Friday, February 7, 2014

128 Pampering the Media

128 Son-in-law showing lofty charity with mother-in-laws money అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
చర్చనీయాంశాలు: media, steel industry, కవిత్రయము, నన్నయ, మహాభారతం, వ్యాసుడు, పద్యకవిత్వము
We have in our mother tongue Telugu a proverb. మా మాతృభాష తెలుగులో ఒక లోకోక్తి ఉన్నది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. Its gist is: దాని సారం: Son-in-law showing lofty charity with mother-in-laws money.

We have a figure of speech in Telugu. మనకు తెలుగులో రెండు అలంకారాలు ఉన్నాయి. The first is drishTAntam. This figure of speech, we can get by giving an example. మొదటిది దృష్టాంతం. ఈ అలంకారాన్ని మనం ఉదాహరణ ఇవ్వటం ద్వారా పొందవచ్చు.

The second figure of speech is ardhAntara nyAsam. రెండవ అలంకారం అర్ధాంతరన్యాసం. First we make a statement. Then support it with a special instance of the occurrence. Vice versa can also be done. ముందు ఒక ప్రకటన ఇస్తాము. దానిని ఒక ప్రత్యేక సంఘటనను చేర్చటం ద్వారా సమర్ధిస్తాము. విపర్యం కూడ చేయవచ్చు. అంటే ప్రత్యేక సంఘటనను ముందు చెప్పి దానిలోనుండి మనం తార్కికంగా పొందగలిగే ప్రకటనను జోడిస్తాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాము. We shall now see some examples.

21st Century. 21వ శతాబ్దము


The Union Steel Minister Beniprasad Varma distributed a largesse of gadgets and gifts to media men and his party members in his Constituency. by spending Rs. 40 million of SAIL. కేంద్ర ఉక్కు మంత్రి బేణీప్రసాద్ వర్మ గారు, సెయిల్ వారి నిధులను వినియోగించి, తన నియోజకవర్గంలోని తన పార్టీ సభ్యులకు, మీడియా విలేఖరులకు, షుమారు రూ. 4 కోట్ల రూపాయల విలువ గల బహుమతులు, మొబైల్ ఫోన్లు పంచి పెట్టుకున్నారు. He boasted that when his industry was making profits, what was wrong in spending a few crore on publicity? శ్రీవారు పైగా కోతలు కోశారు. మా ఉక్కు పరిశ్రమ లాభాలతో నడుస్తున్నపుడు ఓ నాలుగు కోట్లు ప్రచారానికి ఖర్చు చేయటం తప్పా? అని.

Here, the money belongs to the people (Public Sector or Government body). ఇక్కడ, డబ్బు ప్రజలది (ప్రభుత్వరంగ సంస్థది). The distributing son-in-law is Beniprasad Varma, the Minister. పంచి పెట్టే అల్లుడు బేణీ ప్రసాద్ వర్మ.

Mahabharata period మహాభారత కాలం


The context in mahAbhArata. మహాభారతంలో సందర్భం.పాండవుల, కౌరవుల అస్త్ర విద్యాప్రదర్శనం. కర్ణాగమనం. కర్ణ విద్యా ప్రదర్శనం. దుర్యోధనుడి ఆనందం. కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుధ్ధం చేయాలని కోరిక వ్యక్తం చేయటం. పిలవని పేరంటం అని అర్జునుడి అభ్యంతరం. రాజులకు రాజులకు మధ్య మాత్రమే యుధ్ధం పొసగుతుందని పెద్దాయన చెప్పటం. కర్ణుడి అవనత ముఖం. సుయోధనుడు కర్ణుడికి అంగరాజ్యాభిషేకం చేయటం.
Adi126 036 tatas tasmin kshaNE karNah salAja kusumair ghaTaih-
kAncanaih kAncanE pIThE mantravidbhir mahArathah
abhishikto angarAjyE sa SriyA yukto mahAbalah
sacchatravAlavyajano jayaSabdAntarENa ca-

Notes: this quote is from mahAbharata Bombay version of the bhanDarkar library. This does not mention about gifting of 1000 cows each to 1000 priests.

Bengal version. బెంగాల్ వెర్షన్


వైశంపాయన ఉవాచ। 1-146-39x (873)
`తతో రాజానమామంత్ర్య గాంగేయం చ పితామహం।
అభిషేకస్య సంభారాన్సమానీయ ద్విజాతిభిః॥
1-146-39 (6659)
గోసహస్రాయుతం దత్త్వా యుక్తానాం పుణ్యకర్మణాం।
అర్హోఽయమంగరాజ్యస్య ఇతి వాచ్య ద్విజాతిభిః'॥
1-146-40 (6660)
తతస్తస్మిన్క్షణే కర్ణః సలాజకుసుమైర్ఘటైః।
కాంచనైః కాంచనే పీఠే మంత్రవిద్భిర్మహారథః॥
బెంగాల్ వెర్షన్ లో 20 ఆధ్యాయాలు ముందుకు వెళ్ళింది. ఇందులో వేయి ఆవులు ఇచ్చారన్నారు కానీ, ఎంత మంది పురోహితులకో వ్రాయలేదు. సహస్ర సహస్రం అంటే మిలియన్ అనే అర్ధం తీసుకోలేము.

ఇపుడు నన్నయగారి ప్రసన్నకథా కలితార్ధయుక్తి


శ్రీమదాంధ్ర మహాభారతం, ఆది పర్వం, షష్ఠాశ్వాసం (6వ ఆశ్వాసం). తెలుగు మహా భారతంలో ఆశ్వాసాలు. ఒక ఆధ్యాయం ఒక ఆశ్వాసం సమానం, సమాంతర అనువాదం కాదు. ఒక ఆశ్వాసంలో ఎన్నైనా ఆధ్యాయాలను కవర్ చేయవచ్చును.

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆది పర్వం, షష్ఠాశ్వాసం (6వ ఆశ్వాసం). 49వ పద్యం.
వచనం.
అని యప్పుడ భీష్మ ధృతరాష్ట్రులకుం జెప్పి వారి యనుమతంబున మహామహీ సురసహస్రంబునకు గోసహస్రాయతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీడ ర్హుండయ్యెడనుచు బ్రాహ్మణ వచనంబు వడసి కర్ణుం గాంచన పీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండును మణి మకుట కేయూర హారాది భూషణ భూషితుండై సకల రాజ చిహ్నంబుల నొప్పి పరమ హర్షంబుతోడం గురుపతి కిట్లనియె.
మహామహీసుర సహస్రం -- వేయి మంది బ్రాహ్మణులు.
గోసహస్రాయతంబు -- వేయి ఆవులు.
ఇచ్చిన తరువాత బ్రాహ్మణులు, కర్ణుడు అంగరాజ్యాభిషేకానికి అర్హుడని ప్రకటించారు. అపుడు పట్టాభిషేకం. బంగారు సింహాసనం.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


బ్రాహ్మణ సహస్రాలకు గోసహస్రాలిచ్చినా, మీడియా టీవి, పత్రికా విలేఖరులకు, పార్టీ సభ్యులకు మొబైల్ ఫోన్ లిచ్చినా, రాజపుత్రుడిచ్చినా, మంత్రిచ్చినా అది ప్రజల సొత్తేకదా.

అందుకే అత్తసొమ్ము అల్లుడు దానం చేయటం అనే సూక్తిని బేణీ ప్రసాద్ వర్మగారే కాదు, అన్ని రాజకీయ పార్టీల నేతలు సార్ధకం చేస్తున్నారు. నరేంద్రమోడీ గారు, జయలలితగారు, రాహుల్ గాంధీగారు, సహారా ఫైనాన్స్ వారు ఫుల్ పేజీ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారంటే, అదిప్రజల సొత్తనే కదా. కష్టపడి సంపాదించిందైతే, అవసరమా అనవసరమా అని ఆలోచించే వాళ్ళు.

Here is a proverb from Telugu language, in Roman Script: "atta sommunu alluDu dAna micchADuTa". Approx. English: Son-in-law gave away in charity, his Mother-in-law's Property. Here, the intended jibe is: Nobody will indulge in great charities, if the money is his-her own and is hard-earned. Everybody will be a great donor, while gifting away others' properties. (Notes: Though Mr. Bill Gates, and others went on canvassing-mobilising huge charities, there were tax benefits associated with Trust Charities. If there is no heavy taxation, or no tax concessions for charities, or some other indirect benefit, Mr. Gates or any other Corporate Tycoon will have opened his fists).

ఇదీ ఈ భారతదేశం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.