119 Service tax on rice బియ్యం రవాణాపై కేంద్ర ప్రభుత్వ సేవా పన్ను
చర్చనీయాంశాలు: taxation, ధరలు, ఆహారం,రవాణా
కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీచిదంబరం గొప్ప మేథావి. ప్రజలు ఆహారపదార్ధాల అధిక ధరలతో సతమతమవుతూ ఉండటం అనే విషయంలో శ్రీవారికి సంబంధం ఉండదు. శ్రీ మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గ సభ్యులలో పలువురికి ఈగుణం ఉంది. శ్రీవారికి ఈ బాధా రాహిత్యం (apathy) మరీ ఎక్కువ. ధరల పెరుగుదలను అదుపు చేయటం కేంద్రప్రభుత్వబాధ్యత కాదని శ్రీవారు ఇప్పటికే చెప్పారు.

ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. బియ్యం వ్యవసాయోత్పత్తి కాదుట. బియ్యం రవాణా వ్యవసాయోత్పత్తుల రవాణా కిందికి రాదట. కాబట్టి బియ్యం రవాణా కంపెనీలు (లారీలు, ట్రక్కర్లు) తాము సంపాదించే డబ్బులపై 12.38% సేవా పన్ను చెల్లించాలిట. ఫుడ్ కార్పొరోషన్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ మొ|| సంస్థలు లారీలవారినుండి సేవాపన్నుని మినహాయించుకోటానికి సమాయత్తం అవుతున్నాయిట.
క్రూడాయిల్ ధరల పెరుగుదల
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరుగుతున్నాయన్న నెపంతో ఇప్పటికే ఆయిల్ కంపెనీలు డీజెల్ ధరలను ఎప్పటికప్పుడు పెంచేస్తున్నాయి. గజం గజానికీ టోల్ పన్నులతో లారీలవారు ఇప్పటికిప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈగాయలతోనే రోడ్ రవాణా రంగం బ్రతికి బట్ట కట్తుందా కట్టదా అనే అనుమానం వస్తుండగా, బియ్యం రవాణాపై సేవాపన్నును వాయిస్తే, రవాణా సంస్థలవారు తమ కిరాయిలను పెంచేస్తే బియ్యం ధరలు ఆకాశమంటకమానవు. వరదలు, కరువుకాటకాలు, నల్లబజారు తాండవమాడే ఈదేశంలో కొంతవరకు రవాణారంగం బియ్యాన్ని అవసరమైన ప్రాంతాలకు చేరవేయటంలో కీలకపాత్ర వహిస్తున్న విషయం శ్రీ చిదంబరానికి తెలియదా?
మన్మోహన్ సింగ్ గారికి ప్రపంచబ్యాంకు గోలే
మన్మోహన్ సింగ్ గారికి ప్రపంచబ్యాంకు గోలే తప్ప భారతీయుల గోల అసలే పట్టదు.

సోనియా రాహుల్ లకి ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తే లేదు. మన చాయ్ వాలా నరేంద్ర మోడీగారు

ఏ అస్సోచాం, సీఐఐ, ఫిక్కి వంటి బడాయిలవాళ్ళు సన్మానించి అడిగితే తప్ప ఈవిషయం గురించి ఆలోచించటం కుదరదు.
కాకులను కొట్టి గద్దలకు వేసే పన్నుల వ్యవస్థ
పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యమూలసూత్రంలో ముఖ్యభాగం ఏమిటంటే, ప్రభుత్వ నిర్వహణయే ఒకవ్యాపారం. ప్రభుత్వలాభదాయకత ముందు చూసుకోవాల్సిరావటంతో ప్రభుత్వమే అమానుషంగా మారాల్సి వస్తుంది.
మార్క్సిజంలో మెరుగు
మార్క్సిజంలో పరిస్థితి మెరుగుగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యాపారంగా నిర్వహించరు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.