Sunday, March 2, 2014

163 Paramahamsa

163 Where were these paramahamsas from? ఈ పరమహంసలు ఎక్కడ నుండి వచ్చారు?
చర్చనీయాంశాలు: స్వామి వివేకానంద,బెల్గాం,గుట్ఖా,పరమహంస

ప్రార్ధన, వివరణలు, స్పష్టీకరణలు


మనోభావాలు గాయపడే స్వభావం గలవారు ఈబ్లాగులను చదువవలదని ప్రార్ధన. బ్యాక్ బటన్ గానీ ఎక్స్ బటన్ గానీ క్లిక్ చేస్తే పరస్పర సహనం చూపించిన వారమవుతాము.

మీరు క్రైస్తవ మిషనరీయా?


నేను క్రైస్తవ మిషనరీని కానీ, ఇస్లామిక్ క్లరిక్ ని గానీ ఇంకేదైనా మత ప్రచారకుడినీ కాదు.

మీరు మత మార్పిడీ లను వ్యతిరేకిస్తారా లేదా స్పష్టంగా చెప్పండి.


ప్రతి వ్యక్తికీ తమ మతం మార్చుకునే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది. అయితే నేడు ఈహక్కు దుర్వినియోగం అవుతున్నది. మతమార్పిడుల కొరకు విదేశీ డబ్బు భారత్ లోకి విచ్చలవిడిగా ప్రవేశిస్తున్నది. మత ప్రచారకులు విదేశీ డబ్బు కొరకు కక్కూర్తి పడే వ్యాపారులుగా మారారు.

మతం మారేవాడు తానున్న మత సిధ్ధాంతాలను, ఆచరణలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలి. చేరబోయే కొత్తమతం యొక్క సిధ్ధాంతాలను, క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలి. ప్రస్తుతం మతం మార్చేవారికీ, మతం మారే వారికీ కూడ ఈ శక్తి లేదు. డబ్బును ఆశ చూపటమో, మేము ప్రార్ధన చేస్తాం మీకు వ్యాధులు తగ్గుతాయి, మీకు మంచి జరుగుతుంది, అనే తప్పుడు వాగ్దానాలతో మతమార్పిడులు జరుగుతున్నాయి.

మతం మారాలనుకునే వారికి జిల్లా స్థాయిలో ఒక కోర్టుని ఏర్పాటు చేయాలి. అభ్యర్ధులకు వివిధ మతాల సిధ్ధాంతాలపై వ్రాత పరీక్షలను నిర్ణయించాలి. కోర్టులోని జడ్జీ, కోర్టు నియమించిన వివిధ మతాల న్యాయవాదులు, అభ్యర్ధి మతం మారటానికి గల కారణాలపై సంతృప్తిని చెందాలి. అపుడు అతడి మతాన్ని మారుస్తూ కోర్టు డిక్రీ జారీచేయాలి. ఇటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి. తండ్రి, తల్లి, ఇరువురిలో ఒక్కరైనా, ఇద్దరైనా మతం మారినపుడు దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలకు రావలసిన రిజర్వేషన్ హక్కులు రాకపోవచ్చు.

మీరు డబ్బుకోసం వ్రాస్తున్నారా?


డబ్బు కోసం వ్రాయాలంటే ఇటువంటి బ్లాగులు పనికి రావు. ఈబ్లాగుకి ప్రస్తుతం రోజుకి ౩౦ సందర్శనాలు వస్తున్నాయి. అదే ఇదే తెలుగులో రెండు ఫొటోలు తగిలించి స్వలింగ సంపర్కం గురించి వర్ణనలతో ఒక కథను (బహుశా వాస్తవానుభవం కావచ్చు) బ్లాగ్ గా వ్రాస్తే రోజుకి 6000 సందర్శనాలు వస్తాయి. సాధారణంగా ప్రతి వేయి సందర్శనాలకు ఒక క్లిక్ రావచ్చు అని అధ్యయనాలు చెప్తున్నాయి. క్లిక్ కి రూ. 10 గూగిల్ వారు చెల్లిస్తారనుకుంటే రోజుకి 60 రూపాయలు వస్తే గగనం. అందుచేత బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించటం టక్కుటమార విద్యలను ఉపయోగించని సాధారణ బ్లాగులకి కుదరదు.

మరి ఎందుకు వ్రాస్తున్నారు?


వ్రాయటం అనేది ఒక దురద.

సమాజం దయ వల్ల (దేవుడి దయ కాదు) నాకు తిండి, గుడ్డ, నివాసం, సమకూరాయి. ధరలు అతిగా పెరిగితే తప్ప బ్రతుకు తెరువుకై ఆందోళన పడవలసిన అవసరం లేదు.

వృధ్ధుడనే నయినప్పటికి పూర్తిగా మూలపడలేదు. సమాజం తిండి తింటూ, సోమరిగా కూర్చోటం, సమాజానికి భారం కావటం న్యాయం కాదు అనే దృష్టితోనే ఈవ్యాసాలను వ్రాస్తున్నాను. నేను అనుభవిస్తున్న తిండి, గుడ్డ, నివాసం భద్రత సమాజంలో అందరికీ అందాలనే తపన ఈబ్లాగులకు ట్రిగ్గర్ గా పనిచేస్తున్నది.

మార్క్సిజాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు?


మనది అధిక 120 కోట్ల జనాభా గల దేశం, వనరుల కొరత ఉండటాన అందరికి అన్నీ అందుబాటులోకి రావాలంటే పెట్టుబడిదారీ విధానం పనికి రాదనేది నిశ్చయం. రష్యా, చైనా వంటి దేశాలలో కమ్యూనిజం పేరుతో ఆచరించబడిన నియంతృత్వ విధానం విఫలమైనా, భారతదేశంలో ప్రస్తుత కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమైనా, ఈదేశానికి ప్రజాస్వామ్య మార్క్సిజమే దిక్కు అనే అభిప్రాయం నాకు కలిగింది. మార్క్సిజంను ప్రజలు బ్యాలెట్ సాక్షిగా ఆమోదించాలంటే వారు దానిని సైధ్ధాంతికంగా అర్ధం చేసుకోవాలి. మార్క్సిజాన్ని ప్రవేశ పెట్టాక రాబోయే సమస్యలపై కూడ క్షుణ్ణంగా చర్చలు జరిగి పరిష్కార పథకాలను, వ్యవస్థలను సిధ్ధంగా చేసుకోవాలి. ఇది హడావుడిగా ప్రజలపై రుద్దేది కాదు.

మీరు రాజకీయాలలోకి ప్రవేశిస్తారా?


నా కలాటి కోరికలేమీ లేవు. ప్రస్తుతం రాజకీయపార్టీలు నడవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేని రాజకీయ పార్టీల స్థాపనావసరం ఉంది. దీనికి ఖర్చులు తగ్గించుకోటం కీలకం.

స్వామి వివేకానంద గారిపై మీరు శతృత్వం వహించినట్లుగా విమర్శలు వ్రాస్తున్నారు
మొదట్లో మీవలెనే నేను కూడ స్వామీ వివేకానందా గారి అభిమానినే. ఆయన సంపూర్ణ రచనలను ఆమూలాగ్రంగా చదివాక నాకళ్ళు తెరుచుకున్నాయి.

వివేకానంద గారి పాన్ గుట్ఖా అలవాటును, మాంసాహారాన్ని విమర్శించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటంగా భావించరాదు. అసలు స్వామీజీయే ఒకసారి నేను హిందువులకు మాత్రమే చెందను, అఖిల ప్రపంచానికి చెందిన వాడిని అని చెప్పుకున్నారు. ఆయన దృష్టిలో భారత్ ఒక కుళ్ళిన శవం. అమెరికా ఒక బంగారు కలల దేశం. ఆయన ఆశించిన స్థాయిలో డాలర్లు రాలేదు కాబట్టి ఆకలల గాలి మేడ కూలింది. స్వామీజీ భారత్ కి వెనక్కు వచ్చి రాత్రి చీకట్లో మూసిన గేటు దూకి బేలూరి మఠంలోకి ప్రవేశించి బజ్జుకున్నారు. ఈవైఫల్యాల నిరాశకు తోడు, ఆహార విహారాదులలో నియంత్రణ లేకపోవటం వల్ల, యోగా తో 150 సంవత్సరాలు బ్రతకచ్చని ఆయన యూరప్ లో ప్రచారం చేసినప్పటికీ, రకరకాల వ్యాధులతో ఆయన 39 ఏళ్ళకే కన్ను మూశారు.

ఈ పర్టిక్యులర్ బ్లాగ్ పోస్ట్ యొక్క సరిహద్దు (స్కోప్) : పరమహంసలు ఎలా ఉండాలి. తనను తాను పరమహంసగా, తమ గురువు శ్రీరామకృష్ణుడిని రామకృష్ పరమహంస గా చెప్పకున్న స్వామీజీ ఎంతవరకు ఈ పరమ హంస నియమాలను పాటించారు?


జి.ఎస్. భాటే గారు, బెల్గాం మహారాష్ట్రలో, స్వామీ వివేకానంద గారికి ఆతిథ్యం ఇచ్చారు. ఇవి శ్రీ భాటే గారి జ్ఞాపకాలలోవి. వివేకానంద గారి ప్రబుధ్ధభారత 1923 సంచికలో ప్రచురితం.
...There was really nothing very wrong in a Sannyasin wanting pan and supari (betel-nut) or tobacco for chewing, but the explanation he gave of his craving disarmed us completely. He said that he was a gay young man and a distinguished graduate of the Calcutta University and that his life before he met Shri Ramakrishna Paramahamsa was entirely different to what he became afterwards. As a result of teachings of Shri Ramakrishna Paramahamsa he had changed his life and outlook, but some of these things he found it impossible to get rid of, and he let them remain as being of no very great consequence. As regards food, when he was asked whether he was a vegetarian or a meat-eater, he said that as a man belonging not the ordinary order of Sannyasins but to the order of the Paramahamsas, he had no option in the matter. The Paramahamsa, by the rules of that order, was bound to eat whatever was offered, and in cases where nothing could be offered he had to go without food. ...

తెలుగు సారం: ...ఒక సన్యాసి పాన్ నమలటంలో కానీ, పొగాకు నమలటంలో కానీ నిజంగా తప్పేమీ లేదు. ఆయన తనకు ఉన్న క్రేవింగ్ (పాన్, పొగాకు నమలాలనే అదుపు లేని వాంఛ)కు ఆయన (స్వామీ వివేకానంద) ఇచ్చిన వివరణ మమ్ములను నిరాయుధులను చేసింది. ఆయన తాను ఉత్సాహవంతుడైన యువకుడనని చెప్పుకున్నాడు. తాను కలకత్తా విశ్వవిద్యాలయంనుండి డిస్టింగ్విష్డ్ గ్రాడ్యుయేట్ (డిస్టింగ్విష్డ్ కి సాధారణ అర్ధం ఇతరులకన్నా భిన్నమైన. డిగ్రీ కోణంలోంచి చూస్తే మెరిట్ కలిగిన అనే అర్ధం తీసుకోవాల్సి వస్తుంది). తాను శ్రీరామకృష్ణ పరమహంసను కలవకముందు తన జీవితానికి, తరువాత మారిన జీవితానికి బాగా తేడా ఉందని చెప్పారు. రామకృష్ణ పరమహంస గారిని కలిసాక తనజీవితాన్ని, తన దృక్పథాన్నిమార్చుకున్నానని చెప్పారు. అయితే ఇలాంటి కొన్ని విషయాలను వదిలించుకోలేక పోయాడుట. అవి అంత ముఖ్యమైనవి కావులే అని ఉండనిచ్చాడుట.

ఆహారం గురించి : ఆయనను అడిగినపుడు తాము పరమహంస సన్యాసుల తరగతికి చెందిన వారమని, పరమహంస తరగతికి చెందిన వారు, పరమహంస నియమాల ప్రకారం ఏది లభిస్తే అది తినాలని, దానిలో ఎంపిక (ఆప్షన్) లేదని చెప్పారు. ఏదీ లభించకపోతే నిరాహారిగా ఉండాలిట.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


మన యువతకి స్వామి వివేకానందా గారు పొగాకు నములుతారని (గుట్ఖా అనచ్చా) తెలీదు. తెలిసినా మన యువత స్థాయి ఎలా తయారయిందంటే, స్వామీజీకి అలాంటి అలవాట్లు ఉంటే, వారు స్వాగతించే స్థాయికి చేరుకున్నారు. ఎందుకంటే స్వామీజీయే పొగాకు మానటం అంత ముఖ్యం కాదని (not of great consequence) చెప్పారు కాబట్టి, తాము (యువకులు) కూడ తమకున్న అలవాట్లను మాననక్కర లేదని హాయిగా తీర్మానించుకోవచ్చు. ఉభయతారకం.

సన్యాసుల మాంసాహారం గురించి: స్వామీ వివేకానంద గారు కాలిఫోర్నియా, అమెరికాలో ప్రసంగిస్తూ తాము తమ సన్యాసంలో భాగంగా భిక్షకు వెళ్ళినపుడు భారత్ లో ఇల్లాళ్ళు, రాళ్ళులాగా మారిన చద్ది చపాతీలు పెట్టారని చెప్పుకొని అమెరికన్ల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. భారత్ లో మాంసం, చేపలు ధరలు చాల ఎక్కువ. పేదలు రోజూ మాంసం, చికెన్, చేపలు తినటం అనేది దాదాపు అసంభవం. ఇంట్లో వండుకునేది ఇంటాయనకు, ఇల్లాలికి, ఇంటాయన తల్లిదండ్రులకు, పిల్లలకే చాలదు. ఇంటి ముందుకు వచ్చిన సన్యాసికి వాటిని వడ్డించటం అసాధ్యం. చద్ది చపాతీలకే కరువు. స్వామీజీ మహాభారతం అశ్వమేథ పర్వంలో ధర్మరాజు గారి హోమగుండం బూడిదలో దొర్లాడిన పక్షి కథ చదివి ఉండాల్సింది.

చద్ది చపాతీలకు విసుగుబుట్టి కాబోలు, స్వామీజీ సంస్థానాల చుట్టూ, సేఠ్ల చుట్టూ తిరగటం మొదలు పెట్టినట్లున్నారు. సంస్థానాధీశులకి, ఘరానా ధనవంతుల ఇళ్ళల్లోకి అతిథిగా మారి, ఇంగ్లీషులో మాట్లాడుతూ కోల్ కత్తా విశ్వవిద్యాలయం డిస్టింగ్విష్డ్ గ్రాడ్యుయేట్ గా తనను తాను చెప్పుకుంటూ తన మాంస భుక్ క్రేవింగ్ ను వదలకుండా పరమహంస నని చెప్పుకుంటూ తిరిగినట్లుగా, అనిపిస్తుంది. దక్షిణ భారత్ లో శంకర మఠం వంటి ధనిక మఠాల వారు మాంసం, చేపలు తినరు. నదుల ఒడ్డున కనిపించే బైరాగి సన్యాసులు (MENDICANTS) భిక్షుక జీవనం గడుపుతారు కాబట్టి వారికి లభించే కొద్ది అన్నం ప్రసాదంతో, దైవంతో సమానం. ఎప్పుడైనా ఇల్లాళ్ళు మాంసాన్నో, చేపలనో వేస్తే వేయచ్చు. అడిగి వేయించుకోటం అనేది అసాధ్యం.

స్వామీజీ భావనగర్ సంస్థానాన్ని సందర్శించి అక్కడ ఆతిథ్యం పొంది, వారి నుండి పరిచయ పత్రాన్ని పొంది, అక్కడనుండి, మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానాన్ని సందర్శించి, అక్కడ కూడ ఆతిథ్యాన్ని పొంది, వారినుండి పరిచయ లేఖను తీసుకొని బెల్గాం చేరుకున్నట్లు కనిపిస్తుంది. భావనగర్ కి కొల్హాపూర్ కి మధ్యలో ముంబాయిలో ఒక ధనిక సేఠ్ గారి ఆతిథ్యం పొందారు.

మనస్వామీజీ మాంసం, చేపలు దొరకక పోతే విలవిల లాడిపోతారు. ఈవిషయం స్వామీజీ తిరువాన్కూర్ సంస్థానంలో అతిథిగా ఉన్నప్పుడు కూడ ఋజువయ్యింది.

బెల్గాంలో స్వామీజీ నములుడు పొగాకు కాక చుట్టలు అడిగారో లేదో తెలియదు. అవిలేనిదే, స్వామీ వివేకానంద గారిని ఊహించలేము.

పరమ హంస అనేవాడు ఎలా ఉండాలి?


http://www.yogamag.net/archives/1993/esep93/param.shtml కి వెళ్ళటానికి క్లిక్ చేయండి. గమనిక: ఈ లింకును ఇస్తున్నాను కాబట్టి, వారు అందులో వ్రాసిన విషయాలను అన్నిటినీ సమర్ధించినట్లు కాదు. సత్యశోథన మనవిధి.

శుక్ల యజుర్వేదంలో పరమ హంసో పనిషత్ నాలుగవ ఉపనిషత్ గా ఉన్నది. ఇందులో నాలుగే శ్లోకాలు ఉన్నాయి. వీటి ఆంగ్లానువాదం మనకి నెట్ లో లభిస్తున్నది. ఒరిజినల్ సంస్కృత శ్లోకాలు నాకు పూర్తిగా అర్ధం కాలేదు. అందుకని ఇక్కడ టైప్ చేయటం లేదు. నారదుడు బ్రహ్మని పరమహంస లక్షణాలు ఏమిటని అడుగగా బ్రహ్మ ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న వివరణ ఇది. ఈనాలుగిటి సారం ఒకటే. పరమహంస అనేవాడు ఎలా ఉండాలి.

శ్రీరామకృష్ణ పరమహంస గారికి పరమహంస అనే తోకనామం (చివరి పేరు) ఎవరు ఇచ్చారో తెలియదు. గురువు తోతాపురి గానీ, తాంత్రిక గురువు బైరాగి బ్రహ్మణి గాని ఇచ్చినట్లు కనిపించదు. వారెవరూ పరమహంస అనే తోక టైటిల్ ను ఉపయోగించుకున్నట్లు కనిపించదు. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడ ఈ టైటిల్ ను స్వయంగా వినియోగించు కున్నట్లు కనిపించదు. వివేకానందుడు, శ్రీరామకృష్ణ పరమహంస పై గ్రంథాలను రచించిన శ్రీ మహేంద్రనాథ దత్త కలిసి ఈ పరమహంస టైటిల్ ను శ్రీరామకృష్ణుడికి తగిలించినట్లు కనిపిస్తుంది.

1892 నాటి శ్రీవివేకానంద గారు తన అఖిల భారత టూర్ లో తనను తాను పరమంసగా చెప్పుకుంటూ, తన మాంసాహార సేవనాన్ని సమర్ధించుకున్నట్లు కనిపిస్తుంది.

అమెరికా వెళ్ళాక కూడ కొంత కాలం వివేకానంద ఈ పరమహంస తోకటైటిల్ ను వీలుచిక్కినప్పుడు వాడాలని ప్రయత్నించి, అక్కడి వారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పుకోలేక తదనంతర కాలంలో వదిలేసినట్లు కనిపిస్తుంది.


ఇపుడు ఈ బొమ్మలను చూడండి. ఇవి స్వామీజీ నిలువెత్తు సైజు విగ్రహాలు. బెల్గాంలోని ఒక సంస్థవారు భారత్ లోని కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో, ఒక 1500 విగ్రహాలదాకా స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఒక్కో విగ్రహం ఎంతవుతుందో ఏమో. చందాలు ఇవ్వటానికి రియల్ ఎస్టేట్ల వ్యాపారులు, బిల్డర్లు, ఉంటారనుకోండి.

బొమ్మల్లో స్వామీజీ ధ్యానమగ్నులై ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నారు కదా. పొట్టలో మాంసం, నాలుకపైన పొగాకు ఘుమఘుమ లాడించకపోతే ధ్యానం మూలాధార చక్రంనుండి సహస్రారానికి అంటదు. కుండలిని ఓపెన్ కాదేమో.

ఈనాటి పాట


చిత్రం: Ramudu Bheemudu రాముడూ భీముడు

రచన: Kosaraju కొసరాజు.

rElangi రేలంగి
Sarada sarada cigarettu సరదా సరదా సిగరెట్టు
Idi doral tAgu bal cigarettu ఇది దొరలు తాగు బల్ సిగరెట్టు (మరల).

Pattubatti oka dammu laagithe పట్టుబట్టి ఒక దమ్ములాగితే
Swarganike idi tolimettu స్వర్గానికే ఇది తొలి మెట్టు (మరల సరదా సరదా)

girija గిరిజ
Kampugottu ee cigarettu కంపు గొట్టు ఈ సిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ
Kampugottu I cigarettu కంపుగొట్టు ఈసిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ

Kadupu ninduna kaalu ninduna కడుపు నిండునా కాలు నిండునా
Vadilipettavoy nee pattu వదిలిపెట్టవు నీ పట్టూ
మరల (కంపు గొట్టు|| దీన్ని కాల్చకోయి||)

rElangi రేలంగి
Ee cigarettuto aanjaneyudu ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు
Lankaa dahanam chesadu లంకాదహనం చేశాడు

girija గిరిజ
Evado kothalu kosadu ఎవడో కోతలు కోశాడూ

rElangi రేలంగి
Ee pogathoti guppu guppuna ఈపొగ తోటి గుప్పు గుప్పునా
Meghaalu srushtinchavacchu మేఘాలు సృష్టించవచ్చు

girija గిరిజ
Meesalu kaalchukovacchu మీసాలు కాల్చుకోవచ్చు

rElangi రేలంగి
Sarada sarada cigarettu సరదా సరదా సిగరెట్టూ
Idi doral tAgu bal cigarettu ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

girija గిరిజ
Upirithitthula cancer kidiye ఊపిరి తిత్తుల కాన్సర్ కిదియే
Karanam annaru doctorlu కారణ మన్నారు డాక్టర్లు

rElangi రేలంగి Kaadannarule pedda actrlu కాదన్నారులే పెద్ద యాక్టర్లు

girija గిరిజ
Pasaru perukoni పసరు పేరుకొని
Kaphamu cherukoni కఫము చేరుకొని
Usuru deeyu pommannaru ఉసురు తీయు పొమ్మన్నారు

rElangi రేలంగి
Daddammalu adi vinnaru దద్దమ్మలు అది విన్నారు

girija గిరిజ
Kampugottu I cigarettu కంపుగొట్టు ఈసిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ

rElangi రేలంగి
Pakkanunnavallu ee suvasanaku mukkulu egarestharu పక్కనున్నవాళ్ళు ఈ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు
Neeverugavu deeni husharu నీవెరుగవు దీని హుషారూ

girija గిరిజ
Abbo theaterlalo poga taagadame nishedhincharanduke అబ్బో థియేటర్లలో పొగ తాగడమే నిషేధించారందుకే

rElangi రేలంగి Collectionlu levandhuke కలెక్షన్లు లేవందుకే. Sarada sarada cigarettu సరదా సరదా సిగరెట్టు||

girija గిరిజ
Kampugottu I cigarettu కంపుగొట్టు ఈసిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ

rElangi రేలంగి
Kavithvaniki cigarettu కవిత్వానికి సిగరెట్టూ Kasike idi thobuttu కాశికే ఇది తోబుట్టూ

girija గిరిజ
Paithyaniki cigarettu పైత్యానికి సిగరెట్టూ
Badaayi kinda jama kattu బడాయి కింద జమకట్టూ

rElangi రేలంగి
Anandaniki cigarettu ఆనందానికి సిగరెట్టూ
Alochanalanu jilakottu ఆలోచనలకు జిలకొట్టూ

girija గిరిజ
Panilekunte cigarettu పనిలేకుంటే సిగరెట్టూ

Tini kurchunte poga battu తిని కూర్చుంటే పొగబట్టు

rElangi రేలంగి
Ravvalu raalche rockettu రవ్వలు రాల్చే రాకెట్టూ
Rangurangula packettu రంగు రంగుల ప్యాకెట్టూ

girija గిరిజ
Kampugottu I cigarettu కంపుగొట్టు ఈసిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ

rElangi రేలంగి
Sarada sarada cigarettu సరదా సరదా సిగరెట్టూ
Idi doral tAgu bal cigarettu ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

girija గిరిజ
Kampugottu I cigarettu కంపుగొట్టు ఈసిగరెట్టూ
DInni kalchakoyi naa pai ottu దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ

ముగింపు


స్వామి వివేకానంద గారికి మరణించేనాటికి ఒక పాతిక దాకా వ్యాధులు ఉండేవి. వాటిలో ఎన్ని పాన్ బీడాల వలన, పొగాకు నమలటం వల్ల, చుట్టలు కాల్చటం వల్ల, వచ్చాయో తెలీదు. డయాబెటిస్ (మధుమేహం) తనకు వంశ పారంపర్యంగా వచ్చిందని వివేకానంద పరమహంస చెప్పుకున్నారు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.