Tuesday, February 2, 2016

655 స్మార్ట్ నగరాలకు స్మార్ట్ నాయకులు, స్మార్ట్ ప్రజలు, స్మార్ట్ పరిష్కారాలు, అహాహా, అహ్హహ్హా స్మార్ట్ ప్రజలారా కాకినాడ వాసులారా, విశాఖ పురజనులారా !!!


కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఆంధ్రజోతి దిన పత్రికలో ఒక పేద్ద వ్యాసం వ్రాశారు. తత్ పత్రిక వారు ఎంతో భక్తి శ్రధ్ధలతో దానిని సంపాదకీయం పేజీలో ప్రచురించారు. తేదీ 31.01.2016. చదవాలనుకునే వారికి ఇదిగో లింకు. Click to go to Andhra Jyothy dated 31.1.2016 Sunday. . ఈ వ్యాసం శీర్షిక : " దేశం రూపు రేఖలు మార్చేసే స్మార్ట్ విప్లవం." . మారెను లే ఈ దేశం రూపురేఖల్ .!!! స్మార్ట్ ప్రజలారా కాకినాడ వాసులారా, విశాఖ పురజనులారా !!! Smart Leaders, Smart People, Smart Solutions for Smart Cities. Get Ready to work as Security Guards and Proclain Operators.
...వీటిని మించి, ఈ ప్రభుత్వం అగ్రప్రాధాన్యం ఇస్తున్న అందుబాటులో గృహ వసతి అనేదానికి ఈ మిషన్‌ ద్వారా మరింత ఊపు లభిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది.. స్మార్ట్‌ నగరాల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడానికి దోహదం చేస్తుంది. నిర్దిష్టంగా నగరాల్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రైవేటు రంగంలోని, ప్రత్యేకించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని కంపెనీలకు సమృద్ధిగా అవకాశాలు లభిస్తాయి.స్మార్ట్ నగరాలకు స్మార్ట్ నాయకులు, స్మార్ట్ ప్రజలు, స్మార్ట్ పరిష్కారాలు కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సఫలం కాగలుగుతాం. నగరాలు ఉన్నపళంగా నిర్మాణం లేదా పునర్నిర్మాణం అయ్యేవి కాదు. అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందుకు పునాదులు వేసి.. మార్గనిర్దేశనం చేశారు. ...


స్మార్ట్ సిటీలు గా అవకాశాలు పొందనున్న విశాఖ, తిరుపతి నగరా లలో, ఇప్పటికే స్పెక్యులేటర్లు ఆ నగరాల చుట్టూ కనీసం యాభయి కిలోమీటర్ల వ్యాసార్ధం వరకు ప్రతి అంగుళం భూమినీ కొనేసి తమ ముడ్డి క్రింద పెట్టుకున్నారు. ఇంక విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల విషయం చెప్ప నలవికాదు. ఇలా కొన్న బడ్డ భూములలో వ్యవసాయం ఆగిపోయి బంజర్లుగా మారాయి. ఇంక వ్యవసాయ రంగం అభివృధ్ధి కమ్మంటే ఎలా అవుతుంది.

పోనీ వాటిల్లో ఇళ్ళన్నా నిర్మిస్తున్నారా అంటే అదీ లేదు. ఎప్పుడో భారీగా రేట్లు పెరుగుతాయని , ఆ భూములను అలా పెట్టుకు కూర్చున్నారు. వృధ్ధ రాజు దగ్గర ఐదువేల మంది రాణులు తృతీయ ప్రకృతి వారి చేత కాపలా చేయబడుతున్నట్లుగా ఆభూములు దిగజారి పోయాయి. రాజు ఆ 5000 రాణులను ఎలా గైతే అనుభవించలేడో, ఇతరులను అనుభవించనివ్వడో, అలాగే నగరాలనుండి యాభియి కిలోమీటర్ల లోపు ఉండే భూములన్నీ సమాధి రాళ్ళులాగా ప్లాట్ల సరిహద్దు రాళ్ళతో నిండి పోయాయి. ఎవడన్నా పేదవాడు , ఈ నగరాల్లో నివసించే వాడు ఒక వంద గజాలు కొనుక్కుని చిన్న రేకుల షెడ్ వేసుకుందామన్నా జానెడు స్థలం దొరకట్లేదు.

లంచావతారాలు అయిన ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలు బినామీ పేర్లతో కొంటే కొని ఉండవచ్చు. నాకు ఒక మిత్రుడు చెప్పాడు. ఒక ప్రభుత్వాధికారి తన పెళ్ళాం పిల్లల పేర్లతో 70 ప్లాట్లు కొనిపారేసాడు. పోతూపోతూ, వాటిని స్వర్గానికి తీసుకెళ్ళలేడు కాబట్టి, మన రాజశేఖర్ రెడ్డిగారి లాగానే అన్ని ఈ భూమి పైనే వదిలేసి అమరుడయ్యాడు. అయితే మన స్వర్గస్థ స్మార్ట్ అధికారి గారి పుత్రుడు స్మార్ట్ సాఫ్టువేర్ ఇంజనీరు కావటంతో లండన్ పోయి బ్రిటీష్ వాళ్ళు వద్దంటున్నా వాళ్ళకు టాయ్ లెట్ పేపర్లతో వాళ్ళ ముడ్డి తుడుస్తూ, తన ముడ్డి తుడుచుకోటానికి తీరికలేక బాధ పడుతున్నాడు. ఇలాటి పరిస్థితులలో, తండ్రి వదిలేసి పోయిన 70 ప్లాట్లను వెతికి పట్టుకుని, వాటిని అమ్మి సొమ్ము చేసుకుని, ఆ డబ్బును హవాలాలో లండన్ పంపించుకునే, అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలనే అతగాడి కోరిక నెరవేరటం లేదు.

అయితే , ఈ స్పెక్యులేటర్లు అందరూ, ఈ భూములను స్వంత డబ్బులతో కొనలేదు. వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, రకరకాల పేర్లతో , బ్యాంకులనుండి రకరకాల అప్పులను గుంజి, ఆనిధులను దారి మళ్ళించి భూముల స్పెక్యులేషన్ లో పెట్టారు. అలా కొన్న భూములను అమ్మినా బ్యాంకు లోన్లను కట్టరు. కారణమేమంటే, అమ్మినపుడు వచ్చే డబ్బులో అధిక భాగం నల్ల డబ్బే, బ్యాంకుల్లో కట్టటానికి పనికి రానిది. ఫిలితంగా భూములను అమ్మినా , అమ్మక పోయినా బ్యాంకుల అప్పులు ఎన్ పీ ఏ లు (నిరర్ధక ఆస్తులు) గా మారిపోయాయి. స్టాకుల్లేని గోడౌన్లను బ్యాంకులు స్వాధీనం చేసుకుని సరుకును అమ్మకానికి పెట్టలేవు. ఫలితంగా , బ్యాంకుల అధికారులు తేలుకుట్టిన దొంగల్లాగా ఊరుకుంటున్నారు. స్పెక్యులేటర్లు భూములను తెల్ల డబ్బుకు భూములను అమ్మి ఋణాలు కట్టే దాకా బ్యాంకుల అధికారులు ఏడుస్తూ కూర్చోవాల్సిందే. పై గా వారికి హామీగా ఇచ్చిన ఆస్తులను బ్యాంకులు అమ్మటానికి పూనుకున్నా, కొనుగోలుదారులు ముందుకు రాకుండా, స్పెక్యులేటర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీ ఆర్ టీ (డెట్ రీ కవరీ ట్రిబ్యునల్ అనే ప్రత్యేక న్యాయస్థానాలు) లకు వెళ్ళినా జాప్యమే తప్ప అప్పులు తిరిగి రావటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు గ్రామ కంఠం అనే పదం అర్ధాన్నే మార్చి పారేసి, గ్రామాల భూములను ఆక్రమణ దారులకు (అనగా తమ పార్టీ వారే అని వేరుగా చెప్పనవసరం లేదు.) పంచి పెడదామనుకుంటున్నట్లుగానే, నగర కంఠాలు అనే పదాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇది ఒక రకంగా, 2008 లో అమెరికాలో జరిగిన సబ్ ప్రైమ్ ఋణాల కుంభకోణం వంటిదే. 2008 లో అమెరికాలో అమెరికన్ ప్రభుత్వం, ఫెడ్రరల్ రిజర్వు బ్యాంకు కొన్ని ఉద్దీపకాలు పేరుతో వేల కోట్ల డాలర్లను ఋణాలు గా ఇచ్చి ఆబ్యాంకులను ఆదుకున్నాయి. భారత్ లో, కేంద్ర ప్రభుత్వం, బాసెల్ త్రీ ప్రమాణాలు అనే స్విట్జర్లాండులో జరిగిన అంతర్జాతీయ బ్యాంకింగు ప్రమాణాల ఒప్పందం వల్ల తప్పనిసరి అయి ప్రభుత్వరంగ బ్యాంకులకు బడ్జెట్ ద్వారా ఎంతో కొంత పెట్టుబడులను సమకూరుస్తున్నది. ఇంక ప్రైవేటు రంగ బ్యాంకుల విషయానికి వస్తే ఆ అవకాశం ఉండదు కాబట్టి అవి ఇసుకమేడలు లాగా తయారయ్యాయి.తస్మాత్ జాగ్రత్త
అక్కడ పనిచేసే వాళ్ళకు మటుకు ఆ నగరాలలో ఉండే అర్హత ఉండదు. వాళ్ళు తమ కుటుంబాలను తమ గ్రామాల్లోనే వదిలేసి రావాలి. ౧౫ రోజులకు ఒకసారి తమ గ్రామాలకు వెళ్ళి మదన కార్యాలు చేసుకుని రావాలి. పిల్లలను బుజ్జగించుకుని, బై బై చెప్పించుకుని మళ్ళీ డ్యూటీ టైముకు వెనక్కి వచ్చి వాలాలి. గ్రామీణులారా బీ స్మార్ట్ !!!

Tail piece धूमकेतु తోక చుక్క

బడా వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు స్పెక్యులేషన్ కు దారి మళ్ళించగా, ఖాళీ అయిన బ్యాంకుల ఖజానాలకు అదనంగా డబ్బును పంపితేకానీ అవి, అదే బడా వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలకు కొత్త బినామీ పేర్లతో కొత్త ఋణాలను ఇవ్వలేవు. అలా ఇచ్చిన కొత్త ఋణాల లోంచి కొన్ని కోట్లను దారి మళ్ళించి పాత ఋణాలను కట్టించినట్లుగా చూపించే అవకాశాలు మెరుగవుతాయి. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు. పాత ఋణాలను వసూలు చేసినట్లుగా చూపించ వచ్చు. కొత్త ఋణాలను ఇచ్చి పారిశ్రామిక రంగాన్ని ఆదుకున్నట్లుగా డబ్బా కొట్టుకోవచ్చు.

ఈ క్రింది ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టును చూడండి. మన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత సేనుల వారు, ౩౦.౧.౨౦౧౬ నాడు, బాసెల్ ౩ నియమాలను గౌరవించటానికి వీలుగా బ్యాంకులకు, ఈ ఏడాది ఓ రూ. ౨౫,౦౦౦ కోట్లు, వచ్చే ఏడాది ఇంకో రూ. ౨౫,౦౦౦ కోట్లు పెట్టుబడులను సమకూరుస్తామని చెప్పారు. ఇదిగో లింకు. Click to go to Indian Express వెళ్ళటానికి క్లిక్ చేయండి

ఈ వార్తలోనే శ్రీ జయంత సేనుల వారు ఒక గొప్ప విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉండటం వల్ల మసాలా బాండ్ల జారీ ఆలస్యం అయిందిట. త్వరలో నే అంతర్జాతీయ మార్కెట్లు కోలుకుంటాయిట. కొద్ది రోజుల్లోనే మసాలా బాండ్లు రోడ్డు మీదికి వస్తాయిట. ఆహాహా , ఆహాహా. స్మార్ట్ నగరాలకు స్మార్ట్ నాయకులు, స్మార్ట్ ప్రజలు, స్మార్ట్ పరిష్కారాలు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా. భారత ప్రజలారా. మీ అందరికీ రాబోయే ప్రైవటు కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే అవకాశాలు రాబోతున్నాయి. అద్దాల తలుపులు తుడుస్తూ మీ విదిశీ, స్వదేశీ ఘరానా యజమానులకు శాల్యూట్ చేయటం ప్రాక్టస్ చేసుకోండి. డ్రెస్ లు, క్యాప్ లు మటుకూ, మీ డబ్బులతో మీరే కొనుక్కోవాలి సుమా. మీకు ఈ భోగం, ఈ సంభోగం ఇష్టం లేక పోతే క్రేన్ లను, ప్రొక్లెయిన్ లను, ఇసకలారీలను నడపటం నేర్చుకోండి. ఎండవేడికి తట్టుకోలేక వేపచెట్టన నీడల్లో పండుకోటం మానేయండి. ఉపుడు మీరు మధ్య మధ్య క్యాబిన్ లలో పెద్ద సార్లు లేనపుడు, వాళ్ళ క్యాబిన్ లలో ఎసీ లు వేసుకుని సేద తీరవచ్చులే .

To continue. सशेष. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.