Sunday, December 8, 2013

90 Even great intellectuals can faulter; ప్రమాదో ధీమతాపి - ఎంతటి ధీమంతులైనా పొరపాటు పడవచ్చు.

నహుషుడు ధర్మరాజుకి చెప్పాడనో, ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పాడనో, భృగువు భరద్వాజుడికి చెప్పాడవో, సాక్షాత్తూ భగవంతుడే అర్జునుడికి చెప్పాడనో, తిలక్ గారు చెప్పారనో, సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు చెప్పారనో,రాజాగోపాలాచారి గారు చెప్పారనో, వివేకానందాగారు చెప్పారనో, సినిమాల్లో ఎన్ టీ ఆర్ గారు చెప్పారనో, ఘంటసాలగారు పాడారనో, అన్యాయాలన్నీ న్యాయాలయి పోవు. అలాగని, పెద్దలను కించపరచటం కూడ న్యాయంకాదు.
Above paragraph, approx. in English: Injustices will not become virtuosities, simply because something is said by Nahusha to YudhishThira, or Dharmavyadha to Kausika, or by Sage Bhrigu to Bharadwaja, or the Supreme GodHead himself to Arjuna, or Lokmanya Tilak (Great Freedom Fighter of India), or Dr. Sarvepalli Radhakrishnan (Second President of India), or Chakravartula Rajagopalachari (First Governor General of Independent India), or Swami Vivekananda, or Late N.T. Rama Rao in mythological films, or sung by Late Ghantasala. At the same time, it will not be correct to underestimate elders, especially freedom fighters.

మన రెండు ఇతిహాసాలు భారతం, రామాయణం. పురాణ గ్రంధం భాగవతం. ఈ మూడు గ్రంధాల మధ్య పూలదండలో దారం లా ఒక సమాన ధర్మానికి పెద్ద పీట వేస్తాయి. అదే కులవ్యవస్థ. మన గుడి మరియు టీవీ ప్రబోధకులు, స్వామీజీలు, అవసరాన్ని బట్టి వాయించేది లేదా దాటేసేది, అన్యాయ పూరితమైన కుల వ్యవస్థ. గీతలో పరమాత్మ చేత నేనే సృష్టించాను అని మరీమరీ చెప్పించిన చాతుర్ వర్ణ్య వ్యవస్థ. ఈవ్యవస్థ కేవలం నాలుగు విభాగాలు చేసి ఊరుకున్నది కాదు. నాలుగు కులాల వారి శరీరాలకు రంగులను రుద్దిన విషయాన్ని ఇది వరకే సాక్ష్యాలతో వివరించాను. వారి మధ్యలో మరీ అన్యాయంగా విథులను నిర్దేశించారు. గీత, మోక్ష సన్యాస యోగంలో, 42,43, 44 శ్లోకాలను చూడండి.
శమో దమస్ తపః శౌచం క్షాంతిర్ ఆర్జవమ్ ఏవ చ ☀ జ్ఞానం విజ్ఞానమ్ ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమ్ 1842.

శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాంతః శుభ్రత, ధర్మతత్పరత్, వివేకం, పాండిత్యం, దేవుడియందు నమ్మకం, ఇవి బ్రాహ్మణులకు స్వభావసిధ్ధము.

శౌర్యం తేజో ధృతిర్ దాక్ష్యం యుధ్ధేచాపి అపలాయనమ్ ☀ దానమ్ ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మస్వభావజమ్ 1843.

పరాక్రమం, తేజస్సు, ధైర్యం, నేర్పరితనం, యుధ్ధంలో పారిపోకుండుట, దానం, తాము యజమానులమనే భావం (రాజకీయం, నాయకత్వం), క్షత్రియులకు స్వభావసిధ్ధము.

కృషిగోరక్షా వాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ ☀ పరిచర్యాత్మకం కర్మ శూద్ర స్యాపిస్వభావజమ్ 1844.

వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం, వైశ్యులకు సహజసిధ్ధము.
పరిచర్యలు చేయటం, శూద్రులకు స్వభావ సిధ్ధం.


మహాభాగవతం ఒక్క అడుగు ముందుకేసి, సేవ చేయటానికి యజమానులు దొరకని వారు బుట్టలల్లుకోవాలని చెప్పింది. కావలసిన వారు సంస్కృత వ్యాసభాగవతం చూసుకోవచ్చు. పోతన్నగారి పద్యం తరువాత ఇంకో పోస్టులో వ్రాస్తాను.

శతాబ్దాల కాల గమనం , విదేశీ దాడులు, ఆర్ధికరంగాభివృధ్ధి -- కులాలు, వృత్తులు జన్మకులాల మధ్య సంబంధాల్లో కొంత మార్పుని తెచ్చాయి. కానీ రావలసినంత రాలేదు.

జన్మ క్షత్రియులు అంతరించటమో, రాజేతరమైన వృత్తులను చేపట్టటం జరిగాక, వారి స్థానాన్ని భూయజమానులైన శూద్రులలో కొందరు భర్తీచేసి నేడు నాయకులుగా చలామణీ అవుతున్నారు. నాయకత్వం,అధికారం, క్షాత్రం కొరకు అన్ని కులాలవారూ ఆవేశ పడుతూ ఉండగా అవకాశాలు కొందరికే దక్కుతున్నాయి. అత్యధిక సంఖ్యాకులైన శూద్రులు, పలువురు బ్రాహ్మణులు, వైశ్యులు, నేడు సేవా వృత్తిలోకి ప్రవేశించారు. జన్మచేత ఆపాదించబడిన విభజన రేఖ పూర్తిగా చెరిగి పోయి ఎవరు ఏవృత్తినైనా చేపట్టవచ్చు అనే స్వేఛ్చ 100% రావాలి కానే రాలేదు.

దీనికి తోడు పెట్టుబడిదారీ విధానం, వారసత్వజనిత ఆదాయ సంపద పంపిణీ వ్యత్యాసాలు, వ్యక్తుల స్వార్ధాలు, ప్రజల వెర్రి వ్యామోహాలు,నెహ్రూకుటుంబం వారే ప్రధానమంత్రులు, ఎంపీల కొడుకులే ఎంపీలు, ఎంఎల్ఏ లకొడుకులే ఎంఎల్ఏ లు, హీరోల కొడుకులే హీరోలు, డాక్టర్ల కొడుకులే డాక్టర్లు, ఐఏఎస్ ల కొడుకులే ఐఏఎస్ లు వంటి నూతన కుల వ్యవస్థను మన నెత్తిన రుద్దుతున్నాయి.

స్వాతంత్ర్యోద్యమ కాలం మనకు పలువురు గొప్ప మేథావులను, కార్యయోధులను ప్రసాదించింది.


కార్యయోధులలో అత్యంత అగ్ర గణ్యులు లోకమాన్య బాలగంగాధర తిలక్, మరియు మహాత్మా గాంధీ గారు. వీరిరువురూ గీతచేత అత్యంత అధికంగా ప్రభావితం అయిన వారే. గాంధీజీ గీత చేత ప్రభావితం అయినప్పటికీ, గీతపై సవివరమైన వ్యాఖ్యానం రచించే తీరిక వారికి దొరకలేదు. లోకమాన్యతిలక్ బ్రిటీష్ వారి ఆగ్రహానికి గురి యయి బర్మాలోని మాండలే చెరసాలలో ఏకాంతవాస శిక్ష అనుభవించిన కాలంలో, వారికా సావకాశం దొరికింది. వారిచే రచించ బడిన గీతా రహస్య షుమారు 1500 పేజీల సుదీర్ఘ గ్రంధం. మరాఠీభాషలో ఉంది. దాన్ని వారి మిత్రులే వారి అనుమతితో ఆంగ్లంలోకి అనువదించారు.

ఆనాటి దేశ కాల మాన పరిస్థితులను మనం దృష్టిలో ఉంచుకుంటే తిలక్ మహారాజ్ కుల వ్యవస్థనుగానీ, అది బోధించిన అసమానతలను గానీ వ్యతిరేకిస్తారని మనం ఆశించరాదు. మోక్ష సన్యాస యోగంలో, 42,43, 44 శ్లోకాలపై తిలక్ మహారాజ్ అభిప్రాయాన్ని చూద్దాం. Page 620 of Gitarahasya.
The arrangement of the four classes has come into existence as a result of the differences between the inherently natural qualities; but it is not that this explanation has for the first time been given in the Gita. This explanation about the differences between the qualities has, with nominal differences, appeared in

i) in the conversation between Nahusha and Yudhishthira, and in the conversation between the Brahmin and the Hunter in the Vanaparva of the Mahabharata (vana 180 and 211);

ii) in the conversation between Bhrigu and Bharadvaja in the Santi parva (San 188); and

iii) in the conversation between Uma and mahEsvara in the anuSAsanaparva (Asva. 39. 11).

It has been stated before that the various actvities of the world result from the differences in the constituents of Prakriti; and it has been proved that the four-class-arrangement, which determines what each of these classes has to do, is itself the result of the difference in the constituents of Prakriti. The Blessed Lord now says, that

i)all these Actions must be carried on by everybody with a desireless frame of mind, that is, with the idea of dedicating them to the Paramesvara, as otherwise the world will not go on; that

ii) a man acquires Perfection when he conducts himself in this way; and that

iii) it is not necessary to perform any other austerity for obtaining Perfection.


వైబీరావు గాడిద వ్యాఖ్యలు

నహుషుడు ధర్మరాజుకి చెప్పాడనో, ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పాడనో, భృగువు భరద్వాజుడికి చెప్పాడనే, సాక్షాత్తూ భగవంతుడే అర్జునుడికి చెప్పాడనో, తిలక్ గారు చెప్పారనో, సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు చెప్పారనో,రాజాగోపాలాచారి గారు చెప్పారనో, వివేకానందాగారు చెప్పారనో, సినిమాల్లో ఎన్ టీ ఆర్ గారు చెప్పారనో, ఘంటసాలగారు పాడారనో, అన్యాయాలన్నీ న్యాయాలయి పోవు. అలాగని, పెద్దలను కించపరచటం కూడ న్యాయంకాదు.
తెనాలి రామకృష్ణుడి చాటువు ఒకటి గుర్తుకు వస్తుంది:-
చంపకమాల.
తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా


అయినా తప్పటంలేదు. నా నోటిలో దుమ్ము పడితే పడును గాక.
పూర్వకాలపు పాలకులు, పండాలు కుమ్మక్కయ్యి, నిమ్న కులాలపై రుద్దిన అసమానతలను, -- తిలక్ మహారాజ్ గారు జన్మతో వచ్చే అసమానతలుగా భావించి , వాటిని ప్రకృతి పైకి నెట్టేశారు. ప్రకృతిలో మనుషుల శక్తియుక్తుల మధ్య కొన్ని అసమానతలు వచ్చేమాట నిజమే అయినా, వాటిని ఈపెట్టుబడిదారీ సమాజం అతిగా చిత్రిస్తున్నది. పృకృతి సహజంగా వచ్చే అసమానతలకు, పాలకులు-పండాలు, చట్టాలు, ఆచారాలు, సృష్టించే అసమానతలకు హస్తి మశకాంతరం ఉంటుంది.

తిలక్ గారే కాదు, మన బోధకులందరు గీతా వాక్యంగా చెప్పేది ఒకటే. చాకిరీ చేసే సమయంలో, పరమాత్మను సేవిస్తున్నాను , పరమాత్మాత్మార్పణం అనుకోమని. వినోబా భావే గారైతే ఒకడుగు ముందుకేసి 'ఒక వృధ్ద వనిత పిడకలు చేస్తు కృష్ణార్పణం అనుకున్నది. ఆపిడకలు వెళ్ళి శ్రీకృష్ణుడి ముఖానికి వెళ్ళి అతుక్కున్నాయి' అని ఒక పిట్ట కథను మనసుకు హత్తుకు పోయాలా జైల్లో ఖైదీలకు చెప్పారు.

అంటే, మన రజకులు మురికి బట్టలు ఉతుక్కుంటూ, చర్మకారులు పశువుల చర్మాలను కడుక్కుంటూ, సఫాయివాలాలు పాయఖానాలను శుభ్రం చేస్తూ, స్వీపర్లు వీధులు ఊడుస్తూ జీవితాంతమూ గడపాల్సిందేనా? అనే ప్రశ్న రాకపోతే మనం సత్య శోథకులం కాలేము.

హీరోల కొడుకులు హీరోలుగా, ఆటో డ్రైవర్ల కొడుకులు ఆటో డ్రైవర్లకొడుకులు ఆటో డ్రైవర్లుగా ఇలా ఎంతకాలం?

సమానతలు అసాధ్యం, సమానావకాశాలు అనే సిధ్ధాంతాన్ని పలువురు పండితులు ముందుకు తెచ్చారు. వారిలో విశ్వవిఖ్యాత పండితుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (ష్ణ య్య) గారు కూడ ఉన్నారు. వారి గీతానువాదం 1948లో లండన్ లో ప్రచురించబడి, యూరో అమెరికన్ల ప్రశంసలు కూడ అందుకున్నది. మో.స.యోగం 42,43, 44 శ్లోకాలపై రాధాక్రిష్ణయ్యగారి అభిప్రాయాన్ని మరొకసారి పరిశీలిద్దాం.

సమానత్వం లేకపోతే పోనీ, కనీసం సమానావకాశాలైనా లభిస్తున్నాయా? సమానావకాశాలు లభిస్తే సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కొద్దీకాలం లోనే ఎలా కాగలిగారు? జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి పనికి రాకుండా ఎందుకు పోయారు? సీల్డ్ కవర్ సంస్కృతి ఎలా ప్రవేశించింది?

ఇందిరాగాంధీ పోయిన మర్నాడే రాజీవ్ గాంధీ పట్టాభిషేకం ఎలా జరిగింది? ఆయనను , ఆయన పార్టీని జనం అతి పెద్ద మెజారిటీతో ఎలా గెలిపించారు? ధీరూభాయ్ అంబానీగారి అబ్బాయి ముఖేష్ అంబానీ భారతీయుల్లో అత్యధిక ధనికుడు ఎలా కాగలిగాడు? రాజశేఖర పుత్ర జగన్మోహన్ శాతకర్ణి లక్ష కోట్లకు ఎలా అధిపతి కాగలిగాడు?

శరీర కష్టం అవసరమైన, లేక ప్రమాదకరమైన, లేక ఇబ్బంది కరమైన పనులు చేయటానికి ఎవరో ఒకరు కావాలిగా అనే వాళ్ళు ఉన్నారు. తాము మాత్రమే గొప్ప గొప్ప పనులు చేసి సమాజాన్ని ఉధ్ధరిస్తున్నామనుకునే నేతలు,ఆధికారులు, డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, క్రికెటర్లు, చార్టటర్డ్ ఎకౌంటెంట్లు, స్వాములవార్లు, రోజుకో రెండు గంటలు ఈ శరీర కష్టం అవసరమైన, లేక ప్రమాదకరమైన, లేక ఇబ్బంది కరమైన పనులు చేయటానికి ముందుకు రావచ్చు. ప్రభుత్వం చట్టాలు, నిబంధనలు, సంస్థలద్వారా ఈ రొటేషన్ ను అమలులోకి తేగలిగితే, నేడు కొన్ని వర్గాలవారిపై మాత్రమే పడుతున్న ఈ భారం అన్ని వర్గాలకు పంచి నట్లు అవుతుంది కదా. ఊరికే dignity of labor అని ఉపన్యాసాలిస్తే ప్రయోజనం ఏముంటుంది?

సామాజికన్యాయంతో కొన్ని వోట్లను పోగేసుకున్న చిరంజీవి గారేమంటారో?

To continue adding / deleting / modifying. सशेष. ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.