Thursday, January 16, 2014

118 Psoriasis self-care part2

118 Psoriasis self-care part2 చర్చనీయాంశాలు : ఆరోగ్యం, ఆయుర్వేదం, మూలికలు, సోరియాసిస్


సోరియాసిస్ ఉపశమనానికి స్వంత శ్రధ్ధ


ఇంతకు ముందు చేసిన పోస్ట్ కు ఇది ఇంప్రూవ్ మెంట్.

సోరియాసిస్ (బొల్లి) నయం కాదు, అనే ఒక నిరాశాపూరితమైన అభిప్రాయం ఉంది. అది నిజమైనా కాకపోయినా, వైద్యరంగంలో జరుగుతున్న పరిశోథనలను దృష్టిలో ఉంచుకుంటే నిరాశపడ వలసిన అవసరం నాకు కనిపించదు. భయంకర కలరా, మశూచి, పోలియో వంటి వ్యాధులే భారత్ నుండి పారిపోక తప్పలేదు. మన కర్తవ్యం: వ్యాధి ఉపశమనానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, మన ఇతర పనులు ఉత్సాహంగా చేసుకుంటూ ఉండటమే. ఇతరులు ఏమన్నా పట్టించుకోకుండటమే.

డిస్ క్లెయిమర్

నేను వైద్యుడిని గాని, మందులతయారీ దారుని గాని, విక్రేతను గానీ కాదు. జనహితం కోసం సత్యాన్వేషణ చేస్తున్నవాడిని మాత్రమే. కనుక ఇందులో వ్రాస్తున్న విషయాలనువైద్య సలహాలుగా భావించరాదు. అర్హులైన డాక్టర్లతో సంప్రదించుకోటం డబ్బు, సమయం ఉన్నవారికి ఆవశ్యకం. లేనివారి మనశ్శాంతి కొరకు వ్రాస్తున్నాను. కారణాలు
వంశ పారంపర్యమని కొందరి అభిప్రాయం. వత్తిడి (స్ట్రెస్) వల్ల అని మరి కొందరి అభిప్రాయం. సాక్ష్యాలు లేవు. ఎగువ ఊపిరితిత్తుల స్ట్రెప్టోకాకల్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కూడ రావచ్చట. క్లోరోక్విన్, క్లోరోప్రొపామైడ్, లిథియం, ప్రాక్టవోల్ వంటి మందుల వల్లకూడ కొన్నిసార్లు ఎక్కువ కావచ్చుట. మెగ్నీషియం లోపం వల్ల వస్తుంది అనే అభిప్రాయం ఉంది.

ముఖ్యంగా ఆకర్షించిన అంశం

ఉపశమనానికి అవిసె విత్తనాల వినియోగంhttp://health.india.com/diseases-conditions/treatment-and-self-care-for-psoriasis.
దీనిలో వ్రాసిన సూచనలు ప్రాథమికంగా బాగానే ఉన్నాయి. ఈ హెల్త్.ఇండియా.కామ్ వెబ్ పేజీకి 26 వ్యాఖ్యలు వచ్చాయి. వీటిని చూశాను. వీరందరు బాధితులే. వీరు పరిష్కారాలు కోరుతున్నారు. కొందరు 3 నెలలనుండి బాధపడుతుండగా, ఒకరు 20 ఏళ్ళనుండి బాధ పడుతున్నారు. ఒకరు ఆపిల్ సైడర్ స్వల్పంగా తాగటం గురించి ప్రస్తావించారు.
ఆంగ్లం ఫ్లాక్స్ సీడ్స్. దీనికే మరొక పేరు లిన్ సీడ్ ట. బ్రౌన్, తెలుపు, ఎరుపు రంగులు ఉంటాయి. చిట్కా వైద్యవినియోగం: ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లు, విరేచనాలు, కడుపులోమంట, కొన్ని ప్రత్యేక వ్యాధులు(ట).
పైన ఇచ్చిన హెల్త్.ఇండియా.కామ్ లింకులో, అవిసె విత్తనాలకు సంబంధించిన సూచన కోట్ చేస్తున్నాను.

- One home remedy that seems to have helped many people is the intake of flax seeds (Alsi). The omega 3 fatty acids in flax seeds apparently modify the chain of events that cause Psoriasis. Just before breakfast and dinner every day, roast and grind the seeds. Mix with two spoons of water and eat the paste.
షుమారు తెలుగు అనువాదం: చాలమందికి సహాయం చేసినట్లుగా కనిపిస్తున్న ఇంటి దినుసు , అవిసె గింజలను లోపలికి తీసుకోటం. ఈ ఫ్లాక్స్ గింజల్లో ఉన్న ఒమేగా 3 ఫాటీ కొవ్వు ఆమ్లాలు సోరియాసిస్ కు దారితీసే గొలుసుసంఘటనలను మార్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు, రాత్రి డిన్నర్ కు ముందు ప్రతిరోజు ఈగింజలను వేయించి నూరాలి. వీటిని రెండు స్పూన్ల నీళ్ళలో కలిపి పేస్ట్ గా చేసి తినాలి.

ఈవెబ్ పేజీలో ఇచ్చిన కొన్ని సూచనలు


*వైద్యసలహాతో , శరీరం బరువు తగ్గించుకోటం.
*యోగ.
*వాసనలేని షాంపూల వాడకం.
*ఉదయం 9 గంటలముందు, 15 నిమిషాలు సూర్యరశ్మినిపొందటం.
ఫ్లాక్స్ విత్తనాల వినియోగం పై పార్వతిక్రిష్ణన్ అనే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గారి రైట్ అప్ కు లింకు:
http://health.sify.com/how-to-use-flaxseeds-in-your-diet.
ఈసలహా పని చేసినా పనిచేయకున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, నష్టదాయకం కాకపోవచ్చు. అవిసె గింజలు పెద్ద ఖరీదైనవి కూడ కాదు. ప్రయత్నించి చూడచ్చేమో.

బావంచాలు


సంస్కృతం: బాకుఛీ. హింది: బావాచి. గింజలు తెచ్చి పొడి చేసుకోవచ్చు. పౌడర్ (చూర్ణం) దొరుకుతుంది. టాబ్లెట్ లు కూడ దొరుకుతాయి. రసం తిక్తం(చేదు), కటు (కారం). భావప్రకాశ అనే గ్రంధం, సుశ్రుత సంహిత అనే గ్రంధం ప్రకారం(ట).

ఇంకా, ఇంకా

జూలు అనే ఆఫ్రికన్ తెగ వారి జానపద వైద్యంలో అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుందట. సాక్ష్యాలు స్వల్పమే కానీ, ప్రయత్నించినందు వల్ల నష్టం లేదు కాబట్టి ప్రయత్నించ వచ్చు.

బర్ డాక్ వేరు (burdock root) - ముళ్ళతుమ్మ వేరు

ముళ్ళతుమ్మ వేరు, పనిచేస్తుందట. టాబ్లెట్ లు, నూనె దొరుకుతాయి.

ఆముదం , బేకింగ్ సోడా కలిపిన పేస్ట్.

దీనిని, చర్మం పగలకపోతే ప్రయత్నించ వచ్చుట. ఇది చవక కాబట్టి ప్రయత్నిస్తే నష్టం లేదు. ఏక్రీమైనా చర్మం పగిలినపుడు రాయకపోటం మంచిది.

ఆలో వేరా

ఆలోవేరా అనే క్రీం వల్ల రిలీఫ్ ఉంటుంది అంటారు, కానీ సాక్ష్యాలు స్వల్పమే.

చాయన్నె పెప్పర్ అంటే ఎండు మిరపకాయలు.

ఎండు కారం పని చేస్తుందట. ఇది కాప్సాల్ సిన్ జోస్ట్రిక్స్ అనే పేరుతో ఆయింట్ మెంట్ గా దొరుకుతుందట. డబ్బుల్లేనప్పుడు, కొద్దిగా మంట పుట్టినా, ఎండుకారాన్నే స్వల్పంగా ప్రయత్నించవచ్చేమో.

డాండెలైన్ : సింహదంతి.

ఇది పొడిగా కానీ, బిళ్ళలుగా గానీ, యోగం (వేరే వాటిల్లో కలిపిన మిశ్రమం) గాగానీ దొరుకుతుందో లేదో తెలియదు.

వెల్లుల్లి

రక్తాన్ని శుభ్రం చేస్తుందిట. ప్రొద్దున్నే కొద్ది రెబ్బలు తినచ్చుట. ప్రయత్నించతగినదే.

మల్లెపూలు

మల్లెపూలను నూరి బాధిస్తున్న చర్మభాగాలపై రాయచ్చుట.

గుగ్గిలం

పాదరసం వంటి విషపదార్ధాలు కలవని గుగ్గిల ఉత్పత్తులను వాడచ్చు.

వేపనూనె

పనిచేసేవారికి ప్రయత్నించవచ్చు.

పసుపు

లోపలికి, బయటికి కూడ వాడచ్చుట.

బార్ బెర్రి రూట్: మానుపసుపుతో చేసిన టీ

శరీరంలోని విషాలను తగ్గిస్తుందట.

లైకోరైస్ : అతిమధురం తో చేసిన టీ.

వైరస్ లకు వ్యతిరేకంగా పని చేస్తుందట.

కొబ్బరినూనె రుద్దుకోటం

దురదకు ఉపశమనం.

నవకర్షకచూర్ణం

ఇది 11వ శతాబ్దానికి చెందినదిట. దీనిలో వాడబడతున్న మూలికలేవో తెలియటం లేదు. తొమ్మిద మూలికలుంటాయిట. పరిశోథించకుండా వాడటం సమంజసం కాదు.

కాకర రసం, నిమ్మరసం కలిపి తాగటం

అప్పుడప్పుడు చేస్తూఉంటే, ఉపశమనం కలుగుతుందట. బాగానే ఉంది. చవక. ప్రమాదం లేనిది.

బ్లాక్ నైట్ షేడ్ : కామంచి ఆకుల రసం

ప్రయత్నించవచ్చు. ముందు చెట్టును వెతకటమే ఒక సమస్య.

సముద్రస్నానాలు

తరచు సముద్రస్నానాలు చేస్తే ఉపశమనం కలుగుతుందట. చేస్తే గానీ తెలియదు. బాపట్ల, చీరాల, నిజాంపట్నం, విశాఖ, కాకినాడ వంటి ప్రదేశాల్లో ఉండే వారు ప్రయత్నించవచ్చు.

ఎప్సం సాల్ట్ తో స్నానం

ప్రయత్నించవచ్చు. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఉపశమనం కలుగుతుందట. మెగ్నీషియం లోపం వల్ల వచ్చిన సోరియాసిస్ వచ్చినవారికి ఇది పనిచేయవచ్చు. తరువాత ఆలివ్ నూనే రాసుకోవాలిట.

క్యాబేజీ ఆకులు రుద్దుకోటం

ప్రయత్నించి చూడచ్చు. చవక. తేలికగా దొరుకుతాయి. ఆయుర్వేదం ప్రకారం అపథ్యాలు పెరుగు ఎక్కువగా వాడటం. చేపలు, పాలఉత్పత్తులు కలిపి తినకూడదట. నల్లమినుములు ఎక్కువతినకూడదట. పులుపు, ఉప్పు ఎక్కువ తినకూడదుట. ఫ్రిజ్ లో పెట్టి అతిగా ఫ్రీజింగ్ చేసిన వస్తువులు తినకూడదట.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.