Tuesday, December 10, 2013

92 What Draupadi and Subhadra have done during their picnic? ద్రౌపది, సుభద్రలు పిక్నిక్ కు వెళ్ళి ఏమి చేశారు?


చర్చనీయాంశాలు: mahabharata, మహాభారతం, వ్యాసుడు, నన్నయ, పద్యకవిత్వం

నన్నయ ఎండా కాలాన్ని ఎలా వర్ణించాడు? (ఈపద్యాన్ని దాచుకొని ఎండాకాలంలో చదువుకుంటే రమ్యంగా ఉంటుంది.శ్రీమదాంధ్రమహాభారతం, అష్టమాశ్వాసము, 225వ పద్యం.

చంపకమాల.
ఉరుతర దావ పావక శిఖోత్కలిత శ్వసనంబులున్ సితే
తర గతి తీవ్ర తిగ్మ కర ధామ సహస్రములున్ బహు ప్రవా
హరహిత నిమ్నగాతతులు నై కడు దీర్ఘములై నిదాఘవా
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబులై.

ఇందులో అసహ్యం అనే పదానికి ఆనాటి అర్థం గమనించండి. ఎండలు సహింపరానివి అంటే భరించలేనంత ఎక్కువగా ఉన్నాయి అనే మధ్యస్థాయి అర్ధం. నేడు అసహ్యం అనే అర్ధానికి despicable, abominable అనే నీచార్ధం ఎక్కువవాడుకలోకి వచ్చింది.

ఉదాహరణ: పాయఖానాలు అసహ్యంగా, అశుభ్రంగా ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కి దేశంలో మూడవ స్థానం.

మహాభారతంలో సందర్భం: సుభద్రార్జునుల వివాహం అయి పోయింది. అభిమన్యుడు పుట్టాడు. ద్రౌపదికి ఉపపాండవులు పుట్టారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు. ఎండలు మండి పోతున్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుడితో పిక్నిక్ కి వెళ్దామని ప్రతిపాదిస్తున్నాడు. దీని తరువాతనే ఖాండవ దహన ఘట్టం వస్తుంది. అర్జునుడు అంటున్నాడు, నన్నయ ఎంత సుందరంగా వర్ణించాడో చూడండి.

చంపకమాల.
జలరుహనాభ రమ్యగిరి సాను వనంబుల వేటలాడుచున్
జలుపుదమీ నిదాఘ దివసంబుల నీవును నేనున్ ఉన్మిష
న్సలిల రజ స్సుగంధి యమునా హ్రద తుంగ తరంగ సంగతా
నిల శిశిర స్థలాంతర వినిర్మిత నిర్మల హర్మ్య రేఖలన్.

జలరుహనాభ = పద్మనాభం, అంటే కృష్ణుడు. రమ్యగిరి సాను వనంబులు అంటే అందమైన పర్వతలోయలలో ఉండే అడవులు. వేటాడుతూ రోజులు గడుపుదాము. (ఆరోజుల్లో అదే పని షికారీ. క్రూరజంతువులనుండి ప్రజలను రక్షించటం అనే మిష ఉంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరుడు కూడ పారువేటకు వెళ్తాడు).

ఆకాలంలో ఎ.సీ.లా పాడా! ఇపుడు కెసీఆర్ మొదలగు నేతలకు ఫారమ్ హౌస్ లు ఉన్నట్లు, ఆరోజుల్లో నదీతీరాల్లో, అడవుల అంచుల్లో రాజులకు భవనాలు ఉండేవి. (భరత్ పూర్ , రాజస్థాన్ రాజప్రాసాదాలు సరస్సుల మధ్యలో ఉన్నట్లుగా. అవి నేడు 5స్టార్ హోటళ్ళుగా మార్చబడ్డాయి).

ఇక్కడ అద్భుతమైన సమాసాన్ని నన్నయ వాడాడు. 'ఉన్మష స్సలిల రజ స్సుగంధి యమునా హ్రద తుంగ తరంగ సంగతా నిల శిశిర స్థలాంతర వినిర్మిత నిర్మల హర్మ్య రేఖలన్.' వచనం.
అని పురందరనందనుండు, గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్య భృత్యసమేతులయి యిద్దఱు నరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాఁడు ఖాండవ వన సమీపంబున నొక్క చందనలతా భవన చంద్రకాంత వేదికయందు మందశీతల సురభి మారుతం బనుభవించుచు నిష్ట కథావినోదంబుల నుండునంత.

వైబీరావు గాడిద వ్యాఖ్య

వ్యాసుడి ప్రకారం, ఈపిక్నిక్ కు గోవిందుడితో పాటు సత్యభామ , అర్జునుడితో పాటు ద్రౌపది, సుభద్రలు కూడా వెళ్ళారు.
ఇక్కడ నన్నయ ప్రకారం, గోవిందార్జునులు మిత్రామాత్య సమేతులయి మిత్రామాత్య సమేతులయి భవన చంద్రకాంత వేదికయందు మంద శీతల సురభిమారుతంబనుభవించుచు , అంటున్నాడు. సత్యభామ, ద్రౌపది, సుభద్ర సంగతి చెప్పటంలేదు. (మన్మోహన్ సింగ్ గారు విదేశాలకు పిక్నిక్ లకు వెళ్ళినపుడు, శ్రీమతి సింగ్ గారిని తీసుకు వెళ్తున్నారా లేదా?

నన్నయ ద్రౌపదీ సుభద్రల మద్యపానాన్ని ఎందుకు దాటేశాడు? రాజరాజ నరేంద్రుడికి కోపం వస్తుందనా? కాకపోవచ్చు. నన్నయ ప్రసన్న కథాకలితార్ధయుక్తి పరుడు కదా.

సంస్కృత వ్యాస మహాభారతం, ఆదిపర్వం, 234వ ఆధ్యాయం, 34వ శ్లోకం.

1-248-13 (10787) తతః కతిపయాహస్య బీభత్సుః కృష్ణమబ్రవీత్। ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్ఛావో యమునాం ప్రతి॥
1-248-14 (10788) సుహృజ్జనవృతౌ తత్ర విహృత్య మధుసూదన। సాయాహ్నే పునరేష్యావో రోచతాం తే జనార్దన॥
1-248-15 (10789) వాసుదేవ ఉవాచ। 1-248-16x (1315) కుంతీమాతర్మమాప్యేతద్రోచతే యద్వయం జలే। సుహృజ్జనవృతాః పార్థ విహరేమ యథాసుఖం॥
1-248-16 (10790) వైశంపాయన ఉవాచ। 1-248-17x (1316) ఆమంత్ర్య తౌ ధర్మరాజమనుజ్ఞాప్య చ భారత। జగ్మతుః పార్థగోవిందౌ సుహృజ్జనవృతౌ తతః॥
1-248-17 (10791) `విహరన్ఖాండవప్రస్థే కాననేషు చ మాధవః। పుష్పితోపవనాం దివ్యాం దదర్శ యమునాం నదీం॥
1-248-18 (10792) తస్యాస్తీరే వనం దివ్యం సర్వర్తుసుమనోహరం। ఆలయం సర్వభూతానాం ఖాండవం ఖడ్గచర్మభృత్॥
1-248-19 (10793) దదర్శ కృత్స్నం తం దేశం సహితః సవ్యసాచినా। ఋక్షగోమాయుశార్దూలవృకకృష్ణమృగాన్వితం॥
1-248-20 (10794) శాఖామృగగణైర్జుష్టం గజద్వీపినిషేవితం। శకబర్హిణదాత్యూహహంససారసనాదితం॥
1-248-21 (10795) నానామృగసహస్రైశ్చ పక్షిభిశ్చ సమావృతం। మానార్హం తచ్చ సర్వేషాం దేవదానవరక్షసాం॥
1-248-22 (10796) ఆలయం పన్నగేంద్రస్య తక్షకస్య మహాత్మనః। వేణుశాల్మలిబిల్వాతిముక్తజంబ్వాంరచంపకైః॥
1-248-23 (10797) అంకోలపనసాశ్వత్థతాలజంబీరవంజులైః। ఏకపద్మకతాలైశ్చ శతశశ్చైవ రౌహిణైః॥
1-248-24 (10798) నానావృక్షైః సమాయుక్తం నానాగుల్మసమావృతం। వేత్రకీచకసంయుక్తమాశీవిషనిషేవితం॥
1-248-25 (10799) విగతార్కం మహాభోగవితతద్రుమసంకటం। వ్యాలదంష్ట్రిగణాకీర్ణం వర్జితం సర్వమానుషైః॥
1-248-26 (10800) రక్షసాం భుజగేంద్రాణాం పక్షిణాం చ మహాలయం। ఖాండవం సుమహాప్రాజ్ఞః సర్వలోకవిభాగవిత్॥
1-248-27 (10801) దృష్టవాన్సర్వలోకేశ అర్జునేన సమన్వితః। పీతాంబరధరో దేవస్తద్వనం బహుధా చరన్॥
1-248-28 (10802) సద్రుమస్య సయక్షస్య సభూతగణపక్షిణః। ఖాండవస్య వినాశం తం దదర్శ మధుసూదనః॥
' 1-248-29 (10803) విహారదేశం సంప్రాప్య నానాద్రుమమనుత్తమం। గృహైరుచ్చావచైర్యుక్తం పురందరపురోపమం॥
1-248-30 (10804) భక్ష్యైర్భోజ్యైశ్చ పేయైశ్చ రసవద్బిర్మహాధనైః। మాల్యైశ్చ వివిధైర్గంధైస్తథా వార్ష్మేయపాండవౌ॥
1-248-31 (10805) తదా వివిశతుః పూర్ణం రత్నైరుచ్చావచైః శుభైః। యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత॥
1-248-32 (10806) స్త్రియశ్చ విపులశ్రోష్ణ్యశ్చారుపీనపయోధరాః। మదస్ఖలితగామిన్యశ్చిక్రీడుర్వామలోచనాః॥
1-248-33 (10807) వనే కాశ్చిజ్జలే కాశ్చిత్కాశ్చిద్వేశ్మసు చాంగనాః। యథాదేశం యథాప్రీతి చిక్రీడుః పార్థకృష్ణయోః॥
1-248-34 (10808) వాసుదేవప్రియా నిత్యం సత్యభామా చ భామినీ। ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంస్యాభరణాని చ।
ప్రాయచ్ఛంత మహారాజ స్త్రీణాం తాః స్మ మదోత్కటాః॥
1-248-35 (10809) కాశ్చిత్ప్రహృష్టా ననృతుశ్చుక్రుశుశ్చ తథా పరాః। జహసుశ్చ పరా నార్యః పపుశ్చాన్యా వరాసవం॥
1-248-36 (10810) రురుధుశ్చాపరాస్తత్ర ప్రజఘ్నుశ్చ పరస్పరం। మంత్రయామాసురన్యాశ్చ రహస్యాని పరస్పరం॥


స్వర్గీయ కిషోర్ మోహన్ గంగూలీ గారి ఆంగ్లానువాదం, స్వల్ప మార్పులతో.
After a few days, Bibhatsu (Arjuna), addressing Krishna, said, ‴summer days have set in, O Krishna! Therefore, let us go to banks of Yamuna. O slayer of Madhu, sporting there in company of friends, we will, O Janardana, return inevening‴.

Krishna said, ‴O son of Kunti, this is also my wish. Let us, O Partha, sport in waters as we please, in company of friends. having consulted thus with each other, Partha and Govinda, with Yudhishthira‴s leave, set out, surrounded by friends.

Reaching a fine spot (on banks of Yamuna) suitable for purposes of pleasure, overgrown with numerous tall trees and covered with several high mansions that made place look like celestial city and within which had been collected for Krishna and Partha numerous costly and well-flavoured viands and drinks and other articles of enjoyment and floral wreaths and various perfumes, party entered without delay inner apartments adorned with many precious gems of pure rays.

Entering those apartments, everybody, began to sport, according to his pleasure. women of party, all of full rotund hips and deep bosoms and handsome eyes, and gait unsteady with wine began to sport there at command of Krishna and Partha. Some amongst women sported as they liked in woods, some in waters, and some within mansions, as directed by Partha and Govinda.

Draupadi and Subhadra, exhilarated with wine, began to give away unto women so sporting, their costly robes and ornaments. some amongst those women began to dance in joy, and some began to sing; some amongst them began to laugh and jest, and some to drink excellent wines. Some began to obstruct one another‴s progress and some to fight with one another, and to discourse with one another in private.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

చివరిలో గమనించండి. ద్రౌపది, సుభద్రలు వైన్ ఎక్కువై తమ శరీరాలపై ఉన్న బట్టలను, నగలను పరిచారికలకు ఇవ్వటం ప్రారంభించారు.

ఆనాటి రాచరిక స్త్రీలకు ఆమాత్రం మద్యం లేకపోతే పరిచారికల బ్రతుకులు మరీ దరిద్రం అవుతాయి.
21వ శతాబ్దం.
నేటి నేతల, వాణిజ్యవేత్తల, ఉన్నతాధికారులను, సినీ నట-నిర్మాత-దర్శకులను, వారి భార్యలను చూడండి. హైదరాబాదులో, ఢిల్లీలో పబ్బుల్లో , క్లబ్బుల్లో తాగి తందనాలాడి అక్కడే దొర్లటం, విశృంఖల లైంగిక చర్యలకు పాల్పడటం, తిరుగు ప్రయాణాల్లో ఖరీదైన కార్లు అతివేగంగా తోలుతూ ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్నవారిని పచ్చడి చేయటం, ఎంత మార్పు. వీళ్ళు ఇళ్ళల్లో గ్రామాలనుండి తెచ్చుకున్న మైనర్ బాలబాలికలకు తమ బట్టలను నగలను ఇవ్వటమా? ఎన్నటికి జరగదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.