Sunday, April 27, 2014

214 మంత్రులంటే బానిసలా? Are Ministers slaves?


శ్రీ అమిత్ షా గారు గుజరాత్ రాష్ట్రానికి భూత్ పూర్వ హోం మంత్రి. శ్రీ నరేంద్ర మోడీగారి నికట సహయోగి అంటే కుడి భుజం. శ్రీమోడీ ప్రధానమంత్రి అయితే, దేశానికి హోం మంత్రి లేక, రాజనాథ్ సింగుజీకిఅధికారికంగా హోం శాఖ ఇవ్వాల్సి వస్తే, అదే హోం శాఖకి సహాయమంత్రి కావలసిన వాడు. 2014 సాధారణ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ఎన్నికల ప్రచారానికి సారధిగా వ్యవహరిస్తున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం ఇపుడు మోడీ వేవ్ , మోడీ సునామీ గా పరిణమించింది. వైరి పార్టీలను నామరూపాలను చేసేయగల శక్తిని పుంజుకుందని భావం. శ్రీమన్మోహన్ సింగు ప్రధానమంత్రి పదవిని దిగజార్చారనే అభిప్రాయం సర్వత్రా ఉన్నప్పటికి , ఇది శ్రీమోడీ అభిమానులలో అతితీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ప్రధానమంత్రి పదవికి , పార్టీ అధ్యక్ష ప్రధవికి అధికారం కొరకు కొంత తొక్కిసలాట స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూగారి మొదటి రౌండు పాలనలోనే జరిగింది. స్వర్గీయ పురుషోత్తమదాస్ టాండన్, ఆచార్య కృపలానీ వంటివారు, ఆనాటి ప్రధానమంత్రికి ఉన్న ప్రత్యేక ఆదరణకి తట్టుకోలేక వెనక్కి తగ్గవలసిరావటమే కాక, ప్రధానమంత్రి ఒక తరహా నియంతగా మారటం ఆనాడే మొదలయింది.

స్వర్గీయ ఇందిరా గాంధీ పాలనలో నిజలింగప్ప కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండగా, మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు గా కామరాజ్ నాడార్ ఉండగా కూడ ఈసమస్య వచ్చి కాంగ్రెస్ నిలువుగా చీలి పోయి ప్రధానమంత్రి (ఇందిర) నియంతగా తయారు కావటం జరిగింది.

సోనియా పాలనలో ఉల్టా అయ్యింది. ప్రధాని ఆటబొమ్మ అయ్యాడు. కాంగ్రెస్ అధ్యక్షురాలు నియంతగా మారింది. ఇదే సందర్భంగా మనం గమనించాల్సిందేమిటంటే, యుపిఏ భాగస్వామ్యపక్షాల ప్రాతినిథ్య మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు కూడ, ప్రధానమంత్రిని లెక్కచేయకుండా అవినీతికి పాల్పడటం, దీనిని ఆయన ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకోటం గమనార్హం.

ఇపుడు ఈ ఎనాలజీనీ బిజెపికి , శ్రీనరేంద్రమోడీకి అన్వయించాల్సి వస్తే రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి.

౧. మంత్రులు స్ట్రాంగ్ గా ఉండి వారికి ప్రధాని మధ్యలో మానసిక శృతిమేళనం (harmony and concordance) ఉంటే అది సుందరంగానే ఉంటుంది. ఉదా: శ్రీ వాజ్ పేయీ, శ్రీ అద్వానీల మధ్య ఉన్న బంధం. శ్రీ మురళీమనోహర్ జోషీ మరియు శ్రీ అద్వానీల మధ్య ఉన్న శృతిమేళనం.

౨. ఇలాంటి శృతి మేళనం శ్రీ మోడీ మరియు శ్రీ అరుణ్ జైట్లీ మధ్య, శ్రీమోడీ మరియు శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీ మోడీ మరియు శ్రీ రాజ్ నాధ్ సింగుల మధ్య ఉంటుందా? అకాలీ దళ్, శివసేన, బహుశా టిడీపి, వంటి మిత్ర పక్షాల మంత్రులు తమశాఖలలో బానిసలుగా వ్యవహరిస్తారా, వారికేమైనా లీ - వే ఉంటుందా? అధికార వికేంద్రీకరణం అసలు జరగదా? పత్రికలలో వస్తున్నవార్తలను బట్టి బిజెపినేతలు కొందరు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గ శాఖలను పంచేసుకున్నారు.
శ్రీ జైట్లీ గారు ఆర్ధికమంత్రి, శ్రీ రాజ్ నాధ్ సింగు గారు హోం మంత్రి, శ్రీ మతి స్వరాజ్ గారు విదేశాంగం ఇలాగా.

శ్రీఅమిత్ షా గారి అభిప్రాయం ప్రకారం, కేంద్ర మంత్రులు తమ శాఖలను జాగీర్లుగా మార్చుకోలేరు.


प्रत्येक व्यक्ति अपनी मिनिस्ट्री का प्रधानमंत्री बन गया था, और इसकी वजह से भ्रम की स्थिति थी।

తెలుగు సారం: ప్రత్యేక వ్యక్తి తనను తన శాఖకు ప్రధానమంత్రిగా తయారు చేసుకున్నాడు. మరియు, ఈకారణం వల్ల భ్రమ స్థితి వచ్చింది.

मंत्रियों को उनके विभागों को जागीर में तब्दील करने की इजाजत नहीं मिलेगी।

తెలుగు సారం: మంత్రులకు తమ శాఖలను జాగీర్లుగా మార్చుకునే అవకాశం దొరకబోదు.


వైబీరావు గాడిద వ్యాఖ్య

ప్రధానమంత్రి వద్ద కేంద్ర మంత్రులు గుమాస్తాలుగా మారబోతున్నారా (స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యంలో ఇదే జరిగింది). ప్రధానమంత్రికి ప్రతి కేంద్రమంత్రికి మధ్య సంబంధాలను ఎటువంటి త్రాసులో తూచి సమతౌల్యాన్ని సాధించబోతున్నారో శ్రీ షా గారు విశదీకరిస్తే బాగుండేది.

అద్వానీ , జోషీ వంటి వృధ్ధనేతలకు జోలెలు ఇస్తారా?

శ్రీ షా గారు అన్నట్లుగా వచ్చిన మాటలను చూడండి.


बीजेपी के कुछ वरिष्ठ नेता टिकट न मिलने या सीट बदलने के लिए मजबूर होने से नाराज हैं.

బిజెపి లో కొందరు సీనియర్ నేతలకు టికెట్ దొరకనందు వల్ల గానీ, సీటు మార్చుకోమని వత్తిడికి గురి కావటం వల్లగానీ కోపంగా ఉన్నారు.

'' ... यह स्वाभाविक है कि शुरुआत में वे नाराज थे। उनमें निराशा थी। ऐसी चीजें होने पर सार्वजनिक जीवन से जुड़े लोगों को धक्का लगता है। हालांकि सभी पार्टी के अनुशासित कार्यकर्ता हैं और अब कड़ी मेहनत कर रहे हैं। ...''

తెలుగు సారం: మొదట్లో వారు అలుక వహించటం సహజం. వారిలో నిరాశ ఉండింది. ఇలాంటివి జరిగినపుడు ప్రజాజీవనంలో ఉండే వాళ్ళకి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. అయినప్పటికి పార్టీలో అందరు క్రమశిక్షణగల కార్యకర్తలే. మరియు వాళ్ళు ఇపుడు చాలా శ్రమ పడుతున్నారు.
అవునేమోలే మరి. శ్రీబండారు దత్తాత్రేయ గారి సికిందరాబాదు లోక్ సభస్థానాన్ని కోరుకున్న శ్రీకిషన్ రెడ్డి తన పాత అంబర్ పేటలో సోనియా కీ వీరభక్తహనుమాన్ శ్రీ వి. హనుమంతరావుగారితో పోటీచేయవలసిరావటం ఎంత శ్రమ? సికిందరాబాదులో శ్రీ దత్తాత్రేయ గారికి చెమటలు పట్టించారు కదా, శ్రీ కిషన్ రెడ్డీజీ.

లైన్ లో ఉన్నవారి నెత్తుల మీదినుండి తొక్కుకుంటూ వెళ్ళే సంస్కృతి కాంగ్రెస్ లో ఉంది. ఇపుడు అది బిజెపిలోకి ప్రవేశించింది. ఇంతచేసి, శ్రీ నరేంద్రమోడీ దైవ రాజ్యంలో , లోక్ సభకి పోటీ చేసి కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించటం అంటే జాగీరును సంపాదించటమా, ఆస్థానంలో లేక భట్రాజకవిగా మారటమా తేలలేదు.


శ్రీవెంకయ్యనాయుడు గారు, శేషాంధ్ర బిజెపిలో భట్రాజులు లేరనుకుంటారేమోనని చాలశ్రమ పడుతున్నారు. మారి వారికి లభించే పారితోషికం, శ్రీహరిబాబు గారి ఆశలకు, శ్రీమతి పురందేశ్వరి ఆశలకు, తూట్లు పొడుస్తాయా, లేక అందరికీ చోటు దొరుకుతుందా?ఈనాటి పద్యం


నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్‌
కిరిభిత్‌ కరి కరిభిత్‌ కిరికిరిభిత్‌
కరిభిత్‌ గిరిభి త్తురంగ కమనీయంబై !
కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ తార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో
గలగంబారుతు నేగె నీవయనుశంకన్‌ కృష్ణరాయాధిపా !!No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.