Monday, February 17, 2014

141-Vijayasanti. Why did this umbrella get torn? यह छत्र क्यों फटा हूआ है ? ఈగొడుగు ఎందుకు చినిగిపోయింది?


Where is the fierce Telangana State Campaigner Vijaya Shanti, and acclaimed Telugu actress now? What is she doing? For sometime, she was a right-hand person for Mr. Kaluvakolanu Chandra Sekhara Rao, the Chief Minister of Telangana State.

141 Why did this umbrella get torn? ఈగొడుగు ఎందుకు చినిగిపోయింది?
చర్చనీయాంశాలు: రాష్ట్రరాజకీయాలు, తెలంగాణ, తెరాస

ఈ చిత్రం చూడండి. Pl. look at this picture.


ఇది ఆమె 2010లో తెలంగాణ భవన్ లో అన్నమాట:
If somebody obstructs formation of Separate Telangana, I shall stomp him down. This was at a time, when she was under the umbrella of Mr. K. Chandrasekhara Rao. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరైనా అడ్డుపడితే అడ్డంగా తొక్కేస్తాను. కెసిఆర్ తో ఒకే గొడుగు క్రింద ఉన్నప్పటి సంగతి.


25.11.2012 నాడు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారు?
I do not have any differences with Mr. KCR , the President of TRS. I could not attend the Suryapet Meet only because of ill health. It will not be proper for Media to twist the matters. For that reason only I could not attend the Meet. There is no truth in the propaganda that is taking place that I and KCR have differences. I shall continue as a Worker of TRS. Media is unnecessarily creating stories, and alleging faults on me. I shall continue in TRS for ever. Hereafter, Media should not write this type of faulty stories. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అనారోగ్యం కారణంగానే సూర్యపేట సభకు హాజరుకాలేకపోయాను. దీన్ని మీడియా వక్రీకరించడం తగదు. అందుకే బహిరంగసభకు హాజరుకాలేకపోయాను. కేసీఆర్‌కు నాకూ మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను టీఆర్‌ఎస్‌ కార్యకర్తగానే కొనసాగుతాను. మీడియా ఏవేవో కథనాలు సృష్టిస్తూ అనవసరంగా నిందలు వేస్తున్నారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతాను. ఇకపై ఇలాంటి తప్పుడు కథనాలు రాయరాదు.

25.6.2013 నాడు ఏమన్నారు:
... అధ్యక్షుడు కేసీఆర్ అడిగితే ఇవ్వటానికి మెదక్ ఎంపీ సీటు చాక్లెట్ కాదు. మెదక్ నా ఊపిరి తెలంగాణ నా ప్రాణం. 'సెటిల్‌మెంట్లు' పార్టీకి నష్టమే. ...

...నన్నురాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్ నేతలు కుట్రపన్నారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆ పార్టీ నేతలు నా చావును కోరుకున్నారు. అయితే నేను వాటిని ప్రజాబలంతో జయించాను. నేనెన్నడూ కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయలేదు.
...టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసి నన్ను ఒంటరిని చేశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఆ పార్టీ నేతలు నా చావును కోరుకున్నారు. అడుగడుగునా ఎన్నో కుట్రలు పన్నారు.
...వెన్నుపోటు పొడవాలనుకున్నారు. నా నియోజకవర్గానికి వెళ్తానంటే వద్దన్నారు. ఎవరు సహకరించక పోయినా నియోజకవర్గంలో తిరగబట్టే ప్రజా సమస్యలు తెలిశాయి. ఒకవేళ నేను నియోజకవర్గంలో తిరగకపోయి ఉంటే ఈ రోజు మెదక్ రైల్వేలైన్ వచ్చేదా?
...ఈ క్రెడిట్ నాకు దక్కుతుందన్న అక్కసుతోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని సైతం అడ్డుకునేందుకు కుట్రలు చేశారు.
...ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్నికుట్రలు పన్నినా ఓపికతో మిన్నకుండిపోయా. ప్రజాబలమే శ్రీరామరక్షగా అందరి ఎత్తుల్నీ చిత్తుచేశాను. ప్రజలకోసం, వారి సంక్షేమం కోసం ప్రాణాలైనా పణంగా పెడతా.
...నాకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కొన్ని పత్రికల్లో నాపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దయచేసి వాస్తవాలు గ్రహించి రాయాలని, ఎవరో చెప్పిన మాటలు వినవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.
...నా జీవితంలో ఏ నేతకీ తలవంచను. కావాల్సినంత సంపాదించాకే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికలు ఏవైపునకు దారితీస్తాయో.. ఏ క్షణాన ఏం జరుగుతుందో.
...నా రాజకీయ జీవితంలో పాపాలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు. నాకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు లేవు. కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేయటం లేదు.

ఇంక నరసరావుపేట ఎంపి శ్రీ మోదుగుల వేణుగోపాలరెడ్డి గారు 15.2.2015 నాడు ఏమన్నారో చూడండి.
...విజయశాంతిని తీసుకొచ్చి పక్కా ప్రణాళికతో వారిద్దరూ నాపై దాడికి పాల్పడ్డారు. ...

ఇక్కడ వారిద్దరూ అంటే తెలంగాణ నేతలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాఠోడ్.

ఇప్పుడు మరల విజయశాంతి బాధలను చూద్దాం. ఇవి 18.1.2014 నాటివి.

నేను ఎప్పుడు చనిపోతానా అని కొందరు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ కోసం 10 సంవత్సరాలపాటు కష్టపడితే నన్ను ఒంటరిని చేసి రోడ్డున పడేశారు.
నన్నిక ప్రజలే ఆదరించాలి.
టీఆర్ఎస్ నన్ను వెన్నుపోటు పొడిచింది.
నాపై రాజకీయాలు ఆపి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి.
రాజకీయాలు కాదు, ప్రజల ఆప్యాయత ముఖ్యం.
నేను పాలకపక్షంలో లేను. విపక్షంలో ఉన్నాను.
నేను ఒంటరిని.. నాకంటూ ఎవ్వరూ లేరు.

ఈనాటి పాట


చిత్రం : రంగుల రాట్నం.

Writer: Shri Bhujangaraya Sarma.

కలిమి నిలవదూ లేమి మిగలదూ, కలకాలం ఒకరీతి గడవదూ, Wealth does not stay for ever, poverty does not remain for ever, time does not run in the same manner forever,
కలిమి నిలవదూ లేమి మిగలదూ, కలకాలం ఒకరీతి గడవదూ, Wealth does not stay for ever, poverty does not remain for ever, time does not run in the same manner forever,

నవ్విన కనులే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా the eyes which laughed will get moist.

ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం
ఇంతేరా ఈజీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life. a revolvng giant wheel. ||
ఆఆఆఆ అఆఆ ఆఆ humming.


ఏనుగుపైని నవాబూ, పల్లకిలోని షరాబూ, The nawab on the elephant, a shroff in the pallanquin,
గుఱ్ఱం మీది జనాబూ, గాడిదపైని గరీబూ, the Noble on the horse, the impoverished on the donkey,
నడిచే దారుల గమ్యమొక్కటే ... the direction all walk is the same,
ఆ ఆ ఆ ఆ అఅఆఆ, humming.
నడిచే దారుల గమ్యమొక్కటే ... the direction all walk is the same,
నడిపేవాడికి అందరొక్కటే ... all are equal for the driver,
ఇంతేరా ఈజీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life. a revolvng giant wheel. ||
ఆ ఆ ఆ ఆ అఆ humming.


కోరిక ఒకటి జనించూ, తీరక ఎడద దహించూ, A desire sprouts, relentlessly consumes the mind (or heart, if translated literally),
కోరనిదేదో వచ్చూ, శాంతిసుఖాలను తెచ్చూ, something unwanted arrives, and brings in peaee and comfort,
ఏది శాపమో ఏది వరమ్మో .. ఏది శాపమో ఏది వరమ్మో which is a curse and which is a gift, which is curse and which is gift,
అఅ ఆ అఅ ఆ humming,
ఏది శాపమో ఏది వరమ్మో .. ఏది శాపమో ఏది వరమ్మో which is a curse and which is a gift, which is curse and which is gift,
తెలిసీ తెలియక అలమటించుటే anguishing in darkness
ఇంతేరా ఈజీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life. a revolvng giant wheel. ||


త్యాగమొకరిది, ఫలితమొకరిదీ, sacrifice is for one, fruit is for another,
అమ్మ ప్రాణమా యిద్దరిదీ, mother's love is for both,
వ్యథలూ బాధలు, కష్టగాధలు, చివరికి కంటికి ఎన్నో కథలూ, miseries, sufferings, tales of hardships, at the end numerous stories for the eye,
ఇంతేరా ఈజీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life. a revolvng giant wheel. ||


ఆగదు వలపూ, ఆగదు వగపూ, love does not stop, sadness does not stop,
ఆగదు జీవనమాగదూ, life does not stop,
ఎవరు కులికినా, ఎవరు కుమిలినా, even if somebody wassails or somebody wails,
ఆగదు కాలం ఆగదూ time does not stop. ఇంతేరా ఈజీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life. a revolvng giant wheel. ||

కలిమి నిలవదూ, లేమి మిగలదూ, కలకాలం ఒకరీతి గడవదూ, నవ్విన కళ్ళే చెమ్మగిల్లునూ, వాడిన బ్రతుకే పచ్చగిల్లునూ. Wealth does not stay for ever, poverty does not remain for ever, time does not run in the same manner forever, the eyes which laughed will get moist.
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం|| This is all the life, a revolving giant wheel.
అఅ అఆఆ humming.


ఇరుగింటిలోన ఖేదం, పొరుగింటిలో ప్రమోదం, sorrow in this house, revelry in that house,
రాలిన పూలూ రెండూ, పూచే గుత్తులు మూడూ, flowers that dropped are two, clusters that blossom are three,
అఅఆ humming
ఒకరి కనులలో చీకటి రేయీ , ఇరువురి మనసుల వెన్నెల హాయీ, dark night in one's eyes, moonlight in minds of two,
అఅఆ ఆఆ humming
ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం|| This is all the life, a revolving giant wheel.
అఅ అఆఆ humming.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.