Wednesday, April 16, 2014

2౦4 Dr. Subrahmanian Swamy, and Priyanka drinking episode.

204. ప్రియాంక తాగుడు, సుబ్రమణియ స్వామి రగడ ఉదంతము

Topics for awareness and discussion, చర్చనీయాంశాలు: మద్యం, ప్రియాంక, సుబ్రమణియన్ స్వామి, Priyanka, Subramanian Swamy


ఈ వ్యాసాన్ని నేను మొదట ఆంగ్లంలో వ్రాసి నా indiaintyb.blogspot.com కి వెళ్ళటానికి క్లిక్ ఇండియాఇంట్ వైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ అనే ఇంగ్లీషు బ్లాగ్ లో పోస్ట్ చేయటం జరిగింది. తరువాత తెలుగుపై ప్రేమతో ఇక్కడ అనువదించటం చేశాను. మరొక లక్ష్యం ఏమిటంటే, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ మరియు హిందీ స్కిల్స్ తక్కువ అనే అభిప్రాయం కొన్ని చోట్ల వ్యక్తం అవుతున్నది. అందుకని, యువతీయువకుల అనువాద నైపుణ్యాలు పెరగటంలో నా వంతు ఉడతా భక్తి సేవ చేద్దామనే లక్ష్యం తో ఇంగ్లీషు మూల వాక్యాలను కూడ పక్క పక్క ఉంచుతున్నాను.

ఆంగ్ల నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వాళ్ళు ముందుగా తెలుగులో ఆలోచించి దాన్ని ఆంగ్లంలోకి మనసులోనే మార్చుకుని మాట్లాడే అలవాటు ఉంటే దానిని వదులుకోటం మంచిదని నా వ్యక్తిగత నమ్మకం. మనం ఏభాషలో మాట్లాడ దలుచుకుంటే ఆభాషలోనే మూలంగా ఆలోచించటానికి తగిన పదజాలాన్ని, సమాస జాలాన్నీ (phrases), అర్ధవాక్యజాలాన్నీ (clauses) సెట్లు సెట్లుగా మనసులోనే పోగుచేసుకుని సమయానుగుణంగా వాడుకోటం మంచిది, అని నా ఇంకొక వ్యక్తిగత నమ్మకం.

తెలుగు వాళ్ళందరూ ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడాలని ఒక ప్రచారాన్ని మనం చూస్తూ ఉంటాం. తమిళులు చేస్తున్నారు కదా, బెంగాలీలు చేస్తున్నారు కదా, మలయాళీలు లేకపోతే ఇంకొకళ్ళు చేస్తున్నారు కదా అనుకోటం న్యాయం కాదు. భాష ఎన్నికలో ప్రాధమిక లక్ష్యం అవతల వాడికి మన సందేశం స్పష్టంగా అర్ధంమై మనం కోరుకున్న పనిని వాడు చేయకలగాలి. అంటే, అవతలివాడికి ఏభాష బాగా తెలుసో, ఆ భాషనే మనం వాడాలి. లేదంటే మనం వాడిని మంచి నీళ్ళిమ్మంటే వాడు మద్యం తెచ్చి ఇస్తాడు.

ఇంగ్లీషు భాషలో నైపుణ్యాలు సాధించుకోవాలి అనుకునే వాడికి ఇంగ్లీషు భాషలో పఠనం, వ్రాయటం, మాట్లాడటం, వినటం తొక్కిడి, అభ్యాసం అవసరం. మనం ఎప్పుడూ తెలుగులో ఆలోచిస్తూ తెలుగులోనే అన్ని పనులూ చేసుకుంటూ ఉంటే, ఆంగ్లం వినియోగం అవసరమైన చోట సమయానికి మాటలు, సమాసాలు (phrases), అర్ధవాక్యాలు (clauses) స్ఫురించవు.సోనియా పుత్రి, శ్రీమతి ప్రియాంక వధేరా ఇటీవల తాను వారణాసి నుండి శ్రీ నరేంద్ర మోడీతో పోటీ చేయటానికి అనుకూలవతి కానని, అది తన స్వంత నిర్ణయమేనని తెలిపిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా, బిజేపీ నేత, హార్వర్డ్ డాక్టరేట్, పండితుండు అయిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ స్వామి గారు ఒక జాతర లేవదీశారు. ఆసందర్భంగా శ్రీవారు నుడివినట్లు గా చెప్పబడుతున్న సు(దుర్)భాషణలు:

"...(Ms. Priyanka) Gandhi would have been thrashed if she had done so (contested elections) as she drinks too much alcohol and has a bad name...."

తెలుగు సారం: (ప్రియాంక) గాంధీ అలా చేసి ఉంటే (వారణాసి నుండి పోటీ చేసి ఉంటే), ఆమె చితక్కొట్టబడి ఉండేది. ఎందుకంటే ఆమె అతిగా మద్యం సేవిస్తుంది. ఆమెకు చెడ్డపేరు ఉంది.

Another version of what Dr. Swamy was reported to have said: "...she would have been thrashed if she had contested parliamentary elections from Varanasi against Narendra Modi, as she drinks too much alcohol and has a bad name. ..."

ఇంకొక మీడియాలో ఇంకొక వెర్షన్: ''...ఆమె నరేంద్రమోడీతో వారణాసిలో లోక్ సభ ఎన్నికలకు పోటీకి దిగి ఉంటే , చితక్కొట్ట బడి ఉండేది. ఎందుకంటే ఆమె అతిగా మద్యం తాగుతుంది, ఆమెకు చెడ్డ పేరు ఉంది...''


another version of what Dr. Swamy said:

"...They saved her. She would have got a thrashing. She is very unpopular, she drinks too much alcohol and she has a bad name, her husband has a bad name."

మరొక వెర్షన్: వారు ఆమెను రక్షించారు. ఆమెకు బాదుడు లభించి ఉండేది. ఆమె చాల అన్ పాపులర్ (ప్రజాదరణ లేనిది లేదా నకారాత్మక ప్రజాదరణ కలిగినది అనే అర్ధంలో వాడి ఉండ వచ్చు). ఆమె అతిగా మద్యం సేవిస్తుంది. ఆమెకు చెడ్డ పేరు ఉన్నది. ఆమ భర్తకు చెడ్డ పేరు ఉన్నది.

“...Gunde badmaasho ke tareeke istmaal karenge to lok tantra kaise chalaenge (If goons tactics will be used then how will they run democracy)?..."

ఈవ్యాఖ్య ఢిల్లీలో తన నివాసం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసిన తరువాత, శ్రీ సుబ్రమణియన్ స్వామి గారి ప్రతి స్పందన. ''... గూండే బద్మాషోం కే తరీకే ఇస్తేమాల్ కరేంగే తో లోక్ తంత్ర కేసే చలేంగే? గూండాలు, బద్మాష్ ల వలే వాడితే లోక తంత్రం (ప్రజా స్వామ్యం) ఎలా నడుస్తుంది?...''

“...All I said was Priyanka Gandhi should quit smoking and set an example. Why doesn’t she just say she doesn't drink?...”

''...నేను మొత్తానికి చెప్పింది ఏమిటంటే గాంధీ స్మోకింగు వదిలేయాలి మరియు ఒక ఆదర్శాన్ని నిలపాలి. తాను తాగనని ఆమె ఎందుకు చెప్పదు?

“...There are courts to file defamation case at, what is this protest and all? More ppl showed up than Rahul Gandhi's meeting...”

''(నా మీద) పరువు నష్టం దావా వేయటానికి కోర్టులు ఉన్నాయి. ఈనిరసన ఎందుకు? రాహుల్ గాంధీ సభకు హాజర్ అయ్యే జనం కన్నా (నా ఇంటి ముందు నిరసన తెలపటానికి ఎక్కువ మంది జనం హాజర్ అయ్యారు....''ybrao a donkey's observations. వైబీరావు గాడిద వ్యాఖ్యలు

First-of-all, Dr. Subramnian Swamy appears to exceed limits of decency and dignity.

తెలుగు: మొట్టమొదటగా, శ్రీ సుబ్రమణియన్ స్వామి డీసెన్సీ మరియు డిగ్నిటీ యొక్క పరిథులు దాటినట్లుగా కనిపిస్తుంది.

I am not sure whether this lack of decency and dignity is a representative trait of alumni of Harvard University, which seem to admit students not only on merit but also on donations. Both Mr. Subramanian Swamy and Rahul Gandhi happen to be alumni of Harvard University.

ఈ మర్యాద మరియు హుందాతనం యొక్క లోపం హార్వర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధుల జాతి లక్షణమో ఏమో నాకు గట్టిగా తెలియదు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయం వారు మెరిట్ ప్రాతిపదికపైన మరియు డొనేషన్ల ప్రాతిపదికపైన తమవిద్యార్ధులకు సీట్లు ఇస్తారు కాబట్టి. సుబ్రమణియన్ స్వామి మరియు శ్రీ రాహుల్ గాంధీ ఇరువురూ హార్వర్డ్ పూర్వ విద్యార్ధులే కదా.

Dr. Swamy can be seen from the above words, challenging aggrieved persons to approach court and sue him for libel. This courage might have probably stemmed from his conviction that he has evidence and facts before him, and that disclosing truth can be a good defence against libels.

తెలుగు: డా|| స్వామి గారన్న పై మాటలను చూస్తూంటే, వారు మనోభావాలు గాయపడ్డ వ్యక్తులను కోర్టుకి వెళ్ళి తనపై పరువు నష్టం దావా వేయమని సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ధైర్యం ఆయనకు బహుశా తన ఒక నమ్మకం వల్ల వచ్చి ఉంటుంది. తన వద్ద తగినంత సాక్ష్యం, వాస్తవాల సమాచారం ఉందని, సత్యాన్ని బయట పెట్టటం పరువు నష్టం దావాలలో మంచి డిఫెన్స్ అని ఆయన భావిస్తు ఉండ వచ్చు.

Apart from disclosing facts and truths, a defamer can also have a defence of compulsion to disclose facts and truths for public good, or for protecting public interests . He should disclose only that much, which is necessary for these two needs. He should not disclose more.

తెలుగు సారం: సత్యాలు బయట పెట్టబోయే ముందు, పరువు నష్టం కలిగించే అవకాశం ఉన్న ప్రకటనలు జారీ చేసే వారు దృష్టిలో పెట్టుకో వలసిన అంశం ఏమిటంటే, కేవలం సత్యం బయట పెట్టటమే కాదు, ప్రజల ను రక్షించటానికి గానీ, లేదా ప్రజలకు మేలు చేయటానికి గాని, ఆ డిస్ క్లోజర్ అవసరం అని ధృవీకరించుకోవాలి. జన రక్షణ లేక మేలు కు ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే బయట పెట్టాలి. ఎక్కువ బయట పెట్టకూడదు.

In India and in most other countries, alcoholism has never been a disqualification for contesting to Parliament.

భారత్ లో మరియు పలు ఇతర దేశాలలో, పార్లమెంటుకి పోటీ చేయటానికి, మద్యపానం ఒక అనర్హత, గతంలో ఎన్నడూ కాలేదు.
Alcoholism of Lok Sabha contestants was never a contentious issue of public debate in India. People have elected, are electing, and will probably continue electing alcoholics as MPs.

లోక్ సభ అభ్యర్ధుల మద్యలోలత్వం గతంలో ఎన్నడూ ప్రజా చర్చలలో ఒక వివాదాస్పద విషయం కాలేదు. గతంలో ప్రజలు మద్యోన్మత్తులను ఎంపీ లు గా ఎన్నుకున్నారు, ఎన్నుకుంటున్నారు, ఎన్నుకోటం భవిష్యత్ లో కొనసాగించే అవకాశం కూడ ఉంది.

There are alcoholics in all parties, including Dr. Swamy's Party, BJP. Mr. Atal Bihari Vajpayee is reputed as an aficionado of spirits. This aspect came to light, when Mr. Vajpayee was External Affairs Minister. Mr. P.N. Sangma, our former Lok Sabha Speaker is also believed to be a lover of spirits. Swamy Vivekananda, the role model of Shri Narendra Modiji and the idol of lakhs of Indians was also a winelover. (For proof, readers may refer to the conversation between Prof. Deussen and Swami Vivekananda when he was in Switzerland and Germany).

తెలుగు సారం: అన్ని పార్టీలలోనూ మద్య రశికులు ఉన్నారు. డా|| స్వామి గారి పార్టీ అయిన బిజెపిలో కూడ ఉన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజపేయీ గారు కూడ మద్య రశికుడు గా పేరు పొందిన వారే. శ్రీవారు విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు ఈవిషయం కొంత బయటకు వచ్చింది. మన భూత్ పూర్వ లోక్ సభాపతి శ్రీ పిఎన్ సంగ్మా గారు కూడ మద్య రశికుడనే అభిప్రాయం ఉన్నది. శ్రీ నరేంద్రమోడీ గారి ఆదర్శమూర్తి, మరియు లక్షలాది భారతీయుల ఆరాధ్య దైవము అయిన స్వామీ వివేకానంద గారు కూడ వైన్ ప్రేమికుడే. (ఋజువు కావలసిన పాఠకులు స్వామీజి స్విట్జర్ లాండ్ మరియు జర్మనీ లలో పర్యటించినపుడు స్వామీజీకి మరియు ప్రొ|| డ్యూసెన్ లకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించ వచ్చు.

Can BJP place on its website, the names and addresses of connoisseurs of wine who are senior members of BJP, contesting as M.L.A.s/M.P.s?

బిజెపి తన వెబ్ సైట్ పై , బిజెపి సీనియర్ సభ్యులలో, ఎం.ఎల్.ఎ లుగా, ఎం.పీ. లుగా పోటీ చేస్తున్నవారిలో, ఎంతమంది మద్యరశికులో పేర్లు, చిరునామాలు పెట్తే బాగుంటుంది.

Can it place on its website the names and addresses of liquor traders who are members of BJP? I am sure that BJP can't and won't. Of course, other parties also can't do.

వారు త మ వెబ్ సైట్ పై, తమ పార్టీలో ఎంత మంది మద్యం వ్యాపారులు బిజెపి సభ్యులో, వారి పేర్లు, చిరునామాలు, పెట్టగలరా? వారు ఆపని చేయలేరు, చేయబోరు అని నాకు నిశ్చయం. ఇతర పార్టీల వారు కూడ చేయలేరనుకొండి.

Then why segregate Mrs. Priyanka Vadra and Mr. Vadra?

అలాంటప్పడు, కేవలం ప్రియాంకా వాద్రాను, శ్రీ వాద్రాను విడిగా చూడటం దేనికి?

Dr. Swamy's misadventure will do one good. Indians have a tendency to believe that celebrities and leaders are paragons of virtue and models of excellence.

తెలుగు సారం: డా|| స్వామి గారి సు(దుస్) సాహసం వల్ల ఒక మంచి కూడ జరుగుతుంది. భారతీయులకు ఒక అలవాటు-వైఖరి ఉంది. సెలబ్రిటీలు, నేతలు, స్వఛ్ఛమైన సద్గుణ మూర్తులు మరియు ఎక్సెలెన్స్ యొక్క నమూనాలు అని నమ్ముతారు.

Thousands of Indians have named their children as Jawahar, Indira, Rajiv, Sanjay, Sonia, Rahul, Priyanka. Hearing this news, if at least some Indians start treating leaders as ordinary human beings, with average instincts, habits, iq, intellect, etc., it will do great good to Indian democracy.

వేలాది మంది భారతీయులు తమ పిల్లలకు జవహర్, ఇందిర, రాజీవ్, సంజయ్, సోనియా, రాహుల్, ప్రియాంక అని పేర్లు పెట్టుకున్నారు. ఇపుడు ఈవార్త విన్నాక, వారిలో కొందరైనా, తమ నేతలను సామాన్య మానవులుగాను, సామాన్యమైన లక్షణాలు, తెలివితేటలు, అలవాట్లు, మేథస్సు మొ|| కలవారు అని గుర్తించటం మొదలు పెట్టితే భారతీయ ప్రజాస్వామ్యానికి చాలా మేలు జరుగుతుంది.

In other words, we have to humanify, humanise our demy Gods, down to earth. This does not mean that we should look them down upon. It is, rather, we stop looking at them in the sky with awe, as if they were descending from some other planet, to imbue us with divinity.

తెలుగు సారం: ఇంకో మాటల్లో చెప్పాలంటే, దివినుండి భువికి దిగివచ్చిన దేవతలుగా మనం నమ్మే మన నేతలను ఇంకనుండి సామాన్య మానవులు గా పరిగణించకోవాలి. అంటే మానవీకరణం జరగాలి. దైవీకరణం మానాలి. దీనర్ధం మనం వారిని చులకనగా దిగజార్చి చూడాలని కాదు. మనం వారిని చూడటానికి ఆకాశం వంక చూస్తూ, వారు వేరే గ్రహం నుండి దిగివచ్చి మనలని దివ్యత్వంతో ముంచెత్తే దూతలుగా సంభావించటం మానేయాలి.

Whatever I am writing here, also apply to other castes of celebrities like film stars, cricketers, judges, journalists, professors, corporate executives and industrialists.

తెలుగు సారం: నేను వేటినయితే ఇక్కడ వ్రాస్తున్నానో అవి యన్నీ సెలబ్రిటీల కులాలు అన్నిటికీ అంటే సినీతారలు, క్రికెటర్లు, జడ్జీలు, పత్రికారచయితలు, ప్రొఫెసర్లు, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్ లు, పారిశ్రామిక వేత్తలు మొ|| అందరికీ వర్తిస్తుంది.

About gUnDE, badmAshE adjectives used by Dr. Swamy for describing protesters, he may please realise that BJP workers also seem to indulge in similar gUnDE, badmAshE methods, occasionally. Can Dr. Swamy counsel (or at least request) the top leaders of BJP to discourage this type of tendencies in BJP, even if assuming that they are fewer in number than in Congress?

తెలుగు సారం: గూండాలు, బద్మాష్ లు మొ|| విశేషణాలను డా|| స్వామి గారు తన ఇంటి ముందు నిరసన తెలిపిన వారిని ఉద్దేశించి వాడారో, అలాంటి పధ్ధతులను బిజెపి కార్యకర్తలు కూడ అప్పుడప్పుడూ ఆచరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈవిషయాన్ని డా|| దయతో స్వామి గారు గ్రహించాలి. స్వామి గారు, బిజేపీలో అలాంటి గూండే, బద్మాష్ పధ్ధతులను నిరుత్సాహ పరచమని ఆ పార్టీ అగ్రనేతలకు సలహా ఇవ్వగలరా? (అలాంటి గూండేలు, బద్మాష్ లు బిజెపిలో తక్కువ సంఖ్యలో ఉంటే ఉండి ఉండవచ్చు, కానీ తగిన సంఖ్యలోనే ఉన్నారు).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.