Saturday, November 9, 2013

#049 No SImAndhra leader to come forward to work as CM of AP ముఖ్యమంత్రిగా పనిచేయటానికి ఏనేతా ముందుకు రాకపోవచ్చు

#049 No SImAndhra leader to come forward to work as CM of AP ముఖ్యమంత్రిగా పనిచేయటానికి ఏనేతా ముందుకు రాకపోవచ్చు
రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీకోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వచూపినా, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, కాంగ్రెస్ ప్రతిష్ఠకు, భంగకరమని ఆయన గుర్తించి , తిరస్కరించటం ముదావహం.

రవాణా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణకు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటే ఆయన ముందుకు వచ్చే వాడేమో. శ్రీమతి పురందేశ్వరి, పనబాక లక్ష్మి , కిల్లి కృపారాణి వంటి వారు కూడ ముందుకు వచ్చేవారేమో. కానీ కాంగ్రెస్ సంస్కృతిలో ముఖ్యమంత్రి పదవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒకేకులం వారికి దక్కుతూ ఉండటం గమనార్హం.

ఏది ఏమైనా పదవుల తాయిలాలను పంచిపెట్టి, తెలుగు వాళ్ళను లొంగతీసుకునే కాంగ్రెస్ అధిష్ఠానం ఇంద్రజాలాలకు కాలం చెల్లబోతుందని, కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించటం అవసరం.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అవన్ని, అడియాసలు కాకమానవు. సీమాంధ్రప్రజలకు న్యాయం చేస్తే ఆయనకు ఏమి లాభం వస్తుంది? ఆయన,గతంలో రాజీవ్ ని, సోనియామాతను ధిక్కరించి బెంగాల్లో దెబ్బ తిని ఆమె విశ్వాసాన్ని పొందలేక ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయి అతికష్టంమీద రాష్ట్రపతి పదవిని పొంది ఉన్నవాడు. అణకువగా ఉంటే రాష్ట్రపతిగా రెండవ టరమ్ లభిస్తుంది. లేకపోతే మాజీ రాష్ట్రపతిగా బెంగాల్లో చిన్న చిన్న చెరువుల్లో చేపలు పట్టుకుంటూ, శేషజీవితాన్ని గడపాల్సి వస్తుంది.

దిగ్విజయసింగ్ గారు, చెప్తున్నదాని బట్టి చూస్తుంటే, రాష్ట్రశాసనసభ అభిప్రాయాలను పట్టించుకోకుండా, కేంద్రమంత్రివర్గం తెలంగాణా బిల్లును ముందుకు నెట్టబోతుంది. లోకసభలో బిజెపికూడ కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యే సూ చనలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే అఖిల భారత పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీలుగా చరిత్రలో నిలబడపోతున్నాయి.

రాష్ట్రశాసనసభల తీర్మానాలను పట్టించు కోకపోటం అనేది అసాధారణమైన వాటిలో అసాధారణమైన కేసుల్లో (rarest of the rarest) కేసుల్లో జరగాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితులేమీ లేవు. శాసనసభలో సీమాంధ్ర,తెలంగాణా సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కారాలను వెతకాలి. అసలు ఈ పనిని కాంగ్రెస్, బిజేపీలు, 2004-2012 మధ్యలో ఎప్పుడో చేయాల్సి ఉంది. చేయకుండా ఎందుకు నిద్ర పోయారు? ఇప్పుడు, శాసనసభను కూడ పట్టించుకోకుండా, ఎందుకు చిందులు తొక్కుతున్నారు?

రాష్ట్ర విభజన అనేది, మాతృదేవతలు పడే ప్రసవ వేదనల వంటిది కాదు. సిజేరియన్ చేసి పిల్లను తీయకపోతే తల్లికీ, పిల్లకు ప్రమాదం అనే భయం ఇక్కడ ఇప్పుడు పొంచి లేదు.

పదవీవేదనతో బాధ పడుతున్న చంద్రశేఖరరావుకి సోనియామాత ఎందుకు భయపడుతున్నదో అర్ధంకాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఫిబ్రవరి 26, 1997 నాడు శ్రీ చంద్రశేఖరరావు ఏమన్నారో చూస్తే ఆయన నక్కజిత్తులు అర్ధం అవుతాయి.
"ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో , రాయలసీమ లో ఉద్యమాల కోసం ఏదో సమితి అనేది పెడుతున్నారు. రాయలసీమ లో రాయలసీమ విమో...చన సమితి, రాయలసీమ పోరాట సమితి, తెలంగాణ ప్రజా సమితి ఈ విధంగా అనేక పేర్లతో సమితి నాయకత్వాన ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కాని వారికి హోదా వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. పలు నినాదాలు వస్తున్నాయి. ఇందాక హౌస్ లో దామోదరరెడ్డి గారు స్లోగన్ తో సహా జైతెలంగాణ అని కూర్చున్నారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రిగారు తక్షణ చర్యలు చేపట్టాలి."

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.