Friday, October 16, 2015

580 The cat is out of the hat टोपी से बिल्ली बाहर आया। టోపీలోంచి పిల్లి బయటకు వచ్చింది.


శేషాంధ్ర ప్రదేశ్ ను పాలిస్తున్నది రెండు ప్రధాన భూకులాలే కదా. ఒకటి పాలక బూర్జువా పార్టీగా ఉంటే రెండోది ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. రెండో సామాజిక వర్గానికి చెందిన శ్రీ జగన్ & కో వారు రాష్ట్రాన్ని పదేళ్ళు ఏలి, దొరికిన చోటల్లా భూములను కొల్లగోట్టినట్లు, ప్రజల దగ్గర లాక్కున్న భూములను , ప్రభుత్వ భూములను పంద్యారం చేసి షుమారు లక్షకోట్ల దాకా కాజేసినట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి. నిజానిజాలను తేల్చి శిక్ష విధించాల్సిన కోర్టులు ఏళ్ల తరబడి తాత్సారం చేయటం మనకి తెలిసినదే. ఇపుడు రైతుల భూములను లాక్కొని, జపాన్ సింగపూర్ దొరలకు పంచి పెట్టి తమకు రావాల్సిన క్వద్ ప్రో కో లను పోగుచేసుకునే పని శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినట్లు కనిపిస్తుంది. ఈ భారత దేశం, శేష్ ఆంధ్ర ప్రదేశ్ కేవలం నాలుగు స్థనాలు పొదుగులు ఉన్న ఆవులు బర్రెలు కావు. వీటికి ౧౨౦ కోట్ల స్థనాలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు ఆస్థనాలను అందబుచ్చుకుని ఎంతో కొంత స్థన్యాన్ని తాగాలని చూస్తాడు. ఇందులో తప్పులేదు. కానీ జరిగేది ఏమిటంట, ౧౨౦ కోట్లమందికి అందాల్సిన పొదుగులను కేవలం కొన్ని వందల మంది లేక కొద్ది వేల మంది పెద్ద మనుషులు దొరకబుచ్చుకోటమే కాక వాటిని రక్తం వచ్చేదాక పీల్చి పిప్పి చేయటం విచారకరమైన సంగతి. పీల్చి పిప్పి చేయటానికి, రెండవ భూకులం వారికి తగనన్ని స్థనాలు దొరికినట్లు లేవు. శ్రీ చంద్రబాబు గారు రాజధానియొక్క సీడ్ కాపిటల్ స్థలాన్ని గోప్యంగా ఉంచటం వల్ల శ్రీ జగన్ జీ మరియు వారి అనుచరులు తగినన్ని భూములను కొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగలేక చతికిలబడినట్లు కనిపిస్తుంది. అందుకే, వారంతా నిరాహార దీక్ష తంతును నడిపి, శంఖుస్థాపనకి ముందర కాళ్ళకి బంధాలు లాగా ఎనిమిది ప్రశ్నలను సంధించటం, అందులో ఈ రియల్ ఎస్టేట్ ఆరోపణ చేయటం గమనార్హం.

ఇపుడు శ్రీదక్కన్ క్రానికల్ గారి ౧౬.౧౦.౨౦౧౫ ప్రథమ పుట వార్త ప్రకారం, శ్రీ మురళీమోహన్, రాజమండ్రీ ఎమ్ పీ వారి జయభేరీ ప్రాపర్టీస్ శేషాంధ్ర రాజధఆనిలో భారీగా రియల్ ఎస్టేట్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నది ఈవార్తను చదవాలముకునే వారికి లింకు. Click to go to http://www.deccanchronicle.com/151016/nation-current-affairs/article/murali-mohan%E2%80%99s-jayabheri-build-projects-amaravati'
ఇది కుంచనపల్లి వద్ద ఉంటుందట. నిర్మిత కాంక్రీట్ ఏరియా లక్షా ఇరవై ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుందిట. ఇది వరకు ఈ సంస్థ వారే హైటెక్ సిటిలో కూడ భారీ నిర్మాణాలు చేశారుట.

శ్రీచంద్రబాబునాయుడు గారు రోజూ ప్రజలకు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాం, ప్రపంచం అంతా మన రాజధాని గురించే ముచ్ఛటించుకుంటుంది (వేరే పనేమీ లేనట్లు), అంటూ రోజు భజన పత్రికలు, టీవీఛానెల్సునూ కూర్చోపెట్టుకోని (వాళ్ళకి ఎన్ని వందల ఎకరాలు కట్టపెడతారో ఇపుడు తెలియదు. పాపం వాళ్ళ ఆశలు వాళ్ళవి), ప్రజలను ఊదరకొట్టెబదులు, ఏఏ సర్వే నంబర్లలో ఏఏ పార్టీల ఎమ్ పీ లు, ఎమ్ ఎల్ ఏలు, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ లను నిర్మించబోతున్నారో ప్రకటన చేస్తే, జనం ఆయా సంస్థల వారి కాళ్ళు పట్టుకోటం తేలికవుతుంది. ప్రజలకు సుందరంగా క్షౌరం చేసినా ఛండాలంగా చేసినా, చేస్తున్న పనేదో తేటతెల్లంగా చెప్తే భళి భళి భళి దేవా అంటారు కదా.

మన దేశంలో లక్ష్మిక సరస్వతి దాస్యం చేస్తూ ఉండటం, అందరికీ తెలిసిందే. పత్రికలు, టీవీఛానెల్స్, అందలో పనిచేసే రిపోర్టర్లు, కెమెరా మెన్ లు, సంపాదకులు, ఉపసంపాదకులు, మేధావుల క్రింద లెక్క. పత్రికలను నిర్వహించటం, ఛానెల్స్ ను నడపటం ఎంత వ్యాపారమే అయినా వారు భజంత్రీలుగా మారకూడదు అని చాలా మంది నమ్ముతారు (వెర్రివాళ్ళు). శ్రీ చంద్రబాబునాయుడు గారు చివరకు జర్నలిస్టులను కూడ వదలకుండా, వారిచేత 5k రన్ అంటే రాజధానికోసం ఐదు కిలోమీటర్లు పరిగెత్తించటం చేయించారుట. వారు పాపం ఏమి ఆశ పడ్డారో ఏమో. మన అభినవ శ్రీకృష్ణదేవరాయలవారు ఆ ఆశాజీవులకి రాజధానిలో ఎన్నేసి గజాల స్థలాలు ఇప్పించ గలరు. అలా ఇప్పిస్తే సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు , చైనా వాళ్ళూ, ఊరుకుంటారా. ఇంక జ్యోతిష్కులకి, వాస్తు సిధ్ధాంతులకి, స్పిరిట్యుయల్ గురువులకి, ఎన్ని గజాలు ఇస్తారు.

శ్రీ నరేంద్ర మోడీ గారిని భక్తితోనే లోబరుచుకొని, వేలకోట్లను సాధించాలని శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే శంఖుస్థాపనను శ్రీ మోడీ మహా ప్రభువు వారి చేత చేయిస్తే, జగదేక వీరుడి కథ సినిమాలో ఎన్ టీ ఆర్ , ఘఁటసాల, కలిసి శివశంకరీ అని పాడగానే రాతిగుండు కరిగి అగ్నిదేవుడు బయటకు వచ్చినట్లుగా , మోడీగారి మనసు కరుగుతుందని ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.