Monday, February 3, 2014

126 Is Modi Bachelor?

126 Does Modi have a tea-supplier mindset? Did Modi marry? మోడీకి చాయ్ వాలా మైండ్ సెట్ ఉన్నదా? శ్రీమోడీకి వివాహం అయ్యిందా? రాజారాముడికి సీతా పునస్సమాగమం అయ్యేనా?
చర్చనీయాంశాలు: నరేంద్ర మోడి, బిజెపి, రాజకీయాలు, స్వామి వివేకానంద, సమాజం

ఈమధ్య నరేంద్రమోడీ పేరుతో చాయ్ బంకులను తెరచి చాయ్ ని ప్రజలకు ఉచితంగా ఇవ్వటం, చవకధరలకు ఇవ్వటం చేస్తున్నారు. కూటి కొరకు కోటి విద్యలు లాగా వోట్ల కోసం కోటి గారడీలు అనచ్చు. రాహుల్ గాంధీ పిల్లలను సింబాలిక్ గా ఎత్తుకోగానే ఆయనకి పిల్లలపై ఎంత ఘాటు ప్రేమయో అని ఆయా వర్గాల తల్లిదండ్రులు మురిసిపోటం కద్దు. అదే విధంగా మోడీ పేరుతో చాయ్ ఇవ్వగానే చాయ్ వాలాలు మోడీ తమ వాడే అని మురిసిపోతే తరువాత మోసపోయి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది.

చాయ్ వాలాలపై ఎవరికి ప్రేమ?


చాయ్ వాలాలపై సోనియా గాంధీకి గానీ, మోడీకి గానీ, మూలాయం, మాయావతి, లాలూ, మమత, జయలలిత మొ|| ఎవ్వరికి ప్రేమలేదు. శ్రామిక వర్గంపై, బక్కరైతు వర్గంపై ప్రేమ ఉండాలంటే ఉండాల్సింది శ్రామికవర్గ మైండ్ సెట్, బక్కరైతు మైండ్ సెట్. నాయకుడు తన పూర్వాశ్రమంలో చాయ్ వాలా అయి ఉండ నవసరం లేదు. నా బాల్యంలో (వైబీరావు గాడిద బాల్యంలో), పదవ తరగతి చదివే రోజుల్లో నేనూ చాయ్ లూ కాఫీలు సర్వ్ చేశాను. ఇడ్లీ, అట్టు పిండి రుబ్బాను. ఇడ్లీ వండాను, పకోడీలు, బజ్జీలు చేశాను. గ్లాసులు కడిగాను. పనులన్నీ అయినాకే బడికి వెళ్ళేవాడిని. స్కూలునుండి తిరిగి వచ్చాక రాత్రి ఎనిమిది వరకు అదే రొటీన్ ఉండేది. చాయ్ సర్వ్ చేసేటపుడు స్కూల్ పాఠాలు, హోమ్ వర్క్ గుర్తుకు వచ్చేవి. స్కూల్లో ఉన్నప్పుడు శనగపప్పు రుబ్బటం, పకోడీలు గుర్తుకు వచ్చేవి. రాత్రి నిద్రలో కూడ ఈఆలాపనలే మార్చి మార్చి కలలుగా, కలవరింతలుగా వచ్చేవి. అయినా నాకు చాయ్ వాలా మైండ్ సెట్ ఉందో లేదో నేను చెప్పలేను. ఈఅనుభవాలు, అనుభూతులు, నాఒక్కడి సొత్తుగా స్వంతడబ్బాకు చెప్పుకోటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో, అఖిలభారత్ లో, లక్షల-లేక-కోట్ల బాలలకు ఇటువంటి అనుభూతులే రోజు ఉంటాయి. కొన్నైనా జీవితకాలం జ్ఞాపకం ఉంటాయి.

తండ్రి కమ్మరి. పిల్లవాడు తండ్రికి కొలిమి ఊదటంలో, కాల్చిన గొడ్డళ్ళను, కొడవళ్ళను, సుత్తులతో కొట్టటంలో సహాయం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు ఇలాంటి సహాయాన్ని ఆడపిల్లలు కూడ చేస్తూ ఉంటారు. వారికీ రకరకాలు అనుభూతులూ, ఇమోషన్స్ ఉంటాయి.

మైండ్ సెట్ ఎందుకు మారవచ్చు


కొందరు వ్యక్తివికాస, సామాజిక నిపుణుల ప్రకారం ఎక్కువ మంది వ్యక్తులయొక్క వ్యక్తిత్వం ప్రతి ఆరు సంవత్సరాల కొకసారి మారుతూ ఉంటుంది. అంటే, మనం ఆరు సంవత్సరాల క్రితం కలిసిన మనిషిని ఈరోజు చూస్తే అతడు ఆనాటి ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించవచ్చు.

మైండ్ సెట్ మారటానికి కొంతమేరకు వృత్తిలో వచ్చే మార్పులు దోహదం చేస్తూ ఉంటాయి. వృత్తిమారినపుడు మైండ్ సెట్ మార్చుకోటానికి ఇష్టపడకుండా కొనసాగటం వాంఛనీయమా అనే ప్రశ్న చాలా కీలకమైనది. క్రొత్త వృత్తితో పాటు గతంలో కన్నా మెరుగైన మైండ్ సెట్ సంపాదించుకో గలిగితే సంతోషమే. హాయిగా మారచ్చు. గతంలో కన్నానీచమైన మైండ్ సెట్ ను అంటించుకుంటే
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గం
గా కూలంకష! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్
వివేకభ్రష్ఠ సంపాతాలు జరుగుతాయి. ఇక్కడ ఉపమాలంకారం ఏమిటంటే, స్వఛ్ఛమైన జలాలతో హిమాలయాలనుండి జారిన గంగానది (గంగా కూలంకష) బెంగాల్ లోని నవద్వీప్ వద్ద సముద్రంలో కలసే సమయానికి సకల కల్మషాలను చేర్చుకుని పాతాళంలోకి వెళ్తుంది.

అమాయకుడైన చాయ్ వాలా ఒక వృత్తినుండి మరొక వృత్తిలోకి మారుకుంటూ చివరికి రాజకీయవేత్తగా మారి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి అభ్యర్ధిగా అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారటానికి మధ్యలో ఎన్ని వృత్తులు మారాలి? ఎన్ని మైండ్ సెట్ లను అంటించుకోవాలి? ఇక్కడ మనం రెండు కాన్ సెప్ట్ లను విజుయలైజ్ చేయవచ్చు.

1. మెటమార్ఫసిస్: గొంగళిపురుగు శీతాకోక చిలుకగా మారటం. చాయ్ వాలా కన్నా రాజకీయనేత సుందరుడు అనుకుంటే ఇది వర్తిస్తుంది.

2. రివర్స్ మెటమార్ఫసిస్: శీతాకోకచిలుక గొంగళిపురుగుగా మారటం. చాయ్ వాలా మైండ్ సెట్ యే మెరుగైనది అనుకుంటే చాయ్ వాలా- రాజకీయనేత స్థాయికి పతనం కావటం.

౩. ఇవల్యూషన్: పరిణామక్రమం: చాయ్ వాలా వేరు. రాజకీయ వాది వేరు. ఇవి రెండు భిన్న ప్రకృతులు. స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ దీ ఫిట్టెస్ట్ సూత్రం ప్రకారం చాయ్ వాలాగా సర్వైవల్ ఎబామినబుల్ (దయనీయమైనది) కాబట్టి వెర్రి బాగుల జనం అంతా భయపడే రాజకీయవాదిలాగ రూపొందటం.

ప్రచురించబడిన నమో గారి జీవిత చరిత్రల ప్రకారం ఆరేళ్ళ వయసులో, వారి కుటుంబం నడుపుతున్న టీస్టాల్ లో శ్రీవారు చాయ్ వాలాగా పని చేశారు.

తరువాత ఏమి చేశారు?

శ్రీవారికి ఎం.ఏ. పాలిటిక్స్ పట్టా ఉంది. ఏ ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగాలూ చేసిన వివరాలు లేవు. శ్రీవారు ఆరుగురు అన్నదమ్ముల మధ్య మూడవవారు. వారి కుటుంబం కిరాణా షాపును, గుజరాత్ ఆర్ టీ సీ బస్ స్టాండ్ లో టీ స్టాల్ నడిపేదిట. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది లాగా, కుటుంబ కిరాణా షాపు నిర్వహణలో శ్రీవారి పాత్ర ఎట్టిది?

ఈ నలుగురు సోదరులు (సోమా మోడీ, అమృత్ మోడీ, ప్రహ్లాద్ మోడీ, పంకజా మోడీ, సోదరి వాసంతి ) నడిపిన టీస్టాల్, కిరాణాలతో వచ్చిన తన నాలుగవ వంతు వాటా తోనే శ్రీవారు సుమారు రూ. 32 లక్షల బ్యాంకు డిపాజిట్ లు, ఎన్ ఎస్ సీ లు పోగేసు కో గలిగారా? గాంధీనగర్ లో తన వాటాకే కొనుగోలు విలువ రూ. 130488.00, అభివృధ్ధిఖర్చు Development Cost రూ. 247208.00 పెట్టుబడి పెట్టగలిగారా? ఆ గాంధీనగర్ ఆస్తి నేటి విలువ రూ. ఒక కోటి అని శ్రీవారే ప్రకటించుకున్నారు. కిరాణాలు, టీస్టాల్స్ లో అన్ని లాభాలు వస్తాయా?

ఆనలుగురు సోదరుల, ఆసోదరిగారి ఆస్తుల వివరాలు ప్రజలకు తెలియదు. శ్రీవారికి విదేశాల్లో ఏమైనా ఖాతాలు ఉన్నాయో ప్రజలకు తెలియదు.

ఒకటి మటుకు నిజం. చాయ్ వాలా మైండ్ సెట్ తో కోటి రూపాయల ఆస్తి, రూ. 35 లక్షల బ్యాంకు డిపాజిట్లు సంపాదించటం అసాథ్యం. ఆయన, ఆయన సోదరుల మైండ్ సెట్ భూస్వామి దన్నా అవ్వాలి లేక వాణిజ్యవేత్తలదన్నా అవ్వాలి.

నరేంద్ర మోడీ పెళ్ళి, పిల్లలు?


నరేంద్రమోడీకి పెళ్ళి కాలేదని చాలామంది నమ్మకం. కానీ ఓపెన్ ది మాగజైన్.కామ్ అనే వెబ్ సైట్ వారి ప్రకారం మోడీకి వివాహం అయ్యింది. భార్య పేరు జశోదాబెన్ (యశోదాబెన్ అయి ఉండచ్చు). ఈపత్రికవారు ఆమె ఫోటోను కూడ ప్రచురించారు. ఆమె ఫొటో ఓపెన్ ది మాగజైన్.కామ్ వారి దయ.

ప్రచురణ తేదీ 11-4-2009. ఆమె ఏడవతరగతి వరకు మాత్రమే చదువుకోటంతో మోడీ ఆమెను పుట్టింటిలో దించి వదలి వేసినట్లు కనిపిస్తుంది. ఆమె 1972లో ఎస్.ఎస్.సీ. పూర్తిచేసి, ప్రైమరీటీచర్ కోర్స్ ట్రెయినింగ్ పొంది, గుజరాత్ ప్రభుత్వంలో టీచర్ గా పనిచేసింది. అక్టోబర్ 2009 లో రిటైర్ అవబోతున్నట్లుగా ఈ పత్రిక వ్రాసింది. ఇప్పుడు 2014 కాబట్టి ఆమె రిటైర్ అయి ఉండాలి. http://www.openthemagazine.com/article/nation/i-am-narendra-modi-s-wife. ప్రతి ఒక్కరు చదివి తీరవలసిన రిపోర్ట్ ఇది.

రామాయణంలో సీతకు లాగానే, జశోదాబెన్ గారికి కూడ, ఏనాటికైనా తాను తన భర్తను చేరుకోకపోతానా అని నమ్మకమట. ఆమె అప్పుడప్పుడు జ్యోతిష్కులను సంప్రదించటం, ఆమెకు ఏనాటికైనా పునస్సమాగమం జరుగుతందని వారు ఆశాభావం కల్పించే వారట. కొన్ని సార్లు జ్యోతిష్కుల వలన మనకు లాభమే. నిరాశ తీవ్రమై మనం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నప్పుడు వారు ఆశల చిరుదీపాన్ని వెలిగించి మనం ఆపని చేయకుండా కాపాడుతుంటారు.

లవకుశ సినిమాను గుర్తుకు తెచ్చుకోండి. సీతకు ఆశల చిరుదీపాన్ని వెలిగించింది ఎవరు? 'సందేహించకుమమ్మా రఘురాముప్రేమను' అని పాడిన నాగయ్య.
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడిన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మిన్నే విరిగిపడిన వ్రతభంగము కానీడమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా

రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము, నా కావ్యమ్మే వృధయగునమ్మా
నాదు జపము తపము, నా కావ్యమ్మే వృధయగునమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా


ఓపెన్ ది మాగజైన్.కామ్ వారి లేడీ విలేఖరి ఇంటర్వ్యూ ప్రకారం, ఆమెను (జశోదాబెన్) దర్శించటానికి బయట వారు వచ్చిన సమాచారం చేరవలసిన వారికి చేరి పోయింది. ఆతరువాత, జశోదాబెన్ ఆలేడీ విలేఖరికి ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెనుకాడి ఆటోలో వెళ్ళిపోయింది. ఆ విలేఖరి వ్రాసిన రిపోర్ట్ లోంచి కొన్ని మచ్చు తునకలు క్రింద ఇస్తున్నాను.
She left the room meekly, only to come back soon. She said,“I will not say anything against my husband. He is very powerful. This job is all I have to survive. I am afraid of the consequences.” She then went back to her classroom.

Meanwhile, the principal had made a call from his mobile phone to inform somebody that Jashodaben had visitors. He then went to meet her in her classroom. After that, she became a dif­ferent person. She smiled no more, her excite­ment was gone and she looked nervous. She kept wringing her hands. When I approached her again, she screamed, asking to be left alone. But as she walked away, she gestured to suggest that she would talk later. ... ... ...

...Hiding her face in her hands, she went to her brother’s house in her maternal village in Brahamanwada, about 20 km away. A few min­utes later, a young man who identified himself as Prakashbhai, a reporter from Ram Setu (a two-page government-run newspaper printed with inconsistent frequency), approached me and asked me to leave the village. By then a sizeable crowd had gathered around us. ...

Though Jashodaben earns a monthly salary of Rs 10,000, she lives in a one-room tenement in the Panchalvas area in the village, and pays a rent of Rs 150 every month. The 100 sq ft room has a tin roof, no toilets, and not even a bathroom. The tap is located outside the house. According to the vil­lagers, Jashodaben wakes up very early and takes a bath outside the house. ... ... ...

Despite the fact that she can afford a better life, she has chosen to stay in a somewhat im­poverished village, in a sympathetic and help­ful neighbourhood. Here, her story is known to all. Even the children of her school refer to her as ‘Narendrabhai Modi’s wife’.

శ్రీనరేంద్రమోడీ జశోదాబెన్ తన భార్య అని అంగీకరిస్తున్నారా , అంగీకరించటం లేదా?శ్రీనరేంద్ర మోడీ గారు అవుననరు, కాదనరు. మౌనం, అర్ధాంగీకారం అనుకోవాలి.
...After the post-Godhra Gujarat riots, Modi’s po­litical foes in Banaskantha district discovered her in this dusty village. Since then, Jashodaben has lived her life under intense scrutiny. Few among the 2,500 villagers, predominantly Muslim, dis­believe her story. Even Modi has neither con­firmed nor denied her muted claim. At the time of going to press, a faxed request for a comment was not returned by Modi’s office. ...


నరేంద్రమోడీగారి ఆదర్శపురుషుడు స్వామి వివేకానంద గారు క్రిస్టినా గ్రీన్ స్టైడల్ అనే అమెరికన్-జర్మన్ యువతికి తాను సంతకం చేసిన ఒక డాక్యుమెంటును పంపి, ఆమెను సంతకం చేయమని కోరటం, ఆమెను మిస్ గా సైన్ చేయమని కోరటం, పాఠకులకు గుర్తు ఉండే ఉంటుంది.
దీనికి సంబంధించిన నావివేకానందవైబి.బ్లాగ్ స్పాట్.కామ్ చదువ దలచినవారికి లింకు:
http://vivekanandayb.blogspot.in/2014/01/274-male-bondages.html

శ్రీ నరేంద్రమోడీగారు తన మారిటల్ స్టేటస్ ను వివిధ ప్రభుత్వ డాక్యుమెంట్లలో , ప్రభుత్వ ఫారాలలో ఏమని ప్రకటిస్తున్నారు? అవివాహితుడననా? మారీడ్ బట్ పెండింగ్ సెపరేషన్ అనా, లవకుశలో రాజారాముడిలాగా వియోగ చింతాక్రాంతుడననా?

జెశోదాబెన్ మాట్లాడిన వీడియోలు2007లోనే అప్ లోడ్ చేయబడిన ఆరు నిమిషాల వీడియో ఒకటి ఉంది. దాని లింక్ ఇదిగో: http://www.youtube.com/watch?v=tHtbnK3i_Dkhttp://www.youtube.com/watch?v=tHtbnK3i_Dk
దీనికి ఈనాటికి 378 వ్యాఖ్యలు వచ్చాయి. వీటిని విశ్లేషిస్తే మనకి భారతీయుల (అందరూ కాదు, బహుశా యూ ట్యూబ్ చూసే వాళ్ళ) స్వభావాలు అర్ధం చేసుకో వచ్చు. అయితే ఎక్కువమంది మోడీనే సమర్ధించారు. నరేంద్రమోడీకి 18ఏళ్ళ వయసులో వివాహం జరిగింది కాబట్టి అది ఆయనకు తెలిసి తెలియని వయసు కాబట్టి ఆయన తప్పులేదని పలువురి భావన.
ఇంకో వీడియోకి లింకు ఇక్కడ ఇస్తున్నాను. ఇది 2012ది. దీనిని నమ్మాలా వద్దా అనే విషయాన్ని నేను చెప్పలేను.
http://www.youtube.com/watch?v=7rnXUaOtE9o
ఇక్కడే పాఠకులవి ఈనాటికి 57 వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కొందరు నరేంద్రమోడీని సమర్ధించగా, కొందరు కాంగ్రెస్ కుట్ర అని తోసి పారేశారు.

వైబీరావు గాడిద వ్యాఖ్య


మోడీ గారు అవుననటమో, కాదనటమో చేస్తే బాగుంటుంది. ఎందుకు మౌనం? ఆయనకు వివాహం అయ్యిందా అనే విషయంలో భారతీయులకు సంబంధం లేదని వాదించేవారు ఒక విషయం దృష్టిలో ఉంచుకోటం అవసరం.

పెళ్ళయిన తరువాత మూడు నాలుగు సంవత్సరాలు భార్యా భర్తలు కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. సగం పెట్టి మేనత్త అంటే ఎలా? విడిపోవాల్సి వస్తే కారణాలను చూపి కోర్టు ద్వారా విడిపోవచ్చు.
మోడీగారు ప్రపంచాన్ని తాను బ్రహ్మచారినని మభ్యపెట్తున్నారు. అలా మభ్యపెట్టే బదులు, కారణాంతరాల వలన మేము విడిగా ఉండవలసిన అవసరం వచ్చింది. ఆసమస్యను మేము పరిష్కరించుకుంటాము అని చెప్పచ్చు. నేను ఆమెకు సమయం కేటాయించలేను అని చెప్పచ్చు.

ఉపసంహారం


మైండ్ సెట్లగురించి వ్రాయవలసినది ఇంకా చాలా ఉన్నది. దురదృష్టవశాత్తు లవకుశ లోకి వెళ్ళాల్సి వచ్చింది. జశోదాబెన్ కి ఈ వృధ్ధాప్యంలో నయినా కించిత్తైనా పునస్సమాగమ భాగ్యం లభిస్తుందా?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.