Monday, December 7, 2015

627 Part 2 of how to make Telugu language an International Language भाग २ तॆलुगु को एक अंतर्जातीय भाषा बनाने के मार्ग विवरण భాగం ౨ తెలుగును అంతర్ జాతీయ భాషగా చేయటానికి మార్గాలు, పరిష్కారాలు

Link to Part 1 of this post: Click to go to post No. 605.
World Language: English National Language: Hindi Mother Tongue: Telugu spoken by 100 million people
There seems to be some problem for some readers to read the Telugu fonts available on this blogsite. इस ब्लाग सैट पर दिखनेवाले तॆलुगु लिपि अक्षरों (फांट) में कुछ समस्याये दिख रहे हैं। क्यों कि एक मित्र ने सानुभूती से मुझे भेजा कुछ तॆलुगु फांट्स। वे कहाँ कि मै गौतमी तॆलुगु फाँट उपयोग कर रहा हुँ। दूसरे फांट को उपयोग करने के लिये सुझाव दिया। మన బ్లాగు పై వ్రాయబడుతున్న తెలుగు అక్షర లిపులను చదవటంలో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఎందుకంటే, ఒక మిత్రుడు నాపై సానుభూతితో మీరు గౌతమి ఫాంట్ వాడుతున్నట్లు కనపడుతున్నది. మీ ఉపయోగానికి కొన్ని ఫాంట్లను పంపుతున్నాను, అనివ్రాసి కొన్ని ఫాంట్లను పంపారు. పంపుతూ ఒక కొత్త పదం ఖతులు (ఏక వచనం ఖతి అయి ఉండాలి) అనే పదానికి ఫాంట్లకు ఉపయోగించారు.
I do not use Gautami font. I use Linux flavors Ubuntu or Linux Mint Operating Systems. They have a good Language support for Indian Languages. Default language we use in Linux in general seems to be Lohit_Telugu ttf. I have with me around 25 ttf fonts. मै गौतमी फांट उपयोग नहीं करता हूँ। मै लैनक्स आपरेटिंग सिस्टम में सौरभें उबुंटू या लैनक्स मिंट ओ ऎस उपयोग करता हूँ। वे बहुत अछ्छे भारतीय भाषा सपोर्ट देते हैं। लैनक्स लांग्वेज सपोरट् डिफाल्ट फांट लोहित-तॆलुगु दिख रहा है। उसको उपयोग करने में मुझे कुछ तकलीफ नहीं दिख रहा है। लोहित तॆलुगु टीटीऎफ फांट को विंडोस यूजर्स को भी मै दिया। वे भी किसी समस्या मुझे नहीं बताये। मेरा पास इंटरनॆट से आयात किया हुआ २५ तॆलुगु फांट्स हैं। నేను గౌతమి ఫాంట్ ను వాడను. అది విండోస్ ఫాంట్ లాగా కనిపిస్తుంది. డీటీపీ సాఫ్ట్ వేర్ అనూ ఫాంట్సలో కూడ ఉన్నట్లు గుర్తు. నేను స్వేఛ్ఛకు సంకేతమైన ఓపెన్ సోర్సు మరియు సర్వోచితం (సర్వం పైసా ఖర్చులేకుండా ఉచితం. పేదల పాలిట పెన్నిథి సామ్యవాదం వంటిది) కావటం వల్ల లైనక్సు ఆధారిత ఆపరేటింగు వ్యవస్థలను వాడుతాను. వీటిలో భారతీయ భాషలకు చక్కని సపోర్టు ఉన్నది. జనరల్ గా లైనక్సు లో లోహిత్ తెలుగు ఫాంట్ డిఫాల్టుగా ఉన్నట్లు తోస్తుంది. ఈ డిఫాల్టు ఫాంటును, దీని లోహిత్ హిందీ ఫాంట్ ను నేను కొందరు విండోస్ ఓ ఎస్ ను వాడే మిత్రులకు కూడ ఇచ్చాను. వారు కూడ వీటిని వాడుతున్నారు. వారు ఈ లోహిత్ తెలుగు, లోహిత హిందీలతో సమస్యలున్నట్లుగా నా దృష్టికి తీసుకు రాలేదు.
First I type my trilingual (English, Hindi, Telugu) blog posts in the three languages in a linux text-editor cum IDE called GEANY PORTABLE VERSION (it is also free), with all the html tags, tables etc. using Lohit-Hindi and Lohit-Telugu fonts and then paste the content in the blog editor provided by the Blogger for blogspot. When I edit my text in Geany Text Editor, I do not find script-rendering-related problems/errors. After pasting the content in blogger text editor, and updating the blog, some Hindi conjunctional letters such as Otvam (vowel O) appear to be as 'aum' or 'au'. Except this I do not find any script related Hindi errors in the final blog output in Firefox browser. There seems to be some problem in Opera in rendering combination forms. मै पहले मेरा त्रि भाषा ब्लाग पोस्ट को (इंग्लीष, हिन्दी, तॆलुगु भाषाओं में) जीयेनी नामक ऎक टॆक्सट् ऎडिटर और ऐ डी ई पोर्टबुल वॆर्षन् में (वह भी सर्वोचित है), कीबोर्ड ले अवुट को बदलते बदलते टैप करता हूँ। हॆच टी ऎम ऎल् टाग्स भी टॆक्स्ट ऎडिटर में ही टैप करता हूँ। संकलन करने के बाद, पूरे व्यास को कंट्रोल सी, कंट्रोल वी पध्धती मे, ब्लागर ऎडिटर् में पोस्ट करता हूँ। जब मै लोहित हिंदी, लोहित तॆलुगु में मै टैप करने के समय पर कुछ स्क्रिप्ट रॆंडरिंग संबंधित कुछ गलती मुझे नहीं दिखते हैं। बल्गार ऎडिटर में पेस्ट करने के बाद, पोस्ट को अपडेट करने के बाद, मै जब मेरे ब्लाग को फैर फाक्स ब्रौजर में खोल कर चॆक करता हूँ। तब मुझे तॆलुगु स्क्रिप्ट रॆंडरिंग में कुछ गलतिया नहीं दिख रहे हैं। हिन्दी में भी सिर्फ एक या दो वोवॆल्स को कानसोनॆंट्स को जायिन करने में कुछ स्क्रिप्ट् रॆंडरिंगि दोष दिख रहे हैं। उन दोषों को आप इस पेराग्राफ में भी आप देख सकते हैं। लेकिन, हिन्दी हो या तॆलुगु हो, स्क्रिप्ट कभी भी गार्बेज नहीं हो रहा है। ओपेरा ब्रौजर में तॆलुगु वोवॆल् और कानसोनॆंट जायिनिंग में कुछ प्राब्लॆम्स दिख रहे हैं। నేను ముందుగా ఈ త్రిభాషా (English, Hindi, Telugu, three languages) బ్లాగ్ పోస్టును, జీ ఎనీ అనే పోర్టబుల్ వెర్షన్ సర్వోచిత (ఫ్రీ, మరియు ఓపెన్ సోర్సు) టెక్స్టు ఎడిటర్లో , హెచ్ టీ ఎమ్ ఎల్ , టేబుల్ టాగ్ లతో సహా, మూడు భాషలలో కీబోర్డును మార్చుకుంటూ టైప్ చేస్తాను. తరువాత టైప్ చేసిన వ్యాసాన్ని కంట్రోల్ సీ & కంట్రోల్ వీ లను ఉపయోగించి బ్లాగర్ టెక్స్టు ఎడిటర్ లో పేస్టు చేస్తాను. టైప్ చేసేటపుడు మాటర్ లోహిత్ హిందీ, లోహిత్ తెలుగు లోనే ఉంటాయి. తరువాత బ్లాగర్ ఎడిటర్ వారికి వేరొక హిందీ తెలుగు ఫాంట్లు ఉన్నట్లు ఉన్నాయి. కనుక హిందీ తెలుగు అక్షరాలు తమ రూపాలను మార్చుకుని వేరొక ఫాంట్లో (మిత్రుడు చెప్పినట్లుగా తెలుగులో గౌతమి కావచ్చు) ప్రత్యక్షమవుతాయి. బ్లాగ్ ను అపడేట్ చేశాక, నేను ఫైర్ ఫాక్స్ బ్రవుజర్లో ఎల వచ్చిందా అనే దానిని నేను చెక్ చేసుకుంటాను. నా దృష్టి పెద్దగా ఫాంట్ల పై ఉండదు. ఎవరినైనా గాయపరచే విషయాలు వ్రాశానా , లేక అవాస్తవాలను వాస్తవాలుగా చలామణీ చేయాలని చూశానా, నేను చేయని వాటిని ఇతరులు చేయాలని వృథా నీతి బోధనలు చేశానా (జీ ఎనీ లో టైపు చేసే సమయంలో కొన్ని సార్లు భావాలు కలగా పులగం అయి, ఈపొరపాట్లు జరగచ్చు). అందుకని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేశాక, సైధ్ధాంతిక అంశాలను,భావపరమైన అంశాలను, ఆచరణాత్మకమైన అంశాలను పరిశీలించుకుని వీలైనంత వరకు సరిదిద్దుతాను. ఫాంట్ల పై అంతగా దృష్టి పెట్టను. అయితే హిందీ ఫాంట్ల విషయంలో గుణింతాలు ముఖ్యంగా ఓత్వం 'అవు' 'అవుం' అని విడిగా వస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలుగు ఫాంట్ల విషయంలో, పాఠకుల బ్రౌజర్లలో లోహిత్ తెలుగు కాకుండా ఇతర ఫాంట్లలో (అక్కడి డిఫాల్టులను బట్టి, లేక అక్కడ రీడర్ తన బ్రౌజర్ ప్రి ఫరెన్సులలోకి వెళ్ళి తాను పెట్టుకున్న ఫాంట్ ను బట్టి ఫాంట్లు భిన్నమైనవి కనిపించే ఆవకాశం ఉంది.
Hence, what appears to be is: Even if we type the matter in Lohit Telugu , Lohit Hindi or some other font, and paste in the blog editors, Blog Site provider seems to be supply his own fonts to readers. Even if the Blogsite provider does not change the font, the browser-provider (Firefox etc.) may have a different default font. Then ultimately, the final reader himself can choose the font he wants for reading html pages on internet, by altering his preferences. Thus in a practical sense, the decision of which font is to be exhibited on his blog, (in case of Indian languages) does no really rest with blog writers. Blogsite providers, Browser providers, Readers themselves may be choosing their own fonts. अतः यह मुझे दिख रहा है कि : हम हमारे टॆक्सट को लोहित हिन्दी या लोहित तॆलुगु फांट में टैप किये और ब्लाग एडिटरों में पेस्ट किये तो भी, ब्लागसैट दाता, ब्रौजर दाता, पाठकों के निर्णय अंतिम होते हैं। भारतीय भाषा ब्लागरों को फांट्स विषयों स्वेछ्छा कम दिख रहा है। కాబట్టి, భారతీయ భాషల విషయంలో మనకు కనిపించేది ఏమిటంటే, మనం బ్లాగును ఆఫ్ లైన్ లో టైపు చేసేటపుడు ఏ ఫాంటును , ఏ ఓ ఎస్ ను, ఏ టెక్స్టు ఎడిటర్ ను ఉపయోగించి టైప్ చేసినా, అది కంట్రోల్ కాపీ కంట్రోల్ పేస్టు అప్ డేట్ అయ్యాక, బ్లాగ్ సైట్ దాత నిర్ణయాన్ని బట్టి, బ్రౌజర్ దాత నిర్ణయాన్ని బట్టి, రీడర్ లు తమ బ్రౌజర్లకు సెట్ చేసుకున్న ప్రిఫరెన్సులను బట్టి, పాఠకుల బ్రౌజర్లలో ఏ ఫాంట్ కనపడుతుంది అనేది నిర్ణయమవుతున్నట్లుగా తోస్తుంది. హిందీ మరియు తెలుగు కొన్ని ఫాంట్ల విషయంలో అవి టీటీఎఫ్ అయినా , కేవలం విండోస్ వే అయినా, గుణింతాలు, ఒత్తులు కొన్ని సరిగ్గా అతుక్కుంటున్నట్లు గా కనపడదు. స్థాలిత్యాలుఉంటూనే ఉంటాయి. ఈవిషయంలో మనం యూనీ కోడ్ ను కానీ యూటీఎఫ్ ను గానీ మనం తప్పు పట్టలేం. ఎందుకంటే, వాటి పని యూటీఎఫ్ లో కోడీకరించ బడిన గ్లిఫ్ లను హిందీ తెలుగులో కనిపించేలా చేయటమే తప్ప, ఫాంట్లకు మెరుగులు పెట్టటం కాదు. గతంలో నేను కొంత కాలం తిక్కన అనే ఫాంట్ ను వాడాను. ఇది చాలా సుందరమైన ఫాంటు. కానీ తలకట్టులను మింగుతూ ఉండేది. దాని ప్రాబ్లెం దాని గ్లిఫ్ లలో ఉన్నట్లు కనిపిస్తుంది. తిక్కన ఫాంట్ సమస్యాత్మకంగా తయారవటంతో దానిని వాడటం మానేశాను. ఆలాగే వేమన ఫాంట్ చాల సుందరమైనది. కానీబ్లాగర్ డిఫాల్టులలో దానికి సపోర్టు ఉన్నట్లు తోచదు. అందుచేత మనం వేమనలో టైప్ చేసి, బ్లాగర్ లో పేస్టు చేసినా, బ్లాగర్ డిఫాల్టు గాని, బ్రౌజర్ డిఫాల్టును గానీ, రీడర్ ఎంపికలతో మార్పు చేయబడిన బ్రౌజర్ గానీ, వేమన బదులుగా వేరొకదానిని చూపవచ్చు.
English translation will be typed later. Hindi translation will be typed later. తెలుగు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాశ్చాత్యులో మరొకరో మనకి అన్నీ తయారు చేసి ఉచితంగానో లేక తక్కువ రేట్లకో అందిస్తున్నారు కాబట్టి మనం పరభాగ్యోపజీవులుగా తయారు కాకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది. పాపం కదా అని పాతగుడ్డ ఇస్తే మూర కొల్చుకున్నాడట, అని.

సరియైన తెలుగు ఫాంట్లు లేక, రాష్ట్ర ప్రభుత్వాలకు వీటిపై సరియైన అవగాహన లేక, ప్రతి భారతీయ మరియు తెలుగు కంప్యూటర్ వాడకం దారు కూడ విండోస్ కు, ఎమ్ ఎస్ ఆఫీసుకు పెద్ద పెద్ద గొలుసులతో బంధించ బడటం వల్ల, ప్రభుత్వాధికారులు విండోస్ సాఫ్ట్ వేర్ల విక్రేతల నుండి లంచాలను మేయటానికి అలవాటవటం వల్ల, తెలుగు అంతర్జాతీయ స్థాయికి చేరకపోగా , తెలుగు భాష ఉనికి కే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికే మనం పెక్కు సాంకేతిక విషయాలలో, ఇంగ్లీషు కన్నా కనీసం 50 సంవత్సరాలు వెనకపడి పోయాము.

తెలుగు టైపింగు, తెలుగు అనువాదాలు, తెలుగు నేర్చుకోటం, ఇతర రాష్ట్రాల వారికీ, ఇతర దేశాల వారికీ చాల శ్రమను ఇవ్వటం వల్ల వారు తెలుగును వాడటానికి ముందుకు రావటం లేదు. కనీసం తెలుగు లిపి సంస్కరణలకైనా ప్రభుత్వం గానీ, లేక వేరేవారు ఎవరైనా ముందుకు వస్తారని ఆశించాను. అది కూడ జరగలేదు. ఇపుడు తెలుగు లిపి సంస్కరణల వల్ల ప్రయోజనం తక్కువ.

కాబట్టి మనం ఎంత వేగంగా రోమన్ లిపిలోకి మార గలిగితే , అంత త్వరగా తెలుగును అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళటంలో ఒక మెట్టును ఎక్కిన వారమవుతాము.


Link to Part 1 of this post: Click to go to post No. 605.

1 comment:

  1. అనుకోకుండా ఈ బ్లాగ్ నా కంటబడింది! అద్భుతంగా ఉంది. ఒక్క చేతిమీద ఇంత పని ఇంత నిర్ధిష్టంగా జరుగుతున్నది క్రమం తప్పకుండా.. అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు! ఇవన్నీ విమర్శలు కావు. మనసునుండి పొంగుకొస్తున్న ప్రశంసలు. బ్లాగు టపాలద్వారా మీరు వినూత్నమైన ఆంశాలని నవీకరించి అందిస్తున్నారు. ఎంత నిబద్దఃత.. విజ్ఞానం.. అవగాహన.. వివరణాసామర్థ్యం అవసరమో! ఒక క్రతువు మాదిరిగా సాగుతున్నది ఈ బ్లాగు నిర్వహణ! మొదటి రోజునుంచే నేను ఈ బ్లాగుకి అభిమానిగా మారిపోయాను. విధాయకంగా చెప్పడంలేదు ..నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెతుకులాట సౌకర్యంతో మీరు పద్యాల సమాచారం కూడా అందిస్తున్నారు. ఎంతో ఉపయోగకరంగా ఉంది మా బోటి 'సాహిత్య వ్యాసాలు ఇబ్బది ముబ్బడిగా పత్రికలకు అందించే స్వచంద పాత్రికేయులకు(ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు సరైన తెలుగు పదమేనా!) ఒక్కటే విన్నపం. వీలయితే మూడుభాషల్లో ఇస్తున్న బ్లాగు టపాలను.. రైల్వేవారి ప్రకటనల ఫక్కీలో కాకుండాదేనికి దానికిగా విడివిడిగా ఇవ్వగలిగితే చదువుకునేందుకు మరింత సుఖంగా ఉంటుంది. మీకు మరేదైనా వేరే ఇబ్బందులుంటే సరే.. లేకుంటే ఒకసారి మీదృష్టి ఈ అంశాంమీదకూ ప్రసరించమని మనవి. అభినందనలు వైబి రావుగారు! సెలవు!

    ReplyDelete

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.