Friday, April 25, 2014

212 BJP's craze for Los Angeles వద్దు లెండి సార్ లాస్ ఎంజలిస్, శేషాంధ్ర ప్రజలం మేము భరించలేం.


Bharatiya Janata Party promised to make Visakhapatnam City a Los Angeles. Hence, Citizens of Visakhapatnam! Be ready! శ్రీచంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నారు. శ్రీజగన్ గారు కూడ సీమాంధ్రను స్వర్ణాంధ్రనో, ఏదో చేసేస్తానన్నాడు. ఎవరు కూడ శేషాంధ్ర ప్రజలను తమ మానాన తమని బ్రతకనిస్తామని అనలేదు. ఇపుడు బిజెపి విశాఖను లాస్ ఎంజలిస్ చేసేస్తానంటున్నది.
ఈ మ్యాప్ గూగిల్ ఎర్త్ వారిపై ఆధార పడింది, నాచే మాడిఫై చేయబడింది. అసలు లాస్ ఏంజలిస్ అంటే బిజెపి వారికి తెలియదో, తెలిసినా లాస్ ఏంజలిస్ లాగానే విశాఖ తయారు కావాలనుకుంటున్నారో తెలియదు.

లాస్ ఏంజలిస్ ప్రపంచంలోని నేరగ్రస్త నగరాలలో ఒకటి. జూద గృహాలు, డ్రగ్ మాఫియాలు, వ్యభిచార గృహాలు, తుపాకులను కోదండాల్లాగా ధరించి తిరిగే మాఫియా ముఠాలు, ఓహో ఎన్నో!! హాంగ్ కాంగ్, షాంఘై, మకాలు, న్యూయార్కులతో పోటీ పడుతూ ఉంటుంది. హాలీవుడ్ ఉందన్న పేరేగాని, మనశ్శాంతి కరువయ్యే నగరం.

బిజెపి కొన్ని వాగ్దానాలను చూడండి.

Thrust on infrastructure to build robust economy బలమైన ఆర్ధిక వ్యవస్థను నిర్మించటానికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృధ్ధి చేయటం.
Completion of Krishnapatnam port క్రిష్ణపట్నం రేవును నిర్మించటం.
Development of Dugarajapatnam as a major port దుగ్గరాజపట్నం రేవును మేజర్ పోర్టుగా అభివృధ్ధిచేయటం.
State Petroleum Corporation on the lines of Gujarat body గుజరాత్ లో లాగా రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ ను స్థాపించుట.
Special status period to be increased by five years ప్రత్యేక హోదాను ఇంకోఐదేళ్ళు పొడిగించటం.
Agriculture corpus fund with Rs 1,000 cr వెయ్యి కోట్లతో వ్యవసాయ కార్పస్ ఫండ్.
10% quota in schools, colleges for economically poor upper class students పాఠశాలల్లో కాలేజీల్లో ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి 10% కోటా.
100 acres for film studios in Visakhapatnam విశాఖలో సినిమా స్టూడియోల నిర్మాణానికి 100 ఎకరాలు .

వైబీరావుగాడిద వ్యాఖ్యలు

ప్రజలకు ఏమి కావాలో బిజెపి కి అర్ధంకాలేదనన్నా అనుకోవాలి. లేదా తెలిసి కూడ తెలియనట్లుగా నటిస్తున్నదనుకోవాలి.

ప్రజలకు ఏమి కావాలి. తిండి, గుడ్డ, గౌరవ ప్రదమైన శుభ్రమైన చిన్ని కుటీరం, వృధ్ధాప్యంలో భద్రత.

తిండి ఎలా లభిస్తుంది. ఆహారాన్ని అధికంగా ఉత్పత్తి అన్నా చేయాలి లేదా దిగుమతి చేసుకోవాలి. 1000 కోట్లతో అది అవుతుందా?

మార్క్సిజం తో ఈ తిండి సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?

ప్రజలు ఇళ్ళల్లో అన్నాలు వండుకోవాల్సిన పనే లేకుండా, ఆహారం ప్యాకెట్లను వివిధ రకాలుగా శుచిగా రుచిగా తయారు చేయించి ఇంటి వద్ద ఉచితంగా డెలివరీ ఇవ్వ వచ్చు. ఈపధ్దతిలో ధనవంతులకు చికెన్ బిరియానీలు పేదలకు గంజినీళ్ళు, కొరుక్కోటానికి పచ్చిమిరపకాయ కాకుండా వయా మీడియా గా చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించ వచ్చు. అపుడపుడు చికెన్ కూడ ఇవ్వచ్చు.

మార్క్సిజం తో ఈ బట్టల సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?

ప్రజలందరికీ రెడీమేడ్ దుస్తులను ఉచితంగా ఇవ్వచ్చు. చింకి గుడ్డలు ధరించ వలసిన అవసరమే లేదు. పిచ్చి పిచ్చి బికినీలు, కళ్ళుకూడ కనిపించని ముసుగులు, బురఖాలు ధరించవలసిన పనే లేదు. స్త్రీ పురుషులకు ఆడా మగా తేడా లేకుండా, అందరికీ ప్యాంట్లూ, షర్టులు, చలికాలంలో అవసరానుగుణంగా సూట్లను ఇవ్వచ్చు. వృధ్ధులకు, ప్రత్యేక దేహ సమస్యలు ఉండే వారికి కొన్ని మినహాయింపులను ఇవ్వచ్చు.

మార్క్సిజం తో ఈ నివాస సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?

పుట్టినపుడే శిశువుకి ఇల్లు సిధ్ధంగా ఉంటుంది. మొదట్లో ఇళ్ల కొరత ఉన్నా అతి భారీగా ఇళ్ళను నిర్మించి ఈ కొరతను అధిగమించ వచ్చు. మార్క్సిజంలో ఇళ్ళు వారసత్వంగా సంక్రమించవు కాబట్టి, తగిన సంఖ్యలో ఇళ్ళను నిర్మించి, జనాభాను అదుపులో పెట్టుకోటంద్వారా, ప్రతి శిశువుకి పుట్టగానే ఇల్లు రిజర్వు చేయవచ్చు. దీనికి అనుబంధంగా, వివాహ వ్యవస్థను రద్దుచేసే వాగ్దానాన్ని సిసలైన మార్క్సిజం ఇస్తుంది. స్వల్ప స్థలంలో ఈవిషయాన్ని చర్చించలేం కాని, శిశువుకి తల్లిదండ్రులతో సంబంధంలేకుండా, వారిపై భారంలేకుండా ప్రతిదాన్నీ మార్క్సిజం సమకూర్చటం ఆచరణ సాధ్యమే.

మార్క్సిజం తో వృధ్ధాప్యంలో భద్రత సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?

పుట్టిన దగ్గరనుండి చచ్చిపోయే దాక తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, ఆరోగ్యం, రవాణ, అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంక చింత దేని కోసం? ఇప్పటిలాగా కన్న బిడ్డలు వృధ్ధమాతను , వృధ్ధ తండ్రిని స్మశానం ప్రక్కనో, ముళ్ళపొదలలోనో దించి రావలసిన పెట్టుబడిదారీ ఛండాలం దుస్థితి పట్టకూడదు. కన్న తల్లే కన్నబిడ్డను డబ్బు కోసం అమ్ముకోవలసిన పెట్టుబడిదారి నీచ దైన్యం మన భారతీయులకి రాకూడదు.

మరి హీరో కృష్ణంరాజు గారు విశాఖలో హాలీవుడ్ నెలకొల్పటానికి 100 ఎకరాలు కేటాయించామంటున్నారుగా? విశాఖను స్వర్ణాంధ్ర చేస్తామంటున్నారుగా?
ఈచిత్రం వికీపీడియా వారి దయతో. కృతజ్ఞతలు.

జవాబు: జీవితాలు వేరు. సినిమాలు వేరు. ఈకృష్ణంరాజు మహోదయుడు తాను నటించిన సినిమాలనుండి ప్రజలకు నేర్పటం అలా ఉంచి, తానే ఏదైనా నేర్చుకుని ఉంటే 1957 లో స్వర్గీయ మహబూబ్ ఖాన్ నిర్మించిన మదర్ ఇండియా ను గుర్తుకు తెచ్చుకొని ఉండవలసింది. నర్గీస్, సునీల్ దత్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్ మొ|| వారు నటించిన ఈ హిందీ సినిమా తెలుగులో బంగారుతల్లి అనే పేరుతో వచ్చింది. దీనిలో ఈకృష్ణంరాజుగారు రాజ్ కుమార్ వేసిన వేషమో, రాజేంద్రకుమార్ వేసిన వేషమో వేశాడు. తల్లిగా జమున నటించింది. భూమిని గురించిన తపన ఆ సినిమా.


సినిమాలనుండి ప్రజలు మంచిని నేర్చుకోటం, సినిమాలు ప్రజలకు మంచిని నేర్పటం అనే రోజులు పోయాయి. అందుకని సినిమా వాళ్ళకు ఒక వంద ఎకరాలు ఇచ్చినంత మాత్రాన జగమే మారినదీ మధురముగా ఈవేళా కలలు కోరికలు తీరినవీ అనుకోకూడదు. హైదరాబాదులో శ్రీ అక్కినేని వారికి, శ్రీ కృష్ణకు, శ్రీరామానాయుడు మొ|| వారికి ఇట్టి చవక భూములను ఇచ్చారు. వారు సినిమా పరిశ్రమకు కష్టపడలేదు, కృషిచేయలేదు అని నేనన దలుచుకోలేదు. అందులో కొందరు భూములను దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడ మనం మరువరాదు. ఈప్రక్రియలో బాగు పడేది కొందరు సినిమా పెద్దలే తప్ప ప్రజా సామాన్యం కాదు.

నేడు సినిమాల నిర్మాణాల వల్ల, సినిమా హాళ్ళ నిర్వహణ వల్లా కొంతమందికి ఉపాధి కలుగుతున్నమాట నిజమే అయినా, సమాజం నుండి సినిమా పెద్దలు కొల్లగొడుతున్న సంపదతో పోలిస్తే కలిగిస్తున్న ఉపాధి స్వల్పమే. పైగా ఈ ఉపాధి నాణ్యత, ఆత్మ గౌరవం లేనిది. ఈవిషయం ఋజువు చేసుకోవాలనుకునేవారు, సినీరంగంలోని జూనియర్ ఆర్టిస్టులను, సినిమా హాళ్ళ గేట్ కీపర్లను ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. సినీ పెద్దలు ప్రజలనూ కొల్లగొడుతున్నారు, వర్కర్లనూ కొల్లగొడుతున్నారు. హీరోకు నాలుగు కోట్లు ఫీజు, జూనియర్ ఆర్టిస్టుకు నాలుగువందలు కూలీ అంటే ఇది కొల్లగొట్టటం కాక ఏమిటి. నా అభిప్రాయం తప్పయితే, నిజమేమిటో వ్రాయ వలసినది గా జూనియర్ ఆర్టిస్టులను, గేట్ కీపర్లను ఆహ్వానిస్తున్నాను. క్రింద కామెంట్లు వ్రాయటానికి మీకు పూర్తి స్వేఛ్ఛ ఉంది.

Prof S V Seshagiri Rao గారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రతిపాదన

విశాఖ చెన్నయి ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరికి ఉపయోగం? రస్ అల్ ఖైమా వారి సహాయంతో స్వర్గీయ వైయస్ అభివృధ్ధిచేస్తామన్న వాన్ పిక్ లాంటిదే అని చెప్పనక్కరలేదు. 50 లక్షల ఎకరాలదాకా పేదల భూమిని కాజేసే అవకాశం ఉంది. 15 లక్షల కోట్ల దాకా పెట్టుబడి తింటుంది.

దీనికన్నా బంగాళాఖాతం నీటిని కుడాంకుళం ప్రభుత్వ అణు కర్మాగారం వారు అభివృధ్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో శుధ్ధి చేస్తే , ఆనీటిని సాగుకు, తాగటానికి, విద్యుదుత్పత్తికి వాడుకొని తూర్పునుండి పడమరకి ఎగువకి పంపు చేసుకోవచ్చు. నీటికోసం తెలంగాణతో తగాదాలు ఆడవలసిన అవసరం తప్పుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో సూర్యశక్తి అభివృధ్ధికి ఉన్న వనరులు అనంతం. లెక్కించటం నావల్ల కాదు. బిజెపి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడదు? కృష్ణపట్నం, దుగ్గరాజు పట్నం ఓడ రేవులను అభివృధ్ధిచేసి బొగ్గు దిగుమతి చేసుకోటం, ఖనిజాలను కొల్లగొట్టి ఎగుమతి చేయటం ఇలాంటి ఛండాలపు ఐడియాలేనా ఎప్పుడూ?

ఇళ్ళలో, గ్రామాల్లో, కొండల్లో, గుట్టల్లో, రోడ్ల ప్రక్కనా సోలార్ ప్యానెళ్ళను ఏర్పాటుచేసుకొని అపారంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని దానితో కుటీర పరిశ్రమలను నెలకొల్పుకొని, ఉత్పత్తులను అంతర్జాతీయ కార్గో కాంప్లెక్సుల ద్వారా ఎగుమతి చేసుకోటం, ఇది సమతతో కూడిన అభివృధ్ధికి మార్గం. మార్క్సిజం తిండి, గుడ్డ, ఇల్లు, సమకూరుస్తుంది కాబట్టి ప్రజలు కుటీర పరిశ్రమలద్వారా ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి నిలుపుకోవచ్చు.

ఆకాశానికి నిచ్చెనలు వేసే రాజకీయ పార్టీలను తిప్పి కొట్టండి. నాస్తిక వాదాన్ని, మార్క్సిజాన్ని ప్రోత్సహించండి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.