Thursday, November 21, 2013

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

bifurcation, livelihood, విభజన, బ్రతుకుతెరువు

Question: మీవ్రాతలు చూస్తుంటే, మీరు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం లాగ కనిపిస్తుంది. నిజమేనా?నిజం కాదు. ప్రత్యేక తెలంగాణను నిరంకుశ పధ్ధతుల్లో ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అవసరం. వివిధప్రాంతాలవారు, నెలకొకసారి సమావేశమయి కొంత ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, ఒక అవగాహనకు వచ్చాక, అన్ని ప్రాంతాల ప్రజలు ఏర్పాట్లను చర్చించాక, వారే స్నేహపూర్వక విభజనను కోరుకుంటారు. లేదా సమైక్యంగా ఉందామనుకుంటారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ శ్రీ ఆసిఫ్ ఇబ్రహీం , 21-11-2౦1౩ నాడు, ఢిల్లీలో జరిగిన డీజీపీల మూడవ సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారో చూడండి.
“The demand for a separate statehood to Telangana has triggered counter-agitations. The situation emerging on this front is likely to throw up new challenges to the security forces as well as intelligence agencies at both the state and national levels."


కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో, సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని అధికారంలోకి వచ్చింది. 2౦౦4లో ఆమె ఎన్నికల ప్రసంగం.
“Muje Telangana ke jasbath ka yehsahs hai, mein jaanthi hoon jithni tarakki hone chahiye thi, utna nahi hooyi, rojgaar ke jithne mathen milna cayihe the nahi mile,, mein aapp ke jasabaathon ki katthir karthi hoon, aagar iss pradesh mein, aur kendra mein apni sarakari bani,tho hum apki ummedonko poori karneka hur koshish karenge..


ఈ వాగ్దానం ఆమె ఆరునెలలలో పూర్తి చేస్తానందిట. ఆరు నెలల సంగతి మర్చిపోయి 2౦౦4 నుండి 2౦1౩ వరకు సోనియా మాత నిద్రపోయింది. 1999 నుండి 2౦1౩ వరకు బిజెపి నిద్ర పోయింది . కాబట్టి, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ, ఒళ్ళో పెడుదునా దళ్ళో పెడుదునా అన్నట్లుగా బిల్లు, బిల్లు అని ఉరికితే ఎలా? జాతీయ స్థాయిలో పాలించే వాళ్ళకి ముందు చూపు ఉండాలి. విదేశీయురాలైన సోనియాకు పాపం ఈ ముందు చూపు లేదు అనుకున్నా, శ్రీ మన్ మోహన్ సింగుకు, చిదంబరానికి, సుశీల్ కుమార్ షిండేకి ఉండాలి కదా.

తెలంగాణాను ఏర్పరచటానికి ఆమె చేసిన ప్రయత్నం ఏమిటి? ఆమె అన్ని ప్రాంతాలవారినీ 2౦౦4లోనే ఒకచోట సమావేశం చేయించి, ఇరువురికీ ప్యాకేజీలను ఆఫర్ చేసి ఒప్పించి ఉండాల్సింది. గులాబీ కండువా కప్పుకునే ముందు ఆమె సీమాంధ్ర ప్రజలను సంప్రదించిందా? లేదు. తరువాతైనా సంప్రదించిందా? లేదు. తెరాస నేత కెసీఆర్ చేత ఆపార్టీని కాంగ్రెస్ లో ఎలాగైనా విలీనంచేయంచుకోవాలనే యావ తప్ప, కాంగ్రెస్ అధిష్టానానికి వేరొక చోదనం లేదు.

గులాబీ కండువాను కప్పుకోటం ద్వారా సోనియా మాత పులిపై స్వారి మొదలు పెట్టినట్లయ్యింది. కదిలితే తెరాసా నేతలు, టీజాక్ నేతలు మింగటానికి సిధ్ధంగా ఉన్నారు.

ఇప్పుడు కూడ సోనియా మాత సీమాంధ్రలో ఎందుకుపర్యటించలేక పోతున్నది? ఆమెకు అనారోగ్యం అనే కారణం చెల్లదు. ఎందుకంటే,ఆమె కర్నాటక వెళ్ళి కాంగ్రెస్ ను గెలిపించి నందుకు వారికి థాంక్స్ చెప్పింది.

Question ప్రశ్న: మరి సీమాంధ్ర నేతలు ఎందుకు నిద్రపోయారు?

Answer జవాబు:


శ్రీరాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కావాలి. సీమాంధ్రలో కాంగ్రెస్ టిక్కెట్లు పొందిన వారందరు, ఆయన అనుయాయులు కావటం వల్ల అందరూ, టీడీపీని ఓడించి సింహాసనాన్న సాధించుకోవాలనే తపనతో నిద్ర పోయారు.

Question: అయితే మీ వైబీరావు గాడిద అభిప్రాయం ఏమిటి?

Answer: జవాబు


సోనియా స్వార్ధం, వాజ్ పేయి అద్వానీ స్వార్ధం, రాజ్ నాధ్ సింగ్ నరేంద్రమోడీల స్వార్ధం, రాజశేఖర్ స్వార్ధం, కిరణ్ స్వార్ధం, కేసీఆర్ స్వార్ధం,జానా జైపాల్ స్వార్ధం, వంటి వాటికి మనం అలవాటు పడ్డాం.

అయ్యా, ఒక నాస్తికుడిగా, మార్క్సిస్టుగా, నేను శ్రామిక వర్గ పక్షపాతినే కాని కానీ ప్రాంతీయ రాగద్వేషాలతో నాకు సంబంధం లేదు. శ్రామిక వర్గకోణంలోంచి చూసినప్పుడు, పొట్టకోసం వలసపోటం, అనివార్యం. వెళ్ళినచో ట స్వల్పంగా కొన్ని పరిమితులకు లోబడి, చిన్న ఇల్లు, కొద్దిగా పొలం సేకరించుకోవచ్చు. ఇది , దేవుడు ఇచ్చిన అనలేం కానీ, భూగోళంలో మనకు సహజ సిధ్ధంగా లభించే ఒక మానవ హక్కు. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, వంటి దేశాలు, ఈమానవ హక్కుకు భంగం కలిగిస్తున్న విషయం విదితమే. వారి అమానుషత్వాన్ని వ్యతిరేకించ వలసిన బాధ్యత భారతీయులందరిపైనా, ముఖ్యంగా శ్రామికులందరి పైనా ఉంది.

ప్రాంతీయ కుమ్ములాటలతో మనలో మనం తన్నుకుంటుంటే, ఇంక అంతర్జాతీయ మానవ హక్కులను ప్రస్తావించే తీరిక, ఓపిక, కోరిక, మనకు ఎక్కడ ఉంటాయి?

Question: ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పండి.

Answer:జవాబు:


ఆంధ్ర ప్రదేశ్ వైశాల్యం చాలా ఎక్కువ. హైదరాబాదు నుండి విశాఖకు షుమారు 75౦ కిలోమీటర్లు. హైదరాబాదు నుండి రోడ్ ద్వారా అనంతపూర్ కు 476, హిందూపూర్ కు 411 లేక 462 కిలోమీటర్లు. చిత్తూరుకు 572 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు. ఇలాంటి దూరాలను రైల్లో ప్రయాణించినా, బస్సుల్లో ప్రయాణించినా విపరీతమైన ఖర్చు. ప్రాణాలు గాలిలో దీపం. పైగా, ఒకే రోజు హైదరాబాదు వెళ్ళి తిరిగి రాలేరు. హైదరాబాదులో లాడ్జింగ్ ఖర్చులు ఎవరిస్తారు? లేదా బంధువుల నెత్తిన పడాలి. దూరం కోణం నుంచి చూసినా, రాష్ట్రాన్ని 4 లేక 5 చిన్నరాష్ట్రాలను చేయటం అవసరం.


కాబట్టి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాష్ట్రాలు అవసరం.

Question ప్రశ్న: మరి హైదరాబాదు సంగతి ఏమిటి?

Answer, జవాబు:


హైదరాబాదు తెలంగాణా వారిది మాత్రమే అనుకోటం అర్ధం లేదు. శాతవాహన ఆంధ్రులకాలం నుండి, తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉన్నాయి. చాళుక్యుల కాలంలోనూ అంతే. కాకతీయుల కాలంలోనూ అంతే. బహమనీల కాలంలోనూ అంతే. కొంతకాలం గజపతులు గోదావరీ తీరం వరకు ఆక్రమించినా, విజయనగరరాజులు, గోల్కొండ నవాబులు, కోస్తాను, రాయలసీమను తిరిగి ఆక్రమించారు.

బ్రిటీష్ వారికి నిజాం నవాబులు సర్కారులను బ్రిటీష్ వారికి కప్పంగా, ఇచ్చేశాడు. దక్షిణ సర్కారులను వారికి బలవంతంమీద అమ్మివేశాడు. తరువాత, బ్రటీష్ సైన్య పోషణ కొరకు రాయలసీమను దత్తం చేశాడు. అందుకే వీటికి దత్తమండలాలు అనే పేరు వచ్చింది.

బ్రిటీష్ గవర్నర్ మదరాస్ నుండి, దత్తమండలాలను, సర్కారులను పాలించటంతో, సీమాంధ్రులకు మదరాసు ప్రయాణం అవసరం అయ్యింది. కలకత్తా మద్రాస్ రైలు మార్గం ఏర్పడక ముందు అంటే 1905 ముందు విశాఖ నుండి మదరాసు వెళ్ళాలంటే, ఓడలో వెళ్లవలసి వచ్చేది.

హైదరాబాదు నుండి కర్నూలుకు 182 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు కాగా గుంటూరుకు 2 70 లేక 3౦ 2 కిలోమీటర్లు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే , హైదరాబాదుపై ఆప్రక్కనున్న వరంగల్ వారికో,మెదక్ వారికో ప్రత్యేక హక్కులు ఉన్నాయనుకోటం ఒక భ్రమ.

హైదరాబాదులో 1956కు ముందు, వజీర్ సుల్తాన్ వారి చార్ మినార్ సిగరెట్ల ఫ్యాక్టరీ తప్ప పెద్ద పరిశ్రమలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ పెద్దరాష్ట్రంగా అవతరించాక, కేంద్రం మొత్తం 20 జిల్లాల అభివృధ్దిని దృష్టిలో ఉంచుకొని, అఖిలభారత నిధులను వెచ్చించి BHEL, HAL, HMT, BDL, ECIL, HCL, IDPL, DRDL, DLRL, DMRL, MIDHANI, NUCLEAR FUEL COMPLEX, HYDERABAD CENTRAL UNIVERSITY, ICRISAT, ENGLISH & FOREIGN LANGUAGES UNIVERSITY, వంటి పలు సంస్థలను స్థాపించారు తప్ప కేవలం తెలంగాణ 1౦ జిల్లాలనుద్దేశించి స్థాపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ, రాష్ట్రం యొక్క 2౦ జిల్లాల నిధులను వ్యయం చేసి హైదరాబాదును అభివృధ్ధి చేసింది. ఐటీ రంగాన్న అభివృధ్ధి చేసింది. ఆనాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రాంతీయ దృక్పథం ఉండి ఉంటే, విశాఖ, విజయవాడ, కర్నూలు, నగరాల్లో కూడ ఐటీ హైటెక్ సిటీ లను నెలకొల్పి ఉండేవాళ్ళు. ఇప్పడు కెసీఆర్ &కో, కోదండరాం&కో, ఇప్పుడు జైపాల్ రెడ్డి&కో, ప్రతి దాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూడటం గమనార్హం.

2౩ జిల్లాల జనం, 28రాష్ట్రాల జనం ఒకచోట చేరటం వల్ల హైదరాబాదు మార్కెట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రం మొత్తం నుండి వసూలయిన పన్నులను, వ్యాపార సంస్థల, కంపెనీల హైదరాబాదు కార్యాలయాలు, నగరంలో చెల్లించటం వల్ల హైదరాబాదు పన్నుల ఆదాయం విపరీతంగా పెరిగింది. అది మొత్తం 1౦ తెలంగాణ జిల్లాల బలం అనే భ్రమ ఏర్పడింది.

తెలంగాణ నేతలు తమ స్వార్ధం కొరకు, తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్రమైన కోరికను లేవదీశారు. హైదరాబాదునుండి, 1౦ జిల్లాలకు చెందని తెలుగు వాళ్ళను తరిమేస్తే, ఉద్యోగాలన్ని మనవే. డబల్ ప్రమోషన్లు కొట్టేయచ్చు. కెసీఆర్ ఇంక్రిమెంట్లుకూడా వాగ్దానం చేశాడు. ఇళ్ళస్థలాలు, అపార్టమెంట్లు అగ్గువకు కొనేయచ్చు. సాగర్లో, శ్రీశైలంలో, మొత్తం నీళ్ళన్నిటినీ ఆపేయచ్చు. జారాలనుండి, ఆదిలాబాదు వరకు కృష్ణ నీటిని పారించ వచ్చు. కర్నాటక నీటిని వదిలతేకదా, జూరాలకు నీరు వచ్చేది, అనే ప్రాథమిక విషయాన్ని కూడ మర్చి పోయారు. జూరాల్లో నీళ్ళుంటే కదా ఆదిలాబాదుకి వెళ్ళేది.

ఇప్పుడు హైదరాబాదు భారతీయులది అందరిదే తప్ప కేవలం తెలుగు వారిదో, తెలంగాణవారిదో కాదు. పైగా శ్రామిక హక్కుల మానవహక్కు సిధ్ధాంతం సరిగా అమలు కావాలంటే, హైదరాబాదే కాదు, 1౦ లేక 2౦ లక్షలు జనాభా దాటిన ప్రతినగరాన్నీ కేంద్రపాలిత ప్రాంతం చేయటం అవసరం. పాకిస్థాన్ ప్రేరిత తీవ్ర వాదాన్ని అరికట్టాలన్నా, నగరాల కన్నిటికీ కామన్ పోలీస్ వ్యవస్థ అవసరం. అంతేకాదు, 2౦ లక్షల జనాభా దాటిన నగరాల పెరుగుదలను అరికట్టటం కూడ అవసరమే. అంటే అక్కడ 2౦ లక్షల జనాభాకి ఎటువంటి INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలో అన్నే INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలి. ఎక్కువ ఉంటే జనాభ్ పెరిగి నీళ్ళు, డ్రైనేజీ, సమస్యలు వస్తాయి. ఆనగరాల స్థానంలో కొత్త చిన్న నగరాలను అభివృధ్ధి చేసుకోవాలి.

Question ప్రశ్న: ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఎన్నాళ్ళు ఉండాలి?ఎన్నాళ్ళో ఉండనవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర,రాయలసీమలకు అసౌకర్యం. హైదరాబాదు శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు, కావాలనుకుంటే, ఉత్తర దక్షిణ తెలంగాణాలు తమతమ రాజధానులను హైదరాబాదులో ఏర్పరుచుకోవచ్చు.

Question: మరి నదీజలాల సంగతి ఏమిటి?జూరాల్లో కృష్ణానదిలో, శ్రీరాంసాగర్ గోదావరిలో నీళ్ళే లేనప్పుడు పంపకం అనేది ఊహా జనితమైన వివాదం కాబోతున్నది. నదీజలాల విషయంలో, రాయలసీమ, తెలంగాణ, సీమాంధ్రల పరిస్థితి చాలా దీనంగా ఉండబోతున్నది. కాగితం మీద 8౦౦ టీయంసీలు 1౦౦౦ టీయంసీలు వంటి లెక్కలు ఉన్నా వాస్తవ జలాలు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు దాటి దిగువకు రావు. రెండు నదులు వరదల సమయంలో మురుగు కాలువలు గా వాడపడతాయి.

Question ప్రశ్న: మరి ఏమిటి దిక్కు?బంగాళాఖాతంలోని సముద్ర జలాలను శుధ్ధి చేసి, సాగు, తాగు నీటి అవసరాలను కోస్తాజిల్లాలు తీర్చుకోవాలి. అంతేకా దు, ఎగువన తెలంగాణాకు, రాయలసీమకు సప్లయి చేయాలి.

Question ప్రశ్న: మరి బొగ్గు, ఇనుము, సున్నపురాయి సంగతి ఏమిటిఇవి శాశ్వత వనరులు కావు. వాడేస్తే వట్టి పోతాయి. గుంటలు మిగులుతాయి. సూర్య శక్తి తప్పమార్గం లేదు. మనకు భూమి కరువు కాబట్టి బంగాళాఖాతంలో కి రోడ్లను,తేలే ప్లాట్ ఫారాలను నిర్మించుకొని, సూర్యశక్తి స్టేషన్లను అభివృధ్ధి చేసుకోవాలి. దురదృష్ట వశాత్తు ఈదౌర్భాగ్య ప్రభుత్వం మంగళ్ యాన్ మీద వేలకోట్లు తగలేస్తున్నది తప్ప సూర్యశక్తి, సముద్రజలాల శుధ్ది విషయం పట్టించుకోవటంలేదు.

చిన్న రాష్ట్రాలను సమర్ధించటం అనేది అఖిల భారత అవసరం.

ఇంకా సుదీర్ఘంగా వ్రాయవలసి ఉంది. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.