చర్చనీయాంశాలు రాజధాని, చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్
ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబు నాయుడు గారు, విజయదశమి అని కూడ చూడకుండా తెలుగు ప్రజలని బాదేశారు.
మీరు మీగ్రామంలో లేక పేటలో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని పరిచయం, ప్రచారం చేసి, బ్యాలెట్ విప్లవం తెద్దామనుకుంటున్నారా? అయితే సంప్రదించాల్సిన ఈమెయిల్ ybhask [at] gmail [dot] com.
.
అడవిలో రాజధానిని పెట్టుకోమని ఆయనను ఎవరో బలవంతం చేసారుట. ఎవరు. శివరామకృష్ణన్ కమీటీయా.
పనిలో పనిగా శ్రీచంద్రబాబు నాయుడు గారు ఒక బెదిరింపుకు కూడ పూనుకున్నారు. నీకు రెండు నెలలు టైమ్ ఇస్తున్నాను. మర్యాదగా లొంగిపో. లేకపోతే రేప్ చేస్తాను అని రావణుడు సీతతో అన్నట్లుగా లాండ్ పూలింగుకు ముందుకు రండి. లేక పోతే లాండ్ ఏక్విజిషన్ (భూసేకరణ) చేసి భూములు లాక్కుంటాం, అని. ఆయన రాజధానిని నిర్మంచబోయే కృష్ణానదికిరుప్రక్కలా ప్రాంతాలలో కొంత భాగాన్ని ఇప్పటికే అన్నిపార్టీల రాజకీయనేతలు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కొనిపారేయగా, కొంతభాగం ఇంకా వ్యవసాయాన్న నమ్ముకున్న సన్నకారు రైతుల దగ్గర ఉన్నది. ఆయన మాటలకి భూస్వాములు, రియాల్టర్లు, రాజకీయనేతలు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు లొంగరు. ఇంక లొంగాల్సింది ఎవరు.
భూ సేకరణ లేక లాండ్ పూలింగ్ నిజంగా భూయజమానులకు లాభదాయకమైతే, మాభూమిని తీసుకోమని వాళ్ళే పైరవీలు చేసుకొని, పర్సంటేజీలు , కిక్ బ్యాక్ లు , ముడుపులు ముట్టచెప్పటానికి లైన్లో నిల్చుంటారు. అపుడు బక్కరైతుకు భూ పూలింగ్ లేక భూసేకరణలో చోటే దొరకదు. రాజధానికి భూమిని ఇవ్వటం నష్టమైతే, పాలక నేతల బినామీ భూములు ఉన్నచోట కాక ఇతర పార్టీల నేతలు, సానుభూతిపరులు, ముడుపులు ఇవ్వనివారి భూమిని సేకరించాల్సి ఉంటుంది. అంటే కుమ్ములాట పాలక పక్ష ఘరానా వ్యక్తులకు ఇతర పార్టీల మధ్య ఘరానా వ్యక్తులకు మధ్య ఉంటుంది.
అడవులలో రాజధానిని పెట్టుకోమంటే నిజంగా అడవులలో కాదు. అడవులుగా ప్రభుత్వ రికార్డులలో ఉండి, చెట్లు నరికి వేయబడి, వ్యవసాయయోగ్యం కాక, వేస్ట్ ల్యాండ్ గా పడిఉండి, పొదలతో, పుట్టలతో నిండి ఉన్న భూమి. ఇలాంటి భూమి, నూజివీడు, దొనకొండ, మార్కాపురం, దిగువమెట్ట, విజయపురి దక్షిణ భాగాల్లో విపరీతంగా ఉంది. పైసా ఖర్చులేకుండా వస్తుంది. రాయలసీమకు దగ్గరగా ఉంటుంది.
షెడ్లువేసుకున్నా ఆత్మగౌరవంతో రాజధానిని నడుపుకోవచ్చు. నాగార్జునసాగర్ డామ్ నీళ్ళను, నందికొట్కూరు, ఆత్మకూరు, ప్రాంతంలో అయితే సంగమేశ్వవరం నీళ్ళను త్రాగటానికి వాడుకోవచ్చు. కావలికి పశ్చిమ ప్రాంతం నల్లమల అడవుల సానువుల వరకు, కూడ పరిశీలించ తగినదే. ఎలాగో వినుకొండ కాళహస్తి రైల్వే లైను ప్రతిపాదన ఉన్నందువల్ల ఆలైను వెంట ఉండే వేస్టు లాండ్స్ ను కూడ పరిశీలించ వచ్చు. అయితే నా దృష్టిలో కర్నూలు సమీప అటవీభూములలో ఒక ఉపరాజధాని, నూజివీడు అటవీభూములలో ఒక ఉపరాజధాని, నర్సీపట్నం అన్నవరం అటవీ భూములలో ఒక ఉపరాజధానిని నిర్మించుకుంటే, మూడు చిన్నరాష్ట్రాల కొరకు ఎంఎల్ ఏలు, ఎంపీ లు కృష్టి చేయటానికి వీలవుతుంది. రాష్ట్రశాసన సభకూడ తీర్మానం చేయవచ్చు. తాత్కాలక రాజధానిగా గన్నవరంలో సెజ్ బిల్డింగును, మూసేసిన ఇంజనీరింగు కాలేజీల భవనాలను లీజుకి తీసుకొని వాడుకోవచ్చు.
పెట్టుబడిదారీ వికారాలైన పీపీపీ, విదేశీ పెట్టుబడులు, బీ వో టీ లు వంటివి లేకుండానే, ఏ కన్సల్టెన్సీలకూ కోట్లు ఫీజు చెల్లించకుండానే, ఆత్మవిశ్వాసంతో, ఎవరినీ బ్రతిమాలకుండా బెదిరించకుండా, భూములు లాక్కోకుండా. కృష్ణానదీ తీరాన్ని మురికి కూపంగా మార్చకుండా, తూర్పు కనుమల కొండలను మురికివాడలుగా మార్చకుండా, కృష్ణానదీ పంటకాలువలను చెత్తకుండీలుగా మార్చకుండా, రాజధానిని నిర్మించుకోవచ్చు.
అరుణ్ జైట్లీగారు జబ్బునుండి కోలుకున్న తరువాతకూడానూ, భారత్ పాశ్చాత్య దేశాలకు ఇచ్చిన హామీలప్రకారం బజ్డెట్ లోటుని పూడ్చాలి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కి నిధులివ్వటం అసాధ్యం అవుతుంది. మోడీ గారికి పూర్తి మెజారిటీ రాకుండా, సంకీర్ణాలపై ఆధారపడాల్సి వస్తే చంద్రబాబుగారి డిమాండ్లకు తలవొగ్గేవాడేమో. కానీ మోడీగారు అద్వానీని, మురళీమనోహర్ జోషీని దెబ్బతీసిన తీరును చూస్తుంటే, శ్రీమోడీ మహోదయుడిని నుండి మనమేమీ ఆశించకూడదని అర్ధఁ అవుతుంది. గిరీశం చంద్రబాబుగారు డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి రావచ్చు.
శ్రీచంద్రబాబు నాయుడు గారికి, ఆయనను అదుపుచేస్తున్న కోటరీ నేతలకు, విపరీతంగా బినామీ భూములు విజయవాడ ప్రాంతంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది నీలాపనిందే కావచ్చు. శ్రీకృష్ణుడికి శమంతకమణిని అపహరించాడు అని వినాయకచవితి కథలో చవితినాటి చంద్రుడికి చూచినందు వల్ల వచ్చినట్లుగా నీలాపనింద కలిగితే, చంద్రబాబు నాయుడు గారు వినాయకచవితినాడు అద్దంలో తన ముఖాన్ని తానే చూసినందువల్ల ఈనీలాపనింద కలిగి ఉండవచ్చు. దానిని బాపుకోవాల్సిన బాధ్యత ఆయన పైననే ఉంటుంది.
చంద్రబాబునాయుడు గారికి పటాటోపం కాంక్ష తీవ్రమై ఒక భూతం లాగా పరిణమించే అవకాశం ఉంది. ఇంకా ఉంది. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.