Friday, February 21, 2014

150 soniamma chinnamma jatara

150 Telangana Govt can start Sonamma Chinnamma jAtara తెలంగాణ ప్రభుత్వం సోనమ్మ చిన్నమ్మ జాతర ప్రారంభించు కోవచ్చు.
చర్చనీయాంశాలు: bifurcation, telangana, విభజన, తెలంగాణ, సుష్మా స్వరాజ్, sushma swaraj, sonia gandhi


ఇప్పటికే తెలంగాణవారు ఆరాధనగా సోనియా గాంధీ గారిని తెలంగాణ మాతగా వర్ణించటం మొదలుబెట్టారు. తెలంగాణ తండ్రిగా కెసీఆర్ గారుంటారని వేరే వ్రాయనక్కరలేదు.

సోనియా గాంధీ గారు తెలంగాణ సందర్శించటానికి ఒప్పుకున్నారుట. ఆమె కరీంనగర్ వెళ్ళి అక్కడి ఎంపీ శ్రీపొన్నం ప్రభాకర్ గారు కట్టేగుడిలో నిల్చుని, శిలగా మారిపోతే, విగ్రహం కన్నా ఎంతో వాస్తవికంగా ఉంటుంది. ఆవిగ్రహానికి వరాలు ఇచ్చేశక్తులు కూడ పెరుగుతాయేమో. అదే దేవాలయంలో మరో ప్రక్క శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి విగ్రహాన్ని కూడ ప్రతిష్ఠించుకోవచ్చు. ఒకే ప్రదేశంలో రెండు దేవతలుంటే శక్తి కూడ రెట్టింపవచ్చు.

సోనియా గాంధీ గారు గానీ, రాహుల్ గాంధీ గారు గానీ, సుష్మా స్వరాజ్ గారు గాని సీమాంధ్ర సందర్శించరనుకోండి. లేదనుకుంటే అక్కడ కూడ ఒక గుడిని కట్టవచ్చు. ఎందుకంటే, వారి వల్ల సీమాంధ్ర వారికి నెహ్రూకుటుంబ బానిసత్వ విముక్తి కలిగింది కనుక. అక్కడే
చంద్రబాబు, జగన్ విగ్రహాలను కూడ ప్రతిష్ఠించు కుంటే సరిపోతుంది. ఒకటే కాంప్లెక్స్.

ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు లోక్ సభలో, తెలంగాణ బిల్లును పాస్ చేశాక, చెప్పిన వాక్యాలను చూద్దాం.

"... I know, Congressmen from Telangana region will try to give the entire credit to Sonia-amma....we are not after any credit, but don't forget, I too was like chinn-amma (an aunt) for the entire process, ..."
తెలుగు సారం
''... నాకు తెలుసు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ వాదులు, తెలంగాణ ఇవ్వటంలో మొత్తం ఘనతను సోనియాకు ఆపాదిస్తారు. ... మేము ఏ ఘనత కోసం పాకులాడటం లేదు, కానీ మర్చి పోవద్దు, ఈ మొత్తం జరిగిన ప్రాసెస్ లో నేను కూడ చిన్నమ్మ (ఆంట్) లాంటి దానినే...''

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ, తిలక్, ఆనీ బీసెంట్ లను మరచి పోయిన ఘనచరిత్ర మనకు ఉంది. పాపం చిన్నమ్మ చేసిన కృషిని ఎవరు గుర్తుకు ఉంచుకుంటారు? కొన్ని సార్లు గుళ్ళూ గోపురాలు కూడ పూజా పునస్కారాలు లేకుండా, కనీసం దీపం పెట్టుకునే వారు లేక బిక్కుబిక్కు మంటు ఉంటాయి. నిజంగా సోనియమ్మ, చిన్నమ్మ పేర్లను జ్ఞాపకం పెట్టుకో వాలంటే చక్కటి మార్గం ఉంది.

ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళ కొకసారి జరుగుతూ ఉంటుంది. దీనికి కోటి మంది దాకా జనం వస్తూ ఉంటారు. సమ్మక్క సారక్క జాతర లేని సంవత్సరంలో అదే నెలలో సోనమ్మ చిన్నమ్మ (లేక సోనక్క చిన్నక్క) జాతర జరుపుకోవచ్చు. దీనికి తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ళ కొకసారి ఒక 50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం (కాంగ్రెస్ కి సోనక్క, బిజేపికి చిన్నక్క ముఖ్యం కాబట్టి) 50కోట్లు ఇస్తే బాగుంటుంది.

సీమాంధ్ర ప్రజలు కూడ ఈజాతరకు వెళ్ళ వచ్చు. వారికి కూడ సోనక్క, చిన్నక్కలు గుర్తుంచుకోదగ్గ వ్యక్తులే.

English Gist.
We have a glorious history of foregetting the great leaders like Gandhi, Tilak and Anne Besant, who took us successfully through the freedom struggle. Alas, who will remember the contribution made by Chinnamma (Sushma Swaraj)? Even temples, built ith great expense and fanfare, sometimes end up as dilapidated places without anybody to light a lamp. There is a good solution to remember Soniamma and Chinnamma, for ever.

Sammakka Sarakka jatara, the principal fair of Telangana takes place every two years. Nearly 10 million attend the fair. During the year of no sammakka sarakka jatara, they can introduce a Soniamma Chinnamma jatara (or a Sonakka Chinnakka jatara or a Peddamma Chinnamma jatara), which will be a biennial event. The Telangana Government can allocate Rs. 500 million for that purpose. The Central Government, (often run either by Congress of Soniamma or BJP of Chinnamma) can also allocate another Rs. 500 million towards its share.

People of Seemandhra (residual Andhra Pradesh) can also attend the fair, since Soniamma and Chinnamma are leaders worth remembering.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.