Saturday, June 21, 2014

264 Have we gained anything by replacing Sonia-manmo raj with modi-jaitley-rajna raj??264 మనము సోనియా-మన్మో రాజ్ స్థానంలో మోడీ-జైట్లీ-రాజ్నా రాజ్ ను స్థాపించుకొని లాభ పడ్డామా?
చర్చనీయాంశాలు: 264, మన్మోహన్, సోనియా, నరేంద్రమోడీ, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ధరలు, గ్యాస్, సారానాథ్, బౌధ్ధం

మన్మోహన్ ముఖోటాగా ఏలబడిన, సోనియా రాజ్యం పోయిందని మనం సంబరపడటం ఎంత మేరకు సబబు? వీపు మీదనుండి రెండు బండరాళ్ళను క్రింది దించుకొని ఊపిరి పీల్చుకోటంలో తప్పులేదు.

అయితే మనం అంతే బరువు గల మూడు వెయిట్స్ ను వీపుపైకి ఎక్కించు కున్నాము, అని మర్చిపోతున్నాము.

గణిత శాస్త్రంలో strictly equivalent అనే గుర్తు ≣ఉంటుంది. దీనిని సర్వ సమానత్వం అనలేం కానీ గాఠిగా సమానం అనచ్చు.
≅ approximately equal. అంటే సుమారుగా సమానం అన్నమాట.
సోనియా మన్మోహన్ రాహుల్ త్రయాన్ని, మోడీ జైట్లీ రాజ్ నాథ్ త్రయాన్నీ పోల్చి మనం ≅ approximately equal. అంటే సుమారుగా సమానం అనలేం. ≣ గాఠిగా సమానం అనే అనాలి.
రైలు ఛార్జీలు పెంచటం, గవర్నర్లను బలవంతంగా రాజీనామా చేయించటం, పాతవాళ్ళు చేసినవే మేము చేస్తున్నాం అనటం, స్వదేశంలో పనులను తప్పించుకుని విదేశయాత్రలు చేయటం, మెజారిటీలనో మైనారిటీలనో ఎవరినో ఒకరిని మతప్రాతిపదికగానో, కులప్రాతిపదికగానో, ప్రోత్సహించటం ఇవన్నీ ఇరువురి సమాన ధర్మాలు.

కాబట్టి రాబోయే ఐదేళ్ళ పాలన ఇంక దిగజారిపోతుందా మెరుగవుతుందా? దీనికి జవాబు తేలికే. శాసించే పారిశ్రామిక వేత్తలు ఇరువురికీ ఒకరే కదా. శాసించే షేర్ బ్రోకర్లు, పవర్ బ్రోకర్లు ఇరువురికీ ఒకరే ఇంక మార్పేమిటి?నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రికలో సీపీఐ నేత అతుల్ అంజాన్ అనే సీపీఐ నేత చెప్పిన విషయాలు అక్షరాలా నిజాలు.
अभी तो सरकार भूटान जाएगी, बांग्लादेश जाएगी, यूएस कांग्रेस को संबोधित करेगी। इराक के बारे में जरा देर से सोचेगी: अतुल अंजान (सीपीआई)

తెలుగు సారం: ఇపుడు సర్కార్ భూటాన్ వెళ్తుంది. బంగ్లాదేశ్ వెళ్తుంది. యు ఎస్ కాంగ్రెస్ (అమెరికా వారి లోక్ సభ-దిగువసభ) ను సంబోధిస్తుంది. ఇరాక్ గురించి కొద్దిగా ఆలస్యంగా ఆలోచిస్తుంది.


ऐसा लग रहा है, मोदी जी और यूपीए में प्रतियोगिता चल रही है कि कौन आम आदमी को ज्यादा परेशान कर सकता है: अतुल अंजान(सीपीआई)
తెలుగు సారం: ఎలా కనిపిస్తున్నదంటే, మోడీజీకి మరియు యుపిఎ కి మధ్య ఎవరు ఎక్కువ ఆమ్ ఆద్మీని పరేశాన్ చేస్తారు అనే విషయంలో ప్రతియోగిత (పోటీ -- కాంపిటీషన్) నడుస్తున్నది. రైలు ఛార్జీలను పెంచటం అయిపోయింది. ఎల్ పిజి సిలిండర్ ను నెలకొక పదిరూపాయల లెక్కన పెంచుతారట. నవభారత్ టైమ్స్ వారి వార్త చదవాలనుకునే వారికి లింకు. http://m.nbt.in/text/details.php?storyid=36983632§ion=top-news. క్లిక్.

ఐదేళ్ళ భాజపా రాజ్యంలో ఐదేళ్ళు అంటే 60 నెలలే కదా, అంటే రూ. 600 మాత్రమే కదా పెంచేది, అని సంతోషించండి. అంటే రూ. 412 ఉండేది రూ. 1012 మాత్రమే కదా అయ్యేది.


పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడి పెట్టకున్నా, కాదేదీ వ్యాపారాని కనర్హంఉత్తర ప్రదేశ్ సారానాథ్ లో, బుధ్ధుడు మొదటిసారిగా తన బోధను ప్రారంభించిన ప్రదేశంలో, ఉన్న ఒక మర్రి చెట్టు కొమ్మ ఒకటి పెద్దది విరిగి పడిందట.

దాని పవిత్రతను వ్యాపారంగా మలుచుకున్న భిక్షువులు, పరిసరవాసులు, ఆకొమ్మలను చిన్నచిన్న టుకడాలుగా నరికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే బౌధ్ధ యాత్రికులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుట.

మహాకవి శ్రీశ్రీ కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా కావేవీ కవితకనర్హం అన్నారు. కావేవీ వ్యాపారానికనర్హం అనికూడ అంటే బాగుండేది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.