చర్చనీయాంశాలు: ఆరోగ్యం, చర్మం,
సోరియాసిస్ (బొల్లి) నయం కాదు, అనే ఒక నిరాశాపూరితమైన అభిప్రాయం ఉంది. అది నిజమైనా కాకపోయినా, వైద్యరంగంలో జరుగుతున్న పరిశోథనలను దృష్టిలో ఉంచుకుంటే నిరాశపడ వలసిన అవసరం నాకు కనిపించదు. భయంకర కలరా, మశూచి, పోలియో వంటి వ్యాధులే భారత్ నుండి పారిపోక తప్పలేదు. మన కర్తవ్యం: వ్యాధి ఉపశమనానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, మన ఇతర పనులు ఉత్సాహంగా చేసుకుంటూ ఉండటమే. ఇతరులు ఏమన్నా పట్టించుకోకుండటమే.
డిస్ క్లెయిమర్
నేను వైద్యుడిని గాని, మందులతయారీ దారుని గాని, విక్రేతను గానీ కాదు. జనహితం కోసం సత్యాన్వేషణ చేస్తున్నవాడిని మాత్రమే. కనుక ఇందులో వ్రాస్తున్న విషయాలనువైద్య సలహాలుగా భావించరాదు. అర్హులైన డాక్టర్లతో సంప్రదించుకోటం డబ్బు, సమయం ఉన్నవారికి ఆవశ్యకం. లేనివారి మనశ్శాంతి కొరకు వ్రాస్తున్నాను.ఇటీవల చూసిన ఒక లింకు
Click to go to హెల్త్.ఇండియా.కామ్ కు వెళ్ళటానికిదీనిలో వ్రాసిన సూచనలు ప్రాథమికంగా బాగానే ఉన్నాయి. ఈ హెల్త్.ఇండియా.కామ్ వెబ్ పేజీకి 26 వ్యాఖ్యలు వచ్చాయి. వీటిని చూశాను. వీరందరు బాధితులే. వీరు పరిష్కారాలు కోరుతున్నారు. కొందరు 3 నెలలనుండి బాధపడుతుండగా, ఒకరు 20 ఏళ్ళనుండి బాధ పడుతున్నారు. ఒకరు ఆపిల్ సైడర్ స్వల్పంగా తాగటం గురించి ప్రస్తావించారు.
ఈవెబ్ పేజీలో ఇచ్చిన కొన్ని సూచనలు
*వైద్యసలహాతో , శరీరం బరువు తగ్గించుకోటం.
*యోగ.
*వాసనలేని షాంపూల వాడకం.
*ఉదయం 9 గంటలముందు, 15 నిమిషాలు సూర్యరశ్మినిపొందటం.
ఫ్లాక్స్ విత్తనాల వినియోగం పై పార్వతిక్రిష్ణన్ అనే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గారి రైట్ అప్ కు లింకు: Click to go to ఫ్లాక్స్ విత్తనాల వినియోగం పై పార్వతిక్రిష్ణన్ అనే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గారి రైట్ అప్
నన్ను ముఖ్యంగా ఆకర్షించిన అంశం
ఉపశమనానికి అవిసె విత్తనాల వినియోగం
ఆంగ్లం ఫ్లాక్స్ సీడ్స్. దీనికే మరొక పేరు లిన్ సీడ్ ట. బ్రౌన్, తెలుపు, ఎరుపు రంగులు ఉంటాయి. చిట్కా వైద్యవినియోగం: ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లు, విరేచనాలు, కడుపులోమంట, కొన్ని ప్రత్యేక వ్యాధులు(ట).
పైన ఇచ్చిన హెల్త్.ఇండియా.కామ్ లింకులో, అవిసె విత్తనాలకు సంబంధించిన సూచన కోట్ చేస్తున్నాను.
...
- One home remedy that seems to have helped many people is the intake of flax seeds (Alsi). The omega 3 fatty acids in flax seeds apparently modify the chain of events that cause Psoriasis. Just before breakfast and dinner every day, roast and grind the seeds. Mix with two spoons of water and eat the paste.
... షుమారు తెలుగు అనువాదం: చాలమందికి సహాయం చేసినట్లుగా కనిపిస్తున్న ఇంటి దినుసు , అవిసె గింజలను లోపలికి తీసుకోటం. ఈ ఫ్లాక్స్ గింజల్లో ఉన్న ఒమేగా 3 ఫాటీ కొవ్వు ఆమ్లాలు సోరియాసిస్ కు దారితీసే గొలుసుసంఘటనలను మార్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు, రాత్రి డిన్నర్ కు ముందు ప్రతిరోజు ఈగింజలను వేయించి నూరాలి. వీటిని రెండు స్పూన్ల నీళ్ళలో కలిపి పేస్ట్ గా చేసి తినాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.