Friday, October 3, 2014

360 UdbhaTam of Mr. Narendra Modi

అక్టోబర్ రెండు నాడు నిద్ర లేవగానే నాకు నిత్యస్మరణీయుడు  తెనాలి రామకృష్ణ మహాకవి గుర్తుకు వచ్చాడు.  ఎందుకు.  మొబైల్ లో శ్రీనరేంద్రమోడీ గారి స్వఛ్ఛభారత్ లో చీపురు పట్టుకొని ఊడవమని ఎస్ ఎమ్ ఎస్ వచ్చి కుయ్ కుయ్ అంటున్నది.  నాకు అరవింద్ కెజ్రీవాల్ గారి చీపురు గురించి తెలుసు గానీ, శ్రీనరేంద్రమోడీ గారి చీపురు గురించి తెలియదు.  చంద్రబాబు నాయుడుగారి చీపురు గురించి గల్లా జయదేవ్ గారి చీపురు గురించి తెలియదు.

తెనాలి రామకృష్ణుడు గుర్తుకు రాగానే ఆయన విరచిత మైన  ఉద్భటారాధ్య చరిత్ర గుర్తుకు వచ్చింది.  ఇది శైవానికి చెందినది.  (మహాకవి ఆకాలంలో తెనాలి రామలింగడా).  మహాకవి రామకృష్ణుడు అయ్యాక వైష్ణవ గ్రంధం పాండురంగ మాహాత్మ్యం విరచితమయ్యింది అంటారు.

ఉద్భటానికి మూడు అర్ధాలు ఉన్నట్లు కనిపిస్తుంది.  మొదటిది తాబేలు.  రెండవది చేట.  మూడవది, ఎక్కువ, మిక్కుటము.  ఉద్భటారాధ్య చరిత్రం లో నాయకుడు (protagonist)  ఉద్భటుడు అనే పేరుని తాబేలు అనే అర్ధంలో కానీ, చేట అనే అర్ధంలో కానీ వాడారు అనుకోలేం.  మిక్కిలి పూజార్హుడైన ఆరాధ్యుడైన (అమితాభా బచన్ గారి మనుమరాలు ఐశ్వర్యరాయ్ పుత్రిక ఆరాధ్య కాదండి), శివభక్తుడైన ఆరాధ్యుడు అనే అర్ధంలో వాడి ఉండాలి.

ఆంధ్రభారతి డాట్ కామ్ వారిది అద్భుతమైన నిఘంటువు ఉన్నది.  అక్కడ వెతికితే ఈ పర్యాయ పదాలు దొరికాయి.  http://www.andhrabharati.com/dictionary/.అందంద, అక్కజము, అఖర్వము, అగుర్వు, అగ్గలము, అగ్గలిక, అగ్రము, అడి, అతిమాత్రము, అతివేలము, అదనము, అనయము, అనల్పము, అపరిమితము, అపారము, అబ్బరము, అమితము, అమేయము, అవఘళము, అవేలము, అ(వ్వా)(వా)రి, అస్తోకము, ఆలము, ఇట్టలము, ఉగ్గడువు, ఉత్తరము, ఉద్ద(వ)(వి)డి, ఉద్గాఢము, ఉద్భటము, ఉద్వేలము, ఉబ్బకము, ఉ(ర)(ఱ)వు, ఎక్కటి, ఎగువ, ఎచ్చు, ఎస, ఏటము, ఏపు, ఏరా(ల)(ళ)ము, ఒడ్డు, కటికి, కడిది, కడు, కరకర, కరము, కృతము, కోలు, కోవరము, గడితము, గమకము, గరిష్ఠము, గాటము, గాఢము, గుర్వు, గొప్ప, జాస్తి, జిమ్మ, డంబు, తద్ద, త(ఱ)(ఱు)చు, తీవ్రము, తెందెప్ప, తెందేప, తొటదొప్ప, తొప్ప, తోరము, దిండి, దందడి, దుస్తు, దృఢము, దొంతి, నలి, నిట్టలము, నితాంతము, నిద్దా, నిబ్బరము, నిర్భరము, నె(ర)(ఱ)వు, నెఱా, నెఱి, పిండ్రము, పిచ్చలము, పుంఖానుపుంఖము, పుటపుటన, పుటము, పురుభువు, పురు(వు)(ము), పురుహము, పెక్కువ, పెచ్చు, పెద్ద, పెనుపు, పెలుచ, పెల్లిదము, పేరు, పైపెచ్చు, పొరి, పొలుపు, పొసపరి, ప్రచురత, ప్రచురత్వము, ప్రచురము, ప్రభూతము, ప్రాచుర్యము, ప్రాజ్యము, ప్రావృషేణ్యము, బంహిమ, బటువు, బరువు, బలితము, బహుళము, బాఢము, బారాది, బాహుళ్యము, బెట్టు, బెడగు, బెడిదము, బ్రాతి, భూయస్సు, భూరి, మఱిమఱి, మలచము, మించు, మి(క్క)(క్కు)టము, మిక్కిలి, మిగత, మిత్తి, మిమ్మటము, మీటు, మునుము, ముమ్మరము, మెండు, మేలుచేయు, మోపు, ఱొడ్డు, లాతు, లొడ్డు, వలదు, వలము, వసి, వావిరి, వాసి, విగ్రహము, విపులత్వము, విపులము, విప్పు, విరివి, వి(స్త)(స్తా)రము, విస్తృతి, విస్ఫారము, వెక్కసము, వెగ్గలము, వైపుల్యము, వైమాలము, వ్యాసము, వ్రతతి, వ్రేక, శానా, శేష, సంతతి, సమధికము, సమధిహారము, సముదీర్ణము, సమ్మూర్ఛము, సలువ, సాగ్రము, సొచ్చెము, సౌష్టవము, స్ఫీతము, హెచ్చు, హేర(ళ)(ల)ము.

వందపైన దొరికాయి కదండి.  మరి నరేంద్రమోడీ గారి పబ్లిసిటీ వ్యామోహాన్ని వర్ణించటానికి ఈ కాసిని విశేషణాలు సరిపోతాయా.  సరిపోవుకదూ.To continue. ఇంకా ఉంది. सशेष्.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.