Wednesday, April 30, 2014

219 Where in India, looting didn't take place?

219 Where in India looting didn't take place?

219 భారత్ లోలూటింగు ఎక్కడ జరగలేదు?
చర్చనీయాంశాలు: 219, జగన్, నరేంద్రమోడీ, తిరుపతి, జలయజ్ఞం, గుజరాత్, ఋణభారం

శ్రీ నరేంద్రమోడీగారు ఆంధ్రప్రదేశ్ లో లూటీ అయిన సొమ్మంతా కక్కిస్తామంటున్నారు. ఇదెంతవరకు సాధ్యమో నాకు తెలియదు. కర్మకాలి సీమాంధ్రలో జగన్ కి భారీగా లోక్ సభ సీట్లు వచ్చి, ఎన్ డీ ఎకి ఆ కాసిని సీట్లే తక్కువయితే, జగన్ మద్దతు కోసం శ్రీ మోడీ ప్రయత్నిస్తారా, ప్రయత్నించరా? అపుడు కేసులనన్నింటినీ హుష్ కాకీ చేయించరా? ఈలోకంలో కొన్నిసార్లు మాత్రమే యే దిల్ మాంగే మోర్ అని శ్రీ మోడీ కోరినంత పరిమాణంలో, కోరినంత నాణ్యతతో లభించవచ్చు. సాధారణ సమయాలలో, దొరికిందానితో సర్దుకుపోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లూటీ జగన్, వైయస్ఆర్ ల తెలివిలేమి వల్ల బయటపడింది. ఇతర రాష్ట్రాలలో లూటీ జరగట్లేదని ఎవరు చెప్పగలరు? లూటీ సొమ్ము హవాలా మార్గాలలో విదేశాలకు చేరి ఉంటే, ఎవరు కనుక్కోగలరు?

అందరూ కూడ అహింసా పురుషులే, కానీ మధ్యలో ఉన్న రొయ్యల గంప మాయమయ్యింది చందం కదా.

ఆంధ్రప్రదేశ్ అప్పు


2004లో ఆంధ్రప్రదేశ్ అప్పు షుమారు రూ. 66,000 కోట్లు. నేటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 1,79,637 కోట్లు. అంటే ఇంచుమించుగా గుజరాత్ అంతే. షుమారు రూ. 1,13,000 కోట్లు పెరిగింది. మూడు రెట్లయ్యింది. దీనిలో ఎంత భాగం అభివృధ్ధికి వెళ్ళిందో, ఎంత భాగం రెవిన్యూఖర్చులకు వెళ్ళిందో, ఎంత భాగం లూటీలకు వెళ్ళిందో ఎవరికీ తెలీదు.

కొంత భాగం అయితే జలయజ్ఞం కాంట్రాక్టర్లకు వెళ్ళిందనుకోవచ్చు.

గుజరాత్ అభివృధ్ధి మోడల్


శ్రీ నరేందర్ మోడీజీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినపుడు ఆరాష్ట్ర అప్పు షుమారు రూ. 27,000 కోట్లు. నేడు ఆరాష్ట్ర అప్పు రూ. 1,80,000 కోట్లు. అంటే షుమారు రూ. 1,53,000 కోట్లు పెరిగింది.


ఆర్ధిక నిర్వహణలో ప్రూడెన్స్ (జాగ్రత్త) ఏమి చెప్తుందంటే, రోజువారీ ఖర్చులను పన్నులు మొ|| ఆదాయాలతో గడుపుకోవాలి. అప్పులు తెచ్చిన మొత్తాలను అభివృధ్ధికి వాడుకోవాలి. అభివృధ్ధి చేసినపుడు, నిర్మించబడే ఆస్తులలోంచి వచ్చే ఆదాయాలలోంచి అప్పులపై వడ్డీలను, వాయిదాలను చెల్లించుకోవాలి.

గుజరాత్ తో సహా, భారత్ లో ప్రతి రాష్ట్రం నేడు చేస్తున్న పని ఏమిటంటే అప్పుగా తెచ్చిన మొత్తాలను కూడ ఆదాయాన్ని కల్పించే ఆస్తులను నిర్మించటానికి కాకుండా, పప్పు బెల్లాలుగా పంచి పెట్టటం.

దానిని బట్టి పై రూ. 1,50,000 కోట్ల అప్పులలో ఎంత శాతం లూటీ అయినట్లుగా మనం భావించ వచ్చు?

భారత్ లోని 28 రాష్ట్రాలలో జరిగిన లూటీలను అంచనా వేయాలంటే ఒక కాగ్ చాలడు. 28 మంది కూడ చాలరు. సీడాక్, ఇస్రో మొ|| వాళ్ళ వద్ద ఉండే సూపర్ కంప్యూటర్లు, సరిపోవు.

ఎవరి వద్ద ఎవరుశ్రీరాజశేఖర్ రెడ్డిగారు బ్రతికి ఉన్నరోజులలో భారత్ లో మోస్టు డైనమిక్ ముఖ్యమంత్రి ఎవరు వంటి పోల్స్ జరిగేవి. టీవీ ఛానెల్స్ వాళ్ళూ, ఇండస్ట్రియలిస్టులు అంతా కలిసి ఒక్కోసారి గుజరాత్ మోడీ గారిని మరో సారి వైయస్ ను అత్యంత చైతన్యవంతుడైన ముఖ్యమంత్రిగా కిరీటం పెట్టిన సందర్భాలున్నాయి. పోటీ దేనిలో? భూములను పారిశ్రామిక వేత్తలకు పంద్యారం చేయటంలో. రెడ్డిగారు శ్రీ మోడీ దగ్గర నేర్చుకున్నారో, లేక మోడీ గారే శ్రీ రెడ్డి దగ్గర నేర్చుకున్నారో, లేక ఇద్దరూ కలిసి ఇంకో బడాగురువు దగ్గర నేర్చుకున్నారో కానీ రేసు మటుకు అంగారక గ్రహానికి వెళ్ళే ఉపగ్రహం వేగం అందుకుంది. శ్రీమోడీ ఆ విద్యను వదలలేదు సరికదా, యావత్ భారతదేశానికీ విస్తరించటానికి సిధ్ధం అవుతున్నారు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.