115 Six important herbs which every Telugu home should have ప్రత తెలుగు ఇంటిలోనూ ఉండ వలసిన ఆరు ఆయుర్వేద ఔషథమూలికలు
చర్చనీయాంశాలు: ఆరోగ్యం, ఆయుర్వేదం, మూలికా వైద్యం, గృహవైద్యం
ఆధునిక వైద్యం
ఆధునిక వైద్యం బడావ్యాపారం గా మారి ప్రతిదానికి స్పెషలిస్టులు, అతి లేబరేటరీ పరీక్షలు, స్కానింగులు, ఎం ఆర్ ఐలు, రక్తం ప్యాకెట్లు కొనటం ఎక్కువయ్యాక, తెలుగు వారి జీవితాలు, ఆరోగ్యకార్డులు ఉన్నా లేకున్నా, దుర్భరంగా మారాయి. ఘరానా ప్రైవేటు హాస్పిటల్ కి నిలువుగా నడుచుకుంటూ వెళ్ళినవాడు అడ్డంగా శవమై ఇంటికి రావటం, ఇళ్ళూ వాకిళ్ళూ పొలాలూ ఆటోలూ తాకట్టుపెట్టుకోటమో, అమ్ముకోటమో జరిగాక, రోగులు, వారి వారసులు వీథిన పడటం చూస్తున్నాము. పక్కింటి వాళ్ళు ఘరానా హాస్పిటల్ కు వెళ్తే మనం వెళ్ళక పోటం అవమానంగా ఫీల్ అవటం అలవర్చుకున్నాము.హోమియోపతి
హోమియో వైద్యం చూద్దామంటే, అది హుళక్కి అని చాలా మందికి తెలియదు. సైంటిఫిక్ హోమియోపతి, నక్షత్రం హోమియోపతీ అని రకరకాల పేర్లతో ప్రకటనలు విడుదల చేస్తూ బాదుతున్నారు. హోమియో మందులను అతిగా పల్చన చేయటం వలన వాటిలో పంచదార, సారాయి తప్ప వేరేదేమీ ఉండదని చాలా మందికి తెలయదు. తాయిత్తు కట్టించుకోటానికి, హోమియో వాడటానికి తేడా ఏమీ ఉండదని తెలుసుకోవలసిన అవసరం ఉంది. హోమియో వైద్యవిద్యార్ధులు, వైద్యులు ఈవిషయం పై ఆలోచిస్తే మేలే కానీ, ప్రయోజనం ఉండదేమో. ఎందుకంటే, అప్పటికే హోమియో విద్యపై పెట్టుబడి పెట్టటం జరిగి పోతుంది. ఇంక వెనక్కి వెళ్ళటం కష్టమౌతుంది. అందుకనే, హోమియో వైద్యవిద్యార్ధులకు అలోపతి పాఠ్యాంశాలను, ప్రాక్టికల్స్ ను కూడ నేర్పితే వారు అవసరానుగుణంగా అలోపతి మందులను వాడగలుగుతారు.హోమియో వైద్య విద్య - అలోపతి సబ్జెక్టులు
ఈమధ్య ఆయుష్ శాఖ జాతీయ స్థాయి ఉన్నతాధికారులు హోమియో వైద్య సిలబస్ లో అలోపతి సబ్జెక్టులను చేర్చరాదని నిర్ణయించారట. మహారాష్ట్రలో హోమియో వైద్యులు హోమియో మందులతో పాటు అలోపతి మందులను వాడటం ఎక్కువట. ఆంధ్రప్రదేశ్ లో తక్కువట. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు హోమియో వైద్యులు ప్రాథమిక అలోపతి మందులను తక్షణ శమనకాలుగా వాడటానికి అలోపతి సబ్జెక్టును చదవటమే మేలేమో. అలా చదవటం వల్ల, ఎట్టి పరిస్థితులలో పేషెంట్లను అలోపతి పెద్ద స్పెషలిస్టు వైద్యశాలలకు పంపాలో హోమియో వైద్యుడు నిర్ణయించుకో గలుగుతాడేమో. ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ హోమియో వైద్యుల అభిప్రాయం ఏమిటో రిఫరెండం జరగాలేమో.ఆయుర్వేదం
ఆయుర్వేదం విషయానికి వస్తే ఆమందుల్లో రసవైద్యం డామినేషన్ ఎక్కువ. 76%శాతం మందుల్లో పాదరసం, గంధకం, సీసం, మొ. విష పదార్ధాలతో నిండి ఉండటం వల్ల మన శరీరం క్రమ క్రమంగా విషపూరితం అవుతుంది. ఆసవాల్లో, అరిష్టాల్లో భూమిలో వాసినకట్టుకట్టి 40రోజులు సహజపరిస్థితుల్లో పులిసి ఔషథాల్లో సారాయి అదంతట అదే ఉత్పత్తి(self-generated alcohol) కావాలి. కానీ కొందరు మందుల కంపెనీలవాళ్ళు 40రోజుల దాకా ఆగలేక ప్రభుత్వ కోటాలో వచ్చే ఆల్కాహాల్ ను కలిపేస్తున్నారు. కేరళ పంచకర్మల పేరుతో కూడ పిండుకోటం ఎక్కువైంది.గృహ మూలికా వైద్యమే దిక్కు
ఈస్థితిలో మనకు కొంత మేరకైనా మూలికా వైద్యం ఇంట్లో వాడే దినుసులు, కాయలు, గింజలు, ఆకులు, పూలు, వేళ్ళు (మూలము అంటే వేరు) మొ. మూలికలే దిక్కుగా మారాయి. ఇవి బజారులో పచారీ కొట్లో చాలా చౌకగా దొరుకుతాయి. రోగాలు తగ్గినా తగ్గక పోయినా సైడ్ ఇఫెక్ట్స్ ఉండవు.డిస్ క్లైమర్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు దొర్లుతు ఉంటాయి. కాబట్టి ఇందులోని విషయాలను నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ గా భావించరాదు. అర్హుడైన వైద్యుడు అందుబాటులో లేనపుడు, మనం దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు, మనం కొన్ని సిధ్ధాంతాలకు కట్టుబడి జీవించాలనుకున్నప్పుడు, ఈచిట్కాలు ఆసరాగా నిలుస్తాయి తప్ప, వీటిని వైద్య సలహాలుగా భావించరాదు. అన్ని వైద్యవిధానాలలో వలెనే, మూలికల వాడకంలోనూ, సమర్ధనలు (claims) ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రీయమైన క్లినికల్ రికార్డులు లేవు. ఈవిషయంలో మనం చాల ముందుకు వెళ్ళాలి. అందుకే, చాలా వాటికి నేను క్లెయిమ్స్ చివర 'ట' తగిలించాను. కొన్ని మూలికలను నేను వాడైనా సరే, నిజానిజాలను అనుభవించి ధృవీకరించ దలుచుకున్నాను. అయితే ఒక వ్యక్తికి సత్ఫలితం ఇచ్చిన మూలిక మరొకరికి అంతే సత్ఫలం ఇవ్వాలని లేదు. ఆహార విహారాలలో భేదాలు ఉంటాయి. ఇంటి వాతావరణంలో తేడా ఉంటుంది.ప్రతి ఇంటిలోను ఉండవలసిన ఆరు ముఖ్యమైన ఆయుర్వేద ఔషథ మూలికలు
కరక్కాయ

మొదటిది కరక్కాయ. సంస్కృతంలో హరీతకి. ఆంగ్లంలో టెర్మినేలియా చెబ్యులా లేక మైరోబాలాన్. కరక్కాయ తల్లి వంటిది, అనే సామెత అతిశయోక్తి కాదేమో. జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, మూత్రమండలం. ఆధునిక ఇంగ్లీషు వైద్యంలో వాడే మందులతో పోల్చాలంటే, దీనిని డైయూరెటిక్ కింద లెక్కించ వచ్చు. అంటే మూత్రం సాఫీగా పోయేలా చేస్తుంది. ఆహారనాళంలో (గొంతు, ఈసోఫాగస్ నుండి గుదం వరకు పొట్ట, క్లోమం, కాలేయం, గాల్ బ్లాడర్, స్ప్లీన్, డుయోడినం, జెజునం, చిన్నప్రేవులు, పెద్దప్రేవుల ద్వారా మలాశయం వరకు ఆహారం ప్రయాణించే మార్గం) ఆహారం వేగంగా ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతుందిట. మలవిసర్జనకు సహాయం చేయటంలో, దీనికి సునాముఖి తరువాత రెండవ స్థానం ఇవ్వ వచ్చు. పొట్టను శుభ్రం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది. మల విసర్జనకు తోడ్పడుతుంది కాబట్టి , ప్రేగులలో హానికారక బాక్టీరియాను పెరగనివ్వదు, మొలల వ్యాధిని నయం చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. శరీరంలో అధికంగా ఉన్న ద్రవాలను ఇది బయటకు పోయేలా చేస్తుంది లేక లోపలే ఆరబెట్తుందిట. బహుశా ఇందుచేతనే, ఇది దగ్గుకి,జలుబుకి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఉష్ణవీర్యం కాబట్టి, ఆవునేయితో వాడమని ఒకసలహా ఉంది. కనుక పొడి చర్మంతో బాధపడుతూ, ద్రవాల కొరత శరీరాలు ఉన్నవాళ్ళు కరక్కాయ వాడకపోటం క్షేమం. గర్భిణీ స్త్రీలు కూడ వాడకపోటం మంచిది అనే అభిప్రాయం ఉంది. పూర్వకాలంలో కరక్కాయ అధికంగా వాడబడటంవల్ల, కరక్కాయ వైద్యుడు అని చులకన చేయటం జరిగేదిట. అయితే ఆంగ్లవైద్యంలో లూప్ డైయూరెటిక్స్ కి మంచి స్థానమే ఉంది కాబట్టి, మనం కరక్కాయను మరీ చులకనచేయనవసరం లేదు.
తానికాయ

వుసిరికాయ

పిప్పళ్ళు

సొంఠి (సున్నంలో నానబెట్టి ఎండబెట్టిన అల్లం).

మిరియాలు

(ఈబ్లాగ్ పోస్ట్ ను రివైజ్ చేయవలసి ఉన్నది).
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.