Monday, June 2, 2014

246 Indians are capable of prostrating and pulling down

025 Indians are capable of prostrating and pulling down
025 భారతీయులు కాల్ మొక్క గలరు కాళ్ళు గుంజ గలరు!!!!
Topics for discussion, చర్చనీయాంశాలు: BJP, Venkaiah Naidu, Narendra Modi, L.K. Advani, M.M. Joshi, బిజెపి
శ్రీవెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖామాత్యులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మాత్యులు, బిజెపి సీనియర్ నేత, మాజీ అధ్యక్షులవారు. వారు ఇటీవల హైదరాబాదులో సన్మాన సందర్భంగా చెప్పినట్లుగా మీడియాలో వచ్చిన మాటలు:

I do not like people prostrating before us. మాముందు ప్రజలు వంగి నమస్కరించటం నాకు ఇష్టం లేదు.

I never used to prostrate in front of seniors like Advani and Vajpayee though they gave me political birth. నేను ఎప్పుడు అద్వానీ మరియు వాజ్ పేయీ వంటి సీనియర్లు నాకు రాజకీయ జన్మ నిచ్చినప్పటికి, వారి ముందు సాష్టాంగ పడలేదు.

Many are prostrating in front of me after I became Union Minister. I will be careful with them. ... Many pretend to prostrate and suddenly pull a person as happened in case of then CM NTR. ,,, నేను కేంద్రమంత్రిని అయ్యాక నా ముందు చాలా మంది సాష్టాంగ పడుతున్నారు. వాళ్ళతో నేను జాగ్రత్తగా ఉంటాను. ... చాలా మంది సాష్టాంగ పడినట్లుగా నటిస్తారు, మరియు హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎన్ టీ ఆర్ గారిని చేసినట్లుగా, తాము సాష్టాంగ పడిన వారినే లాగిపడేస్తారు.


Mr. Venkaiah Naidu is said to have recollected how four to five people mostly women prostrated to NTR and when he asked, NTR remarked it was their love and affection. Mr. Naidu is said to have proceeded to explain how Nadendla Bhaskara Rao pulled down NTR later. శ్రీ వెంకయ్యనాయుడుగారు గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఒక సారి నలుగురైదుగురు వ్యక్తులు, ఎక్కువగా స్త్రీలు ఎన్ టీ ఆర్ ముందు సాష్టాంగ పడ్డారుట. శ్రీవెంకయ్యగారు ఎన్ టీ ఆర్ ను ఈవిషయం గురించి అడిగినపుడు ఆయన అది వారి ప్రేమ మరియు అభిమానం అన్నారుట. శ్రీవెంకయ్యనాయుడు గారు , ఆతరువాత నాదెండ్ల భాస్కర రావు ఎన్ టీ ఆర్ ను ఎలా లాగి పడేశారో వివరించారు.

ybrao a donkey's comments వైబీరావు గాడిద వ్యాఖ్యలుసాధారణంగా పేద ప్రజలు నేతలముందు , అధికారులముందు, సాష్టాంగ పడినప్పటికీ పేదప్రజలకు, తరువాత తాము మోకరిల్లిన వాళ్ళ కాళ్ళను లాగి పడేసే తత్వం ఉండదు. నేను తెలంగాణలో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న కాలంలో రోజుకి పది మంది నాకాళ్ళమీద పడుతూ ఉండే వాళ్ళు. వాళ్ళెవరూ తరువాత నాకాళ్ళను గుంజేసి కింద పడేయలేదు. అమాయకులైన వాళ్ళకు కాళ్ళమీద పడే అలవాటును నేర్పిన పెత్తందారులను మనం తప్పు పట్టాలేమో. ఏది ఏమైతేనేమి, కాల్ మొక్కే వారి అలవాటును మాన్పించి తమ సమానత్వ హక్కును తాము పొందటం నేర్పటానికి, నేను కొంత శ్రమ పడాల్సి వచ్చింది.

కాళ్ళు పట్టుకున్నా, గుంజి పారేసినా, ఏది చేసినా రాజకీయ వాదులే చేయాలిముందు సాష్టాంగ పడేదీ, తరువాత కాళ్ళను గుంజి నేలకు ఈడ్చి పారేసేదీ రాజకీయవాదులే. వాళ్ళు సాష్టాంగపడినా, పడకపోయినా, కాళ్ళను గుంజి నేలకేసి కొట్టటం వాళ్ళ వృత్తి కళలలో ఒకటి.

Now see this picture. Like mythological Suyodhana Mr. Narendra Modi is prostrating before Mr. L.K. Advani, the Bhishmacharya of BJP. ఇపుడు ఈచిత్రాన్ని చూడండి. మహాభారత సుయోధనుడిలాగా శ్రీ నరేంద్రమోడీగారు, బిజేపీ భీష్మాచార్య , శ్రీ ఎల్కే అద్వానీ గారిముందు ఏలా మోకరిల్ల బోతున్నారో.
In the right side photo Mr. Modi was prostrating before Advani. In the left side photo he was bending forward to seek blessing of Mr. Murali Manohar Joshi.

కుడి వైపు ఫొటోలో శ్రీమోడీ అద్వానీ గారికి మోకరిల్లపోవటం, ఆయన పైకి ఎత్తటం. ఎడమ వైపు ఫొటోలో శ్రీ మోడీగారు శ్రీ మురళీమనోహర్ జోషీగారి ఆశీస్సులను కోరుతూ ముందుకి వంగుతున్నారు.

Now, what is happening to the Gurus and deliverers? ఇపుడు ఈ భీష్మ ద్రోణాది గురువులకు, ఆశీస్ - దాతలకు ఏమి జరగబోతున్నది?

How could Mr. Modi suddenly bring a bench mark of maximum age of 75 years for being taken into Cabinet?

మంత్రివర్గంలోకి తీసుకోటానికి గరిష్ఠ వయసుగా 75 ఏళ్ళ బెంచి మార్కుని ఎక్కడ నుండి తెచ్చి పెట్టారు?

Mr. Modi has the audacity to take into his Cabinet, TV actress Ms. Smriti Irani who has not completed her XII Standard or Part I of her Correspondence Course and entrust her the administration of Human Resource Development of 1200 million Indian Citizens, supervising IITs, IIMs, UGC, AICTE, Public and Private Sector Universities and what not!!

శ్రీ మోడీగారు ఒక టీవీనటి , కేవలం 12 వ తరగతి చదివిన, డిగ్రీ కరెస్పాండెన్స్ కోర్సులో చేరి పూర్తిచేయని స్మృతి ఇరానీ గారిని తెచ్చి 1200 మిలియన్ భారతీయుల మానవాభివృధ్ధిని పర్యవేక్షించే పనిని, వేలకోట్ల రూపాయల బడ్జెట్ గల ఐఐటీలు, ఐఐఎమ్ లు, యూజీసీ, ఎఐసీటీఈ, ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను పర్యవేక్షించే పనిని అప్పగించారంటే ఎంత అడాసిటీ అనాలి?

శ్రీమోడీ గారినుండి సాంగ ప్రణామాలను స్వీకరించిన శ్రీ అద్వానీ గారు ఏస్థితికి దిగజారి పోయారంటే, 'నాకు ఏబాధ్యత నిచ్చినా స్వీకరిస్తాన'ని, లొంగిపోయి దేనికైనా సిధ్ధపడ్డారు. ఏబాధ్యతనూ ఇవ్వక పోతే?!!!!

అద్వానీ గారికి ప్రధానమంత్రి గౌరవ సలహాదారు పదవి, మానవ వనరుల మంత్రిత్వం ఇచ్చి, ఆయనకు సహాయమంత్రిగా సృతి ఇరానీ గారిని నియమిస్తే ఆమె ఆశాఖ లక్ష్యాలను, వనరులను, సవాళ్ళను, అర్ధంచేసుకోటం నేర్చుకొని ముందు ముందు క్యాబినెట్ ర్యాంకు పొంది ఉండేది.

డైరక్టుగా స్వర్గీయ పీవీ నరశింహారావువంటి మహామేథావి , బహుభాషా వేత్త , सहस्र फण् రచయిత, నిర్వహించిన మానవ వనరుల శాఖను కనీస విద్య చదవటాన్ని అశ్రధ్ధ చేసిన ఒక టివి నటికి ఎలా బంగారు పళ్ళెంలో సమర్పిస్తారు? గతంలో ఆమెకు కనీసం సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవంగానీ, కనీసం ఒక ప్రైవేటు కాలేజీని నడిపిన అనుభవంగానీ లేవే. ఈ మోడివేషన్ (మోటివేషన్) వెనుక ఏదివ్య శక్తి ప్రభావం ఉన్నదో.

ఇకనామిక్స్ అర్ధశాస్త్రంలో ఇకనామిక్ మ్యాన్ ఆర్ధిక మనుష్యుడు ఉంటాడు. వీడు ఎంతో కొంత హేతుబధ్ధంగా ఆలోచిస్తాడు. ధర తగ్గితే కొనుగోళ్ళను పెంచుకుంటాడు. ప్రెడిక్టబుల్ బిహేవియర్ మనం ముందుగా ఊహించటానికి వీలైన ప్రవర్తన ఉంటుంది. ఇకనామిక్ మ్యాన్ అన్ ప్రెడిక్టబుల్ అయితే మనం డిమాండు కర్వ్ ను గీయలేం.

రాజకీయనాయకుల పరిపాలనా శాస్త్రం లో ఇలాంటి హేతుబధ్ధతలు ఏవీ ఉన్నట్లు కనబడవు. శ్రీమోడీ గారు తన నిర్ణయంలోని హేతుబధ్ధతను ఎలా సమర్ధించుకుంటారో. సాధారణంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలను ఇవ్వరు. ఇచ్చినా తాను చెప్పింది వాళ్ళు వ్రాసుకోవాల్సిందే.

Mr. Joshi was a Physics Professor and was a stalvart in many Educational Commissions and Committees, besides being a Senior HRD Minister in Vajpayee's Cabinet. Mr. Advani needed no introduction.

శ్రీమోడీ ముందుకు వంగి పోయి ఆశీస్సులు కోరిన శ్రీమురళీ మనోహర్ జోషీ గారు విశ్రాంత ఫిజిక్స్ ప్రొఫెసర్. ఎన్నో మానవాభివృధ్ధి కమీటీలలో పనిచేయటమే కాక, వాజ్ పేయీ మంత్రి వర్గంలో మానవాభివృధ్ధి మంత్రిగా కూడ కొంత కృషిచేశారు. ఆయన మానవాభివృధ్ధి మంత్రిగా పూర్తిగా విజయం పొంది ఉండక పోవచ్చు. అపుడు ఆయనకు లభించింది కేవలం 1826 రోజులే (ఐదేళ్ళే). అపుడు సంపాదించిన అనుభవాల ప్రాతిపదికన తన తప్పులను సవరించుకుని, ఈ రెండవ 1826 రోజుల టర్మ్ లో మెరుగైన ఫలితాలను చూపేవాడేమో.

మురళీమనోహర్ జోషీ గారు తన చాపకిందకి నీళ్ళు వస్తున్నా ఒక జోక్ వేశారు. మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలో, ప్రధాని ఇష్టం అని అంటున్న, మోడీగారిని చామరాలతో విసిరి చల్లగాలి వీచేలా చూస్తున్న జోషి గారి మనః ఆంతర్యం ఏమిటో నాకర్ధం కావటం లేదు. దీని భావమేమి తిరుమలేశ?

ప్రధానమంత్రి తనకు నచ్చిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకోటం అనేది నియంతృత్వం అవుతుంది తప్ప, ప్రజాస్వామ్యం అవదు. ఈసమస్యను మనం శాశ్వతంగా పరిష్కరించుకోవాలంటే, మంత్రి వర్గం సభ్యులను, వారి శాఖలవారీగా, రహస్య బ్యాలెట్ ద్వారా, ఎంపీలు ఎన్నుకునే నిబంధనలను మనం ఏర్పాటు చేసుకోవాలి. దీని కొరకు మనం ఒక ప్రత్యేక చట్టం చేసుకోవాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించుకోవాలి.

Actually, it seems to be the fault of Mr. Vajpayee, Mr. Advani and Mr. Murali Manohar Joshi to have encouraged Mr. Narendra Modi, by exporting him from Delhi to Ahmedabad as Chief Minister in 2002.

శ్రీ నరేంద్రమోడీ చేత ప్రణామాలు చేయించుకుని ఆయనను ప్రోత్సహించిన శ్రీ వాజ్ పేయి, శ్రీ అద్వానీ, శ్రీ ము.మ. జోషీ గారిది ఈ దోషం అవుతుంది, తప్ప శ్రీ మోడీది అవదు.

The trinity sowed the wind and reaped the whirlwind. They deserve their downfall.

ఈ త్రిమూర్తులు గాలులను విత్తారు. సుడిగాలులను పంటగా పొందారు. వారి పతనానికి, వారు అర్హులే.

Mr. Venkaiah Naidu might not have prostrated before Mr. Vajpayee or Mr. Advani. But one thing is definite. Mr. Venkaiah Naidu, Mr. Rajnath Singh, Mr. Arun Jaitley, Ms. Sushma Swaraj played their AshADha bhUti roles in letting down Mr. Advani and Mr. M.M. Joshi. Now, Mr. Advani and Joshi must have been repenting for encouraging flunkeys like Messrs. Naidu, Rajnath, Jaitley, and Swaraj.

శ్రీ వెంకయ్య నాయుడు గారు శ్రీవాజ్ పేయి లేక శ్రీ అద్వానీ గారి ముందు సాష్టాంగ పడి ఉండక పోవచ్చు. (ప్రస్తుతం ఆ ఫొటోలు లభించటం లేదు. అలాంటివి ఉన్నవారెవరైనా పబ్లిక్ డొమెయిన్ లోకి తెస్తేగానీ తెలియదు.) కానీ ఒకటి మటుకు నిశ్చయం. శ్రీ వెంకయ్యనాయుడు, శ్రీ రాజనాథ్ సింగు, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీమతి సుష్మా స్వరాజ్, వీరంతా, అద్వానీ, మరియు జోషీలను నీరస నీరవులుగా చేయటంలో తమ తరహా ఆషాఢ భూతి శిష్య పాత్రను నిర్వహించిన వాళ్ళే. ఇలాంటి ఫ్లంకీ లను ప్రోత్సహించినందుకు, శ్రీ అద్వానీ, శ్రీ జోషీ నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండాలి.

సమయానుగుణంగా తమ ఫక్కీలను మార్చుకొని ఈనేతలు గుజరాత్ లో శంకర్ సింగు వాఘేలా, శ్రీ కేశూభాయ్ పటేల్ లకు పట్టిన గతి తమకు పట్టకుండా ఆత్మరక్షణ చేసుకున్నారనుకోవాలి.

What will happen to Indian Parliament after prostration?మోకరిల్లాక, మన పార్లమెంటుకి ఏమి జరుగుతుంది?
This photo shows, Mr. Narendra Modi prostrating before the entrance of Indian Parliament. ఈఫొటోలో శ్రీ నరేంద్రమోడీ పార్లమెంటు ముందు మోకరిల్లటాన్ని మనం చూడచ్చు.
We have to wait and see what he is going to do to the Indian Parliament, having prostrated before it.

ఇపుడు ఇలా మోకరిల్లిన శ్రీనరేంద్రమోడీ, మన పార్లమెంటుని ఏవిధంగా సత్కరించ బోతున్నారో వేచి చూడాలి.

అజ్ఞాత వీరుడు శ్రీ మురళీకృష్ణకు నా అభినందనలుదక్కన్ క్రానికల్ పత్రిక ప్రచురించింది. 31.5.2014 నాడు తన పాపాయితో సహా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలోకి దూకిన శ్రీమతి ముండ్లమూడి సుజాత అనే 26 ఏళ్ళ గృహిణిని శ్రీ మురళీకృష్ణ అనే ఆటో డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి రక్షించాడు. రక్షించటం పూర్తికాగానే తన దారిన తాను వెళ్ళిపోయాడుట. అదృష్టవశాత్తు సమయానికి అక్కడకి చేరుకున్న క్రానికల్ ఫొటోగ్రాఫర్ మురళీకృష్మ ఫొటోను తీసి మనకందించాడు. అగ్రశ్రేణి తెలుగు పత్రికలు ఏమి చేస్తున్నాయి? చంద్రబాబుకి, జగన్ కి, మోడీకి, భజన చేస్తున్నాయా?

ఏది ఏమైనా రియల్ హీరో మురళీ కృష్ణకు నా అభినందనలు. Let his tribe flourish. అతడి జాతి విత్తనాలు సర్వత్రా వ్యాపించు గాక!!!!

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.