చర్చనీయాంశాలు: రాష్ట్ర దుర్గతి, భూకబ్జాలు, మీడియా, లోకాయుక్త
గతంలో ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తెరాస నేత శ్రీకెటీఆర్ పై భూవివాదాల్లో తలదూర్చటం విషయంలో, చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆఆరోపణలపై శ్రీకెటీఆర్ పరువు నష్టం దావా వేస్తానన్నారు. కానీ వేయలేదు.
ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. చర్యతీసుకోవాల్సిన బాధ్యత లేదా? లోకాయుక్తగారు కూడ పట్టించుకోలేదు.
విశ్రాంత డీజీపీ శ్రీదినేష్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన తమ్ముడి భూ వ్వవహారాల విషయంలో వత్తిడులు తెచ్చారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాటి విషయంలో శ్రీకిరణ్ చర్యతీసుకుంటారని ఎవరూ ఆశించలేరు. తన తమ్ముడి అవినీతి విషయంలో తానే ఏమి చర్యలు తీసుకుంటాడు?
ఆంధ్రప్రదేశ్ కు ఒక లోకాయుక్త ఉన్నది. జస్టిస్ శ్రీ బీ. సుదర్శన్ రెడ్డి గారు లోకాయుక్తగా ఉన్నారుట. అధికారిక వెబ్ సైట్: క్లిక్ టు http://lokayukta.ap.nic.in/. ఇక్కడ నాకు ప్రస్తుత లోకాయుక్త గారి ఫొటో గాని, పేరు గానీ కనిపించలేదు. 2011వార్షిక నివేదిక ఉన్నది. 2012 వార్షిక నివేదిక లేదు. మరి 2012లో పనిచేయలేదో ఏమో.

ముఖ్యమంత్రిపై విచారణ జరపటానికి లోకాయుక్త గారికి అధికారం లేకపోతే లేకపోవచ్చు. కానీ ఆయన తమ్ముడి భూ సెటిల్ మెంట్లపై విచారణ జరపటానికి శ్రీవారికి అధికారం ఉన్నదో లేదో తెలియదు.
సు మోటు (తమంత తాము) విచారణ జరపటానికి లోకాయుక్త గారు జంకుతారా అంటే అదేమీ లేదు. ఫిబ్రవరి 2013లో 20.2.2013 ఆంధ్ర జ్యోతి భిక్షుకులపై ప్రచురించిన వార్తపై సు మోటూ విచారణ చేపట్టినట్లు వార్తలు ఉన్నాయి.
ఈవార్త చదువదలచిన వారికి లింకు: క్లిక్ టు న్యూస్ వాలా.కామ్.
మరి భిక్షుకులపై విచారణ చేపట్టగలిగినపుడు, ముఖ్యమంత్రి తమ్ముడి భూ సెటిల్ మెంట్లపై విచారణ జరపటానికి శ్రీవారికి ఏమి అడ్డంకులున్నాయో మనకు తెలియదు.
2.1.2013 అంధ్రజ్యోతి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి బావమరిది , కడప మాజీ మేయర్ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి పై మొదటి పేజీ పతాక శీర్షికలో సంచలనాత్మకమైన ఆరోపణలు చేసింది.
ఈ వార్తను చదువదలచిన వారికి లింకు.
క్లిక్ టు ఆంధ్రజ్యోతీ.కామ్.'
దీనిపైన అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ, లోకాయుక్తగానీ సూ మౌటూగా ఏమైనా స్పందిస్తారా? లోకాయుక్త గారికి క్రీడలపై మక్కువ ఎక్కువట. మరి భూమ్మరదిగురించి పట్టించుకోటానికి సమయం చిక్కునో చిక్కదో. శ్రీవారికి శ్రీశ్రీ కవిత్వం అంటే అభిరుచిట. మరి జగన్నాథ రథచక్రాలను కదిలిస్తారో, కదిలించరో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.