వారి దయతో పొందిన సమాచారం ఆధారంగా వ్రాసింది. ఇందులో తప్పలకు వారి బాధ్యతేమి ఉండదు.
శరీరంలో కణాల మధ్య సమాచార మార్పిడీ ప్రాధాన్యత
ప్రజాహితం కొరకు వ్రాసిన వారు
ybrao a donkey.
దీనిని నిపుణుల చేత చెక్ చేయించ వలసి ఉన్నది.
ఆహారం శరీరంలోకి ప్రవేశించినపుడు, అది ముక్కలు ముక్కలుగా చేయబడి రక్తంలోకి ప్రవేశిస్తుంది. క్లోమంలోని కణాలను షుగర్ , ఇన్ సులిన్ ను విడుదల చేయవలసిందిగా ప్రేరేపిస్తుంది. ఇన్సులిన్ రక్తంద్వారా శరీరంలోని ఇతర కణాలలోకి ప్రయాణించి ఆ షుగర్ ని తీసుకోవలసిందిగా సంకేతాలను పంపిస్తుంది.
ఇన్సులిన్ గారే, కాలేయానికీ, కండరాల కణాలకు, కొవ్వు కణాలకూ, ఆ చక్కెరను భవిష్యత్ ఉపయోగం కొరకు దాచుకోవలసిందిగా కూడ చెప్తుంది.
టైప్ 1 డయాబెటిస్ లో ఇన్సులిన్ ను తయారుచేసే క్లోమ కణాలు నశిస్తాయి. అందుకని కాలేయానికి, కండరాల కణాలకు, కొవ్వు కణాలకు సిగ్నల్స్ అందక అవి రక్తంలోని గ్లూకోజును పీల్చుకోవు, స్టోర్ చేసుకోవు. రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోతుంది. దీనిని సరిదిద్దక పోతే, కిడ్నీ వ్యాధి, అంధత్వం, గుండె జబ్బులు రావచ్చు.
మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏమిటి
మల్టిపుల్ స్క్లెరోసిస్ లో మెదడు లోని మరియు వెన్నెముకలోని నరాల కణాలచుట్టూ ఉండే రక్షణ కవచం పోవచ్చు. ఇలా దెబ్బతిన్న నరాల కణాలు మెదడులో ఒకచోట నుండి మరొ చోటకి సందేశాలు పంపించలేక పోవచ్చు. ఫలితంగా కండరాల బలహీనత, శరీరం బ్యాలెన్సు తప్పటం, కదలికలు అదుపులో లేకపోటం, చూపు బూజురు అవటం వంటివి జరగచ్చు.
టైప్ 2 డయాబెటిస్ లో సిగ్నల్స్ రావా
ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ సిగ్నల్స్ పంపుతుంది. కానీ, వాటిని స్వీకరించాల్సిన కణాలు వాటిని తీసుకునే శక్తిని కోల్పోటం వల్ల వాటిని తీసుకోవు.
ఫలితంగా చక్కెరను భవిష్యత్ ఉపయోగానికి కండరాలకణాలు, కొవ్వుకణాలు తీసుకోవు కాబట్టి రక్తంలో చక్కెర పెరిగిపోతుంది.
ఎక్సైటో టాక్సిసిటీ అంటే ఏమిటి
మెదడు కు రక్తం ప్రయాణించ టానికి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడ్డప్పుడు, మెదడులో కొంత భాగానికి రక్తం అందదు. అపుడు పక్షవాతం వంటివి రావచ్చు. రక్తం అందని మెదడు కణాలు చచ్చిపోతాయి. ఇంకా ప్రమాదం ఏమిటంటే, చచ్చిపోయే మెదడు కణాలు గ్లూటామేట్ అనే సిగ్నలింగు అణువును కణాల్లోకి వదులుతాయి. ఇది ఎక్కువ పరిమాణంలో జరిగితే, విషం అవుతుంది. ఈగ్లూటామేట్ మెదడులో ప్రయాణించి మెదడులో దెబ్బతినకుండా మిగిలిన కణాలను కూడ దెబ్బతీస్తాయి. ఇది బ్రెయిన్ డామేజీకి దారితీయవచ్చు.
మల్టీపుల్ బ్రేక్ డౌన్ అంటే ఏమిటి
కణ విభజన, కణవృధ్ధిలను పలు మెకానిజాలు నిర్వహిస్తాయి. బయట నుండి వచ్చే సిగ్నల్స్ వల్ల కూడ కణ విభజన జరగచ్చు. కణాలు పొరుగు కణాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ఈసంబంధాలలో ఏవైనా మార్పులు వస్తే, కణాలు పరస్పరం హెచ్చరికలు పంపుకుంటాయి. కణాలు పరస్పరం గౌరవించు కుంటూ తమ హద్దులలో ఉంటాయి. ఏకణమైనా తాను ఇంక రిపేరుకి పనికిరాను అనుకుంటే, తన మరణాన్ని తానే ప్రారంభించుకుంటుంది.
కణ వృధ్ధి, కణవిభజన పైన చాల కంట్రోళ్ళు, చెక్ లు ఉంటాయి. అయినా కూడ, కణాల మధ్య సమాచార మార్పిడి దెబ్బ తిన వచ్చు. అపుడు కణవిభజన అదుపులేకుండా జరిగి క్యాన్సర్ కి దారి తీయ వచ్చు. సిగ్నల్స్ లేకపోయినా, కణాలు వృధ్ధి పొందే లేక విభజన చెందే లక్షణాన్ని సంతరించుకున్నాయంటే, అది కాన్స్రర్ కి స్వాగతం పలికినట్లే. కణానికి చచ్చిపోమని సందేశం వచ్చినా అవి పట్టించుకోకుండా విభజన చేసుకుంటూ పోతే కూడ కాన్సర్ రావచ్చు.
ఆస్త్మాలో సిగ్నల్స్ పాత్ర ఏమిటి
ఆస్త్మాలో అణువులు పంపే సంకేతాల వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలో దారులు కుంచించుకు పోవచ్చు. మందులు వాడినపుడు, ఊపిరితిత్తులలోని కండరాల కణాలకు వాటిని రిలాక్స్ అవమని సందేశాలు పంపినపుడు, శ్వాసదారులు తెరుచుకోవచ్చు.
కణాలమధ్య సిగ్నల్స్ సంచారానికి అడ్డంకి వ్యాధిగా మారినపుడు, కొత్త సంచార మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ముందు సమస్యను గుర్తించటం. ఆసమస్యకు తగ్గ ఉపాయాన్ని వెతకటం.
టైప్ 1 డయాబెటిస్ లో ఇన్సులిన్ ను ఇంజక్ట్ చేయటం ఇటువంటిదే. సిగ్నలింగ్ వ్యవస్థ శరీరంలో పలుచోట్ల దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ వంటి వ్యాధుల విషయంలో అది అంత తేలికకాదు.
చూడతగిన కొన్ని వెబ్ సైట్లు
diabetes.niddk.nih.gov/dm/pubs/causes/
www.purdue.edu/.../cell-signaling-pathway-linked-to-obesity,-type-2-diabetes-.html
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.