౩౯౯ కల్యాణి రాగం , హిందూస్థానీ శైలిలో.
తీన్ తాల్ (ఆదితాళం).
పై వీడియో ఆడియో లో నేను వాడిన పాశ్చాత్య స్వరలిపి (నొటేషన్) కావాలంటే, నా ఈక్రింది బ్లాగ్ ను దర్శించండి.
http://museyb.blogspot.in/search/label/144
కల్యాణి రాగం దక్షిణ భారత్ లో అత్యంత లోక ప్రియమైనది. ఉత్తర భారత్ లో కూడ అంతకన్నా తక్కువేమీ కాదు.
దీనిని ఎన్నిసార్లు, ఎన్ని రీతులలో విన్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.*
ఉత్తర భారత్ లో యమన్ ఆరోహీలో పంచమం వాడకం తక్కువ. అక్కడక్కడ మన దక్షిణ భారతీయ కర్నాటక సంగీతంలో కూడ దమగరి లేక మదనిస(తార స్థాయి) వంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి.
*(లైంగికానందం కూడ అంతే కదా. ఋజువు__ . కనుకనే మనకు ఒక సామెత వచ్చింది. తాతా, తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే, ఈ వయసులో నాకు పిల్లనెవరిస్తార్రా అంటాడు కానీ ఈవయసులో నాకు సెక్సు ఎందుకు అనడు.)కల్యాణి మరియు కర్నాటక తోడి (క_తోడి) ఈ స్వరాల కోణం లోంచి చూస్తే పరస్పర విరుధ్ధ ప్రకృతులు కలిగినవి. కల్యాణిలో అన్నీ స్ట్రాంగ్ స్వరాలే. భైరవిలో అన్నీ కోమల స్వరాలే.
కల్యాణి లేక హిం_యమన్. c,d,e,f sharp, g,a,b,c'.
క_తోడి లేక హిం_భైరవి. c,c sharp, d#,f,g,g#,a#,c'.
నోట్సు . పాశ్చాత్య సంగీతంలో # గుర్తు షార్ప్ కి సంకేతం. ఏబీసీటుమిడీలో నేను గమనించింది షార్పు స్వరాలకు ముందు క్యారెట్ ^ తగిలిస్తేనే కానీ పనిచేయటం లేదు. ఉదా f# =^f.
కల్యాణి రాగం దేవతలకే కాక దేవదూతలకి కూడ ప్రియమైనది (వెంకయ్యనాయుడు గారి దేవదూతలకి కాక పోవచ్చు) అని కూడ మనం భావించవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.