Ayurveda is yet to re-examine the justifiability of continuing the kafa-vAta-pitta dOsha balancing system. Central Govt. wake up!! // आयुर्वेद भी इस कफ वात पित्त त्रिदोष प्रकोप (या क्षीण) सिध्धांत को कायम रखना या छोड देना, इस अंश को समुचित रूप से परिशीलन करना होगा। | ఆయుర్వేదం కూడ, ఈ కఫ వాత పిత్త త్రిదోష ప్రకోప (లేక క్షీణ) మరియు సన్నిపాత దోష సిధ్ధాంతాలను కొనసాగించాలా, లేక వదలివేయాలా అనే విషయాన్ని తగిన పరిశోథన బృందాలతో (కేవలం ఆయుర్వేద డాక్టర్ల చేత కాదు, అలాగని ఆయుర్వేదం అంటే చులకన భావం ఉండే ఎల్లోపతి డాక్టర్ల చేతా కాదు,) శాస్త్రీయ పరిశోథనా దృష్టికలిగిన శాస్త్రజ్ఞుల చేత క్షుణ్ణంగా పరిశీలింప చేయాలి.)//
| Many Indians are made to believe that India taught the world, everything that can be called knowledge, when the world was wallowing in ignorance. | कई भारतीयों को यह विश्वास दिया गया है कि, जब सब दुनिया अज्ञान में डूब रहे थे, भारत विश्व को सभी चीजे जिसको ज्ञान कह सकते है, विश्व को सिखाया। | భారతీయులలో ఒక విశ్వాసాన్ని ఒక వర్గం వారు నెత్తి కెక్కించారు. అది ఏమంటే, జగత్తు సర్వం తమస్సులో తలబంటి లోతులో మునింగి నపుడు, ప్రపంచం అంతా గోచీ పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భారత్ వారందరికి బట్టలు కట్టుకోటం నేర్పిందని, జ్ఞానం అనతగిన ప్రతి దానినీ నేర్పిందనీ, కాబట్టి ప్రపంచంలోని అన్ని జాతులలోనూ భారత జాతి మిక్కిలి గొప్పదనీ, గోంగూర పచ్చడి అనీను. |
| What these make-believers do not know is that when peoples interact with one another, exchange of information takes place, and knowledge is given and taken. It is never a unilateral affair of one party dishing out everything, and the other party copying or imitating everything. | इन विशवासों को फैलाने वाले, यह भूल जाते हैं कि, जब एक जन समूह दूसरे जन समूह से मिल जुलता है, तब ज्ञान बदली होता है, यह द्विप्क्षीय होता है, याने हर जन समूह कुछ लेता है, और कुछ देता है। यह विज्ञान बदली कभी भी एक पक्षीय नहीं होता। याने, देने वाला हमेशा एक ही नहीं रहता। लेनेवाला भी एक ही नहीं रहता। | ఇలాటి విశ్వాసాలను వ్యాపింప చేసే వాళ్ళు మరచే దేమిటంటే, జన సమూహాలు ఒకరితో మరొకరు కలసి మాట్లాడుకోటం, కార్యక్రమాలు చేసుకోటం, కొట్లాడుకోటం (యుధ్ధాలు), వంటివి చేసుకున్నప్పుడు రెండు ప్రక్కలనుండీ సమాచారం, విజ్ఞానం మార్పిడీ జరుగుతుందనీ, అది ఎన్నటికీ ఏక పక్షంగా ఉండదనీ. అంటే ఒక పార్టీ ఎప్పుడూ ఇచ్చేదిగానూ, రెండో పార్టీ ఎప్పుడూ స్వీకరించేది గానూ ఉండదని. అంటే భారత్ కేవలం దాత కాదు, స్వీకర్త కూడాను, అనే విషయాన్ని ప్రపంచానికి మేము గోచీ పెట్టుకోటం నేర్పాము అనకునే భారతీయులు మర్చిపోకూడదు. |
| One of the knowledges (arts, or sciences, or skills) thus exchanged between India and Europe (through Mesopotaemia-Babilonia-Sumeria link) is Medicine. In Europe the system that was received in Europe from Iraq and in use for about 2000 years of European History there was the System of Four Humors. | वैसा, मॆसपोटेमिया बाबिलोनिया सुमेरिया लिंक के द्वारा बदली किया हुआ विज्ञानों में चार ह्यूमर वैद्य चिकित्सा पध्धति एक है। | అలా మెసపొటేమియా బాబిలోనియా సుమేరియ నాగరికతల ద్వారా పశ్చిమాన యూరప్ కు, తూర్పున భారత్ కు బదిలీ జరిగిన విజ్ఞానాలలో నాలుగు హ్యూమర్ల వైద్య విధానం ఒకటి. |
| In India, we have Ayurvedic Traditional Medical System, prevalent during the last nearly 3000 years. Instead of the European four humours, Indian Ayurveda recognises three humors. While fire (pitta), water (kafa or slEshma), air (vAta) conform to yellow bile, phlem, black bile respectively in the European Ancient Medical System, the fourth of the European Humors i.e. "blood", Indian Ayurveda does not recognise as a dOsha (deviation or irregularity). | भारत में हमारे को सांप्रदायिक आयुर्वेदिक वैद्य व्यवस्था, ३००० वर्षों से है. इस में यूरप के चार दैहिक द्रवों में तीन याने, अग्नि (पित्त), जल (कफ या श्लेष्म), वात (वायु), को आयुर्वेदिक व्यवस्था मानती है. चौथा द्रव रक्त (खून या ब्लड) को आयुर्वेद एक ह्यूमर (त्रिदोषों में एक) अनुमोद नहीं करती. | భారత్ లో మనకు గత మూడు వేల ఏండ్లుగా ఉన్న సాంప్రదాయిక వైద్య వ్యవస్థ, ఆయుర్వేదం. ఇది త్రిదోషాల మధ్య సమతౌల్యాన్ని సాధించటం అనే సిధ్ధాంతం పై ఆధార పడినది. యూరోపియన్ వైద్య విధానంలో నాలుగు దోషాలు (వీటిని శారీరిక ద్రవాలుగా కూడ సంభావించ వచ్చు) అంటే పసుపుబైల్ (పైత్యం), ఫ్లెమ్ (కఫం లేక శ్లేష్మం), నల్లబైల్ (వాతం) అనే త్రిదోషాలను మాత్రమే ఆయుర్వేదం గుర్తిస్తుంది. నాలుగవదైన రక్తాన్ని ఆయుర్వేదం నాలుగు హ్యూమర్లలో చివరిదానిగా గుర్తించదు. |
| For those who wish to read about this European Theory of four Humours, here is the link: Click here to go to Wikipedia.org. | यह चार ह्यूमर्स (चार दैहिक द्रव) के सिध्धंत को देखना चाहे, तो, आप बाजू में दिया हुआं लिंक क्लिक कीजिये। | ఈ నాలుగు హ్యూమర్ల యూరోపియన్ సిధ్ధాంతాన్ని చదవాలనుకునే వారు ఎడమ ప్రక్కన ఉన్న లింకును క్లిక్ చేయండి. |
| Like our Indian Ayurveda, European Medieval Medicine also used leeches for sucking of bad blood from legs. | मध्य युग के आयर्वेदिक वैद्य की तरह, यूरोपियन चार ह्यूमर सिध्धांत भी, शरीर मे दुष्ट रक्त को पीने के लिये, जलौकों को उपयोग करते बीसवी शताब्दी तक करती थी। | మధ్యయుగ ఆయుర్వేద వైద్యం వలెనే, మధ్యయుగ యూరోపియన్ వైద్యం కూడ జలగలను దుష్టరక్తం పీల్పింప చేసి, రక్త శుధ్ధి చేయటం కొరకు వాడటం జరిగింది. |
| Later Leech-sucking blood purification medicine lost its popularity in Europe with the advent of Modern Medcine. | आधुनिक वैद्य विज्ञान के परिणामक्रम के बाद, यूरोपियन ह्यूमर वैद्य व्यवस्था और जलौकों से खून पिलाना, जनादरण को खो गया। | యూరోప్ లో ఆధునిక వైద్య విజ్ఞానం ఆవిష్కారాలు జరిగాక, యూరోపియన్ హ్యూమర్ వైద్యం (దేహ ద్రవాలవైద్యం), జలగలను కాళ్ళకు పట్టించి చెడు రక్తాన్ని పీల్పించి, రక్త శుధ్ధి చేయటం ఆదరణను కోల్పోయాయి. |
| In Indian Ayurveda also, gradually leach-sucking has vanished. | भारतीय आयुर्वेद में भी, जलौकों से कट्वाने के पध्धति क्रमशः अतर्धान हुआ । | భారతీయ ఆయుర్వేదంలో కూడ జలగలతో చెడు రక్తాన్ని పీల్చింప చేసే వైద్యం క్రమ క్రమంగా అంతర్ధానం అయ్యింది. |
| Ayurveda is yet to re-examine the justifiability of continuing the kafa-vAta-pitta dOsha balancing system. Central Govt. wake up!! | आयुर्वेद भी इस कफ वात पित्त त्रिदोष प्रकोप (या क्षीण) सिध्धांत को कायम रखना या छोड देना, इस अंश को समुचित रूप से परिशीलन करना होगा। | ఆయుర్వేదం కూడ, ఈ కఫ వాత పిత్త త్రిదోష ప్రకోప (లేక క్షీణ) మరియు సన్నిపాత దోష సిధ్ధాంతాలను కొనసాగించాలా, లేక వదలివేయాలా అనే విషయాన్ని తగిన పరిశోథన బృందాలతో (కేవలం ఆయుర్వేద డాక్టర్ల చేత కాదు, అలాగని ఆయుర్వేదం అంటే చులకన భావం ఉండే ఎల్లోపతి డాక్టర్ల చేతా కాదు,) శాస్త్రీయ పరిశోథనా దృష్టికలిగిన శాస్త్రజ్ఞుల చేత క్షుణ్ణంగా పరిశీలింప చేయాలి.) |
To continue, a lot more. और बहुत लिखने का है। ఇంకా వ్రాయల్సింది చాలా ఉంది.
Want black hair at the risk of losing masculinity? बाल काला होना या पुंसत्व खो जाना ? జుట్టు నల్ల పడాలా, లేక పుంసత్వాన్ని కోల్పోవాలా? In this world we can't have everything for ourselves. For getting one thing, we may have to lose another thing.
World language English in Roman script: प्रपंच भाषा अंग्रेजी, रोमन स्क्रिप्ट में। ప్రపంచ భాష ఇంగ్లీషు రోమన్ స్క్రిప్టులో.
సంస్కృతం: బాకుఛీ. హింది: బావాచి. గింజలు తెచ్చి పొడి చేసుకోవచ్చు. పౌడర్ (చూర్ణం) దొరుకుతుంది. టాబ్లెట్ లు కూడ దొరుకుతాయి. రసం తిక్తం(చేదు), కటు (కారం). భావప్రకాశ అనే గ్రంధం, సుశ్రుత సంహిత అనే గ్రంధం ప్రకారం(ట).
తానికాయ ఆంగ్లనామం టెర్మినేలియా బెలిరికా. జీర్ణ, శ్వాస వ్యవస్థ. యాంటి హేల్మెంతిక్ అంటే నులిపురుగుల నివారిణి. యాంటి స్పాస్మోడిక్ తెరలుతెరలుగా వచ్చే నొప్పులనివారిణి. యాంటీ పైరెటిక్ అంటే జ్వరనివారిణి. శ్వాస వ్యాథులు దగ్గు , క్షయ , ఆస్తమా , ఎలర్జీల ఉపశమనం. విరేచనాల నివారిణి. లివర్ టానిక్ అంటారు. కేశపోషణి (ట). కంటి చూపు మెరుగు పరుస్తుంది (ట). గుండెజబ్బులకు ఉపశమనం. కరక్కాయ వలెనే కఫాన్ని తగ్గిస్తుంది. సర్పి అనే చర్మ వ్యాధికి ఉపశమనం.
ఆంగ్లనామం ఫైలాంథస్ ఎంబ్లికా. సంస్కృతం లో ఆమలకం. క్రియాస్థానాలు: జీర్ణ, శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థలు. దీనికి ధాత్రి అనే సంస్కృతనామం వల్ల తల్లి అనే భావం ఉంది. కరక్కాయవలెనె, ఇదికూడ సర్వ వ్యాథినివారిణి అనే భ్రమ ఉంది. కాకపోవచ్చు. అయితే పలు వ్యాథులకు పని చేయవచ్చు. చ్యవనప్రాశలో ఒక ముఖ్యదినుసు. హెయిర్ ఆయిల్స్ లో బ్రాహ్మీ అనే మూలికతో కలిపి వాడకం ఎక్కువ. లినోయిక్ ఆమ్లం వల్ల కాలేయ వ్యాథులు తగ్గుతాయిట. వీకీపీడియా ప్రకారం, ఊపిరితిత్తులనుండి రక్తం పడటం తగ్గుతుందట.
జాగ్రత్తలు: పిత్తదోషం ఉన్నవారికి, విరేచనాలను కలిగించే అవకాశం ఉందిట.
త్రికటుకాల్లో మొదటిది. కటుకం అంటే కారంగా ఉండే కారంగా ఉండే దినుసు. జీర్ణ, శ్వాస, పునరుత్పత్తి వ్యవస్థలో పని. అనులోమనం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). నొప్పి శమనకం (analgesic). నులిపురుగుల దమనకం(anthelmintic). లైంగికశక్తిని పెంచుతుందట (aphrodisiac). ఉమ్మిబహిష్కరిణి(expectorant). ఫ్లూ జ్వరశమనకం. కడుపులో పుండ్ల శమనకం. ఆస్తమా శమనకం. జలుబులు, దగ్గులు, మూర్ఛ, గొంతు వ్యాథులు, పక్షవాతం, కీళ్ళనొప్పులు, క్రిమి వ్యాధుల శమనకం.
జాగ్రత్తలు: పిత్తాన్ని పెంచుతుంది. కామెర్లవారు, అతివాగుడుగాళ్ళు, వాడకపోటం మేలు.
త్రికటుకాల్లో రెండవది. జీర్ణ, శ్వాస వ్యవస్థల్లో చర్యలు. అనులోమనగుణం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). వాంతుల నివారకం (anti-emetic) నొప్పి శమనకం (analgesic). నులిపురుగుల దమనకం(anthelmintic). లైంగికశక్తిని పెంచుతుందట (aphrodisiac). చెమటను పెంచి బయటకు పంపుతుంది (diaphoretic), ఉమ్మిఉత్పత్తిని పెంచి ప్రవహించేలా చేస్తుందిట (sialogogue). ఉమ్మిబహిష్కరిణి(expectorant). ఫ్లూ జ్వరశమనకం. కడుపులో పుండ్ల శమనకం. ఆస్తమా శమనకం. జలుబులు, దగ్గులు, మూర్ఛ, గొంతు వ్యాథులు, పక్షవాతం, కీళ్ళనొప్పులు, క్రిమి వ్యాధుల శమనకం. పటికబెల్లం తో వాడినపుడు పిత్త శమనకంట. తేనెతో వాడితే కఫశమనకం ట. అల్లం రసాన్ని బొడ్డుపై రుద్దుకుంటే, విరేచనాలనుండి ఉపశమనం కలుగుతుందట.
యాంటీ కోయాగ్యులెంట్, (రక్తాన్ని గడ్డ కట్టకుండా చేసి రక్తాన్ని పల్చగా ఉంచేది). సుగుణం: రక్తనాళాల్లో అడ్డంకులవల్ల గుండె జబ్బులు, బీపీలతో బాధపడేవాళ్ళకి ఇది ఉపయోగపడాలి.
త్రికటుకాల్లో మూడోది. దీపనం అంటే ఆకలిపెంచేది. అనులోమనగుణం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). కఫహరం అంటే కఫాన్ని తగ్గించేది. ఊపిరితిత్తులు కఫంతో నిండినపుడు శమనం కలిగిస్తుందిట (decongestant) పిత్తాన్ని తగ్గిస్తుందా అనే విషయంలో, భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ముఖదుర్గంధహరం అంటే నోటి దుర్వాసన తగ్గించేది. వస్తిశోధకం అంటే మలాశయాన్ని శుభ్రం చేసేది. పాచకం అంటే జీర్ణక్రియలో సహకరించేది. రుచ్యం అంటే నోటి అరుచితగ్గించి రుచిని పెంచేది. కీళ్ళనొప్పుల శమనకం. ఫ్లూ జ్వరశమనకం. కొవ్వుని, లావుని తగ్గిస్తుందట.