Monday, February 22, 2016

670 Why buffalos, goats, and camels are not sacred? भैंस, बक्री, ऊँट क्यों पवित्र नहीं हैं ? బర్రెలు, మేకలు, ఒంటెలు ఎందుకు పవిత్రం కావు?


పండితులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఆవుని, శునకమును, శునకమాంసమును తినువానిని సమదృష్టితో చూస్తారని మన పవిత్ర గ్రంధం భగవద్గీత చెప్తూ ఉంటుంది. భగవద్గీత కర్మ సన్యాసయోగం ౧౮వ శ్లోకం KSY 018 vidyaavinayasampannee braahman`ee gavi hastini s`uni ca iva s`vapaakee ca pamd`itaa: samadars`ina. భగవద్గీత పూర్తి ఆంగ్ల పాఠం, సంస్కృతశ్లోకాలు ఆంగ్ల లిపిలో చదవాలనుకునే వారికి లింకు. : Click to go to Bhagavadgitayb.blogspot.com

దీనిని మన స్వాములవార్లు తూచా తప్పకుండా పాటిస్తారనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ఇతర మతాల పండితులు కూడ, విద్యావినయ సంపన్నులను, ఆవుని, శునకాన్ని, శునకమాంసాన్ని తినేవాడిని సమదృష్టతో చూస్తారనుకోటం కూడ భ్రమ.

మనకు స్వాములవార్లందరూ, గోమాతను పూజించమని చెప్తూ ఉంటారు. ఆనందమే. గోమాత మాత్రమే ఎందుకు పవిత్రము ? బర్రె మాత ఎందుకు పవిత్రము కాదు. ఒంటె మాత ఎందుకు పవిత్రము కాదు. మేక మాత ఎందుకు పవిత్రము కాదు. ఎక్కువ ఆవులు తెల్లగా ఉంటాయి కాబట్టి (కొన్ని కపిల గోవులు తప్ప) ఆవులకి ఎక్కువ పవిత్రత ఆపాదించి ఉండచ్చు. లేదా ఆర్యులు లాట్వియా లిథుయేనియా ప్రాంతం నుండి భారత్ కు వలస రావటం వల్ల వాళ్ళకు తెలుపు అంటే మోజు ఉండి ఉండవచ్చు. అంతే కాక వలస వచ్చిన ఆర్యులు తెల్ల వాళ్ళు కావటం వల్ల (తరువాత వర్ణ సంకరం వల్ల, హైబ్రిడ్ చామన చాయ ఆర్యులు, నల్ల ఆర్యులు ఉత్పత్తి అయ్యారు) వారికి తెల్ల జంతువులు ఎక్కువ పవిత్రంగా తోచి ఉండవచ్చు. మరి కల్యాణి కపిల ను పవిత్రంగా ఎందుకు పూజిస్తారు. నలుపు ఆవులు తక్కువగా ఉండటం వల్ల వాటికి విలువ పెరిగి ఉండవచ్చు. స్థానిక భారతీయులతో చెలిమి ఎక్కువ కావటం అయ్యాక నల్ల ఆవులని కూడ పూజించటం అలవర్చుకొని ఉండచ్చు. విచిత్రం ఏమిటంటే, స్థానిక భారతీయులతో చెలిమి పెరిగాక, బర్రె మాతలను, ఒంటె మాతలను, మేక మాతలను కూడ పవిత్రంగా భావించటం మొదలు పెట్టి ఉంటే, పండితులు సమ దర్శనులు అని గట్టిగా రూఢి అయ్యేది. ఇపుడు పండితులు (స్వాముల వార్లతో సహా ) సమ దృష్టులు కాదేమో ననే అనుమానం కలుగుతుంది.

మహా భారత కాలపు ఆర్యులు ఆవులను గోధనంగా భావించినట్లు కనిపిస్తుంది. ధర్మరాజు గారి అశ్వమేథయాగంలో ఎద్దులను బలి ఇవ్వటం గురించి ఉన్నది. దీని గురించి చదవాలనుకునే వారికి లింకు Click to go to Post No. 553.

మహా భారతం, అరణ్య పర్వం ౨౧౨ వ ఆధ్యాయం 212 ఆధ్యాయం ప్రకారం, రంతి దేవుడు అనే గొప్ప పుణ్యాత్మ మహారాజుగారు, బ్రాహ్మణులు చాతుర్మాస్యం తన రాజ్యంలో జరుపుకోటానికి వీలుగా , వారికి రోజూ ౨౦౦౦ ఆవులను ఎద్దులను వధించి భోజనాలు పెట్టించే వారు. (ఇదే రంతి దేవ పుణ్యాత్ములవారు మహాభాగవతం ప్రకారం, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి అనే పద్యం ప్రకారం, ఒక చండాలుడి దాహం తీర్చటానికి కరువుకాలంలో తాను తాగాల్సిన నీటినే త్యాగం చేశారు). దీనిని చదవాలనుకున్నవారు పోస్టు నంబర్ ౬౨౮ చూడండి. Click to go to Post No. 628.

రామాయణ కాలంలో కూడ గో మాంసాన్ని భుజించే వారనటానికి, వశిష్ఠుడు కల్యాణి కపిలను మడమడాయించిన విషయాన్ని, భవభూతి ఉత్తరరామచరిత్ర లోని తృతీయ విష్కంభం లో సీనియర్ శిష్యుడు, జూనియర్ శిష్యుడు భండాయనుడు మరియు సౌదామినులకు జరిగిని చర్చను కూడిన సాక్ష్యాలను చదవటానికి లింకుః Click to go to Ramayanayb.blogspot.com, post NO. 036.

భారత్ టీవీ అనే తెలుగు ఛానెల్ లో ఈ రోజు అంటే ౨౨.౦౨.౨౦౧౬ నాడు, స్వామి వివేకానందా గారిపై ఒక దీర్ఘమైన వార్తను ప్రసారం చేసారు. ఈ వార్త ప్రకారం, భారత్ లోని యువత అంతా కనీసం రోజులో ఒక గంటను స్వామీ వివేకానంద గారి గురించి ఆయన వ్రాసిన గ్రంథాలను చదివి ఆయనను ఆదర్శంగాతీసుకుని తమ జీవితాలను మలుచుకోవాలని చెప్పారు. నిజంగా స్వామీ వివేకానంద గారి రచనలను లోతుగా చదివితే ఆయనలాగా ఉండటం కన్నా మనం మనంగా ఉండటమే నయమని తెలుస్తుంది.

స్వామీ వివేకానంద గారి గురించి ఈ టీవీ ఛానెల్ వారు ప్రసారం చేసిన దానిలో, స్వామీ వివేకానంద గారి మూడు బీ లు అంటే బైసెప్సు, భగవద్గీత, మరియు బీఫ్ లలో రెండు బీ లను గురించి మాత్రమే చెప్పారు. స్వామీజీ మూడో బీ అంటే బీఫ్ గురించి చెప్పలేదు. దానిని ప్రస్తావిస్తే డేంజర్ కాబట్టి ప్రస్తావించలేదు అనే అనుమానం కలుగుతుంది. స్వామీజీ విదేశాలలో తిరిగినంత కాలం భీఫ్ ను మామూలుగానే తీసుకునే వారు. దీని గురించి చదవాలనుకునేవారు, అయనకు ఆయన దక్షిణాత్య శిష్యులు మధ్య వ్రాసుకున్న లేఖలను చదవచ్చు. నా ఆహారం గురించి అడగద్దు అని భావం అన్నమాట.

స్వామీజీ భారతీయ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఎంతో ఉత్తేజ పరిస్తే పరచి ఉండచ్చు. కానీ స్వామీజీకి విక్టోరియా రాణి గారంటే మహా భక్తి. ఆమె పట్టాభిషేక స్వర్ణోత్సవానికి వెళ్ళాలనుకుంటే, డాక్టర్లు వెళ్ళనివ్వ లేదని, ఎంతో బాధ పడుతు ఖేత్రీ రాజుగారికి ఒక లేఖ వ్రాశారు. అంటే గొప్ప విక్టోరియా భక్తుడన్నమాట.

స్వామీజీని ఆదర్శంగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఆయన అన్నట్లుగానే భారత్ ను కుళ్ళన శవం, జెల్లీ చేప అని ఒప్పుకోవాల్సి వస్తుంది. తమ తమ పొట్టలను షాడ్ అనే చేపలతోనూ, తాబేళ్ళతోనూ, ఫుల్ గా నింపుకోవాల్సి వస్తుంది. స్వామీజీ పై ఇన్ని అభాండాలా అనుకునే వాళ్ళు ఆయన సంపూర్ణ రచనలను, ముఖ్యంగా క్రిస్టినా గ్రీన్ స్టైడల్ అనే అమ్మాయికి వ్రాసిన లేఖలను (వీటీని ఎపిజిల్స్ అంటారు) లోతుగా చదవచ్చు.

ఆయన లాగానే చుట్టపీకలను కన్యాశుల్కంలో గిరీశంలాగా గుప్పు గుప్పు మనటం నేర్చుకోవాల్సి ఉంటుంది. విదేశాలలలో ఏవరైనా పుణ్యాత్మురాలు, రోజూ మూడు పూటలా పప్పన్నాన్ని పెట్తే, ఆవిడ విసుక్కుందని ఆతిథ్యం ఇచ్చిన వాడినే , మీరెప్పుడైనా నాకు చుట్టపీకలు ఇచ్చారా అనాల్సి ఉంటుంది. మద్యాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద హోటళ్ళలో దిగటం నేర్చుకోవాల్సి ఉంటుంది.

పాశ్ఛాత్యలముందు మనం ఏమి వాపోవాలంటే, మేను కలకత్తాలో సన్యాసి వేషంలో భిక్షం ఎత్తుకున్నప్పుడు, కలకత్తా పతివ్రతా మణులు మాకు చద్ది చపాతీలు పెట్టేవాళ్ళు. అని వాళ్ళ సానుభూతి చూరగొనాల్సి వస్తుంది.

Another thing observed in this news item is: School children have been made to get by heart teacher-dictated speeches praising Vivekananda, which invariably contained the quotation "Arise, Awake, and Stop not till thy goal is achieved". The children repeated like parrots, whatever their teachers taught them. The children do not know, Vivekananda himself fell flat with numerous self-responsible diseases, at an age of just 39.

The parrot-like-speaking Children did not know that Vivekananda himself was superstitious, when he sacrificed a goat for Durga Pooja Festival, ten months before his death. What Vivekam (wisdom) was there in sacrificing a goat to a Divine Mother Goddess, who is supposed to be kind to her children, even if a goat she is not fed with goat's meat as nivEdan. What did our Vivekananda understand of Divine Mother? It is the wife of Ramakrishna Paramahamsa, her name "Sarada Devi", who introduced the system of offering banana fruits at Belur Math. Not the World Famous Vivekananda. This proves that an illiterate Indian Wife has more wisdom than the World Prophet.

Our TV content-producers, anchors, have to study a lot and come out with more and more facts. This is because, TV Channels today are the most powerful media which can modify INdian & Indian-Telugu behaviors.

ఆలీఘ్రర్ ముస్లిం విశ్వవిద్యాలయం వారి క్యాంటీన్ లో ఆవు మాంసం వడ్డించారని ఒక దుమారం రేగింది. ఆయూనివర్సిటీ వారు , తమ కాంటీన్ లో వడ్డించింది బర్రె మాంసమే కానీ ఆవు మాంసం కాదని వాపోయారు.

సగం పెట్టి మేనత్త అని ఒకడన్నాడుట, అనే సామెత గురించి ఇప్పటికే వ్రాసి ఉన్నాను. జంతువులయందు సమ దృష్టతో కరుణను చూపాలనుకుంటే, అవులతో పాటు, గేదెలు, మేకలు, ఒంటెలు మొ. పాలిచ్చి మనల్లి బ్రతికించే అన్ని జంతువుల ఎడల మనం మన కృతజ్ఞతను చూపటం న్యాయం. లేదా, విద్యా వినయ సంపన్నే అనే గీతాశ్లోకాన్ని మేము ఆచరించము అనిచెప్పినా సరిపోతుంది.

ENGLISH and HINDI Versions, I shall try to add in due course.

This particular blog post will be subject to revision, to eliminate views which may hurt the sentiments of our readers.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.