Monday, January 27, 2014

121 Leave Hyderabad?

121 Who are Tleaders to say that somebody should leave Hyderbad, if he has self-respect? ఆత్మాభిమానం ఉంటే హైదరాబాదు వదలి వెళ్ళాలని కిరణ్ ను హెచ్చరించటానికి టీ-లీడర్లు ఎవరు?
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, రాష్ట్రపతి, ఆం ఆద్మీ

ఎవరినో వెళ్ళగొట్టాలనే ధోరణి

రాష్ట్ర విభజన సమస్య భ్రష్టు పట్టటానికి కాంగ్రెస్ అధిష్ఠానం యొక్క రాజకీయ స్వార్ధం మాత్రమే కాక, టీ-లీడర్ల అహంకారపూరిత ధోరణి మరొక ప్రముఖ కారణం. లేటెస్ట్:
ఈనాడులో ప్రచురించిన ప్రకారం, జనవరి 26 నాడు హైదరాబాదు గాంధీ భవన్ లో సమావేశమైన టీ-లీడర్లు 'ఆత్మాభిమానం ఉంటే హైదరాబాదును వదిలి వెళ్ళిపొండి' అని డిమాండు చేశారు.
ఇలా డిమాండు చేయటానికి వాళ్ళెవరు? భారతదేశం ఒక పెద్ద పేద దేశం. భారతీయ పౌరులు ఏనగరంలో నయినా ఎంతకాలమైనా నివసించవచ్చు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. హైదరాబాదు కరీంనగర్ వారికో, మెదక్ వారికో స్వంత సొత్తుగా భావించటం ఒక భ్రమ. టీ-లీడర్లు మొదటినుండి, ఈ భ్రమతో బాధ పడుతున్నట్లు కనిపిస్తున్నది. హైదరాబాదునుండి ఎవరినో తరిమేయాలి అని విపరీతంగా పలవరిస్తున్నారు.

ప్రస్తుతం వారీ డిమాండును కాంగ్రెస్ గాంధీ భవన్ నుండి చేశారు కాబట్టి, వారికి సరియైన మార్గం చూపవలసిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే కాంగ్రెస్ అధిష్ఠానమే తన రాజకీయ అవసరాల కొరకు పక్షపాత జబ్బుతో బాధ పడుతున్నది. అది న్యాయమేదో అన్యాయమేదో గమనించే స్థితిలో లేదు.

మార్క్సిజానికి తిలోదకాలిచ్చిన సీపీఐ నేత


తెరాస, టీ కాంగ్రెస్ లు రెండో మూడో సీట్లు తమకు కేటాయిస్తాయనే ఆశతో ఉన్న సీపీఐ నేతలు తమ మార్క్సిస్టు సిధ్ధాంతాలను తుంగలో తొక్కి తెలంగాణ వాదాన్ని అతిగా నెత్తినేసుకోటం (విభజనను సమర్ధించటం తప్పుకాదు), విచారకరం. కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నదని బిజెపీ కేంద్రనాయకత్వం కూడ అంగీకరించింది. తప్పుల తడకలుగా ఉన్న ఆబిల్లులో, బిల్లుయొక్క లక్ష్యాలను గానీ, ఆర్ధిక అంశాలను గానీ వివరించలేదు.

ఈ తప్పులన్నీ ముఖ్యమంత్రి కిరణ్ కు 40రోజుల తరువాత గుర్తుకు వచ్చాయా అని సీపీఐ నేత అన్నారు. శాసన సభలో తనకు బిల్లుపై పూర్తి స్థాయి ప్రసంగం చేసే అవకాశం శ్రీకిరణ్ కు ఇప్పుడు వచ్చింది. ఆయన తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు.

శాసనసభలో చర్చించకుండా మొదటి రోజే వెనక్కి పంపే తీర్మానాన్ని ప్రతిపాదించి ఉంటే, అప్పుడు ఇదే సీపీఐ నేతలు 'శాసనసభలో కనీసం చర్చించకుండా బిల్లును తిప్పి పంపారు. ఇది ప్రజాస్వామ్యమా ' అని ఉండే వాళ్లు. నాలుకలు ఏముంది, ఎలా కావాలంటే అలా తిరుగుతాయి.

ఇంకా శాసనసభలో బిల్లుపై ప్రసంగించ వలసిన వాళ్ళు 190 మంది వరకు ఉన్నారు. రాష్ట్రపతి

ధర్మాత్ముడు గారు కేవలం వారం రోజులు మాత్రమే గడువిచ్చి (అందులో రిపబ్లిక్ డే), మిగిలిన శాసన సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా నిర్దయగా వ్యవహరించారు. ఇదే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగారు తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం--కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన ఒక మంత్రి వర్గ కమీటీకి నేతృత్వం వహించారు. ఈకమీటీ తెలంగాణ సమస్యపై ఎన్ని సంవత్సరాలు కూర్చుంది? ఎన్ని సార్లు సమావేశమయ్యింది? ఏమి పరిష్కారాలను సూచించింది? తాము ఒక సమస్యపై ఎన్ని ఏళ్ళయినా నిద్ర పోవచ్చు. రాష్ట్ర శాసనసభ మటుకు 40 రోజులలో తన అభిప్రాయం చెప్పాలా? ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించేలా బిల్లును తయారు చేయిస్తానని చెప్తే కేంద్రమంత్రివర్గంలో సీమాంధ్రమంత్రులు ఊ కొట్టి వచ్చారు. మరి మరల ప్రధానిని కలిసి ఏమిటండీ ఇలాటి బిల్లుని పంపారు అని అడగరా?

రాష్ట్ర శాసనసభకి రాష్ట్రపతి, కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న విలువ ఎంత?


సున్నా. విలువ ఇవ్వకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా విభజించుకోవాలనుకుంటున్నప్పుడు, ముసాయిదా బిల్లును శాసనసభకి పంపటం ఎందుకు?

ఆం ఆద్మీ పార్టీ తొందరపాటు


చిన్న రాష్ట్రాలను సమర్ధిస్తున్నాం అనే సిధ్ధాంతంతో ఆం ఆద్మీ పార్టీ తెలంగాణను సమర్ధించ బూనుకోటం విచారకరం. చిన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ ఆం ఆద్మీ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండు చేస్తున్న వాళ్ళ లక్ష్యం గుర్తుంచుకోవాలి. వారు ఎవరినో హైదరాబాదు నుండి తరిమేయాలనే వ్యాధితో బాధ పడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చ గొట్టటంతో అమాయకులు కొందరు ఉద్రేకపడి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ బలవంతం వసూళ్ళను extortions ను యధేఛ్చగా కొనసాగించుకోవాలని విభజన వాదుల పథకం. తెలంగాణను పాకిస్థాన్ కన్నా హీన స్థితికి వారు చేర్చనున్నారు. అందుకే వారు నిజాంను గొప్ప లౌకిక పాలకుడిగా భజన చేయటానికి వెనకాడటం లేదు.

ఆం ఆద్మీ పార్టీ నిజంగా చిన్నరాష్ట్రాలను సమర్ధించాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకు ఈక్రింది రాష్ట్రాలను ప్రతిపాదించాలి.
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ.

రాష్ట్రాల పునర్విభజన అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కారాదు. దేశం మొత్తాన్ని అమెరికా లాగా ఏ 50 రాష్ట్రాలుగానో విభజించటానికి, దేశమంతా అభిప్రాయ సేకరణ జరగాలి.

భారత్ ఒక దేశంగా మనుగడ సాగించాలంటే నియంతృత్వ ధోరణులు ప్రమాదకరం


తెలంగాణ ఇవ్వటం తప్పులేదు. దానికి చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారాలు వెతకాలి. బలవంతంగా రుద్దితే కుదరదు. హైదరాబాదు నగరంలో కొన్ని లక్షలకోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వెచ్చించాక, దానిని కొన్ని జిల్లాల వాళ్ళ స్వంత ఆస్థిగా మార్చటం కుదరదు. అది రాష్టంలోని అన్ని జిల్లాల ప్రజలకు, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి ఉండాల్సిందే. హైదరాబాదే కాదు, దేశంలో ఇటువంటి నగరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదుని కొన్ని జిల్లాలవారి స్వంత ఆస్తిగా మారిస్తే, మిగిలిన నగరాలలో కూడ ఇటువంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. శివసేన మనకు చక్కని ఉదాహరణ. 20 లక్షలు దాటిన ప్రతి నగరాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాల్సిన అవసరం ఉంది. అంతే కాదు, 20 లక్షలు దాటిన నగరాల నెత్తిపై ఒక మేకు కొట్టాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లుగా పెరుగుతూ పోతే అవి నేరగాళ్ళ నిలయాలుగా, ఉగ్రవాదానికి నెలవులుగా మారతాయి.

20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలను అభివృధ్ధి చేస్తూ అక్కడ ఉపాధి అవకాశాలను కల్పిస్తే కొన్నిగ్రామాల్లో ఉండే అధిక జనాభాకి అక్కడ పునరావాసం కల్పించవచ్చు. ప్రధమ ప్రాధాన్యత గ్రామాల, చిన్న పట్టణాల అభివృధ్ధి, అక్కడే ఉపాధి, ప్రాధమిక సౌకర్యాల కల్పన. తప్పని సరి పరిస్థితులలోనే చిన్న నగరాల అభివృధ్ధి.

సీపీఐ నేతలు చింతనా బైఠక్ జరుపుకోవాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.