417 News REVIEW समाचार समीक्षाएँ సమాచార సమీక్షలు
MEDICAL NEWS आरोग्य समाचार ఆరోగ్య సమాచారం
TODAY is Mahatma Gandhi's death anniversary. In this context, we shall see tips given by Gandhiji to Mr. Prabhudas Gandhi in his letter (date not available) sometime in Dec.1947. Source volume 98 of his Complete Works.
I have your letter. It has made me very happy. Do not worry and
improve your health. That even in illness, you have not lost your calm
is no mean achievement. Now, I want you to observe complete
self-control in building up your body. After recovering from illness,
the mind craves for food. Do not listen to the doctors. It is better to
eat only as much as you can digest.
Even in the matter of exercise, do only as much as you easily
can. It is better for a person who knows his own strength to depend
less on what others say. Get up only when you can. Do not force
yourself into any activity. Keep on writing to me from time to time.
BAPU
నీ ఉత్తరం నాకు అందింది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నీ ఆరోగ్యం గురించి దిగులు పడద్దు. మరియు ఆరోగ్యాన్ని అభివృధ్ధి చేసుకో. నీవు నీ అనారోగ్యం లో కూడ నీ మనస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్నావంటే, అది సాధారణ మైన విజయం కాదు. ఇప్పుడు, నీవు నీ శరీరాన్ని (ఆరోగ్యాన్ని) పునర్ నిర్మించుకోటంలో పూర్తి ఆత్మ నిగ్రహం పాటించాలని నేను కోరుకుంటున్నాను. అనారోగ్యం నుండి కోలుకున్నాక మనసు ఆహారం కోసం ఆరాట పడుతుంది. నీవు డాక్టర్ల మాటలకు చెవి యొగ్గకు. నీవు ఎంతవరకు జీర్ణం చేసుకోగలవో అంతవరకు మాత్రమే తింటం మంచిది.
వ్యాయామం విషయంలో కూడ, నీవు ఎంత అయితే సులువుగా చేయ గలవో అంత మాత్రమే చేయి. తన బలాన్ని తెలుసుకునే వ్యక్తి ఇతరులు చెప్పే దానిపై తక్కువ ఆధారపడటం మేలు. నీవు (నిద్రనుండి) ఎప్పుడు లేవగలవో అప్పుడే లే. పనులలోకి నిన్ను నీవు బలవంతంగా ప్రవేశపెట్టుకోకు. తరచూ నాకు వ్రాస్తూ ఉండు.
ఆశీస్సులతో , బాపు.
All India news अखिल भारतीय समाचार అఖిల భారత వార్త
Replacement of Foreign Secretary Sujatha Singh, with Jaishankar, seven months ahead of completion of her tenure. Reports that Ms. Sushma Swaraj is dissatisfied with the change.
It may be recalled that Ms. Sushma Swaraj has been inactive in her arena, particularly ever since, Mr. Narendra Modi has started his foreign tours, and started receiving foreign Heads of State in India.
Customarily, traditionally, Indian Prime Ministers, since the days of Jawaharlal Nehru (probable exception Lal Bahadur Sastry), were de-facto Foreign Ministers of India, while the de-jurie Foreign Ministers were only facilitators for the PMs to get invitations from European and American Heads of State to visit their countries, fix dates, lobby for special treatments and hospitality for the PMs.
Foreign Secretaries, often used to have direct access to PM and his Office, overlooking the Foreign Minister, bypassing the formal channels of communications. Probably, in that process, Mr. Narendra Modi might have found that Sujatha Singh was not working upto his expectations.
WHY Indian Prime Ministers take more interest in foreign affairs, spend most of their time in foreign tours or receiving foreign dignitaries? Probable Answer: They find the heat of the internal affairs of this poor country unbearable. Attending to the poverty of the people, and the inequalities of income and wealth, may be a once-in-five-years affair. For them, it is not a thing which is to be attended immediately and continuously.
Can you give some example?
Mr. Narendra Modi takes pride in being an erstwhile chaiwallah. Welcome. Recently, he has received praise from American President Barack Obama, for having risen from the level of a Chaiwala to the level of a Prime Minister. Ok, no grudge. But, does he spend sometime at least once in a month to know and solve the problems of the Chaiwallahs in this country, who may number about 10 million, if we include roadside vendors of eatables, on carts and from bunks. Does he know that they are forced to buy their LPG fuel in large-sized commercial cylinders and that they were frequently harassed by Government Officials? Our Prime Minister and Foreign Minister are more interested to explain with folded hands to G8 country Heads of State and Heads of Government, that India will fulfil its promise of removing all subsidies.
हिन्दी वॆर्षन थोडे दिनों में लिखने के लिये कोशिश करता हूँ।
क्या, आप एक उदाहरण दे सकते?
విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ గారిని, ఆమె పదవీకాలం ముగియటానికి ఏడు నెలల ముందే స్థాన భ్రంశం చేసి, శ్రీ జైశంకర్ గారిని ప్రవేశ పెట్టటం. తత్ పశ్చాత్ , విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారికి అసంతృప్తి కలిగిందనే వార్త.
గత కొంత కాలంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తన విదేశాంగ మంత్రిత్వ రంగంలో అల్ప చైతన్యంతో ఉండటం గమనార్హం. ముఖ్యంగా శ్రీ నరేంద్రమోడీ గారు, విదేశాలను భారీగా సందర్శించటం, విదేశీ ప్రభుత్వాధినేతలను భారత్ లో రిసీవ్ చేసుకుని వారిని తిప్పటం భారీగా చేయటం మొదలుపెట్టిన దగ్గరనుండి, ఆమె పాత్ర స్వయంగా పరిమితంచేసుకోటమో, లేక పరిమితం చేయబడటమో జరిగినట్లు కనిపిస్తుంది.
వాడుకగా, ఆచారంగా, జవహర్ లాల్ నెహ్రూ గారి కాలం నుండి, భారతీయ ప్రధానమంత్రులే భారత్ కు వాస్తవ విదేశాంగ మంత్రులుగా వ్యవహరించటం, విదేశాంగ మంత్రిగా నియమించబడిన వాళ్ళు, విదేశాంగ వ్యవహారాల స్టేట్స్ మెన్ గా కాకుండా, కేవలం ఏర్పాట్లు చేసేవాళ్ళుగా మారటం జరుగుతూ వచ్చింది. ఏర్పాట్లు చేయటం అంటే, విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులనుండి, మా దేశాన్ని సందర్శించండి అనే ఆహ్వానాలను భారత ప్రధానమంత్రులకు అందేలాగా లాబీయింగ్ చేయటం, తారీకులు ఫిక్సు చేయటం, హోటళ్ళు ఏర్పాటు చేయటం, వంటి చిల్లర పనులు చేయటం జరిగేది.
విదేశాంగ కార్యదర్శులు, డైరక్టు గా ప్రధాన మంత్రితో, ఆయన కార్యాలయంతో సంబంధాలు కలిగి ఉండటం, తన బాస్ అయిన విదేశాంగ మంత్రినిపట్టించుకోకుండా ప్రధానమంత్రిని సంతృప్తి పరచాలసి చూడటం జరిగేది. ఫలితంగా, స్థాన భ్రంశం పొందిన సుజాతా సింగ్ గారు, శ్రీ నరేంద్రమోడీ గారిని సంతృప్తి పరిచేలాగా పనిచేయటం లో విఫలం చెంది ఉండవచ్చు. అసలేం జరిగిందో, ఆమె చప్తేగానీ తెలియదు.
భారతీయ ప్రధాన మంత్రులు స్వదేశ సమస్యలైన దారిద్ర్యం, ఆదాయం మరియు సంపదలలో వ్యత్యాసాలు, జనాభా విస్ఫోటం, వంటి ఘోరవిషయాలను పట్టించుకోకుండా, తరచు విదేశాలను సందర్శించటానికి, విదేశ ప్రభుత్వాధినేతలను స్వదేశానికి ఆహ్వానించి, వారికి ఆతిథ్యం చేయటంలో కాలక్షేపం చేయటానికి కారణం ఏమిటి ?
దారిద్ర్యం, ఆదాయాలు సంపదలలో వ్యత్యాసం, మత కలహాలు, ప్రాంతీయ కలహాలు, జనాభా విస్ఫోటం, వంటి సమస్యలు భరించిరాని వేడిని కలిగిఉండి తపన పుట్టిస్తాయి. అదే విదేశాలను సందర్శించటం, విదేశాధినేతలకు ఆతిథ్యం ఇవ్వటం వంటి పనులు మంచి గ్లామర్ కలిగి ఉండి, ఫన్ ను అందిస్తాయి. ఒకలాగా చెప్పాలంటే ఇంటర్ నెట్ లో చాటింగ్ చేసే ఆనందాన్ని ఇస్తాయి. ఇంక దారిద్ర్యం వంటి సమస్యల విషయంలో ప్రజలను కలవటం అంటే అది ఐదేళ్ళ కొకసారి చేయాల్సిన పని. వాటిని రోజూ, ఏమాత్రం విరామం ఇవ్వకుండా , అటెండ్ కావటం అంటే మనస్సు తిరుగుబాటు చేస్తుంది.
మీరు ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు, తన గత చాయ్ వాలా చరిత్రను గుర్తు చేసుకుంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు శ్రీబారక్ ఒబామా గారినుండి, చాయ్ వాలా స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎగిరిన వాడిగా (ఎదిగిన వాడిగా) ప్రశంసలు కూడ పొందారు. బాగానే ఉంది, ఈర్షలేదు. మరి ఆయన నెలకొకసారియైనా, తనకు గౌరవ స్థానాన్ని తెచ్చిపెట్టిన చాయ్ వాలాల సమస్యల గురించి సమీక్షిస్తారామీరు ఒకఉదాహరణ ఇవ్వగలరా? దేశంలో, చాయ్ వాలాలు, హోటళ్ళలో పనిచేసేవాళ్ళు, బండ్లమీద తినుబండారాలు చాయ్ లు అమ్మేవాళ్ళు, బంకుల్లో కాకా హోటళ్ళను నడిపే వాళ్ళూ అందరినీ కలుపుకుంటే, ఒక కోటిమంది దాకా ఉన్నారు. వీరికి నిత్యావసర వస్తువైన ఎల్ పీ జీ గ్యాస్ ను కమర్షియల్ సిలిండర్లు చాలా అధిక ధరలకు కొని వాడవలసి వస్తున్నది. ప్రభుత్వాధికారులు తరచూ దాడులు చేస్తూ లంచాలకోసం వేధిస్తూ ఉండటం వల్ల వాళ్ళకు బ్రతుకు తెరువే ప్రశ్నార్ధకంగా తయారయింది. ప్రజలు కమర్షియల్ సిలిండర్లపై తయారు చేసిన తినుబండారాలను, చాయ్ లను కొని తాగలేక నానా బాధలు అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి, ఆయన ఆర్ధిక మంత్రులు , జీ ఎనిమిది దేశాధినేతల ముందు చేతులు నులుపుకుంటూ సబ్సిడీలను తొలగిస్తాం అని వారికి వివరణలు ఇచ్చుకుంటున్నారే తప్ప, సబ్సిడీలను కొనసాగించటమా, మానటమా అనేది భారత్ యొక్క అంతరంగ వ్యవహారమనీ, అది సర్వసత్తాక రాజ్యం యొక్క హక్కులలో ఒకటి అని వారికి స్పష్టం చెప్పలేకపోతున్నారు. ఆచరణలో కూడ చూపట్లేదు. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోతున్నారే తప్ప, చాయ్ వాలా ల సమస్యలను పట్టించుకోటంలేదు. ఎక్సైజు సంకాన్ని తగ్గించి కమర్షియలి సిలిండర్ల రేటు తగ్గిస్తే, చాయ్ వాలాలకు , తత్ఫలితంగా సాధారణ ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది కదా. అవసరమైతే, చాయ్ వాలాలకు ప్రత్యేక గ్యాస్ సప్లయి కార్డులు ఇవ్వ వచ్చును. సమస్యును పరిష్కరించాలనే కోరిక ఉంటే మార్గం ఉంటుంది. అసలు తీరికే దొరకనంత స్థాయిలో, భారత విదేశాంగ మంత్రి, రాష్ట్రపతి మొదలగు వారికి వదిలేయాల్సిన విదేశ పర్యటనలను, విదేశీ అతిథుల స్వాగత సత్కారాలను ప్రధాన మంత్రులు నెత్తిన వేసుకోటం ఎందుకు.
Today's Classical music आज का शास्त्रीय संगीत ఈ రోజు శాస్త్రీయ సంగీతం.
महात्मा गांधी के वर्धंति के अवसर पर, वैबीराव गधे के विरचित राग शूभाळी में, एक आडियो वीडियो पेश कर रहा हूँ। मध्य लय, द्रुत लय. तीन ताल. शुभाळी कर्नाटक संगीत राग है। हिन्दूस्थानी में नहीं है। ४५ मेळ कर्ता शूभ पंतु वराळी के जन्य राग है। शूभ पंतु वराळी से, पंचम को वर्ज्य करके, हम इस राग को ले सकते हैं। याने, स, कोमल रिषभ, कोमल गंधार, तीव्र मध्यम, कोमल धैवत, शुध्द निषाद इन स्वरों से, यह षाडव राग पैदा होता है। हिंदूस्थानी तोडी ठाठ के जन्य , हम मान सकते हैं। शोक रस पोषण केलिये यह सदा स्मरणीय है। स्वर्गीय नेदुनूरि कृष्ण मूर्ति, विख्यात करनाटक संगीत वेत्ता, इस शुभाळी में अन्नमाचार्य के कृति ' आकलि वेळल अलसिन वेळल (जब भूक था, जब थक गया था...) ' को बहुत मधुरता स्फूर्ति से स्वर बध्ध किये थे, और वह बहुत लोकप्रिय बने।
గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుభాళి రాగం, ఆది తాళంలో వైబీరావు గాడిద రచన. హిందూస్థానీ పధ్ధతి. మధ్యలయ. ద్రుత లయ. శుభాళి, కర్నాటక సంగీత రాగం. ౪౫వ మేళకర్త శుభపంతు వరాళి జన్యం. శుభ పంతువరాళి లోని పంచమాన్ని తీసేస్తే, అంటే, సరిగమదని స.నిదమగరి స్వరాలతో శుభాళి వస్తుంది. ఇది శుభపంతువరాళి వలెనే విషాద రసభరితం. హిందూస్థానీ లో ఈ రాగం లేదు. వర్గీకరించాలంటే మటుకు, దీనిని హిందూస్థానీ తోడి రాగ జన్యం గా లెక్కించాల్సి ఉంటుంది. శుభాళిలో స్వర్గీయ నేదునూరి కృష్ణమూర్తి గారు ఆకలి వేళల అలసిన వేళల అనే అన్నమాచార్యుల కీర్తనను చాలా అద్భుతంగా స్వరపరిచారు.
To see the western notation for this click इस के पाश्चात्य स्वर लिपि देखने के लिये क्लिक. దీని పాశ్చాత్య స్వరలిపిని చూడటానికి క్లిక్. http://museyb.blogspot.com/search/label/157
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.