Sunday, January 19, 2014

120 Don't take water, eat meat only నీళ్ళు తాగద్దు, మాంసం మాత్రమే తినాలి

120 Vivekananda's respect towards cows & vegetarianism
చర్చనీయాంశాలు: స్వామి వివేకానంద

స్వామి వివేకానంద గారికి శాకాహారం అన్నా, ఆవులు అన్నా ఎంత గౌరవం ఉండేదో ప్రతి వివేకానంద అభిమాని, గోరక్ష అభిమాని తెలుసుకోటానికి ప్రయత్నించటం అవసరం.

స్వామీజీ భారతీయులకు, 3బీ లు ఉండాలని బోధించేవారు. 1. భగవద్ గీత 2. బైసెప్స్ (కండలు) 3. బీఫ్ (ఆవు మాంసం).

భారతీయులు కండలు లేక పోవటం వల్లనే యుధ్ధాల్లో ఓడిపోయారని, దౌర్బల్యం వల్ల పలు రంగాల్లో వెనుకబడ్డారని, కాబట్టి భారతీయులకి కండ బలం అవసరమని, ఆ కండబలం కావాలంటే బైసెప్స్ వ్యాయామం, మాంససేవనం ఉండాలని స్వామీజీ దృఢనమ్మకం. భారతీయులు తమ పొట్టలను బియ్యంతో నింపటం వల్ల సకల వ్యాధులకు గురి అవుతున్నారని స్వామీజీ బోధన. తన నమ్మకానికి అనుగుణంగా ఆయన షాడ్ చేపలు, తాబేళ్లు, చికెన్, మటన్, వగైరాలు భుజిస్తూ అవి లేనప్పుడు కొంత అసౌకర్యానికి గురి అవుతుండేవారు. వీటికి సాక్ష్యాలు కావలసినవారు స్వామి వివేకానంద జీవిత చరిత్రలను, సంపూర్ణరచనలను కూలంకషంగా పరిశీలించుకోవచ్చు.

ఇక్కడ ఒకే వ్యాసంలో అన్నిటినీ పరిశీలించటం సాధ్యంకాదు, అప్పుడప్పుడు వీలుచిక్కినపుడు చర్చిద్దాం. ఈరోజుకు మచ్చుకు ఒకటి.

ఈఫొటోలో ఉంది ఖేత్రీ సంస్థానానికి రాజు. ఈయన పేరు అజిత్ సింగ్. ఈఖేత్రీ రాజస్థాన్ రాష్ట్రంలో, ఝుంఝున్ను జిల్లాలో ఉన్నది. రాజస్థాన్ లో ఈప్రాంతాన్ని షేకావత్ ప్రాంతం అంటారు. స్వామీజీకి వివేకానందా అనే పేరు ఇచ్చింది ఖేత్రీరాజుగారే. స్వామీజీకి ప్రత్యేక కాషాయ తలపాగ, నడుముకి ప్రత్యేక బెల్టు ఇచ్చింది ఖేత్రీరాజుగారే. శ్రీఅజిత్ సింగ్ గారికి తనకు కలిగిన పుత్రసంతానం స్వామీజీ దయతో కలిగినదే అని నమ్మకం. వివేకానంద అసలు తల్లి భువనేశ్వరి దేవి గారికి నెలకు రూ. 100 భత్యం (ఆనాటి ధరలలో పెద్ద మొత్తమే) ఖేత్రీరాజుగారు ఏర్పాటు చేసారు. ఈఅజిత్ సింగ్ నే, స్వామీజీ 'ఈభూమిపై నాకున్న ఏకైక స్నేహితుడు' అని ప్రకటించారు. తెల్లవాళ్ళకి జపం చేసుకోటానికి, పులితోళ్ళు ఇచ్చి వారితో స్వామీజీ మైత్రి చేసుకోటానికి, ఖేత్రీరాజు గొప్పగా సహకరించేవాడు. ఈఖేత్రీరాజుగారికి చెన్నై ప్రాంత ఊటీనుండి శ్రీవివేకానంద గారు లేఖలు వ్రాశారు.
ఇది ఖేత్రీలో వివేకానంద శ్రీఅజిత్ సింగ్ గారినుండి ఆతిథ్యం పొందిన ప్రదేశ్ కావచ్చు
On our way we had the company of Mr.Ramnath, the charan headmaster of the Jeypore noble's school. He and I had a bout on my first coming out of Khetri years ago, about vegetarianism. He had in the meantime got hold of some American writers and pounced upon me with his arguments from them. His author, he said, has proved to his satisfaction that the human digestive organs including the teeth are exactly like those of the cow. Therefore, man is designed by nature to be a vegetarian animal. He is a very good and nice gentleman and I did not want to disturb his confidence in the American hobbyist but one thing was on the tip of my tongue. If our digestive apparatus is exactly like that of a cow, we ought and must be able to eat and digest grass. In that case poor Indians are fools to die of starvation in famine times while their natural food, grass, is so abundant, and your Highness' servants are fools to serve you while they have only to get up the nearest hillock and get a bellyful of grass instead of undergoing all the trouble of serving others!!! Grand American discovery indeed!!! Only I hope the holy dungs of such human cows may become of great use to the wonderful American author and his Indian disciple. Amen. So much for the cow-human theory.

వైబీరావుగాడిద అభిప్రాయాలు

ఆవు యొక్క దంత నిర్మాణం, మనిషి యొక్క దంతనిర్మాణంలో కొన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి మనిషికి శాకాహారం మేలు అని అమెరికన్ లు, రామనాథ్ అనే ఆజైపూర్ నోబుల్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, పొరపాటు పడితే పడి ఉండవచ్చు.
ఇక్కడ ఖేత్రీగారి మెప్పు కోసం వివేకానంద గారు ఆహెడ్ మాస్టారిని ఘోరంగ ఎగతాళి చేయటం అన్యాయం.

కరువు వచ్చినప్పుడు గడ్డితింటే సరిపోదా అని వివేకానంద హేళన చేశారు.

ఒకసారి పెద్దతుఫాను వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పంటలన్ని తుడిచిపెట్టుకుపోయాయి. పొలాల్లో గడ్డి భారీగ ఉండటంతో, పాడి, పాలు, పెరుగు దొరికేవిట. కాని ధాన్యం లేకపోటంతో తిండి కరువయ్యిందిట. అపుడు జనం రేగడి మట్టిలో పెరుగు కలుపుకొని తిన్నారట. మన పెద్దలు చెప్తూ ఉంటారు. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సజ్జ, ఇవన్నీ గడ్డిజాతులే.

మొదట మనిషి శరీర జీర్ణ వ్యవస్థ మాంసాహారానికి అనువుగా రూపొందినప్పటికి, కాలగమనంలో మాంసాహారానికి కొరత వచ్చిగానీ, ఇతర కారణాల వల్లగానీ, శాకాహారానికి అనువుగా జీర్ణవ్యవస్థ పరిణామం పొందటం మొదలయింది. ఇంకా పూర్తికాలేదు. ఇపుడు మనిషి ఆమ్నీవోరస్ అంటే అన్నీ తింటాడు. కార్నీవోరస్ మాత్రమే కాదు. హెర్బీవోరస్ మాత్రమేకాదు.

ఓ మహారాజా, మీ సేవకులు ఇతరులకి సేవకులుగా పడిఉండేకన్నా కొండమీదికెళ్ళి కడుపునిండా గడ్డి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని స్వామీజీ వ్రాయటం ఆయన అపరిపక్వ జ్ఞానాన్ని సూచిస్తుంది.

స్వామీజీ ఈలేఖ 1893లో వ్రాశారు. 1897కల్లా స్వామీజీగారి మధుమేహం (చక్కెర వ్యాధి డయాబెటిస్) బయటపడింది. ఇతర పలు రోగాలు కూడ బయట పడ్డాయి. తన వ్యాధి తగ్గాలంటే, ఇంక నీళ్ళు తాగకూడదని, మాంసాహారం మాత్రమే తీసుకోవాలని స్వామీజి దీక్షపట్టినట్లున్నారు. 26-3-1897 నాడు స్వామీజీ డార్జిలింగ్ నుండి, అమెరికాలోని మిసెస్. ఓల్ బుల్ గారికి వ్రాశారు.
The demonstrations and national jubilations over me are over — at least I had to cut them short, as my health broke completely down. The result of this steady work in the West and the tremendous work of a month in India upon the Bengalee constitution is "diabetes". It is a hereditary foe and is destined to carry me off, at best, in a few years' time. Eating only meat and drinking no water seems to be the only way to prolong life — and, above all, perfect rest for the brain. I am giving my brain the needed rest in Darjeeling, from where I am writing you now.

వైబీరావు గాడిద వ్యాఖ్య

నీతి ఏమిటి? మనకి ఏ జబ్బు వచ్చినా నీళ్ళు తాగకూడదు. మాంసం మాత్రమే తినాలి. కరువు వచ్చినా సరే గడ్డితో తయారయిన బియ్యం, గోధుమలు వంటివి తినకూడదు. ఐస్ క్రీం తినచ్చు.

కుతూహల ప్రశ్న: స్వామీజీ కలకత్తానుండి వ్రాయకుండా డార్జిలింగ్ నుండి ఎందుకు వ్రాస్తున్నారు?జవాబు: ఓస్ అంతేగా. స్వామీజీకి కూలింగ్ సెంటర్లంటే మక్కువ. ఆల్మోరా, డార్జీలింగ్, ముస్సోరీ, కాశ్మీర్, ఊటీ, ఆల్ప్స్ పర్వతాలు వంటి చల్లటి ప్రదేశాలను మాత్రమే స్వామీజీ ఇష్టపడతారు. అప్పటి కింకా ఏ.సీ. లు రాలేదు. ఇప్పటి స్వామీజీలైతే ఎ.సీ. గదుల్లో సేద తీరుతారు. ఎ.సీ. కార్లలో తిరుగుతారు. మాయవతి ఆల్మోరాలో మంచి ఆశ్రమం నిర్మించుకోవాలని స్వామీజీ కోరిక, విదేశీ శిష్యులు సహకరించనందు వల్ల కుదరలేదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.