Monday, March 3, 2014

165 Rashtrapati

165 Do we need a President? మనకొక రాష్ట్రపతి అవసరమా?
చర్చనీయాంశాలు: రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభ, ప్రధాని, సుప్రీం కోర్టు
ఈ భవనాన్ని చూడండి. ఇది రాష్ట్రపతి భవన్. ప్రపంచంలోని రాజ్యాధిపతులు నివసించే భవనాలన్నిటిలో కన్నా, మన నిరుపేద భారతదేశాధిపతి రాష్ట్రపతి భవనమే అతి పెద్దదిట. అంటే దీనికన్నా అమెరికా అధ్యక్షుడి వైట్ హౌస్, రష్యా అధ్యక్షుడి క్రెమ్లిన్, ఇంగ్లీష్ రాణి బకింగ్ హామ్ ప్యాలెస్ అన్నీ దీని గ్రాండ్ యూర్ ముందు దిగదుడుపే.

సర్వే లన్నీ ఎన్ డీ ఏ అధికారం లోకి వస్తుందని చెప్తున్నా, ఆం ఆద్మీ బలం పుంజుకొని కేజ్రీవాల్ గారు అంటున్నట్లుగా 1౦౦ సీట్లు కాకపోయినా 7౦ సీట్లు సాధిస్తే హంగ్ పార్లమెంటు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

హంగ్ లోక్ సభ వస్తే రాష్ట్రపతి పాత్ర కీలకం కాబోతుంది. కొత్త లోక్ సభలో అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించటం సాంప్రదాయమే అయినా,
శ్రీప్రణబ్ ముఖర్జీగారు రాహుల్ గాంధీని గానీ, లేక యూపీఏ-౩ నేత ఎవరైతే వారిని గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించరని ఏమీలేదు.

బ్రిటీష్ వాళ్ళని కాపీ చేయటం వల్ల కష్టాలు
ఇటువంటి పక్షపాత పూరిత పరస్థితులు తలఎత్తటానికి కారణం, మనం బ్రిటీష్ ఆచారాలను పాటించటమే. బ్రిటీష్ రాణి ఎన్నిక కాదు.
వంశ పారంపర్య పాలకగత్తె. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి కన్నా విస్త్రత నియోజకవర్గం చేత ఎన్నుకోబడిన వాడు. రాష్ట్రాల శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అంతా కలసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ వోట్ అనే పధ్ధతి ద్వారా ఎన్నికవుతారు. ప్రధానికి 542 మందిలో, సగం 272 మందిలో సగం అంటే 136 మంది ప్రత్యక్ష మద్దతు, 272 పరోక్ష మద్దతు ఉంటే చాలు. బ్రిటీష్ రాణి నియంతలాగా మారకుండా ఆమెను రబ్బర్ స్టాంపులాగా చేయవలసి రావటంలో అర్ధం ఉంది. భారత రాష్ట్రపతిని అలా రబ్బర్ స్టాంపుగా మార్చ వలసిన అవసరంలేదు.

మరల మెట్ల పైనుండి దొర్లించాలి
రాష్ట్ర శాసన సభ లతో సహా విస్తృతమైన నియోజకవర్గం ఎన్నుకున్న రాష్ట్రపతిని ఇంపీచ్ చేయటానికి కేవలం లోక్ సభ, రాజ్యసభలు సరిపోతాయనటం అర్ధంలేదు. సినిమాల్లో హీరోయిన్ కి మెట్లమీది నుండి దొర్లి పడినపుడు కళ్ళుపోటమో మాట పోటమో జరుగుతుంది. మళ్ఱీ పోయిన కళ్ళు లేదా మాట రావాలంటే ఆమెను దర్శకుడు తిరిగి మెట్లమీదినుండ డొర్లించాల్సిఉంటుంది. రాష్ట్రపతని ఇంపీచ్ చేయాలంటే (తొలగించాలంటే) ఆయనను ఎన్నుకున్న నియోజక వర్గం చేతనే ఆ ఇంపీచ్ మెంటు చేయిస్తే బాగుంటుంది.

రాష్ట్రపతి వల్ల వేయి కోట్ల రూపాయల దండుగ
స్వర్గీయ ఎన్ టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాలకు గవర్నర్లు అనవసరం అని చెప్తూ ఉండేవారు. ఈ అభిప్రాయాన్ని మనం రాష్ట్రపతి విషయంలో కూడ వర్తింప చేయవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినపుడు గవర్నరు, ఆయన సలహాదారులు అవసరం పడచ్చేమో కానీ సాధారణ పరిస్థితులలో గవర్నర్ యొక్క అవసరం ఉండదు. ఖర్చు దండగే.

రాష్ట్రపతి జీత భత్యాలకు, రాష్ట్రపతి భవన నిర్వహణకు మనకి షుమారు ఏటా రూ. వేయి కోట్లకు పైగానే అవుతున్నది. రబ్బర్ స్టాంపుగా పని చేయటం తప్ప ఆయన చేస్తున్న ఘనకార్యాలేమీ లేవు. బ్రిటీష్ వాళ్ళకి కూడ బ్రిటీష్ రాణి ఆర్ధికంగా బరువే. అయితే చింత చచ్చినా పులుపు చావని చిన్న దీవి తాము అని గుర్తుంచు కోటం బ్రిటిష్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని తమ రాణి మీద వాళ్ళకి విపరీతమైన మోజు. మనకి రాష్ట్రపతి అనేవాడు బ్రిటీష్ వైస్ రాయ్ (రాణి ప్రతినిథి) స్థానంలోకి కావలసి వచ్చాడు. అతగాడిని మొదట్లో గవర్నర్ జనరల్ అన్నారు. రాజ్యాంగాన్ని అమలుచేసుకుని రిపబ్లిక్కు అయ్యాక రాష్ట్రపతి అని పాట పాడుతున్నాం.

ఏడాదికి వేయి కోట్లు మిగలాలంటే రాష్ట్రపతిని, ఆయన పటాటోపాన్ని తుంగలో తొక్కక, త్యాగం చేయక తప్పదు.

రాష్ట్రపతి పదవిని రద్దు చేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా? బిల్లులను చట్టాలను ఎవరు నోటిఫై చేస్తారు అనే అనుమానం రావచ్చు.


లోక్ సభ, రాజ్యసభ లలో పాస్ అయిన బిల్లులను, రాష్ట్రపతి సంతకం చేసే బదులు, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ (ఉపరాష్ట్రపతి అనే జంట పేరు పదవి తీసేయచ్చు. రాష్ట్రపతినే ఎత్తేస్తున్నప్పుడు ఇంక ఉపరాష్ట్రపతి ఎందుకు), సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసిన కమీటీ బిల్లును చట్టంగా మార్చే సంతకం చేయవచ్చు. నోటిఫికేషన్ కి ఆదేశించ వచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి బిల్లును చట్టంగా మార్చే ఆదేశంపై సంతకం చేసే ముందు తన సుప్రీం కోర్టు ఫుల్ బెంచిని సమావేశ పరచి ఆబిల్లులో రాజ్యాంగ విరుధ్ధమైనవేమైనా ఉన్నాయా, సహజ న్యాయానికి విరుధ్ధమైనవి ఏమైనా ఉన్నాయా, ఇతర ముఖ్యమైన చట్టాలను నీరుగార్చే సెక్షన్లు ఏమైనా ఉన్నాయా వంటివన్నీ పరిశీలింపచేసి వారి ఏకాభిప్రాయ నిర్ణయం, లేక మెజారిటీ నిర్ణయం (బిల్లు యొక్క తీవ్రతను బట్టి) ద్వారా ఓకే చేయించుకోవాలి. ఇలా చేస్తే బిల్లును చట్టంగా ప్రజలపై రుద్దకముందే దాని జుడిషియల్ రివ్యూ పూర్తి అవుతుంది.

సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ ఏవైనా మార్పులు అవసరం అనుకుంటే, ఆసవరణలను సూచిస్తూ బిల్లును లోక్ సభ స్పీకర్ కు, రాజ్యసభ స్పీకర్ కు పంపవచ్చు. లోక్ సభ, రాజ్యసభలు తిరిగి ఆబిల్లులను పాస్ చేశాక ముగ్గురూ (లోక్ సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి) కలసి ఆబిల్లును చట్టంగా ప్రకటిస్తూ సంతకాలు చేసి నోటిఫై చేయించ వచ్చు.

రాష్ట్రపతి లేకపోతే మంత్రివర్గాన్ని ఏర్పరచమని లోక్ సభలో పెద్ద పార్టీ నేతను ఎవరు ఆహ్వానిస్తారు?
కోడి కూయకపోతే తెల్లారదా?

ప్రధాన మంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయించాల్సింది రాష్ట్రపతి నిర్ణయించే కన్నా లోక్ సభ యే నిర్ణయించుకుంటే బాగుంటుంది. ప్రధానమంత్రిని, మంత్రివర్గ సభ్యులను వారి శాఖలతే సహా ఎన్నుకోటానికి రహస్య బ్యాలెట్ పధ్ధతిలో ఎన్నికలు జరుపవచ్చు.

కొత్త లోక్ సభలో అయితే ముందుగా సీనియర్ మోస్ట్ సభ్యుడు ప్రోటెం స్పీకర్ (తాత్కాలిక గౌరవ స్పీకర్) గా వ్యవహరిస్తాడు. శాశ్వత స్పీకర్ ను, డెప్యూటి స్పీకర్లను ఎన్నుకున్నాక, ప్రోటెం స్పీకర్ స్థానంలోకి శాశ్వత స్పీకర్ వచ్చి ప్రధానమంత్రి, మంత్రివర్గ రహస్య బ్యాలెట్ ఎన్నికలను పూర్తి చేయవచ్చు.

ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.