Shri Resu Gurram commented as under: (Approx. in English). Before thinking that your blog is devotionally good, it is understood that you are a dog of YSRCP. Finally, people say about persons like you: People say Great Morals (ceppEvi SrIranga nItulu). Same people who preach great morals enter into huts of gypsies (dUrEvi dommari guDiselu.).
ybrao-a-donkey's note: This is a very old proverb of Telugu language. As per the proverb, entering into huts of gypsies, by the moral preachers, is for the presumed purpose of prostitution. The word "dommari" meant drimmari or tramps. Some tramps of those days (some centuries back) might have been forced into enter into prostitution for survival as they do not have their own agricultural farms. Anyway, this WIDE VARIANCE between preaching and practice is a world-wide phenomenon, common in all cultures, Nations, and Religions. How can ybrao-a-donkey, though not a preacher, alone be exempt from this? Shri RESu Gurram (Race Horse) commented as under:-
Hi Brother mee blog devotional ga chalabagundi ... ani anukuno lopu nuvvu YSRCP Kukka vani telisindi. Chivaraku neelanti vadi gurinchi okati cheppru...CEPPEDI SRIRANGA NEETHULU ... DOOREDI DOMMARA G... LO ANTA...BOKKALO CBN GURINCHI COMMENTS MANI NEE GUDDA NUVVU KADUKKO...
ybrao donkey's reply वैबीराव गधे के प्रत्युत्तर వైబీరావు గాడిద ప్రత్యుత్తరం
Dear friend:
I am not a supporter of Jagan or YSRCP. His fate will be decided by Courts, hopefully before 2019. Else, there is danger of people electing Jagan as C.M., if Mr. Pavan Kalyan does not work intensively. Then, people of Residual A.P. are going to face greater trouble. నేను శ్రీ జగన్ కు గానీ, వైయస్ ఆర్ పీ కి గానీ మద్దతుదారును కాను. ఆయన భవిష్యత్ ను కోర్టులు నిర్ణయించాలి, ౨౦౧౯ కన్నా ముందే ఇది జరగాలి. జైలుకు వెళ్ళటమా, లేక సాంకేతిక లోపాల వల్ల బయట పడి, జనాన్ని పీక్కు తినటమా అనేది మనం వేచి చూస్తే కానీ తెలియదు. శ్రీజగన్ కేసులలోంచి బయటపడితే, శ్రీ పవన్ కల్యాణ్ స్వయంగా జనంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి పీఠానికై ప్రయత్నించక పోతే , శేషాంధ్ర ప్రదేశ్ ప్రజల పని పెనం లోంచి పొయ్యిలో పడినట్లవుతుంది. సీమాంధ్ర ప్రజల పరిస్థితి చాల ఘోరంగా మారే అవకాశం ఉంది.
You appear to be a supporter of Mr. Chandra Babu Naidu. आप श्री चंद्रबाबु नायुडु के समर्धक दिख रहे है। మీరు శ్రీచంద్ర బాబు నాయుడికి ప్రగాఢ మద్దతు దారు లేక జగన్ ద్వేషి లాగా కనిపిస్తుంది.
As you think, I am not a hater of Mr. Chandra Babu Naidu. He has his strengths and merits. If we come across occasions to appreciate him, we shall definitely appreciate him. आप शोच रहे है, मैं चंद्र बाबु नायुडु के द्वेषि हुँ, लेकिन मैं उनके विद्वेषी नहीं हुं। उनको भी कई सुगुण हैं। जन हमारे को उनको प्रशंसा करने के वखत मिलेगा, हम निश्चय तौर से, श्री नायुडु को तारिफ करके शहबास करेंगे। మీరు అనుకుంటున్నట్లుగా నేను శ్రీ చంద్రబాబు నాయుడు కి ద్వేషిని కాదు. ఆయనలో కూడ ఎన్నో సుగుణాలు ఉన్నాయి. సందర్భాలు వచ్చినపుడు, ఆయనను మనం తప్పక ప్రశంసిద్దాము. మీరు కోరితే ఇప్పుడైనా మనం ఆయన సుగుణాలను వెలికి తీసి ప్రశంసించుకోవచ్చు. కానీ కావాలని స్తుతి చేయటానికీ, సందర్భం వచ్చినప్పుడు గౌరవపూర్వకంగా వ్రాయటానికీ చాలా తేడా ఉంటుంది.
It is very difficult to maintain impartiality for a writer. हमारे जैसे छोटे लेखक लोगों को निष्पक्षपात रहित दिखना कभी कभी मुष्किल होता है। మాలాంటి చిన్న రచయితలకు నిష్పక్షపాతంగా కనిపించేలా వ్రాయటం చాల కష్టం. సంస్కృతంలో ఒక లోకోక్తి ఉంది. సత్యం బ్రూయత్, ప్రియం బ్రూయత్, నబ్రూయత్ సత్యం అప్రియం. దీని అర్ధం ఏమిటంటే, నిజం చెప్పు, ప్రియం చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పద్దు. అయితే ఈ సూక్తి రాజుల దగ్గర, జమీందార్ల దగ్గర, పెద్దవ్యాపారుల దగ్గర సేవలు చేసే వాళ్ళు వాడుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళకి కోపం వస్తే, కొరడా దెబ్బలు తగలచ్చు, లేకపోతే రావాల్సిన అనుగ్రహ రాశులు రాకపోవచ్చు.
అందరూ భజనపరులే అయితే, రాజుగారు కట్టుకున్న దేవతా వస్త్రాలు ఉత్తుత్తివే అని చెప్పటానికి తనకి ఏది లాభమో, ఏది నష్టమో పరిగణనలోకి తీసుకోలేని బాలుడు కావాల్సి వస్తుంది.
నా అభిప్రాయం ఏమిటంటే, మనం ప్రియమైనా, అప్రియమైనా సత్యాన్ని చెప్పాల్సిందే. ప్రియమా కాదా అనేది కాదు చూసుకోవాల్సింది. ప్రజలకి హితమా కాదా అనేది చూసుకోవాలి. హితం అంటే మేలు చేస్తుందా, చేయదా, అని. కొన్ని సార్లు మనం మేలు చేసే విషయాలను చెప్పినా జనం బూతులు తిట్తూ ఉంటారు. దానికి మనం సిధ్ధపడాల్సిందే. ఇక్కడ సంస్కృతంలో ఒక శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, మనం గ్లాని స్థానంలో మనో స్థైర్యాన్ని పొందుతాం.
నిందంతు నీతి నిపుణాం యది వా స్తువంతు
లక్ష్మీ సమావిశతు వా గఛ్ఛతువా యథేష్టం
అద్యైవవా మరణమస్తు యుగాంతరే వా
న్యాయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః
ఇది భర్తృహరి మహాకవి విరచితం. దీని భావం, నీతి నిపుణులైన వారు నిందించినా , డబ్బులు (లక్ష్మి) వచ్చినా పోయినా, ఈక్షణమే మరణం వచ్చినా, యుగాంతంలో వచ్చినా, ధీరులైన వాళ్ళు న్యాయమైన మార్గం నుండి చరించరు. ఇపుడు శ్రీ రాజశేఖర్ రెడ్డిగారు చూడండి, షుమారు లక్షకోట్ల దాకా జగన్ కి సంపాదించి పెట్టి ఏమి మూటకట్టుకున్నట్లు. కనీసం చీపురు పుల్లకూడ స్మశానానికి రాలేదు. సాదా గానే మట్టిలో కలిసిపోవాల్సి వచ్చింది. శ్రీజగన్ పితృవియోగం లోంచి తగినంత నీతిని వైరాగ్యాన్ని పొందుతాడని మనలో కొందరు ఆశించి ఉండచ్చు. అలా జరగలేదు.
నేను నూటికి నూరు పాళ్ళు న్యాయ మార్గంలో వెళ్తున్నానని డబాయించలేను కానీ ప్రయత్నిస్తున్నానని గట్టిగా చెప్పగలను. నా నిజాయతిలో లోపం చేయనివ్వననే హామీ ఇవ్వగలరు. మీరు ఎపుడైనా నేను భిన్న మార్గంలో వెళ్తున్నట్లు గమనిస్తే సరిదిద్దటానికి ప్రయత్నించవచ్చు. నేను, జగన్ తో పోలిస్తే శ్రీ చంద్రబాబు నాయుడుని, సోనియాతో పోలిస్తే శ్రీ నరేంద్ర మోడీని ఎక్కువగా దుయ్యబడుతున్నట్లుగా కనిపించటానికి కారణం, శ్రీ నాయుడు, శ్రీ నరేంద్ర మోడీ అధికారంలో ఉండటమే.
శ్రీ జగన్, సోనియాలు వారు తిరిగి అధికారంలోకి వచ్చే దాకా వారిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అధికారం పోగొట్టుకున్న వాళ్ళు సగం చచ్చిన పాములతో సమానులే, ఎందుకంటే, లోకం వాళ్ళను పట్టించుకోదు. వాళ్ళు తాము పోగొట్టుకున్న అధికారాన్ని చేజిక్కించుకోటానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చప్పుళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారికి చట్టసభలలో తగినంత బలం ఉంటే తప్ప వాళ్ళు ఎంత గింజుకున్నా , బుస కొట్టినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు బుసకొట్టటమే తప్ప ప్రజలకు చేయగలిగే మేలు, కానీ కీడు కానీ పెద్దగా ఉండదు. వారు తాము పదవి కోల్పోయిన కాలాన్ని అంతర్ వీక్షణ (introspection, अंतर वीक्षण, अंतर दर्शन) కొరకు వినియోగించి, మద్యపాన వ్యతిరేక ప్రచారం, ఖాదీ ప్రచారం, విద్యా ప్రచారం, వ్యవసాయం, నీటి వనరుల పరిరక్షణ మొదలగు రాజకీయేతర అంశాలలో నిర్మాణాత్మక కృషి చేస్తే, పదవిలేని ఐదు సంవత్సరాలు ఉస్సూరు మనకుండా నల్లేరు మీద బండిలాగా గడిచి పోతాయి. వాళ్ళు అలా చేయకుండా అధికార పక్షం పై విరుచుకు పడటం వల్ల ప్రజలకు అనవసరమైన బాధలు కలుగుతున్నాయి.
మీరు నా బ్లాగ్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని చదివినట్లు లేదు. అది నాస్తికత్వాన్ని, సమతా వాదాన్ని, మార్క్సిజాన్ని ప్రచారం చేయటం. నా దృష్టిలో వ్యక్తుల ప్రవర్తన పెట్టుబడి విధానం, న్యాయమా అన్యాయమా అనే పట్టించుకోకుండా అతితక్కువ సమయంలో అతిఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ చేత అతి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కుక్క అతి తీవ్రమైన వాసన వచ్చే కుళ్ళిన ఎముకనే అమృతతుల్యంగా భావించినట్లుగా, అంబానీ, టాటా, ల దగ్గరనుండి గుంటూరు సిటీలో రేషన్ కిరసనాయిలును లీటర్ యాభయి రూపాయలకి విక్రయించే అవ్వ వరకు, ప్రతివాళ్ళూ డబ్బుకు లోకం దాసోహం గా ఇటీజ్ ఎ మాడ్ మాడ్ వరల్డ్ గా మారి, తమ జీవితాలను దుఃఖ మయంగా చేసుకోటమే కాకుండా, తమ చుట్టూ ఉండే వాళ్ళ జీవితాలను కూడ దుఃఖమయంగా చేయటాన్ని మనం చూస్తున్నాం. దీనిలో మనం తప్పు పట్టాల్సింది టాటాను కాదు, కిరోసిన్ బ్లాక్ చేసే అవ్వనూ కాదు. వాళ్ళంతా తోలు బొమ్మలు లాంటి వాళ్ళు. అసలు విలన్ లు పెట్టుబడిదారీ విధానం, ప్రైవేటు ఆస్తి, వారసత్వ సంక్రమణాలు, సత్తుకు అసత్తుకు, చిత్తుకు జడానికి గల తేడాని గుర్తించే శక్తిని కోల్పోటం.
ఆంగ్లంలో ఒక సామెత ఉంది. దీ పీపుల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వు. ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని పొందటానికి అర్హులో, అలాంటి ప్రభుత్వాన్నే పొందుతారు. సమాజంలో వర్గాల పాత్రను గుర్తించి, సరియైన సిధ్ధాంతాలను ఏర్పరుచుకోలేని, ఒక్క రోజైనా తమ దురలవాట్లను ప్రక్కన పెట్టుకోలేని కోట్లాది మంది ప్రజలు వోట్లు వేసినపుడు మోడీలు, సోనియాలు, చం.బా. నాయుళ్ళు, రాజశేఖర్ రెడ్లు, జగన్ లు ఇంకా ఎందరో అధికారంలోకి రావటం, ఒక ఐదేళ్ళో పదేళ్ళో ప్రజలను పీడించటం మనం చూస్తున్నాం.
కాబట్టి మిత్రమా, మనం రాగ ద్వేషాలనుండి, వ్యక్తి పూజలనుండి, వ్యక్తి ద్వేషాలనుండి బయట పడటం తక్షణ అవసరం. లేదంటే, ౨౦౧౯ నాటికి మనపై చీకట్లు ఇంకా ఎక్కువ ముసురుతాయి.
నేను ఇక్కడ చేస్తున్నది ఏకాకి ప్రయత్నం. చండీగఢ్ నగరంలో నేకీ చంద్ అనే వ్యక్తి మునిసిపల్ చెత్త పారేసే గ్రౌండ్ లో పారేసిన గాజు పింగాణీ ఇతర ముక్కలను వినియోగించి కొన్ని తనకు నచ్చిన బొమ్మలను తయారు చేసుకున్నాడు. ఇపుడు శ్రీ నేకీచంద్ స్వర్గస్థుడయ్యారు. మనం చండీఘర్ వెళ్ళినపుడు నేకీచంద్ మ్యూజియాన్ని చూడచ్చు. ఆయన స్ఫూర్తితో నేను ఇంటర్ నెట్ లో ౧౫,౦౦౦ ఏ౪ పేజీలు దాకా వ్రాయటం జరిగింది. వీటిల్లో ౮౦ శాతం దాకా ఆంగ్లం. ఇపుడిపుడే తెలుగులో హిందీలో ఎక్కువగా వ్రాస్తున్నాను. దురదృష్టవశాత్తు శ్రీమోడీని, శ్రీ బాబుని ఎక్కువగా విమర్శించటం జరిగింది. వారు ప్రస్తుతం అధికారంలో ఉండటం ఒక కారణం కావచ్చు. అంతే తప్ప బాబు ద్వేషం కాని, జగన్ పై అనురాగం గానీ లేదు. నిస్సంగం (without attachment or hatred) గానే వ్రాయటం జరిగింది.
I shall try to add English and Hindi translations some time later.
ఇంకి మీరు అన్యథా భావించనంటే, ఒక ప్రార్ధన. నేటి రాజకీయవాదులు వాడుతున్నట్లుగా, బూతులు వాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ వాక్కు ఎంతో ప్రకాశించేదిగా ఉండాలని నాకోరిక.
సంస్కృతం, భర్తృహరి అనుకుంటాను.
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
తెలుగులో, ఏనుగు లక్ష్మణ కవి అనుకుంటాను.
భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాక్
భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.
అయితే వాక్కు ఒక్కటే పవిత్రంగా ఉంటే సరిపోతుందని నేను అనుకోను. ఆలోచనలకు తగిన వాక్కు, వాక్కుకు తగిన ప్రవర్తన, ఈమూడింటిని కలిపితే మనం త్రికరణశుధ్ధి అనచ్చు. గాంధీజీ లో ఈ త్రికరణశుధ్ధి ఎక్కువగా ఉందని లూయీ ఫిషర్ గారు అభిప్రాయపడినట్లు నాకు గుర్తు. ఈ త్రికరణశుధ్ధిలో ఏమాత్రం తేడా వచ్చినా మనిషి అనారోగ్యానికి గురి అయే అవకాశం ఉందని శ్రీ లూయీ ఫిషర్ గారో శ్రీ రోమా రోలా గారో వ్రాసినట్లు నాకు గుర్తు.
Added on 07th Jan. 2016.
Mr. Chandra Babu Naidu and Mr. Kodela Shiva Prasada Rao (Speaker of Assembly) day-in and day-out speak about the abusive language used by Ms. Roja, a Y.S.R.C.P. M.L.A., and they have finally barred her for one year from A.P. Assembly. They forget that Ms. Roja was encouraged by them when she was in TDP. At that time they might have enjoyed when she abused others. ఇంకా ఉంది. TO CONTINUE. सशेष.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.