Monday, March 3, 2014

164 KCR cheated dalits and coronated his own Son as Prince कॆसीअर दलितों को धोका दिया और अपने बेटे को युवराजा बन दिया కెసీఆర్ దళితులకు చేయిచ్చి తన కొడుకుకే పట్టాభిషేకం చేసుకున్నాడు

164 IS EVERYTHING A DELUSION? అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
చర్చనీయాంశాలు: పవన్ కల్యాణ్,కెసిఆర్,సోనియా గాంధీ,కాంగ్రెస్,తెరాస,చంద్రబాబు


శ్రీపవన్ కల్యాణ్ గారు రాజకీయాలలోకి వస్తారట. కిరణ్ వెనుకాడుతున్నందు వల్ల శ్రీపవన్ కల్యాణ్ గారు రాజకీయాల్లోకి దూకే అవకాశం ఉందిట.

పాతనీరు పోయి కొత్తనీరు రావటంగా మనం భావించి స్వాగతం చెప్పటమే మేలు. కొత్తనీరు పాతనీరు కన్నా మురికిగా ఉండకూడదనేమీ లేదు. అయినా కూడ మార్పు ఎల్లపుడూ అభిలషణీయమే.

ఆక్రోశించి ఫలితమేమి?


శ్రీచంద్రబాబు నాయుడు గారు కెసీఆర్ తన దగ్గర పాఠాలు నేర్చుకొని తనకే పంగనామాలు పెట్టాడని కెసీఆర్ పై ఆక్రోసిస్తున్నారు. మరి తానిచ్చిన ట్రెయినింగు ఎలాంటిది? ఇద్దరూ కలిసి ఎన్ టీ ఆర్ కి వెన్నుపోటు పొడవలేదా?

కెసిఆర్ దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా? Won't KCR allow a dalit to become the first Chief Minister of TelangaNa?


సోపన్ జోషి గారి చిత్రం తెహల్కా.కామ్ వారి దయతో.

15.1.2011 నాడు శ్రీ కె చంద్రశేఖర రావు గారు శ్రీ సొపన్ జోషి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏమన్నారో చూడండి.

Are you doing all this to become the CM of the new state? ఇదంతా మీరు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని చేస్తున్నారా?

This is rubbish. I’ve said it not less than a thousand times that the first Telangana CM will be a Dalit. We have not zeroed in on a name right now, but there are so many leaders. When the occasion comes, we will evolve a consensus on a Dalit CM. The Telangana society is in such a mood that nobody can rule here unless they bring us statehood. It is ultimately a political decision. Let wisdom prevail on the Prime Minister and Sonia Gandhi that they deliver on the promise they made to the people of Telangana.

తెలుగు సారం: ఇది చెత్త. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ఉంటాడని నేను వేయి సార్లకు తక్కువ కాకుండా చెప్పాను. ఇప్పటికిప్పుడు మేము పేరును నిర్ణయించుకునే దశకు రాలేదు. ఆ సమయం వచ్చినపుడు దళిత ముఖ్యమంత్రిపై మేము ఏకాభిప్రాయాన్ని సాధిస్తాము. తెలంగాణ సమాజం ఈరోజు ఏస్థితిలో ఉందంటే, తెలంగాణకి రాష్ట్రాన్ని సాధించకుండా ఇక్కడ పాలన చేయలేని మూడ్ లో ఉన్నది. అది చివరికి ఒక రాజకీయ నిర్ణయము. తాము తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే వివేకం ప్రధానమంత్రి మరియు సోనియా గాంధీలో ఉదయించు గాక.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించటానికి కూడ వెనుకాడకుండా ప్రధానమంత్రి, సోనియా గాంధీ, తాము అన్నమాటలను నెరవేర్చారు కదా. మరి కెసీఆర్ గారు తాను వేయి సార్లకు తక్కువగా కాకుండా అన్నమాటలను నెరవేర్చరా?

కాంగ్రెస్ లో విలీనానికి తెరాస నిరాకరణ


ఊహించినదే. కెసీఆర్ చంద్రబాబు పాఠశాలలో చదివాడు కదా. అందుకని వెన్నుపోట్లు తప్పవు.

శ్రీమతి సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లు కలిసి పాడుకోవాల్సిన ఈనాటి పాటదేవదాసు నుండి. శ్రీ సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం. సముద్రాల రచన. గానం: కె.రాణి.
ప్రస్తుత పరిస్థితి కనుగుణంగా మార్చి.

అంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా
ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...
మరల అంతా భ్రాంతి||

చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
మరల.
తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
మరల.
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా.. నా ఆశే దోచినదా ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మరల.
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
మరల.
వంతలపాలై చింతిలుటే మా వంతా తెరాసా.. మా వంతా తెరాసా..

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.