Sunday, May 11, 2014

232 We are all one- you people, do not become fools232 మేమంతా ఒకటే. జనాల్లారా, మీరు ఫూల్స్ కాకండి.

చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, నవభారత్ టైమ్స్, రాజకీయాలు, Narendra Modi, नरेंद्रमोडी,వ్యంగ్యం

भा.भा.प्र.प्र. श्री नरेंद्र मोडी महोदय् భా.భా.ప్ర.ప్ర. శ్రీ నరేంద్ర మోడీ మహోదయ్ నవభారత్ టైమ్స్ అనే హిందీ పత్రికకు 11.5.2014 నాడు ఒక ఇంటర్వ్యూని ప్రసాదించారు. ఇందులో 17 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన దరిమిలా, ఎన్నికల ప్రచారంలో జన్మించిన కాఠిన్యం, రాబోయే రోజులలో తన విధానాలు ఎలా ఉండబోతున్నాయి, మొ|| అంశాలను కవర్ చేశారు. ఇంటర్వ్యూ కర్త: శ్రీ గుల్షన్ రాయ్ ఖత్రీ. ఈ ఇంటర్వ్యూని చదవాలనుకునే వారికి లింకు: http://m.nbt.in/text/details.php?storyid=34937356§ion=top-news కి వెళ్ళటానికి క్లిక్

వైబీరావు గాడిద వ్యాఖ్యలు:ఈ ఇంటర్వ్యూ చాల సుదీర్ఘంగా ఉన్నది. ముందుగా నిపుణులైన వ్యక్తులు, కొన్ని రోజులు ముందుగా, లోతుగా ఆలోచించి తయారు చేసినదిగా కనిపిస్తున్నది. స్పాంటేనియస్ (spontaneous सहज) లాగా కనిపించటం లేదు. వారణాసిలో శ్రీ మోడీ గారు నిషేధిత ర్యాలీలో పాల్గొన్న తరువాత, కిరాయి విమానంలో, హెలికాప్టర్లలో వెనక్కి వెళ్ళాక ఉద్రేకాన్ని చల్లార్చుకొని, ఆలోచించుకోటానికీ, కొంత సమయం అవసరం. మోడీ గారి కాంపెయిన్ లో గొప్పతనం ఏమిటంటే, ప్రతిదీ ప్రణాలికా బధ్ధంగా జరిగి పోతుంది. నవగ్రహాలు రావణుడి చేత శాసించబడి, ఇంద్రజిత్ జనన సమయంలో నిర్దేశిత స్థానాలలో నిలబడినట్లుగా, శ్రీమోడీ గారి నిర్వహణలో ప్రతి వ్యక్తీ, ప్రతి సంస్థా, స్థాణువులై, తిరిగి కదలినపుడు నిర్దేశిత కక్ష్యలో, నిర్దేశిత వేగంలో సంచరించి, తిరిగి ఆగమన్నప్పుడు ఆగటం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంపెయిన్లకు ఈలక్షణం అవసరమా కాదా అనే విషయాన్ని నేను చెప్పలేను.

పెట్టుబడి విధానంలో ఇంతటి వినయశీలత, సంస్థలకు, వ్యక్తులకు ఎలా వస్తుంది? ఇది ఒక ఆశ్చర్యం. ఇంటర్వ్యూలోని 17 ప్రశ్నలనూ , జవాబులను ఇక్కడ పరిశీలించటం అవసరమైనా, ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయలేము. స్థాలీ పులాకన్యాయంగా ఒక పేరాగ్రాఫ్ ను తీసుకుందాము.
मीडिया का यह कहना कि चुनाव के दौरान पैदा हुई कटुता का प्रभाव चुनाव के बाद भी देखने को मिलेगा, एक अतिशयोक्तिपूर्ण सोच है।

తెలుగు సారం: మీడీయాకథనం ఏమిటంటే ఎన్నికల ప్రచారంలో ఏర్పడిన ఈ కటుత్వం యొక్క ప్రభావం, ఎన్నికలతరువాత కూడ చూడటానికి దొరుకుతుంది: ఇది అతిశయోక్తితో నిండి ఆలోచన. दरअसल, जमीनी हकीकत ऐसी नहीं है। अक्सर आपने देखा होगा कि चुनावी समर में एक-दूसरे पर तीखे वार करने वाले नेता जब अनायास किसी हवाई अड्डे पर मिलते हैं, तब उनके बीच बड़े ही सहज ढंग से बातचीत होती है।

తెలుగు సారం: నిజానికి, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. మీరు తరచుగా చూస్తూ ఉంటారు. ఎన్నికల సమరంలో పదునైన కత్తులు దూసుకున్న నేతలు, తరువా త ఏదైనా విమానాశ్రయంలో కలిస్తే , వారి మధ్యలో చాల సహజమైన రీతిలో మాటా మంతీ చోటు చేసుకుంటాయి.

ऐसा नहीं है कि चुनावी जंग की तल्खियां राजनेताओं के आपसी रिश्ते पर हावी हो जाती है।

తెలుగు సారం: ఎన్నికల యుధ్ధంలో కనిపించిన భీకర శతృత్వం రాజకీయ నేతలలో, పరస్పర సంబంధాలలో డామినేట్ చేస్తుందని, ఏమీ లేదు.

गर्मजोशी के साथ मिलने के बाद जब वे फिर रैलियों में पहुंचते हैं तो आरोप-प्रत्यारोप का सिलसिला भी शुरू हो जाता है।

తెలుగు సారం: (విమానాశ్రయాల్లో ఇంత) ప్రేమతో కావిలించుకున్న తరువాత, తిరిగి ఎన్నికల ర్యాలీలకు వెళ్ళినపుడు మరల ఆరోపణల, ప్రత్యారోపణల పరంపర మొదలవుతుంది.

यह समझना होगा कि राजनीति में प्रतिस्पर्धा तो होती है, लेकिन दुश्मनी कतई नहीं।

తెలుగు సారం: ఇది మనం అర్ధం చేసుకోవాలి: రాజనీతిలో ప్రతిస్పర్ధ అయితే ఉంటుంది. కానీ పరమ శతృత్వం ఉండదు.

एक अहम बात और कहना चाहूंगा।

ఇంకొక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను.

इधर, पिछले कुछ समय से सार्वजनिक जीवन में व्यंग्य और विनोद का चलन खत्म-सा होता जा रहा है।

తెలుగు సారం: ఈవైపు, గ త కొంత కాలం నుండి, సార్వజనిక జీవనంలో, వ్యంగం, మరియు వినోదం చోటుచేసుకోటం తగ్గిపోతున్నాయి.

सार्वजनिक जीवन में गंभीरता के साथ-साथ व्यंग्य और विनोद का होना भी जरूरी है, आपसी रिश्तों में उदासीनता के लिए कोई जगह नहीं होनी चाहिए।

తెలుగు సారం: సార్వజనిక జీవనంలో, గంభీరతతో పాటు (along side seriousness), వ్యంగ్యం, వినోదం ఉండవలసిన అవసరం ఉంది. పరస్పర సంబంధాలలో ఉదాసీనత (బహుశా కోపతాపాలు, అలగటం అనే అర్ధంలో కావచ్చు. నిర్లిప్తత అనే అర్ధంలో కాక పోవచ్చు) కు చోటు ఉండకూడదు.


వైబీరావు గాడిద వ్యాఖ్యలుసార్, కడుపు నిండిన వాళ్ళకి వ్యంగ్యం, వినోదం. మీరు భారత దేశంలో, శేషాంధ్రలో , బహుశా తెలంగాణలో కూడ, గుజరాత్ లో కూడా, ఏ చాయ్ వాలా నడిగినా చెప్తాడు: మా బ్రతుకులకు వ్యంగ్యం, వినోదం కూడానా. పొద్దుటినుండి రాత్రి దాకా చాయ్ గ్లాసులు మోయటం, కస్టమర్లు ఒకడు వేడిలేవంటాడు, ఇంకోడు చక్కెర చాల్లేదంటాడు, ఇంకోడెక్కువయిందంటాడు, ఇంకోడు స్ట్రాంగు అయ్యిందంటాడు, ఇంకోడు నీళ్ళగా ఉన్నాయంటాడు. ఇంకోడు సింగిల్ చాయ్ తాగి వెయ్యి రూపాయల నోటిస్తాడు. మాబ్రతుకులు ఏడవలేక నవ్వటంగా ఉన్నాయంటారు. రాత్రిపూట హోటల్ ఓనర్ చూపించిన కమరాలో పదిమందీలో చాపల మీద పండుకోవాలి. దోమలు కుట్తుండగానే తెల్లారుతుంది, మళ్ళీ చాయ్ గ్లాసులు మొదలు.

ఈమధ్య మంగళగిరిలో చేనేత పని వాళ్ళ దుస్థితి గురించి తెలిసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రెండురోజులు గుంట మగ్గంలో కూర్చొని నేస్తే ఒక చీర పూర్తవుతుంది. దీనిని రూ. 800 కు అమ్మాలన్నా కొనేవాళ్ళు లేరు. పవర్ లూమ్ ల పోటీ ముందు నిలవలేక పస్తులే మిగులుతున్నాయి.

మా ముఖాలకు హాస్యం కూడానా. వ్యంగ్యం, వినోదం, అనేది రాజకీయ నేతలకి, పారిశ్రామిక వేత్తలకి, బడా వ్యాపారులకి, సినీతారలకీ, క్రికెటర్లకీ, బ్యూరోక్రాట్లకి. ఈరో జు వాళ్ళు ప్రతిస్పర్ధుల్లాగా కాట్లాడుకుంటారు. దుష్మన్ లు లాగా తన్నుకుంటూ ఉంటే, మనం అభిమానులం, అవి అన్నీ నిజం అనుకొని, మనం కూడ తన్నుకొని ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటూ ఉంటాం. వాళ్ళు ఒకళ్ళు నొకళ్ళు చంపుకోరు.

అందు చేత అయ్యా ప్రజలూ, భవిష్యత్ లో ఏదో హవాయి అడ్డాలో శ్రీ ప్రియాంకా వద్రా గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు ఎదురుపడి, కరచాలనాలు చేసుకొని, సరససంభాషణలు చేసుకున్నా , మర్నాడే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుకుని కొట్టుకున్నా, నిజం అనుకోకండి. జడుల్లాగా ఉండటం అలవర్చుకోండి.

మమతా బెనర్జీ x శ్రీనరేంద్ర మోడీ
“They (Congress) has no guts. It’s shivering with fear. For its survival, the party is indulging in match-fixing, not uttering a word against Modi. It seems to be in love with Modi.”

తెలుగుసారం: కాంగ్రెస్ కి గట్స్ లేవు. అది భయంతో వణికి పోతున్నది. మోడీని ఒక్కమాట కూడ అనకుండా, తన మనుగడ కోసం కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నది. “... Had I been in Delhi in place of the Congress, I’d have sent Modi to jail by tying a rope around his waist.”

తెలుగుసారం: కాంగ్రెస్ స్థానంలో నేను ఢిల్లీలో ఉండి ఉంటే, మోడీని, ఆయన నడుముకి తాడు కట్టి జైలుకి పంపి ఉండే దాన్ని.


వైబీరావు గాడిద వ్యాఖ్యలు:భవిష్యత్ లో కు|| మమతా బెనర్జీ శ్రీ|| మోడీ పరాచకాలాడుకుంటుంటే కంగారు పడకండి. పైగా ఇద్దరి నడుముకీ తాళ్ళు కట్టి జైలుకి పంపే వాడు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.