Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label వ్యాసుడు. Show all posts
Showing posts with label వ్యాసుడు. Show all posts

Thursday, July 31, 2014

314 Horripilation రోమాంచము रोमांच

314 Horripilation రోమాంచము रोमांच
३१४ रोमांंच, पुलक 314 గగుర్పాటు, వెంట్రుకలు నిక్కపొడుచుకోటం
చర్చనీయాంశాలు Topics for discussion चर्चांंश : 314, రేలంగి, నర్తనశాల, रोमांच, horripilation, రోమాంచము, Today's English Word, Vocabulary, Mahabharata, Ramayana, Vyasa, Valmiki, Tikkana, तुलसीदास, తులసీదాసు

ఈ రోజు ఆంగ్ల పదం आज के अंग्रेजी शब्द












Horripilation हारिपैलेषन హారీపైలేషన్




తెలుగు: గగుర్పాటు, రోమాంచం, వెంట్రుకలు నిక్కబొడుచుకొనుట.

English: reflex erection of hair in response to stimuli such as cold, emotional stress, skin irritation. syn: goose bump.

Hindi: सनसनी, पुलक, रोमांच, कँपकँपी.



ప్రయోగం: త్యాగరాజ స్వామి. బంటు రీతి కొలువీయవయ్య అనే హంసనాదం కీర్తనలో. రోమాంచమనే ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళయు రామనామ మనే వరఖడ్గ మివి రాజిల్లునయ్య త్యాగరాజునకే। బంటు రీతి కొలువీయ వయ్య.

రోమాంచం అనే ఘన కంచుకం, అంటే గగుర్పాటు అనే గొప్ప డాలు ఈయవయ్య రామా. రామనామం కత్తి. రోమాంచం డాలు. రామభక్తుడు అనే ముద్రబిళ్ళ (మెడలోకి). బంటుకి ఐడెంటిటీ కార్డులాగ.

हिन्दी संग्रह: वाग्गेयकार त्यागराज अपने कीर्तन "बंटु रीती कॊलुवीयवय्या" में गाया था कि।: ऒ श्रीराम, आप के दर्बार मे , मुझे ऎक किंकर के नौकरी दीजिये। रोमांच नामक महानु ढाल दीजिये। श्रीराम नाम --नामक खड्ग दीजिये। राम भक्त के नामक यह पहचान बिल्ला दीजिये।

English Gist: Great Telugu lyricist-musician St. Tyagaraja, in his Adulative song 'banTu rIti koluvIya vayya' (Take me as a menial servant in your court) in the tune hamsanAdam. He said: Give me a shield named "Horripilation". Give me a sword called name of Rama. Give me an identity badge named "Devotee of Rama".



हिन्दी प्रयोग: जयति रामायण श्रवण संजात रोमांच, लोचन सजल, शिथिल वाणी। रामपदपद्म मकरंद मधुकर, पाहि , दास तुलसी शरण, शूलपाणी. --विनय वल्ली, गोस्वामि तुलसीदास. पद २९.

English script: jayati rAmAyaN SravaN sajAt rOmAnch, lOcan sajal, sithil vANi,
rAma pada pank makaramd madhukar, pAhi, dAs tulasi SaraN, SUlapANi. -- Vinayavallai of Goswammi Tulasidas, Verse 29.

English Gist: Victory to listening of RamayaNa, accompanied by horripilation, eyes full of tears, choked voice, honey of dust at Rama's feet, Oh holder of SUla (Siva?), I am Tulasi Das,I take refuge in thee, save me.

తెలుగు సారం: రోమాంచయుత, సజలనేత్ర యుత, రుధ్ధకంఠయుత, రామ పాద పంక మకరంద మధుకర యుక్త, శ్రీరామాయణ శ్రవణానికి జయమగు గాక. ఓ శూలపాణీ (శివా?) పాహి, శరణు, తులసీ దాసుడిని. గోస్వామి తులసీదాస్ విరచిత వినయవల్లి. 29వ శ్లోకం.

వ్యాస మహా భారతం లో హారీపైలేషన్ Horripilation in Vyasa Mahabharata व्यास महा भारत में रोमांच




విరాట పర్వం Virata Parva (Book 4)विराट पर्व

36 వ ఆధ్యాయం Chapter 36 आध्याय ३६

8వ శ్లోకంలో రెండవ లైన్. 8th Verse, second line. श्लोक ८, लैन २.

సందర్భం Context संदर्भ: Pandavas were in Virata's city, incognito. Kichaka was already slain. Duryodhana sent Susarma for DakshiNa gOgrahaNa. (Capturing the cows of Virata, from the Southern part of his City). Duryodhana himself, along with Bhishma, Drona, Karna, Kripa, Asvaththama et al captured Virata's cows from the Northern frontiers of Virata's City. This is called Uttara GO-grahaNam. Entire army of Virata, supported by Yudhishthira-Bhima-Nakula-Sahadeva went to South to defend the cows there. Prince Uttara and the aged king Virata alone were in the City. Prince Uttara, accompanied by Brihannala (Arjuna in the guise of dance teacher) went to defend the Northern Frontier. Seeing the monstrous Kaurava Army, Uttara developed cold feet. His hairs became stiff, in fear.

తెలుగు సారం: విరట రాజ్యంలో పాండవుల అజ్ఞాతవాసం దాదాపు పూర్తి అయ్యింది. కీచక వధ పూర్తి అయ్యింది. దుర్యోధనుడు పాండవుల ఉనికిని పసిగట్టటానికి సుశర్మను దక్షిణ గోగ్రహణం చేయమని పంపాడు. భీష్మ, ద్రోణ,కర్ణ, కృపాశ్వథ్థామాది యోధులతో దుర్యోధనుడే స్వయంగా ఉత్తర గోగ్రహణానికి వచ్చాడు. అప్పటికే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ దక్షిణ గోగ్రహణానికి గురియైన విరటుడి గోవులను విడిపించటానికి సుశర్మతో యుధ్ధం చేయటానికి వెళ్ళారు. నగరంలో రాజకుమారుడు ఉత్తరుడు ఒక్కడే ఉన్నాడు. సారధులు దొరకక నాట్యాచార్యుడైన బృహన్నలను తీసుకొని కౌరవ సైన్యాన్ని ఎదుర్కోటానికి ఉత్తర గోగ్రహణ రంగానికి వెళ్ళాడు. కౌరవసేన చూడగానే భయంతో వళ్ళు గగుర్పొడించింది.

हिन्दी संग्रह: विरट राज्य में पांडव अपने अञात वास को अधिकतर संपूर्ण किया। कीचक वधा समाप्त हुआ। दुर्योधन पांडओं के मौजूदगी पकडने के लिए, त्रिगर्त देशाधीश सुशर्मा को दक्षिण गो ग्रहण करने के वास्ते, मत्स्य देश भेजा। दुर्योधन स्वयं भीष्म, द्रोण, कर्ण, कृप, अश्वथ्थामादि योधों के सहित उत्तर गोग्रहण करने लिए आया। उस समय में युधिष्ठिर, भीम, नकुल, सहदेव विरट सैन्य को लेकर सुशर्मा से युध्ध करने के लिये दक्षिण दिशा में गये थे। नगर मे कोई मर्द नहीं थे, सिवाय राजपुत्र उत्तर और महाराज विरट। राजपुत्र उत्तर, नाट्याचार्य बृहन्नला को सारधी बनकर, कौरवों से प्रतिरोध करने केलिये उत्तर दिशा में गया। वहा, भयंकर कौरव सैन्य को देखते ही, राजपुत्र उत्तर को कँपकँपी हुआ। वह भय विह्वल हो गया।

04036008b hrishTaromA bhayodvignah pArtham vairATir abravIt.

०४ ०३६ ००८बी. हृष्टरोमा भयोद्विग्न: पार्धंं विराटैर अब्रवीत.

౦౪౦౩౬ ౦౦౮బీ. హృష్టరోమ భయోద్విగ్నః పార్ధం విరటైర్ అబ్రవీత్.

Horripilated, frightened, panicked, Uttara said to Partha (Arjuna).

తెలుగు సారం: రోమాంచితుడు,భయవిహ్వలుడు అయిన ఉత్తరుడు , పార్ధుడితో ఇలా అన్నాడు.

हिन्दी संग्रह: रोमांचित, भय विह्वल राजपुत्र उत्तर, पार्ध (अर्जुन) से कहा।

తిక్కన మహాకవి విరచిత ఆంధ్ర మహాభారతంలో ఉత్తరుడి హారీపైలేషన్. तिकक्न महाकवी विरचित आंध्र महाभारत में राजपूत्र उत्तर का हारीपैलेषन. Horripilation of Prince Uttara in Mahabharata of Telugu Poet Tikkana.




కౌరవసేనఁ జూచి వడకం దొడఁగెన్‌ మదితోన మేను నీ
వూరక పోవు చున్కి యిది యొప్పునె యిప్పటిభంగిఁ జూచిన
న్వీరల నేను మార్కొనమి నిశ్చయ మ ట్లగుటన్‌ రయంబునం
దేరు మరల్పు ప్రాణములు దీ పన మున్‌ వినవే బృహన్నలా.

देवनागरी

कौरव सेन चूचि वडकॆन दोडगॆन मदि तोन मेनु नी
वूरक पोवु चुन्कि यिदि योप्पुनॆ यिप्पटि भंगि जूचिनन्
वीरल नेनु मार्कोनमि निश्चयमट्लगुटन रयंबुनन्
तेरु मरल्पु प्राणमुलु तीपन मुन विनवे बृहन्नला.

हिन्दी संग्रह: कौरव सेना को देखने से मेरा देह में कँपकँपी और थरथराहट उठ रहे हैं। आप, इस तरह आगे बढना अछ्छा नहीं रहेगा। इन लोगों से मै लडना असंभव। अतः रथ को आप शीघ्र वापस ले कर जाना। ओ बृहन्नला, तुम नहीं सुने, जान मीठा होता है?

Roman Script

Kaurava sena cUci vaDaken toDagen madi tOna mEnu nI
vUraka pOvu cunki idi yoppune ippati bhangi cUcinan
vIrala nEnu mArkonami niScayam aTulagun rayambunan
tEru maralpu prANamul tIpana mun vinave brihannalA.

English Gist: My body is shaking and shivering (probably includes horripilation), seeing this Kaurava Army. It will not be appropriate for you to go ahead. It is definite that I am not going to fight these people. Hence, O Brihannala, have you not heard that our lives are sweet?

వాల్మీకిరామాయణంలో హారీపైలేషన్ రోమాంచం గగుర్పాటు పులకిత దేహం वाल्मीकि रामायण में रोमांच पुलक कँपकँपी Horripilation (Goosebumps) in Valmiki Ramayana





Photo: Hanuman Mandir at Mansa, Punjab. చిత్రం పంజాబ్ లోని మన్సా వద్ద హనుమాన్ మందిరం. तस्वीर, पंजाब मन्सा शहर मं, हनुमान मंंदिर है। Hanuman is worshipped all over India. హనుమంతుడు భారతదేశమంతా పూజింపబడతాడు. हनुमान पूरे भारत देश में पूजित है।

Valmiki Ramayana, Sundara Kanda (Book 5, the Book of Beauty), Chapter 58, Verse 6.

వాల్మీకి రామాయణం, సుందరా కాండ, 58వ సర్గ, 6వ శ్లోకం.

वाल्मीकि रामायण, सुंदर कांड, ५८ सर्ग, ६ श्लोक.

5-58-6.

Roman Script (English Script)

sa niyuktaH tataH tena samprahruShTa tanU ruhaH,
namasyan shirasA devyai siitAyai pratyabhAShata.

Context and English Gist:
Demon RAvaNa abducted Sita. Hanuman went to Lanka, in search of Sita, flying over the Sea. Found Sita. Talked to her. Returned with a message from her. Great Senior Jambavan encouraged Hanuman to narrate to Shri Rama, what Hanuman had seen in Lanka. Hanuman, recalled his talk with Sita and his hair stood erect in ecstasy (horripilated). Hanuman, in his mind, bowed his head to Sita and started his narration. देवनागरी लिपि

स नियुक्तः ततः तेन संप्रहृष्ट तनू रुहः
नमस्यान शिरसा देव्यै शीतायै प्रत्यभाषत।

हिन्दी संग्रह और वाल्मीकी रामायण में संदर्भ: दैत्य रावण ने शीता माँ को अपहरण किया था। शीता माँ की अन्वेष मे हनुमान समुद्र पार कर लंका गया। वहाँ शीता माँ को देखा। उन से भाषण किया। शीता माँ की संदेश ले कर, किष्किंधा वापस् आया। महानू वानर जांबवान, हनुमान के लंकायान कहन सुनाने के लिऎ उन को प्रोत्साह दिया. तब हनुमानजी, अपने मन में शीतामाँ की स्फुरण कर, शिर मोडकर वंदन करते ही, उन के शरीर पुलकांकित हुआ।

తెలుగు లిపి
స నియుక్తః తతః తేన సంప్రష్ట తనూరుహః
నమస్యాన్ శిరసా దేవ్యై శీతాయై ప్రత్యభాషత.

తెలుగు సారం: అలా (జాంబవంతుడిచేత) నియుక్తుడైన హనుమంతుడు, సీతామాతను ఒక సారి మనసులో స్మరించుకొని శిరసు వంచి నమస్కరించుకునే సరికి, అతడికి శరీరము పులకాంకితమయ్యింది. ( రోమాంచం, గగుర్పాటు హారీపైలేషన్ అయ్యింది.)


Do you get horripilated when you see this picture? ఈ చిత్రాన్ని చూస్తే మీకు రోమాంచము కలుగుతుందా? ईस तस्वीर देखने से आप को रोमांच आयेगा?





This picture is in circulation on internet. In this image, you can see film star Ms. Katrina Kaif and Mr. Ranbir Kapur at a foreign beach location.

తెలుగు సారం: ఈచిత్రం ఇంటర్నెట్ లో సర్క్యులేషన్ లో ఉంది. ఈబింబంలో మీరు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మరియు హీరో రణ్ బీర్ కపూర్ ను ఒక విదేశీ బీచ్ లొకేషన్ లో చూడచ్చు.

हिन्दी संग्रह: यह तस्वीर इंटर नॆट् में सर्क्युलेषन में है। इस बिंब में आप बालीवुड स्टार कत्रीना कैफ् और हीरो रणबीर कपूर को , ऎक विदेशी समुद्र तट स्थान पर देख सकते हैं।

సశేషం (ఇంకా ఉంది). सशेष. To continue.

Sunday, July 20, 2014

305 What is good-interpretation and what is mis-interpretation?


305 ఏది మంచి వివరణ, ఏది దుర్-అన్వయము?
చర్చనీయాంశాలు: 305,రామాయణం, Ramayana,వాల్మీకి,వ్యాసుడు,ఆభీరులు, బ్రహ్మాస్త్రం,Brahmastra, Kanpur, Ayodhya, Sitamarhi

నాచే వ్రాయబడిన, షుమారు 195 పోస్టులు గల రామాయణవైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ వాల్మీకి రామాయణ బ్లాగ్ కు వెళ్ళటానికి click, పోస్ట్ నంబర్ 068లో ఒక విజ్ఞుడైన అజ్ఞాత పాఠకుడు వ్రాసిన వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాను.
Anonymous has left a new comment on your post "#068, Brahmastra could not destroy Abhiras?": Sage Valmiki or Sage Vyasa are merciful to give us 2 great treasures, Sri Ramayanam, Mahabharatham (and Srimad Bhagavatham). They have given for our well being. As every one knows, value of jewel is known only to a jewel appraiser. A vegetable vendor does not know. We do not have the capability to search as to the right path to lead our life. That's why merciful Rama has lived and shown the way to lead a life. And Sage Valmiki has dutifully recorded for us to follow. In this stead fast life, it is difficult for many to even sit and spend time in knowing it. It is obvious that we do not have the knowledge as that of Sage Valmiki. So, we do not have the capacity to value this jewel, Sri Ramayanam. If we want to get benefited by this jewel, all we have to do is to go to a right teacher and know its meaning properly and not to misinterpret with our little knowledge. Misinterpretation only leads to becoming astray. Everybody wants to be benefited by this life, a chance to live better and attain eternal happiness. As the proverb says little knowledge is dangerous. Also, it is important for us to concentrate on areas from Ramayanam which are essential for us to follow. If we cross question on small areas, we lose on the essence. So, please attain a right teacher and seek the essence of Sri Ramayanam. And also please visit Sage Valmiki ashram in Bhitoor (Kanpur), Ayodhya (Birthplace of Sri Rama) and Sitamarhi, Bihar (Birthplace of Sita Matha).

తెలుగుసారం: శ్రీవాల్మీకి లేక వ్యాసర్షి మనకు దయతో రెండు నిథులను ఇచ్చారు, ''శ్రీ రామాయణం, శ్రీ మహాభారతం (మరియు శ్రీమద్ భాగవతం). వారు మన శ్రేయస్సును కోరి మనకు వాటిని ఇచ్చారు. ఆభరణాల విలువ ఆభరణాల నిపుణుడికి మాత్రమే తెలుస్తుందని విదితమే. ఒక కూరగాయల వ్యాపారికి తెలియదు. మన జీవితాలకు సరియైన మార్గం ఏదో వెతుక్కునే శక్తియుక్తులు మనకు లేవు. అందుకే కరుణానిథి రాముడు తాను జీవించి, మనకు జీవించి దారిని చూపించాడు. వాల్మీకి మహర్షి దానిని ఎంతో కర్తవ్యనిష్ఠతో మనకి ఆచరించటం కోసం, దానిని రికార్డెడ్ గా మనకి అందించారు. ఈస్టెడ్ ఫాస్ట్ లైఫ్ లో మనకి, రామాయణాన్ని అర్ధంచేసుకునేందుకు, కూర్చొని కాలాన్ని వెచ్చించే తీరిక ఉండటం లేదు. వాల్మీకికి తెలిసినంత మనకి తెలియదనేది సుస్పష్టం. కనుక ఈ ఆభరణం రామాయణాన్ని విలువకట్టే శక్తి మనకి లేదు. ఈ ఆభరణం నుండి మనం లాభం పొందాలంటే, మనం సరియైన గురువు దగ్గరకు వెళ్ళాలి: అంతే తప్ప మనకు ఉన్న పరిమిత జ్ఞానంతో తప్పుడు వివరణలు చేయకూడదు. తప్పుడు వివరణల వల్ల మనం దారితప్పటం మాత్రమే జరుగుతుంది. ప్రతి వ్యక్తీ ఈజీవితం నుండి ఎక్కువ లాభపడాలని కోరుకుంటాడు. మెరుగుగా జీవించే అవకాశం రావాలని కోరుకుంటాడు. నిత్యానందాన్ని పొందాలని ఆకాంక్షిస్తాడు. అల్పజ్ఞానం అపాయకరమని ఒకసామెత ఉంది. రామాయణంలో మనం వేటినైతే ఆచరించాలో, మనం వాటిపైనే దృష్టి నిలపాలి. మనం చిన్న చిన్న విషయాలపై ప్రశ్నలు లేవనెత్తితే, మనం గుజ్జును (ముఖ్యసారాన్ని) కోల్పోతాం. కనుక, మంచి బోధకుడిని ఆశ్రయించి, రామాయణ సారాన్ని అన్వేషించండి. భిటూర్ (కాన్పూర్) లో ఉన్న వాల్మీకి ఆశ్రమాన్ని, శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యను, సీతాజన్మస్థలమైన సీతామర్హి (బీహార్) ని సందర్శించండి.

अञात श्रीमान जी ने आप के पोस्ट नंबर् ०६८ ''ब्रह्मास्त्र आभीर को संपूर्ण विनाश नहीँ कर सका,'' पर एक टिप्पणी छोड दिया. ऋषि वाल्मीकि या ऋषि व्यास् हमारे को दो महानु खजानें श्री रामायण, महाभारतम् (और श्रीमद भागवतं) देने में बहुत कृपालु रहे। उनहोंने हमारे श्रेय के लिए हमारे को दिए। हर इनसान जानता है कि, ऎक गहने के मूल्य को गणन एक मूल्य निरूपक ही कर सकता है। एक सब्जी विक्रेता को नहीं पता चलेगा। हमारे जीवन में सही राह चुनने के लिऎ हम शक्तिहीन हैं। इसी लिये दयालू राम इस धर्ती पर जिया और हमारे को सही ढंग में जीने का रास्ता दिखाया। और ऋषी वाल्मीकि कर्तव्य निष्ठा से वह सब विषयों को हम सीखने के लिए रिकार्ड किया। इस वेग भरित जीवन में, हमारे को बैठकर (रामायण के सभी अंतरार्ध) जानने के लिए मुष्किल है। यह सुस्पष्ट है कि, जितना ञान ऋषी वाल्मीकी को है, उतना ञान हमारे को नहीं है। अतः, हमें इस गहने को मूल्य गणने का सामर्ध्य नहीं है। अगर हम इस गहने से लाभ उठना तो, हम एक सही गुरु के पास जाना और रामायण का तात्पर्य सही ढंग से जानना चाहिए। हमारे अल्प ञान से झूठा अर्थ लगाना नहीं करना चाहिए। दुर्व्याख्या हमारे को पथभ्रष्ठ बनायेगा। हर आदमी इस जीवन से लाभ उठना चाहता है। और अच्छे ढंग से जीना चाहता है। और नित्यानंद पाना चाहता है। एक लोकोक्ति कहता है: अल्प ञान खतरनाक हो सक्ते है। यह जरूरी है कि हम रामायण में जिस चीज हमें आचरण योग्य है, उन विषयों पर हम हमारा नजर रखना। अगर हम छोटे विषयों पर सवाल उठाये, तो हम मूल तत्व को छोडने का खतरें में गिर सकते हैं। इसीलिये आप एक सही गुरु को पा कर, उस से रामायण के सार पूछीये। और आप, भीतूर (कानपूर) मे ऋषी वालमीकी आश्रम, आयोध्या (श्रीराम जन्म भूमी), और् शीतामर्ही, बीहार् (माँ शीता की जन्मस्थान) यात्रा कीजिये।

వైబీరావుగాడిద వివరణ


మీ హితబోధకు ధన్యవాదాలు. మీ మనో భావాలు దెబ్బతినకుండా, సత్యాన్ని అన్వేషిస్తూ, ఈ దేశ హితాన్ని కోరుతూ, నామనసుకి తోచిన దాన్ని మీముందుకు తేవటం నా లక్ష్యం.

Thank you for your advice. My goal is to bring forward to your notice without hurting your sentiments, what I sincerely perceive, while exploring the truth in the interests of this country.

आप के सूचनाऒं, और खरा लिखा हुआ राय, को बहुत धन्यवाद। मेरा लक्ष्य यह है कि इस देश के हित में, मै सत्यान्वेषण करने का मौके पर, जिस चीज मुझे मिल रहे हैँ, उन को आप के भावनाओं को चोट पहुंचाए बिना, आप के सामने रखना है।

''నా మనోభావాలు గాయపడవు, నీవు చెప్పాలనుకుందేదో చెప్పు, వ్రాయదలుచుకుందేమిటో వ్రాయి'' అని కొంత ఔదార్యంతో ముందుకు వస్తే, నేను మీకు సవివరమైన జవాబుఇవ్వగలను.

If you come forward with some generosity, saying that "Our emotions will not be hurt; you say whatever you want to say, and write whatever you want to write", I can provide a detailed reply.

अगर आप थोडा वदान्यता से, ''हमारे मनोभाव को कभी भी आघात नहीँ पहुँचेगा, तुम जो बोलना है वह बोल सक्ते, जो लिखना है वह लिख सकते हो। '' कहते हुए आगे आए, तो मैं विस्तृत जवाब दे सकता हू।




అయ్యా ఎనానిమస్ గారూ, ఈశ్లోకాన్ని చూడండి.

ఆచార్యాత్ పాదమాదతే, పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః , పాదం కాలక్రమేణచ.

తెలుగు భావం: మనం నాలుగు విధాలుగా జీవితంలో నేర్చుకోవచ్చు. 1. గురువు నుండి 25%. 2. స్వమేథ తో 25%. 3. సహ శిష్యులనుండి 25%. 4. కాలగమనంలో, పరిణామ క్రమంలో 25%.

వైబీగాడిద: దురదృష్ట వశాత్తూ, నాకు గురువుల నుండి అంటాల్సిన 25%, సహశిష్యులనుండి అంటాల్సిన 25% , చిన్నతనంలోనే దరిద్రం వల్ల నౌకరీలోకి దిగటాన అంటాల్సినంత అంటలేదు. అయితే ఈలోపాన్ని నేను పుస్తకాలతో, ఇంటర్నెట్ తో కొంత మేరకు భర్తీచేసుకున్నాను. స్వమేధ ఉందోలేదో చెప్పలేను గానీ, కాలగమనంలో నేర్చుకున్నది 25% కన్నా ఎక్కువగానే ఉన్నది. మీకు dangerous గా కనిపించిన నా little knowledge కి మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను.

మీరు వ్రాసిందాని బట్టి మీరు గురువుపై ఎక్కువ ఆధార పడదలుచుకున్నట్లు కనిపిస్తున్నది. నిష్ణాతులు, నీతిమంతులు అయిన గురువులకు ప్రపంచ వ్యాప్తంగా కరువు ఉన్నట్లుగా కనిపిస్తుంది. నేను వ్రాసిన స్వామీ వివేకానందా బ్లాగ్ ను గనుక మీరు చూస్తే, click లేక స్వామీ వివేకానంద సంపూర్ణరచనలను గనుక మీరు శ్రధ్ధగా గనుక చదివితే, ఆధ్యాత్మిక గురువులకు, బోధకులకు ముఖ్యంగా కావలసినది కాషాయ వస్త్రాలు, రకరకాల బొట్లు నామాలు, కొన్ని సంస్కృత శ్లోకాలు, పిట్టకథలను ఆసక్తికరంగా చెప్పే శక్తే తప్ప అన్వేషణా దృష్టి అవసరంలేదని స్ఫురిస్తుంది. సహశిష్యులనుండి నేర్చుకోవాలంటే, సహశిష్యులు కూడ అన్వేషణాసక్తులు కావాలి. మీవయస్సు ఎంతో నాకు తెలియదు. కొంత మధ్య వయస్సులో ఉన్నట్లయితే జీవీతానుభవం కోటాలో 25%, స్వమేధ కోటాలో 25%, ఇలాగా ఏసీ కార్లలో తిరిగే గురువుల సహాయం లేకుండానే, మీ సత్యాన్వేషణను ముందుకు తీసుకెళ్ళవచ్చు.


मान्य श्री ऎनानिमस् जी,

आचार्यात् पादमादते पादं शिष्यः स्वमेधया ।
पादं सब्रह्मचारिभ्यः, पादं कालक्रमेण च ॥

हिन्दी: आचार्य से हम २५% सीख सकते हैं. हम हमारे बुध्धी से २५% सीख सकते हैं. सह शिष्यों से २५% सीख सकते हैं. कालांतर में या काल गमन क्रम में २५% सीख सकते हैं.

'वैबीराव एक गधे का दृकपथ: अचानक, मुझे बारह साल के उम्र से ही आजीविका कमाने के लिये काम करना शुरू हुआ. इसलिये, मै गुरु-अध्यापकों से मिलने वाला २५% नहीं ले सका। मैं इस नष्ट को किताबें पढते हुऎ, इंटरनॆट देखते हुऎ, भर्ती किया हूं। मुझॆ मेरा स्व-मेधा है या नहीं, यह नहीं बोल सकता हूँ।

परन्तु, मैं जीवन काल गमन कोटा २५% से ज्यादा सीख सका। मेरा dangerous little knowledge आप पायिंट किया, जिसको मैं कालक्रम और् मैरा गधे का दिमाग इस्तेमाल करके सीखा था, उस से आप को कुछ तकलीफ उठे तो, मैं आप से माफी माँगता हुँ।

आप से लिखा हुआ आप के राय से मैं यह समझता हुँ कि, आप गुरू पर ज्यादा निर्भर होना चाहते है. मुझे यह दिखता है कि, ञानवान और इमानदार गुरु महाजन के विश्वव्याप्त कमी है। आप कुछ तकलीफ लेकर मेरा लिखा हुआ स्वामी विवेकानंदा ब्लग click, या स्वामी विवेकानंद विरचित उनका संपूर्ण रचन अध्ययन किये तो, यह स्पष्ट होगा कि, आध्यात्मिक गुरुजनों को आजकल सत्यान्वेषण दृष्टि होने का जरूरत नहीँ है. यह काफी होता है कि, वे स्पॆषल काषाय ड्रॆस पहनना चाहिए. मुख फलक पर तरह तरहों का पवित्रता दिखानेवाला मार्कंस् धारण करना चाहिऎ. संस्कृत श्लोक आशु से बोलना चाहिए. भक्तिदायक कहानियाँ कहने का निपुणता, भजन वगैरा गाने के लिए मधुर स्वन होना चाहिऎ. अगर स्वामि विवेकानंद अपना भाषण को, बिना स्पॆशल् ड्रॆस पहन कर दिए, तो बहुत कम पाश्चात्य महिलाऎं उन से आकर्षित होते थे।

हम सह शिष्य से सीखने के लिए भी, उन सह शिष्य सत्यान्वेषक होना चाहिऎ। मैं आप कै उम्र नहीँ जानता हूँ। अगर आप मिडिल एज में हो, तो आप को २५% काल गमन और जीवन अनुभवों का २५% कोटा ञान, और ऎक्स्टरा २५% स्वमेधा से आप को मिले हौगा. आप इन दोनों को पाने के लिये रियाल्टर्स, बिल्डर्स, इंडस्ट्रियलिस्ट्स, राजकीय नेताओं से दिया हुआ सम शीतल कारों मे चलने वाला गुरुओं से जरूरत नहीं पडेगा।


Dear Shri Anonymous, pl. see the following verse.

AcAryAt pAdamAdatE, pAdam Sishyaha svamEdhayA,
pAdam sabrahmacAribhyaha, pAdam kAlakramENa ca.

English gist: We can learn in four ways. pAdam = one-fourth or 25%. 25% from teacher. 25% from own intellect. 25% from brother-disciples. 25% in course of time.

'Dear Shri Anonymous:

ybrao-a-donkey's view: Unfortunately, as I had to earn my livelihood from an early age of 12 years, I could not get my quota of 25% from my teachers fully. However, I recouped this loss, by learning from books and internet. I can't say whether I have my own intellect or not. But what I have learnt through the course of my life (kAlakramam - afflux of time), I got more than 25% of my quota. I apologise to you for exhibiting the dangerous little knowledge I have acquired through this kAlagamanam and donkey's mind.

From what you have written, it appears to me that you want to depend more on Guru (teacher). There seems to be a dearth of knowledgeable and honest teachers worldwide. If you peruse the blog written by me on Swami Vivekananda, click or study the Complete Works of Vivekananda with an inquisitive mind, you will notice that spiritual teachers do not require an urge to explore truth, and that they should specialise in wearing peculiar looking dresses, ochre clothes, facial-marks of different shapes and colors, ability to say some Sanskrit, capability to tell some devotional stories, added sweet voice to sing some bhajans. Had Vivekananda given his speeches without wearing his special dress, very few people might have been tempted towards him.

If we have to learn from co- disciples, such co-disciples should also be avid seekers of truth. I do not know your age. If you are in middle age, you can depend on 25% from life's experiences quota, and another 25% from own intellect. This without depending on Gurus trotting in air-conditioned cars provided by realtors, industrialists and politicians.


విజ్ఞులైన పాఠకుల అభిప్రాయాలకు, ప్రశ్నలకు, ఆహ్వానం. తిట్టినా ఫరవా లేదు. పేరు వ్రాయాల్సిన నిర్బంధం లేదు.

Saturday, April 26, 2014

213 Should Sudras weave baskets?

213 Should Sudras weave baskets? 213 శూద్రులు బుట్టలు అల్లుకోవాలా? చర్చనీయాంశాలు: వ్యాసుడు, భాగవతం, శూద్రులు, కులవ్యవస్థ
PART 11, CHAPTER 17, VERSE 19, SANSKRIT:

సంస్కృత వ్యాస విరచిత శ్రీమద్ భాగవతం, ఏకాదశ స్కంధం, ౧౭వ ఆధ్యాయం, ౧౯వ శ్లోకం.
s'us'ruushaNam dvija gavaam devaanaam ca apy amaayayaa
tatra labdheena santooshaha, s'uudra-prakritayas tv imaaha.


శుశ్రూషణం ద్విజ గవామ దేవానాం చ అపి అమాయయా
తత్ర లబ్ధేన సంతోషహః , శూద్ర ప్రకృతయస్ త్వ ఇమాః.
VERSE 49 శ్లోకం ౪౯.

suudra-vruttim bhajeed vais'yaha, s'uudraha kaaru-katha-kriyaam
kricchraan muktoo na garhyeena vruttim lipseeta karmanaa.


శూద్ర వృత్తిం భజేద్ వైశ్యః, శూద్రః కారు కథ క్రియాం క్రిఛ్రాన్ ముక్తో న గార్హ్యేన వృత్తిం లిప్సేత కర్మణా.


ENGLISH GIST: ఆంగ్ల తాత్పర్యం
Serving the Priests, cows, Gods, without cheating and being happy with whatever he gets -- these are the duties of a Suudra.


తెలుగు సారం: బ్రాహ్మణులను (ద్విజులను), ఆవులను, దేవుళ్ళను, సేవించుకుంటూ, మోసగించకుండా, తనకు వచ్చిన దానితో తృప్తి పడుతూ జీవించటం -= ఇవి శూద్రుడి విధులు.
A fourth caste person who cannot find a master to serve, can overcome his difficult situation by weaving baskets and straw mats. Again they should revert back to their original occupations after normalcy occurs. (That means a fourth caste person should find a master and serve again).


నాలుగవ కులం వ్యక్తి సేవించుకొనుటకు యజమాని దొరకనపుడు, ఈ క్లిష్ట పరిస్థితిని బుట్టలు నేయటం, గడ్డి చాపలను నేయటం వంటి పనుల ద్వారా అధిగమించాలి. సాధారణ పరిస్థితులు ఏర్పడినపుడు వారు తమ మామూలు పనులకు వెనక్కి వెళ్ళాలి (అంటే మరల యజమానిని వెతుక్కొని ఆయనను సేవించాలి).







వైబీరావు గాడిద వ్యాఖ్యలు

CRITICAL REMARKS: Who stipulated these duties? Did Krishna stipulate? Or the priests stipulated?

ఈ విధులను ఎవరు నిర్దేశించారు? శ్రీకృష్ణుడు ప్రవేశ పెట్టాడా? పవిత్ర గ్రంధాలలోకి, పూజారులు ప్రవేశ పెట్టారా?

ద్విజులు శూద్రులను మోసం చేయవచ్చా?

ద్విజులు శూద్రులను ఎందుకు సేవించరు? మానవసేవయే మాధవసేవయని కదా ఆర్షనీతి.

ద్విజలు దేవుడిని సేవిస్తూ, తీరిక సమయంలో బుట్టలు, చాపలు ఎందుకు అల్లకూడదు?

ఈగాడిదకు, ఏకులం వారిపైన గానీ ప్రేమ గానీ ద్వేషం గానీ లేదు. కనుక అపార్ధం చేసుకోవద్దని ప్రార్ధన. పైగా, ఇది ఆకాలం నాటి సంగతి కాబట్టి, నేడు మనం దోషులుగా బాధ పడనక్కరలేదు. ఈకాలంలో, ఇటువంటి దోషాలు ఏమన్నా ఉంటే, వాటిని నివారించుకోటమే లక్ష్యం. ఆలక్ష్యానికి నాస్తికత్వం, మార్క్సిజం సహాయం చేస్తాయి.

Saturday, February 22, 2014

153 questions of yaksha


English: Recollect the film Maya Bazar 1957, in which NTR acted as Sri Krishna, ANR as Abhimanyu, and SVR as Ghatotkacha. In the same way recollect the Telugu film Pandava Vanavasam, in which NTR acted as Bhima, Savitri as Draupadi, Kanta Rao as Krishna, and Satyanarayana as Ghatotkacha. In both the films, the common theme is Pandavas' exile to Forest. Another key climax scene is 'Wedding of Sasirekha (d/o Balarama and his wife Rohini)'. This wedding of Sasirekha is not in Vyasa's Sanskrit Mahabharata, or its Telugu version Errapraggada's Andhra Mahabharata. It may be in some other Telugu books. It may also be intellectual creativity of Film Script Writers, Producers and Directors. I do not wish to find fault with them. Because, they have conflicting objectives of 'Informing', 'Entertaining', and 'Profit making'.

Introduction పరిచయం


ఎన్ టీ ఆర్ కృష్ణుడుగా, ఎ ఎన్ ఆర్ అభిమన్యుడుగా, ఎస్ వీ ఆర్ ఘటోత్కచుడుగా, సావిత్రి శశిరేఖగా వచ్చిన మాయా బజార్ సినిమాను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్ టీ ఆర్ భీముడిగా, సావిత్రి ద్రౌపదిగా, కాంతారావు కృష్ణుడిగా, సత్యనారాయణ ఘటోత్కచుడిగా నటించిన పాండవ వనవాసం సినిమాను గుర్తుకు తెచ్చుకోండి.
ఈరెండు సినిమాల నేపథ్యం పాండవులు అడవిలో నివసించటం. రెండు సినిమాలలో కీలక క్లైమాక్స్ ఘట్టం శశిరేఖా పరిణయం. ఇది వ్యాసుడు వ్రాసిన సంస్కృత మహాభారతంలో కానీ, కవిత్రయం వ్రాసిన తెలుగు మహాభారతంలో కానీ లేదు. ఇతర పుస్తకాలలో ఉండచ్చు. కొంత సినీ రచయితల, దర్శకుల మేథస్సు కావచ్చు. వారిని నేను తప్పు పట్టను. సినిమాల లక్ష్యం వ్యాపారం, వినోదం- తద్వారా ప్రేక్షకాదరణ. కళయొక్క స్థానం నంబర్ 3.

మాయాబజార్ లో భీముడికి, ధర్మరాజుకి, బహుశా అర్జునుడికి ప్రాముఖ్యత లేదు. పాండవవనవాసంలో కథ అంతా భీముడి చుట్టు తిరుగుతుంది.

మాయాబజార్ సినిమాలో ఈ యక్షప్రశ్నలు ఘట్టాన్ని చూపలేదు. పాండవ వనవాసం సినిమాలో స్వల్పంగా చూపినట్లున్నారు.

నర్తనశాల సినిమాలో (ఇది వనవాసం కాదు, అజ్ఞాత వాసానికి చెందినది), ముక్కామల విరాటరాజు, గుమ్మడి ధర్మరాజు కంకుభట్టు మథ్య జరిగిన సంభాషణల్లో హాస్యం కోసం ఒకటి రెండు యక్షప్రశ్నలను చొప్పించారు. అది దర్శకుడియొక్క మేథస్సుకు నిదర్శనం.

యక్షప్రశ్నల ప్రాముఖ్యత


తెలివైన మానవుడికి సదసద్విచారం (ఏది మంచి ఏది చెడు తేడా తెలుసుకునే శక్తి), నిత్యానిత్యవిచారం (ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తేడా తెలుసుకునే శక్తి), మిథ్యామిథ్యవిచారం (ఏది మాయ, ఏది నిజం తేడా తెలుసుకునే శక్తి) అవసరం.

ప్రాచీన మానవుడి కన్నా ఆధునిక మానవుడికి ఇవి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ప్రాచీన మానవుడి ముందు ఉండే ఆకర్షణలు (pulls and temptations) బలహీనమైనవి. ఆధునిక మానవుడి ముందు ఉండే ఆకర్షణలు బలమైనవి. మహమ్మద్ అలీలాగ , మైక్ టైసన్ లాగా అవి బాక్సింగ్ గుద్దులను మానవుడిమీద గుద్దుతూ ఉంటాయి.

నిత్యానిత్యవిచారం, సదసద్విచారం లేక పోతే, లక్షకోట్లు సంపాదించి వైయస్ రాజశేఖర రెడ్డిగారు వాటిని సరిగా అనుభవించకముందే, స్వర్గస్థులైనట్లుగా ఉంటుంది. మనిషి బందీ అయిపోతాడు.


యక్ష ప్రశ్నలలో కొన్ని స్టాక్ ప్రశ్నలు ఉన్నా ఆలోచనలు రేకెత్తించేవే. సదస్విచారాన్ని ప్రేరేపించేవే. మచ్చుకి ఒక ప్రశ్న, తెలుగు మామూలు భాషలో:
ప్రశ్న: బ్రతికి ఉండి కూడ చచ్చిన వాడితో సమానం ఎవరు? జవాబు: దేవుడు, అతిథి, తండ్రి తాతలు, సేవకులు వీళ్ళకి అన్నం పెట్టకుండా తాను తినేవాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య


అప్పుడూ, ఇప్పుడూ ఇది 100% సత్యమే. దేవుడు ఒక ఊహ. దేవుడికి నైవేద్యం పెట్టటం అంటే ఏపటానికో విగ్రహానికో పెట్టటం అనే అర్థంలో నేడు రూఢి అయ్యింది. దేవుడు తింటాడా? పటం, విగ్రహాలు తింటాయా? నిరక్షరాస్యుడు నమ్మటంలో అర్థం ఉంటుంది. వేదవేదాంగవిదులైన పండితులు నమ్మకూడదు. తింటాడనే నమ్మకం భారత ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీగారికి కూడ ఉంది. అందుకే ఆయన వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంటే పాలక్యారేజీ తీసుకొని ఢిల్లీలో వినాయకుడి గుళ్ళకి వెళ్ళాడు.
మరణించిన పితృదేవతలు మనం పెట్టే తిండి ని తింటారనుకోటం కూడ ఋజువుల్లేని ఊహే. అర్ధం, బ్రతికున్న తండ్రి తాతలకు పెట్టమనే. తాతలనాటి బొచ్చె తరతరాలు చేయవద్దని.
అతిథులకు పెట్టటం మనకి అలవాటు తప్పింది. మనమే హోటళ్ళకి వెళ్ళి టిఫిన్ ప్యాకెట్లు కొనుక్కోవలసిన కర్మ పట్టింది. ఇంట్లో చేసుకున్నా గ్యాస్, నిత్యావసరవస్తువులు ధరలు పెరిగిపోయి అతిథులకి పెట్టే స్థాయినుండి కిందికి దిగజారి పోయాం. బిజేపి వాళ్ళు ప్రచారంచేసే, కానీ ఆచరణలో పట్టించుకోని సిసలైన హిందూత్వ ప్రకారం, ప్రతిరోజు మనం అన్నం తినబోయే ముందు ఒక కొత్తవాడిని వెతికి పట్టుకుని వెతికి తెచ్చుకొని, వాడిని గౌరవించి వాడి పక్కన కూర్చోని వాడితో కబుర్లుచెప్తూ భుజించాలి. బిచ్చగాళ్ళకి వేయటం కాదు.

సేవకులకు అన్నం పెట్టటం నా దృష్టిలో అతిథికి అన్నం పెట్టటం కన్నా ముఖ్యమైనది. అలాపెట్టకపోతే మనం శ్రమదోపిడీ చేసిన వాళ్లమవుతాం. దీనిలో మళ్ళీ పెట్టుబడిదారీ ఎకనామిక్స్ వస్తుంది. జీతం ఇస్తున్నాంగా, ఇంక మనతో సమానంగా భోజనం పెట్టాలా, లెక్కలెయ్యి, అని పెట్టుబడిదారీ విధానం చెప్తుంది.

ఇది నేడెందుకు కుదరదు అంటే, పెట్టుబడిదారీ విధాన మహిమ. అందు వల్ల పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం మనమందరం జీవన్మృతులమే.

పాండవులు వనవాసం చేసినపుడు ఈయక్షప్రశ్నల ఘట్టం ఎప్పుడు వస్తుంది?


ఇంచు మించుగా చివర. ధర్మరాజుకి దాహం వేస్తుంది. తమ్ముళ్ళు చెట్టెక్కి చూస్తారు. కొంతదూరంలో ఒక సరస్సు (చెరువు) కనిపిస్తుంది. నకులుడు నీళ్ళు తేవటానికి వెళ్తాడు. సరస్సుకి కాపలా కాస్తున్న యక్షుడు నకులుడికి అడ్డు పడి నాప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీళ్ళను ముట్టుకోవద్దంటాడు. నకులుడు పట్టించుకోకుండా చెరువులోకి దిగుతాడు. యక్షుడి మాయవల్ల మూర్ఛపోతాడు.

తరువాత సహదేవుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

తరువాత అర్జునుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

తరువాత భీముడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోటంతో ఆందోళనతో ధర్మరాజు స్వయంగా వెళ్తాడు. సరస్సు ఒడ్డున మూర్ఛపోయిన తమ్ముళ్ళు, యక్షుడు కనిపించారు. ధర్మరాజుకి జూద వ్యసనం ఉంది కానీ, కొన్నిసార్లు తెలివిగా ప్రవర్తిస్తాడు. యక్షుడిని మెప్పించేలా జవాబులు చెప్పి, ప్రవర్తించి, తమ్ముళ్ళందరినీ విడిపించుకుంటాడు. క్లుప్తంగా, ఇదీ కథ.

నేనేదో అరటి పండు వలిచి పెట్టినట్లుగా మీనోట్లో పెట్టి, మీక స్పూన్ ఫీడింగ్ చేస్తాను అని ఆశించకండి. శ్లోకాలను, పద్యాలను అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి. వాటిని సమకాలీన పరిస్థితులతో పోల్చండి. శ్రధ్ధావాన్ లభతే విద్యా.

ఇవన్నీ మేమెందుకు చదవాలి, ఇది మాసిలబస్ లో లేదే


భారతంలోగాని, రామాయణంలో ఉన్నవి గానీ, గురువులు చెప్పినవి కానీ నూటికి నూరు పాళ్ళు ఆచరించాలని లేదు. సత్యాసత్య విచారం, చేసుకున్న తరువాత, మంచివి, ఆచరణీయం అనుకున్నవాటినే ఆచరించుకోవాలి. సంస్కారం వల్ల మానవుడు మెరుగైన మానవుడుగా తయారుఅయ్యి తాను సుఖపడి చుట్టూ ఉన్న వారిని సుఖపెట్ట కలుగుతాడు.

సత్యాసత్య విచార, నిత్యానిత్య విచార విద్యకి సిలబస్ లు ఉండవు. ఈవిచారాన్ని సరిగా చేసుకోనివాడు స్వామీ వివేకానందలాగా అయిపోయి మేకను బలిఇవ్వగానే దుర్గామాతకు ఆనందం కలుగుతుందనుకుంటాడు. తాబేళ్ళను తినటానికి డాక్టర్లు అనుమతించలేదే అని బాధ పడతాడు.

వ్యాసుడు


వ్యాస భారతం, అరణ్యపర్వం లో 314వ ఆధ్యాయంలో మనం ఈ యక్ష ప్రశ్నలను చూడవచ్చు. We can see these questions of yaksha, in Chapter 314 of vyasa mahabharata.
స దదర్శ హతాన్భ్రాతృఁల్లోకపాలానివ చ్యుతాన్।
యుగాంతే సమనుప్రాప్తే శక్రవైశ్రవణోపమాన్ ॥ 1
వినికీర్ణధనుర్బాణం దృష్ట్వా నిహతమర్జునం।
భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్గతాయుషః ॥ 2
సదీర్ఘముష్ణం నిఃశ్వస్య శోకబాష్పపరిప్లుతః।
తాందృష్ట్వా పతితాన్భ్రాతౄన్సర్వాంశ్చింతాసమన్వితః। 3
నను త్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం వృకోదర।
సుయోధనస్య భేత్స్యామి గదయా సక్థినీ రణే ॥ 4
వ్యర్థం తదద్య మే సర్వం త్వయి వీరే నిపాతితే।
మహాత్మని మహాబాహో కురూణాం కీర్తివర్ధనే ॥ 5
మనుష్యసంభవా వాచో విధర్మిణ్యః ప్రతిశ్రుతాః।
భవతాందివ్యవాచస్తు తా భవంతు కథం మృపా ॥ 6
దేవాశ్చాపి యదాఽవోచన్మూతకే త్వాం ధనంజయ।
సహస్రాక్షాదనవరః కుంతి పుత్రస్తవేతి వై ॥ 7
ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వశః।
విప్రనష్టాం శ్రియం చైషామాహర్తా పునరోజసా ॥ 8
నాస్య జేతా రణే కశ్చిదజేతా నైష కస్యచిత్।
సోయం మృత్యువశం యాతః కథం జిష్ణుర్మహాబలః ॥ 9
అయంమమాశాం సంహత్య శేతే భూమౌ ధనంజయః।
ఆశ్రిత్యయం వయం నాథం దుఃఖాన్యేతానిసేహిమ ॥ 10
రణే ప్రగల్భౌ వీరౌ చసదా శత్రునిబర్హణౌ।
కథం రిపువశం యాతౌ కుంతీపుత్రౌ మహాబలౌ।
యౌ సర్వాస్త్రాప్రతిహతౌ భీమసేనధనంజయౌ ॥ 11
అశ్మసారమయం నూనం హృదయం మమ దుర్హృదః।
యమౌ యదేతౌ దృష్ట్వాఽద్య పతితౌ నావదీర్యతే ॥ 12
శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞాస్తపోయుక్తాః క్రియాన్వితాః।
అకృత్వా సదృశం కర్మ కిం శేధ్వం పురుషర్షభాః ॥ 13
అవిక్షతశరీరాశ్చాప్యప్రమృష్టశరాసనాః।
అసంజ్ఞా భువి సంగంయ కిం శేష్వమపరాజితాః ॥ 14
సానూనివాద్రేః సంసుప్తాందృష్ట్వా భ్రాతృన్మహామతిః।
సుఖం ప్రసుప్తాన్ప్రస్విన్నః ఖిన్నః కష్టాం దశాం గతః ॥ 15
ఏవమేవేదమిత్యుక్త్వా ధర్మాత్మా స నరేశ్వరః।
శోకసాగరమధ్యస్థో దధ్యౌ కారణమాకులః ॥ 16
ఇతికర్తవ్యతాం చేతి దేశకాలవిభాగవిత్।
నాభిపేదే మహాబాహుశ్చింతయానో మహామతిః ॥ 17
అథసంస్తభ్య ధర్మాత్మా తదాఽఽత్మానం తపఃసుతః।
ఏవంవిలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
బుద్ధ్యా విచింతయామాసవీరాః కేన నిపాతితాః ॥ 18
నైషాం శస్త్రప్రహారోస్తి పదం నేహాస్తి కస్యచిత్।
భూతం మహదేదం మన్యే భ్రాతరో యేన మే హతాః ॥ 19
ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వా జలం।
`భ్రాతౄణాం న్న్యసనం ఘోరం సమమేవ మహాత్మనాం' ॥ 20
స్యాత్తు దుర్యోధనేనేదముపాంశు పరికల్పితం।
గాంధారరాజరచితం సతతం జిహ్మవుద్ధినా ॥ 21
యస్ కార్యమకార్యం వా సమమేవ భవత్యుత।
కస్తస్య విశ్వసేద్వీరో దుష్కృతేరకృతాత్మనః ॥ 22
అథవా పురుషైర్గూఢైః ప్రయోగోఽయందురాత్మనః।
భవేదితి మహాబుద్ధిర్బహుధా సమచింతయత్ ॥ 23
ఆచార్యం కింను వక్ష్యామి కృపం భీష్మమహం ను కిం।
విదురం కింను వక్ష్యామి బృహస్పతిసమం నయే ॥ 24
అంబాం చ కింను వక్ష్యామి సర్వదా దుఃఖభాగినీం।
దృష్ట్వా మాం భ్రాతృభిర్హీనం పృచ్ఛంతీం పుత్రగృద్ధినీం ॥ 25
యదా త్వం భ్రాతృభిః సర్వైః శక్రతుల్యపరాక్రమైః।
సార్ధం వనం గతో వీరైః కథమేకస్త్వమాగతః' ॥ 26
కస్య కింను విషేణేదముదకం దూపితం యథా।
మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే।
ముఖవర్ణాః ప్రసన్నా మే భ్రాతౄణామిత్యచింతయత్ ॥ 27
ఏకైకశశ్చౌఘబలానిమాన్ పురుషసత్తమాన్।
కోఽన్యః ప్రతిసమాసేత కాలాంతకయమాదృతే ॥ 28
ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్।
పాతుకామశ్చ తత్తోయమంతరిక్షాత్స శుశ్రువే ॥ 29

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-30
అహం బకః శైవలమత్స్యభక్షో
నీతా మయా ప్రేతవశం తవానుజాః।
త్వం పంచమో భవితా రాజపుత్ర
న చేత్ప్రశ్నాన్పృచ్ఛతో వ్యాకరోపి ॥ 30
మా తాత సాహసంకార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 31

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 32
రుద్రాణాం వా వసూనాం వామరుతాం వా ప్రధానభాక్।
పృచ్ఛామి కో భవాందేవో నైతచ్ఛకునినా కృతం ॥ 32
హిమవాన్పారియాత్రశ్చ వింధ్యో భలయ ఏవ చ।
చత్వారః పర్వతాః కేన పాతితా భువి తేజసా ॥ 33
త్వయాఽతీవ మహత్కర్మ కృతం చ బలినాంవర।
వినిఘ్నతా మహేష్వాసాంశ్చతురోపి మమాత్మజాన్' ॥ 34
యాన్న దేవాన గంధర్వానాసురాశ్చ న రాక్షసాః।
విపహేరన్మహాయుద్ధే కృతం తే తన్మహాద్భుతం ॥ 35
న తే జానామి యత్కార్యం నాభిజానామి కాంక్షిత్తం।
కౌతూహలం మహజ్జాతం సాధ్వసం చాగతం మమ ॥ 36
యేనాస్స్యుద్విగ్నహృదయః సముత్పన్నశిరోజ్వరః।
పృచ్ఛామి భగవంస్తస్మాత్కో భవానిహ తిష్ఠతి ॥ 37

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-38
యక్షోఽహమస్మి భద్రం తే నాస్మి పక్షీ జలేచరః।
మయైతే నిహతా సర్వే భ్రాతరస్తే నివారితాః ॥ 38
వైశంపాయన ఉవాచ। 39
తతస్తామశివాం శ్రుత్వావాచం స పరుషాక్షరాం।

యక్షస్ బ్రువతో రాజన్నాకంపత తదాఽఽస్థితః ॥ 39
విరూపాక్షం మహాకాయం యక్షం తాలసముచ్ఛ్రయం।
జ్వలనార్కప్రతీకాశమధృష్యం పర్వతోపమం ॥ 40
సేతుమాశ్రిత్య తిష్ఠంతం దద్రశ భరతర్షభః।
మేఘగంభీరనాదేన తర్జయంతం మహాస్వనం ॥ 41
ఉవాచ యక్షః కౌంతేయం భ్రాతృశోకప్రపీడితం' ॥ 42
ఇమే తేభ్రాతరో రాజన్వార్యమాణఆ మయాఽసకృత్।
బలాత్తోయం జిహీర్షంతస్తతో వై మృదితా మయా।
న పేయముదకం రాజన్ప్రాణానిహ పరీప్సతా ॥ 43
పార్థ మా సాహసం కార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతఃపిబ హరస్వ చ ॥ 44

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 45
న చాహం కామయే యక్ష తవ పూర్వపరిగ్రహం ॥ 45
కామం నైతత్ప్రసంసంతి సంతో హి పురుషాః సదా।
యదాత్మనా స్వమాత్మానం ప్రశంసేత్పురుషర్షభ।
యథాప్రజ్ఞం తు తే ప్రశ్నాన్ప్రతివక్ష్యామి పృచ్ఛ మాం ॥ 46

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-47 yaksha started questioning yudhishthira.
కింస్విదాదిత్యమున్నయతి కే చ తస్యాభితశ్చరాః।
కశ్చైనమస్తం నయతికస్మింశ్చ ప్రతితిష్ఠతి ॥ 47

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 48
బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యాభితశ్చరాః।
ధర్మశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి ॥ 48

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-29
కేన స్విచ్ఛ్రోత్రియో భవతి కేన స్విద్విందతే మహత్।
కేన స్విద్ద్వితీయవాన్భవతిరాజన్కేన చ బుద్దిమాన్ ॥ 49

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 50
శ్రుతేన శ్రోత్రియో భతి రతపసా విందతే మహత్।
ధృత్యా ద్వితీయవాన్భవతి బుద్ధిమాన్వృద్ధసేవయా ॥ 50

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-51
కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 51

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 52
స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ।
మరణం మానుషో భావః పరివాదోఽసతామివ ॥ 52

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-53
కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 53

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 54
ఇష్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ।
భయం వై మానుషో భావః పరిత్యాగోఽసతామివ ॥ 54

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-55
కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజుః।
కా చైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతివర్తతే ॥ 55

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 56
ప్రాణో వై యజ్ఞియంసామ మనో వై యజ్ఞియం యజుః।
ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతివర్తతే ॥ 56

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-57
కింస్విదావపతాం శ్రేష్ఠం రకింస్విన్నివపతాం వరం।
కింస్విత్ప్రతిష్ఠమానానాం కిస్విత్ప్రసవతాంవరం ॥ 57

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 58
వర్షమావపతాం శ్రేష్ఠం బీజం నివపతాం వరం।
గావః ప్రతిష్ఠమానానాం పుత్రః ప్రసవతాం వరః ॥ 58

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-59
ఇంద్రియార్థాననుభవన్బుద్ధిమాఁల్లోకపూజితః।
సంమతః సర్వభూతానాముచ్ఛ్వసన్కో న జీవతి ॥ 59

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 60
దేవతాతిథిభృత్యానాం పితౄణామాత్మనశ్చ యః।
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్న స జీవతి ॥ 60

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-61
కింస్విద్గురుతరం భూమేః కింస్విదుచ్చతరం చ స్వాత్।
కింస్విచ్ఛీఘ్రతరం వాయోః కింస్విద్బహుతరం తృణాత్ ॥ 61

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 62
మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చతరస్తథా।
మనః శీఘ్రతరం వాతాచ్చింతా బహుతరీ తృణాత్ ॥ 62

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-63
కింస్విత్సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చేంగతే।
కస్యస్విద్ధృదయం నాస్తికాస్విద్వేగేన వర్ధతే ॥ 63

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 64
మత్స్యః సుప్తో న నిమిషత్యండం జాతం న చేంగతే।
అశ్మనో హృదయంనాస్తి నదీ వేగేన వర్ధతే ॥ 64
యక్ష ఉవాచ। యక్షుడు అన్నాడు. yaksha said. 65
కింస్విత్ప్రవసతో మిత్రం కింస్విన్మిత్రం గృహే సతః।
ఆతురస్ చ కిం మిత్రం కింస్విన్మిత్రం మరిష్యతః ॥ 65

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 66
విద్యా ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః।
ఆతురస్య భిషఙ్భిత్రం దానం మిత్రం మరిష్యతః ॥ 66

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-67
కోఽతిథిః సర్వభూతానాం కిం స్విద్ధర్మం సనాతనం।
అమృతం కింస్విద్రాజేంద్రకింస్విత్సర్వమిదం జగత్ ॥ 67

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 68
అతిథిః సర్వభూతానామగ్నిః సోమో గవామృతం।
సనాతనోఽమృతో ధర్మో వాయుః సర్వమిదం జగత్ ॥ 68

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-69
కింస్విదేకో విచరతే జాతః కో జాయతే పునః।
కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్ ॥ 69

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 70
సూర్య ఏకో విచరతే యంద్రమా జాయతే పునః।
అగ్నిర్హమస్య భైషజ్యం భూమిరావపనం మహత్ ॥ 70

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-71
కింస్విదేకపదం ధర్మ్యం కింస్విదేకపదం యశః।
కింస్విదేకపదం స్వర్గ్యం కింస్విదేకపదం సుఖం ॥ 71

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 72
దాక్ష్యమేకపదం ధర్మ్యం దానమేకపదం యశః।
సత్యమేకపదం స్వర్గ్యం శీలమేకపదంసుఖం ॥ 72

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-73
కింస్విదాత్మా మనుష్యస్ కింస్విద్దైవకృతః సఖా।
ఉపజీవనం కిస్విదస్ కింస్విదస్య పరాయణం ॥ 73

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 74
పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృతః సఖా।
ఉపజీవనం చ పర్జన్యో దానమస్ పరాయణం ॥ 74

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-75
ధన్యానాముత్తమం కింస్విద్ధనానాం స్యాత్కిముత్తమం।
లాభానాముత్తమం కింస్యాత్సుఖానాం స్యాత్కిముత్తమం ॥ 75
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతం।
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ॥ 76

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-77
కింస్విద్ధర్మపరంలకే కశ్చ ధర్మః సదాఫలః।
కిం నియంయ న శోచంతి కైశ్ సంధిర్న జీర్యతే ॥ 77

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 78
ఆనృశంస్యం పరం ధర్మాత్రేతాధర్మః సదాఫలః।
మనో యంయ న శోచంతి సంధిః సద్భిర్న జీర్యతే ॥ 78

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-79
కింను హిత్వాప్రియో భవతి కింను హిత్వా న శోచతి।
కింను హిత్వాఽర్థవాన్భవతి కింను హిత్వా సుఖీ భవేత్ ॥ 79

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 80
మానం హిత్వాప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి।
కామం హిత్వాఽర్థవాన్భవతి లోమం హిత్వా సుఖీ భవేత్ ॥ 80

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-81
కిమర్థం బ్రాహ్మణే దానం కిమర్థం నటనర్తకే।
కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు ॥ 81

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 82
ధర్మార్థం బ్రాహ్మణే దానం యశోర్థం నటనర్తకే।
భృత్యేషు సంగ్రహార్థం చ భయార్థం చైవ రాజసు ॥ 82

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-83
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 83

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 84
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 84

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-85
మృత కథం స్యాత్పురుషః కథం రాష్ట్రం మృతం భవత్।
శ్రాద్ధం మృతంకథం వా స్యాత్కథం యజ్ఞా మృతో భవేత్ ॥ 85

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 86
మృతో దరిద్రః పురుషో | మృతం రాష్ట్రమరాజకం।
మృతమశ్రోత్రియం శ్రాద్ధం | మృతో యజ్ఞస్త్వదక్షిణః ॥ 86

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-87
కా దిక్కిముదకంపార్థ | కిమన్నం కించ వై విషం।
శ్రాద్ధస్ కాలమాఖ్యాహి | తతః పిబ హరస్వ చ ॥ 87

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 88
సంతో దిగ్జలమాకాశం గౌరన్నం బ్రాహ్మణం విషం।
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష మన్యసే ॥ 88

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-89
తపః కింలక్షణం ప్రోక్తం కో దమశ్చ ప్రకీర్తితః।
క్షమా చ కా పరా ప్రోక్తా కా చ హ్రీః పరికీర్తితా ॥ 89

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 90
తపః స్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః।
క్షమా ద్వంద్వసహిష్ణుత్వంహీరకార్యనివర్తనం ॥ 90

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-91
కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్కః శమశ్చ ప్రకీర్తితః।
దయా చ కా పరా ప్రోక్తా కిం చార్జవముదాహృతం ॥ 91

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 92
జ్ఞానం తత్త్వార్థసంబోధః శమశ్చిత్తప్రశాంతతా।
దయాసర్వసుఖైపిత్వమార్జవం సమచిత్తతా ॥ 92

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-93
కః శత్రుర్దుర్జయః పుంసాం కశ్చవ్యాధిరనంతకః।
కీదృశశ్చ స్మృతః సాధురసాధుః కీదృశః స్మృతః ॥ 93

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 94
క్రోధః సుదుర్జయః శత్రుర్లోభోవ్యాధిరనంతకః।
సర్వభూతహితః సాధురసాధుర్నిర్దయః స్మృతః ॥ 94

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-95
కో మోహః ప్రోచ్యతే రాజన్కశ్ మానః ప్రకీర్తితః।
కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చశోకః ప్రకీర్తితః ॥ 95

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 96
మోహో హిధర్మమూఢ్తవంమానస్త్వాత్మాభిమానితా।
ధర్మనిష్క్రియతాఽఽలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే ॥ 96

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-97
కిం స్థైర్యమృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతం।
స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే ॥ 97

యుధిష్ఠి ఉవాచ। 98
స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్యమింద్రియనిగ్రహః।
స్నానం మనోమలత్యాగో దానం వై భూతరక్షణం ॥ 98

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-99
కః పండిః పుమాన్జ్ఞేయో | నాస్తికః కశ్చ ఉచ్యతే।
కో మూర్ఖః కశ్చకామః స్యాత్ | కో మత్సర ఇతి స్మృతః ॥ 99

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 100
ధర్మజ్ఞః పండితో జ్ఞేయో | నాస్తికో మూర్ఖ ఉచ్యతే।
కామః సంసారహేతుశ్చ | హృత్తాపో మత్సరః స్మృతః ॥ 100

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-101
కోఽహంకార యఇతిప్రోక్తః కశ్చ దంభః ప్రకీర్తితః।
కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్పైశున్యముచ్యతే ॥ 101

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 102
మహాఽజ్ఞానమహంకారో దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయః।
దైవం రదానఫలం ప్రోక్తం పైశున్యం పరదూషణం ॥ 102

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-103
ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పరవిరోధినః।
ఏషాం నిత్యవిరుద్ధానాం కథమేకత్ర సంగమః ॥ 103

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 104
యదా ధర్మశ్భార్యా చ పరస్పరవశానుగౌ।
తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః ॥ 104

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-105
అక్షయోనరకః కేన ప్రాప్యతే భరతర్షభ।
ఏతన్మే పృచ్ఛతః ప్రశ్నం తచ్ఛీఘ్రం వక్తుమర్హసి ॥ 105

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 106
రబ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించనం।
పశ్చాన్నాస్తీతి యోబ్రూయాత్సోక్షయంనరకం వ్రజేత్ ॥ 106
వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యా యో వై ద్విజాతిషు।
దేవేషు పితృధ్రమేషు సోఽక్షయంనరకం వ్రజేత్ ॥ 107
విద్యమానే ధనే లోభాద్దానభోగవివర్జితః।
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్సోక్షయం నరకం వ్రజేత్ ॥ 108

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-109
రాజన్కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా।
బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్సునిశ్చితం ॥ 109

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 110
శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ శ్రుతం।
కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయః ॥ 110
వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః।
అక్షీణవృత్తో న క్షీణో వృత్తతస్తు హతో హతః ॥ 111
పఠకాః పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్రచింతకాః।
సర్వే వ్యసనినో మూర్ఖా యః క్రియావాన్స పండితః ॥ 112
చతుర్వేదోఽపి దుర్వృత్తః స శూద్రాదతిరిచ్యతే।
యోఽగ్నిహోత్రపోర దాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 113

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-114
ప్రియవచనవాదీ కిం లభతే
విమృశితకార్యకరః కిం లభతే।
బహుమిత్రకరః కిం లభతే
ధర్మే రతః కిం లభతే కథయ ॥ 114

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 115
ప్రియవచనవాదీ ప్రీయో భవతి
విమృశితకార్యకరోఽధికం జయతి।
బహుమిత్రకరః సుఖం వసత
యశ్చ ధర్మరతః స గతిం లభతే ॥ 115

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-116
కోమోదతేకిమాశ్చర్యం| కః పంథాః కా చ వార్తికా।
వద మే చతురః ప్రశ్నాన్ | మృతా జీవంతు బాంధవాః ॥ 116

యుధిష్ఠిర ఉవాచ 117
పంచమేఽహని షష్ఠే వా శాకం పచతి స్వే గృహే।
అనృణీ రచాప్రవాసీ చస వారిచర మోదతే ॥ 117
అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయం।
శేషాః స్థావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం ॥ 118
తర్కోఽప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా
నైకో మునిర్యస్య మతం ప్రమాణం।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గతఃస పంథా ॥ 119
పృథ్వీ విభాండం గగనం పిఘానం
సూర్యాగ్నినా రాత్రిదివేంధనేన।
మాసర్తుదర్వీపరిఘట్టనేన
భూతాని కాలః పచతీతి వార్తా ॥ 120

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-121
వ్యాఖ్యాతా మే త్వయా | ప్రశ్నా యథాతత్వం పరంతప।
పురుషం త్విదానీంవ్యాఖ్యా| అహి యశ్చ సర్వధనీ నరః ॥ 121

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 122
దివం స్పృశతి భూమిం చ శబ్దః పుణ్యేన కర్మణా।
యావత్స శబ్దో భవతి తావత్పురుష ఉచ్యతే ॥ 122
తుల్యే ప్రియాప్రియే యస్ సుఖదుఃఖే తథైవ చ।
అతీతానాగతే చోభే సవై పురుష ఉచ్యేత ॥ 123
`సమత్వం యస్య సర్వేషు నిస్పృహః శాంతమానసః।
సుప్రసన్నః సదా యోగీ స వై సర్వధనీ నరః' ॥ 124

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-125
వ్యాఖ్యాతః పురుషో రాజన్యశ్చ సర్వధనీ నరః।
తస్మాత్త్వమేకం భ్రాతృణాం యమిచ్ఛసి స జీవతు ॥ 125

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 126
శ్యామో య ఏష రక్తాక్షో బృహత్సాల ఇవోత్థితః।
వ్యూఢోరస్కో మహాబాహుర్నకులో యక్ష జీవతు ॥ 126

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-127
ప్రియస్తే భీమసేనోఽయమర్జునో వః పరాయణం।
త్వం కస్మాన్నకులం రాజన్సాపత్నం జీవమిచ్ఛసి ॥ 127
యస్ నాగసహస్రేణ దశసంఖ్యేన వై బలం।
తుల్యంతం భీమముత్సృజ్య నకులం జీవమిచ్ఛసి ॥ 128
తథైనం మనుజాః ప్రాహుర్భీమసేనం ప్రియం తవ।
అథ కనానుభావేన సాపత్నం జీవమిచ్ఛసి ॥ 129
యస్య బాహుబలంసర్వేపాండవాః సముపాసతే।
అర్జునం తమపాహాయ నకులం జీవమిచ్ఛసి ॥ 130

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 131
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః।
తస్మాద్ధఱ్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్ ॥ 131
ఆనృశంస్యం పరో ధర్మః పరమార్థాచ్చమే మతం।
ఆనృశంస్యం చికీర్షామి నకులో యక్ష జీవతు ॥ 132
ధర్మశీలః సదా రాజాఇతిమాం మానవా విదుః।
స్వధర్మాన్న చలిష్యామి నకులో యక్ష జీవతు ॥ 133
కుంతీ చైవ తు మాద్రీ చ ద్వే భార్యే తు పితుర్మమ।
ఉభే సపుత్రే స్యాతాం వై ఇతిమే ధీయతే మతిః ॥ 134
యథా కుంతీ తథా మాద్రీ విశేషో నాస్తి మే తయోః।
మాతృభ్యాం సమమిచ్ఛామి నకులో యక్ష జీవతు ॥ 135

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-

యస్ తేఽర్థాచ్చ కామచ్చ ఆనృశంస్యం పరం మతం।
తస్మాత్తే భ్రాతరః సర్వే జీవంతు భరతర్షభ ॥ 136.

315 వ ఆధ్యాయంలో యమ ధర్మరాజు తన పుత్రుడైన ధర్మరాజుకు తన నిజరూపాన్ని చూపించి వారి వనవాసం పూర్తి కావస్తున్నదని, అజ్ఞాత వాసంలో వారినెవరు గుర్తు పట్టరని దీవించాడు.

Great Poet YerrapragaDa మహాకవి ఎర్రాప్రగడ


ఎర్రాప్రగడ, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం, 423 వ పద్యం నుండి 459 వ పద్యం వరకు.

వ్యాసుడు: ముంబాయి వెర్షన్ లో 314 ఆధ్యాయం. కొన్ని ఇతరవెర్షన్లలో 297వ ఆధ్యాయం.

423. కందం. దినకరు నెయ్యది నడపును,
దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు రద్దే
వుని యస్తమించుటేమిట,
ననఘ తదాధారభూతమెద్ది యొకో,

424. తే.గీ. అనిన ధర్మజుడిట్లను నబ్జహితుని,
నడపు బ్రహ్మంబుసురకోటి నడచుఁ గొలిచి
ధర్మువున నస్తమితుఁ డగుఁ దపనుఁ డమ్మ
హాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు.

అనిన విని యక్షుండిట్లనియె.

కందం. ఏమిట శ్రోత్రియుఁడనఁజను,
నెమిటఁ గడు మహిమ వడయు నిమ్ముగఁ బురుషుం
డేమిట సహాయయుతుఁడగు, నేమిటనగు బుధ్ధిమంతుఁ డర్పడఁ జెపుమా.
అనిన నతండిట్లనియె.

కందం. శ్రుతము వలన శ్రోత్రియుఁడగు,
నతుల తపోయుక్తిఁ (లేక తపోవృత్తి) గడు మహత్వము వడయున్
ధృతిచే సహాయయుతుఁ డగు,
నతిశయముగ బుధ్ధిమంతుడగు బుధసేవన్.

వచనం. అని చెప్పిన అప్పార్ధివోత్తమున కప్పురుషుండు వెండియు నిట్లనియె.

తేటగీతి. ఏమి కతమున భూదేవుఁ డెసగు దేవ,
భావమున నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు నసాధుత్వ మెద్దానఁ జెందు
మానుషుండగు నాతడేదానఁ జెపుమ.

చంపకమాల. అనవుడు ధర్మజుండనియె నధ్యయనంబున దేవభావముం
గను నవనీసుపర్వుఁ డధిక వ్రతశీలత సాధుభావ మా
తనికి విశిష్ట వృత్తి దిగఁ ద్రావి యసాధు వనంగ నుండు శౌ
చనియతి లేక మృత్యుభయసంగతి నాతడు మానుషుండగున్.

కందం. నావుడు నతడాతనితో
జీవన్మృతుడెట్టివాడు సెప్పు మనుటయున్
దేవాతిథిపితృభృత్యజ
నావళులకు నిడక కుడుచు నతడని చెప్పెన్.

౪౩౩. విని మగుడంగ వాఁడు పృథివీపతిఁ జూచి ధరిత్రికంటె వ్రేఁ
కన జనుదాని నాకసము కంటె కడుం బొడవైనదాని గాడ్పునకును నెక్కుడై జనము పొంపిరి వోయెడుదానిఁ బూరి కం
టెను దరచైన దానని ఘటింపఁగ జెప్పుము నాకు నావుడున్.
౪౩౪.వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కిట్లనియె.

౪౩౫. ఆ.వె. తల్లి వ్రేఁగు సువ్వె ధరణికంటేను నాక,
సంబు కంటె పొడవు జనకు డరయ
గాడ్పు కంటె మనసు గడు శీఘ్రగతి తృణో
త్కరము కంటె చింత గరము తరచు.


౪౩౬.వ. అనిన అంబర చరుండు మరియు నిట్లనియె.
౪౩౭. తే. మొనసి నిద్రించియును గన్ను మూయ దెద్ది
పుట్టియును చేతనత్వంబు పొరయ దెద్ది
యరయ రూపు గల్గియు హృదయంబు లేని
దెద్ది వేగంబు కతనమున నెద్ది వొదలు.


౪౩౮. అనినఁ గన్ను మూయదు సుప్తమయ్యు మీను
పుట్టియును గ్రుడ్డు చేతనఁ బొరయకుండు
హృదయరహితంబు రారూప మేఱు రయము
కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు.


౪౩౯. చెప్పిన అయ్యక్షుం డతనితో తెరువు నడుచు వానికి రోగార్తునకు గృహస్తునకు మృతి పొందిన వానికి ఎవ్వరు సుట్టంబు లనిన అప్పుడమి ఱేఁడన్నలువురకుం గ్రమంబున సార్ధంబును, వైద్యుండును, సద్భార్యయును, కృతంబైన ధర్మంబును బరమ మిత్రులని నిర్దేశించుటయు , నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె.


౪౪౦. కందం. ఎయ్యది దర్మువునకుఁ గుదు
రెయ్యది యాశ్రయము కీర్తి కిమ్మగు మార్గం
బెయ్యది సురలోకమునకు,
నెయ్యది సుఖమునకు నిక్క యేర్పడఁ జెపుమా.


౪౪౧. వ. అని యడుగుటయు.


౪౪౨. కందం. అమరగ దాక్షిణ్యము ధ
ర్మమునకు కుదురండ్రు కీర్తి మహిమ నెలవు దా
నము సత్యము సురపురి మా
ర్గము శీలము సంశ్రయము సుఖంబుల కెల్లన్.


౪౪౩. వచనం. అని యుధిష్ఠిరుం డెరింగించిన వెండియు.


౪౪౪. చంపకామాల. నరునకు నాత్మ యెవ్వఁడు ఘనంబుగ దైవికమైన చుట్టమె
వ్వరతనికిం దదీయ మగు వర్తన మేమిట నిర్వహించు భూ
వర యతడేమి వూని యనవద్యతఁ బొందు నెఱుంగఁ జెప్పు మీ
నరుదుగ నన్న నక్కురుకులాగ్రణి యాతనితోడ నిట్లనున్.


౪౪౫. తేటగీతి. ఆత్మజుఁడు సువ్వె పురుషున కాత్మ యయ్యె
నాతనికి భార్య దైవిక మైన చుట్ట
మతని జీవిక పర్జన్యు కతనఁ జెల్లు
నతఁడు దానము గొనియాడి యతిశయిల్లు.


౪౪౬. చంపకమాల. అనవుడు మేటి ధర్మమగు నట్టిది యెయ్యది యేది యెప్పుడున్
తనియఁగ బండి యుండు నెనకంబున నెయ్యది నిగ్రహించినం
దనరుఁ బ్రమోదసిధ్ధి నియతంబుగ నెవ్వరి తోడి సంధి యెం
దును వికలంబు గాదు పరితోష మెరల్ప నుపన్యసింపుమా.


౪౪౭. వచనం. అని దివ్యుండు వలికిన నా దివ్యబోధనుం డిట్లనియె.


౪౪౮. ఆటవెలది. విను మహింస మేటి యనఁ జను ధర్మంబు
యాగకర్మ మెపుడు నమరఁ బండి
యుండు మనసు క్రొవ్వు ఖండింపఁగా మోద
మెసగు సుజన సంధి యెడల దెందు.


౪౪౯. తేటగీతి. అనిన నతఁడు లోకమునకు నెయ్యది దిక్కు
జలము నన్నంబు నెద్దాన సంభవించు
విషమనంగ నెయ్యది శ్రాధ్ధవిధికి నెద్ది
సమయ మనిన నిట్లని చెప్పె జన విభుండు.


౪౫౦. తేటగీతి. సజ్జనులు దిక్కు సూవె యీ సర్వమునకు
నభము ధరణియు జలము నన్నమ్ము నుద్భ
వించు నెలవులు విషమగు విప్రధనము
లనఘ శ్రాధ్ధకాలము బ్రాహ్మణాగమంబు.


౪౫౧. వచనం. అని తెలిపిన నయ్యక్షుండు ధర్మ నందనుతో మనుజుండెయ్యది పరిత్యజించి సర్వజన ప్రియుండును నిశ్శోకండును నర్ధవంతుండును సుఖియును నగు ననిన నమ్మహీపతి యిట్లనియె.


౪౫౨. తేటగీతి. సర్వ జన సమ్ముతుండగు గర్వ ముడిగి
క్రొధ మడఁచి శోకమునకుఁ గుదురు గాఁడు
వినవె యర్ధాఢ్యుఁ డగు లోభ మొనర విడిచి
తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుఁ గాంచు.


౪౫౩. వచనం. అనిన యనంతరంబ యద్దివ్యుండతనితోఁ బురుష శబ్ద వాచ్యుండెట్టి వాఁడు మఱి సర్వధని యగు వాఁ డెవ్వండు నిశ్చయింపు మనినఁ బాండవ జ్యేష్ఠుండిట్లనియె.


౪౫౪. కందం. దివి ముట్టి ధరణి యంతట
నివిడి మెఱయు చుండు నెవ్వని యశోరమ య
ట్టి విశిష్ట చరిత్రుఁడు య
క్షవరా పురుషుండు నాఁ బ్రకాశత నొందున్.


౪౫౫. ఆటవెలది. ప్రియము నప్రియంబుఁ బెల్లగు సౌఖ్యదుః
ఖములు భూత భావి కార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధని యనఁ
బరగుఁ జువ్వె యట్టి భవ్యుఁ డనఘ.


౪౫౬. వచనం. అని వివరించిన విని యుధిష్ఠిరు దసఁ బ్రసాద మధురబైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు మహాత్మా మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి నీవలనం బ్రీతుండ నైతి నీతమ్ముల యందొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు మనిన నతడు.


౪౫౭. సీసం. శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సాలప్రాంశు నున్నత లలితబాహు
నకులుని బ్రతికింపు నావుడు యక్షుండు భీమ ఫల్గును లతి భీమ బలులు
ప్రియులు నీకెంతయుఁ బృథివీశ వీరిలో నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి
తనుడు ధర్మాత్మజుం డనియెడు మాతండ్రి యగు పాండు విభునకు మగువ లిరువు


ఆటవెలది. రందు గొంతి కొడుకు లైన మువ్వురిలోన, నేను బ్రతికినాఁడ నింక మాద్రి
తనయు లిరువురందు నొక్కుండిప్డు,
బ్రతుక వలదె చెపుమ పాడి తెఱఁగు.


౪౫౮. ఆటవెలది. ధర్మనందనుండు ధర్మాత్ముఁడని యెప్డు
దగిలి జగము నన్నుఁ బొగడు చుండు
నట్ట యేను ధర్మహానికి నోర్వజు
మ్మెత వచ్చెనేని యింత నిజము.


౪౫౯. వచనం. అనిన నతండు నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి, నీ తమ్ములందఱు లబ్ధ జీవితులయ్యెద రనిన నక్షణంబ విగత క్షుత్ పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కనిన తెఱంగున సముత్థితు లైనం జూచి విస్మితుండై ధర్మపుత్రుండి ట్లనియె.


౪౬౦. చంపకమాల. నిను నొక యక్షమాత్రుఁడని నెమ్మి నమ్మఁగ నేర నయ్యెదన్
జననుత నీవు నిక్కముగ శక్రుడవో యలకాధిపుండవో
యనలుఁడవో సమీరుఁడవొ యట్లునుగాక జగన్నుతుండు మజ్జనకుఁడు నైన ధర్ముఁడవొ సత్కృపఁ జెప్పుము నాకు నావుఁడన్.


౪౬౧. వచనంబు. అమ్మహాత్ముండు మందస్మితననుండై.

౪౬౨. మత్తకోకిలము.
ఏను ధర్ముఁడఁజువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
దానముం దపమున్ శమంబును దాంతియున్ యశముం పరి
జ్డానయుక్తియు నాదు మూర్తులు సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమ ధార్మికున్ నినుఁ జూచు వేడుక వచ్చితిన్.


౪౬౩. వచనం. నన్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబులైన వరంబు లిచ్చెద నడుగు మనినఁ బాండవాగ్రజుండు సంభ్రమ భక్తి పరుండగుచు దండప్రణామంబు సేసి యద్దేవోత్తముం బ్రస్తుతించి దేవా మదీయాశ్రమ వాసుండైన భూసుర వరు నరణి యొక్క హరిణంబు చేత నపహృతంబయ్యె నతనికం గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే యనినఁ బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు.


౪౬౪. కందం. వినుమేను నీమనోగతి,
యనఘా యెఱుగంగవేఁడి యరణీ హరణం
బొనరించితి మృగ మెక్కడి
దని యమ్మహనీయ వస్తు వతనికి నిచ్చెన్.


౪౬౫. వచనం. ఇచ్చి మఱియు నిట్లనియే. పదమూఁడవ యేడు నరుదెంచె నింక మీరజ్ఞాత వాసంబు సలుప వలయు నందు మీరెవ్వ రెక్కడ నేరూపంబనం జరియింపం గోరిన నయ్యైరూపంబు లలవడియెడు నెట్లున్నను మిమ్మెవ్వరు నెఱుంగ కుండనట్లుగా వరంబిచ్చితి నింక నొండెయ్యది వలసిన నడుగు మనిన నమ్మనుజేశ్వరుండిట్లనియె.


౪౬౬. మత్తకోకిలము.

ఆదిదేవుండ వైన నీవు దయామతిం బొడసూపి న
న్నాదరించుటఁ జేసి ధన్యుఁడనైతి నింతకు నెక్కుడొం
డేది కలునె యైన నామది యెల్లవాఁడును గ్రోధమోహాదులం బెడఁబాసి ధర్మువు నంద నెక్కొనఁ జేయవే.

౪౬౭. వచనం. అనిన నద్దేవుండతనికి నవ్వరంబొసంగి యంతర్హితుండయ్యెఁ గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబు కరిగి ధరణీదేవునకు నరణీ ప్రదానంబు సేసి తత్ ప్రయుక్తాశీర్వాదంబులు గైకొని పరమానందంబునం బొందిరని యిట్లు పాండు తనయుల వనవాస ప్రకారంబు సవిస్తర మధురంబుగా నుపన్యసించి.


౪౬౮. కందం. అనఘుఁడు గృష్ణద్వైపా
యన శిష్యుఁడు బోధనిధి సమంచిత మేధా
ఘనునకుఁ బారిక్షితునకు
ననవరానంద సుఖ సమగ్రత యొసఁగెన్.

ఇక్కడితో ఆరణ్య పర్వం అయిపోయింది. ఈసందర్భంగా ఎర్రన చెప్పిన పద్యాలు కూడ అవశ్య పఠనీయాలే. నాకు వదలి వేయ బుధ్ధి కావటంలేదు.

౪౬౯. సీసం. భవ్యచరిత్రుఁ డాపస్తంభసూత్రుండు శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడు సూరనార్యునకును బోతమాంబికకును
నందనుఁడిల బాకనాటిలో నీలకంఠేశ్వర స్థానమై యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు ధన్యుండు ధర్మైక తత్పరాత్ముఁ

తేటగీతి. డెఱ్ఱనార్యుండు సకల లోకైక విదితుఁ
డయన నన్నయ భట్ట మహాకవీంద్రు
సరస సారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
జెందుటయు సాధుజన హర్ష సిధ్ధిఁ గోరి.

౪౭౦. కందం. ధీరవచారుఁడు తత్కవ
తారీతియుఁ గొంత దొప దద్రచనయకా
రణ్యపర్వ శేషమున్
బూరించెఁ గవీంద్ర కర్ణ పుట పేయముగాన్.

౪౭౧. కందం. వీరావతార విమలా
చార మహోదార శుభవిచార సుజనమం
దార నవకీర్తి మౌక్తిక
హార హర పదాబ్డ మధుకరాత్మ విహారా.

౪౭౨. తరలము.
అమిత వైభవ లోబ మోహ మదాది దుర్లభ మంజువి
భ్రమ విలాసిత కామినీ జన పంచ బాణ నిరంతరా
నమద శేష నృపాల మౌళి పినధ్ధ ముగ్ధమణి ప్రభా
క్రమ సమంచిత విస్ఫురత్ పదకాంతి నిర్జిత పంకజా.

గద్యం. ఇది సకల సుకవి జన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందారణ్య పర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణ యుధ్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ చరిత్రంబును సూర్యుండు గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ గర్ణు జన్మంబును, నింద్రుడు విప్రరూపంబునఁ గర్ణు కవచకుండలంబులు హరించుటయు నారణేయంబును యక్ష ప్రశ్నలును ధర్ముండు ధర్మజునకు వరంబు లొసంగుటయు, నన్నది సర్వంబును సప్తమాశ్వాసము.
శ్రీమదాంధ్ర మహా భారతమునందలి యారణ్య పర్వము సమాప్తము.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


వ్యాసుడు 89 శ్లోకాలు వాడుకున్నాడు (47 వశ్లోకం నుండి 136వ శ్లోకం వరకు). ఎర్రాప్రగడ మొత్తం 36 పద్యాలు (42౩ నుండి 459 వరకు) వాడుకున్నాడు. అంటే షుమారు రెండున్నర రెట్లు కుదించినట్లు.

ఇలా పద్యాల సంఖ్యను కుదించే క్రమంలో కొన్ని ప్రశ్నలు, జవాబులు కవర్ కాలేదు. అంతే కాక పద్యకవిత్వావసరమైన ఛందస్సును పాటించ వలసి రావటం వల్ల కొంత కుదింపు జరిగి ఉండ వచ్చు. మొత్తం మీద ఎర్రన అనువాదం శైలీభేదం ఉన్నప్పటికి నన్నయకి ఏమాత్రం తీసిపోదు.

కొంత స్వంత గోల


నిజమైన బ్లాగులు (వెబ్ లాగులు) అంటేనే కొంత స్వంత గోల ఉండాలి.

ఎర్రన శ్రీవత్స గోత్రీకుడు. మేము కూడ శ్రీవత్స గోత్రీకులమే.

సగోత్రీకులు బంధువులు కారని పరిశోథకులు చెప్పారు.

సరదాగా రెండు విషయాలు వ్రాస్తున్నాను.

1. పై పద్యాలలో, ఎర్రన శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడ నని చెప్పాడు. ఎర్రనయందు నాకింత భక్తి ఉన్నప్పటికి ఆయనకున్న శివభక్తి నాకు అంటలేదు. అదేమి చిత్రమో, నేను నాస్తికుడ నయ్యాను.

2. నేను పూర్వాశ్రమంలో (పూర్వ జన్మ అని కూడ అనచ్చు. నా దృష్టిలో ప్రతి వృత్తీ కూడ ఒక జన్మయే. పలు జన్మలు పొందిన అదృష్టం నాకు కూడ కలిగింది.) ఒక ప్రభుత్వరంగ బ్యాంకు అధికారిగా పనిచేసిన కాలంలో మా ఒక బాస్ కూడ శ్రీవత్స గోత్రీకుడే. ఆయన బ్యాంకులో ఏవైనా ప్రారంభించాల్సి వచ్చినపుడు హిందూ(త్వ) పధ్దతిలో పురోహితులచేత పూజలు చేయించే వాడు. పూజ చేసే పురోహితులు పూజకు కూర్చున్న ఆయనను గోత్రమడిగినపుడు శ్రీవత్స గోత్రమని చెప్పేవాడు. మన పూజా మంత్రాలలో ''ఇష్ట సంకల్పాది సిధ్ధ్యర్ధం, పుత్రపౌత్రాది వృధ్ధ్యర్ధం వంటి'' సబ్మిషన్స్ ఉంటాయి.

ఒకరోజు ఏదో సంభాషణ వచ్చినపుడు నేను హాస్యానికి ఆయనతో అన్నాను. ''మీ గోత్రం, మాగోత్రం ఒకటే. బ్యాంకు ఖర్చుతో మీ వంశం(పుత్ర పౌత్రాభివృధ్ధి)తో పాటు మా వంశం కూడ అభివృధ్ధి చెందుతుంది లేండి '' అన్నాను. ఆయన నవ్వి ఊరుకున్నాడు.

తిరగవ్రాయాల్సినది ఉంది. ఈయక్ష ప్రశ్నలపై వ్యాఖ్యలను, విమర్శలను, సందేహాలను ఆహ్వానిస్తున్నాను. నేను గొప్ప నిపుణుడనేమీ కాదు. నాశక్తి కొద్ది ప్రయత్నిస్తాను. ఇందులో ఏముంది అనుకోకండి. ఈయక్ష ప్రశ్నలపై 1000 పేజీల పుస్తకం వ్రాయ వచ్చు. నాకాభాగ్యం కలుగుతుందో లేదు. ౧౧-౧౪ శతాబ్దాలకి చెందిన ఎందుకంటే కవిత్రయానికి ఉన్న శ్రధ్ధ ౨౧ శతాబ్దానికి చెందిన మనకెలా వస్తుంది?

Friday, February 7, 2014

128 Pampering the Media

128 Son-in-law showing lofty charity with mother-in-laws money అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
చర్చనీయాంశాలు: media, steel industry, కవిత్రయము, నన్నయ, మహాభారతం, వ్యాసుడు, పద్యకవిత్వము




We have in our mother tongue Telugu a proverb. మా మాతృభాష తెలుగులో ఒక లోకోక్తి ఉన్నది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. Its gist is: దాని సారం: Son-in-law showing lofty charity with mother-in-laws money.

We have a figure of speech in Telugu. మనకు తెలుగులో రెండు అలంకారాలు ఉన్నాయి. The first is drishTAntam. This figure of speech, we can get by giving an example. మొదటిది దృష్టాంతం. ఈ అలంకారాన్ని మనం ఉదాహరణ ఇవ్వటం ద్వారా పొందవచ్చు.

The second figure of speech is ardhAntara nyAsam. రెండవ అలంకారం అర్ధాంతరన్యాసం. First we make a statement. Then support it with a special instance of the occurrence. Vice versa can also be done. ముందు ఒక ప్రకటన ఇస్తాము. దానిని ఒక ప్రత్యేక సంఘటనను చేర్చటం ద్వారా సమర్ధిస్తాము. విపర్యం కూడ చేయవచ్చు. అంటే ప్రత్యేక సంఘటనను ముందు చెప్పి దానిలోనుండి మనం తార్కికంగా పొందగలిగే ప్రకటనను జోడిస్తాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాము. We shall now see some examples.

21st Century. 21వ శతాబ్దము


The Union Steel Minister Beniprasad Varma distributed a largesse of gadgets and gifts to media men and his party members in his Constituency. by spending Rs. 40 million of SAIL. కేంద్ర ఉక్కు మంత్రి బేణీప్రసాద్ వర్మ గారు, సెయిల్ వారి నిధులను వినియోగించి, తన నియోజకవర్గంలోని తన పార్టీ సభ్యులకు, మీడియా విలేఖరులకు, షుమారు రూ. 4 కోట్ల రూపాయల విలువ గల బహుమతులు, మొబైల్ ఫోన్లు పంచి పెట్టుకున్నారు. He boasted that when his industry was making profits, what was wrong in spending a few crore on publicity? శ్రీవారు పైగా కోతలు కోశారు. మా ఉక్కు పరిశ్రమ లాభాలతో నడుస్తున్నపుడు ఓ నాలుగు కోట్లు ప్రచారానికి ఖర్చు చేయటం తప్పా? అని.

Here, the money belongs to the people (Public Sector or Government body). ఇక్కడ, డబ్బు ప్రజలది (ప్రభుత్వరంగ సంస్థది). The distributing son-in-law is Beniprasad Varma, the Minister. పంచి పెట్టే అల్లుడు బేణీ ప్రసాద్ వర్మ.

Mahabharata period మహాభారత కాలం


The context in mahAbhArata. మహాభారతంలో సందర్భం.



పాండవుల, కౌరవుల అస్త్ర విద్యాప్రదర్శనం. కర్ణాగమనం. కర్ణ విద్యా ప్రదర్శనం. దుర్యోధనుడి ఆనందం. కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుధ్ధం చేయాలని కోరిక వ్యక్తం చేయటం. పిలవని పేరంటం అని అర్జునుడి అభ్యంతరం. రాజులకు రాజులకు మధ్య మాత్రమే యుధ్ధం పొసగుతుందని పెద్దాయన చెప్పటం. కర్ణుడి అవనత ముఖం. సుయోధనుడు కర్ణుడికి అంగరాజ్యాభిషేకం చేయటం.
Adi126 036 tatas tasmin kshaNE karNah salAja kusumair ghaTaih-
kAncanaih kAncanE pIThE mantravidbhir mahArathah
abhishikto angarAjyE sa SriyA yukto mahAbalah
sacchatravAlavyajano jayaSabdAntarENa ca-

Notes: this quote is from mahAbharata Bombay version of the bhanDarkar library. This does not mention about gifting of 1000 cows each to 1000 priests.

Bengal version. బెంగాల్ వెర్షన్


వైశంపాయన ఉవాచ। 1-146-39x (873)
`తతో రాజానమామంత్ర్య గాంగేయం చ పితామహం।
అభిషేకస్య సంభారాన్సమానీయ ద్విజాతిభిః॥
1-146-39 (6659)
గోసహస్రాయుతం దత్త్వా యుక్తానాం పుణ్యకర్మణాం।
అర్హోఽయమంగరాజ్యస్య ఇతి వాచ్య ద్విజాతిభిః'॥
1-146-40 (6660)
తతస్తస్మిన్క్షణే కర్ణః సలాజకుసుమైర్ఘటైః।
కాంచనైః కాంచనే పీఠే మంత్రవిద్భిర్మహారథః॥
బెంగాల్ వెర్షన్ లో 20 ఆధ్యాయాలు ముందుకు వెళ్ళింది. ఇందులో వేయి ఆవులు ఇచ్చారన్నారు కానీ, ఎంత మంది పురోహితులకో వ్రాయలేదు. సహస్ర సహస్రం అంటే మిలియన్ అనే అర్ధం తీసుకోలేము.

ఇపుడు నన్నయగారి ప్రసన్నకథా కలితార్ధయుక్తి


శ్రీమదాంధ్ర మహాభారతం, ఆది పర్వం, షష్ఠాశ్వాసం (6వ ఆశ్వాసం). తెలుగు మహా భారతంలో ఆశ్వాసాలు. ఒక ఆధ్యాయం ఒక ఆశ్వాసం సమానం, సమాంతర అనువాదం కాదు. ఒక ఆశ్వాసంలో ఎన్నైనా ఆధ్యాయాలను కవర్ చేయవచ్చును.

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆది పర్వం, షష్ఠాశ్వాసం (6వ ఆశ్వాసం). 49వ పద్యం.
వచనం.
అని యప్పుడ భీష్మ ధృతరాష్ట్రులకుం జెప్పి వారి యనుమతంబున మహామహీ సురసహస్రంబునకు గోసహస్రాయతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీడ ర్హుండయ్యెడనుచు బ్రాహ్మణ వచనంబు వడసి కర్ణుం గాంచన పీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండును మణి మకుట కేయూర హారాది భూషణ భూషితుండై సకల రాజ చిహ్నంబుల నొప్పి పరమ హర్షంబుతోడం గురుపతి కిట్లనియె.
మహామహీసుర సహస్రం -- వేయి మంది బ్రాహ్మణులు.
గోసహస్రాయతంబు -- వేయి ఆవులు.
ఇచ్చిన తరువాత బ్రాహ్మణులు, కర్ణుడు అంగరాజ్యాభిషేకానికి అర్హుడని ప్రకటించారు. అపుడు పట్టాభిషేకం. బంగారు సింహాసనం.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


బ్రాహ్మణ సహస్రాలకు గోసహస్రాలిచ్చినా, మీడియా టీవి, పత్రికా విలేఖరులకు, పార్టీ సభ్యులకు మొబైల్ ఫోన్ లిచ్చినా, రాజపుత్రుడిచ్చినా, మంత్రిచ్చినా అది ప్రజల సొత్తేకదా.

అందుకే అత్తసొమ్ము అల్లుడు దానం చేయటం అనే సూక్తిని బేణీ ప్రసాద్ వర్మగారే కాదు, అన్ని రాజకీయ పార్టీల నేతలు సార్ధకం చేస్తున్నారు. నరేంద్రమోడీ గారు, జయలలితగారు, రాహుల్ గాంధీగారు, సహారా ఫైనాన్స్ వారు ఫుల్ పేజీ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారంటే, అదిప్రజల సొత్తనే కదా. కష్టపడి సంపాదించిందైతే, అవసరమా అనవసరమా అని ఆలోచించే వాళ్ళు.

Here is a proverb from Telugu language, in Roman Script: "atta sommunu alluDu dAna micchADuTa". Approx. English: Son-in-law gave away in charity, his Mother-in-law's Property. Here, the intended jibe is: Nobody will indulge in great charities, if the money is his-her own and is hard-earned. Everybody will be a great donor, while gifting away others' properties. (Notes: Though Mr. Bill Gates, and others went on canvassing-mobilising huge charities, there were tax benefits associated with Trust Charities. If there is no heavy taxation, or no tax concessions for charities, or some other indirect benefit, Mr. Gates or any other Corporate Tycoon will have opened his fists).

ఇదీ ఈ భారతదేశం.

Tuesday, December 10, 2013

92 What Draupadi and Subhadra have done during their picnic? ద్రౌపది, సుభద్రలు పిక్నిక్ కు వెళ్ళి ఏమి చేశారు?


చర్చనీయాంశాలు: mahabharata, మహాభారతం, వ్యాసుడు, నన్నయ, పద్యకవిత్వం

నన్నయ ఎండా కాలాన్ని ఎలా వర్ణించాడు? (ఈపద్యాన్ని దాచుకొని ఎండాకాలంలో చదువుకుంటే రమ్యంగా ఉంటుంది.



శ్రీమదాంధ్రమహాభారతం, అష్టమాశ్వాసము, 225వ పద్యం.

చంపకమాల.
ఉరుతర దావ పావక శిఖోత్కలిత శ్వసనంబులున్ సితే
తర గతి తీవ్ర తిగ్మ కర ధామ సహస్రములున్ బహు ప్రవా
హరహిత నిమ్నగాతతులు నై కడు దీర్ఘములై నిదాఘవా
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబులై.

ఇందులో అసహ్యం అనే పదానికి ఆనాటి అర్థం గమనించండి. ఎండలు సహింపరానివి అంటే భరించలేనంత ఎక్కువగా ఉన్నాయి అనే మధ్యస్థాయి అర్ధం. నేడు అసహ్యం అనే అర్ధానికి despicable, abominable అనే నీచార్ధం ఎక్కువవాడుకలోకి వచ్చింది.

ఉదాహరణ: పాయఖానాలు అసహ్యంగా, అశుభ్రంగా ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కి దేశంలో మూడవ స్థానం.

మహాభారతంలో సందర్భం: సుభద్రార్జునుల వివాహం అయి పోయింది. అభిమన్యుడు పుట్టాడు. ద్రౌపదికి ఉపపాండవులు పుట్టారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు. ఎండలు మండి పోతున్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుడితో పిక్నిక్ కి వెళ్దామని ప్రతిపాదిస్తున్నాడు. దీని తరువాతనే ఖాండవ దహన ఘట్టం వస్తుంది. అర్జునుడు అంటున్నాడు, నన్నయ ఎంత సుందరంగా వర్ణించాడో చూడండి.

చంపకమాల.
జలరుహనాభ రమ్యగిరి సాను వనంబుల వేటలాడుచున్
జలుపుదమీ నిదాఘ దివసంబుల నీవును నేనున్ ఉన్మిష
న్సలిల రజ స్సుగంధి యమునా హ్రద తుంగ తరంగ సంగతా
నిల శిశిర స్థలాంతర వినిర్మిత నిర్మల హర్మ్య రేఖలన్.

జలరుహనాభ = పద్మనాభం, అంటే కృష్ణుడు. రమ్యగిరి సాను వనంబులు అంటే అందమైన పర్వతలోయలలో ఉండే అడవులు. వేటాడుతూ రోజులు గడుపుదాము. (ఆరోజుల్లో అదే పని షికారీ. క్రూరజంతువులనుండి ప్రజలను రక్షించటం అనే మిష ఉంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరుడు కూడ పారువేటకు వెళ్తాడు).

ఆకాలంలో ఎ.సీ.లా పాడా! ఇపుడు కెసీఆర్ మొదలగు నేతలకు ఫారమ్ హౌస్ లు ఉన్నట్లు, ఆరోజుల్లో నదీతీరాల్లో, అడవుల అంచుల్లో రాజులకు భవనాలు ఉండేవి. (భరత్ పూర్ , రాజస్థాన్ రాజప్రాసాదాలు సరస్సుల మధ్యలో ఉన్నట్లుగా. అవి నేడు 5స్టార్ హోటళ్ళుగా మార్చబడ్డాయి).

ఇక్కడ అద్భుతమైన సమాసాన్ని నన్నయ వాడాడు. 'ఉన్మష స్సలిల రజ స్సుగంధి యమునా హ్రద తుంగ తరంగ సంగతా నిల శిశిర స్థలాంతర వినిర్మిత నిర్మల హర్మ్య రేఖలన్.' వచనం.
అని పురందరనందనుండు, గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్య భృత్యసమేతులయి యిద్దఱు నరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాఁడు ఖాండవ వన సమీపంబున నొక్క చందనలతా భవన చంద్రకాంత వేదికయందు మందశీతల సురభి మారుతం బనుభవించుచు నిష్ట కథావినోదంబుల నుండునంత.

వైబీరావు గాడిద వ్యాఖ్య

వ్యాసుడి ప్రకారం, ఈపిక్నిక్ కు గోవిందుడితో పాటు సత్యభామ , అర్జునుడితో పాటు ద్రౌపది, సుభద్రలు కూడా వెళ్ళారు.
ఇక్కడ నన్నయ ప్రకారం, గోవిందార్జునులు మిత్రామాత్య సమేతులయి మిత్రామాత్య సమేతులయి భవన చంద్రకాంత వేదికయందు మంద శీతల సురభిమారుతంబనుభవించుచు , అంటున్నాడు. సత్యభామ, ద్రౌపది, సుభద్ర సంగతి చెప్పటంలేదు. (మన్మోహన్ సింగ్ గారు విదేశాలకు పిక్నిక్ లకు వెళ్ళినపుడు, శ్రీమతి సింగ్ గారిని తీసుకు వెళ్తున్నారా లేదా?

నన్నయ ద్రౌపదీ సుభద్రల మద్యపానాన్ని ఎందుకు దాటేశాడు? రాజరాజ నరేంద్రుడికి కోపం వస్తుందనా? కాకపోవచ్చు. నన్నయ ప్రసన్న కథాకలితార్ధయుక్తి పరుడు కదా.

సంస్కృత వ్యాస మహాభారతం, ఆదిపర్వం, 234వ ఆధ్యాయం, 34వ శ్లోకం.

1-248-13 (10787) తతః కతిపయాహస్య బీభత్సుః కృష్ణమబ్రవీత్। ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్ఛావో యమునాం ప్రతి॥
1-248-14 (10788) సుహృజ్జనవృతౌ తత్ర విహృత్య మధుసూదన। సాయాహ్నే పునరేష్యావో రోచతాం తే జనార్దన॥
1-248-15 (10789) వాసుదేవ ఉవాచ। 1-248-16x (1315) కుంతీమాతర్మమాప్యేతద్రోచతే యద్వయం జలే। సుహృజ్జనవృతాః పార్థ విహరేమ యథాసుఖం॥
1-248-16 (10790) వైశంపాయన ఉవాచ। 1-248-17x (1316) ఆమంత్ర్య తౌ ధర్మరాజమనుజ్ఞాప్య చ భారత। జగ్మతుః పార్థగోవిందౌ సుహృజ్జనవృతౌ తతః॥
1-248-17 (10791) `విహరన్ఖాండవప్రస్థే కాననేషు చ మాధవః। పుష్పితోపవనాం దివ్యాం దదర్శ యమునాం నదీం॥
1-248-18 (10792) తస్యాస్తీరే వనం దివ్యం సర్వర్తుసుమనోహరం। ఆలయం సర్వభూతానాం ఖాండవం ఖడ్గచర్మభృత్॥
1-248-19 (10793) దదర్శ కృత్స్నం తం దేశం సహితః సవ్యసాచినా। ఋక్షగోమాయుశార్దూలవృకకృష్ణమృగాన్వితం॥
1-248-20 (10794) శాఖామృగగణైర్జుష్టం గజద్వీపినిషేవితం। శకబర్హిణదాత్యూహహంససారసనాదితం॥
1-248-21 (10795) నానామృగసహస్రైశ్చ పక్షిభిశ్చ సమావృతం। మానార్హం తచ్చ సర్వేషాం దేవదానవరక్షసాం॥
1-248-22 (10796) ఆలయం పన్నగేంద్రస్య తక్షకస్య మహాత్మనః। వేణుశాల్మలిబిల్వాతిముక్తజంబ్వాంరచంపకైః॥
1-248-23 (10797) అంకోలపనసాశ్వత్థతాలజంబీరవంజులైః। ఏకపద్మకతాలైశ్చ శతశశ్చైవ రౌహిణైః॥
1-248-24 (10798) నానావృక్షైః సమాయుక్తం నానాగుల్మసమావృతం। వేత్రకీచకసంయుక్తమాశీవిషనిషేవితం॥
1-248-25 (10799) విగతార్కం మహాభోగవితతద్రుమసంకటం। వ్యాలదంష్ట్రిగణాకీర్ణం వర్జితం సర్వమానుషైః॥
1-248-26 (10800) రక్షసాం భుజగేంద్రాణాం పక్షిణాం చ మహాలయం। ఖాండవం సుమహాప్రాజ్ఞః సర్వలోకవిభాగవిత్॥
1-248-27 (10801) దృష్టవాన్సర్వలోకేశ అర్జునేన సమన్వితః। పీతాంబరధరో దేవస్తద్వనం బహుధా చరన్॥
1-248-28 (10802) సద్రుమస్య సయక్షస్య సభూతగణపక్షిణః। ఖాండవస్య వినాశం తం దదర్శ మధుసూదనః॥
' 1-248-29 (10803) విహారదేశం సంప్రాప్య నానాద్రుమమనుత్తమం। గృహైరుచ్చావచైర్యుక్తం పురందరపురోపమం॥
1-248-30 (10804) భక్ష్యైర్భోజ్యైశ్చ పేయైశ్చ రసవద్బిర్మహాధనైః। మాల్యైశ్చ వివిధైర్గంధైస్తథా వార్ష్మేయపాండవౌ॥
1-248-31 (10805) తదా వివిశతుః పూర్ణం రత్నైరుచ్చావచైః శుభైః। యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత॥
1-248-32 (10806) స్త్రియశ్చ విపులశ్రోష్ణ్యశ్చారుపీనపయోధరాః। మదస్ఖలితగామిన్యశ్చిక్రీడుర్వామలోచనాః॥
1-248-33 (10807) వనే కాశ్చిజ్జలే కాశ్చిత్కాశ్చిద్వేశ్మసు చాంగనాః। యథాదేశం యథాప్రీతి చిక్రీడుః పార్థకృష్ణయోః॥
1-248-34 (10808) వాసుదేవప్రియా నిత్యం సత్యభామా చ భామినీ। ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంస్యాభరణాని చ।
ప్రాయచ్ఛంత మహారాజ స్త్రీణాం తాః స్మ మదోత్కటాః॥
1-248-35 (10809) కాశ్చిత్ప్రహృష్టా ననృతుశ్చుక్రుశుశ్చ తథా పరాః। జహసుశ్చ పరా నార్యః పపుశ్చాన్యా వరాసవం॥
1-248-36 (10810) రురుధుశ్చాపరాస్తత్ర ప్రజఘ్నుశ్చ పరస్పరం। మంత్రయామాసురన్యాశ్చ రహస్యాని పరస్పరం॥


స్వర్గీయ కిషోర్ మోహన్ గంగూలీ గారి ఆంగ్లానువాదం, స్వల్ప మార్పులతో.
After a few days, Bibhatsu (Arjuna), addressing Krishna, said, ‴summer days have set in, O Krishna! Therefore, let us go to banks of Yamuna. O slayer of Madhu, sporting there in company of friends, we will, O Janardana, return inevening‴.

Krishna said, ‴O son of Kunti, this is also my wish. Let us, O Partha, sport in waters as we please, in company of friends. having consulted thus with each other, Partha and Govinda, with Yudhishthira‴s leave, set out, surrounded by friends.

Reaching a fine spot (on banks of Yamuna) suitable for purposes of pleasure, overgrown with numerous tall trees and covered with several high mansions that made place look like celestial city and within which had been collected for Krishna and Partha numerous costly and well-flavoured viands and drinks and other articles of enjoyment and floral wreaths and various perfumes, party entered without delay inner apartments adorned with many precious gems of pure rays.

Entering those apartments, everybody, began to sport, according to his pleasure. women of party, all of full rotund hips and deep bosoms and handsome eyes, and gait unsteady with wine began to sport there at command of Krishna and Partha. Some amongst women sported as they liked in woods, some in waters, and some within mansions, as directed by Partha and Govinda.

Draupadi and Subhadra, exhilarated with wine, began to give away unto women so sporting, their costly robes and ornaments. some amongst those women began to dance in joy, and some began to sing; some amongst them began to laugh and jest, and some to drink excellent wines. Some began to obstruct one another‴s progress and some to fight with one another, and to discourse with one another in private.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

చివరిలో గమనించండి. ద్రౌపది, సుభద్రలు వైన్ ఎక్కువై తమ శరీరాలపై ఉన్న బట్టలను, నగలను పరిచారికలకు ఇవ్వటం ప్రారంభించారు.

ఆనాటి రాచరిక స్త్రీలకు ఆమాత్రం మద్యం లేకపోతే పరిచారికల బ్రతుకులు మరీ దరిద్రం అవుతాయి.
21వ శతాబ్దం.
నేటి నేతల, వాణిజ్యవేత్తల, ఉన్నతాధికారులను, సినీ నట-నిర్మాత-దర్శకులను, వారి భార్యలను చూడండి. హైదరాబాదులో, ఢిల్లీలో పబ్బుల్లో , క్లబ్బుల్లో తాగి తందనాలాడి అక్కడే దొర్లటం, విశృంఖల లైంగిక చర్యలకు పాల్పడటం, తిరుగు ప్రయాణాల్లో ఖరీదైన కార్లు అతివేగంగా తోలుతూ ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్నవారిని పచ్చడి చేయటం, ఎంత మార్పు. వీళ్ళు ఇళ్ళల్లో గ్రామాలనుండి తెచ్చుకున్న మైనర్ బాలబాలికలకు తమ బట్టలను నగలను ఇవ్వటమా? ఎన్నటికి జరగదు.

Friday, December 6, 2013

088 Great ethics of birds at display in mahAbhArata కొన్నిసార్లు పక్షులే మనుషులకన్నా నీతిపరులు


చర్చనీయాంశాలు: mahabharata , మహాభారతం, నన్నయ, పద్యకవిత్వం

కొన్ని కథలను,సంఘటనలను చూస్తుంటే, కొన్నిసార్లు మనుష్యులకన్నా పక్షులే నీతిపరులేమో అని పిస్తుంది. పక్షులకు నీతి శాస్త్రం, ధర్మాధర్మాలు తెలుసా అనే విషయాలను ప్రక్కన పెడితే, నన్నయ భారతంలోని సుందర పద్యాన్ని ఒకదాన్ని చూద్దాం.

నన్నయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 308వపద్యం నుండి.


మహాభారతంలో సందర్భం: పాండవులు ఇంకా మయసభను నిర్మించలేదు. ధర్మరాజు ఇంద్రప్రస్థం లో రాజ్యం చేస్తున్నాడు. కృష్ణార్జునులు వాహ్యాళికి ఖాండవ వనానికి వెళ్ళారు. అక్కడ వారు విశ్రమిస్తూ ఉండగా, అజీర్ణంతో బాధ పడుతున్న అగ్నిదేవుడు, వనమూలికలతో కూడిన ఖాండవాన్ని తాను దహనం చేస్తే తన అజీర్ణం తగ్గుతుందని సహాయం చేయమని కృష్ణార్జునులను కోరాడు. కృష్ణార్జునులు దానికి అంగీకరించి అగ్నికి బాసటగా నిల్చున్నారు.
ఖాండవదహనం మొదలయ్యింది. వృక్షాలతో పాటు పశు పక్ష్యాదులు కూడ అగ్నికి ఆహుతి ఆవుతున్నాయి. చుట్టు పొగలు కమ్మేశాయి. అగ్నికి ఆహుతి కావలసిన పక్షులలో జరిత అనే ఆడపక్షి, దాని నాలుగు పిల్లలు ఉన్నాయి. వాటికింకా రెక్కలు రాలేదు. మగపక్షి మందపాలుడు తన మొదటి భార్య అయిన లపితతో ఖాండవం బయట విహరిస్తున్నాడు. బయట ఉన్న మందపాలుడు తన పిల్లలను రక్షించమని అగ్నిదేవుడిని వేడుకున్నాడు. అక్కడ జరిత పిల్లలను ఎలారక్షించుకోవాలో , తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియక కళవళ పడుతున్నది.

తండ్రి బాధ్యతారాహిత్యంవల్ల తల్లి పడే బాధను గమనించండి.
304వ పద్యం, కందం.
వీరలఁ దోడ్కొని పోవగ,
నేరను బాలకులఁ బెట్టి నిర్దయబుధ్ధిన్
వీరల తండ్రి క్రియం జన
నేరను విధికృతము గడవ నేరఁగ లావే.

చంపకమాల.
ఇది ప్రళయాగ్ని వోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫు లింగముల్
వదలక వాయుసారథి జవంబునఁ దానిట వచ్చె ఏమి సే
యుదు సుతులార యీ బిలము నొయ్యెన పోయి చొరుండు దీనిఁగ
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి తాక కుండగన్.

ఇంకో చంపకమాల.
కొడుకుల బ్రహ్మ విత్తములఁ గోరిన యట్టుల వీరి నల్వురం
బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందక యుండఁ బెంచుచున్
నడవుమటంచు నన్ను మునినాథుఁడు మీ జనకుండు పంచి యి
ప్పుడ యెటయేనిఁ బోయె హుత భుక ప్రళయంబు దలంప కక్కటా.

వైబీరావుగాడిద వ్యాఖ్య: ఇందులో కరుణ రసాన్ని గమనించండి. ఆంగ్లకవులు John Milton జాన్ మిల్టన్ వంటి వారు కూడ ఇటువంటి verses వ్రాయలేరు అని నా వ్యక్తిగత అభిప్రాయం.

వచనం.
అని దుఃఖితయైయున్న తల్లిం జూచి యగ్రతనయుండైన జరితారి యిట్లనియె.

తేటగీతి.
బిలము సొచ్చితిమేని నందెలుక చంపు,
నంద యుండితిమేనిఁ దానేర్చు నగ్ని
యెలుకచేఁ జచ్చు కంటె నీ జ్వలనశిఖలఁ,
గ్రాఁగి పుణ్యలోకంబులఁ గాంతు మేము.

వచనం.
మఱియు మాంపిండంబుల మయి యున్న మాకు బిల ప్రవేశంబున మూషక భయంబు నియతం బింద యుండిన నగ్ని భయంబు సంశయితం బెట్లనిన.

కందం.
జ్వలనంబు వాయువశమునఁ,
దొలఁగుడు జీవనము మాకు దరకొనుఁ గృఛ్రం
బుల సంశయ యుతకార్యం
బులు కర్తవ్యములు నియతములు వర్జ్యమ్ముల్.

వచనం
కావున నీవు మెచ్చిన చోటికిఁ బోవనోపము మావలని మోహంబు విడిచి యరుగుము. ఏము దహన క్లేశంబునం బొందినను జీవించి పుత్రులం బడయ నోపుదువు, నీ పుణ్యవశంబున మాకు నగ్ని భయంబు తొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతువని కొడుకులెల్ల మ్రొక్కినం జూచి జరితయు బాష్పపూరిత నయనయై యాసన్న తరు గుల్మ గహన దహన మహోత్సాహుండయి వచ్చు హవ్యవహనుం జూచి ప్రాణభయంబున గగనంబున కెగసి చనెనంత.

కందం.
నలుగురు నాలుగు వేద,
మ్ముల మంత్రము లొప్ప బ్రహ్మ ముఖములు వోలెన్
వెలయంగ సంస్తుతించుచు,
నలఘులు మాకభయ మభయ మనిరయ్య ననలున్.

వచనం.
అగ్ని దేవుండప్పుడు మందపాలు ప్రార్ధనం దలంచి యన్నలువురు శార్ఙకులు నున్న వృక్షంబు భక్షిపక పరిహరించిన జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకుల యొద్దకు వచ్చి సుఖంబుండెన్.
అంత నక్కడ మందపాలుండు పురందరువనంబు దహనుచేత దగ్ధంబగుట యెఱింగి యందున్న జరితను బుత్రులం దలంచి యతి దుఃఖితుడయి లపిత (మొదటి భార్య) కిట్లనియె.

కందం.
తరుణుల నజాత పక్షులఁ,
జరణంబులు లేనివారి శార్ఙేయుల న
ల్వుర నొక్కతె యెట దోడ్కొని ,
యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్.

ఇంకో కందం.
మఱచు నొకొ మఱవకుండియు,
నెఱుగక యుండు నొకొ యనలుఁ డెఱిఁగి యు నెడనే
మఱునొకొ పుత్త్రులఁ గానక ,
గుఱుకొని నమ్మంగ నగునె క్రూరాత్మకలకున్.

అనిన విని లపిత యిట్లనియె.

కందం.
నా యొద్దన ప్రార్ధించన,
వాయు సఖుండపుడు నీకు వరదుండయి శా
ర్ఙేయుల నలువురఁ గాతును,
ధీయుత యని పలికె మఱచితే ముని నాథా.

(నీకు అగ్ని దేవుడు వాగ్దానం చేశాడు కదా, అని లపిత గుర్తుచేస్తున్నది.)

వచనం.
ఆలికి నెయ్యుండవయి దాని యోగ క్షెమంబరయం దలంచితది పులుఁగెట యేని యుం బఱచుం గా కేమి యయ్యెడు, వగవకుండుము అనిన మందపాలుండు వసిష్ఠునట్టి పురుషునైన నరుంధతి యట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు సంశయింపకుండదిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని ఖాండవంబునకు వచ్చి పుత్ర సహితయయి కుశలిని యయి యున్న జరితంజూచి సంతుష్టుండై నిజేచ్చ నరిగె.

అగ్ని దేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవ వనౌషధంబు లుపయోగించి విగత రోగుండయి కృష్ణార్జునుల దీవించే చనియెన్. అంత.

(ఇంద్రుడు అర్జునునకు ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలను ఇచ్చాడు.)


పక్షి పిల్లల్లో ఇటువంటి ధర్మ బుధ్ధిని చిత్రించటం, భారతీయులకే సాధ్యమేమో. నాన్ ఋషిః కురుతే కావ్యం, అంటే ఋషి కాని వాడు కావ్యం వ్రాయలేడు, అంటారు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

రు అగ్నికి ఆకలెయ్యటం, ఇష్టం వచ్చినట్లుగా తినటం, మళ్ళీ అజీర్ణం తగ్గటానికి వనమూలికలను తినటం కొరకు అడవిని దహించటం, ఈ మొత్తం fantasy అవుతుంది, తప్ప వాస్తవాలను ప్రతిఫలించదు. ఈకథను నిజం అనుకొని చదవటానికి, సత్యాన్వేషణకు పొంతన ఉండదు. ఒక సాహిత్యవిశేషంగానే చదవాలి. రమ్యమైన పద ప్రయోగాలు, సమాసాలు, ఉపమాద్యలంకారాలు, లోకోక్తులు, ఇవన్ని దండిగానే ఉన్నాయి.

నన్నయ కన్నా వ్యాసుడు చాల సుదీర్ఘంగా వ్రాశాడు. ఇంచుమించు వంద శ్లోకాల దాకా ఉన్నాయి. నన్నయ క్లుప్తీకరించాడు. మందపాలుడిచేత వ్యాసుడు అగ్నిదేవుడికి చేయించిన స్తుతి ఒకసారి చూద్దాము.

ఆదిపర్వం. 255వ ఆధ్యాయం. 23వ శ్లోకం నుండి.
త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్॥ 1-255-23
త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక। త్వామేకమాహుః కవయస్త్వామాహుస్త్రివిధం పునః॥
త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్। త్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్షయః॥
త్వదృతే హి జగత్కృత్స్నం సద్యో నశ్యేద్ధుతాశన। తుభ్యం కృత్వా నమో విప్రాః స్వకర్మవిజితాం గతిం॥
గచ్ఛంతి సహ పత్నీభిః సుతైరపి చ శాశ్వతీం। త్వామగ్నే జలదానాహుః ఖేవిషక్తాన్సవిద్యుతః॥
దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రంయ హేతయః। జాతవేదస్త్వయైవేదం విశ్వం సృష్టం మహాద్యుతే॥
తవైవ కర్మవిహితం భూతం సర్వం చరాచరం। త్వయాపో విహితాః పూర్వం త్వయి సర్వమిదం జగత్॥
త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్సంప్రతిష్ఠితం। త్వమేవ దహనో దేవ త్వం ధాతా త్వం బృహస్పతిః॥
త్వమశ్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః।

Wednesday, December 4, 2013

085 Why and how, did Arjuna make Draupadi to weep? అర్జునుడి వల్ల ద్రౌపదికి దుఃఖం ఎందుకు కలిగింది?


అర్జునుడంటే, ద్రౌపదికి ప్రత్యేక ప్రేమ అనేవిషయం విజ్ఞులకు తెలుసు. మత్స్య యంత్రాన్ని భేదించిన వీరవరేణ్యుడిగా ఈ ప్రేమ ఎంతో సమర్ధనీయం కూడ. Readers know that, among Pandava five brothers, Draupadi has special love towards, the third Brother Arjuna. As a Great Archier who had conquered the Matsya-yantram (An archer has to, using his bows and arrows, strike the targeted fish which moves in a pool of water beneath on the ground), that special love towards Arjuna is appreciation-worthy and understandable. But what did Arjuna do to Draupadi in return to her Love?

కానీ అర్జునుడు ద్రౌపది యందు ఇటువంటి ప్రేమనే చూపించాడా? Did arjuna reciprocate draupadi's love in equal degree? సందేహాస్పదమే. మనవాడెక్కడి కెళ్ళినా, స్త్రీలను ఆకర్షించేవాడు. స్త్రీలచేత అమితంగా ఆకర్షింపబడేవాడు. (ఊర్వశి యెడల నిగ్రహంతో వ్యవహరించటానికి కారణం, ఆమె దేవవేశ్య, ముఖ్యంగా ఇంద్రుడి కచేరీకి చెందిన ఆస్తి. మాతృసమానురాలైన ఆమె కోరికను మన్నిస్తున్న సమయంలో, వెయ్యి కళ్ళున్న ఇంద్రుడికి పట్టు పడితే, శాపం గ్యారంటీ).

ధర్మజుడు ద్యూతంలో పరాజయం పొందాక, దుర్యోధన ప్రేరితుడైన దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేయటానికి ప్రయత్నించటం (ఆధునిక కాలంలో assault,molestation, rape వంటి నిర్వచనాల్లోకి తీసుకు రావచ్చు), పాండవ వనవాసం సినిమాలో, సావిత్రి ద్రౌపదిగా 'దేవా ! దీనబాంధవా!' అని పాడుతూ విలపించటం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు.

అర్జునుడు ద్రౌపదికి కలిగించిన క్షోభను చూద్దాం. We shall see the agony created by Arjuna on Draupadi, by marrying Subhadra, without the knowledge of Draupadi:--

నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 211వ వచనం. సందర్భం: అర్జునుడు శ్రీకృష్ణ ప్రోద్బలంతో, దేవేంద్ర సమక్షంలో సుభద్రను వివాహమాడి, ఆమెను అపహరించుకొని ద్వారకనుండి ముకుంద ప్రేరితులైన దాశార్హవీరులతో, ఇంద్రప్రస్థానికి చేరుకొని, ఒకచెట్టునీడలో విశ్రమించి, సుభద్రతో ఇలా అంటున్నాడు.
మన మివ్విధంబనఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్రి యప్రియంబులు పలుకునో యప్పరమ పతివ్రత పలుకు నిక్కువంబగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గనుమని పనిచిన సుభద్రయు నిజేశ్వరు పంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన :

తేటగీతి పద్యం, ఇది చాల సుందరమైన పద్యం.
పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర,
విజయుఁ డయ్యెడు నీవును వీరపుత్ర
జనని వగుమని దీవించె సంతసంబు
తోడ వసుదేవ పుత్రి నాద్రుపదపుత్రి.


ఇక్కడ పాఠకులు గమనించవచ్చు. నన్నయ ద్రౌపదిని ఎంతో ఔదార్యవంతురాలిగా చిత్రించాడు. భర్త సవతిని తెచ్చాడు. తెలివిగా ముందామెను తనవద్దకు పంపి కాళ్ళమీద పడేశాడు. ఆమె దీవించమంది. ద్రౌపది కూడ హృదయపూర్వకంగానే దీవించింది. ఓ పంకజాక్షీ (సుభద్రా) నీ వతి ప్రతిపక్షవీర విజయుడౌతాడు. అర్జునుడు అయ్యాడు కదా!
నీవును వీరపుత్ర జనని వగుము. అభిమన్యుడి తల్లి అయ్యింది కదా!

వ్యాసుడిచ్చిన original treatment

అర్జునుడు ముందుగా సుభద్రను పంపించి, ఆమెచేత ద్రౌపది కాళ్ళమీద పడ వేయించి దీవెనలు కోరించటం వంటి సున్నితమైన ముందు చూపు మనకి కనిపించదు.

వ్యాస భారతం, ఆదిపర్వం, 213వ ఆధ్యాయం, 15వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు


15 తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనమ్
తత్రైవ గచ్ఛ కౌన్తేయ యత్ర సా సాత్వతాత్మజా
సుబధ్ధస్యాపి భారస్య పూర్వబన్ధః శ్లదాయతే
16 తదా బహువిధం కృష్ణాం విలపన్తీం ధనంజయః
సాన్త్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృత్
17 సుభద్రాం త వరమాణశ్చ రక్తకౌశేయ వాససమ్
పార్ధః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపుః
18 సాధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ
భవనం శరేష్ఠమ్ ఆసాద్య వీర పత్నీ వరాఙ్గనా
వవందే పృథు తామ్రాక్షీ పృథాం భద్రా యశస్వినీ
19 తతో ఽభిగమ్య త్వరితా పూర్ణేందు సదృశాననా
వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమ్ ఇతి చాబ్రవీత్
20 ప్రత్యుత్థాయ చ తాం కృష్ణా స్వసారం మాధవస్య తామ్
శాస్వజే చావదత్ ప్రీతా నిఃసపత్నో ఽస్తు తే పతిః
తదైవ ముదితా భద్రా తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి
21 తతస్తే హృష్టమనసః పాణ్డవేయా మహారథాః
కున్తీ చ పరమప్రీతా బభూవ జనమేజయ
సంస్కృత వ్యాస భారతాన్ని సంపూర్ణంగా, వీలైనంత మూలానికి దగ్గరగా, 1899 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించిన కీర్తి శేషులు శ్రీకిశోర్ మోహన్ గంగూలీ అనువాదాన్ని చూడండి.
At last the hero went unto Draupadi. Draupadi, from jealousy, spoke unto him, saying, ‴Why tarriest you here, O son of Kunti? Go where the daughter of the Satwata race is! A second tie always relaxes the first one upon a faggot!‴ And Krishna lamented much in this strain. But arjuna pacified her repeatedly and asked for her forgiveness. And returning soon unto where Subhadra, attired in red silk, was staying, Arjuna, sent her into the inner apartments dressed not as a queen but in the simple garb of a cowherd woman. But arrived at the palace, the renowned Subhadra looked handsomer in that dress.

The celebrated Bhadra of large and slightly red eyes first worshipped Pritha. Kunti from excess of affection smelt the head of that girl of perfectly faultless features, and pronounced infinite blessing upon her. Then that girl of face like the full moon hastily went unto Draupadi and worshipped her, saying, ‴I am your maid!‴ Krishna rose hastily and embraced the sister of Madhava from affection, and said, ‴Let your husband be without a foe!‴ Bhadra then, with a delighted heart, said unto Draupadi, ‴So be it!‴ From that time, O Janamejaya, those great warriors, the Pandavas, began to live happily, and Kunti also became very happy.
వైబీరావు గాడిద షుమారు అనువాదం. అనువాదంలో లోపాలు ఏవైనా ఉంటే నావే. గంగూలీవి కావు.


చివరికి హీరోగారు ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. ద్రౌపది అసూయతో ఇలా అన్నది: ఓ కుంతీ పుత్రా! ఇక్కడ ఎందుకు తారట్లాడతావు? ఆ శాత్వతి దగ్గరకే వెళ్ళు.(శాత్వత వంశీకురాలు అయిన ఆ శాత్వతి ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లు). ఎంత సుబధ్ధంగా మనం పీటముడి వేసినా, మొదట వేసిన ముడిపై రెండవ ముడి ఎక్కి సుఖంగా కూర్చుంటుంది. ఈవిధంగా ద్రౌపది కొంత తడవు చాల విలపించింది. కానీ అర్జునుడు ఆమెను శాంతింపచేయటానికి ప్రయత్నించాడు. క్షమాపణ వేడుకున్నాడు. (మొత్తానికి శాంతింపచేయటంలో విజయుడైనాడు).

తరువాత ఎర్ర చీరె కట్టుకున్న సుభద్ర దగ్గరకు వెళ్ళాడు. సుభద్రను మహారాణిగా కాక సాధారణ గోపాలక కాంత గా వేషం వేయించి, ద్రౌపది అంతఃపురానికి పంపాడు. ద్రౌపది అంతఃపురానికి గోపాలక కాంత వేషంలో వెళ్ళినా సుభద్ర ఎంతో అందంగా కనిపించింది.

ఇక్కడ గంగూలీగారు సుభద్రను పెద్ద ఎర్ర కళ్ళు ఉన్నట్లుగా (The celebrated Bhadra of large and slightly red eyes) అనువదించారు . నాకు సంస్కృతం పెద్దగా రాదు. పృథుతామ్రాక్షీ అనే విశేషణం అక్కడే ఉన్న కుంతికేమో నని నా అనుమానం.

సుభద్ర ముందు కుంతికి నమస్కరించింది. కుంతి ప్రేమతో సుభద్ర తల నిమిరి ఆమెకు అనంతమైన దీవెనలనిచ్చింది.

సుభద్ర తరువాత ద్రౌపదికి నమస్కరించింది. నేను నీ సేవకురాలిని అంది. ద్రౌపది వెంటనే నిలబడి, మాధవుడి చెల్లెలిని కౌగలించుకుని , ఆమెను దీవిస్తూ ఇలా అన్నది.

'నిఃసపత్నో ఽస్తు తే పతిః'. పైన ఇచ్చిన గంగూలీగారి అనువాదం ప్రకారం ‴Let your husband be without a foe!‴. అంటే నీ భర్తకు శత్రువులు ఉండకుండు కాక, అంటే శత్రుంజయుడు అగు కాక.

నాకు తెలిసిన సందర్భోచితమైన అనువాదం ఏమిటంటే, సపత్ని అంటే సవతి. నిః సపత్ని అంటే సవతులు లేకుండుట. ఓసుభద్రా , నీకైనా సవతుల బాధ ఉండకుండు కాక,అని దీవించింది అనుకున్నాను.

నా తప్పుకు సవరణ,క్షమాపణ: ద్రౌపదిమీద సానుభూతితో నేను పొరపాటు పడ్డాను. అధరసపత్న పదానికి సంస్కృతాంగ్ల నిఘంటువు rival అంటే పోటీదారు లేకపోటం అంటే నిర్జించిన శత్రువులు కలవాడు, అనే అర్థం ఇచ్చింది. సవతికూడ ఒకరకం పోటీదారే (భర్తృప్రేమను పంచుకోటంలో). ద్రౌపది నేను నిన్ను బాధ పెట్టనులే అని సుభద్రకు హామీ ఇచ్చింది అనే అర్థం నేను తీసుకున్నాను. సుభద్రకూడ నీవన్నట్లే జరుగును గాక అనటంలో నేను కూడ నిన్ను బాధ పెట్టనులే అని వాగ్దానం చేసిందా అనిపించింది.

సుభద్రకూడ, ద్రౌపదిని 'తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి' అని స్వస్తి పలికింది. గంగూలీ: So be it! నీవన్నట్లే అగునుగాక.

వైశంపాయనుడు,జనమేజయుడికి ఈకథ చెప్తున్నట్లు మనం మర్చి పోకూడదు. 'ఓజనమేజయా! అప్పటినుండి మహారథులైన పాండవులు ఆనందంగా జీవించటం మొదలు పెట్టారు. కుంతి కూడ ఎంతో సంతసించింది.'

వాగ్దానం చేసుకున్న ప్రకారమే, ద్రౌపదీ సుభద్రలు మంచి స్నేహంగానే వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఇద్దరు కలిసి మద్యం సేవించిన విషయాన్ని ఇంకో వ్యాసంలో ప్రస్తావిస్తాను.

21వ శతాబ్దపు పాలకుల ధర్మ పత్నులు, అధర్మపత్నులు

మనం 21వ శతాబ్దానికి వద్దాం. కేంద్ర మంత్రుల, ఎంపీల ఖాతాల సంగతులు మనకు తెలీదు కానీ, రాష్ట్రమంత్రులకు,శాసన సభ్యులకు, రెండు, అంతకన్నా ఎక్కువ ఖాతాలే ఉన్నాయని ఒకసారి మనరాష్ట్ర శాసనసభలో చర్చకు వచ్చినట్లు నాకు జ్ఞాపకం. ఆపైన, ఆనాటి సభాపతి శ్రీ సురేష్ రెడ్డి గారు ఒక విచారణా సంఘాన్ని నియమించి నట్లుకూడ నాకు గుర్తు. తరువాత ఎన్నికలు వచ్చాయి. శ్రీ సురేష్ రెడ్డిగారు సభాపతి పదవి నుండి దిగిపోయారు. కొత్త శాసనసభ వచ్చింది. కమిటీ ఏమైందో ఎవరికీ తెలీదు.

శాసన సభ్యులకు, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, కేంద్రమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఉన్న ధర్మ పత్నులు, అధర్మ పత్నుల విషయం వోటు వేయవలసిన వోటర్లు , ముఖ్యంగా మహిళా వోటర్లు తెలుసుకోవలసిన అవసరం ఉందా లేదా , లేక ఇది పాలకుల ప్రైవేటు వ్యవహారమా ఇవి అన్నీ నాన్ -సెన్సా?

ఎంతమంది ద్రౌపదులు కుమిలి పోతున్నారో, కమిలి పోతున్నారో తమ వోట్లను సద్వినియోగం చేసుకోవలసిన \ చేసుకోదలచిన పౌరులు స్థానికంగా విచారించుకోవలసిన అవసరం ఉందేమో.

Sunday, December 1, 2013

081 Were Aryans also as much obsessed about color of body as Europeans and Americans? శరీరం రంగుల పిచ్చి యూరోపియన్లకే , అమెరికన్లకే కాక ఆర్యులకి కూడా ఉండేదా?


We know that Europeans and North Americans are enamoured with body color, thinking that their body color being 'white' shows their racial superiority, although body color depends on presence of melanin which is black in color, In respect of those humans who lived in hotter regions of the world, this melanin content in skin will be high, whereas those who live in colder regions lose their melanin in skin, over evolution of their bodies in Centuries of Human History.

శరీరం రంగుల పిచ్చి యూరోపియన్లకి, అమెరికన్లకే కాక, ఆర్యులకి కూడ ఉండేదా?



వ్యాస భారతం, సంస్కృతం, శాంతి పర్వం, 181వ ఆధ్యాయం (ప్రతిని బట్టి స్వల్పంగా నంబర్ మారచ్చు), 5వ శ్లోకం.
--Santi Parva 181 005 (bhrigu explained to bharadvAja):
brahmaNAnAm sito varNah kshatriyANAm tu lohitah-
vaiSyAnAm pItako varNah SUdrANAm asitas tathA

brahmins white color. kshatriyas red color. vaisyas yellow color. sUdras black color.

బ్రాహ్మణానాం సితో వర్ణః
క్షత్రియాణాం లోహితః
వైశ్యానాం పీతకో
శూద్రానాం అసితస్ తథా.

శ్లోకసారం: బ్రాహ్మణులది తెలుపు రంగు. క్షత్రియులది ఎరుపు రంగు. వైశ్యులది పసుపు రంగు. శూద్రులది నలుపు రంగు.

మహా భారతంలో సందర్భం: మహాభారత మహా సంగ్రామం అయి పోయింది. అంతా పోయారు. ఇప్పుడు యుథిష్ఠిరుడికి కిల్బిషం భయం (పాపం అనే మకిల భీతి) అంటుకుంది. భీష్మ పితామహుడు ఇంకా అంపశయ్య పై పండుకునే ఉన్నాడు. యుధిష్ఠిరుడు ఆయన దగ్గరే కూర్చుని ఆయన బోధించిన నీతులు ఓపికగా విన్నాడు. శాంతి పర్వం చాలా సుదీర్ఘమైనది. కొన్ని వందల ఆథ్యాయాలతో ఒక్కసారి చదవగలగటమే గగనం. నీతులన్నీ నిజంగా భీష్ముడే చెప్పాడో, ఆయన పేరుతో పురాణ బోధక పండాలు దానిలోకి చొప్పించారో కానీ, ఆనీతులన్నీ దండకారణ్యం లాగా దుర్భేద్యంగా అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి. తిక్కన ఆ శాంతి పర్వాన్ని ఎంతో ఓపికగా అనువదించాడు, అందులో ఛందో బధ్ధంగా పద్యాల్లో చెప్పాడు, అంటే ఎంతో గొప్ప తపశ్శీలి, మహా శక్తిశాలి అయితే తప్ప అసాథ్యం.

తిక్కన తన ఆరాథ్య దైవమైన హరిహరనాధుడి ఆజ్ఞమేరకు మహాభారతాన్ని తెనిగిస్తున్నట్లు చెప్పుకున్నాడు.

మహాభారతం, భీష్మ పర్వంలో నిక్షిప్తమై 700 శ్లోకాలతో నిండి ఉన్న భగవద్ గీతను 70 పద్యాలకు కుదించిన సంగతి విదితమే.

తిక్కన శాంతి పర్వాన్ని కూడ బాగానే కుదించాడు. వావిళ్ళ వారి 1915 ప్రచురణలో 295 పేజీలు వచ్చింది. అహో!

పైశ్లోకాన్ని ఎలా అనువదించాడో చూద్దాం.

భారద్వాజ ముని ప్రశ్నలకు భృగు మహర్షి ఇచ్చిన జవాబులుగా ,భీష్ముడు ధర్మరాజుకి బోధించాడు.
శాంతిపర్వం, చతుర్ధాశ్వాసం, 97వ పద్యం. సీసపద్యం.

ఆగమ సత్య ధర్మాచార తపముల
    కునికిపట్టుకాగ వనజభవుడు
కలిగించె మును బ్రాహ్మణుల మఱి కల్పించె
   నృప వైశ్య శూద్రుల నిర్మలాత్మ
బ్రాహ్మణాదికముగఁ బరగు నన్నాలుగు
   జాతుల యుజ్జ్వల ఛాయ లోలి
సొంపారు తెలుపునుఁ గెంపును బసపుచా
   యయుఁ గప్పునయ్యు నండ్రార్య వర్యు

ఆటవెలది పద్యం.
లాత్మ కర్మ మెడలి యనులోమ వృత్తి నె
జ్జాతి సొచ్చు నన్యజాతి పనికి
దానికట్టి భంగి దలకొనుఁ బెక్కులు
పనులఁ జేసి జారతనము వచ్చు.


98వ పద్యం. కందం.
సిత రక్త పీత నీలము,
లతులమతీ మొదలు తొడఁగి యంతంతకు హీ
నత దాల్చుగాన యెఱిగిం
చితి నీ పరిపాటి కర్మశీలత కొరకున్.


సితం= తెలుపు. రక్త = ఎరుపు. పీత = పసుపు. నీలము = బ్లూ లేక బహుశా నలుపు (శ్యామ వర్ణం). వ్యాసుడు అసితం అనేశాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య.

97వ పద్యం లో ఉన్న ఆటవెలది మొదటి లైను లోని, అనులోమ వృత్తి కి వివరణ


ఎక్కువ కులం గల పురుషుడు, తక్కువ కులంగల స్త్రీలను పెళ్ళాడటం, అనులోమం. బ్రాహ్మణుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను,
క్షత్రియుడు వైశ్య శూద్ర కన్యలను,
వైశ్యుడు శూద్ర కన్యలను,
వివాహ మాడే సౌకర్యం అనులోమం.

97వ పద్యం మరియు 98వ పద్యాల సారాన్ని మనం కలిపినపుడు, ఈ అర్ధం తీయచ్చేమో: ఎక్కువ కులంగల పురుషులు అనులోమం ద్వారా తక్కువ కులం గల స్త్రీల ద్వారా పిల్లలను కన్నప్పుడు, 1. జార తనం పెరుగుతుంది. 2. రంగు దిగజారి పోతుంది.

నోట్: విలోమం ఆకాలంలో అనుమతించలేదు కాబట్టి ఇక్కడ ప్రస్తావించినట్లు కనపడదు. విలోమం అంటే, తక్కువ కులం గల పురుషుడు, ఎక్కువ కులంగల స్త్రీని వివాహం చేసుకోటం, విలోమం. అనుమతించక పోటానికి ముఖ్యకా రణం మానవ స్వార్ధ ప్రకృతియే. తాము తక్కువ కులంగల స్త్రీలను స్వేఛ్చగా అనుభవించాలి. కానీ తమ స్త్రీలను (చెల్లెళ్ళను, కూతుళ్ళను మొ||) తక్కువకులంగలవాళ్ళు ఆకర్షించకూడదు.

21వ శతాబ్దపు భారత దేశంలో , పాకిస్థాన్ లో , నేడు జరుగుతున్న పరువు కోసం హత్యలు (honor killings) ఇంచుమించు ఇటువంటి మనస్తత్వాన్నే సూచిస్తున్నాయి.

తిక్కన వ్యాసుడి మూలాన్ని మార్చాలని నేను కోరటం లేదు. ఎలాగో భగవద్గీత 700 శ్లోకాలను కత్తిరించే ధైర్యం చేశాడు కాబట్టి, ఇక్కడ కూడ చిన్న వివరణ పద్యం ఒక కందాన్ని జత చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే తిక్కనకాలపు 13వ శతాబ్దపు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో మనకు తెలియదు కాబట్టి, ఈవ్యాఖ్య కూడ న్యాయంకాదు. పైగా హరిహరనాధుడి ఆజ్ఞ మేరకు వ్రాస్తున్నాడు కదా, ఈరంగుల గోలను వ్యాసుడు వ్రాసి ఉండడు, తరువాత వారెవరో జోడించి ఉంటారు, అనేభావంతో ఎత్తిసినా బాగుండేదేమో. గ్రంధంయొక్క నిడివి కూడ తగ్గేది.

వైబీరావు గాడిద రెండవ వ్యాఖ్య

పలువురు చరిత్రకారులు అంగీకరించిన దేమిటంటే, ఆర్యులు మధ్య ఆసియానుండి వచ్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆర్యులు ధ్రువ ప్రాంతాలనుండి వచ్చినట్లు అభిప్రాయపడినట్లు నాకు గుర్తు. నా మిత్రులు కొందరితో నేను ఈవిషయాన్ని ప్రస్తావించినపుడు, వారు, ఆర్య సంస్కృతి భారతీయులు స్వంతం. ఇక్కడనుండి విదేశాలకు వ్యాపించింది. వారికి గోచీ పెట్టుకోటం రానపుడు మనం వారికి గోచీ పెట్టుకోటం నేర్పాం అన్నారు. నాకు సరియైన సాక్ష్యాలు దొరకక నోరు మూసుకొని ఊరుకున్నాను.

శరీరం రంగుల పిచ్చి (racialism) యూరోపియన్లకు, అమెరికన్లకు ఎక్కువ అనే అభిప్రాయం సర్వత్రా ఆమోదం పొందింది.

మనం వ్యాస భారత శ్లోకం లోను,తిక్కన పద్యం లోనూ, ఏమి గమనించాం? ఆర్యులకు కూడ శరీరం రంగుల పిచ్చి ఉండటమేకాక, ఆరంగులను ఇష్టం వచ్చినట్లుగా కులాలకు అంటగట్టటం చూశాం. ఆర్యులు ఉత్తర యూరప్ నుండి వచ్చారు అనే విషయాన్ని మనం అంగీకరించ గలిగితే, వారికి ఉన్న రంగుల పిచ్చి దిగుమతి చేసుకున్నట్లు అవుతుంది. లేదూ, ఆర్యులు స్వదేశీయులే. విదేశీయులకు గోచీ పెట్టుకోటం నేర్పారు అనుకుంటే, ఈ రంగుల పిచ్చిని కూడ మనం విదేశాలకు ఎగుమతి చేశాం అని అంగీకరించ వలసి వస్తుంది.

రంగుల పిచ్చి ఎగుమతి వస్తువా, దిగుమతి వస్తువా అని నిర్ణయించుకునే స్వేఛ్ఛ భారతీయులకు ఉంది. కాబట్టి వారే నిర్ణయించుకుందురు గాక!

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |