Sunday, June 22, 2014

265 What awaits Mr. L.K. Advani?


265 శ్రీ ఎల్ కే అద్వానీ గారి భవిష్యత్ ఏమిటి?

చర్చనీయాంశాలు: 265, అద్వానీ, నరేంద్రమోడీ, బిజెపి, హిందీ రాష్ట్రాలు, పెండ్యాల, పింగళి, Advani, Joshi, Sushma Swaraj, Narendra Modi

భారత్ లో 2014లో బిజెపి సాధించిన అఖండ విజయంలో అత్యధిక భాగం హిందీ రాష్ట్రాలలోనే అనేది విదితమే. బెంగాల్లోగానీ, తమిళనాడులో గానీ, కేరళలో గానీ, ఆంధ్రప్రదేశ్_తెలంగాణల లో గానీ, ఒరిస్సాలో గానీ, బిజెపి తన ప్రభావాన్ని చూపలేకపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్ సీ పీ లు అధికారంలో ఉన్నా, శివసేన బిజెపిలకు మూలాలు బలంగా ఉండేవి. ఊయల బల్లలో వలే ఒకసారి వారు, ఒకసారి వీరు తమ సత్తాచూపటం జరిగేది. బిజెపి కి బాగా ఈసారి బాగా కలిసి వచ్చిన రాష్ట్రాలు యూపీ బీహార్ లే.

గుజరాత్ లో శ్రీ నరేంద్రమోడీ అక్కడి స్థానిక సీనియర్ బిజేపీ నేతలను (శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్) లను శంకరగిరి మాన్యాలు పట్టించిన విషయం విజ్ఞులకు తెలిసిన విషయమే.

ఇపుడు అదే పధ్ధతిలో భీష్ముడు శ్రీ ఎల్ కే అద్వానీ, ద్రోణుడు శ్రీ మురళీ మనోహర్ జోషీలకు కూడ మంగళం పాడేయటం జరుగుతుందా, వారి భవిష్యత్ ఏమిటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఈ సందర్భంగా, ఉత్తరభారత్ లో హిందీ పత్రికలలో పాఠకుల అభిప్రాయంపై నేను చేసిన సర్వేలో, ముఖేష్ ఆర్యా అనే పాఠకుడు, 8.6.2013 నాడు, మండీ, గోబిందఘర్, పంజాబ్ నుండి నవభారత్ టైమ్స్ పత్రికలో బిజేపి భీష్ముడు అద్వానీ గారికి ఇచ్చిన సలహా (దీనిని సమర్ధించటం లేక వ్యతిరేకించటం నాపని కాదు) ఉత్తర భారతదేశపు యువతలో నెలకొన్న భావోద్వేగానికి ప్రతీకగా నేను భావించి, దానికి తెలుగు అనువాదాన్ని, నా వ్యక్తిగత టిప్పణి (వ్యాఖ్య), రాయ్ (అభిప్రాయాన్ని) ఇక్కడ ఇస్తున్నాను.
mukesh arya , mandi gobindgarh punjab का कहना है :
08/06/2013 at 08:15 AM
अडवाणी जी, आपको यह समझना चाहिए कि मोदी तो आपके बालक की तरह है, वो आपका शिष्य है और यदि भाजपा को मोदी सत्ता दिला सकते हैं तो ये आपके लिए गर्व की बात है। यदि आप नहीं समझना चाहते तो ये आपका मोदी के लिए विद्वेष ही नहीं, आपके उपर नितीश कुमार जैसे छद्म धर्मनिरपेक्ष नेताओं का प्रभाव और कांग्रेस का मोह माना जायेगा।

फैसला आपको करना है कि भारतीय राजनीती के इतिहास में अपना नाम आप कैसे अक्षरों में लिखवाना चाहते हो। मैं आपका बहुत आदर करता हूँ क्यूंकि भाजपा को यहाँ तक लाने में आपका बहुत योगदान है मगर आज आपने अपने ही आचरण से अपने ऊपर कलंक लगा लिया है और अब इस कलंक को धोने की जरूरत है।

मोदी को मोदी के ही समर्थक भूल जायेंगे अगर आप ईमानदारी से खुलासा कर दें कि वो क्या कारण हैं जिसकी वजह से आप मोदी से नफरत करने लगे।

ये गुपचुप खेल नहीं चलना चाहिए, सार्वजानिक जीवन में हो तो ये जानना जनता का अधिकार है कि आखिर माजरा क्या है आप दोनों के बीच।

लोगों को समझने दीजिये कि इस कलह में आप गलत हैं या मोदी।

कमाल है...

సుమారు తెలుగు సారం: అద్వానీజీ! మీరు అర్ధంచేసుకోవాల్సింది ఏమిటంటే, మోడీ మీకు బాలకుడు వంటి వాడు. అతడు మీ శిష్యుడు. ఒకవేళ మోడీ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగితే అది మీకు గర్వకారణమవుతుంది. దీనిని మీరు కోరకపోతే మీరు మోడి యొక్క విద్వేషి యని, నితీష్ కుమార్ వంటి లౌకిక వాదుల ప్రభావము, కాంగ్రెస్ వ్యామోహము మీకుందని భావించవలసి వస్తుంది.

మీరు ఫైసలా చేసుకోవాల్సింది ఏమిటంటే భారతీయ రాజనీతి ఇతిహాసంలో మీపేరు ఎలాంటి అక్షరాలతో లిఖించ బడాలా అని (ఇక్కడ భావం మోడీ పక్షంలో మీరుంటే, సువర్ణాక్షరాలని, లేకపోతే ఇనుప అక్షరాలు కాబోలు!!). నేను మిమ్ములను ఏమని చాలా ఆదరిస్తానంటే, భాజపాను ఈ ఉచ్చస్థితికి తెచ్చిన ఖ్యాతి మీదే. కానీ, మీరు , మీ ఆచరణతో , మీపై మీరే కళంకాన్ని ఆపాదించుకున్నారు. ఇపుడు మీరు ఆ కళంకాన్ని తుడిచి వేసుకోవలసిన అవసరం ఉంది.

మీరు మోడీని ఎందుకు ద్వేషించటం మొదలు పెట్టారో నిజాయితీగా బయట పెడితే నరేంద్రమోడీ అభిమానులు మోడీని మరచి పోతారు.

ఈ గప్ చుప్ క్రీడ జరగ కూడదు. సార్వజనిక జీవనంలో, మీకు మోడీకి మధ్య ఆఖరి విషయం ఏముందో, ప్రజలకు తెలుసుకునే అధికారం ఉంది.

ఈ కలహంలో మీది తప్పా, మోడీది తప్పా , అనే విషయాన్ని ప్రజలను తెలుసుకోనివ్వండి.

అద్భుతం, ఆశ్చర్యం ...


వైబీరావు గాడిద వ్యాఖ్యలుఅద్భుతం, ఆశ్చర్యం ... తరువాత ఆపాఠకుడి కొనసాగింపు వ్యాఖ్యలు దొరకలేదు. ఈపాఠకుడి వ్యాఖ్యలు శ్రీ అద్వానీ గారి దృష్టికి వెళ్ళాయో లేదో తెలియదు. శ్రీ అద్వానీ మహోదయ్ మటుకు, తనకు శ్రీ మోడీకి మధ్య విభేదానికి కారణం చెప్పలేదు. పాదాలకు నమస్కారాలు మటుకు చేయించుకున్నారు.

శ్రీ అద్వానీ అసంతృప్తికి బాహ్య కారణం, ప్రాధమికంగా ఒకటే. అదేమంటే, అప్పటి వరకు, సహజరీతిలో ప్రధాన మంత్రి పదవికి వాజ్ పాయ్ గారు లేనందున అద్వానీయే అభ్యర్ధి. ప్రధాని అభ్యర్ధి ఎవరు అనే విషయాన్ని ప్రకటించే ఆచారం అప్పటి వరకు ఏరాజకీయ పార్టీలోనూ లేదు. ఎన్నికలయ్యాక, వచ్చిన సీట్లను బట్టి, ఆపార్టీ ఆచారాలను బట్టి ఎవరో ఒకరిని ఎన్నుకోటం జరిగేది. కాంగ్రెస్ విషయాన్నే తీసుకుంటే, నెహ్రూ కుటుంబ సభ్యులే ఎన్నికయ్యే ఆచారమున్నా , 1967 ఎన్నికలయ్యాక శ్రీ మొరార్జీ దేశాయి కాంగ్రెస్ లోక్ సభనాయకత్వానికి ఎన్నిక జరగాలని పట్టు పట్టారు. ఎన్నిక జరిగి ఇందిరా గాంధీ గెలిచింది. ఇపుడు కూడ 2014 ఎన్నికలయ్యాక బిజెపి ఎంపీలు తమ నాయకుడిని రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుని ఉంటే మోడీ గెలిచేవాడో, అద్వానీ గెలిచేవాడో, ఇంకెవరన్నా గెలిచే వారో తేలేది. ఇపుడలా జరగలేదు. ముందుగా మోడీని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించటం ద్వారా ఒక అప్రజాస్వామిక సంప్రదాయానికి తెర ఎత్తారు. ఇదే శ్రీ అద్వానీకి కోపం తెప్పించి ఉండచ్చు. ఆవిషయమే ఆయన స్పష్టంగా బహిరంగంగా చెప్పి ఉంటే సరిపోయేది. బహుశా ఆయన ఆవిషయాన్ని మోడీ మొ|| వారికి చెప్పి ఉండచ్చు. మోడీ గ్రూపు దానిని పట్టించు కోకుండా ముందుకు తన ఎజెండాతో వెళ్ళింది. పార్టీలో వివిధ కమిటీలకు రాజీనామా చేసిన శ్రీ అద్వానీ తన రాజీనామాకు కట్టుబడి ఉండి మౌనంగా ఉంటే సరిపోయేది. లోక్ సభఅభ్యర్ధులకు టికెట్లు ఇచ్చేది మోడీ బృందం కాబట్టి, తాను ఏకాకి అయ్యాడు కాబట్టి, శ్రీ అద్వానీ లోక్ సభకు కూడ పోటీ చేయకుండా ఉండ వలసింది. ఇంకా ధైర్యం, ఓపిక ఉంటే, తన సమర్ధకులతో కొత్త పార్టీని స్థాపించి ఉండ వలసింది. అలా చేయకుండా ఆయన పాదాభివందనాలకు లొంగి పోయాడు, ఫలితం అనుభవించాడు.

శ్రీనరేంద్ర మోడీ అద్వానీ గారికి పాదాభివందనం చేసి, వినయం అభినయించి, మొత్తానికి ఆయనను లొంగదీసుకున్నారు. తెర వెనుక ఏమి జరిగిందో కానీ అద్వానీ గారు భోపాల్ నుండి పోటీ చేయటానికి పట్టు పట్టకుండా, గాంధీనగర్ నుండే పోటీ చేశారు. మోడీ దయనో, అద్వానీ గారి స్వశక్తియో మొత్తానికి, శ్రీఅద్వానీజీ లోక్ సభలోకి ప్రవేశించారు. అదృష్టవశాత్తూ భాజపా కూడ అధికారం లోకి వచ్చి శ్రీ మోడీ ప్రధాని అయ్యారు.

గడ్కారీ ప్రకటన హాస్యాస్పదంశ్రీ గడ్కారీ ఈ క్రింది విషయాలను ఇండియా టీవి నిర్వహించిన ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో చెప్పారుట. (ఈరోజు ఈనాడు 22.06.2014 లో వచ్చిన వార్త ఆధారంగా) నేను వ్రాస్తున్నాను.

భాజపా అగ్రనేత ఎల్ కే. అద్వానీ రాష్ట్రపతి అయ్యేందుకు తగిన స్థాయి అర్హతలు ఉన్న వ్యక్తి.

దేశ ఉప ప్రధానిగా చేసిన వ్యక్తికి లోక్ సభ స్పీకర్ గా అవకాశం కల్పించటం సబబుగా ఉండదు, అనే ఉద్దేశం తోనే ఆయనను ఆ పదవికి పరిగణనలోకి తీసుకోలేదు.

మేమంతా అద్వానీని గౌరవిస్తాము. ఆయన స్థాయికి తగిన పదవి లభించాలని కోరుకుంటున్నాము.

75 ఏళ్ళు మించిన వారిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోరాదని గడ్కారీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా సీనియర్ నేతలైన అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటివారు కేబినెట్ లో స్థానం పొందని విషయం తెలిసిందే.

బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అయినా ఇపుడు కథనాయకుడి పాత్రను పోషించలేరు.

ప్రస్తుత పథకాలకూ నిథులు లేవు. చేదు గుళికలే మనిషి అనారోగ్యాన్ని నయం చేస్తాయి.


వైబీరావు గాడిద వ్యాఖ్యలురాష్ట్రపతి పదవి ఈమధ్యనే ఫిల్ అప్ అయ్యింది. ఇంకా నాలుగేళ్ళకి గాని ఎన్నికలు జరగవు. శ్రీ అద్వానీజీకి ఇప్పటికే 86 ఏళ్ళు. అప్పటికి 91 ఏళ్ళు వస్తాయి. అలాటప్పుడు ఆయనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని అనుకోటాన్ని ఏమనాలి? పిల్లవాడి ఐస్ క్రీం కొనిపెట్తానని ఊరిస్తూ, తండ్రి కొనకుండా కాలక్షేపం చేసినట్లు శ్రీ అద్వానీ గారి ఇమోషన్స్ తో ఆటలాడుకోటం ఎంతవరకు సబబు?

ఎన్నికలలో జయాపజయాలు అనేవి, గోడ మీద పిల్లుల వంటివి. గోడ మీద నిలబడ్డ పిల్లి ఎటు దూకుతుందో అంచనా వేయటం ఎంత కష్టమో ఎన్నికల ఫలితాలు కూడ అంతే. ఈవిషయాన్ని గుర్తించక గెలిచిన వారు అంతా తమ ఘనతే అనుకుంటూ ఉంటారు. 1984లో శ్రీమోడీ కన్నా, ఘన విజయం సాధించిన శ్రీరాజీవ్ గాంధీ 1989 వచ్చేసరికి మాజీ అయిపోయారు. గుజరాత్ లో శ్రీమోడీ మూడు సార్లు గెలిచినా, నాలుగవ సారి గెలవాలని ఏమీలేదు. బెంగాల్లో బంకూరాలో తొమ్మిది సార్లు విజయం సాధించిన సిపీఎమ్ నేత శ్రీ బాసుదేవ్ ఆచార్యను మూన్ మూన్ సేన్ ఓడించలేదా.

'' కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే,
వారేరీ సిరిన్ మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై
పేరైనం గలదే... ''
అని పోతన్నగారన్నట్లుగా ఎందరో రాజులు వచ్చారు, పోయారు. ఎందరో నేతలు వస్తారు, పోతారు. గంగ వంటి గొప్ప నదులు ఎన్ని నీళ్ళున్నా, ఎంత పెద్ద వరద వచ్చినా నిలకడగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు స్వల్ప వర్షాలకే పెద్దగా ధ్వనులు చేసుకుంటూ, పొంగి పొర్లుతాయి, గంటాగితే చుక్కనీళ్ళు కూడ ఉండవు. కొన్ని విజయాలకే పొంగిపోయి పెద్దలను చులకనగా చూడటం ధీర గుణం కాదు. ఒక దేశ చరిత్రలో ఐదేళ్ళన్నా, 1826 రోజులన్నా, బుద్బుదాల్లాంటివే. ఐదేళ్ళ రాజ్యాధికారానికే పెద్ద కొమ్ములొచ్చినట్లు భావించటం ఉత్తముల స్వభావానికి శోభించదు. ఈసందర్భంగా శ్రీగడ్కారి గారన్నట్లుగా పత్రికలలో వచ్చిన మాటలు గమనార్హం:
''..మంత్రుల అభిప్రాయాలను ప్రధాని వింటారు. కొన్నింటిని అంగీకరిస్తారు. ప్రధానికి ఆయా శాఖలపై స్వీయ అవగాహన ఉంది. ప్రధాని అంటే మంత్రులు భయపడతారనేది నిజం కాదు. ప్రతి విషయంలోనూ లోతుపాతులను ఆయన తెలుసుకుంటారు. అందుకే శాఖల కార్యదర్శులు ఆయనంటే భయపడతారు..''


శ్రీ గడ్కారీ గారి ఈ వివరణ, ఈ వైబీ గాడిదకు అంత అర్ధవంతంగా కనిపించటం లేదు. ముఖ్యంగా ఆఖరి వాక్యం. ఈ భయపడటం ఏమిటి? ఎవరైనా ఎందుకు భయపడాలి. చట్టబధ్ధమైన పాలనలో, రాజ్యాంగబధ్ధమైన పాలనలో, ప్రధాని, మంత్రులు, అధికారులు ఎవరు పనిచేసినా, న్యాయ శాస్త్ర, రాజ్యాంగ సూత్రాల ననుసరించే కదా. అధికారులు తమకి భయపడుతూ, ఎల్లవేళలా విధేయులై ఉండాలని, ప్రధాని, కేంద్ర మంత్రులు కోరుకుంటున్నారా? అలా కోరుకోటంలేదని ఆశిద్దాము. LOYALTY TO PERSONS instead of LOYALTY TO LAW & CONSTITUTION అనేది కాంగ్రెస్ పాలనలో జరిగి ఉండచ్చు. బిజేపీ పాలనలో ఆ అశాస్త్రీయ అధమ పధ్ధతి కి చోటివ్వరని ఆకాంక్షిద్దాము.

75 సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉండదు అనే నిర్ణయాన్ని ఎవరెవరు కలిసి తీసుకున్నారు? కేవలం గడ్కారీ, ప్రధాని మాత్రమే కలిసి తీసుకున్నారా (పైవార్తలో ఏదో లోటు ఉన్నది) లేక ఇంకా ఎవరెవరు కలిసి తీసుకున్నారు? ఈవిషయంలో జాతీయ స్థాయిలో , అఖిల పక్షస్థాయిలో, లేదా కనీసం బిజెపి స్థాయిలో బహిరంగ చర్చ ఏదైనా జరిగి ఎక్కడైనా తీర్మానాలను ఆమోదించారా?

వారు తీసుకున్న ఈకీలక నిర్ణయాన్ని ప్రజలకు ఎన్నికలముందు ఎప్పుడైనా చెప్పారా? మోడీగారు షుమారు 400 ర్యాలీలలో ప్రసంగించారుట కదా, ఒక్క ర్యాలీలో అయినా, ఒక చాయ్ పర్ చర్చా కార్యక్రమంలో అయినా ఈవిషయాన్ని చెప్పలేదేమిటి? కనీసం 75 ఏళ్ళు దాటిన అద్వానీ, జోషీ వంటి సీనియర్లకు ఈవిషయాన్ని ఎన్నికల ముందే చెప్పారా? చెప్తే వారు ఎన్నికలలో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకునే వాళ్ళు కదా!!

పథకాలకు కేంద్రంలో నిధుల కొరత ఉందని గడ్కారీ, మోడీ, జైట్లీ, శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీవెంకయ్యనాయుడు, లకు ముందు తెలుసు కదా. చేదు గుళికలు అవసరమని వారు ర్యాలీలలో, చాయ్ పర్ చర్చా కార్యక్రమాలలో, ఎన్నికలముందే ప్రజలకు ఎందుకు చెప్పలేదు?

కెప్టెన్ గా పని చేసిన వారు తరువాత క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్, హాకీ మొదలగు క్రీడలలో సాధారణ సభ్యులుగా ఎన్నో ఏళ్ళు ఆడిన ఉదాహరణలు కోకొల్లలు. సునీల్ గవాస్కర్, సచీన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ మొ|| వారందరు అలా వేరొక కెప్టెన్ క్రింద ఆడి వారికి సహకరించి, వారి విజయానికి తోడ్పడిన వాళ్ళే. టీమ్ స్పిరిట్ అనుకున్నా, డబ్బుపై ప్రీతి అనుకున్నా, సర్దుకుపోటం అనే ఆచారం ఉంది. బహుశా శ్రీ అద్వానీ, జోషీలు ఉప ప్రధానులుగానో, సీనియర్ మంత్రులు గానో సర్దుకుపోయే వాళ్ళేమో. విద్యాగంధం తక్కువ కావటమే కాక, దానిని అభివృధ్ధి చేసుకుందాం అనే కాంక్షలేని, మేకప్ తో కాలక్షేపం చేసే టీవీ నటి స్మృతి ఇరానీ 120 కోట్ల మానవ అభివృధ్ధి మంత్రిణిగా ఏవిధంగా అర్హురాలు? పూర్తి గ్రూప్ కంపెనీల వ్యవహారాలలో, అక్రమాల ఆరోపణలను ఎదుర్కున్న శ్రీగడ్కారీ, ఏవిధమైన పూర్తి స్థాయి విచారణలను ఎదుర్కోకుండానే, కీలకమైన కేంద్ర రవాణా మంత్రి పదవికి ఏవిధంగా అర్హులయ్యారో, ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసి విద్యారంగానికి ఎంతో సేవ చేసిన మురళీ మనోహర్ జోషి ఏవిధంగా అనర్హుడు అయ్యాడో అర్ధం కావటం లేదు.

ఇపుడు డిఫెన్స్ శాఖ ఇంకా ఖాళీగానే ఉంది. దానిని శ్రీ అద్వానీకి ఇస్తే ఆయన దానిని నిర్వహించలేడా? లేదా రాజనాధ్ సింగుకి రక్షణ శాఖను ఇచ్చి హోం శాఖను శ్రీ అద్వానీకి ఇవ్వలేరా? ఆయన పాపం గతంలో అభినవ సర్దార్ పటేల్ గాపొగిడించుకున్నవాడే కదా.

దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే అద్వానీ, జోషీలను భ్రష్ఠు పట్టించటం కావాలని చేసిన పనే. అయితే తాతల నాటి బొచ్చె తరతరాలు అని ఒక సామెత ఉంది. తాడి నెక్కువానిని తలదన్నువాళ్ళుంటారు. గుడిని మింగే వాళ్ళుంటే, గుడిని, గుళ్లోలింగాన్ని అన్నిటినీ మింగే వాళ్ళుంటారు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్నలుంటారు. 1826 రోజులకే కదా ఈరాజ్యం!!


అయితే చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అని ఒక సామెత ఉంది. గుఱ్ఱపు డెక్క మొక్కల్ని వేసి మామిడి కాయలు కాయమంటే కాయవు. అద్వానీ, జోషి వంటి వారు, ఇపుడు కొంత తీరిక దొరుకుతుంది కాబట్టి, తాము ఎలాంటి అనుచరులను ప్రోత్సహించారో, వారు తమకు ఎలాటి పాఠాలను నేర్పారో ఆత్మకథలు వ్రాసుకుని కనీసం మరణానంతరం ప్రచురించమని ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి. నాకయితే జగదేకవీరుడి కథ సినిమాలో ముక్కామల పెద్ద కొడుకు గుర్తుకు వస్తున్నాడు. ఆ నటుడి పేరు నల్లరామ్మూర్తి అనుకుంటాను. వాడు ముక్కామలను, తల్లిని చెరసాల్లో పారేస్తే వారెలానో బయటపడి, ఎన్ టీ ఆర్, బి. సరోజాదేవి, రేలంగిలు ఉన్న రాజ్యానికి చేరుకుంటారు.


ఈనాటి పాట


చిత్రం: జగదేకవీరుని కథ. రచన: పింగళి. సంగీతం: పెండ్యాల.

జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా, అహ ఏమి హాయిలే హలా !! ||2||

ఉన్నది పగలైనా అహ వెన్నెలె కురిసేనె ||2||
అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే ||2||

|| జలకాలాటలలో కలకల పాటలలో ||

తీయని రాగమెదో మది హాయిగ పాడేనె ||2||
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే ||2||
అది వరుని కొరకు పిలుపే
|| జలకాలాటలలో కలకల పాటలలో ||


వైబీరావు గాడిద వ్యాఖ్యఈపాట విజయా స్టూడియో వారి ఫౌంటేయిన్ లేక పూల్ లో చిత్రించినది. ఇదే పూల్ ను మనం చాలా సినిమాల్లో , చాల మంది నటీనట మణులు తమ గుడ్డలను తడిపేసుకుంటుండగా చూడచ్చు. మోడీ గారి ప్రధాన మంత్రి కుర్చీ, రాజ్ నాథ్ సింగ్ గారి హోం మంత్రి కుర్చీ, స్మృతీ ఇరానీ గారి విద్యామంత్రి కుర్చీ, గడ్కారీ గారి రవాణా మంత్రి కుర్చీలు కూడ ఇలాంటివే. సినిమాల్లో వేషాలకోసం తంత్రాలు జరిగినట్లుగానే కుర్చీ తంత్రాలు కూడ ఉంటాయి.

ఈనాటి శ్లోకంభర్తృహరి మహాకవి. నీతిశతకం. సంస్కృతం.

పరిగత పరమార్థాన్‌ పండితాన్‌ మా-వమంస్థాః
తృణమివ లఘు లక్ష్మీర్ నైవ తాన్‌ సంరుణద్ధి ।
అభినవ మద రేఖా శ్యామ గండ స్థలానాం
న భవతి బిసతంతుర్వారణం వారణానామ్‌ ॥

తెలుగు సారం: (గడ్కారీ రాజా, వెంకయ్యరాజా, జైట్లీ రాజా, నరేంద్రమోడీ రాజా) పరమ తత్వం తెలిసిన పండితులను అవమానించకండి. వాళ్ళకు లక్ష్మి (సంపద) గడ్డిపోచతో సమానం. అభినవ మద రేఖా శ్యామ గండస్థలం కలిగిన, మదించిన ఏనుగును గడ్డిపోచతో బంధించ గలరా?


వైబీరావు గాడిద వ్యాఖ్యలుశ్రీ ఎల్ కే అద్వానీ గారు, శ్రీ మురళీమనోహర్ జోషీ గారు పరమ తత్వం తెలిసిన పండితులలాగా ''నిర్మోహి'' జీవితాలు ప్రారంభించాలి. జోషి గారు , కక్కిన కూడు వంటి మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆశ పడకూడదు.

ఉడుముండదే నూరేండ్లును,
పడియుండదె పేర్మి పాము పది నూరేండ్లున్,
మడువున కొక్కెర యుండదె,
కడునిల పురుషార్ధ పరుడు కావలె సుమతీ.

(దీనిని సరిదిద్దుతూ తిరగవ్రాయవలసి యున్నది. ఈలోగా మీ మనోభావాలేమన్నా గాయపడితే కామెంట్లలో వ్రాయండి.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.