Sunday, May 4, 2014

224 Shri Modi lacks minimum courtesy and manners

224 శ్రీనరేంద్ర మోడీ కనీస గౌరవ మర్యాదలు చూపించలేని వ్యక్తియా?

చర్చనీయాంశాలు: సోనియా, నరేంద్రమోడీ, బిజెపి, కాంగ్రెస్


ఈయనయే గరీబ్ ఆద్మీ, చాయ్ వాలా

శ్రీ నరేంద్రమోడీ అన్నట్లుగా చెప్పబడుతున్న మాటలు:

हमें गर्व है कि हमने कहा कि लोगों को और मत लूटिए। लोगों को जो लूटते हैं उन्हें कहने की जरूरत नहीं है। आपने गरीबों के लिए कुछ भी नहीं छोड़ा है। यह आप जैसे लोगों को कहना है, क्योंकि हमने कभी नहीं लूटा है। तो क्यों नहीं ‘ये दिल मांगे मोर’। केवल सोनिया जी ही क्यों? आपको सम्मानित तरीके से जाने की तैयारी करनी चाहिए।

తెలుగు సారం: ప్రజలను ఇం కా లూటీ చేయటం మానమని చెప్పటానికి మాకు గర్వంగా ఉంది. ప్రజలను లూటీ చేసే వారు ప్రజలకు చెప్పవలసిని అవసరం లేదు. మీరు పేదలకు కొంత కూడ వదలలేదు. మేము ప్రజలను ఎప్పుడూ లూటీ చేయలేదని , మీలాటి వ్యక్తులకు చెప్పాల్సి ఉంది. అలాటపుడు ''యే దిల్ మాంగే మోర్ '' ఎందుకు అనకూడదు? మీరు మర్యాదాకరమైన పధ్ధతిలో వెళ్ళిపోటానికి సిధ్ధపడాలి.వైబీరావు గాడిద వ్యాఖ్యలులూటీలనేవి అన్ని పార్టీల వారూ చేశారు. కర్నాటకలో బిజెపి రాజ్యంలో జరిగిన ఇనుప ఖనిజం లూటీ సంగతేమిటి? ఇనుప ఖనిజం దొంగలను, దానిని ప్రోత్సహించిన నాటి బిజెపి ముఖ్యమంత్రినీ, బిజెపి పెద్దపీట వేసి వెనక్కి ఆహ్వానించింది కదా.

శ్రీ నితీన్ గడ్కారీ పై వచ్చిన అవనీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందా?

కాంగ్రెస్ రాజ్యంలో భారీగా అవినీతి జరిగి ఉండ వచ్చు. అయితే ఈ విషయంలో బిజెపి వెనుకంజ వేసి లేదు.

గెలుపూ వోటములు అనేవి రాజకీయాలలో పడుగూ పేకల వంటివి. ఐదేళ్ళ సమయంలోనే, కొన్ని సార్లు మధ్యంతర ఎన్నికలు వస్తే ఇంకా తక్కువ సమయంలో అదృష్టాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఒకసారి ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన రాజకీయ జీవితాలు సమాప్తం కావు కదా. జయంట్ వీల్ లో కూర్చున్న వాళ్ళు కొన్ని సార్లు ఆకాశానికి ఎగురుతారు. మరి కొన్నిసార్లు ఉపరితలానికి వస్తారు.

లూటీల విషయానికి వస్తే, చట్టం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోయి అవినీతి పరులకి శిక్షలు పడితే, ప్రజాస్వామ్యానికి న్యాయానికి జరిగినట్లే.

అరిచే కుక్క కరవదు. కరిచే కుక్క అరవదు. శ్రీ మోడీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కాలం అవినీతిపై విచారణ జరిపించి వారిని నిస్సందేహంగా జైలుకు పంపచ్చు. దీనికి ఆర్భాటం అక్కరలేదు.

ఈ మధ్య శ్రీ మోడీ, రాహుల్, శ్రీమతి సోనియా, ప్రియాంకా అందరూ తిట్లకి లంకించు కుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం, కాదు.

ఇక, మత తత్వం, కులతత్వం విషయానికి వచ్చినపుడు కాంగ్రెస్, బిజెపి లతో సహా రాజకీయ పార్టీలన్నీ విభజించి పాలించు పధ్ధతిలో నే నడుస్తున్నాయి.

క్రొత్త లోక్ సభ సజావుగా పని చేయాలంటే
లోక్ సభకు శ్రీమతి సోనియా ఎన్నికయినప్పటికీ, ఆమె తన ఆరోగ్య సమస్యల వల్లో సభకు తరచుగా హాజర్ కాక పోవచ్చు. కాంగ్రెస్ తరఫున శ్రీ రాహుల్ గాంధీయే ఎక్కువగా ప్రసంగించ వలసి రావచ్చు.

ఈసందర్భంగా నా అల్ప దృష్టికి , శ్రీ నరేంద్రమోడీ వాక్ తపస్సు చేయటం మేలేమో ననిపిస్తుంది. లోక్ సభ నిబంధనల, సభ సదాచారాల నిపుణులు, మరియు వాయిస్ మాడ్యులేషన్ నిపుణుల దగ్గర ఆయన శిక్షణ పొంది, ఒక ఆదర్శ నేతగా, జాతికి సరియైన మార్గ దర్శకుడుగా రూపొందితే బాగుంటుంది. గతం గతః అనుకోటానికి, ప్రజలు సిధ్ధంగా ఉండ వచ్చు. నా భయం ఏమిటంటే, మోడీ పధ్ధతులకి బిజెపి సీనియర్ నేతలే ఖిన్నులై యున్నారు. ఆయన కొంతైనా ఆత్మ పరిశీలన చేసుకుని, కొంతైనా తన పధ్ధతులను మార్చుకుంటే, జాతికి మహోపకారం చేసిన వారవుతారు. జాతి ఆయనకు ఇస్తున్న ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.