Tuesday, March 4, 2014

168 CPI-CPM

168 All are Bourgeois అందరూ బూర్జువాలే

చర్చనీయాంశాలు: కమ్యూనిజం,మార్క్సిజం,తెలంగాణ,సీమాంధ్ర,సీపీఐ,సీపీఎం,CPI,CPM,Marxism

సీపీఎం


వైఎస్ ఆర్ పీ, తెదేపా లతో పొత్తుకు తమకేమీ అభ్యంతరాలేమీ లేవు. --- న్యూఢిల్లీలో సీపీఎం నేత శ్రీ తమ్మినేని వీరభద్రం.

వైఎస్ ఆర్ పీ తో పొత్తును త్రోసి పుచ్చలేము. --- శ్రీప్రకాశ్ కారత్, సీపీఎం జాతీయ కార్యదర్శి.

ఫ్రంట్ లో చేరటానికి ఎన్ సీ పీ NCP కి స్వాగతం. - CPIM.

అవినీతి మయమైన జయలలిత అన్నా డిఎమ్ కే తో పొత్తుకు సీపీఐ ఎమ్ కి అభ్యంతరం లేదు. ఒకటో రెండో సీట్లు ఎక్కువ విదిలిస్తే చాలు.

ఎన్నికల ఖర్చు గరిష్ఠ పరిమితి పెంచటానికి సీపీఐ ఎం వ్యతిరేకంట.

సీపీఐ


సీపీఐ నారాయణ గారు సిపీఎమ్ ను కూడ బూర్జువా పార్టీలో జమ కట్టారు. తమ పార్టీ బూర్జువా పార్టీ అవునో కాదో శ్రీనారాయణ గారికి తెలియదనుకోవాలా?


విభజనానంతర సీపీఐ రాష్ట్ర కమీటీ విజయవాడ సమావేశంలో శ్రీనారాయణ గారు సీమాంధ్ర అభివృధ్ధికి ఇచ్చిన డిమాండ్ల లిస్టు హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఈ డిమాండ్ల లిస్టును విభజనకు ముందు ఇవ్వాల్సింది. కొన్ని డిమాండ్లనైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేశాక, ఆయన విభజనకు మద్దతు ఇవ్వాల్సింది. నిన్నటి వరకు ఆయన తెలంగాణ ప్రాంతీయ నేతలాగా చిందులు తొక్కారు. నేడు సీమాంధ్ర ప్రాంతీయనేతల డిమాండ్ల పట్టీ చదువుతున్నారు. ఇదేమన్నా చిల్లర కొట్టునుండి తేవాల్సిన సరుకుల పట్టీనా? అంతా బోగస్. ఇపుడు నారాయణ గారి నేతృత్వం లేకపోయినా విజయవాడలో, సీమాంధ్రలో సీపీఐ బ్రతికే ఉంటుంది. ఎలాగో సీమాంధ్రకు, తెలంగాణకు విడివిడిగా రాష్ట్రస్థాయి కమీటీలు వస్తాయి.


ఈయన కమ్యూనిస్టేనా? ఖమ్మం సీపీఐ నేతగా సుపరిచితులైన శ్రీ పువ్వాడ నాగేశ్వర రావు గారు ఖమ్మంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్నారు. ఇటీవల వార్తలలో వచ్చిన లిక్కర్ కుంభకోణంలో వీరి పేరు కూడ బయటకు వచ్చింది. తమకు అలాంటి లిక్కర్ సంబంధాలేమీ లేవని శ్రీవారు ఖండించారు. లేకపోతే మంచిదే.

మెడికల్ కాలేజీలను నడపటం అంటే సామాన్యం కాదు. ప్రభుత్వాలే మెడికల్ కాలేజీల ఎక్విప్ మెంటు, ప్రొఫెసర్ల జీతాల ఖర్చులు భరించలేక గుడ్లు తేలేస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కొన్న సౌకర్యాలు, ప్రొఫెసర్ల కొరత ఉన్నా మొత్తం మీద అవి పేద విద్యార్ధులకు భారం కావటం లేదు. మరి మన కమ్యూనిస్ట్ నేత గారి పార్టీ డొనేషన్లు భారీగా వసూలు చేస్తుందా చేయదా? ఆహాస్పిటల్లో కమ్యూనిస్టునేత గారి పెద్ద పటం పెట్టారు. తరువాత విగ్రహం పెడతారేమో. వారి మెడికల్ కాలేజీలో డొనేషన్ల రేట్ల పట్టీ కూడ పెడితే బాగుంటుంది. అక్కడ డొనేషన్లనేవి ఉన్నాయా లేవా?

కమ్యూనిస్టు నేతలు ఎంతవరకు బూర్జువా వ్యాపారాలను చేయవచ్చు అనే విషయంలో స్పష్టత లేదు. సొసైటీలు వ్యాపారాలా అనే విషయంలో కూడ స్పష్టత రావాలి. ట్రస్టుల్లో, సొసైటీల్లో స్థాపకులు తమ, తమ కుటుంబ సభ్యుల కంట్రోల్ ని తగ్గించుకుంటూ పోతే వారి చిత్తశుధ్ధిని శంకించ వలసిన అవసరం రాదు. ప్రస్తుతం శ్రీవారి సంస్థలపై శ్రీవారికి 100 శాతం పట్టు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఈవిషయంలో తన చిత్తశుధ్ధిని నిరూపించుకుని, సీపీఐని ఉన్నత పీఠంపై నిలబెట్టవలసిన బాధ్యత శ్రీవారి పైనే ఉంటుంది.

ఏవిషయంలో రాజీ పడచ్చు, ఏవిషయంలో రాజీ పడకూడదు అనే దానిపై సీపీఐలో అన్నిస్థాయిలలో చర్చ జరగాలి. లేదంటే బూర్జువాలు కమ్యూనిస్ట్ నేతలుగా చలామణీ అయ్యే అవకాశం ఉంది.
శ్రీ బివి రాఘవులు గారు సీపీఎమ్ నేతగా సుప్రసిధ్దులు. వీరు ఇప్పుడు తేల్చి చెప్ప వలసింది ఒకటే. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా కోర్టు కేసుల నెదుర్కుంటున్న, కొన్నైనా ప్రాథిమిక ఆధారాలు బయట పడ్డ శ్రీజగన్ నేతృత్వంలోని వైయస్ ఆర్ పీ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు. పొత్తుపెట్టుకోము అని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ సీపీఎం నేతపై ఉంది.

ఢిల్లీనుండి వారి కేంద్ర కమీటీ ఆజ్ఞాపించినా సిధ్ధాంతాలకు విరుధ్ధం కాబట్టి ఒప్పుకోకూడదు కదా. తమ పార్టీ పధ్ధతులు నచ్చకపోతే బయటకు రావలసిన బాధ్యత వీరిపై ఉండదా? ఉంటుందా?

వైఎస్ ఆర్ పీ పార్టీతో పొత్తుల కోసం సిపిఎమ్ ఖమ్మం యూనిట్ తొందర పడుతున్నట్లు కనిపిస్తుంది.

పార్టీలు నడిపేటప్పుడు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు తలఎత్తినపుడు, నడపకుండా కొంత నెమ్మదించినా ఫరవాలేదు. సిధ్ధాంతాలకో రాజీ పడటం వల్ల పార్టీలు ప్రజావిశ్వాసం కోల్పోతారు. ఈవిషయంలో బూర్జువా పార్టీలకు మిగిలిన పార్టీలకు తేడ్ అవసరం. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అనే వాదన నిలవదు.

ఎమార్ బౌల్డర్ హిల్స్ స్కాం

దీని గురించి వామపక్షాలు బయటకు ఆందోళనలు చేస్తున్నా, వీరికి కూడ రెండు ప్లాట్లు ముట్టాయా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత వామపక్షాలపై ఉంటుంది.

ఈ ఆరోపణ|అనుమానం చాల ముఖ్యమైనది. ఎందుకంటే, ఇతర బూర్జువా పార్టీల వలెనే వామపక్షాలకు కూడ బడా నగరాలలో బడా భవనాలు, ఫర్నీచర్లు, ఎసీలు అంటే వ్యామోహం ఉన్నట్లు కనిపిస్తున్నది. కష్టజీవులు సమావేశం కావాలంటే ప్యాలెస్ లే అవసరం లేదు, పార్కులైనా సరిపోతాయి. భవనాలకోసం, విలువైన స్థలాలకోసం కక్కూర్తి పడి బూర్జువా పార్టీలను బయటనుండి సమర్ధించటం, పొత్తులకు దిగటం చేయనవసరం లేదు.

పట్టణాలలో, నగరాలలో స్థలం కొనుక్కోలేక పోతే కమ్యూనిస్టు పార్టీలు గ్రామాల బయట వేస్ట్ లాండ్ కొనుక్కొని రేకుల షెడ్ లలో తమ కార్యాలయాలను నడుపుకోవచ్చు. ప్రాథమికంగా కమ్యూనిస్టు పార్టీలు గ్రామాల పునాదిగా పనిచేయాలి కాబట్టి నగరాలలో తిష్ఠవేయటం, విమానాలలో తిరగాల్సిన అవసరం ఉండదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.