంతి, తెరాస, కెసిఆర్

10-4-2014 నాడు మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం, సినీనటి, భీకర తెలంగాణా వాది, విజయశాంతిగారు మీడియోతో ఇలా అన్నారు.

ప్రస్తుతం ఈ వేదికపై అంతర్గత విషయాలు చెబితే తెరాసను ఖతం చేస్తారు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు

చెప్పకుండా ఎంత కాలం దాస్తారు? తెరాస ఏమి చేసిందో చెప్పవలసిన బాధ్యత శ్రీమతి విజయశాంతి గారిపై తప్పక ఉంటుంది. దాచి పెట్టి, తడవ తడవకూ బెదిరించుకుంటూ పోతే అది బ్లాక్ మెయిలింగు అవుతుంది. చెప్పాక, తెరాసను ఖతం చేయాలా వద్దా, రాళ్ళు వేయాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక వేళ ప్రజలు సరియైన నిర్ణయం తీసుకోకపోతే అది వారి కర్మం. కనుక శ్రీమతి విజయశాంతి గారు తమ కర్తవ్యాన్ని నిర్వహించటం కొరకైనా ఆమె దాస్తున్న విషయాలను బయట పెట్టాలి. బయట పెట్టక పోతే సిబిఐ విచారణ కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయవలసిన బాధ్యత గవర్నర్ గారిపై ఉంటుంది.

తెరాస వారు తన మీదనే దాడి చేస్తే అనే ధర్మ సందేహం ఆమెకు రావచ్చు. జవాబు: అడ్డుకోటానికి బౌన్సర్లను ఇప్పటికే నియమించుకొని ఉండాలి. గతంలో అలాంటి తెరాస కార్యకర్తల మద్దతుతోనే కదా ఆమె లోక్ సభకు ఎన్నికయ్యింది. అపుడు మంచివాళ్ళుగా ప్రవర్తించిన తెరాస కార్యకర్తలు ఇపుడు గూండాలుగా మారరు కదా!!

ఈనాటి తెలుగు పద్యం

కూరిమి కల దినములలో
నేరము లెన్నడు కలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబై నపుడు
నేరములో తోచుచుండు నిక్కము సుమతీ!!

Monday, April 14, 2014

202 Modi wave or BJP wave or Anti Congress wave?202 మోడీ కెరటమా, బిజెపి కెరటమా, లేక కాంగ్రెస్ వ్యతిరేక కెరటమా?
topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اجینڈا: నరేంద్రమోడీ, అద్వానీ, BJP, మురళీమనోహర్ జోషీ
శ్రీ మురళీ మనోహర్ జోషీ గారేమన్నారో చూడండి , సార్!!"Modi is the representative of the party as the prime ministerial candidate. And whenever a dynamic person moves with the support of the party, he creates a very strong sympathy and support for him, because of his track record also. So its not a highly personalized thing, it is a representative wave. He gets support from different parts of the country, from different sections of society, and from all leaders of BJP. So, he represents the general mood and the desire for change. You may call it a Modi wave, there is no harm in it. But it is a sum total of what is happening inside the country, it represents that,"

మోడీ ప్రధాని అభ్యర్ధిగా పార్టీకి ప్రతినిథి. పార్టీ మద్దతుతో చైతన్యవంతుడైన ఒక వ్యక్తి సంచరిస్తున్నపుడు, అతడు తనకు బలమైన సానుభూతి మరియు మద్దతు సృష్టించవచ్చు, అతడి ట్రాక్ రికార్డ్ వల్ల కూడ (మద్దతు రావచ్చు). కనుక అది మిక్కిలి వ్యక్తిగతమైన వస్తువు కాదు, అది ప్రాతినిథ్య కెరటం. అతడికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి, సమాజంలోని వివిధ వర్గాలనుండి, బిజెపి లోని అందరు నేతలనుండి మద్దతు లభించ వచ్చు. కనుక అతడు ఆ జనరల్ మూడ్ మరియు మార్పు కొరకు కోరికకు ప్రాతినిథ్యం వహిస్తాడు. మీరు దానిని మోడీ కెరటం అనచ్చు, అందులో హాని లేదు. కానీ, అది దేశంలో జరుగుతున్నదానికి వెరసి మొత్తం, జరుగుతున్నదానికి ప్రతినిధి.

(మనోరమా న్యూస్ వారికిచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వ్రాసిన దాని ఆధారంగా).


It is now the developmental model of the country as presented by BJP. In a country like India, what developmental model is true for Jammu and Kashmir or Arunachal Pradesh, may not be true for Kerala.

ఇప్పుడది (గుజరాత్ అభివృధ్ధి నమూనా) బిజెపి ప్రదర్శిస్తున్న అభివృధ్ధి నమూనా. భారత దేశం లాంటి దేశంలో, జమ్ము కాశ్మీర్ కో , అరుణాచల్ కో సరిపోయే నమూనా, కేరళకు సరిపోవాలని ఏమీ లేదు. (భారత్ వైవిధ్యం ఉన్నదేశం. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలాగా అన్నిటికీ గుజరాత్ నమూనానే వర్తింప చేయలేం అని భావం)."So to say that this model or that model -- no. So some good points may be there, some good points from the government of Tripura will also be there, it is not some straitjacket model,"
తెలుగుసారం: కనుక చెప్పాలంటే ఈ నమూనా, ఆ నమూనా అంటే, --కాదు. అందులో కొన్ని మంచి అంశాలు ఉండచ్చు. త్రిపుర ప్రభుత్వం నుండి కూడ కొన్ని మంచి అంశాలుండచ్చు. అది వ్యక్తులను కట్టివేసే స్ట్రెయిట్ జాకెట్ వంటి బంధక వస్త్రం కాదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ముందుగా శ్రీ మురళీ మనోహర్ జోషీ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ ధైర్యాన్ని శ్రీ అద్వానీ చూపలేక పోటం గమనార్హం. కానీ దేశంలో నేడున్న కెరటాన్ని మోడీ కెరటం, బిజెపి కెరటం, అనే కన్నా కాంగ్రెస్ వ్యతిరేక కెరటం అనటం మేలు. గతంలో బిజెపి బలంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీలో బిజెపి గెలవటంలో వింతేమీ లేదు.

కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో కానీ, ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్న ప్రాంతాలలో కానీ బిజెపి విజయ బావుటా ఎగరేసినప్పుడు మాత్రమే మోడీ కెరటం ఉన్నట్లు ఋజువవుతుంది. ఈలోపల ఊదర కొట్టటమే అవుతుంది.

కాంగ్రెస్ వ్యతిరేక కెరటాలకు ముఖ్య కారణాలు: ధరలు ఆకాశానికంటటం, అవినీతి కి హద్దులేకపోటం, ఆధార్ కార్డు వంటి పథకాలతో సామాన్యులను వేధించటం, సైనికులని కూడ మతప్రాతిపదికపై విభజించాలని చూడటం.

అద్వానీ గారేమన్నారు?“This is the first ever election where it can be felt that people have already made up their minds to throw out the present (UPA) government. There is no doubt that BJP will form government under the leadership of Narendra Modi. I will take up any role which will be offered to me after election,”
తెలుగు సారం: యుపిఎ ప్రభుత్వాన్ని విసిరేయాలని ప్రజలు ఇప్పటికే మనసులో నిర్ణయించుకున్న మొట్ట మొదటి ఎన్నిక ఇది. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనటంలో ఏ సందేహమూ లేదు. ఎన్నికల తరువాత నాకు ఏ బాధ్యతలనప్పగించినా నేను స్వీకరిస్తాను.వైబీరావు గాడిద వ్యాఖ్యలు


శ్రీవారు , మోడీని విష సర్పంతో పోల్చిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేయటం మనం మరువరాదు. శ్రీమోడీపై ఆ ఆగ్రహమంతా ఇపుడెలా చల్లారింది? తన పాదాలకు నమస్కరించటాన కూలింగ్ అయ్యారా? ఎన్నికల తరువాత శ్రీవారు కొత్త ప్రభుత్వం నుండి ఏ బాధ్యతలను ఆశిస్తున్నారు? రాష్ట్రపతి పదవి ఇవ్వాలంటే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. లోక్ సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారా? గతంలో తాననుభవించిన ఉపప్రధాని కం కేంద్రహోం మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఎన్నికలలో బిజెపి గెలిస్తే , హోం మంత్రి శ్రీ అమిత్ షా అవ్వాలి.

గాంధీనగర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యతను అంతకు ముందు శ్రీ అద్వానీ గారి అమ్మాయి చూసుకునేదిట. ఈసారి అబ్బాయిగారికి అప్పగించారు. నియోజకవర్గంలో తన తరువాత సీనియర్ అయిన నేతకు అప్పగించ వచ్చును కదా? నగదు హ్యాండిల్ చేయాల్సిరావచ్చు. గాంధీనగర్ నియోజకవర్గాన్ని అబ్బాయిగారికి రాసిద్దామని అనుకుంటూ ఉండ వచ్చు. అబ్బాయిని అన్నివిధాలు గా ఆదుకుంటామని, శ్రీనరేంద్రమోడీ దగ్గర వాగ్దానం తీసుకొని ఉండ వచ్చు.ఈనాటి పద్యం

పౌరుష జ్ఞాన కీర్తుల బరగె నేని
వాని జీవన మొక్కపూ ట యైన చాలు
ఉదర పోషణ మాత్రకై ఉర్వి మీద
కాకి చిరకాల మున్ననే కార్యమగును.

ఉడుముండదే నూరేండ్లును
పడియుండదే పేర్మి పాము పదినూరేండ్లున్
మడువున కొక్కెరయుండదె
కడునిల పురుషార్ధపరుడు కావలె సుమతీ.

Saturday, April 12, 2014

201 Presidents, Vice Presidents, Prime Ministers, Lok Sabha Speakers, CJIs cannot be ordinary persons.మనలో పాపం చేయని వాడూ!!

రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, లోక్ సభ సభాపతులు, ప్రధాన న్యాయమూర్తులు, సాధారణ వ్యక్తుల కన్నా ఉన్నతంగా ఉండాలి.

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اجینڈا: నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మూలాయం సింగ్ యాదవ్
ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. పోలింగు కేంద్రాల వద్ద వోట్లు వేయటానికి క్యూలలో నిల్చొని, తమ గుర్తింపు కార్డులను మీడియాకు చూపిస్తూ ఉన్న వారిని , వోట్లువేసి ఇంకు పూసిన తమ చూపుడు వేళ్ళను మీడియాకు చూపిస్తూ ఉన్న వారిని , గమనిస్తే ఏమి అర్ధం అవుతున్నది?

లోక్ సభకు వోటు వేయటానికి, శాసనసభకి వోటు వేయటానికి, కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ మెంబర్లను ఎన్నుకోటానికి వోటు వేయటానికి కావలసిన పరిణతి, నైపుణ్యాలు, సమాచార జ్ఞానం, మొ|| వాటిలో చాల తేడా ఉంది. లోక్ సభ సభ్యుడి విధులేమిటో చాల మంది వోటర్లకి తెలియదు. అభ్యర్ధులకు, ఎన్నికైన సభ్యులకు, కూడ చాలమందికి తెలియదు. భారత్ ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యలు చాల సంక్లిష్టమైనవి. అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య సంబంధాలు, న్యాయ వ్యవహారాలు, సాంకేతిక వ్యవహారాలు చాల సంక్లిష్టంగా మారాయి. చాల వ్యవహారాలు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళకే అర్ధం కాని స్థితికి చేరుకున్నాయి.

ప్రభుత్వంలో ఒక చప్రాసీ పని చేయటానికి, రైల్వేలో గాంగమాన్, కీమాన్ పనులు చేయటానికి కూడ రకరకాల పరీక్షలు ఉంటాయి. కానీ వోటు వేయటానికి గానీ, వేయించకుని పెద్ద పెద్ద పదవులు అలంకరించటానికి గానీ, ఎటువంటి పరీక్షలు ఉండక పోటం ఆశ్చర్యకరం.

దేశానికి లక్షల కోట్ల రూపాయల నిథులు ఉంటాయి. అవి కాక ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తూ ఉంటారు. కొన్ని లక్షల కోట్లరూపాయల ఆయుధాలు , విమానాలు కొంటూ ఉంటారు. ఈ నిథులన్నిటినీ కాపాడటానికి, సమర్ధవంతంగా వినియోగించటానికి, ఎంత సమర్ధత, విశ్వసనీయత కావాలి? నేరగాళ్ళను, చదవకపోయినా డిగ్రీలను కొనుక్కున్న వాళ్ళని ప్రతినిథులుగా పాలకులుగా ఎన్నుకుంటే, వారు ప్రజలను నట్టేటిలో ముంచక మానరు.

చాల మంది వోటర్లకి ఈ బలిపీఠం పై ఎన్ని లక్షల కోట్లు నైవేద్యం పెట్తున్నారో తెలీదు, తెలుసునే ఆసక్తి లేదు, ఉన్నా సమయం, శక్తి, యుక్తి, నైపుణ్యం, శారీరిక ధార్ఢ్యం లేవు. వాళ్ళు లోక్ సభ ఎన్నికలలో మా సారా సీసా మాకు పారేసి, నీకు నచ్చినట్లేడువు, అని వోట్లేసినట్లవుతుంది.

కాబట్టి పాలకుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోటం ప్రజలకు ఎంతో అవసరం. పారదర్శకంగా జీవించటానికి ఇష్టం లేని నేతలు, ప్రజలను పాలించటానికి ముందుకు రాకపోటమే మంచిది. అయితే పదవులని ఆశించని వారిని ప్రజలు శాసించలేరు.

శ్రీ నరేంద్ర మోడీ గారు ఇన్నాళ్ళ బట్టీ గోప్యంగా ఉంచిన తన వివాహ సమాచారాన్ని, 2014 అఫిడవిట్ లో బయట పెట్టటం ముదావహం. ఇదే పధ్ధతిలో, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ కేజ్రీవాల్ గారు, శ్రీ మూలాయం సింగ్ యాదవ్ గారు, ఇంకా ప్రధాని అవ్వాలని కోరుకునే ఇతరులు, తాము దాస్తున్నవి ఏమైనా ఉంటే బయట పెడితే , వారి వ్యక్తిత్వాలు శోభిస్తాయి.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం మనం మరువరాదు. ఎవరో ఒక పౌరుడు ఏదో అన్నాడని, నిండు చూలాలైన భార్యను అడవులలో దించటం వంటి ''అతి'' ధర్మాలను పాలకులు చూపనక్కర లేదు. అలాగని ఈ ధర్మాలు ఇతరుల భార్యలను (లేక భర్తలను) కాజేయటానికి, మభ్యపెట్టి కొట్టేయటానికి దారి తీయకూడదు. కొందరు ముఖ్యమంత్రులు ఆపనులు కూడ చేశారు.

పాలకులకు, సామాన్యపౌరులకి తేడా ఏమిటంటే, పాలకులు వివేకులక్రింద లెక్క. సామాన్య పౌరుడు పెళ్ళాన్ని వేధించటం, వాడి సహజ గుణాలలో ఒకటిగా ఉండ వచ్చు. పాలకుడికి పౌరుల పెళ్ళాలను వేధించటం గాని, తన పెళ్ళాన్ని వేధించటం కానీ ఒక గుణంగా ఉండ రాదు. అయితే అత్యంత ప్రత్యేక పరిస్థితులు వచ్చినపుడు భార్యా భర్తలు విడిగా ఉండటం తప్పు అవదు. కానీ ఏది జరిగినా పారదర్శకంగా జరగాల్సి ఉంటుంది.

వేధింపబడుతున్న భార్యనుండి అభ్యంతరాలు లేవు కదా

వేధింపబడుతున్న భార్యనుండి అభ్యంతరాలు లేవు కదా అనే మాట నిలవదు. ఉదాహరణకి అర్జునుడు సుభద్రను ద్వారక నుండి కిడ్నాప్ చేసి తీసుకు వచ్చినపుడు, ద్రౌపది ఏడ్చింది. సత్యభామను తెచ్చినపుడు రుక్మిణి, జాంబవతిని తెచ్చినపుడు రుక్మిణి, సత్యభామలు ఏడ్వరా? వారిని, శ్రీకృష్ణుడు, అర్జునుడు , కుంతి సముదాయించారనుకోండి, తరువాత వారు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ, అది హృదయపూర్వకంగా జరిగిందా అనేది ప్రశ్నార్ధకమే. అభ్యంతరాలు రాకపోటానికి వివిధ కారణాలు ఉండ వచ్చు. వారిపై నిఘా ఉండవచ్చు. అక్బర్ జనానాలో 5000 మంది దాకా భార్యలు ఉండే వాళ్ళు. వాళ్లకి నపుంసకుల కాపలా ఉండేది. చీమ చిటుక్కుమన్నా పాదుషాకి వార్త చేరుతుంది. ఇంక వాళ్ళేమి అభ్యంతరాలను లేవదీస్తారు?

సెలబ్రీటీలనుండి విడాకులు తీసుకన్న భార్యలుగా జీవించే కన్నా, వారి పెద్దభార్యలుగా జీవించటమే మెరుగని, ఆవిధంగా వేలకోట్లకి తాము, తమ పిల్లలు వారసులు కావచ్చని, కొందరు స్త్రీలైనా అనుకోవచ్చు. కానీ ఆపధ్ధతి సమాజానికి తీరని అపకారం చేస్తుంది. ఆ పధ్ధతి పెట్టుబడి దారీ విధానం లక్షణం.

పాలకులు, తమ వ్యక్తిగత విషయాలలో స్వాతంత్ర్యాలకు అర్హులే. ఇద్దరు మాజీ భర్తలను కలిగిని వాలెస్ అనే మహిళను వివాహం చేసుకోటంపై వివాదం చెలరేగినపుడు ఎడ్వర్డ్ 8 రాజు, తన రాజ్యాన్నే వదిలేసి (abdication), తన ప్రేమకే ప్రథమ స్థానం ఇచ్చుకున్నాడు. ప్రేమకు, కర్తవ్యానికి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఏమి జరుగుతుందో స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి గారు (మాజీ దేవాదాయ మంత్రి) తన రామాయణ సుధాలహరి అనే గ్రంథంలో సువివరంగా చర్చించారు.
అయితే అద్దాల గదులలో ఉండే నేతలు, తాము పోటీపడుతున్న నేతలపై రాళ్ళు విసరటంలో కొంత ప్రమాదం ఉంది. శ్రీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి వివాహ ప్రకటన అఫిడవిట్ ను ప్రశ్నించటం ఈ తరహాకి చెంద వచ్చు.ఈ సందర్భంగా బిజెపి నేతలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు అన్నట్లుగా చెప్ప బడుతున్న విషయాలను పరిశీలిద్దాం.
శ్రీ వెంకయ్య నాయుడు :
"It will cost Congress heavily. Don't get into this, it will boomerang you,"

తెలుగు సారం: అది కాంగ్రెసుకి చాల భారీ కాస్ట్ ను కలగిస్తుంది. దీనిలోకి వెళ్ళకండి. అది మీపైనే బూమరాంగ్ అవుతుంది.అది అంటే, వ్యక్తిగత విషయాలను లేవనెత్తటం. వ్యక్తిగత విషయాలను లేవనెత్తితే మీకే నష్టం అని శ్రీ వెంకయ్య నాయుడు గారు హెచ్చరిస్తున్నారు.

శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు అన్నట్లుగా చెప్ప బడుతున్నది:

There are several family issues of the Nehru-Gandhi family that we are aware of. Some of it is also recorded in documents...But we will not discuss it in public because we have a standard..

తెలుగు సారం: నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఎన్నో కుటుంబ విషయాలు మా కు తెలిసినవి ఉన్నాయి. వాటిలో కొన్ని డాక్యుమెంట్లలో రికార్డ్ అయి ఉన్నాయి. కానీ మేము దానిని పబ్లిక్ లో చర్చించము, ఎందుకంటే మాకు ఒక ప్రమాణం ఉన్నది.వైబీరావు గాడిద వ్యాఖ్యలు

మాకు చాల విషయాలు తెలుసు, కానీ చెప్పం, అనటాన్ని ఒక తరహా బ్లాక్ మెయిలింగ్ అనాల్సి వస్తుంది. తమకు తెలిసిన , ముఖ్యంగా ఋజువులున్న సమాచారాన్ని , ప్రజా ప్రాముఖ్యం ఉన్నప్పుడు జనానికి విడుదల చేయవలసిన బాధ్యతను విస్మరించటమే కాకుండా, ''బయటకు చెప్తే మీమీదే బూమరాంగ్ అవుతుంది'' అనటం , బయట పెట్టటం కన్నా అల్పమైనది, గుణ హీనమైనది.

ఇంకో విధంగా ఆలోచించాలంటే, కాంగ్రెసూ, బిజెపీ కుమ్మక్కై ప్రజలకు సత్యం తెలియకుండా అడ్డు పడుతున్నట్లవుతుంది.

గతంలో శ్రీ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడ ఇటువంటి ఆటనే ఆడారు. ఒకరిపై మరొకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కానీ, ఇద్దరిలో ఒకరు కూడ అవినీతిని సరిదిద్దటానికి చట్టబధ్ధమైన చర్యలు తీసుకోలేదు.

ఈనాటి పద్యం

ఆటవెలది, ఛందస్సు. దీనిలో ౧,౩ పాదాలలో ౩ సూర్యగణాలు, ౨ఇంద్రగణాలు ఉంటాయి. ౨,౪ పాదాలలో ఐదూ సూర్యగణాలే ఉంటాయి. ప్రాస ఉండదు. ౪వ గణం మొదటి అక్షరం యతి. వేమన పద్యాలలో చాల భాగం ఆటవెలదులే.

తప్పులెన్నువారు తండోప తండంబులు
ఉర్విజనుల కెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ.

ఈనాటి పాట


ఎన్ టీ ఆర్ నటించిన , నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి.
సంగీతం: సత్యం
రచన: డా. సి. నారాయణ రెడ్డి
పాడింది: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
మంచిని సమాధి చేస్తారా..
ఇది మనుషులు చేసే పని యేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..

చరణం 1:

కత్తితో చేధించనిది కరుణతో చేధించాలి.
కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి..
తెలిసీ తెలీయక కాలు జారితే..తెలిసీ||
చేయూతనిచ్చి నిలపాలీ
మనలో కాలు జారని వారు.. ఎవరో చెప్పండి..
లోపాలు లేని వారు.... ఎవరో చూపండి...
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..

చరణం 2:
గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు...
ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు..
ఆకలి తీరక నేరం చేసే.. ఆకలి తీరక||
అభాగ్యజీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ.... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు... ఎవడో చూపండి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం||

చరణం 3:
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి..
మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి..
ఐతే..
ఎన్నడు పాపం చేయని వాడు...
ఎన్నడు పాపం చేయని వాడు... ముందుగ రాయి విసరాలి...
మీలో పాపం చేయని వాడే... ఆ రాయి విసరాలి..
ఏ లోపం లేని వాడే... ఆ శిక్ష విధించాలి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..
మనలో పాపం||

Friday, April 11, 2014

200 Nearing truth

200 Nearing truth

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اَجینڈا: నరేంద్రమోడీ, Narendra Modi, జశోదాబెన్, Jashodaben, బిజెపి, 200ఈ నా 200 వ పోస్ట్ సందర్భంగా చాల సంతోషకరమైన వార్త ఏమిటంటే, భా భా ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ గారు, వడోదారా లోక్ సభ నియోజకవర్గ అభ్యర్ధిగా ఫైల్ చేసిన నామినేషన్ అనుబంధ అఫిడవిట్ లో, శ్రీమతి జశోదాబెన్ గారిని తన భార్యగా అంగీకరించటం. గత అసెంబ్లీ ఎలక్షన్ లలో ఆయన తన అఫిడవిట్ లో భార్య కాలమ్ ను ఖాళీగా ఉంచే వాడు.

గతంలో భారతీయులు ఈవిషయాన్ని ఎక్కువగా పట్టించుకోకపోటానికి ముఖ్య కారణం, గుజరాత్ భారత్ లోని 28 (ఇపుడు 29) రాష్ట్రాలలో ఒకటి కావటం. భారతీయులకు ఇంగ్లీషు వాళ్ళనుండి అంటుకున్న జబ్బుల్లో ముఖ్యమైనది, ప్రక్క రాష్ట్రం వాడు చచ్చిపోతున్నా పట్టించుకోక పోటం. ఉదాహరణకి బీహార్ లో వరదలు వస్తే తెలుగు వాళ్ళు పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ లో వరదలు వస్తే బీహారీలు పట్టించుకోరు.

ఇపుడు శ్రీ మోడి భావి భారత ప్రధాని కనుక తమ ప్రధాని ఎలా ఉండబోతున్నారో తెలుసుకోటం అవసరమైంది.

ఫిబ్రవరి 2014లో జరిగిన ఎన్నికల రాలీలో ఆయన నేను ఒంటి గాడిని, నాకు కుటుంబ బంధాలు లేవు, నేను ఎవరికొరకు అవినీతి చేయాలి!! అని ప్రచారం చేసుకున్నారు. ఆయన నిజానికి చేసిందేమిటి, పెళ్ళైన మూడేళ్ళలోనే చదువుకోమ్మా అని పెళ్ళాన్ని పుట్టింట్లో దించి, అప్పటినుండి ముఖం చాటేశాడు. ఒంటిగాడు అంటే ఇదా!!

ఇపుడు శ్రీమోడీ గారు అఫిడవిట్ లో తన న్యాయవాదుల సలహా ప్రకారం నిజాన్ని బయట పెట్టారా, లేక నిజంగా హృదయ పరివర్తన వచ్చి సత్యాన్ని ప్రకటించారా?

నిజంగా హృదయ పరివర్తన వచ్చి సత్యాన్ని ప్రకటిస్తే జేజేలు. ఇపుడు తరువాత జరగవలసినది, జశోదాబెన్ గారికి గౌరవ ప్రదమైన స్థానాన్ని ఇవ్వటం. దీనిని పలువిధాలుగా చేయవచ్చు. ఎన్నికల రాలీలలో అప్పుడప్పుడు తన ప్రక్కన నిల్చోపెట్టుకోవచ్చు. ఆమె స్వఛ్ఛందంగా ముందుకు వస్తే వడోదారాలో కానీ, వారణాసిలో కానీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు.

జశోదాబెన్ గారు గుజరాత్ కుగ్రామాలలో ప్రాథమిక పాఠశాల అధ్యాపకురాలిగా పనిచేయటం వల్ల, ఆమెకు స్కూల్ డ్రాప్ అవుట్స్ పై మంచి అవగాహన ఉండి ఉంటుంది. దేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తిపై ఆమె ఏవైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే వినచ్చు.

సోమాభాయి దామోదర్ మోడీ , శ్రీ నరేంద్రమోడీ గారి సోదరుడు, ఈసందర్భంగా అన్నమాటలు పరిశీలనార్హం:
"...What happened 45-50 years ago should be seen in the context of a poor and superstitious family. ..."

తెలుగుసారం: ''... 45-50 సంవత్సరముల క్రితం జరిగిన దానిని బీద మరియు మూఢవిశ్వాసాల కుటుంబ నేపథ్యంలో చూడాలి. ...''


ఈ ''పేద , మూఢ విశ్వాసాల కుటుంబం'' అనే పదం సోమాభాయి దామోదర్ మోడీ గారు తన కుటుంబానికి వర్తింప చేయాలా , లేక జశోదా బెన్ గారి పుట్టింటి వారి కి వర్తింప చేయాలా, లేక రెండు కుటుంబాలకు వర్తింప చేయాలో చెప్తే బాగుండేది.

నిజానికి ధనిక కుటుంబాల్లో స్త్రీపురుషులు తమ ఇష్టం వచ్చినట్లు కలిసినా విడిపోయినా సమాజానికి పెద్ద ఇబ్బంది కలుగదు. ఉదాహరణకి ఈమధ్య ఒక సేనా పార్టీ పెడుతున్నానని హంగామా చేసిన ఒక తెలుగు హీరోగారు తమ మొదటి భార్యకి, రెండో భార్యకి విడాకులు ఇస్తే జనం పట్టించుకోలేదు, పట్టించుకోవలసిన అవసరం కూడ లేదు. ఎందుకంటే , వారూ, వీరూ, ఘరానా ధనవంతులు కాబట్టి, వాళ్ళకది అలవాటులే మనకెందుకులే గోల అని ఊరుకోవచ్చు.

ముక్కు పచ్చలారని ఒక ముద్దరాలిని, పేద కుటుంబానికి చెందినది, చదువుకోలేదు అనే కారణంతో కనీసం ఫీజు కూడ కట్టకుండా పుట్టింట్లో విడిచేసి ముఖం తప్పిస్తే దానిని ఏమనాలి? శ్రీనరేంద్రమోడీ అన్నలకు, తల్లి దండ్రులకి ఏబాధ్యతలు ఉండవా?

శ్రీ నరేంద్రమోడీ గారు , ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం లో ఫుల్ టైమ్ చేరకముందు, బస్ స్టాండు సమీపంలో కొద్ది రోజులు టీ బండి నడిపారు అని వార్తలు ఉన్నాయి. ఆసమయంలో , అవకాశం ఇచ్చి ఉంటే, జశోదా బెన్ గారు, ఆబండి వద్దనే తన భర్తకి చాయ్ తయారు చేసి చేదోడు వాదోడుగా ఉండి ఉండేది. మోడీగారు తన సహధర్మచారిణికి ఆఅవకాశాన్ని దక్కకుండా చేశారు. భారత దేశంలో మనం ఏ పట్టణంలో చూసినా, ఇలా పరస్పరం సహకరించుకుంటూ, చాయ్ బండ్లు, చాయ్ బంకులు నడుపుకునే భార్యా భర్తలు, భవిష్యత్ పై గొప్ప ఆశతో జీవిస్తూ, మనకి అసంఖ్యాకంగా దర్శనమిస్తారు.
శ్రీ మోడీ రోల్ మోడల్ స్వామీ వివేకానందగారికి కాష్మీర్ , ఊటీ, ఆల్మోరా వంటి వేసవి విడుదులంటే మక్కువ, దోమలు అంటే విపరీతమైన భయం, కోట్లు, బూట్లు, చుట్టలు అంటే అభిమానం, అని ఆయన సంపూర్ణరచనలు చెప్తాయి.

శ్రీ వివేకానంద గారు కూడ శ్రీరామకృష్ణుడు మరణించిన కొత్తరోజులలో భిక్షాటన చేసే వాళ్ళమని, ఇల్లాళ్ళు రాళ్ళల్లాగా మారిన చద్ది చపాతీలు వేసేవారని తన క్యాలిఫోర్నియా అమెరికా ప్రసంగం ఒకదానిలో చెప్పుకున్నారు. దాని ఫలితమో ఏమో, తరువాత ఆయన భిక్షాటన మానేసి స్వదేశ సంస్థానాధీశుల చుట్టు, సేఠ్ జీల చుట్టూ తిరగటం, పరమహంసలం అని చెప్పుకోటం అలవర్చుకున్నట్లు కనపడుతుంది.

నేడు రాజకీయవేత్తలు అంబానీలు, టాటాలను ఆశ్రయించుకున్నట్లే, నాడు స్వామి వివేకానంద గారు కూడ లెగ్గెట్ అనే అంతర్జాతీయ టీ వర్తకుడిని ఆశ్రయించుకుని, ఆయనకు చెందిన రిసార్టులో నెలల తరబడి బసచేసే వాడు. స్వామీజీ లెగ్గెట్ గారి టీ వ్యాపారానికి బ్రాండ్ అంబాసెడర్ అయ్యే వాడే (ఆకాలంలో ఆపదం వాడుక లేదు కానీ, బ్రాండులను వ్యాపింప చేయటానికి సెలబ్రిటీలను వాడుకోటం ఉండేది) కానీ, కొద్దిలో ఏదో బెడిసింది.

అలాగే శ్రీమోడీజీకి ఖరీదైన కుర్తాలు, కోట్లు, డ్రెస్ లు అంటే మక్కువ , అహమ్మదాబాద్ లోని అతి ఖరీదైన డ్రెస్ మేకర్ కు ఆయన ప్రధాన ఖాతాదారు అనే విషయం ప్రజలలో చాలామందికి తెలియదు. పార్టీ సమావేశాలకు గోవా వెళ్ళినా సరే, అహమ్మదాబాదు నుండి బుల్లెట్ ప్రూఫ్ కారు గోవాకి వెళ్ళాలి. మనలో లైఫ్ స్టైల్స్ చిననాటి నుండే రూపులు దిద్దుకుంటాయి. అవి అవకాశాలు దొరకనంతకాలం, అణగి మణిగి ఉంటాయి. దొరికినపుడు, విశ్వస్వరూపాలు చూపిస్తాయి.కనుక సుదీర్ఘ కాలం, బస్ స్టాండ్ వద్ద చాయ్ బండి నడుపుకుంటూ, భార్య సహాయం తీసుకోటం కొందరి ప్రవృత్తులకు, ప్రకృతులకు వ్యతిరేకం అని మనం అర్ధం చేసుకుంటే నేతలను, స్వామీజీలను తప్పు పట్టం.


నీలాంజన్ ముఖోపాధ్యాయ అనే రచయిత గారు శ్రీ మోడీ గారి జీవిత చరిత్ర వ్రాశారుట. దాని ప్రకారం, ఆర్ ఎస్ ఎస్ లో పైకి రావాలంటే, బ్రహ్మచారులకే అవకాశం కాబట్టి శ్రీమోడీజీ తన వివాహ విషయాన్ని గోప్యంగా ఉంచారని వ్రాశారు.

వివాహం కన్ సమ్మేట్ కాకుండానే (అంటే శోభనం, కార్యం జరగకుండానే) శ్రీ మోడీ వివాహం నుండి బయటకి వచ్చేసినట్లు ఆయన సోదరుడు శ్రీ సోమాభాయ్ చెప్పిన మాట నిజమే అయితే, శ్రీ మోడీ సోదరులు , తల్లిదండ్రులు చేయవలసిన పని , న్యాయం గా ఏమి కావాలి? శ్రీమతి జశోదా బెన్ గారి తల్లి దండ్రులతో సంప్రదించి శ్రీ మోడీ గారి చేత ఆమెకు విడాకులు ఇప్పించి, ఇంకొక వరుడిని చూసి వివాహం చేయించి ఉండవలసినది. శోభన కార్యమే జరగనపుడు , మారు మనువు సరియైన పరిష్కారమే అవుతుంది. మొత్తం సమస్యను మాంగల్యబలం సినిమాలో లాగా బాల్యవివాహాలపైకి తోసేయటం కుదరదు.

ఏది ఏమైనా, శ్రీమోడీ గారు సత్యాన్ని ప్రకటించటాన్ని మనం స్వాగతిద్దాం. ఇదే సందర్భంగా ఆయన, బడా పెట్టుబడిదారులు, కార్పోరేట్ ఘరానా వ్యాపారవేత్తల బానిసత్వం నుండి బయట పడాలని ప్రార్ధిద్దాం. గుజరాత్ లో శ్రీమోడీ గారు చేశానని చెప్పుకుంటున్న అభివృధ్ధి అంతా బడా పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి వారిని బాగుచేయటమే తప్ప ప్రజలని బాగుచేయటం కాదు. ఆయన నిజంగా ప్రజలను బాగు చేయాలనుకుంటే, కుటీర పరిశ్రమలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేయాలి. అయితే శ్రీ మోడీ రిపేరబుల్ అని నేననుకోటం లేదు.

ఈనాటి పాటరచన: శ్రీశ్రీ. చిత్రం: మాంగల్యబలం. పాడింది ఘంటసాల, సుశీల. సంగీతం: మాస్టర్ వేణు. కర్నాటక సంగీత రాగం: కల్యాణి. హిందూస్థానీ రాగం: యమన్.

పల్లవి
పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం
విషమాయే మా ప్రేమా విధియే పగాయేయ

చరణం: 1
చిననాటి పరిణయగాధ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాధ తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమా విధియే పగాయే.
చరణం: 2
మొగమైన చూపలేదే, మనసింతలొ మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలనా హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమా విధియే పగాయే.
పెనుచీకటాయే||

Wednesday, April 9, 2014

199 Householder vs non-householder

199 Householder vs non-householder

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चा विषय, اَجینڈا: బ్రహ్మచర్యం, గృహస్తాశ్రమం, నరేంద్రమోడీ, వివేకానంద, మహాభారతం, తిక్కన

బోధ, ఉద్ బోధ రెండు పదాలను తీసుకుందాం. ఉద్ అంటే పైకి. బోధ కన్నా ఉద్ బోధ స్ట్రాంగు. జండూ బాం, మహాజండూ బాం లాగా.

ఉద్ బోధలు చేయించుకోటాన్ని ఒక తరహా రుగ్మత అనుకుంటే , ఉద్ బోధలు చేయటాన్ని కూడ రుగ్మత అనచ్చు, లేదా మహా రుగ్మత అనచ్చు.

ఉద్ బోధ లు చేయటం రుగ్మతగా పరిణమించటానికి, లౌడ్ థింకింగు కీ (బిగ్గరగా బయటకు వ్యక్తం అయ్యేలా ఆలోచించటం) విభజన రేఖ స్వల్పమే. అంతర్జాలంలో కొన్ని సార్లు లౌడ్ థింకింగును రాంటింగు (ranting) గా పరిగణించటం జరుగుతున్నది. కానీ రెండిటికీ కూడ భేదం ఉన్నది.

ఈ ఉద్ బోధలు చేయటం అనే రుగ్మత (రుగ్మత అనే కన్నా కొన్ని సార్లు బలహీనత అంటే మేలేమో), మహాత్ముల దగ్గర నుండి సాధారణ వ్యక్తుల వరకు అందరిని ఆవహిస్తునే ఉంటుంది.


ప్రస్తుత కాలంలో , మధ్యతరగతిలో (దిగువ, ఎగువ), ధనిక తరగతులలో ఒక విశ్వాసం ప్రబలినట్లు కనిపిస్తున్నది. అదేంటంటే, గృహస్తాశ్రమం కన్నా బ్రహ్మచర్యం గొప్పది, అని. బ్రహ్మచర్యం అనేది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పటం లాంటిది. ఈదినప్పుడు కదా ఈతలో మజా తెలిసేది. ఈతలో కష్టాలు నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఈదను, మీరు కూడ ఈదకండి. నేను ఈదను కాబట్టి మీకన్నా గొప్ప వాడిని. మీకు బోధించే అర్హత నాకు వస్తుంది. నేను పరమహంసను. మీరు నా కాళ్ళమీద పడుతుంటే, నేను మీ నెత్తి మీద చేతులు పెట్తూ ఉంటాను అనే ప్రవృత్తి మనదేశంలో బుధ్ధుడి కాలం నుండీ ప్రబలి ఉన్నది. అదేంట్రా నాయనా అంటే, నా కాషాయ గుడ్డలే, నా మంత్రదండమే, నా అర్హతలు. ఇలాగా అన్ని మతాలలోని బోధకులు గృహస్తుల నెత్తిన కూర్చోటం అలవర్చుకున్నారు. ఘరానా మఠాల సన్యాసుల కన్నా ఒక విధంగా వీధులలో ముష్ఠెత్తుకునే సాధువులు కొన్ని సార్లు మెరుగని పిస్తారు. ఎందుకంటే వీరు పాదాలు పట్టుకునేటందుకు ఛార్జీలు వసూలు చేయరు.

''వినదగు నెవ్వరు చెప్పిన'' అన్నట్లుగా, మహాభారతంలో ధర్మరాజు గారికి మంచి వినికిడి ఓపిక ఉన్నది. మహాభారత యుధ్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయాక, తాతలు, గురువులు, అందరినీ చంపాక, ధర్మరాజు గారికి కిల్బిష భయం (పాప భీతి) పట్టుకుంది. నేను సన్యాసం పుచ్చుకుంటానంటాడు. ఆసమయంలో ఆయనకు ఉద్ బోధ చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు.

సాధారణంగా, నకుల సహదేవులకి ఉద్ బోధలు చేసే ఛాన్సులు రావు. శాంతి పర్వంలో, ప్రథమాశ్వాసంలో, నకులుడికి అలాంటి ఛాన్స్ ఒకటి వచ్చింది. నకులుడు, సన్యాసం తీసుకోవద్దు, గృహస్తాశ్రమమే మిన్న అని ధర్మరాజుకి ఉద్ బోధ చేశాడు. ఆ ఉద్ బోధలోంచి కొన్ని పద్యాలను ఈక్రింద ఇస్తున్నాను.

తిక్కన ప్రణీత శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతి పర్వం, ప్రథమాశ్వాసం, 76వ పద్యం.


కంద పద్యం.
తక్కిన మూడాశ్రమములు
నొక్క దెస, గృహస్థ ధర్మ మొక దెసఁ తులయం
దెక్కింప వానితో న,
య్యొక్కటి సరి తూఁగె నందురు ర్వీశ బుధుల్.

తెలుగు సారం: గృహస్థాశ్రమాన్ని త్రాసులో ఒక పళ్ళెంలో వేసి, రెండవ పళ్ళెంలో మిగిలిన మూడాశ్రమాలను అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ (అడవులలో ఉండటం), సన్యాసాశ్రమాలను పడేస్తే, మొగ్గు గృహస్తాశ్రమం వంకే ఉంటుంది అని పండితులు చెప్తారు.

81 వ పద్యం. కందం.
పరుల వధింపక యెవ్వడు,
ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక,
యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.

తెలుగు సారం: ఓ రాజా, పూర్వపు రాజులలో, ఇతరులను చంపక ఏ రాజు భూమిని యేలాడు చెప్పు, వారు సుగతికి అంటే మంచి లోకాలకే వెళ్ళారు, నీవు కూడ అలాగే వెళ్తావు.

82 వపద్యం. కందం.
రక్ష ప్రజ గోరు నిజయో
గ క్షేమార్ధముగ జన సుఖ స్థితి నడపన్
దక్షుడగు రాజు నడప కు
పేక్షించినఁ పాపమొందడే కురు ముఖ్యా.

ఓ కురు ముఖ్యా, జనం తమ యోగ క్షేమాలు చక్కగ సుఖంగా గడచి, రక్షణ కావాలని కోరుతుంటే సమర్ధుడైన రాజు పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే, పాపం పొందడా?

82 వపద్యం. తేటగీతి.
గోవులను ఘోటకంబులఁ, కుంజరముల
దాసులను ప్రీతి నిమ్మెల్ల ధాన్యములను
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క
నొసగు తత్తత్ సుపాత్రత్వ యుక్త విధుల. అర్ధము

తెలుగు సారం: గోవులంటే ఆవులు. ఘోటకాలు అంటే గుర్రాలు. కుంజరాలు అంటే ఏనుగులు. దాసులంటే సేవకులు. ధాన్యాలు, గ్రామాలు, ఇళ్లు, నిష్కాలు అంటే ఆనాటి నాణెములు, ఇలాగా అన్నిటినీ వేడుకతో, ప్రీతితో, రాజు, సుపాత్రులు అంటే అర్హులైన వారికి తగినట్లుగా ఇస్తాడు.

ఆధునిక కాలం


భా భా ప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారి రోల్ మాడెల్ స్వామి వివేకానంద గారికి బ్రహ్మ చర్యం గురించి ఉద్ బోధలు చేయటం అంటే మహా మక్కువ. తల్లిని పోషించటానికి, సోదరీ సోదరులను పైకి తీసుకురావటానికి ఉద్ యోగం చేయటం అంటే చిన్న చూపు. ఉద్యోగం అంటే ప్రొద్దున నుండి సాయంకాలం దాకా, కష్ట పడాలి కదా. తన పోషణకు నెలకో వంద రూపాయలు, తల్లి పోషణకు నెలకో వంద రూపాయలు భృతి ఏర్పాటు చేయమని ఖేత్రీ రాజును ఆశ్రయించుకున్నాడు. (ఖేత్రీ రాజుకు తన పుత్ర సంతానం వివేకానందుడి దయ వలన కలిగిందని ఒక నమ్మకం. అందుకే రెండు భృతులూ ఏర్పాటు చేశాడు. అంతే కాక, వివేకానంద గారి కోరికపై ఆయన తెల్లతోళ్ళ శిష్యులకి ధ్యానం కోసం పులి తోళ్ళు ఏర్పాటు చేశాడు).


తత్ శిష్యుడు శ్రీ నరేంద్రమోడీ గారికి కూడ బ్రహ్మ చర్యం పై మక్కువో కాదో మనకి తెలియదు కానీ, శ్రీవారి ధర్మపత్ని జశోదా బెన్ గారు మటుకు, నేను శ్రీవారి ధర్మపత్నినే అని మొత్తుకుంటున్నది. శ్రీవారు అవుననరు, కాదనరు. చదువుకో మ్మా అని పుట్టింట్లో దిగబెట్టి 30 ఏళ్ళు పూర్తయ్యింది. ఆమె 10 పాసయి, టీచర్ ట్రైనింగు పూర్తిచేసి, కుగ్రామాలలో గవర్న్మెంటు టీచరుగా పనిచేసి, రిటైర్ అయి ఒంటరి జీవితం గడుపుతున్నది.

ప్రజాసేవకి గృహస్థాశ్రమం పనికి రాదని, ఆర్ ఎస్ ఎస్ లో అలిఖిత నిబంధన ఏదైనా ఉందో ఏమో గానీ, శ్రీవారికి గృహస్తాశ్రమం యొక్క శ్రేష్ఠతను ఆర్ ఎస్ ఎస్ అగ్ర గురువులు బోధిస్తే న్యాయంగా ఉండేది. ఒకవేళ బ్రహ్మచర్యం అవసరమే అనుకున్నా, అది వివాహం కాకముందు తీసుకోవలసిన నిర్ణయం, అగ్ని సాక్షిగా సప్తపదిని పూర్తిచేసి, నాతిచరామి వంటి ప్రతిజ్ఞలు చేసుకున్నాక శోభించదు అని ఉద్ బోధిస్తే బాగుండేది.

భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. అతడు గృహస్థే. తన కొడుకుని రాజకీయాలలోకి దింపి, కూతురుని కూడ దింపాలనుకుంటున్నారు. ప్రొటోకోల్ ప్రకారం, ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి. తృతీయ పౌరుడు ప్రధాని. ఈ శ్రేష్ఠ భారత దేశానికి శ్రీ మోడీ ప్రధాని అయితే శ్రీవారి శ్రేష్ఠ దంపతులు ఉభయులు కనువిందు చేస్తే బాగుంటుందా, లేక ఒక్కడే లింగూ లిటుకూ అంటే బాగుంటుందా?

ఈనాటి పాట

రచన: శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి.
చిత్రం: మంచిరోజులు వచ్చాయి.
ఈ పాట టైపింగు శ్రీ వికీసోర్స్.ఆర్గ్ వారి దానం.

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ||| నేలతో |||

చరణం 1 :
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ, నేను లేనూ, లోకమే లేదులే ||| నేలతో |||

చరణం 2 :
రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే ||| నేలతో |||

చరణం 3 :
అంటరానితనము - ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం ||| నేలతో |||

వైబీరావు గాడిద లౌడ్ థింకింగ్.


మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే అని శ్రీ దేవులపల్లి వ్రాసిన వాక్యాలు అజరామరాలు. బౌధ్ధం యొక్క ప్రభావానికి లోనైన భారత జాతి గుండ్లు గీయించుకొని, కాషాయాలు కట్టుకుంటుంటే, బయటకి వైరాగ్యం ఆర్భాటం చేసినా, పురుష భిక్షువులు, స్త్రీభిక్షువుల మధ్య వ్యభిచారాల కాలనాగులు తిరిగేవి. అదను చూసి కాట్లు వేస్తూ ఉండేవి.

ఈనాటి కేథలిక్ క్రైస్తవ ప్రపంచాన్ని తీసుకోండి. బ్రహ్మచర్యం పాటించాల్సిన మతగురువులు పలు పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో బాలురతో మైథునాలు చేసుకుంటూ కోర్టుకేసుల పాలైతే, వాటిని ఎలా సరిదిద్దాలో తెలియక గతంలో పోప్ బెనెడిక్ట్, నేడు పోప్ ఫ్రాన్సిస్ నానా బాధలు పడుతున్నారు. మైథునం అనేది ఒక జననార్తి. దానిని ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంయోగం ద్వారా అప్పుడప్పుడూ సంతృప్తి పరచకుంటే జననార్తులు వికృత మార్గాలు పట్టే అవకాశం ఉంది.

మనం అదుపులో పెట్టుకోవలసినది: సంగం, అంతే కాని లింగం కాదు


సంగం అనే పదం, సంఘం అనే పదం ఒకటి కాదు. సంగం అంటే ఆంగ్లంలో attachment. తెలుగులో బంధం. ఏమిటీ ఈ బంధం, అంటే కనిపించే ప్రతి దాన్ని తనది అనుకోటం. సంగాన్ని వదులుకోమని ప్రతి గృహస్థుని మన ఆర్ష సంస్కృతి బోధించినది.

కలిగి ఉండమని బోధించింది, ఏమిటంటే సత్యాసత్యవివేకం, నిత్యానిత్య వివేకం , మిథ్యా మిథ్య వివేచన . ఈ వివేచన కలిగి ఉండక మొండిగా ప్రవర్తించినపుడు, లక్షకోట్లార్జించినా, చివరికి ఏ విమాన ప్రమాదం లోనో, ఏ గన్ మాన్ కాలిస్తేనో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చి, తాను నిజం, నిజం అని నమ్మిన సంపదకే దూరం కావాల్సి వస్తుంది. మెట్లమీదినుండి కాలు జారితే చాలదా, అంతా అసత్యం, అనిత్యం అని ఋజువు కావటానికి.

లింగాన్ని వదిలేయాలా

లింగాన్ని వదిలేయమని ఎవరూ అనరు. లింగాలకు, భగాలకు వాటి పరిమితులు వాటికి ఉంటాయి. మన కుటుంబ వ్యవస్థయే ఆపరిమితుల సరిహద్దులను కొంత మేరకు నిర్దేశించింది. ఈమధ్య కొందరు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, టీవీ ఛానెల్ అధినేతలు, ఐటీ కంపెనీల మహానిర్వాహకులు, దైవమానవులు (గాడ్ మెన్), రకరకాల కారణాల వల్ల విచారణలు ఎదుర్కొంటున్నారు.

కొన్ని కులాలలో ఉపనయనం అనే వ్యవస్థ ఉంది. రోజూ ఉదయాన్నే సంధ్యావందనం అనే ప్రక్రియ ఉంది. ఉపనయనం అంటే sub-eye. మామూలు రెండు కన్నుల కన్నా అదనపు కన్ను అన్న మాట. ఈ అదనపు కన్ను ఏమిటి? జ్ఞాన నేత్రం. ఏమిటా జ్ఞానం? అదే నిత్యానిత్య జ్ఞానం. సదసద్ విజ్ఞానం. మిథ్యామిథ్య వివేచనం. ఈ జ్ఞానం ఏమి చెప్తుందంటే, శరీరం ఒక గుర్రం. అందులో ఉండే మానవుడు రౌతు. రౌతు చెప్పినట్లు గుర్రం వినాలా, లేక గుర్రం చెప్పినట్లు రౌతు వినాలా? లింగాలు, భగాలు అనేవి ఈశరీరంలో భాగాలు మాత్రమే. అంటే రౌతుచెప్పినట్లు నడుచుకోవలసినవే.

ఈపరిశోథనలో భాగంగా అంతర్జాలంలో నేను కొన్ని డజన్ల వెబ్ సైట్లను చూసి కొన్ని వందల వీడీయోలను అథ్యయనం చేయటం జరిగింది. ఈసందర్భంగా గమనించిందేమిటంటే, భారతీయులలో కొన్ని లక్షలమంది ఈ సైట్లను దర్శిస్తున్నారు. తదనంతరం రకరకాలుగా భావోద్వేగాలకు గురియవుతున్నారు. గురువులు పాఠశాలల్లో కీచకులుగా తయారు కావటానికి, తండ్రులు గృహాల్లో కీచకులుగా తయారు కావటానికీ ఈ సైట్ల వలన కలిగే భావోద్వేగాలు ఎంతవరకు కారణం అనే అధ్యయనం న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు , సోషియాలజిస్టులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

మానవుడి లైంగిక ప్రవర్తన పై మిథ్యాహార, విహారాల ప్రభావం , ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే స్ట్రెస్ గూర్చి అధ్యయనాలు జరగాల్సి ఉంటుంది.

మానవ వికాస చరిత్రలో ఇంటర్నెట్ ఒక నూతనాధ్యాయాన్ని తెరిచింది. తాంత్రిక విద్యల కన్నా, దేవాలయాలపై శృంగార శిల్పాలకన్నా మానవులపై ఇంటర్ నెట్ వీడియో ల ప్రభావం లోతుగా ఉండ బోతున్నది. పరాశరాది నాటి ఋషుల వలెనే నేటి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన మేథావులు ఉద్వేగాలకు లొంగిపోటాన్ని గమనించినపుడు, మనం --- లింగాల, భగాల, ఫెరోమోన్ల శక్తియుక్తులను తక్కువగా అంచనా వేయలేము. ప్రస్తుతానికి మేథావులం అనుకునే వారు తెల్లారి లేవగానే, రాత్రి పండుకునే మందు, ఒక భర్తృహరి శ్లోకాన్ని స్మరించుకోవటం విధాయకం.
brahmAmDa mamDaalI mAtram బ్రహ్మాండ మండలీ మాత్రమ్
kim lobhAya manasvinaha; కిమ్ లోభాయ మనస్వినః
Sapharii sphuritE nAbdhEh (naabdhihi) శఫరీ స్ఫురితే నాబ్ధేః
kshubdhO na khalu jAyatE. క్షుబ్ధో న ఖలు జాయతే.

If a female fish dances and leaps in an Ocean, the Ocean does not get tumultous. The mind of an ascetic in Union does not quiver even if the Universe were accrue to him.

తెలుగు సారం: ఒక ఆడ చేప సముద్రంలో గంతులేస్తే , నాట్యం చేస్తే, సముద్రం కల్లోలితం కాదు. యోగి హృదయం కూడ, సర్వ విశ్వం అతడిని సమీపించినా, ఊగిసలాడదు. మేథావులు కూడ అంతే.

తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, ఆరోగ్యం, వృధ్ధాప్యం లో సామాజిక భద్రత


ఇవీ ప్రతి భారతీయుడూ, తపన పడాల్సినవి, అందరు భారతీయులకి అందుబాటులో లేనివి. ప్రతి వ్యక్తి వీటిని తన జీవితకాలంలో సేకరించుకుని తీరవలసినవే. వివిధ కారణాల వల్ల, వారి అదుపులో లేని వివిధ పరిస్థితులలో వలన (factors beyond their control) వారు ఈ లక్ష్యాన్ని చేరుకోలేక పోతే, సమాజం ఈ అవసరాలను పూరించాల్సిందే. పెట్టుబడిదారి విధానం ఈ బాధ్యతను తీసుకోదు. తీసుకున్నట్లుగా నటిస్తుంది. మభ్యపెట్తుంది.


ఈ బాధ్యతను తీసుకునే శక్తి మార్క్సిజానికే ఉన్నది. కాకపోతే అది మావోయిస్టులు భావిస్తున్నట్లుగా తుపాకీగొట్టం ద్వారా రావాల్సినది కాదు. అది బ్యాలెట్ ద్వారా మాత్రమే రావాలి. తుపాకీ గొట్టం ద్వారా వస్తే అది నిలువదు. నియంతృత్వానికి దారి తీసి, పెట్టుబడిదారి విధానం కన్నా దుర్భర ఫలితాలను ఇస్తుంది. గౌ. శ్రీ వరవరరావు వంటి వారు ఉద్ బోధిస్తున్నట్లుగా, ప్రజలు ఎన్నికలను బహిష్కరించినందు వల్ల అది సిధ్ధించదు. ప్రజలు ఎన్నికలలో పాల్గొన వలసినదే. కాకపోతే వారు విజ్ఞాన వంతులైన వోటర్లుగా పాల్గొనటం అవసరం.

ఇంకా ఉంది, ఇంకో సారి.

Tuesday, April 8, 2014

198 Crows on trees

198 Crows on trees

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اُجزڈا: సినిమాలు, అలియాభట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్, రణ్ బీర్ కపూర్, ప్రణయబంధాలు, బాలీవుడ్


కాఫీ విత్ కరణ్ అనే టీవీ కార్యక్రమంలో ఈ 21 ఏళ్ల బాలీవుడ్ నటి చెప్పిందట.

I remember the first time I spoke to Ranbir.. you called him up when ‘Rockstar’ released and you said, here talk to Ranbir tell him how much you love him. And I just spoke so much rubbish, I was just talking non-stop. But later I have hung out with Ranbir and I still think he is really adorable and I still want to marry him.

తెలుగు సారం: రణ్ బీర్ తో నేను మొదటి సారి మాట్లాడినది నాకు జ్ఞాపకం ఉంది. రాక్ స్టార్ రిలీజ్ అయినపుడు మీరు నన్ను కాల్ చేసి అన్నారు: ఇక్కడ రణ్ బీర్ తో , మీరు అతడిని ఎంత ప్రేమిస్తారో చెప్పండి, అన్నారు. అపుడు నేను చాల చెత్త మాట్లాడాను, నేను ఆగకుండా మాట్లాడుతూ ఉండినాను. కాని, తరువాత నేను రణ్ బీర్ తో మాట్లాడటం జరిగింది. నేను ఇప్పటికి అతడు చాలా ప్రేమార్హుడనే భావిస్తున్నాను. నేను ఇప్పటికి అతడిని వివాహమాడాలనే అనుకుంటున్నాను.

Everybody knows my plan. I have gone on record and said it as you said.. and I am very open about it except to Ranbir.

నా ప్లాన్ ప్రతివాళ్ళకి తెలుసు. నేను రికార్డు గానే చెప్పాను, మరియు మీరన్నట్లుగానే చెప్పాను. నేను దాని గురించి ఓపెన్ గానే ఉన్నాను, రణ బీర్ తో తప్ప.

వైబీరావు గాడిద వ్యాఖ్య

చెప్ప వలసిన వాళ్ళకి చెప్పకుండా మిగిలిన వాళ్ళకి చెప్పి ప్రయోజనమేమి?

ఇంతకు ముందు శ్రీ రణ బీర్ కపూర్ పేరు ౩0 ఏళ్ళ కుమారి కత్రీనా కైఫ్ తో వినిపించింది. వారు 2015 లో ఒక ఇంటి వారవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె, తాను కూడ ఈ విషయాన్ని మీడియా ద్వారాతెలుసుకున్నానని (29.3.2014) అన్నది.

I don’t know about this, it has come in media today. It is news to me as I got to know when someone sent me a message about this, till then I was not aware about it.

దీని గురించి నాకు తెలియదు, ఈరోజు మీడియాలో వచ్చింది. నాకు కూడ ఇది వార్తయే, నాకు ఒకరు మెసేజి పంపగా తెలిసింది. అంతవరకు నాకు తెలియదు.


అంతకు ముందు కుమారి దీపికా పాదుకోనే మరియు శ్రీ రణ్ బీర్ కపూర్ ఒక ఏడాది డేటింగు చేసుకొని విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

కుమారి దీపిక కూడ కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలోనే తన మనసుని విప్పి చెప్పింది.
"... when I genuinely believed that I had fallen in love." "I think it was a relationship that I thought would go beyond. For whatever reasons, it didn't work out."

తెలుగు సారం: శ్రీ రణ బీర్ తో డేటింగ్ జరిగిన కాలంలో నేను నిజంగానే ప్రేమలో పడ్డానని నమ్మాను. ఆ సంబంధం ముందుకు వెళ్తుందని నేననుకున్నానని అనుకుంటున్నాను. కానీ, కారణాలేమయితేనేం, అది వర్క అవుట్ కాలేదు.

వారు బ్రేక్ అప్ అయినాక కూడ వారు యే జవానీ హై దివానీ అనే చిత్రంలో నటించి 2013 లో ఘన విజయాన్ని సాధించారు.
''...As far as our equation is concerned, the best part is that he and I are very clear about where we are in our lives today. So there’s no reason for anyone is his life or anyone in my life to be worried about or concerned or insecure about our equation."

తెలుగు సారం: మా ఇద్దరి మధ్య సమీకరణానికి సంబంధించినంత వరకు, అన్నిటికన్న మంచి విషయం ఏమిటంటే, మా జీవితాలలో మేము ఎక్కడ ఉన్నాము అనే విషయంలో స్పష్టత ఏర్పడింది. కనుక, ఆయన జీవితంలో ఎవరైనా కానీ, నా జీవితంలో ఎవరైనా గానీ, దిగులు పడాల్సిన, లేక సంబంధించిన విషయంగా భావించటానికి గానీ, మా సమీకరణం గురించి అభద్రత ఫీల్ అవాల్సిన అవసరం లేదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

బాలీవుడ్ లో నటీ నటులు ప్రేమలో పడటం, ఇదే మొదటి సారీ కాదు, ఇదే చివరి సారీ కాబోదు. వెర్రి ఏదైనా ఉంటే ప్రేక్షకులకే. ఒక చెట్టుమీదకి ఎన్ని కాకులు వాలుతున్నాయి, ఎన్ని ఎగిరి బయటకు పోతున్నాయో లెక్కేయటం ఎంత కష్టమో నటీ నటులు ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు గమనించటం అంతే కష్టం. అందుకే వీటిని కాకుల లెక్కలు అనాలి.

ఎవరు ఏ పని చేసినా డబ్బు కోసం. ఇది పెట్టుబడి విధానపు అనుల్లంఘనీయ నియమం. నటీనటులు చిన్నగోచీలు పెట్టుకోవాలా, పెద్ద గోచీలు పెట్టుకోవాలా, ముద్దులు పెట్టుకోవాలా, ఇంకా ఏమి చేయాలి అనేది నిర్మాతలు చెల్లించే కోట్లపై ఆధారపడి ఉంటాయి.

ఇంక డేటింగులు, ప్రేమలు, పెళ్ళిళ్లు అనేవి జననార్తుల క్రిందకి వస్తాయి.

వారిని మనం సామాన్య మానవులుగా గుర్తించ కలిగితే మనకు జ్ఞానం కలిగినట్లే. ఈ జ్ఞానం కలిగే లోపలే మనం వాళ్ళని ఎంపీలు గా ఎన్నుకుంటూ ఉంటాం.

జస్టిస్ శ్రీ మార్కండేయ కట్జూ గారు అన్నట్లుగా (తరువాత విత్ డ్రా చేసుకున్నట్లుగా), భారతీయులలో 90% మంది మూర్ఖులే. భారతీయుల పరిణామ క్రమం కొంత నెమ్మదిగా జరుగుతున్నది, కాబట్టి చింతించన్ పని లేదు.

Monday, April 7, 2014

197 Narendra Modi and China

197 Narendra Modi and China

Topics for discussion: Narendra Modi, నరేంద్రమోడీ, చైనా, రక్షణ వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలు
శ్రీనరేంద్ర మోడీగారికి , శ్రీ మన్మోహన్ సింగు గారికి వలెనే , చైనా యందు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో స్పష్టత లేనట్లు కనిపిస్తున్నది. శ్రీవారు 25.2.2014 నాడు ఈశాన్యరాష్ట్రాలలోని పాసీఘాట్ వద్ద ఒక ఎన్నికల ర్యాలీ లో ప్రసంగిస్తూ అనవసరంగా చైనాను గిల్లారు.
“...No power on earth can take away even an inch from India ... China should give up its expansionist attitude and adopt a development mindset. ... I swear by this land that I will not let this nation be destroyed, I will not let this nation be divided, I will not let this nation bow down,”

తెలుగు సారం: ''... ఈభూమిపై ఏ శక్తికూడ భారత్ నుండి ఒక అంగుళాన్ని కూడ తీసుకు వెళ్ళలేదు. ... చైనా తన విస్తరణవాద దృక్పథాన్ని వదిలేసి వికాసభరితమైన మైండ్ సెట్ ను ప్రవేశ పెట్టుకోవాలి. ... నేను ఈ జాతిని వినాశం కానివ్వనని, నేను ఈ దేశాన్ని విభజించబడనివ్వనని, ఈదేశాన్ని లొంగి ఇతరుల పాదాక్రాంతం కానివ్వనని ఈ నేల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ప్రతిజ్ఞలు వేరు, ఆచరణలు వేరు. 2002 లో గుజరాత్ లో మత కలహాలు చెలరేగి వేలమంది హతమైతే ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్రూప్సు ను పంపలేదని శ్రీవారు చూస్తూ ఊరుకున్నారు. కనీసం, మతకలహాలు జరుగుతున్న చోటికి వెళ్ళి పోలీసు అధికారులు ఏమీ చేస్తున్నారు అనేది గమనించటం కూడ చేయలేకపోయారు. ఇలాంటి నిస్సహాయ వ్యక్తి, తాను చాల బాధ పడ్డానని చెప్పే పాలకుడు, చైనా నిజంగా దాడి చేస్తే ఏవిధంగా అడ్డుకుంటాడు? ఏరష్యానో, అమెరికానో సాయం అడిగి, వారు పంపలేదని చూస్తూ ఊరుకుంటాడా? యుధ్ధం అన్నాకా గెలుపూ ఓటములు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇంగ్లండు వంటి చిన్న దేశం భారత్, చైనా ల వంటి అతి పెద్ద దేశాలనే కాక ప్రపంచం మొత్తాన్నీ జయించింది అంటే అది ఆధునిక ఆయుధాల మహత్తు కావచ్చు, వాటిని వాడటంలో నైపుణ్యం కావచ్చు, యుధ్ధ వ్యూహాలు కావచ్చు, ధర్మాధర్మాలు పట్టించుకోకుండా పిట్టలను కాల్చినట్లుగా కాల్చుకుంటూ పోవటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. విజ్ఞుడైన రాజకీయవేత్త వీలైనంత వరకు యుధ్ధాలను నివారించాలని చూస్తాడు: కయ్యాలకు కాలు దువ్వడు. యుధ్ధం అనివార్యం అయినపుడు తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తాడు తప్ప, వాచాలత్వాన్ని చూపి, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేయడు. కరిచే కుక్క అరవదు, అరిచే కుక్క కరవదు అనే సూత్రం చక్కగా వర్తిస్తుంది.

మోడీ గారి ప్రసంగానికి చైనా తన ధోరణిలో జవాబు చెప్పింది. వారేం జవాబు చెప్పినా, ఫలితం భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఈలోగా అనవసరంగా కవ్వించినట్లయ్యింది.

ముందు చూపులేని వ్యాపారాలు, పెట్టుబడులు

1962లో చైనా భారత్ లో షుమారు 36,000 చదరపుమైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. 20,000 మంది దాకా భారతీయ సైనికులు హతమయ్యారు. వారి భార్యలు విధవలై , పిల్లలు తండ్రులు లేని వారై, కుమిలిపోతున్నారు. అలాటి చైనాతో, కయ్యానికి కాలు దువ్వక పోయినా, సమయం చూచుకొని మన భూభాగాన్ని మనం సామదాన భేద దండోపాయాల ద్వారా తిరిగి సాధించుకోవాలి.

ఒక సామెత ఉంది, చరిత్ర నుండి పాఠం నేర్చుకో లేని వాడు, గత చరిత్రలలో జరిగిన దురాగతాలనే మరల మరల అనుభవించాల్సి ఉంటుంది. చైనా దురాగతాల చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకున్నాం?

చైనా నుండి ప్రతి ఏటా 50 బిలియన్ డాలర్ల వస్తువులను కొంటూ, చైనా ఆర్ధిక వ్యవస్థకు మహారాజ పోషకులలాగా తయారు అయ్యాం. బిలియన్ డాలర్లు అంటే షుమారు రూ. 6000 కోట్లు. 50 బిడాలు అంటే ఏటా రూ. 3 లక్షల కోట్ల రూపాయలు. 36000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నవాళ్ళకి మనం ఏటా 3 లక్షల కోట్లు చెల్లిస్తున్నామంటే మనం ఎంతటి అర్భకులం? ఎంతటి మూర్ఖులం?

గతంలో భారతీయ నగరం ఆలీఘర్ గొప్ప గొప్ప తాళాల తయారీకి ప్రసిధ్ధి. ఈరోజు ఏఇంట్లో చూచినా చైనా తాళాలు దర్శన మిస్తాయి. గాడ్రెజ్ వంటి గొప్ప కంపెనీ వారు కూడ తమ బ్రాండ్ పేరుతో ముద్రింపచేసుకొని, చైనా నుండి తాళాలను దిగుమతి చేసుకొని , భారత్ లో అమ్ముతున్నారు అంటే ఎంత నికృష్టులం మనం. పోనీ ఈతాళాల నాణ్యత ఎంతో గొప్పదా? పైన పటారం లోన లొటారం లాగా, తాళాలు బాగు చేసే వాడిని అడిగితే వాడు ఒక చిన్న మేకుతో, సుత్తితీసుకొని కీహోల్ లో ఆయువు పట్టైన చోట ఠాప్ అని ఒక దెబ్బ వేస్తే చాలు, చైనా తాళం దెబ్బకి ఊడి వచ్చేస్తుంది. భారత్ తాళాలు అలా రావు.

మోడీజీ, ఏమిటీ బ్రతుకు?

గుజరాత్ లో పెట్టుబడులు పెట్టమని శత్రుదేశమైన చైనా వారిని అడుక్కోటానికి, శ్రీ నరేంద్ర మోడీగారు మూడు సార్లు చైనా పర్యటించి వచ్చారట. గుజరాత్ ను చైనాకు అమ్మటంలో వారు ఎంత మేరకు కృతకృత్యులైనారో తెలియదు.

ఈవిషయంలో కాంగ్రెసాది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ తక్కువేమీ తినలేదు. భారతీయ నౌకాశ్రయాల నిర్వహణను చైనా కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నాలు జరిగాయి కాని, రక్షణ శాఖవారు అభ్యంతరాలు లేవదీయటం వలన కొంచెం స్లో అయ్యాయి.

రివర్సుగా, అంటే చైనాలో భారత్ పెట్టుబడులు

చైనాలో పెట్టుబడులు పెట్టాలని భారతీయ పారిశ్రామికులు ఉవ్విళ్ళూరుతున్నారని వేరుగా చెప్పనవసరం లేదు. భారతీయ పారిశ్రామికులకు భారత్ లో పెట్టుబడులు పెట్టటం కన్నా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని విపరీతమైన దురద.

చైనాలో పెట్టుబడులు పెట్టటానికి భారత్ కు ఎన్నో అవకాశాలున్నాయని మన భావి భారతప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారి నమ్మకంట. అలా చైనాలో భారీగా పెట్టుబడులు పెట్తే చైనా భారత్ పై ఇంక ముందు దాడి చేయదనా? అరుణాచల్ ప్రదేశ్ ను తమ భూభాగంగా చూపించటం మానేస్తుందనా? కాశ్మీర్ నుండి చైనా వెళ్ళే భారతీయులకు స్టేపుల్డ్ వీసాలు జారీచేయటం మానేస్తుందనా?

భవిష్యత్ లో చైనా భారత్ పై దాడి చేస్తే, చైనాతో యుధ్ధం చేయవలసి వస్తే ఆ పెట్టుబడులను ఎలా వెనక్కి తెచ్చుకుంటారు?

(ఇంకా ఉంది, ఇంకో రోజు.)

196 pseudo-secularistsTopics for discussion: bjp, congress, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, 2014 ఎన్నికలు, టిడిపి, కుటుంబ నియంత్రణ

వెన్నుపోటు సార్వభౌమ శ్రీచంద్రబాబు నాయుడు గారు బిజెపితో పొత్తు ఏర్పరుచుకోటంలో వింత ఏమీ లేదు. బిజెపి అగ్రనేత శ్రీ నరేంద్రమోడీ స్వభావం కూడ బయటపడింది. తెలంగాణ బిజెపి ఏమైపోయినా ఫరవాలేదు, 2004 లో తనను నిందించి ఎన్ డి ఏ కి టాటా చెప్పిన చంద్రబాబు నాయుడిని కౌగలించుకొని తాను ప్రధానమంత్రి కావటానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272 సాధించటమే ధ్యేయంగా, బిజెపి కేంద్ర అధిష్ఠానం వ్యవహరించింది.


నేటి రాజకీయాలలో అమాయకులు ఉండరు కాబట్టి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి దగా పడ్డ తమ్ముడయ్యాడని, ఆయన ఆశాసౌధాలన్ని కూలిపోయాయని, మనం చింతించ నవసరం లేదు.


అఖిలభారత పార్టీల నియంతృత్వాలే కాదు, ప్రాంతీయ పార్టీల నియంతృత్వాలలో కూడ ప్రత్యేకత ఏమిటంటే, తమ మరియు తమకుటుంబం యొక్క స్వార్ధమే తప్ప మిగిలిన వాళ్ళు ఏమవుతారు అనే ఆలోచన అసలు ఉండనే ఉండదు. మోడీకి కిషన్ రెడ్డిని గురించిన చింత లేనట్లుగానే, శ్రీ చంద్రబాబుకు శ్రీమోదుగల వేణుగోపాల రెడ్డి (లోక్ సభలో దెబ్బలు తిన్న నరసరావుపేట టిడిపి ఎంపి), డా. కోడెల శివప్రసాదరావు, మాజీ హోమ్ మంత్రి, నరసరావుపేట టిడిపికి మూలస్థంభం ఏమవుతారు అనే పట్టింపు లేనే లేదు. చివరికా డా. కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుండి ఇండిపెండెంటు గానైనా పోటీకి సిధ్ధ పడాల్సి వచ్చింది.


ఇంకా దుఃఖకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ మైనారిటి మత తత్వాన్ని పెంచి పోషిస్తుండగా,బిజెపి మెజారిటి మతతత్వాన్ని పోషించటం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలి యైన మహిళగా కొనియాడబడిన సోనియా గాంధీ ఏమిటి, ఒక సాధారణ మసీదు లోని మతబోధకుడిని తమకు వోట్లు వేయించమని ఆశ్రయించటం ఏమిటి?
పౌరుష జ్ఞాన కీర్తుల బరగెనేని
వాని జీవన మొక్కపూట యైన చాలు
ఉదర పోషణ మాత్రకై ఉర్వి మీద
కాకి చిరకాల మున్ననే కార్య మగును?

ఇరవయి నాలుగు గంటలూ మతం గోలేనా?

మనకి సవాలక్ష రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీయైనా ''మీ కులం, మీ మతం మాకు సంబంధం లేదు. మీ కుటుంబాన్ని ఇద్దరికి పరిమితం చేసుకోండి. మీపిల్లలు మరణించినా, వారు మిమ్మల్ని నిరాదరించినా, మీ భద్రతకు మా పూచీ,'' అని మానిఫెస్టోలో పెట్టుతుందేమో అని చూస్తున్నాను. ఉహూ. అలాంటి ధైర్యం, తెగువ మన పార్టీలకు ఉండదు కదా.

కాంగ్రెస్ చేస్తున్న ఇటువంటి పనుల వల్ల , బిజెపి మతతత్వాన్ని తప్పు పట్టటం కష్టమవుతుంది.

Saturday, April 5, 2014

195 Indian scams - foreign exposures

195 Indian scams - foreign exposures
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चा अंश, اِپزڈا: అవినీతి, రాజ్యసభ, కాంగ్రెస్ , బిజెపి, Corruption, కెవిపి, kvp
సాధారణంగా భారత్ లో అవినీతిని భారతీయ పాలకులే పట్టుకొని, దిద్దుబాటు చర్యలు తీసుకోటం అనేది చాలా అరుదు.

ఈ విషయంలో కాంగ్రెస్ కు, బిజెపి కి పెద్ద తేడా ఏమీ లేదు.

వైఎస్ జగన్ మీద తెలంగాణ మాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎందుకు కోపం వచ్చిందేమో కానీ, శ్రీ శంకరరావు జగన్ అవినీతిపై కోర్టులో పిటీషన్ వేయటం, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించటం, శ్రీలక్ష్మీనారాయణ నేతృత్వంలో జగన్ అవినీతి డొంక కదలటం జరిగింది. ఆ కోప రహస్యాన్ని కూడ విదేశీ సంస్థలే బయట పెట్టాలి.

బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టిందెవరు?

స్వీడిష్ రేడియో.

వెస్ట్ లాండ్ హెలీకాప్టర్ కుంభ కోణాన్ని బయట పెట్టిందెవరు?

ఇటలీ కోర్టులు.

టైటానియం మైనింగు కుంభకోణంలో శ్రీకెవిపి రామచంద్రరావు పాత్రను బయట పెట్టిందెవరు?

ఈనాడు దిన పత్రికా కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రికా కాదు. జస్టిస్ డిపార్ట్ మెంట్, అమెరికా ప్రభుత్వం. వారి వెబ్ సైట్ దర్శించు కోదలుచుకున్న వారికి లింకు. క్లిక్ వెళ్ళుటకు: http://www.justice.gov/usao/iln/pr/chicago/2014/pr0402_01.html

అయితే ఎక్కడో ఉత్తర ఇల్లినాయిస్ అమెరికా కోర్టులలో జరుగుతున్న కేసును తెలుగు ప్రజల గడపల్లోకి తీసుకు వచ్చి వివరిస్తున్న ఖ్యాతి ఈరెండు పత్రిక లకే చెందాలి. ఆకాశవాణి వారికి గానీ, దూరదర్శన్ వారికి గానీ దీనిపై అంత ఆసక్తి ఉంటుందనుకోను. విచిత్రమేమిటంటే, జాతీయ స్థాయి పత్రికలు గానీ, టీవీ ఛానెల్స్ గానీ దీని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు కనిపించదు.


కాంగ్రెస్ అధిష్ఠానం వారికి శ్రీ కెవిపి రామచంద్రరావు గారిపైన అమితమైన ప్రేమ ఎందుకో వాస్తవాలను వెలికితీయవలసిన అవసరం ఉంది. జగన్ పై దర్యాప్తు జరుగుతున్నప్పుడే శ్రీ కెవిపీ పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రధాని శ్రీమన్మోహన్ సింగ్ కు గానీ, కాంగ్రెస్ అధిష్ఠానంకు గానీ, శ్రీమతి రాహుల్ గాంధీకి గానీ, సోనియా గాంధీకి గాని, నిజంగా అవినీతి నిర్మూలన పై శ్రధ్ధ ఉంటే శ్రీ కెవిపీ పైకూడ సీబీఐ దర్యాప్తు చేయించి ఉండే వాళ్ళు. అలా చేయించక పోగా, శ్రీవారిని 2014 రాజ్యసభ ఎన్నికలలో తిరిగి టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆయనతో పాటు రెండవ టికెట్ పొందిన శ్రీ టీ. సుబ్బరామిరెడ్డిపై కూడ శ్రీమతి పురందేశ్వరి, ఆమె భర్త ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వేటినీ పట్టించుకోకుండా, శ్రీ కెవీపీకి, శ్రీ సు.రా. రెడ్డిగారికి టికెట్లిచ్చి ఏమి నిరూపించుకున్నది? తాను కూడ ఒక భాగస్వామి ననే నిరూపించుకున్నది.

రాహుల్ గాంధీగారు నిన్న బళ్ళారి లో గర్జించారు.
If Congress comes to power, it will recover every pie of illegal mining from looters and utilise it for welfare of Bellary people. We won't allow looters, who are already in jail, to come out.


తెలుగు సారం: కాంగ్రెస్ అధికారం లోకి వస్తే లూటర్ల దగ్గరనుండి ప్రతి పైసాను వసూలు చేసి బళ్ళారి ప్రజల సంక్షేమానికి వినియోగిస్తాము. ఇప్పటికే జైలులో ఉన్న లూటర్లను బయటకు రానివ్వము.

వైబీరావు గాడిద వ్యాఖ్యఅయ్యా రాహుల్ గాంధీ గారు, ఇతరుల కళ్ళలో సూదులను వెదకపోయే ముందు, మీ కళ్ళలో ఉన్న దూలాలను చూసుకోండి.


శ్రీ నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే శ్రీకెవిపీ పై సమగ్ర సీబీఐ దర్యాప్తు చేయిస్తాడని అనుకోటం కష్టం. ఎందుకంటే ఆయన ప్రాధాన్యతలు (పెద్ద పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరచటం) వేరే ఉన్నాయి, వాణిజ్యవేత్తల కొలువులో కంకు భట్టు పాత్రను (జూదగాడు), వలలుడి పాత్రను (వంటవాడు), బృహన్నలపాత్రను (డాన్సర్), తంత్రీపాలుడి పాత్రను (పశువుల కాపరి), దామగ్రంధి పాత్రను (గుర్రాల కాపరి), సైరంధ్రి పాత్రను (పూలు బుక్కాయిలు సిధ్ధం చేసేది) అన్నిటినీ శ్రీనరేంద్రమోడీ ఒక్కడే నిర్వహించుకోవాల్సిఉంటుంది. శ్రీమతి సుష్మా స్వరాజ్ సైరంధ్రి పాత్రకు పనికి రాదు. శ్రీమతి పురందేశ్వరి ఎన్నికైతే ఆమెను సైరంధ్రి పాత్రకు నియమించుకోవచ్చు.

ప్రస్తుతానికి నిజ నిర్ధారణకు అమెరికన్లపై ఆధార పడక తప్పదు.
Six Defendants Indicted in Alleged Conspiracy to Bribe
Government Officials in India to Mine Titanium Minerals

CHICAGO — A federal indictment returned under seal in June 2013 and unsealed today charges six foreign nationals, including a Ukrainian businessman and a government official in India, with participating in an alleged international racketeering conspiracy involving bribes of state and central government officials in India to allow the mining of titanium minerals. Beginning in 2006, the defendants allegedly conspired to pay at least $18.5 million in bribes to secure licenses to mine minerals in the eastern coastal Indian state of Andhra Pradesh. The mining project was expected to generate more than $500 million annually from the sale of titanium products, including sales to unnamed “Company A,” headquartered in Chicago.

One defendant, DMITRY FIRTASH, aka “Dmytro Firtash” and “DF,” 48, a Ukrainian businessman, was arrested March 12 in Vienna, Austria. Firtash was released from custody on March 21 after posting 125 million euros (approximately $174 million) bail, and he pledged to remain in Austria until the end of extradition proceedings.

Five other defendants remain at large: ANDRAS KNOPP, 75, a Hungarian businessman; SUREN GEVORGYAN, 40, of Ukraine; GAJENDRA LAL, 50, an Indian national and permanent resident of the United States who formerly resided in Winston-Salem, N.C.; PERIYASAMY SUNDERALINGAM, aka “Sunder,” 60, of Sri Lanka; and K.V.P. RAMACHANDRA RAO, aka “KVP,” and “Dr. KVP,” 65, a Member of Parliament in India who was an official of the state government of Andhra Pradesh and a close advisor to the nowdeceased chief minister of the State of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy.

“Criminal conspiracies that extend beyond our borders are not beyond our reach,” said Zachary T. Fardon, United States Attorney for the Northern District of Illinois. “We will use all of the tools and resources available to us to ensure the integrity of global business transactions that involve U.S. commerce,” he said.

“Fighting global corruption is part of the fabric of the Department of Justice,” said Acting Assistant Attorney General David A. O’Neil of the Justice Department’s Criminal Division. “The charges against six foreign nationals announced today send the unmistakable message that we will root out and attack foreign bribery and bring to justice those who improperly influence foreign officials, wherever we find them.”

Robert J. Holley, Special Agent-in-Charge of the Chicago Office of the Federal Bureau of Investigation, said: “This case is another example of the FBI’s willingness to aggressively investigate corrupt conduct around the globe. With the assistance of our law enforcement partners, both foreign and domestic, we will continue to pursue those who allegedly bribe foreign officials in return for lucrative business contracts.”

The five-count indictment was returned under seal by a federal grand jury in Chicago on June 20, 2013. All six defendants were charged with one count each of racketeering conspiracy and money laundering conspiracy, and two counts of interstate travel in aid of racketeering. Five defendants, excluding Rao, were charged with one count of conspiracy to violate the federal Foreign Corrupt Practices Act.

As described in the indictment, Firtash controls Group DF, an international conglomerate of companies that was directly and indirectly owned by Group DF Limited, a British Virgin Islands company. Group DF companies include: Ostchem Holding AG, an Austrian company in the business of mining and processing minerals, including titanium; Global Energy Mining and Minerals Limited, a Hungarian company, and Bothli Trade AG, a Swiss company, for which Global Energy Mining and Minerals was the majority shareholder. In April 2006, Bothli Trade and the state government of Andhra Pradesh agreed to set up a joint venture to mine various minerals, including ilmenite, a mineral which may be processed into various titanium-based products such as titanium sponge, a porous form of the mineral that occurs in the processing of titanium ore.

In February 2007, Company A entered into an agreement with Ostchem Holding, through Bothli Trade, to work toward entering into a supply agreement in which Bothli Trade would sell 5 million to 12 million pounds of titanium sponge from the Indian project to Company A on an annual basis. The mining project required licenses and approval of both the Andhra Pradesh state government and the central government of India before the licenses could be issued.

The racketeering conspiracy count alleges that the defendants:

* used U.S. financial institutions to engage in the international transmission of millions of dollars for the purpose of bribing Indian public officials to obtain approval of the necessary licenses for the project;
* used Group DF, including its business reputation and financial resources, to advance, participate in, and finance the project, as well as to fund, transfer, and conceal bribe payments connected with the project; and
* used threats and intimidation to advance the interests of the enterprise’s illegal activities.

According to the indictment, Firtash was the leader of the enterprise and oversaw, directed and guided certain of its illegal activities. Firtash allegedly:

* caused the direct and indirect participation of certain Group DF companies in the project;
* met with Indian government officials, including Chief Minister Reddy, to discuss the project and its progress;
* authorized payment of at least $18.5 million in bribes to both state and central government officials in India to secure the approval of licenses for the project;
* directed his subordinates to create documents to make it falsely appear that money transferred for the purpose of paying these bribes was transferred for legitimate commercial purposes; and
* appointed various subordinates to oversee efforts to obtain the licenses through bribery.

Knopp allegedly supervised the enterprise and, together with Firtash, met with Indian government officials. Knopp also met with Company A representatives to discuss supplying titanium products from the project. Gevorgyan allegedly traveled to Seattle and met with Company A representatives. Gevorgyan also engaged in other activities, including allegedly signing false documents, monitoring bribe payments, and coordinating transfers of money to be used for bribes. Lal, also known as “Gaj,” allegedly engaged in similar activities, reported to Firtash and Knopp on the status of obtaining licenses, and recommended whether, and in what manner, to pay certain bribes to government officials.

Sunderalingam allegedly met with Rao to determine the total amount of bribes and advised others on the results of the meeting, and identified various foreign bank accounts held in the names of nominees outside India that could be used to funnel bribes to Rao. Rao allegedly solicited bribes for himself and others in return for approving licenses for the project, and warned other defendants concerning the threat of a possible law enforcement investigation of the project.

As part of both the racketeering and money laundering conspiracies, the indictment alleges that one or more of the defendants caused funds to be transferred to and from the United States to promote the bribery of public officials in India. The indictment lists 57 transfers of funds between various entities, some controlled by Group DF, in various amounts totaling $10,597,050, beginning April 28, 2006, through July 13, 2010.

The indictment seeks forfeiture from Firtash of his interests in Group DF Limited and its assets, including 14 companies registered in Austria and 18 companies registered in the British Virgin Islands, as well as 127 other companies registered in Cyprus, Germany, Hungary, the Netherlands, Seychelles, Switzerland, the United Kingdom, and one unknown jurisdiction, and all funds in 41 bank accounts in several of those same countries. Further, the indictment seeks forfeiture from all six defendants of more than $10.59 million.

The charges in the indictment carry the following maximum penalties on each count: racketeering conspiracy ― 20 years in prison and a $250,000 fine; money laundering conspiracy ― 20 years and a $500,000 fine, or a fine totaling twice the value of the funds involved in the money laundering; interstate travel in aid of racketeering ― five years and a $250,000 fine; and conspiracy to violate the Foreign Corrupt Practices Act ― five years in prison and a $250,000 fine. If convicted, the Court must impose a reasonable sentence under federal sentencing statutes and the advisory United States Sentencing Guidelines.

The case is being investigated by the Chicago Office of the FBI. The government is being represented in court by Assistant U.S. Attorneys Amarjeet Bhachu and Michael Donovan, and Trial Attorney Ryan Rohlfsen, of the Criminal Division’s Fraud Section.

The Justice Department has worked closely with and has received significant assistance from its law enforcement counterparts in Austria, as well as the Hungarian National Police, and greatly appreciates their assistance in this matter. Significant assistance was also provided by the Criminal Division’s Office of International Affairs.

An indictment contains only charges and is not evidence of guilt. The defendants are presumed innocent and are entitled to a fair trial at which the government has the burden of proof beyond a reasonable doubt.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

శ్రీకెవిపి పై అమెరికన్లు వాడిన పదం: Five other defendants remain at large. ఐదుగురు ప్రతివాదులు అందుబాటులో లేరు (తప్పించుకు తిరుగు తున్నారు అనే అర్ధం స్ఫురిస్తుంది).


శ్రీ కెవిపి ఈ అపవాదం నుండి బయట పడాలంటే నార్తరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ , 219S డియర్ బార్న్ స్ట్రీట్, ఫిప్త్ ఫ్లోర్, చికాగో, ఇల్లినాయిస్ 60604, లో ఉన్న ఫెడరల్ కోర్టులో డిఫెన్స్ లాయర్లను నియమించకుని పోరాడాల్సి ఉంటుంది. ఈలోపలే ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్సు (నిందితులను తమకి విచారణ నిమిత్తం స్వాధీనం చేయమని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అడగటం) ప్రారంభం అవుతుంది. దేవయాని ఖోబ్రగాడే కేసు కన్నా ఈ కేసు జటిలమైనది. సాధారణ పరిస్థితులలో శ్రీ కెవిపికి జైలు అనివార్యం లాగా కనిపిస్తుంది. భారత ప్రభుత్వం , అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బిజెపి ప్రభుత్వం అయినా, తృతీయ ఫ్రంట్ అయినా , శ్రీ కెవిపి ని రక్షించటం కష్టం లాగా కనిపిస్తుంది.

ఇపుడు ఇంతవరకు జరిగింది, ఇండిక్ట్ మెంటు మాత్రమే. అంటే నేరారోపణ మాత్రమే జరిగింది. డిఫెండెంట్లు తమను తాము రక్షించుకునే అవకాశాన్ని ఇస్తారు. రక్షించుకో లేక పోతే 20 ఏళ్ళవరకు జైలు, $2,50,000 డాలర్ల వరకు జరిమాన పడే అవకాశం ఉంది.

దీనిని మనం రెండు కోణాల లోంచి చూడాలి.

1. భారత్ లో జరుగుతున్న అవినీతిని విదేశీయుల నుండి చెప్పించుకోవలసిన స్థితి రావటం దారుణం. ఇప్పటికల్లా భారత్ సిబీఐ విచారణ పూర్తిచేసుకొని, శ్రీకెవిపి పై కేసులు పెట్టి, కోర్టులచేత ఆయన నిర్దోషియా , దోషియా అని నిర్ధారించుకుని ఉండాల్సింది. నిర్దోషి యని కోర్టులు నిర్ధారించి ఉంటే, ఇపుడు భారతప్రభుత్వం శ్రీ కెవిపి కి భారత పౌరుడిగా విదేశీ వేధింపులనుండి కొంత రక్షణ ఇవ్వటానికి ప్రయత్నించటం కుదిరేది.

2. శ్రీ కెవిపి దోషి యని భారతీయ కోర్టులు ఇప్పటికే నిర్ధారించి ఉంటే, మిగిలిన నలుగురు నిందితులను (పైన పేస్టు చేసిన జస్టిస్ డిపార్ట్మెంటు వారి ప్రొసీడింగు ని చూడండి) ఎక్స్ట్రడైట్ చేయమని భారత ప్రభుత్వం అమెరికాను కోరటానికి, రెడ్ ఎలర్ట్ వారంట్లు పంపటానికి వీలయ్యేది.

అమెరికన్ కోర్టులో విచారణయే మేలు అని తలచే వారు కూడ ఉంటారు. శిక్షకూడ కఠినం. భారత్ లో ఇంతవరకు అవినీతికి 20 ఏళ్ళ శిక్ష పడిన వాళ్లు లేరు. కానీ ఒక ముఖ్య సమస్య ఏమిటంటే , భవిష్యత్ లో అమెరికన్ కోర్టులు కేసుల నెపంతో అమాయక భారతీయులను కూడ వేధించవచ్చు.

ఈ అమెరికన్ జస్టిస్ డిపార్టుమెంటు ప్రెస్ రిలీజ్ లో , హంగేరియన్ ప్రభుత్వం వారు అందించిన సహకారం గురించి ప్రస్తావించారు. అమెరికన్ జస్టిస్ డిపార్టుమెంటు గానీ, ఎఫ్ బీ ఐ గాని, భారత ప్రభుత్వ సహకారాన్ని , అర్ధించిందా లేదా, దానికి భారత ప్రభుత్వ స్పందన ఏమిటి తెలుసుకోటం అవసరం.

కెవిపి ఇండిక్ట్ మెంట్ శ్రీ నారా వారికి, శ్రీ నారా లోకేషు గారికి అమితోత్సాహాన్ని ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ట్విట్టర్లో శ్రీ లోకేషు గారి ట్వీట్లు చదివితే వారెంతటి అమందానంద కందళిత హృదయులయ్యారో అర్ధమవుతుంది.

(ఇంకా ఉంది).

Tuesday, April 1, 2014

194 Amir's Mercedez

194 Amir's Mercedez

Topics for discussion: Amir Khan, సినిమాలు, కార్లు, ముఖేష్ అంబానీ, మహాభారతం, ఎర్రన, satyamev jayate, నరేంద్రమోడీ


సత్యమేవజయతే అనేది బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ గారు వారంవారం హోస్ట్ చేసే ఒక టివి కార్యక్రమంట. దేశంలోని సాంఘిక సమస్యలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను చూపిస్తుందట. బాగానే ఉంది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయిట. ఎందుకో ఏమిటో, ఈ దేశంలో అన్నీ విచిత్రాలే.


ఇపుడు ఇంకొక గొప్ప మరొక విచిత్రం జరిగింది. శ్రీ ఆమీర్ ఖాన్ గారు ఆత్మరక్షణ కొరకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక మెర్సిడెజ్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నారుట. ఇలాంటి కార్లు దేశంలో మూడే ఉన్నాయిట.

మొదటిది, దేశ ప్రధాన మంత్రి యైన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు గారి దొడ్లో కట్టేసి ఉంటుందట.

రెండోది వణిక్ సార్వభౌమ శ్రీముఖేష్ అంబానీ గారి చావిట్లో పడి ఉంటుందట.

మూడోదే గొప్ప సంఘసేవకుడైన మన ఆమీర్ ఖాన్ గారు ఊరేగే ఈ దివ్యరధం.

ఈనాటి పద్యం

ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన కవీంద్రుడు. శ్రీమదాంధ్ర మహా భారతం. ఆరణ్యపర్వం. షష్ఠాశ్వాసం, 135 వ పద్యం. అడవుల పాలైన పాండవులను ఓదార్చటానికి, వ్యాసుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజుకి నీతి బోధ చేస్తున్నాడు. ముద్గలుడు అనే ముని కథ్ చెప్పాడు. ముద్గలుడు ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్ధుడైన దుర్వాసుడు, ముద్గలుడికి బొందితో స్వర్గానికి వెళ్ళే వరాన్ని ఇచ్చాడు.

దేవదూత ముద్గలుడిని స్వర్గానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. ముద్గలుడు , ఆదేవదూతలను స్వర్గం ఎలా ఉంటుంది, అక్కడి ప్రత్యేకతలు ఏమిటి అని అడిగాడు. దేవదూత చెప్పిన పలు పద్యాలలో ఇవి కొన్ని.

తేట గీతి.
ఇందుఁ జేసిన పుణ్యంబు లెల్ల నందుఁ
గుడుచుఁ గాని మర్త్యున కందు గడఁగి పుణ్య
మాచరింపంగఁ గాదు పుణ్యావసాన
మగుడు భూమికి త్రోతురు మగుడ నతని.

కంద పద్యం
కడు మరగిన సౌఖ్యంబులు,
విడుచుటఁ జిత్తంబు దుఃఖ వివశముగ మహిం
బడుఁ జూవె పుణ్యలోకం,
బెడలిన మనుజుండు తేజ మేది యబలుడై.

కంద పద్యం

తన తక్కువ యునికియు న
న్యుని యున్నత శీలతయుఁ గనుంగొని చిత్తం
బున నెరియుచునికి గలుగును,
జననుత సురలోకవాస జనులకు నెల్లన్.

వచనం.
బ్రహ్మ లోకంబునం దక్కఁ దక్కిన పుణ్యలోకంబులందెల్ల నిదియ మేరయై చెల్లు. ... ... ...

ఈ వివరాలు ముద్గలుడికి నచ్చలేదు. పుణ్యం క్షీణించగానే క్రిందికి తోసేస్తారు, అనగానే, అది వాంఛనీయం కాదని అర్ధం అయ్యింది. పైగా, పాతపుణ్యాల ఫలాలను అనుభవించటమే కాని, కొత్తపుణ్యాలు చేసుకునే అవకాశం స్వర్గంలో ఉండదుట. (భూలోకంలో ఉంటుంది అని వేరే చెప్పనక్కరలేదు).

ముద్గలుడు, దేవదూతను వెనక్కి పంపించి, ఇంకా ఘోర తపస్సు చేసి, ఇంకా ఉన్నత లోకాలను పొందాడు.


ఆమీర్ ఖాన్ గారి మెర్సెడెజ్ బెంజి బుల్లెట్ ప్రూఫ్ కారు దీని ముందెంత? శ్రీనరేంద్రమోడీగారికి కూడ గుజరాత్ ప్రభుత్వ ఖర్చుతో బుల్లేట్ ప్రూఫ్ సువ్ (sports utility vehicle) అమరింది. శ్రీవారు గోవా వెళ్ళినపుడు భద్రత కొరకు ఈ బుల్లెట్ కారును కూడ తీసుకెళ్ళారు.