
జానారెడ్డిసారు ఈ తెలివితేటలను మొదటినుండీ బహిర్గతం చేసి ఉంటే ఎంతో బాగుండేది. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో అందరూ డూడూ బసవన్నలే ననే విషయం తెలుగు వాళ్ళకి విదితమే. వారు అప్రమత్తంగా ఉండి ఉంటే వేల ఎకరాల భూముల పంద్యారం జరిగి ఉండేది కాదు. లక్షకోట్లరూపాయల తెలుగు వారి సంపద దోపిడీకి గురి అయ్యేది కాదు.
తామేది మాట్లాడినా సోనియా అండ (ఆమె స్వార్ధ అవసరం) ఉంటుందని తెలంగాణ నేతలు అర్ధం చేసుకున్నారు. ఇది ఒక బానిస లక్షణం. లక్షలాది మంది ప్రజలకు నేతృత్వం వహించే నేతలకు స్వతంత్ర వ్యక్తిత్వం , నిజాయితీ , నిర్భీతి, నిబద్ధత ఉండాలి. యజమానురాలి కొరకు కాకుండా, సత్యం కొరకు మాట్లాడటం, తెలుగు ప్రజలకు మేలు చేస్తుంది.
సీమాంధ్ర నేతలకు కూడ లోపించిన, ఈ స్వతంత్ర వ్యక్తిత్వం , నిజాయితీ , నిర్భీతి, నిబద్ధత అవసరం. సోనియా చేతిలో ఖంగు తిన్న తరువాత కూడ, వారు తమ బానిస బుద్ధిని వదలటంలేదు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ దూకుడుకు, కేంద్రం దూకుడుకూ, నిరసనగా రాజీనామా చేశాక, ఇంక ఢిల్లీ ముఖం చూడకూడదు. అధిష్ఠానం తన బుద్ధిని మార్చుకునె దాకా, వారు ఢిల్లీనుండి పిలుపు వచ్చినా వెళ్ళకూడదు. వాళ్ళు ఢిల్లీలోనే వేళ్ళాడుతూ, వాళ్ళ కాళ్ళూ, వీళ్ళకాళ్ళూ, పట్టుకుంటున్నారంటే, ఈ స్వతంత్ర వ్యక్తిత్వం , నిజాయితీ , నిర్భీతి, నిబద్ధత లేమియే మనకు కనిపిస్తుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.