Wednesday, December 10, 2014

400 Should Bhagavad Gita be National scripture?On the 7th Dec. 2014, Ms. Sushma Swaraj, the Union Minister for External Affairs, was reported to have said at Gita PreraN mahOtsav (approx. Engl:  Gita's Inspiration Festival), 5151st Anniversary of Gita, as under:

డిసెంబర్ ౭, ౨౦౧౪ నాడు, కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు  ౫౧౫౧వ గీతా ప్రేరణా మహోత్సవం లో  ఇలా చెప్పారుట.

“When I read Gita for the first time, I did not agree with the concept of whatever happens, happens for the best and whatever happens in future, will be for good. But when I read it for the third and fourth time, I understood its meaning. This has helped me all through my life. Even now, when I am handling the External Affairs and the challenges related to it,”
నేను గీతను మొదటి సారి చదివినపుడు, ఏది జరిగినా మన మంచికే, మరియు భవిష్యత్ లో ఏది జరిగినా అది కూడ మన మంచికే అనే సిధ్ధాంతం తో ఏకీభవించలేదు.  కానీ, దానిని మూడవ సారి, నాలుగో సారి చదివినపుడు, దాని అర్ధం నాకు బోధ పడింది.  ఇది నాకు జీవితాంతమూ సహాయపడింది.  ఇప్పుడు కూడ, విదేశాంగ వ్యవహారాలను చూస్తున్నపుడు, వాటి సవాళ్ళను ఎదుర్కుంటున్నప్పుడు కూడ నాకు సహాయం చేస్తున్నది.

"I am able to face the challenges as External Affairs Minister only because of the teachings of Gita."
గీతా బోధనల వల్లనే నేను విదేశాంగమంత్రిగా సవాళ్ళను ఎదుర్కోగలుగుతున్నాను.
     "...Only a formal announcement to this effect is pending. ... “The Prime Minister has already given it the stature of national granth by gifting it to US President Barack Obama.  ...”
ఇపుడు ఇంక అధికారికంగా ప్రకటించటం మాత్రమే మిగిలింది.  ప్రధానమంత్రిగారు, గీతను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా గారికి బహుకరించటం ద్వారా, ఇప్పటికే దానికి జాతీయ గ్రంధం హోదాను ఇచ్చారు.
"...psychiatrists should  read and prescribe the Gita to patients suffering from depression. ..."

సైకియాట్రిస్టులు (మానసిక వైద్యులు) గీతను చదివి, డిప్రెషన్ నుండి బాధపడే  రోగులకు ప్రిస్క్రైబ్ చేయాలి.

Hariyana Chief Minister, Manoharlal Khattar is reported to have said:  హరియానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇలా అన్నారుట.

“Gita ke sandesh ko jab hum dhyan se padhte hain , to jaisa kaha hai hamare desh ka samvidhan hi Gita hai. Gita ko samvidhaan se upar maan liya gaya hai. Kisi bhi desh ka samvidhan kaal aur paristhithi ke hisab se badalta rehta hai, lekin Gita aisa saar hai jo sahasvat hai (When we read the Gita carefully, as has been said, our Constitution is the Gita itself. In fact, the Gita is considered above the Constitution. Any country’s constitution changes with time and circumstances, but the Gita is eternal.)  ...”

గీతా సందేశాన్ని మనం తదేక ధ్యానంతో చదివితే, అది భారత రాజ్యాంగం, గీత ఒకటే అని అర్ధం అవుతుంది.   రాజ్యాంగం కన్నా గీత ఉన్నతమైనదిగా అంగీకరించ బడినది.  ఏదేశ రాజ్యాంగమైనా, దేశ కాల మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, కానీ గీతా సారం శాశ్వతం.


Person views of ybrao a donkey, which I do not wish to impose on others: వైబీరావు గాడిద అభిప్రాయాలు

1. What is the definition of a sacred scripture?  పవిత్ర గ్రంధం యొక్క నిర్వచనం ఏమిటి.
2. What is the definition of a National scripture?  జాతీయ గ్రంథం నిర్వచనం ఏమిటి.


3. Does a country require a National scripture?  ఒక దేశానికి జాతీయ గ్రంధం అవసరమా.

The objects of Bhagavad Gita as per verses 18/42 to 44 (May be insertions by preachers), are very clear:  గీత లోని మోక్ష సన్యాసయోగం (౧౮ వ ఆధ్యాయం) ౪౨ నుండి ౪౪ శ్లోకాలను గమనిస్తే, (అవి పురాణోపన్యాసకుల, పూజారులు చొప్పించినవి కావచ్చు), దాని లక్ష్యాలు సుస్పష్టం.

Gita imposes servility on SUdras (4th caste persons). What it imposes on 5th caste persons (today's word: dalits), is not clear.  గీత శూద్రులపై,  పై కులాలకు సేవ అనే నిరంకుశ ధర్మాన్ని (మహాభాగవతం కూడ అంతే నండి), రుద్దుతుంది.  ఈ ౪౨,౪౩,౪౪ శ్లోకాలు పంచముల (ఐదవ కులం వారు, దళితులు కావచ్చు, ఇతర అణగారిన వర్గాలవారు కావచ్చు) గురించి ఎందుకో మౌనం వహించాయి.  అంటే గీత వారిని మనుషులుగా గుర్తించలేదనుకోవాలా.  Reason: During Mahabharata period, there were too many outcasts(es) with nomenclature such as 'chandAla' etc.  They were supposed to stay in the outskirts of villages.  YudhishThira used to throw some food to chandAlas,  dogs, and birds, while performing his Vaiswadeva yagna.   Mahabharata, Aranya Parva, Chapter 2, Verses 56 and 57 deal with it.  Late Ganguly translated around in 1899 into English, almost verbatim.  In his translation, he has clearly mentioned as under:  కారణం.  మహాభారత కాలంలోనే గ్రామబాహ్యులైన కులాల వారు పలువురు ఉండేవాళ్ళు.  వీళ్ళకి చండాలురు మొ|| పేర్లను వాడారు.  యుధిష్ఠిరుడుగారు (అంటే ధర్మరాజుగారు) వైశ్వదేవం అనే యజ్ఞాన్ని చేసేటపుడు, చండాలురకు, కుక్కలకు, పక్షులకు ఆహారాన్ని విసిరేసి భోజనం చేసేవారుట.  మహాభారతం ఆరణ్యపర్వం, రెండవ ఆధ్యాయం, ౫౬, ౫౭ శ్లోకాలు దీనికి సంబంధించినవి.  స్వర్గీయ కిశోర్ మోహన్ గంగూలీ గారు, వ్యాస భారతాన్ని యథామూలంగా,  ౧౮౯౯ ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించారు.  ఆ ఆంగ్లానువాదంలో ఈచండాలురను, కుక్కలను, పక్షులను సమానం చేయటం, స్పష్టంగా ఉంది.

By scattering food on the earth, morning and evening, for (the behoof of) dogs and Chandalas and birds, should a person perform the Viswedeva sacrifice.   భూమిపై పొద్దున, సాయంత్రం, కుక్కలకు, చండాలురకు, పక్షులకు ఆహారాన్ని విసరటం ద్వారా, వ్యక్తులు వైశ్వదేవం యజ్ఞాన్ని నిర్వహించాలి.

This line of verse equating chandalas with dogs and birds, got purged in Sanskrit Mahabharatas placed on net subsequently in digital files such as Bhandarkar Library, etc.  We can't say who deliberately removed this line, from Bombay version while it was apparently present in Bengal version (Great translator Ganguly depended on it), they might have considered it offensive and removed it.   Offensive or not, lines cannot be removed from the scriptures.  At the most a noting can be made, that it is likely to offend.   వైశ్వదేవంలో, కుక్కలను, చండాలురను, పక్షులను సమానంగా చూసే ఈ శ్లోకం, ఆధునికంగా డిజిటాలైజ్ చేయబడి ఇంటర్నెట్ లో పెట్టబడిన భండార్కర్ లైబ్రరీ మొ|| వారి ముంబాయి వెర్షన్ లలో ఎందుకో తొలగించబడింది.  బహుశా, ఆ ముంబాయి వెర్షన్ల సంపాదకులు ౫౭ వ శ్లోకంలోని ఈలైనుని గాయపరిచేదిగా భావించి ఉండవచ్చు.  గంగూలీగారి ఆంగ్లానువాదం లో ఎందుకు ఉందంటే, ఆయన బెంగాల్ ప్రతిని అనుసరించి ఉండాలి. ఆఫెన్సివ్ అయినా కాకపోయినా ప్రాచీన గ్రంధాలలోంచి శ్లోకాలను తీసివేయటం, మార్చటం మంచిపధ్ధతి కాదు.  ఎందుకంటే, అలా మారిస్తే, అవి తమ రూపురేఖలను కోల్పోతాయి.  ఆఫెన్సివ్ అని భావించినపుడు, అలాగా ఒక నోటింగ్ ను చేస్తే, సరిపోతుంది.

సారాంశం ఏమిటంటే గీత యొక్క ఫోకస్---= కులాలు.  ఈవిషయం అర్జున విషాదయోగంలోనే మనకి స్పష్టం.  తండ్రులు, తాతలు, మేనమామలను చంపి రక్తపుకూడును తినిలేను అనటంతో పాటు, అర్జునుడు, యుధ్ధంలో సైనికులు చచ్చిపోతే స్త్రీలు విధవలు అవుతారు, వ్యభిచారం మితిమీరుతుంది, వర్ణ సంకరం జరుగుతుంది  వంటి భయాలను వ్యక్తం చేశాడు.  వర్ణసంకర భయమే అర్జునుడిని యుధ్ధవిముఖుడిని చేసి ఉండ వచ్చు.Why Lord Krishna, divided only Indians into four castes?  Why did he leave the remain world untouched?  భగవాన్ శ్రీకృష్ణుడు భారతీయులను మాత్రమే ఎందుకు నాలుగు కులాలుగా విభజించాడు.  మిగిలిన ప్రపంచాన్ని ఎందుకు వదిలేశాడు.

Why did Lord Krishna take up the task of dividing Indians only into four castes?   Today , there are thousands of castes; it is a different thing. భగవాన్ శ్రీకృష్ణుడు భారతీయులను కేవలం నాలుగు కులాలుగానే ఎందుకు విభజించాడు.   ఈరోజు వేలాది కులాలు ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి.

cAtur-varNyam maya srishTam
guNa-karma-vibhAgaSah
tasya kartAram api mAm
viddhi akartAram avyayam.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మ విభాగశః
తస్య కర్తారం అపి మాం
విధ్ధి, అకర్తారం, అవ్యయం.

It is very clear that priests and preachers have tried to legitimize their own creation of caste divisions, by attributing to Lord Krishna.  ఒక విషయం స్పష్టం, పూజారులు, మతబోధకులు, తాము సృష్టించిన కుల విభజనలను, దేవుడిమీది రుద్దటానికి ప్రయత్నించారు.  దేవుడు చేసాడంటే కానీ, జనం వినరని వారు అనుకొని ఉండచ్చు.


Mahatma Gandhi, Lok Manya Bala Gangadhara Tilak, and many others have used the meaning of 'karma' in Gita, to mean 'duty' and, of course, society has benefited from their getting inspired by Gita.  మహాత్మా గాంధీ గారు, లోక్ మాన్య తిలక్ గారు, ఇంకా పలువురు, గీతలోని కర్మ అనే పదానికి కర్తవ్యనిర్వహణ అనే అర్ధాన్ని తీసుకొని, గొప్ప గొప్ప కార్యాలను సాధించటం, నిజమే కావచ్చు.  వారు అలా తమ సద్బుధ్ధితో, గీతను తమ కోణంలోంచి అర్ధం చేసుకోటం వల్ల భారతజాతికి లాభం కలిగింది అన్న మాట నిజమే.


But, the real meaning of 'karma', as per Gita, is not a simple straight "one's own duty".  It is one's own duty as imposed by his caste.   Fortunately or unfortunately, in independent India, people are giving greater importance to wealth in the place of caste of a person.   People are accepting marital relationships with rich persons, ignoring their castes.  It is good that they are ignoring the caste element, gradually.  But they are substituting it with a bigger mill-stone, 'wealth'.  Cure should not be worse than disease.

కానీ గీత లోని కర్మ అనే పదానికి కర్తవ్యనిర్వహణ అనే విస్తృతార్ధం లేదు.  గీతలో బోధించబడిన కర్మ కులం పేరుతో వ్యక్తులపై రుద్దబడిన కర్మ.   అదృష్ట వశాత్తు లేక దురదృష్టవశాత్తు, జనం నేడు కులం కన్నా ధనానికి ప్రాధాన్యతనివ్వటం గమనార్హం.  అవతల వాళ్ళ కులం ఏదీ అనేదాన్ని పట్టించుకోకుండా, వాళ్ళు తమకన్నా ధనవంతులు అయితే చాలు,  పెళ్ళి సంబంధాలను,  బంధుత్వాలను కలుపుకుంటున్నారు.   వాళ్ళు క్రమంగా కులం అంశాన్ని వదిలేయటం సంతోషకరమే.   కానీ వాళ్ళు సంపదకు ప్రాధాన్యత నివ్వటం వల్ల, ఒక  బండరాయిని వీపుపైనుండి దించుకుని ఇంకా బరువైన, మరో బండ రాయిని పెట్టుకున్నట్లయింది.  వ్యాధికి ఇచ్చే మందు, వ్యాధికన్నా అల్పమైనది కాకూడదు.


The reason for Mahabharata war was internecine disputes.  It has nothing to do with religion or defending a Nation. The dispute arose because of presumed insult suffered by Duryodhana, and gambling disputes between Pandavas and Kauravas.

 మహాభారత యుధ్ధానికి కారణం, అన్న దమ్ముల మధ్యతగాదాలు.  ఆ తగాదాలు మతానికి సంబంధించినవి కానీ, దేశ రక్షణకి సంబంధించినవి కావు.  తగాదాలు ఎందుకు వచ్చాయి అంటే, దుర్యోధనుడికి మయసభలో అవమానం జరగటం వల్ల కావచ్చు, లేక పాండవులకు, కౌరవులకు జూదంలో తగాదాల వల్ల కావచ్చు.

Indians seem to have learnt this predisposition to gambling 24 x 7 x 365 from Pandavas, Kauravas , Yadavas (Balarama was a gambler), Vidarbha (Rukmini's brother Rukmi was a gambler.   Balarama killed him in a gambling dispute), Nala et al.  Gambling is a trait of Aryans.  We find mantras in Atharvana Veda, praying Gods for success in gambling.   21st Century Indian gambling does not leave out anything.  Stock exchanges, cricket, weather, elections, car numbers, matka-bracket, horse-races, card-games, what not.

భారతీయులకి ఈ జూదం ఆడే జబ్బు, పాండవులు, కౌరవులు, యాదవులు (బలరాముడు జూదరి), విదర్భ పాలకులు (రుక్మిణి సోదరుడు రుక్మి జూదరి.  రుక్మిని, జూదంలో తగాదా వచ్చి బలరాముడు తన నాగలితో పొడిచి చంపాడు), నలుడు మొ|| వారినుండి వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తున్నది.  అథర్వణ వేదంలో, జూదంలో జయం కలిపించమని దేవతలను ప్ర్రార్ధిస్తూ చేసే  ప్రక్రియలు ఉన్నాయి.  ౨౧వ శతాబ్దపు భారతీయుల జూదం దేనిని వదలదు.  స్టాక్ ఎక్స్ ఛేంజీలు, కమోడిటీ ఎక్స్ఛేంజీలు,  క్రికెట్, వాతావరణం, ఎన్నికలు, కారు నంబర్లు, మట్కా బ్రాకెట్, లాటరీలు, గుర్రపు పందాలు, పేకాటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు (బ్యాంకులనుండి పరిశ్రమలోన్లు, వ్యవసాయ బంగారం లోన్లు తీసుకుని, ప్లాట్లను కొని పారేసి, వాటి ధరలు ఎప్పుడుపెరుగుతాయా అని ఎదురుచూడటం, నష్టం వస్తే ఆనష్టాన్ని బ్యాంకులకు వదిలేయటం) కావేవీ జూదానికి అనర్హం.

Indians have to find out a solution for these evils of alcoholism, prostitution, unofficial wives, gambling and wife-beating (wife-betting?) etc.   Without solutions for these evils, having a National Scripture will be like adorning a skeleton with silk cloth.   భారతీయులు తమను చుట్టుముట్టిన దుష్టశక్తులు అంటే మద్యపానం, వ్యభిచారం, అనధికారిక భార్యలు, జూదం, పెళ్ళాలను కొట్టటం (పెళ్ళాలను పణంగా పెట్టి జూదం ఆడటం కూడానేమో), వీటిని వదిలించుకోవాల్సి ఉంది.  వీటిని వదిలించుకోకుండా, జాతీయ పవిత్ర గ్రంధాన్ని కలిగి ఉండటం అంటే, అస్థి పంజరానికి, పట్టుబట్ట చుట్టినట్లవుతుంది.


India's priority today is not getting a National scripture.  Its priorities should be:  భారతీయులకి ఇపుడు కావాల్సిన ప్రాధాన్యత జాతీయ గ్రంధం కాదు.  మనకి ఉండాల్సిన ప్రాధాన్యతలు నాదృష్టిలో ఇవి.

1. Population control. జనాభా అదుపు.

2. Removal of inequalities of income and wealth.  For this probably Right of property will have be removed. Democratic Marxism can help in this respect.  ఆదాయాలు, సంపదలు వీటిలో వ్యత్యాసాలను తొలగించటం.  దీనికొరకు ఆస్తి హక్కును తొలగించాల్సి ఉంటుంది.   ఈవిషయంలో మనకి ప్రజాస్వామ్య మార్క్సిజం మనకు తోడ్పడ కలదు.

3. Producing food, clothing, shelter, skill generation, indigenously, on a large scale.  ఆహారం, బట్ట, ఇళ్ళు, నైపుణ్యాల పెంపుదల, వీటిని అతి భారీ స్థాయిలో మనం చేపట్టాలి.

4. Solar energy, sea-wave energy, wind energy, probably hydrogen fuel.  సూర్య శక్తి, సముద్ర కెరటాల శక్తి, వాయు శక్తి, బహుశా ఉదజని ఇంధనం, వీటిని అభివృధ్ధి చేసుకోవాలి.

5. Confining religion to individual and family level, within the boundaries of home.  For this we have to remove priests of all religions and close down prayer houses.  Of course, Marxism can use their services for some other productive purposes, and provide them greater intrinsic job satisfaction, than what they are getting now.  Those who are in priest / preaching profession now (all religions), have joined that profession, not because they adored that profession, but because in a Capitalist Society, they have no real freedom to choose their profession, and they have to accept whatever comes in, or starve.   Had they been offered some medical set or IIT seat, would they have rejected it, and relish only priesthood?  Definitely not!   Pl. see point No. 7 below.

మతాన్ని వ్యక్తి మరియు కుటుంబ స్థాయికి పరిమితం చేయాలి.  దీని కొరకు మనం, అన్నిమతాల పూజారులను, బోధకులను, తొలగించి, అన్ని మతాల ప్రార్ధనాలయాలను మూసివేయాల్సి రావచ్చు.   మార్క్సిజం, వీరి సేవలను వేరొక  ఉత్పత్తి దాయకమైన పనికి వినియోగించుకోవచ్చు.  దీని వల్ల పూజారులకి, మతబోధకులకి కూడ, ఇంకా మెరుగైన ఉద్యోగతృప్తిని కలిగించిన సంఘం అవుతుంది.  ప్రస్తుతం అన్ని మతాలలోనూ పూజారి వృత్తులను చేపట్టిన వాళ్ళు ఆవృత్తి పై ప్రేమతో కాక, పెట్టుబడిదారీ విధానంలో వ్యక్తులకు ఉండే గత్యంతరం లేని పరిస్థితులలోనే, పూజారి వృత్తులలోకి ప్రవేశించారనచ్చు.  వారికే ఏ మెడికల్ సీటో, ఐఐటీ సీటో ఇస్తే వారు వదిలేసి పూజారి వృత్తిలోకి ప్రవేశించి ఉండేవాళ్ళా.


6. Reduce dependence of agriculture on monsoons, by bringing every inch of cultivable land under drip irrigation. వ్యవసాయాన్ని ఋతుపవనాలపై ఆధారపడటం తగ్గించుకోవాలంటే, ప్రతి అంగుళం భూమిని డ్రిప్ ఇరిగేషన్ క్రిందికి తెచ్చుకోవాలి.

7. Develop a culture of 'dignity of physical work'.  Every individual from top industrialist to the bottom laborer should have a combination of physical work for 4 hours, mental work 3 hours, and intellectual work 1 hour.  This is possible only by implementing Marxism.  శరీరశ్రమకు గౌరవాన్ని ఇచ్చే సంస్కృతిని మనం అభివృధ్ధి చేసుకోవాలి.  అగ్రస్థాయి పారిశ్రామికవేత్తనుండి, క్రికెటర్ నుండి, సినీ స్టార్ నుండి క్రింది శ్రామికుడి వరకు, రోజుకు కనీసం నాలుగు గంటలు శరీర శ్రమ, మూడు గంటలు మానసిక శ్రమ, ఒక గంట మేథో శ్రమ, నిర్బంధంగా చేయాలి.  స్వఛ్ఛభారత్ కొరకు చీపిరి పట్టుకున్నట్లు కాదు.  మార్క్సిజాన్ని అమలులోకి తెచ్చుకోటం ద్వారా (అంటే మార్క్సిస్టు పార్టీలను అభివృధ్ధిచేసుకుని, వాటిని ఎన్నుకుని, వాటి చేత నిజమైన మార్క్సిజాన్ని అమలు చేయించుకోటం ద్వారా) మాత్రమే సాధ్యమవుతుంది.

8. India is very fast in learning habits which ought not to be learnt from the West.  Example pubs, cricket, films, porno, excess alcohol and non-veg. consumption.  పాశ్చాత్యదేశాలనుండి ఏ అలవాట్లను మనం నేర్చుకోకూడదో, ఆఅలవాట్లను నేర్చుకోటంలో భారతీయులు ముందంజలో ఉన్నారు.  ఉ||  పబ్బులు, క్రికెట్, సినిమాలు, పోర్నో,  అతి మద్యం, అతి నాన్ వెజ్ మొ||.

9. The institution of family has become a bondage, to all the three-- husbands, wives and children.  The institution of family and marriage is to be substituted by better designed community families.  Modified Marxism can help in this.  Society and Govt. can take care of all children, and relieve parents from the burden of raring children.   కుటుంబ వ్యవస్థ, భర్తలకు, భార్యలకు, పిల్లలకు అందరికీ బానిసత్వంగా పరిణమించింది.   కుటుంబం, మరియు వివాహ వ్యవస్థను మనం ఇంకా మెరుగు గా డిజైన్ చేయబడిన కమ్యూనిటీ కుటుంబాలతో భర్తీ చేసుకోవాలి.  ఈవిషయంలో మనకు మాడిఫైడ్ మార్క్సిజం సహాయ పడ గలదు.   సంఘం, మరియు ప్రభుత్వం, పిల్లలను పెద్దలబారినుండి విడిపించటం, పెద్దలను పిల్లలను పోషించే భారం నుండి విముక్తులను చేయటానికి, ఆభారాన్ని సమాజం, ప్రభుత్వమే స్వీకరించాలి.

10. Better care of aged persons, physically challenged persons, by the society and Government, as a legal duty, instead of leaving it to charitable institutions and so called philanthropists who are nothing but vultures.  సమాజం మరియు ప్రభుత్వం వయోవృధ్ధులను, వికలాంగులను, జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఛారిటబుల్ సంస్థలకు వదలకుండా, తామే స్వీకరించాలి.

It may not be correct to say that Constitution of a country is superior to Gita, or that Gita is superior to Constitution.  Reason:  Constitutions too are made by political parties.  Today, Mr. Narendra Modi and BJP have become virtual dictators with a sweeping majority.  Once they get appropriate majority in the Upper House (Rajya Sabha), they are capable of writing a new Constitution.  Indian Constitution, in particular, is vulnerable to frequent amendments, at the whims and fancies of the parties in power.

రాజ్యాంగం కన్నా గీత గొప్పదని కానీ, లేక గీత కన్నా రాజ్యాంగం గొప్పదని కానీ పోలిక చేయటం సమంజసం కాదు.  ఎందుకంటే రాజ్యాంగాలను తయారు చేసేది రాజకీయ పార్టీలు.   ఈరోజు శ్రీ నరేంద్రమోడీ మరియు బిజేపీ పార్టీలకు ఇంచుమించుగా నిరంకుశ అధికారం సమకూరింది.  వారికి రాజ్యసభలో కూడ బలం పెరిగితే, కొత్త రాజ్యాంగాన్ని తయారుచేసినా, లేక కొత్తరాజ్యాంగంతో సమానంగా ఉండేలా ఆర్టికిల్సును ఎడాపెడా మార్చేసినా ఆశ్ఛర్యపోనవసరం లేదు.  భారత్ కు సంబంధించినంత వరకు రాజ్యాంగం అనేది ఎన్నిసార్లైనా ఉతికి పారేయటానికి వీలైన, ఒక అతుకుల బొంత మాత్రమే.

Ms. Sushma Swaraj has unnecessarily opened up a pandora box.  BJP leaders have a tendency of raking up non-issues in the guise of Indian culture.  Of course, Congress was worse in this respect, in the guise of minority protection.  శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు అనవసరంగా ఒక పండోరా బాక్సును తెరిచేశారు.  భారత సంస్కృతి పేరుతో,  సమస్యలుకానివాటిని సమస్యలుగా తయారు చేసే దివ్యశక్తి పలువురు బిజేపీ నేతలకు ఉన్నట్లుగా కనిపిస్తుంది.  అయితే మైనారిటీల రక్షణ పేరుతో, కాంగ్రెస్ నేతలకు కూడ ఈదివ్యశక్తి ఉంది.

Thus Indians are left between devil and the deep sea.  ఈవిధంగా భారతీయులు, ముందు నుయ్యి, వెనుక గొయ్యి పరిస్థితిలో ఇరుక్కు పోయారు.


(To continue.  సశేషం.  असंपूर्ण.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.