Tuesday, November 12, 2013

#056 Bifurcation of A.P. రాష్ట్ర విభజన

విభజన, బిజెపి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, హైదరాబాదు, తెలంగాణ, మెట్రో

భవిష్యత్ లోరాబోయే సమస్యలను దృష్టిలో ఉంచుకొని,వైబిరావు గాడిద, ఈరోజు 13.11.2013 బిజెపి ఢిల్లీకి , ఒక ఈమెయిల్ పంపటం జరిగింది.

1. Put up proposals to make Seemandhra three States North Andhra, South Andhra and Rayala Seema and save people from future agitations.

2. Union Territory a must for Hyderabad to save not only people of Seemandhra from KCR&Co, Kodandaram & Co, but also to save people of South TelangaNa, and Indians who wants to settle in Hyderabad.

3. Pl. put up a separate proposal for declaring all cities in India with population of more than 20 lakhs as Union Territories, to save them from 1. Zehadi terrorism, 2. Regional terrorism. Center shd administer law & order of these cities.

సామాన్య మానవుడిగా పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశానే తప్ప ఇతరులపై నా అభిప్రాయాన్ని రుద్దటం నా అభిమతం కాదు. ఇతర తెలుగు వారు కూడ తమ అభిప్రాయాలను బిజెపి కేంద్ర కార్యాలయానికి ఈక్రింది ఈమెయిల్ అడ్రస్ కి పంపచ్చు.

bjpco2006@gmail.com .

నేను పంపిన ఈమెయిళ్లు డెలివరికాక తిరిగి రాలేదు కాబట్టి, బిజెపికి చేరాయనే నమ్ముతున్నాను.

కాంగ్రెస్ కేంద్రకార్యాలయం యొక్క ఈమెయిల్ అడ్రస్ సంపాదించలేక పోయాను. పాఠకులు సహాయం చేస్తే కృతజ్ఞుడనై ఉంటాను

పై ఈమెయిల్ షుమారు తెలుగు అనువాదం.
సీమాంధ్రను మూడు రాష్ట్రాలుగా అంటే, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ గా ప్రతిపాదించండి. భవిష్యత్తులో ఆందోళనలు చెలరేగకుండా సీమాంధ్ర ప్రజలను రక్షించటానికి ఇది అవసరం.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం అవసరం. సీమాంధ్ర ప్రజలనే కాక, కెసీఆర్&కో, కోదండరాం&కో లనుండి దక్షిణ తెలంగాణ, మరియు భవిష్యత్తులో హైదరాబాదులో సెటిల్ కాగోరే భారతీయులను రక్షించటానికి కూడ ఇది అవసరం.

భారత్ లో 20 లక్షలు దాటిన ప్రతి నగరాన్ని కూడ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటానికి, ఒక ప్రత్యేక ప్రతిపాదన, తయారు చేయండి. మతతత్వ ఉగ్రవాదం, ప్రాంతీయవాద ఉగ్రవాదం నుండి ప్రజలను రక్షించటానికి ఇది అవసరం. ఈనగరాలలోని శాంతి భద్రతల పరిరక్షణను కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి.


నదీజలాల పంపిణీకి ప్రత్యేక సాధికారిక పరిపాలనా సంస్థ మొ|| వ్రాయవలసి ఉండింది. కానీ మర్చి పోయాను. ఇంకోసారి ప్రయత్నించగలను. సీమాంధ్ర ప్రజలందరు కూడ, బిజెపి కేంద్ర కార్యాలయాన్ని తమ అభిప్రాయాలతో ముంచెత్త వలసిన అవసరం ఉంది. సీమాంధ్ర బిజేపీ జిల్లా యూనిట్లు ఉదాసీనంగా ఉండటం దురదృష్టకరం. వారు పూర్తి స్థాయిలో సీమాంధ్రుల సమస్యలను వారి కేంద్ర కార్యాలయంతో ఎందుకు ప్రస్థావించటంలేదో తెలియదు. వారు కొంత మొక్కు తీర్చు కుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తోస్తుంది.

కెసిఆర్&కో, కోదండరాం&కో పై నాకేదో ప్రత్యేక రాగ ద్వేషాలున్నట్లు గా భావించరాదు. Readers may please NOT THINK that I have special hatred towards KCR&Co and Kodandaram&Co.

రాగ ద్వేషాలేవో వారికే ఫుల్ గా ఉన్నాయి. ఉదాహరణకు, హైదరాబాదు మెట్రోలో కొన్ని అవకతవకలు, కొంత అవినీతి జరిగి ఉండవచ్చు. దానిని బయటపెట్టటము తప్పు కాదు, వ్యతిరేకించటమూ తప్పుకాదు . కెసీఆర్ తాను అధికారంలోకి రాగానే దానిని కూలగొట్తానంటున్నాడు. కొంత పని నడచిన తరువాత కూలగొట్టటం ఎలా కుదురుతుంది. లోపాలను సరి చేయవచ్చు. అవినీతి సొమ్మును జప్తులు చేసి వసూలు చేయవచ్చు. ఆయన ఈమాటలను సిధ్ధిపేట ప్రజలను రెచ్చగొట్టటానికి అన్నట్లుగా కనిపిస్తుంది.

ఏది ఏమైనా, తెలంగాణా ప్రజలకు, సీమాంధ్ర ప్రజలకు, రాబోయే రోజులు గడ్డురోజులే.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.