Thursday, January 2, 2014

108

108 There is a need to revise the melakarta and ThATh system of Indian music. భారతీయ సంగీతం యొక్క మేళకర్త మరియు ఠాఠ్ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది.
చర్చనీయాంశాలు: Indian Music, Carnatic Music, శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం, వెంకటమఖి

కర్నాటక సంగీతంలో ప్రస్తుతం ఉన్న 72 మేళకర్తరాగాల పూర్వాంగ చక్ర వర్గీకరణ

72 మేళకర్తలను 12 చక్రాలుగా విభజించారు. ప్రతి చక్రానికి 6. శుధ్ధమధ్యమ చక్రాలు 6. ప్రతిమధ్యమ చక్రాలు 6. పూర్వాంగం అంటే రాగం యొక్క మొదటి భాగం, అనగా స,రి,గ,మ, స్వరాల ఫస్ట్ హాఫ్. ఉత్తరాంగం అంటే రాగం యొక్క రెండవ భాగం. పదనిస' లతో కూడినది.

షడ్జమంగానీ, పంచమంగానీ లోపిస్తే ఆరాగాన్ని మేళకర్తగా గణించకూడదని ఒక సంప్రదాయం. అలాగే 2 రిషభాలు & గాంధారం , లేక ఒకరిషభం 2 గాంధారాలు, లేక 2రిషభాలు 2 గాంధారాలు ఉన్నవాటిని మేళకర్తలుగా అంగీకరించటం లేదు. వీటన్నిటినీ మేళకర్తలుగా మనం అంగీకరించ కలిగితే, మన సంగీతం ఇంకా సమగ్రం, పరిపుష్టం అవుతుందేమో.
రాగాల పేర్లకు, స్వరాల అమరికకు కొంతైనా సంబంధం ఏర్పరచి, రాగాలను పునర్ నామకరణం చేసుకో కలిగితే, కర్నాటక సంగీతాన్ని కొత్తవారు విని ఆనందింటం, నేర్చుకోటం తేలికవుతుంది.

మేళకర్తల పూర్వాంగ వర్గీకరణ.

శుధ్ధ మధ్యమ చక్రాలు1.ఇందు చక్రం :- స్వరాలు: శుధ్ధరిషభం, శుధ్ధగాంధారం. చతుశృతి రిషభాన్నే శుధ్ధగాంధారం గా భావించి పాడటం, వాయించటం జరుగుతున్నది. కాబట్టి శురి, చరి. రాగాలు: కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపిణి.

2. నేత్ర చక్రం :- స్వరాలు: శురి, సాగా. రాగాలు: సేనాపతి, తోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి.

౩. అగ్ని చక్రం :- స్వరాలు: శురి, అంగా. రాగాలు: గాయకప్రియ, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యాకాంతం, హాటకాంబరి.

4. వేదచక్రం :- స్వరాలు: చరి, సాగా. రాగాలు: ఝంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి, వరుణప్రియ.

5. బాణచక్రం :- స్వరాలు: చరి, అంగా. రాగాలు: మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజీ, ధీరశంకరాభరణం, నాగానందిని.

6. ఋతుచక్రం :- స్వరాలు: షట్ శృతి రిషభం, అంతర గాంధారం. సాధారణ గాంధారాన్నే షట్ శృతి రిషభంగా భావిస్తు పాడటం, వాయించటం, జరుగుతుంది. రాగాలు: యాగప్రియ, రాగవర్ధని, గాంగేయభూషణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట.

ప్రతిమధ్యమచక్రాలు

7. ఋషిచక్రం :- స్వరాలు:- శుధ్ధరిషభం, శుధ్ధగాంధారం. చతుశృతి రిషభాన్నే శుధ్ధగాంధారం గా భావించి పాడటం, వాయించటం జరుగుతున్నది. కాబట్టి శురి, చరి, ప్రమ. రాగాలు: సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ.

8. వసుచక్రం :- స్వరాలు: శురి, సాగా, ప్రమ. రాగాలు: గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్విధమార్గిణి, సువర్ణాంగి, దివ్యమణి.

9. బ్రహ్మచక్రం :- స్వరాలు: శురి, అంగా, ప్రమ. రాగాలు: ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధని (పంతువరాళి), రామప్రియ, గమనశ్రమ, విశ్వాంబరి.

10. దేశ చక్రం :- స్వరాలు: చరి, సాగా, ప్రమ. రాగాలు: శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమం, హేమవతి, ధర్మావతి, నీతిమతి.

11. రుద్రచక్రం :- స్వరాలు: చరి, అంగా, ప్రమ. రాగాలు: కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకల్యాణి, చిత్రాంబరి.

12. ఆదిత్యచక్రం :- స్వరాలు: షట్ శృతి రిషభం, అంతర గాంధారం. సాధారణ గాంధారాన్నే షట్ శృతి రిషభంగా భావిస్తు పాడటం, వాయించటం, జరుగుతుంది., ప్రమ. రాగాలు:- సుచరితం, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధని, నాసికాభూషణి,కోసలం, రసికప్రియ.
ఉత్తరాంగ వర్గీకరణ
72 మేళకర్తల చక్రం సృష్టి కర్త శ్రీ వేంకటమఖి, ఈ 72 మేళకర్తలను ఉత్తరాంగం కోణంనుండి వర్గీకరించనట్లు కనపడదు. లేదా, ఆయన వర్గీకరించినా, కాలగమనంలో వాడకం ఎక్కడో ఆగిపోయి ఉంటుంది.

మేళకర్త రాగాల ఉత్తరాంగ వర్గీకరణ


శ్రీవేంకటమఖి తన చక్రాలలో పదనిస స్వరాలను ఒక ప్యాటర్న్ ప్రకారం వాడారు. వీటిని ఆరు శంఖాలు గా వర్గీకరించవచ్చు. పూర్వాంగాలను చక్రాలుగా వర్గీకరించినపుడు, ఉత్తరాంగాలను శంఖాలుగా వర్గీకరించవచ్చు, అని శంఖాలుగా పేరు పెట్టవచ్చు. ఈవర్గీకరణ వైబీరావు గాడిద చేస్తున్నది. లోపాలుంటే నావే.
1. నంద శంఖం :- ఉత్తరాంగ స్వరాలు: ప, శుధ్ధధైవతం, శుధ్ధనిషాదం, తార షడ్జం. చతుశృతి ధైవతాన్నే శుధ్ధనిషాదంగా భావించ పాడటం జరుగుతుంది. వాద్యకారులు వాయించేది చతుశృతి ధైవతాన్నే, కానీ : 'నీ' అని పిలవాలి. కాబట్టి, ప, శుద, చద, స''.
రాగాలు: కనకాంగి, సేనాపతి, గాయకప్రియ, ఝంకారధ్వని, మారరంజని, యాగప్రియ, సాలగం, గవాంబోధి, ధవళాంబరి, శ్యామలాంగి, కాంతామణి, సుచరితం.

2. రత్నశంఖం :- స్వరాలు: శుధై, కైని. రాగాలు: రత్నాంగి, తోడి, వకుళాభరణం, నటభైరవి, చారుకేశి, రాగవర్ధని, జలార్ణవం, భవప్రియ, నామనారాయణి, షణ్ముఖప్రియ, రిషభప్రియ, జ్యోతిస్వరూపిణి.

౩. మూర్తశంఖం :- స్వరాలు: శుధై, కాని. రాగాలు: గానమూర్తి, ధేనుక, మాయామాళవ గౌళ, కీరవాణి, సరసాంగి, గాంగేయభూషణి, ఝాలవరాళి, శుభపంతువరాళి, కామవర్ధని (పంతువరాళి), సింహేంద్రమధ్యమం, లతాంగి, ధాతువర్ధని.

4. పతశంఖం లేక పతి శంఖం :- స్వరాలు: చధై, కైని. రాగాలు: వనస్పతి, నాటకప్రియ, చక్రవాకం, ఖరహరప్రియ, హరికాంభోజి, వాగధీశ్వరి, నవనీతం, షడ్విధమార్గిణి, రామప్రియ, హేమవతి, నాసికాభూషణి. 5. వత శంఖం లేక వతి శంఖం :- స్వరాలు: చధై, కాని. రాగాలు: మానవతి, కోకిలప్రియ, సూర్యాకాంతం, గౌరీమనోహరి, ధీరశంకరాభరణం, శూలిని, పావని, సువర్ణాంగి, గమనశ్రమ, ధర్మావతి, మేచకల్యాణి, కోసలం.

6. రూపశంఖం లేక రూపిణి శంఖం :- స్వరాలు: కైశికి నిషాదాన్ని షటృతి ధైవతం అనే పేరుతో పాడటం, వాయించటం జరుగుతుంది. కాబట్టి కైని, కాని. రాగాలు: తానరూపిణి, రూపవతి, హాటకాంబరి, వరుణప్రియ, నాగానందిని, చలనాట, రఘుప్రియ, దివ్యమణి, విశ్వాంబరి, నీతిమతి, చిత్రాంబరి, రసికప్రియ.

తాత్కాలిక ముగింపు :- ప్రస్తుతం మనకు రాగం పేరు తెలిసినా, వినికిడి జ్ఞానం లేకపోతే, ఆరాగ లక్షణాలు తెలుసుకోవాలంటే, చాలా పుస్తకాలు వెతుక్కోవాల్సిందే. వినికిడి జ్ఞానం బాగా ఉన్నవారు మేళకర్తరాగాలను, జనంలో నలుగుతున్న రాగాలను బాగా గుర్తు పట్తారు. కానీ, అరుదైన రాగాల విషయంలో, కొంత ఆలస్యం కావచ్చు. మేళకర్తేతర రాగాలకు కూడ పేరులో ఏదైనాప్రణాలిక ఇమిడి ఉంటే, రాగం పేరును బట్టి స్వరాలను ఊహించటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం కొన్ని రాగాల పేర్లవెనుక, చరిత్ర, భూగోళం వంటివి ఉన్నా ఎక్కువరాగాలకు ఆపేర్లు ఎందుకు పెట్టారో వివరించుకోటం కష్టంగానే ఉన్నది.

1 comment:

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.