Thursday, June 26, 2014

270 What Ms. Sonia Gandhi is doing in Kausani?


270 సోనియా గాంధీ గారు కౌశానీ లో ఏమి చేస్తున్నారు?
270, Uttarakhand, Sonia Gandhi, Uttarakhand, Almora, Swami Vivekananda, Mahatma Gandhi, Sumitranandan Pant,

జవాబు: సేద తీరుతున్నారుట.
ఎన్నికల ప్రచారంలో ఎండలో తిరిగి తిరిగి చేతులు ఊపీ ఊపీ , గొంతు చించుకొనిహామీలు ఇచ్చీ ఇచ్చీ సోనియా గాంధీ గారు అలసి పోయారో ఏమో, కూలింగు సెంటర్ కి వెళ్ళి సేద తీర్చుకుంటున్నారట. ఈ కూలింగ్ సెంటర్ పేరు కౌశానీ.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, బాగేశ్వర్ జిల్లాలో ఉన్నది. హిమాలయ పర్వత శిఖరాలను తనివి తీరా దర్శించటానికి సరియైన ప్రదేశంట. ఆల్మోరాకు 52 కిలోమీటర్ల దూరంలో, ఆల్మోరా బాగేశ్వర్ దీదీహాట్ హైవే పై ఉందిట. ఇక్కడనుండి త్రిశూలి, నందాదేవి, పంచౌలీ, వంటి హిమాలయా శిఖరాలను చూచాయగా దర్శించ వచ్చునట. పైన్ చెట్ల గుబురులు ఎక్కువట (మనకు తాడిచెట్లలాగా అనుకోండి). గాంధీగారు ఈ ప్రదేశాన్ని స్విట్ జర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నారుట. గాంధీగారు ఇక్కడి అనాసక్తి ఆశ్రమం లో బస చేసినపుడు, అనాసక్తి యోగా అనే వ్యాఖ్యానాన్ని కూడ వ్రాసారుట.Kausani

ఆల్మోరా ఉత్తరాఖండ్ లో ఒక జిల్లా కేంద్రం. ఆల్మోరా జిల్లా పరిపాలన వెబ్ సైట్ http://almora.nic.in/pages/view/29/48-kausani-location కి వెళ్ళటానికి క్లిక్

సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్లలో సరియైన సమాచారం ఉండదు. కానీ ఆల్మోరా జిల్లా వెబ్ సైట్ ని ఒక మినహాయింపు అనచ్చు.
The wide expanse of the famous Katyur Valley lies in front of it as you wake up to experience the Kausani sunrise. Kausani's beauty arrested the feet of even Mahatama Gandhi, who stayed for some time at this place. The memory that brief stay of that great man lingers behind in the Anasakti Ashrama. Another great man of India the famous Hindi poet Sumitra Nandan Pant was born here. There is small museum to earmark that sacred spot. The famous folk singer Gopidas was also inspired by the beauty of Kausani. Pinnath (10KMs), Bura Pinnath (5KMs) and Bhakot are the highest points near Kausani.

తెలుగు సారం: విస్తృతమైన కత్యూర్ లోయ, కౌసాని పట్టణం ముందు, సూర్యోదయం కాగానే, మనం నిదుర లేవగానే, మన కళ్ళముందు దర్శన మిస్తుంది. ఇక్కడ కొంత సమయం ఆగిన మహాత్మా గాంధీ గారి పాదాలను కౌసానీ సౌందర్యం కట్టిపడేసిందట. ఆ క్లుప్తమైన విడిది యొక్క జ్ఞాపకం, అనాసక్తి ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భారత్ యొక్క మరొక మహనీయుడు, హిందీ మహాకవి, సుమిత్రానందన్ పంత్ గారు ఇక్కడ జన్మించారుట. ఆ పవిత్ర స్థలాన్ని గుర్తించటానికి ఒక చిన్న మ్యూజియం కూడ ఉన్నది. ప్రఖ్యాత జానపద గాయకుడు గోపీదాస్ జీ , కౌసానీ సౌందర్యంతో ఎంతో ముగ్ధుడు అయ్యారు. పిన్నత్ 10 కిమీ, బూరా పిన్నత్ 5కిమీ, మరియు భకోట్ ఇక్కడి ఉన్నత ప్రదేశాలు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలుశ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమహాత్మాగాంధి గారు విడిది చేశారంటున్న కౌసానీ లోని అనాసక్తి ఆశ్రమాన్ని సందర్శించారో లేదో తెలియదు.
సోనియా మేడమ్ అనే తెలంగాణ మాతకు ఉన్నసేద తీరే హక్కుని మనం తప్పక గౌరవించి తీరవలసినదే. అదే సమయంలో, పాపం గాంధీగారు!! అనాసక్తి ఆశ్రమం యొక్క చరిత్రను గురించి వాకబు చేసి, గాంధీజీ రచించిన అనాసక్తి యోగా గ్రంధం , దీని ఆంగ్ల నామం , Anasakti Yoga, or The Gospel of selfless action చదవాలనే ఆసక్తిని ఆమె చూపి ఉంటే ఎంతో ఆదరణీయంగా ఉంటుంది. ఇది 390 పేజీల గ్రంధం. రాజకీయనేతలు చదువవలసినది. దురదృష్ట వశాత్తు, ఇది కాపీరైట్ లో ఉండి డబ్బు పెట్టి కొనాల్సిందే తప్ప, ఫ్రీ డౌన్ లో డ్ గా లభ్యమవుతున్నట్లు కనిపించదు. దీని యొక్క సంక్షిప్తసారాన్ని ఈ క్రింది వెబ్ సైట్ లో చూడచ్చు. http://www.mkgandhi.org/swmgandhi/chap01.htm సంక్షిప్త సారం చదువటానికి క్లిక్

ఈ సందర్భంగా, మరొక్క విషయం వ్రాయటం తప్పు కాదనుకుంటాను.
తెలంగాణ మాత సోనియా గాంధీ కనీసం, నెలకొక్కరోజైనా తనకొరకు తెలంగాణా లో నిర్మించి దేవాలయాలలోని విగ్రహాలలోకి ప్రవేశించి భక్తుల కోరికలను తీరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా కరీంనగర్ భూత్ పూర్వ్ ఎంపీ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, భూత్ పూర్వ్ ఎం.ఎల్.ఏ. శ్రీ శంకరరావు గారికి, ఏవైనా వరాలను ఇస్తే బాగుంటుంది.ఆల్మోరాలో స్వామీ వివేకానందస్వామీ వివేకానంద గారు కౌసానీ వెళ్ళారో లేదో తెలియదు కానీ, సేవియర్ దంపతులతో ఆల్మోరాలో చాలా కాలం ఉన్నారు. అంతేకాక తన మిత్రురాలైన క్రిస్టీనా గ్రీనై స్టైడల్ గారికి సేవియర్ దంపతుల చేత ఆశ్రయం ఇప్పించారు. స్వామీజీకి ఆల్మోరాలో స్వంత ఇల్లు కొనుక్కోవాలని కోరిక. అది తీరకుండానే కన్ను మూశారు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.